సాయంత్రం కేసీఆర్‌తో డీఎస్‌ భేటీ | D srinivas will Meet CM Kcr Over TRS Leaders Complaint | Sakshi
Sakshi News home page

సాయంత్రం కేసీఆర్‌తో డీఎస్‌ భేటీ

Published Wed, Jun 27 2018 3:50 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

D srinivas will Meet CM Kcr Over TRS Leaders Complaint - Sakshi

కేసీఆర్‌, డీ.శ్రీనివాస్‌ (పాతచిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు గళమెత్తారు. డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నేరుగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడంతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు డీఎస్ అపాయింట్‌మెంట్ కోరారు.

దీంతో సీఎం కార్యాలయం నుంచి డీఎస్‌కు పిలుపొచ్చింది. సాయంత్రం 6 గంటలకు కేసీఆర్‌తో ఆయన భేటీ కానున్నారు. జిల్లా నేతలు తనపై చేసిన ఆరోపణలపై డీఎస్‌ ముఖ్యమంత్రికి వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే డీఎస్‌ నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను మీడియా ప్రతినిధులు కలువగా మాట్లాడేందుకు నిరాకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement