'తిట్టించుకుని.. మళ్లీ అక్కడికే వెళ్లారు' | DS Join In TRS || Jana reddy Fires On D.Srinivas | Sakshi

Jul 2 2015 2:51 PM | Updated on Mar 22 2024 10:56 AM

సీనియర్ నేత డీ శ్రీనివాస్ కాంగ్రెస్ ను వీడడం వల్ల ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారు గురువారం మీడియాతో మాట్లాడుతూ... పదవి లేకుండా డీఎస్ నెల రోజులు కూడా ఉండలేక పోయారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. డీఎస్ ను దూషించిన కేసీఆర్ వద్దకే ఆయన వెళ్లారని చెప్పారు. పదే పదే పెద్ద పదవులు తనకే ఉండాలనడం డీఎస్ స్థాయి వ్యక్తికి సరికాదని పేర్కన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎస్ కు ఉన్నత పదవులు ఇచ్చింది, ఆయనకు పార్టీలో సముచిత గౌరవమే దక్కిందని వివరించారు. అన్ని పదవులు అనుభవించి పార్టీని వీడడాన్ని ప్రజలేవరూ హర్షించరని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement