tpcc chief uttam kumar reddy
-
దుబ్బాక... మనకు కీలకం
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని, ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, వారికి కేటాయించిన గ్రామాల్లోనే ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉండి పనిచేయాలని సూచించారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అధ్యక్షతన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నవంబర్ 3న జరిగే దుబ్బాక ఉపఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై గంటకు పైగా చర్చించారు. అనంతరం మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని ఏఐసీసీ త్వరలోనే ప్రకటిస్తుందని చెప్పారు. సీఎంను కలుస్తారు... మాకేమో అనుమతి ఇవ్వరా? తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాంగ్రెస్ నాయకులను కలవొద్దని రాష్ట్ర గవర్నర్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలుస్తామని చెప్పినా కరోనా పేరుతో అనుమతించలేదని, కానీ సీఎం కేసీఆర్‌కు మాత్రం కరోనా నిబంధనలు అడ్డురాలేదని విమర్శించారు. గవర్నర్, బీజేపీ, టీఆర్ఎస్లు ఒక్కటేనని దీన్ని బట్టి అర్థమవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీవ్ర ఉద్యమాలు చేయాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఎ.రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. నేడు సత్యాగ్రహ దీక్షలు: ఉత్తమ్ దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని, అందరికీ బాధ్యతలు అప్పగిస్తామని, ఎవరి బాధ్యతలను వారు సజావుగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. హాథ్రస్లో దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో బాధితురాలికి న్యాయం జరిగే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని, ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. గాంధీభవన్ ఎదుట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఓటరు నమోదులో క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగించాలన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
‘చలో రాజ్‌భవన్’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్‌భవన్ కార్యక్రమం భగ్నమైంది. ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన కాగా, దిల్కుషా అతిథిగృహం వద్దే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి, గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించినా.. అక్కడ పోలీసులు మోహరించడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ బస చేసిన దిల్కుషా అతిథిగృహం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అయితే, గవర్నర్.. కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకుని గోషామహల్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, నాయకులు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, దామోదర రాజనర్సింహ, సంపత్ కుమార్, బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, నేరేళ్ల శారద, ఇందిరా శోభన్ తదితరులున్నారు. టీఆర్ఎస్కు నిబద్ధత లేదు: ఉత్తమ్ అంతకుముందు దిల్కుషా అతిథిగృహం వద్ద ఆందోళనకారులను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను నిలువరించే పోరాటంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ నిబద్ధతతో పనిచేయడం లేదని విమర్శించారు. ఈ బిల్లులను పార్లమెంట్లో ఏకపక్షంగా ఆమోదించుకోవడం ద్వారా ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని వ్యా ఖ్యానించారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగానే ఈ బిల్లులున్నాయని, వీటిని ఆమోదించడం వెనుక అనేక కుట్రలున్నాయన్నారు. అందుకే ప్రధాని మోదీ పార్లమెంటు బయట మాట్లాడిన అంశాలు ఈ బిల్లుల్లో లేవని ఉత్తమ్ ఆరోపించారు. కేంద్రం చేసే ప్రతి ఆలోచనకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని, బీజేపీ–టీఆర్ఎస్లు ములాఖత్ అయి ఇప్పటివరకు అన్ని బిల్లులను ఆమోదించుకున్నారని చెప్పారు. ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్టు టీఆర్ఎస్ చెప్పినా వారిలో నిబద్ధత కనిపించడం లేదన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, దేశ చరిత్రలోనే రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. అక్టోబర్ 2న రైతు సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చెప్పారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని, అప్పటి వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తన కొనసాగిస్తుందని ఉత్తమ్ చెప్పారు. కరోనా వారికి అడ్డం కాదా? రైతుల పక్షాన వినతిపత్రం ఇచ్చేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకపోవడం దారుణమని ఉత్తమ్ అన్నా రు. కరోనా కారణంగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని గవర్నర్ కార్యాలయం తెలిపిందని, మరి సీఎంతో భేటీ అయినప్పుడు గవర్నర్‌కు కరోనా అడ్డం రాలేదా అని ప్రశ్నించారు. ఇదే విషయమై పార్టీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాము వినతిపత్రం ఇచ్చేందుకు వస్తామని మూడు రోజుల క్రితమే గవర్నర్‌కు సమాచారం ఇచ్చామని, కానీ కోవిడ్ నిబంధనల పేరిట అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చలో రాజ్‌భవన్ కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో జరిగిందని, అన్ని చోట్లా గవర్నర్లు అనుమతించినప్పుడు తెలంగాణలో ఎందుకు అనుమతించలేదని ఆయన ప్రశ్నించారు. -
2023లో అధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. రాష్ట్రంలో త్వరలో రానున్న దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలన్నింటిలో పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని మాణిక్యం ఠాగూర్ టీపీసీసీ నేతలను కోరారు. తన తొలి పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో వరుసగా భేటీ అయ్యారు. ఉదయం దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎన్నికలు, తర్వాత జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన సమీక్షలు జరిపారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలతో పాటు పలు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాణిక్యం మాట్లాడుతూ అన్ని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థిని అనుకొని పని చేయాలని, టీమ్‌వర్క్‌తో అందరూ పనిచేస్తేనే ఫలితం దక్కుతుందన్నారు. బౌలర్, బ్యాట్స్మెన్లే కాకుండా ప్రతి ఆటగాడు బాగా ఆడితేనే క్రికెట్ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని, ఇదే స్ఫూర్తిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అలవర్చుకోవాలని కోరారు. అన్ని ముఖ్యమైన అంశాలపై సబ్ కమిటీలు వేసి లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల్లో ఉండి పోరాడాలన్నారు. ఎన్నికల కోసం వ్యూహరచన దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితం వస్తుందని మాణిక్యం ధీమా వ్యక్తం చేశారు. ప్రతి రెండు గ్రామాలకు ఒకరికి బాధ్యతలు అప్పగించాలని, అదే విధంగా ఏడు మండలాలకు ఏడుగురు ఇన్చార్జులను నియమించా లని, బూత్‌ల వారీగా ఓటర్లను చైతన్యపర్చే కార్యక్రమంలో ముందుండాలని కోరారు. ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కొత్త ఓటర్లను పార్టీవైపు తిప్పుకునే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు చేసిందేమీ లేదని, ఎన్నికల వాగ్దానమైన నిరుద్యోగ భృతిని అమలు పర్చలేదని విమర్శించారు. వీటన్నింటినీ పట్టభద్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అదే విధంగా పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టి పనిచేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు విశ్వనగరం హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ హయాంలో జరిగిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం నగరాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్య తలను ముఖ్య నేతలు తీసుకోవాలన్నారు. కోదండకు మద్దతు వద్దు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని, పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తేల్చిచెప్పారు. రెండు స్థానాలూ కాంగ్రెస్ గెలిచే అవకాశముందని నేతలు అభిప్రాయçపడినట్లు తెలి సింది. మద్దతు కోరుతూ టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ పార్టీకి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పినట్టు సమాచారం. ప్రతి నెలా డీసీసీ అధ్యక్షులతో సమావేశం డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాణిక్యం మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షులు నిరంతరం ప్రజల్లో ఉండాలని, ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి డీసీసీ అధ్యక్షుడు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే టార్గెట్‌గా పనిచేస్తే అధికారంలోకి వస్తామన్నారు. ప్రతినెలా తాను డీసీసీ అధ్యక్షులతో సమావేశమవుతానని, జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతినెలా మం డల స్థాయిలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలన్నారు. డీసీసీ అధ్యక్షులతో మాట్లాడకుండా పార్టీపరంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
బడా కంపెనీల కోసమే బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద పెద్ద కంపెనీలకు లాభం చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లులు తెచ్చిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. వీటిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీ రేవంత్‌రెడ్డితో కలసి సోమవారం విజయ్‌చౌక్ వద్ద విలేకరులతో ఉత్తమ్ మాట్లాడారు. ‘విపక్షాల సవరణ ప్రతిపాదనలు కూడా పట్టించుకోకుండా కొత్త వ్యవసాయ బిల్లులను మోదీ ప్రభుత్వం ఆమోదింపచేసుకుంది. వీటికి పేర్లే తప్పుగా పెట్టారు. ఏపీఎంసీ మార్కెట్ మూసివేత బిల్లు, కాంట్రాక్టు ఫార్మింగ్ ప్రోత్సాహక బిల్లు, ఆహార ఉత్పత్తుల కార్పొరేట్ అక్రమ నిల్వల బిల్లు అని పేర్లు పెడితే సబబుగా ఉండేది. అదానీ, అంబానీ, అమెజాన్, వాల్‌మార్ట్ వంటి పెద్ద కంపెనీలకు లాభం చేకూర్చేలా, రైతులకు నష్టం కలిగించేలా కొత్త బిల్లులున్నాయి’ అని ఆయన అన్నారు. కాంట్రాక్టు సేద్యం ప్రోత్సహించేలా.. ‘మొదటి బిల్లు.. కంపెనీల ద్వారా కాంట్రాక్టు సేద్యం ప్రోత్సహించేలా ఉంది. æఇది కంపెనీలకు రైతులతో కాంట్రాక్టు కుదుర్చుకునే స్వేచ్ఛ ఇచ్చింది. కానీ రైతులకు ఎలాంటి రక్షణా కల్పించలేదు. ధర హామీ ఇవ్వలేదు. కనీస మద్దతు ధర ఊసేలేదు. బిల్లు ప్రకారం కంపెనీలు రైతులతో లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో కంపెనీ కాంట్రాక్టును ఉల్లంఘించినా రైతు ఏమీ చేయలేడు. ఇక నిత్యావసర సరుకుల సవరణ చట్టం బిల్లు లక్ష్యం రైతుల ఆదాయం పెంచడమని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుత చట్టాల మేరకు సరుకుల నిల్వపై రైతులకు మాత్రమే అధికారం ఉండేది. కానీ కొత్త బిల్లు.. ప్రైవేటు కంపెనీలు నిత్యావసర సరుకులు కొనడం, నిల్వ చేసుకోవడంపై ఉండే ఆంక్షలు తొలగిస్తుంది. అంటే అవి అక్రమంగా నిల్వచేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వ్యవసాయ మార్కె ట్ రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని రాష్ట్రాల అధికారాన్ని హరిస్తోంది. కొత్త చట్టంతో మార్కెట్ యార్డులో కొనుగోలుచేసే వ్యవస్థ కుప్పకూలుతుంది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మూడు డిమాండ్లు ► మార్కెట్ యార్డుల లోపల, వెలుపలా అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల నియంత్రణ ఉండాలి. ► కొనుగోలుదారులు తమ పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలి. వారి లావాదేవీలు నియంత్రణలకు లోబడి ఉండాలి. ► మార్కెట్ యార్డు లోపల అమ్మినా, బయట అమ్మినా రైతుకు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ లభించాలి. -
ఛలో సెక్రటేరియెట్‌కు కాంగ్రెస్ పిలుపు
-
కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లు పంపును నిరసిస్తూ కాంగ్రెస్ నేడు చలో సెక్రటేరియేట్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ సచివాయం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, మల్రెడ్డి రంగారెడ్డి లను గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలపై కరెంట్ బిల్లుల భారం వేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. స్లాబులు పేరుతో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. (కరోనా: జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం) కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అడ్డగోలు విద్యుత్ బిల్లులు, నియంతృత్వ వ్యవసాయ విధానం, కరోనాపై ముఖ్యమంత్రితో కలిసి చర్చించేందుకు అపాయిమెంట్ మాత్రమే అడిగామని, సచివాలయం ముట్టడికి పిలుపు ఇవ్వలేదన్నారు. కనీస సమాచారం కూడా లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత అనాలోచిత పాలన ఎక్కడా లేదని దుయ్యబట్టారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. పాలన నిర్బంధం కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. (స్వయం ప్రకటిత లాక్డౌన్లో ఐటీ) -
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
సాక్షి, కరీంనగర్: రైతుల ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు భరోసా కల్పించేందుకే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటన చేశామని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆయన విమర్శించారు. కేసీఆర్ చెప్పింది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. తాము రాజకీయాలు కోసం ఇక్కడకు రాలేదని.. ప్రస్తుతం ఎన్నికలు కూడా లేవన్నారు. ప్రతిపక్షాల నేతలను పచ్చిబూతులు తిట్టడం సబబు కాదన్నారు. రెండు నెలలు గడుస్తున్నా.. కందులు,మొక్కజొన్నల పైసలు రాలేదని మండిపడ్డారు. బత్తాయి, మామిడి, బొప్పాయి, నిమ్మ రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత వల్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. ఫలితంగా అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందన్నారు. తడిసి పోతే మళ్లీ తేమ శాతం అంటూ నిబంధనలు పెడతారని ఇది న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. 40 కిలోలకు బస్తా బరువు తీసేసి తూకం వేయాలని.. కానీ 4 కిలోల తరుగు తీసేస్తున్నారని ఆరోపించారు. దీనికి సమాధానం ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
‘మంత్రిగా ఆయన అట్టర్‌ప్లాఫ్’
సాక్షి, నల్గొండ: సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ మూల సిద్ధాంతానికే ఈ చట్టం వ్యతిరేకం అని పేర్కొన్నారు. కేరళ, పంజాబ్ రాష్ట్రాలు శాసనసభ ద్వారా సీఏఏను వ్యతిరేకిస్తునట్లు తీర్మానించాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక తీర్మానం చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ద్వంద విధానాలను మైనార్టీలు గమనించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రతి అంశంలోనూ సహకరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను మైనార్టీలు ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులు, దళితులు, ఉద్యోగులు.. మున్సిపల్ ఎన్నికలను ఆయుధంగా మలచుకోవాలన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అట్టర్ ప్లాఫ్ అయ్యారని విమర్శించారు. ఎంపీ నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. -
‘ఛలో ట్యాంక్‌బండ్’లో పాల్గొనండి: ఉత్తమ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కూమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరిందనీ, అందుకోసం శనివారం చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానం సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నా, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నా కేసీఆర్ మనసు కరగకపోవడం దారుణమని మండిపడ్డారు. -
ఉత్తమ్‌తో భేటీ కానున్న చంద్రబాబు
-
మేమిస్తే.. మీరు లాక్కుంటారా.?
సాక్షి, కామారెడ్డి: తరతరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం హక్కు పత్రాలను ఇస్తే ప్రస్తుత టీఆర్ఎస్ సర్కారు వారి భూములను లాక్కుంటోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిరిజన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి రాగానే చేయతలపెట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ‘గిరిజన డిక్లరేషన్’ప్రకటించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘2014 ఎన్నికల్లో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని నమ్మించి సీఎం కేసీఆర్ మోసం చేశారు. 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. హామీలు అమలు చేయకపోగా వారు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపడం, గొత్తికోయ మహిళలను బట్టలిప్పించి అవమానించిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది’అని మండిపడ్డారు. ‘కేసీఆర్.. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే ఖబడ్దార్.. నీ అంతు చూస్తాం’అని హెచ్చరించారు. టీఆర్ఎస్ పాలనకు చివరి రోజులు సరైన ధరలు లేక పత్తి, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పరామర్శించిన పాపాన పోలేదని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనకు చివరి రోజులు మొదలయ్యాయని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, నిశ్శబ్ద విప్లవం రానుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్.. ఇప్పుడు వేరే రాష్ట్రాల వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అందరూ మోసపోయారు: జానారెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, అయితే కేసీఆర్ కల్లబొల్లి మాటలు నమ్మి టీఆర్ఎస్కు ఓటేసిన పాపానికి ప్రజలు మోసపోయారని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. రైతులను మభ్యపెట్టడానికే ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల పంపిణీ మొదలుపెట్టిందన్నారు. అప్పులు చేయడంలో సీఎం రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. హామీలు నిలబెట్టుకోలేని టీఆర్ఎస్ను నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి రవీంద్రనాయక్, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. గిరిజన డిక్లరేషన్ 1. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్య, ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. 2. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు ఉద్యోగాలు అందిస్తాం. 3. రాష్ట్ర ఏర్పాటు బిల్లులో గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు సంబంధించి చట్టం ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా రావడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తాం. 4. బయ్యారంలో స్టీల్‌ఫ్యాక్టరీని స్థాపించి ఆ ప్రాంత గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. 5. గిరిజనులు నివసించే అన్ని మైదాన ప్రాంతాల్లోనూ ఐటీడీఏలను ఏర్పాటు చేస్తాం. ఐటీడీఏ ద్వారా గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. 6. 22 లక్షల మందికి ఇళ్లు లేవని తేల్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షలు కూడా నిర్మించలేకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు లేనివారందరికీ నిర్మించి ఇస్తాం. 7. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిధులను వారి అభ్యున్నతికే ఖర్చు చేస్తాం. 8. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ఇప్పటికే పట్టాలిచ్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల నుంచి గుంజుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి గిరిజనులకే అప్పగిస్తాం. గిరిజనులకు అండగా ఉంటాం. -
రాష్ట్రాన్ని దోచుకుంటూ విమర్శలా?
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబం మొత్తం రాష్ట్రంపై పడి అడ్డగోలుగా దోచుకుంటూ ఇతరులపై నిందలు వేసే ప్రయత్నం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సీఎం మాట లు అడ్డగోలుగా, చిల్లరగా ఉన్నాయని, ఆయన హుందాకు తగిన విధంగా లేవని అన్నారు. ప్రతిపక్షాలపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం గాంధీ భవన్లో మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రాజనీతిజ్ఞుడిగా ఉంటారని భావించాం. కానీ ఇతరులను పదే పదే కించపరుస్తూ తన వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసుకుంటున్నారు. గల్లీ స్థాయి లీడర్‌గా చిల్లరగా మాట్లాడుతున్నారు’అని విరుచుకుపడ్డారు. ‘రాజకీయాల్లోకి రాక ముందు సైన్యంలో పని చేశా. యుద్ధ విమానాల పైలట్‌గా దేశ రక్షణ కోసం సరిహద్దులో ఏళ్లపాటు సేవలందించా. నిస్వార్థంగా పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. నేనూ, నా భార్య ప్రజాజీవితానికే అంకితమయ్యాం. మాకు పిల్లలు లేరు. వారసత్వం లేదు. కేసీఆర్‌లా క్యారెక్టర్ లేని పనులు చేసి రాజకీయాల్లోకి రాలేదు. పిచ్చి, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దు’ అని ఉత్తమ్ హితవు పలికారు. ప్రధానికి కూడా అలాంటి నివాసం లేదు.. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన విమర్శలపై ఉత్తమ్ తీవ్రంగా స్పందించారు. ‘ప్రగతి భవన్లో 150 గదులు ఉన్నాయని నేనెప్పుడూ అనలేదు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సీఎం అధికారిక నివాసం ఉన్నా.. రూ.500 కోట్ల విలువైన స్థలంలో ప్రగతి భవన్ నిర్మించారు. దాని నిర్మాణానికి రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు ఖర్చు చేశారు. ప్రగతి భవన్ నిర్మాణ ఖర్చు ప్రజాధనం కాదా? వందల కోట్లతో ఎవడబ్బ సొమ్మని ప్రగతి భవన్ కట్టుకున్నావ్’అని ప్రశ్నించారు. ‘దేశ ప్రధానికి కూడా ఇంత విలాసవంతమైన నివాసం లేదు. ప్రైవేటు కార్యక్రమాలకూ ప్రత్యేక విమానాలు వినియోగిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు విదేశాల్లో అత్యంత ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు’అని ఆరోపించారు. ప్రగతి భవన్లో సామాన్య ప్రజలెవరూ కనపడరని, కేవలం ఆంధ్రా కాంట్రా క్టర్లు మాత్రమే కనబడతారని విమర్శించారు. ప్రజలకు మాత్రం పైసలుండవు.. ‘నేనెప్పుడూ ఆంధ్రా నేతల సంచులు మోయ లేదు. తెలంగాణ ముసుగులో రాష్ట్ర సొమ్మును ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నది మీరు’అని సీఎంపై ఉత్తమ్ ధ్వజమెత్తారు. ‘చనిపోయిన రైతులకు, అమరవీరులకు ఇవ్వడానికి పైసలు ఉండవు. సబ్సిడీ ఇవ్వడానికి, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు భూమి ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులుండవు. కానీ విలాసాలకు కోట్లు ఖర్చు చేస్తారా?’అని ప్రశ్నించారు. ‘ముస్లిం రిజర్వేషన్ల అమలుపై ప్లీనరీలో మాట్లాడరు. గిరిజనుల రిజర్వేషన్లు ఏమయ్యాయో చెప్పరు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఏమైందో తెలియదు. ఉద్యోగ ఖాళీలు నింపలేని అసమర్థుడివి. ప్రతిపక్షాలపై అవమానకరంగా మాట్లాడటం తెలుసు. హామీలు నెరవేర్చనందుకు ప్రజలకు ఇప్పటికై నా క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. దొంగ పాస్‌పోర్ట్‌ల చరిత్ర నీది: షబ్బీర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసే ముందు కేసీఆర్ తన జీవితం ఏమిటో వెనక్కి తిరిగి చూసుకోవాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ సూచించారు. దొంగ పాస్‌పోర్ట్‌ల చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచే భూకంపం సృష్టించడం కాదని, దమ్మూ ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టాలని సవాల్ విసిరారు. క్యాంపస్లోకే పోలేని వ్యక్తి దేశాన్ని నడుపుతారా? అని ఎద్దేవా చేశారు. దేశం కోసం సైన్యంలో పనిచేసిన వ్యక్తిపై వ్యక్తిగత విమర్శలు సరికాదని హితవుపలికారు. ఒక్క ఎంపీ సీటు కూడా రాదు టీఆర్ఎస్ వల్లే పీసీసీ పదవి వచ్చిం దంటూ తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ మండిపడ్డారు. ‘నీ వల్ల పీసీసీ రాలేదు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్ల నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే మా సంగతి కాదు.. ముందు మీ సంగతి ఎలా ఉండేదో ఆలోచించండి’అని హితవు పలికారు. దేశానికి జాతీయ పార్టీలు ఏమీ చేయలేదట కానీ, కేసీఆర్ ఓ తీస్మార్ ఖాన్‌లా ఏదో చేస్తారా అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని, ఇక ఆయన జాతీయ రాజకీయాలు ఏం చేస్తారని ప్రశ్నించారు. భారత్‌ను చైనాతో పోల్చడాన్ని తప్పుబట్టిన ఉత్తమ్.. అసలు చైనాలో ప్రజాస్వామ్యం ఉందా? అని నిలదీశారు. -
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవహక్కులను ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క, నర్సారెడ్డి, వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ, సర్వే సత్యనారాయణ, దానం నాగేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇక్కడి పాలకులు అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేడ్కర్ పేరు మీద ఉన్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా చేశారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కేవలం పేరు మార్చడం ద్వారా రూ.50 వేలకోట్ల అంచనా వ్యయాన్ని పెంచారన్నారు. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తాయన్నారు. -
రేవంత్ ఆత్మీయ సభకు టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్
-
అనూహ్యం: రేవంత్ ఆత్మీయ సభకు ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : ఇంకా అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే రేవంత్ రెడ్డికి టీపీసీసీ నేతలు ఎల్లడలా మద్దతు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో రేవంత్ నిర్వహించిన ‘ఆత్మీయులతో మాట-ముచ్చట’ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఉత్తమ్‌తోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రేవంత్ సభలో పాల్గొనడం గమనార్హం. ‘ఆత్మీయుల ముచ్చట’లో మాట్లాడిన వేం నరేందర్ రెడ్డి.. తాము ఇప్పుడు, ఎప్పుడూ రేవంత్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. రేపు అధికారిక చేరిక : ఆత్మీయ ముచ్చట అనంతరం నేరుగా ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి.. రేపు(మంగళవారం) రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి అధికారికంగా చేరనున్నారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ ముఖ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరతారు. ఆత్మీయ సభకు హాజరైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి -
ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
-
అక్టోబర్‌లో 27 జిల్లాలకు కమిటీలు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 27 జిల్లాలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకాలను ఈ అక్టోబర్‌లోనే పూర్తిచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఈ రెండున్నరేళ్లలోనే చాలా తప్పులు చేసిందన్నారు. రైతులు, యువకులు, దళితులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు, హామీల అమలుకోసం పోరాటం చేయడానికి వెంటనే జిల్లా కమిటీల నియామకం పూర్తిచేస్తామని, అంతకన్నా ముందుగా టీపీసీసీకి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీపీసీసీకి కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకాన్ని నాలుగైదు రోజుల్లోనే పూర్తిచేస్తామన్నారు. కార్యవర్గంలో నియామకాలపై ప్రతిపాదనలకోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు నాగయ్య అధ్యక్షతన ఐదుగురితో ఓ కమిటీని వేసినట్టు వెల్లడించారు. ఈ కమిటీ ప్రతిపాదనల మేరకు దాదాపు 40 మందికి అవకాశం రావచ్చునని చెప్పారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటిదని, అలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముందుచూపుతో నిర్మించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్‌పార్టీకి పేరు వస్తుందనే భయంతో దానిని పక్కనపెట్టి కాళేశ్వరం పేరుతో కొత్త ప్రాజెక్టుకు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఎల్లంపల్లి సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామని, టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. రైతులను ఆదుకోవడంలేదు: పంటరుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీనిచ్చిన టీఆర్ఎస్ .. రైతులను మోసం చేసిందని ఉత్తమ్ విమర్శించారు. ఇప్పటిదాకా కేవలం రెండు దఫాల్లో కొంత మాత్రమే మాఫీ చేసిందని, మూడో దఫా నిధులను ఇంకా బ్యాంకుల్లో జమచేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. వీటిపై టీపీసీసీ క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతోందని ఉత్తమ్ వెల్లడించారు. 3 నుంచి ప్రచార కమిటీ సమావేశాలు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణ, కాంగ్రెస్‌పార్టీ సిద్ధాంతాలు, ప్రచార వ్యూహంపై చర్చించడానికి అక్టోబర్ 3 నుంచి 7వ తేదీదాకా ప్రచార కమిటీ జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహించనుంది. 3న శిక్షకుల సమావేశం, 4న నిజామాబాద్‌లో.. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల సమావేశాలు ఉంటాయని కమిటీ కన్వీనర్ నాగయ్య, కో కన్వీనరు మల్లు రవి వెల్లడించారు. 5న వరంగల్‌లో.. వరంగల్, కరీంనగర్ జిల్లాలు, 6న మహబూబ్‌నగర్‌లో.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు, 7న సూర్యాపేటలో ఖమ్మం, నల్లగొండ జిల్లాల సమావేశాలుంటాయని వారు వెల్లడించారు. -
4 రోజుల్లో టీపీసీసీకి పూర్తి కార్యవర్గం: ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకానున్న 27 జిల్లాలకు కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకాలను అక్టోబరులోనే పూర్తిచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఈ రెండున్నరేళ్లలోనే చాలా తప్పులు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ అమలుచేయడం లేదని విమర్శించారు. రైతులు, యువకులు, దళితులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. వీటిపై పోరాటం చేయడానికి వెంటనే జిల్లా కమిటీలను పూర్తిచేస్తామని, అంతకన్నా ముందుగా టీపీసీసీకి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని కూడా పూర్తిచేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. టీపీసీసీకి కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకాన్ని నాలుగైదు రోజుల్లోనే పూర్తిచేస్తామన్నారు. కమిటీలో ప్రతిపాదనలకోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు నాగయ్య అధ్యక్షతన ఐదుగురితో కమిటీని కూడా వేసినట్టుగా వెల్లడించారు. ఈ కమిటీ ప్రతిపాదనల మేరకు 40 మందికి అవకాశం రావచ్చునని చెప్పారు. -
'కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ హ్యాపీగా లేరు'
హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు చేసేందేమీ లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.90 వేల కోట్లను ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ తరగతులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ తోపాటు నారాయణ స్వామి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథలో అవినీతి జరుగుతుందని అన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆయన ఆరోపించారు. -
ఆదుకుంటారనుకుంటే ఆవు కథ చెబుతారా?
ప్రధాని పర్యటనపై ‘ఉత్తమ్’ విమర్శ సిద్దిపేట జోన్ /వీణవంక: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమి లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట, కరీంనగర్ జిల్లా వీణవంకలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయహోదా ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణను ఆదుకుంటారని ప్రధాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఆయన ఆవు కథ చెప్పి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏదో ఒక మంచి ప్రకటన, హామీ ఇచ్చి వెళ్తారని ఎదురు చూశామని, కానీ కచ్చితమైన మాట చెప్పలేకపోయారని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం రూ.10 కోట్ల ప్రజాధనాన్ని ఆర్భాటంగా ఖర్చు చేసిందని విమర్శించారు. -
కాంగ్రెస్ నేతల అరెస్టులు దుర్మార్గం: ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటయిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి పర్యటిస్తున్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడమేకాక హౌస్ అరెస్ట్‌లు చేయడంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన విమర్శించారు. ప్రధాని పర్యటన సందర్భంగా సుహృద్భావ వాతావరణం నెలకొల్పాల్సిందిపోయి, నిర్బంధకాండ కొనసాగించడం సరికాదని, తెలంగాణలో కనీస హక్కులు లేకుండా ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని రాష్ట్రంలో జరుగుతున్న సర్కారు అణచివేత పై కూడా దృష్టి సారించాలని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉత్తమ్ పేర్కొన్నారు. -
'ప్రజలను ముంచి కట్టాల్సిన పనిలేదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఎదురుదాడి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణ పేరుతో తెలంగాణ సర్కారు అనాలోచితంగా, ఆశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని అన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ అసలు అవసరం లేదని అన్నారు. డీపీఆర్ లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా అధికారులు ఇవ్వలేదని ఉత్తమ్ చెప్పారు. గత కొద్ది రోజులుగా మల్లన్న సాగర్ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి ఈ అంశంపై మరోసారి సోమవారం మాట్టాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి .. ప్రాజెక్టుల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పై 23న గాంధీభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కూడా రిజర్వాయర్లు లేకుండా రీ డిజైన్ చేయాలని అన్నారు. మల్లన్న సాగర్ తో పాటు ఇతర రిజర్వాయర్లకోసం చేపట్టిన భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సాగునీరు పారిశ్రామిక అవసరాలకోసం మాత్రమే రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుందని అన్నారు. హరియాణాలోని యమునా నదిపై నిర్మించిన జవహార్ లాల్ నెహ్రూ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ మాదిరిగానే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని అన్నారు. సంపులు, పంపులు, కాల్వల ద్వారా సాగునీరు అందించాలని చెప్పారు. ప్రాజెక్టుల గురించి బాగా తెలుసని అనుకుంటున్న కేసీఆర్ ప్రజలను, గ్రామాలను ముంచి ప్రాజెక్టులు కట్టాల్సిన పనిలేదని అన్నారు. మరోపక్క, మల్లన్న సాగర్ తో పాటు ఇతర రిజర్వాయర్ల కోసం చేపట్టిన భూసేకరణ వెంటనే ఆపాలని మరో కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. -
'కేసీఆర్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం'
హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను అవమానపరిచేలా స్పీకర్, సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చించినట్లు ఉత్తమ్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. బడ్జెట్ పై ఉత్తమ్ స్పందిస్తూ.. తెలంగాణ బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని, ఇదసలు ఆచరణకు సాధ్యం కాని బడ్జెట్ అని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా కేసీఆర్ మారుస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల శాఖలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించారని, కుటుంబ పాలన జరుగుతోందని అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రాజెక్టుల టెండర్ల విషయంలో భారీ అవినీతి జరుగుతోందని ఉత్తమ్ ఆరోపించారు. -
రైతు ఆత్మహత్యలు పట్టని సర్కార్
మిర్యాలగూడ: రాష్ట్రంలో రోజు రోజుకు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని తెలంగాణ పీససీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మిర్యాలగూడలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలపై రాష్ర్ట మంత్రులు, అధికారులు కనీసం మానవీయ కోణంలో కూడా ఆలోచించడం లేదన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడితే.. మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా నోరుపారేసుకొని ఎదురు దాడికి దిగుతున్నారన్నారు. రాష్ర్ట ప్రజలు తెలివైన వారని, టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరును గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కొంతమంది, అప్పుల బాధతో మరి కొంతమంది మొత్తం రాష్ట్రంలో 1,300 మంది ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం ప్రభుత్వం వారికి భరోసా కూడా కల్పించడం లేదని విమర్శించారు. ఎంత సేపూ హైదరాబాదేనా? హైదరాబాద్ నగరాన్ని సింగపూర్, డల్లాస్ మాదిరిగా మారుస్తానని ప్రకటనలు చేస్తున్న సీఎం కేసీఆర్ రైతుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అందజేసే ప్యాకేజీని కూడా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు రూ.6 లక్షలు పెంచినట్టు ఆయన గుర్తుచేశారు. ఈ ప్యాకేజీని తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి చనిపోయిన వారికి అందించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల బిల్లులు చెల్లించాలి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని చెబుతూ ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు మంజూరు చేయడం లేదని ఉత్తమ్ అన్నారు. గృహ నిర్మాణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, మిర్యాలగూడ ఎమెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, జెడ్పీటీసీ నాగలక్ష్మి, మిర్యాలగూడ, దామరచర్ల మండలాల పార్టీ అధ్యక్షులు భిక్షంగౌడ్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుణ మాఫీ ఒకే దఫా ఇవ్వాల్సింది... రుణమాఫీ నాలుగు దఫాలు కాకుండా ఒకేసారి చేస్తే ఆత్మహత్యలు జరిగేవి కావని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయలు వృథా చేస్తున్న సీఎం.. రుణమాఫీని ఒకే విడతలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రుణ మాఫీ ఒకే విడత చేయడంతోపాటు రుణమాఫీ కాని వారికి కూడా ప్రధాన మంత్రి ప్యాకేజీ అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే విషయమై అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీస్తామన్నారు. -
కాంగ్రెస్‌ది గోబెల్స్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పనులు సీఎం కేసీఆర్ సొంత వ్యవహారమా అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు పారేసుకుంటున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రాణహితపై చర్చించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అసెంబ్లీలో కూడా చర్చిస్తామని పేర్కొనారు. ప్రాణహిత-చేవెళ్ల పథకంపై గాంధీభవన్‌లో జరిగిన సదస్సులో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని ప్రభుత్వం రద్దు చేయలేదని, ఆదిలాబాద్ జిల్లాకు అక్కడి నుంచే నీరివ్వనున్నామని ప్రకటించినా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ వద్ద మరో బ్యారే జీ అవసరం ఎందుకు కలిగిందో ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు వివరించిందని, ఆ వివరాలు కాంగ్రెస్ నేతలకు తెలియకపోవడం తమ తప్పుకాదన్నారు. గతంలో నీటిపారుదల మంత్రిగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవంగా ఇక్కడ ఒక్క ఎకరం భూసేకరణ జరగలేదన్నారు. అన్ని రకాల అధ్యయనాలు జరిగాకే మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం భావించిందని, సమగ్ర సర్వే జరిపిన తర్వాతే ముంపు, కాల్వల పొడవు, ఎంత కరె ంటు అవసరం.. తదితర వివరాలు తెలుస్తాయని అన్నారు. ఎవరో మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సమాచారంతో మాట్లాడడం కాంగ్రెస్ నేతలకు విజ్ఞత అనిపించుకోదని మంత్రి హితవు పలికారు. తుమ్మిడిహెట్టి వద్ద అధిక విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని కొందరు పదే పదే అంటున్న విషయాల్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి వంటి నేతలు నమ్మడం విచిత్రంగా ఉందన్నారు. ఇక్కడ 152 మీటర్ల వద్ద ఒక్క మెగావాట్ కరెంటుకు కూడా ప్రతిపాదనలు లేవని, మరి విద్యుత్ ఉత్పత్తి కోల్పోతున్నట్లు గోబెల్స్ ప్రచారం చేయడం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. ముడుపులు బొక్కింది మీరు కాదా? ‘మహారాష్ట్ర ప్రభుత్వాన్ని 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు ఒప్పించలేక పోయిన వైఫల్యం మీది కాదా..? విభజన చట్టంలో ప్రాణహితకు జాతీయ హోదా ఇప్పించలేక పోయారు... పైగా పోలవరానికి జాతీయ హోదా కట్టబెడుతుంటే చేష్టలుడిగి చూస్తూ కూర్చుంది మీరు కాదా..? ప్రాజెక్టును సమస్యల వలయంలో పడేసి కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు బొక్కింది మీరు కాదా..’ అని మంత్రి హరీశ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలు, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు కాలువ వివరాలు నిర్ధారణ అయ్యాక అసెంబ్లీ వేదికగా అన్ని వివరాలూ తెలియజేస్తామన్నారు. -
విభజన చట్టం, టీఆర్ఎస్ హామీలపై అధ్యయనం
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని అంశాలు, టీఆర్ఎస్ హామీలు, ప్రభుత్వ కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ లోతుగా అధ్యయనం చేస్తుందని, దాని కోసం మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించా రు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఉత్తమ్ విమర్శించారు. ఒక స్వచ్ఛంద సంస్థతో వాటర్‌గ్రిడ్‌పై పరిశీలన చేయిస్తామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలు, సాంకేతిక అంశాలపైనా లోతుగా అధ్యయనం చేస్తామని ఉత్తమ్ చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం తర్వాత ఆయా పథకాలపై కార్యాచరణను నిర్ణయించుకుంటామని వెల్లడించారు. 17 మందితో కూడిన అధ్యయన కమిటీలో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారన్నారు. పార్టీకి దూరమైన వారిని తిరిగి ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని పునరుద్ధరిస్తామని ఉత్తమ్ తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలు, పనుల పరిశీలనకు మరిన్ని ఉపకమిటీలు వేసి, లోతుగా అధ్యయనం చేసి ఏఐసీసీకి నివేదిక ఇస్తామని సురేశ్‌రెడ్డి వెల్లడించారు. -
'తిట్టించుకుని.. మళ్లీ అక్కడికే వెళ్లారు'
హైదరాబాద్: సీనియర్ నేత డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారు గురువారం మీడియాతో మాట్లాడారు. పదవి లేకుండా డీఎస్ నెల రోజులు కూడా ఉండలేక పోయారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. డీఎస్ ను దూషించిన కేసీఆర్ వద్దకే ఆయన వెళ్లారని చెప్పారు. పదే పదే పెద్ద పదవులు తనకే ఉండాలనడం డీఎస్ స్థాయి వ్యక్తికి సరికాదని పేర్కన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎస్ కు ఉన్నత పదవులు ఇచ్చిందని, ఆయనకు పార్టీలో సముచిత గౌరవమే దక్కిందని వివరించారు. అన్ని పదవులూ అనుభవించి పార్టీని వీడడాన్ని ప్రజలెవరూ హర్షించరని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. డీఎస్ పార్టీని వీడడం బాధాకరమని, ఆయనది అనాలోచిత నిర్ణయమని జానారెడ్డి అన్నారు. ఆయన రాజీనామా ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను అవమానించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా తాను పార్టీ సిద్ధాంత ప్రకారమే నడుచుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ను విలీనం చేసే పనిని హైకమాండ్ ఎవరికి అప్పగించిందో తెలియదని, ఆ పనిని పార్టీ నేతలు సరిగా డీల్ చేయలేదని డీఎస్ ఎలా వ్యాఖ్యానించారో ఆయనే వివరించాలని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో డీఎస్‌కు పదవులు దక్కాయే తప్ప, అవమానాలు పడ్డారనడం వాస్తవం కాదని భట్టి విక్రమార్క అన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే డీఎస్ టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. -
'తిట్టించుకుని.. మళ్లీ అక్కడికే వెళ్లారు'
-
'జీహెచ్ఎంసీ కమిషనర్.. టీఆర్ఎస్ ఏజెంట్'
హైదరాబాద్: హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సెటిలర్లకు కాంగ్రెస్ ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ప్రస్తుత రాజకీయాలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరు ఎవరిని రెచ్చగొట్టినా సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఈ నెల 21 నుంచి 27 వరకు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో సీనియర్ లీడర్లతో 6 కమిటీలు ఏర్పాటు చేశామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరించారు. -
ఆందోళన వద్దు..అండగా ఉంటాం
కడ్తాల : పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా.. అండగా ఉంటామని, ఆందోళన వద్దని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు భరోసాఇచ్చారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఆమనగల్లు మండలం కడ్తాలలోని ఎంబీఏ గార్డెన్స్‌లో స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అధ్యక్షతన కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ.. మాయమాటలు, అబద్ధాలు, భ్రమలు చూపి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంటికో ఉద్యోగం పేరు అధికారంలోకి వచ్చి లక్ష ఉద్యోగా లు భర్తీచేస్తానని నిరుద్యోగుల జీవితాల తో ఆడుకుంటున్నారని విమర్శించారు. కేఎల్ఐ సాగునీరు అందించాలి వచ్చే ఖరీఫ్ నాటికి కల్వకుర్తి నియోజకవర్గానికి 62,140 ఎకరాలకు కేఎల్ఐ సాగునీరు అందించకపోతే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తానని స్థానిక ఎమ్మె ల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2999కోట్లు కేటాయిం చిందని గుర్తుచేశారు. ఇన్ని నిధులు ఖర్చుచేసినా సాగునీరు అందడం లేదన్నారు. సీఎం కేసీఆర్ పాత ప్రాజెక్టులను పక్కన పెట్టడం తదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి 90వేల ఎకరాలకు సాగునీరు అందించేలా పథకాన్ని రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. కేఎల్ఐ, పాలమూరు ఎత్తిపోతల పథకాల ద్వారా 1.57లక్షల ఎకరాలకు సాగనీరు అందేవరకు పోరాటం సాగిస్తామని స్పష్టంచేశారు. పీసీసీ అధికార ప్రతినిధి మల్లురవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కుటుంబపాలను గమనిస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. హామీలను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు ప్రజలు సోనియాగాంధీకి రుణపడి ఉన్నారని చెప్పారు. అనంతరం తలకొండపల్లి మండలం సాలార్పూర్కు చెందిన పార్టీ కార్యకర్త ఎక్బాల్ ఆవులు చనిపోవడంతో అతడిని ఆదుకునేందుకు పార్టీ తరఫున రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. -
రిపోర్టర్ ను పరామర్శించిన టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ కవరేజ్ లో గాయపడి అపోలోలో చికిత్స పొందుతున్న మహిళా రిపోర్టర్ ను కలిసి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ కూడా ఆసుపత్రికి వెళ్లారు. చికిత్సకయ్యే ఖర్చును తమ పార్టీనే భరిస్తుందని నేతలు ఆమెకు భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీని పూర్తిగా ఒకే దఫాలో అమలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. -
మా వాళ్లను గెలిపించండి: కాంగ్రెస్
హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేలా నేతలు కృషి చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, డీ శ్రీనివాస్ సూచించారు. ఇచ్చిన హమీల అమలు విషయంలో కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని వారు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను పట్టభద్రులు గ్రహించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేయాలని కోరారు. హై కమాండ్ ఆదేశం మేరకే ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నామని, ప్రచారం కూడా ఆలస్యంగా ప్రారంభించామని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి అవినీతికి సంబంధించి తమ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ నుంచి పూర్తి సమాచారం తీసుకుంటున్నామని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు. జగదీశ్ రెడ్డి చెల్లని రూపాయి అని, ఆయన సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారని జానారెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పన్షన్ను ఎత్తివేసి సభకు రప్పించడం సబబుగా ఉంటుందని చెప్పారు.