సాక్షి, నల్గొండ: సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ మూల సిద్ధాంతానికే ఈ చట్టం వ్యతిరేకం అని పేర్కొన్నారు. కేరళ, పంజాబ్ రాష్ట్రాలు శాసనసభ ద్వారా సీఏఏను వ్యతిరేకిస్తునట్లు తీర్మానించాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక తీర్మానం చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ద్వంద విధానాలను మైనార్టీలు గమనించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రతి అంశంలోనూ సహకరిస్తున్నారని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మైనార్టీలు ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులు, దళితులు, ఉద్యోగులు.. మున్సిపల్ ఎన్నికలను ఆయుధంగా మలచుకోవాలన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అట్టర్ ప్లాఫ్ అయ్యారని విమర్శించారు. ఎంపీ నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment