రేపు పంటల పరిశీలనకు కేసీఆర్‌  | KCR To Visit Dry Crops In Nalgonda District on March 31 | Sakshi
Sakshi News home page

రేపు పంటల పరిశీలనకు కేసీఆర్‌ 

Published Sat, Mar 30 2024 3:01 AM | Last Updated on Sat, Mar 30 2024 3:01 AM

KCR To Visit Dry Crops In Nalgonda District on March 31 - Sakshi

జనగామ,సూర్యాపేట,నల్లగొండ

31న మూడు జిల్లాల్లో పర్యటన

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్‌: ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం మూడు జిల్లా­ల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో సాగు­నీరు లేక, భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్థితిగతులు తెలుసుకోనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండిపోతున్న వరిపంటలపై ఇటీవల కేసీఆర్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు వస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement