
సాక్షి, సూర్యాపేట జిల్లా : బీఆర్‌ఎస్ పార్టీ బరాబర్ వారసత్వ పార్టీనే అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. తమది వారసత్వ పార్టీ అని, కుటుంబ పాలన అని విమర్శిస్తున్న వాళ్లకి తనదైన శైలిలో బదులిచ్చారు కేటీఆర్. సూర్యాపేట సభలో ప్రసంగించిన కేటీఆర్. ‘ బరాబర్ మాది కుటుంబ పాలనే. ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న కేసీఆర్ తప్పకుండా తెలంగాణ కుటుంబ సభ్యుడే. ఎందరో నాయకుల త్యాగఫలమే వారసత్వ పార్టీ. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. సూర్యాపేటలో జగదీష్‌రెడ్డిని 50వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి.
రాష్ట్రమంతా విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్నాయంటే మంత్రి జగదీష్‌రెడ్డి ఆలోచన విధానానికి నిదర్శనం. అవతలి వారు ఎన్ని ఎత్తులు వేసిన జగదీష్‌రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరు. కంటి ముందు సంక్షేమం ఇంటి ముందు అభివృద్ధి కనబడుతుంది. శిఖండి రాజకీయాలు తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదు. జగదీష్ రెడ్డి ఓడిపోతాడాని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నాడు. ప్రజల్లో తేల్చుకుందాం రా. కాంగ్రెస్ పార్టీ వారంటీ లేని సచ్చిన పీనుగ లాంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చారు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు.ఓటుకు నోటుకు దొరికిన దొంగ, రేవంత్ సీట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దామా.?, కేసీఆర్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నాడు.మోదీ వచ్చి కుటుంబ పాలన అంటున్నాడు’ అని కేటీఆర్‌విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment