నల్గొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడీ నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో నాగార్జునసాగర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ముగ్గురు యువ నాయకుల మద్య పోటి నెలకొంది. బీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
మొన్నటి వరకు పార్టీ అధిష్టానం అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపించినా.. ఇటీవల భగత్‌కే భీఫాం ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు చెక్‌పడింది. ఎప్పటి నుంచి పార్టీలో ఉంటూ, నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అతన్ని కాదని భగత్‌ను టికెట్ ఇవ్వడంతో మన్నెం రంజిత్ యాదవ్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.
బీజేపీ పార్టీలో చేరి భగత్‌కు ప్రత్యర్థిగా మారారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి పోటీలో నిలిచారు. అయితే నియోజకవర్గంలో యాదవ వర్గం వారు ఎక్కువగా ఉండటం మన్నెం రంజిత్ యాదవ్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. దీంతో నాగార్జున సాగర్‌లో కమల జెండా ఎగరేసి తీరాతామని రంజిత్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నాగార్జున సాగర్ ఎవరి వశం కానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment