nagarjuna Sagar constituency
-
Nalgonda: నాగార్జునసాగర్‌లో ఎయిర్పోర్ట్!
నాగార్జునసాగర్/సింగరేణి(కొత్తగూడెం): నాగార్జునసాగర్‌లో ∙1,600 ఎకరాలలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ జాయింట్ జనరల్ మేనేజర్ ఏఎస్ఎన్ మూర్తి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ప్రాజెక్టు సమీపంలో గతంలో ఏర్పాటుచేసిన రన్‌వే సమీపంలోని భూములను పరిశీలించింది. ఏపీలోని మాచర్ల మండలం విజయపురిసౌత్, పసువేముల, చింతలతండ, నాగులవరం భూములను గురువారం పరిశీలించారు. సాగర్ జలాలపై ‘సీ ప్లేన్’ను నడిపే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఇక్కడ మినీ విమానాశ్రయం ఏర్పాటుకు ఆవశ్యకత ఏర్పడింది. మరోవైపు కొత్తగూడెంలో విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని ఉన్నతాధికారులు అబ్దుల్ అజీజ్, మహమ్మద్ సాకిబ్, ప్రశాంత్ గుప్తా, ఆర్.దివాకర్, మనీష్ జోస్వాల్, ప్రవీణ్ ఉన్ని కృష్ణన్ పరిశీలించారు. -
నా బలం, బలగం ‘సాగర్’ ప్రజలే.. అవే నన్ను గెలిపిస్తాయి: ఎమ్మెల్యే భగత్
‘సాగర్ నియోజకవర్గ ప్రజలే నా బలం.. బలగం. నేను ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గతంతో పోల్చితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ పథకాలు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సాక్షితో మాట్లాడారు. నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం వారికి అందుబాటులో ఉంటున్నా. ఇక్కడే స్థిరనివాసం ఏర్పచుకుని నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా. సాగర్‌లో ఏడు సార్లు పాలించినవారు చేయని అభివృద్ధిని కేవలం రెండున్నరేళ్లల్లోనే నేను చేసి చూపెట్టా. బలహీనవర్గాల బిడ్డగా ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. రూ.200 కోట్లతో అభివృద్ధి చేశా.. 2018లో తొలిసారిగా మా నాన్న నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలిచాక హాలియా, నందికొండను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలో 40 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. నేను గెలిచాక రూ.60 కోట్లతో హాలియా, నందికొండ పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. వరద కాల్వ పనులను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. నియోజకవర్గంలో 10 విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాం. నందికొండలో క్వాటర్స్‌లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చాం. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాం. సాగర్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలోని మూడు పీహెచ్‌సీలకు రూ.25 లక్షల చొప్పున కేటాయించి అభివృద్ధి చేశాం. కంపాసాగర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలగా ఏర్పాటు చేయడమే నాముందు ఉన్న ఏకైక లక్ష్యం. నెల్లికల్లు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. రూ.664 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దవూర మండలంలో సుమారు రూ.2.5 కోట్లతో డీ8, డీ9 లిఫ్ట్ పనులు పూర్తి చేశాం. దీని ద్వారా 7300 ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.33.81 కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాం. ఇంకా త్రిపురారం, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో లిఫ్ట్‌లు, చెక్‌డ్యాంల ఏర్పాటు చేయాల్సి ఉంది. -
ప్రజల మద్దతు నాకే..
‘ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజల నుంచి నాకు ఆదరణ లభిస్తోంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న ధీమా ఏర్పడింది. నామీద నమ్మకంతో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ ప్రాంత బిడ్డగా.. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై ప్రతి నిత్యం కొట్లాడుతున్నాను. ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతా’నని కాంగ్రెస్ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు మా ర్పు కోరుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు. భారీ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను. నియోజకవర్గానికి మా నాన్న చేసిన అభివృద్ధి వాళ్ల కళ్ల ముందే కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. నేను గెలిచాక స్థానికంగానే ఉండి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతా. జానారెడ్డి హయాంలోనే అభివృద్ధి.. సాగర్ నియోజకవర్గంలో ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మా నాన్న కుందూరు జానారెడ్డి హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగింది. గిరిజన తండాలకు రోడ్లు, కరెంట్ సౌకర్యంతో పాటు 34 వేల ఇళ్లు, 2 లక్షల ఎకరాలకు సాగునీరు, 1048 కిలోమీటర్ల రహదారుల నిర్మాణంతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు మా వద్ద లెక్కలతో సహా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన జాబ్ క్యాలెండర్ అమలు చేయడానికి కట్టుబడి ఉంది. యువత చెడ్డదారిలో పోకుండా చదువుపై మనస్సును నిలిపి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు విస్తృతం చేయనున్నాం. ప్రైవేట్ రంగాల్లోనూ ఉపాధి కల్పించడానికి నేను సొంతంగా కృషి చేస్తాను. యువత మేధస్సును పరిపూర్ణంగా వినియోగించుకుంటాం. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. నియోజకవర్గంలో ప్రజలు వైద్య సేవలు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మండల, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు కావాలి్సన ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించి వైద్య సేవలు స్థానికంగానే అందేలా చర్యలు తీసుకుంటాం. విద్యా సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా స్కూళ్లలో టీచర్ల కొరత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. టీచర్ల కొరత తీర్చడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలకు మరమ్మతు చేయించి ప్రైమరీ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. -
జనసేనతో కలిసి వెళ్లడంపై బీజేపీ మహిళా ఎమ్మెల్యే కీ కామెంట్స్
-
రసవత్తరంగా నాగార్జున సాగర్ రాజకీయం
నల్గొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడీ నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో నాగార్జునసాగర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ముగ్గురు యువ నాయకుల మద్య పోటి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు పార్టీ అధిష్టానం అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపించినా.. ఇటీవల భగత్‌కే భీఫాం ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు చెక్‌పడింది. ఎప్పటి నుంచి పార్టీలో ఉంటూ, నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అతన్ని కాదని భగత్‌ను టికెట్ ఇవ్వడంతో మన్నెం రంజిత్ యాదవ్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో చేరి భగత్‌కు ప్రత్యర్థిగా మారారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి పోటీలో నిలిచారు. అయితే నియోజకవర్గంలో యాదవ వర్గం వారు ఎక్కువగా ఉండటం మన్నెం రంజిత్ యాదవ్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. దీంతో నాగార్జున సాగర్‌లో కమల జెండా ఎగరేసి తీరాతామని రంజిత్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నాగార్జున సాగర్ ఎవరి వశం కానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
ప్రజల ఆ ఒక్క కోరికా తీరుతుందేమో!
గుర్రంపోడు (నాగార్జునసాగర్): ‘నేను ఏ హోదాలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నట్లుగానే లెక్క.. 55 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నన్ను తెలుగు రాష్ట్రాల్లో అందరూ గౌరవిస్తున్నారు, ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నేను ఆశించకుండానే అనేక పదవులు వచ్చాయి. ఏ ముఖ్యమంత్రీ చేయని పలు శాఖలకు మంత్రిగా పనిచేశా.. ప్రజల ఆ చివరి కోరిక కూడా నాకు తెలియకుండానే తీరవచ్చు’అని మాజీమంత్రి కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు. ‘పదవుల రేసులో నేను ఎప్పుడూ లేను, పదవే రేసులో ఉండి నన్ను వరిస్తుంది’అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి కాలేదా.. ముఖ్యమంత్రి అయినంక, ఆరు నెలల తర్వాత నా కొడుకు రాజీనామా చేస్తాడు.. నేను ఎమ్మెల్యే అవుతా’అంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో జెడ్పీటీసీ సభ్యురాలు గాలి సరితా రవికుమార్, పదిమంది సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ, పలువురు నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జానారెడ్డి మాట్లాడారు. మరోమారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని కోరారు. సమావేశంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గుర్రంపోడు మండల అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాగర్‌లో జానా తనయుడివైపే మొగ్గు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల వ్యవహారం తేలలేదు. మిగతా నియోజకవర్గాల్లో దాదాపు కొలిక్కి వచ్చినా దేవరకొండ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డినే పోటీలో దింపాలని భావించినా ఆయన తన కుమారుడికే టికెట్ ఇప్పించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉంటే.. పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టులకు రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకారానికి వచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు, మునుగోడు స్థానాన్ని సీపీఐకి ఇస్తున్నారన్న విషయంపై సోమవారం రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయా స్థానాలను ఆశిస్తున్న వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి వర్గం, మునుగోడులో టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి వర్గం నిరాశలో పడింది. అయితే, మిర్యాలగూడ, మునుగోడు స్థానాలను ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని కమ్యూనిస్టు పార్టీల నేతలు చెబుతుండగా.. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. తేలాల్సి ఉన్న మూడు స్థానాలు ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో ఎవరిని బరిలో నిలుపాలన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయానికి రానట్లుగా తెలిసింది. అందులో ముఖ్యంగా దేవరకొండ, తుంగతుర్తి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొనగా, సూర్యాపేటలో ఇద్దరి మధ్యే ప్రధానమైన పోటీ నెలకొంది. దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ఐదారుగురు ప్రయత్నిస్తున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు గతంలో టీడీపీ, పీఆర్పీలో పనిచేసిన వడ్త్యా రమేష్‌నాయక్, కిషన్‌నాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో రమేష్‌నాయక్ మాజీ మంత్రి జానారెడ్డి ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో పీఆర్పీలో పనిచేసినందున సినీ నటుడు చిరంజీవి ద్వారా కూడా రమేష్ నాయక్ ప్రయత్నాలు చేస్తుండటంతో టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని తేల్చలేదు. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, నాగరిగారి ప్రీతమ్, భాషపంగు భాస్కర్, వడ్డేపల్లి రవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ పోటీ అధికంగా ఉండటంతో వెంటనే తేల్చని పరిస్థితి నెలకొంది. ఇక సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్ మధ్య సయోధ్య కుదిర్చే పనిలోనే అధిష్టానం ఉంది. దీంతో వారిలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి రాలేదు. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తన కుమారుడు జైవీర్‌రెడ్డి అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అవసరమైతే తాను ఎంపీ వెళతానని ప్రకటించారు. దీంతో అక్కడ జానారెడ్డి కూమారునికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. -
సాగర్ అభ్యర్థిని మార్చాలి.. లేదంటే!.. బీఆర్ఎస్ నేతల డిమాండ్
సాక్షి, నల్గొండ: ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనతో అధికార బీఆర్ఎస్ అమ్మతి జ్వాలలు తీవ్ర స్థాయికి చేరాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సిట్టింగ్‌లకు టికెట్టు ఇవ్వడంతో స్థానిక నేతలు అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నియమాకాన్ని వెనక్కి తీసుకోవాలిని వాదిస్తున్నారు. ఎమ్మెల్యే నోముల భగత్‌పై అసంతృప్తి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో, నాయకుల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. ఈ మేరకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశావాహి మన్నెం రంజిత్ యాదవ్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్టుగా పనిచేసి నోముల భగత్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు పార్టీ సమావేశానికి స్థానిక నేతలను ఆహ్వానించడం లేదని మండిపడ్డారు. తండ్రి పేరుతో ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయనకు కార్యకర్తలతో ఎలా మాట్లాడాలనేది కూడా తెలియదని విమర్శించారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామల్లో కొట్లాటలు జరుగుతున్నాయని, సమస్యలను పరిష్కరించడంలో నోముల భగత్ విఫలమయ్యారని అన్నారు. ఆయన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. భగత్‌ను కాకుండా స్థానిక వ్యక్తికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. భగత్‌ను మార్చకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెడతామని ముక్తకంఠంతో తెలిపారు. -
సాగర్‌లో బీజేపీ బిగ్ ప్లాన్.. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క
నాగార్జున సాగర్ సీటు మీద కమలం పార్టీ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కారు, హస్తం పార్టీలకు ధీటైన అభ్యర్థిని బరిలో దించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రెండు ప్రత్యర్థి పార్టీలు యువనేతలకే ఈసారి ఛాన్స్ ఇవ్వబోతున్నాయి. ఆ తరహాలోనే తాను కూడా యువనేతనే పోటీలో దించడానికి ప్లాన్ చేసింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కమలం పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ గట్టి అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకముందు జరగబోయేది మరో ఎత్తు అనే రీతిగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న కారు, కాంగ్రెస్ పార్టీలను తట్టుకుని నిలబడగలిగే అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది. అయితే నాగార్జునసాగర్‌లో సరైన నాయకులు లేకపోవడంతో ఇతర పార్టీల నేతలకు గేలం వేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డిని లాగాలనుకున్నా సాధ్యం కాలేదు. మరో ఇద్దరు నాయకుల కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూనే కొత్త వ్యూహాలకు పదును పెడుతుందోట. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్ మరోసారి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి రంగంలోకి దిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు యువనేతలకు ధీటుగా ఉండే మరో యువనేతను రంగంలో దించాలని కమలం పార్టీ యోచిస్తోందట. గతంలో టికెట్ హామీతో కాషాయ కండువా కప్పుకున్న రిక్కల ఇంద్రసేనారెడ్డి కూడా తనకిచ్చిన హామీని రాష్ట్ర నాయకత్వం దగ్గర పదే పదే గుర్తు చేస్తున్నారట. రాష్ట్ర స్థాయి నేతలు కూడా రిక్కల విషయంలో సానుకూలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో నియోజవకర్గంలో ఇంద్రసేనారెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓవైపు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తూనే తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలతో ఆ పార్టీ నేతల్ని కూడా కలిసి మద్దతు కోరుతున్నారట. చదవండి: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన టీ కాంగ్రెస్ ఇక రిక్కలతో పాటు చెన్ను వెంకటనారాయణ రెడ్డి అనే మరో నేత కూడా టికెట్ ఇస్తే పోటీ చేయాలని ఆలోచిస్తున్నారట. గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రవినాయక్ ప్రస్తుతం యాక్టివ్‌గా లేరని చెబుతున్నారు. ఉప ఎన్నికలు ముగిసిన కొంతకాలం తర్వాతినుంచి రవినాయక్ సైలెంట్ అయిపోయారని పార్టీ కేడరే చర్చించుకుంటోంది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదిత కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అయితే పార్టీ మాత్రం ఈసారి పక్కా ప్రణాళికతో ఉంది. ఎన్నికల్లో పోటీ చేశాం అన్నట్లు కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చి నాగార్జునసాగర్‌లో పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తోంది. అంగబలం, అర్థబలం ఉన్న నేతకే టికెట్ ఇవ్వాల్సి వస్తే మాత్రం రిక్కలకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏదో పోటీలో ఉన్నామని అనుకునేవారు కాకుండా.. సీరియస్‌గా ఎంతైనా ఖర్చు పెట్టగలవారికే సాగర్ టిక్కెట్ ఇచ్చేందుకు కమలం నేతలు నిర్ణయించుకున్నారు. -
నాగార్జునసాగర్ బరి నుంచి జానారెడ్డి అవుట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనా?. ఎప్పటి నుంచో తన వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కంటున్న జానారెడ్డి.. ఆ వ్యూహంలో భాగంగా తన చిన్న కుమారుడిని రంగంలోకి దించారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి పోటీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో.. ఈసారి ఎన్నికలకు జానారెడ్డి దూరమైనట్లే భావించొచ్చు. చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్‌రెడ్డి.. తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ సాగారు. అయితే.. ఉన్నట్లుండి జైవీర్ రంగంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గతంలో గిరిజన తండాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చడంతో మెజార్టీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే సర్పంచులుగా ఉన్నారు. దీంతో గిరిజనుల మద్దతును మరోసారి కూడగట్టేందుకు యాత్రను ఉపయోగించుకుంటున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థుల దరఖాస్తుకు రేపే ఆఖరి రోజు. పీసీసీకి ఇప్పటిదాకా 600 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య దరఖాస్తు చేసుకోగా.. పొంగులేటి, కొమటిరెడ్డి, కొండాసురేఖలు ఇప్పటికే అప్లికేషన్లు సమర్పించారు. ఉత్తమ్, భట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. చదవండి: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు -
కేసీఆర్ చెప్పినా కూడా ఎమ్మెల్యేల కాళ్లులాగే ప్రయత్నాలు.. ఇలాగైతే కష్టమే!
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ బీఆర్ఎస్ పార్టీలో లొల్లి ఎక్కువవుతోంది. టిక్కెట్ల పోరు తీవ్రమవుతోంది. సిటింగ్‌లకే సీట్లని కేసీఆర్ ప్రకటించాక కూడా ఎమ్మెల్యేల కాళ్ళులాగే ప్రయత్నాలు ఆగడంలేదు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తలనొప్పులు పెరిగాయట. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు వర్గపోరుతో పాటు.. కొత్త తలనొప్పులు మొదలయ్యాయని టాక్. సొంత వర్గం నేతలు కూడా ఎమ్మెల్యే మాటల్ని పెడచెవిన పెడుతూ బహిరంగంగా కయ్యానికి కాలు దువ్వుతున్నారట. ఇప్పటికే సాగర్ బీఆర్ఎస్ పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో అక్కడ పార్టీ శ్రేణులు కూడా రెండు వర్గాలుగా విడిపోయాయి. రెండు గ్రూపులకు తోడు మధ్యలో మరో నేత రావడంతో ఇప్పుడు మూడు ముక్కలాట సాగుతోంది. ఈ పరిస్థితుల్లో సొంత వర్గాన్ని కాపాడుకుంటూ.. ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎమ్మెల్యేలకు సమయం సరిపోవడంలేదట. అంతా గందరగోళంగా మారడంతో సొంత వర్గం నుంచి కూడా ఎమ్మెల్యే భగత్‌కు సమస్యలు ఎదురవుతున్నాయట. ఇవన్నీ చూసి ఎమ్మెల్యేకు తలబొప్పి కడుతోందని టాక్. చదవండి: తేరా చిన్నపరెడ్డి రాజకీయ అదృష్టమెంత? కారులో సీటుందా? ప్రచారంతో వివాదం ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పంచాయితీ కొనసాగుతున్న తరుణంలోనే.. సొంత వర్గానికి చెందిన చోటా నేతలు చేస్తున్న హంగామా ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే బజారుకెక్కి బట్టలు చింపుకుంటుండటంతో ఏం చేయాలో అర్థం కావడంలేదట. సొంతవర్గంలోని గొడవలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఎమ్మెల్యే ఆందోళన పడుతున్నారని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారు. తాజాగా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పెద్ద హీరో సినిమా విడుదల సమయంలో అభిమానులు పెట్టినట్లుగా ఫ్లెక్సీలను ఊరంతా నింపేశారట. వాటిలో ఒకచోట నిడుమనూరు ఎంపీపీ జయమ్మ ఫోటో పెట్టలేదట. దీంతో ఆమె అనుచరులు కొందరు అక్కడకు చేరుకుని నానా హంగామా చేశారు. తమ నేత ఫోటో లేకుండా ఫెక్సీలు పెడతారా? మీకెంత ధైర్యం అంటూ అందులో తమ నాయకుడు భగత్ ఫోటో ఉందన్న విషయం కూడా మర్చిపోయి వాటిని చించేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయట. సోషల్ మీడియాలో వైరల్ అసలు ఏం జరుగుతుందో అర్థంకాక కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి సర్ధిచెప్తున్నా ఎంపీపీ అనుచరుడు వినిపించుకోకుండా రోడ్డుపైనే గొడవకు దిగారట. దాదాపు గంట పాటు ఈ గొడవ జరగడంతో పార్టీ పరువు పోతుందని అక్కడే ఉన్న ఓ నాయకుడు ఎమ్మెల్యేకు విషయం చేరవేశాడట. దీంతో ఎమ్మెల్యే సీరియస్ అయి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా సదరు నేత వెనక్కి తగ్గలేదట. మరోవైపు ఇదే అవకాశమని వైరి వర్గం ఆ వీడియోను విస్తృతంగా వైరల్ చేసేసిందట. దీంతో ఒక్కసారిగా నాగార్జున సాగర్ లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఇది మీడియాలో కూడా రావడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఎమ్మెల్యే ఎంపీపీతో వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇన్నాళ్లు అక్కడ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నువ్వా నేనా అన్నట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య రాజకీయాలు సాగుతున్నాయి. వీరి పోరుతోనే పార్టీ పరువు సాగర్‌లో కలుస్తోందని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ తాజాగా ఎమ్మెల్యే వర్గానికి చెందినవారే రొడ్కెక్కడంతో ఏంటీ కొత్త గోల అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. అసలే భగత్ ఎక్కడ దొరుకుతాడా కసి తీర్చుకుందాం అని ఎదురుచూస్తోన్న ఎమ్మెల్సీ వర్గానికి ఎమ్మెల్యే సొంత వర్గమే వారికి ఇప్పుడో ఆయధం ఇచ్చినట్లు అయిందట. మొత్తానికి అందరూ కలిసి పార్టీ పరువును సాగర్‌లో కలిపేస్తున్నారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పట్టించుకోని కేసీఆర్ సర్కార్.. తీర్థం ఇచ్చేందుకు సిద్ధమైన కమలం పార్టీ
రాజకీయాల్లో కొందరిని అదృష్టం వెంటాడుతుంది. మరికొందరిని దురదృష్టం వదలనంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దురదృష్టం వెంటాడుతున్న నాయకుడు ఒకరున్నారట. ఎన్నికల్లో ఓడిపోవడం, గెలిచినా ఆ పదవి కొద్ది కాలమే ఉండటంతో.. కొంతకాలంగా ఆ నేత రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తుండటంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి వస్తారా? రారా ? అని ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారట? తేరా చిన్నపరెడ్డి. నల్లగొండ జిల్లాలో రాజకీయ దురదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన పేరే అని సెటైర్లు వేస్తుంటారు కొందరు విశ్లేషకులు. ఎందుకంటే... పొలిటికల్‌గా ఆయన ట్రాక్ రికార్డు అలా ఉంది మరి. చట్టసభలోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన తేరా చిన్నపరెడ్డి 2009 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆయనను విజయం వరించలేదు. ఓటమి మాత్రమే పలుకరించింది. మామూలుగా అయితే ఓ రాజకీయ నాయకుడు వరుసగా ఓడిపోతూ వస్తుంటే కూడబెట్టిన ఆస్తులు కరిగిపోయి నడిరోడ్డుపై నిలబడతారని అంటారు. కానీ వ్యాపారంలో సంపాదించిన వేల కోట్లు ఉండటంతో ఆయన మరో ప్రయత్నంగా నాలుగోసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి అదృష్టం కలిసి వచ్చింది. తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు. కానీ అది కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. మామూలుగా ఎమ్మెల్సీ అంటే ఆరేళ్లు ఉంటుంది. అయితే ఆయన పోటీ చేసింది ఉప ఎన్నిక కావడం..ఆ పదవి గడువు మూడేళ్ళే ఉండటంతో తేరా ఆశ సగమే తీరింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గులాబీ బాస్ ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో.. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో ముఖ్యమంత్రులు, మంత్రులు పర్యటించినా కూడా కనిపించడం మానేశారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ తేరా చిన్నపరెడ్డి రాజకీయాల్లో కొనసాగుతారా? లేదంటే పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అనే చర్చ ఓ రేంజ్లో జరుగుతోంది. ఆశ ఉంది కానీ.. అవకాశాలే తక్కువ నాగార్జునసాగర్ నియోజకర్గానికి చెందిన తేరా చిన్పప రెడ్డి ఫార్మా రంగంలో వ్యాపారం చేస్తూనే తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. తొలి ఎన్నికల్లోనే జానారెడ్డి లాంటి సీనియర్ నేతకే ముచ్చెమటలు పట్టించారు. కానీ ఆ ఎన్నికల్లో 6 వేల 214 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీచేసి గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ గూటికి చేరారు. 2016లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీభత్సంగా ఖర్చు చేశారని ప్రచారం జరిగినా...అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలోనే రాజకీయం తన వల్ల అవుతుందా అని తనను తాను ప్రశ్నించుకున్నారట చిన్నపరెడ్డి. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో తేరాను అదృష్టం మొదటిసారి పలకరించింది. రాజగోపాల్‌రెడ్డి గెలిచిన సీటులో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి శాసనమండలిలో అడుగు పెట్టారు. కారులో సీటుందా? శాసనమండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలవడంతో ఆయన పదవి కాలపరిమితి గత ఏడాదే ముగిసింది. కాని గులాబీ బాస్ తేరాకు రెన్యువల్ చేయలేదు. చిన్నపురెడ్డి విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ మన్నించలేదు. శాసనమండలి సభ్యత్వం మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోవడంతో..ఏడాదిగా రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా ఆయన కనిపించడంలేదు. దీంతో చిన్నపరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారా అనే చర్చ మొదలైంది. జ్యోతిష్యుడి ఆజ్ఞ లేనిదే అడుగు కూడా బయట పెట్టరని చిన్నపరెడ్డికి పేరుంది. మరి జ్యోతిష్యుడి ఆదేశాల కోసం తేరా ఎదురు చూస్తూ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయనకు కాషాయ తీర్థం ఇచ్చేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ కండువా కప్పి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయిస్తే బీజేపీకి లాభం చేకూరుతుందని నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే ఒకసారి చర్చలు కూడా జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చిన్నపరెడ్డి బీజేపీలో చేరతారా... లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతారా లేక రాజకీయాల నుంచే తప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. కాలు కదిపేందుకు కూడా జ్యోతిష్యుడి ఆదేశాల కోసం ఎదురుచూసే తేరా చిన్నపరెడ్డి రాజకీయ జాతకాన్ని.. ఆయన గురువు ఎటువంటి మలుపు తిప్పుతారో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com చదవండి: ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. మంత్రిని నిలదీసిన చేనేత కార్మికులు -
Father's Day: తండ్రిని తలుచుకొని పాట పాడిన ఎమ్మెల్యే నోముల భగత్
సాక్షి, నల్గొండ: అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తే..బతుకంతా ధారపోసి జీవితమిచ్చేది మాత్రం నాన్నే. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడించేది.. కష్టాల్లో నిబ్బరంగా, ఆపదల్లో ధైర్యంగా నిలబడేలా చూసేది నాన్నే. కన్నబిడ్డ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే శ్రమజీవి నాన్నే. అందుకే.. నాన్న నీకు వందనం. నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం. ఫాదర్స్ డేఏ సందర్భంగా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తన తండ్రి నోముల నర్సింహయ్యను తలుచుకొని పాట పాడారు.. నా దారి నువ్వే నాన్నా.. నా ధైర్యం నువ్వే నాన్నా’ అంటూ పాట పాడారు. ఈ పాటను తనే స్వయంగా రాసి తండ్రికి అంకితం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే తన టట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘మా నాన్నకు అంకితం.. ప్రపంచంలోని నాన్నలందరికీ ఫాదర్స్‌డే శుభాకాంక్షలు’ అనిపేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాట జనాలకు ఆకట్టుకుంటోంది. చదవండి: Father's Day: తల్లి దూరమైన పిల్లలు.. అమ్మ కూడా... నాన్నే! A small dedication to my father..Happy father's day to all father's out there...#fathersday pic.twitter.com/xuUEXJtC3s — Nomula Bhagath Kumar (@BagathNomula) June 19, 2022 -
రాహుల్ గాంధీకి పబ్బులు, జల్సాలు మాత్రమే తెలుసు: కేటీఆర్
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ, రాహులల్ గాంధీపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లాలో జరిగిన హాలియా సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కాలం పదవిలో ఉన్న నేతలు చేయని అభివృద్ధి ఈరోజు ఎమ్మెల్యే భగత్ చేస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వారు చేయని, చేయలేని పనులు భగత్ చేసి చూపిస్తున్నాడు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. ఎమ్మెల్యే భగత్ కోరిక మేరకు నూతన స్టేడియం కోసం రూ. 3కోట్లు మంజూరు చేస్తున్నాం. ఓపెన్ డ్రైనేజీ కోసం రూ. 15కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. జానారెడ్డి అంటే గౌరవం.. కానీ వారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వారే చెప్పాలి. పక్కన కృష్ణా నది ప్రవహిస్తున్నా.. ఫ్లోరైడ్ నిర్మూలన చేయలేదు. రైతులకు సాగు నీరు ఇవ్వని అసమర్థులు గత పాలకులు. ఫ్లోరైడ్ నిర్మూలనకు కేసీఆర్ కృషి చేసి చూపించారు. గత పాలకులు పదవులు అనుభవించారు తప్ప.. అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. పెద్దమనుషుల ఆత్మగౌరవం పెంచిన నేత కేసీఆర్.. బీడీ కార్మికుల గురించి ఆలోచన చేసింది కేసీఆర్ అని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, పథకాలు చరిత్రాత్మకం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. మంత్రులుగా సుదీర్ఘంగా పనిచేసినా 6 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వలేదు గత పాలకులు. దేశంలో రైతుల కోసం అనేక పథకాలు ఇచ్చిన ఏకైక నేత కేసీఆర్ మాత్రమే. మనం కట్టే పన్నులు పక్క రాష్ట్రాలకు ఉపయోగపడుతున్నాయి. ఏడు సార్లు గెలిచిన జానారెడ్డి ఏం చేశారు.? రాహుల్‌కు ఒక్కసారి అవకాశమిస్తే ఏం అభివృద్ధి చేస్తారు. ఎద్దులు, పొలం, వ్యవసాయం తెలియని నేత రాహుల్ గాంధీ. పబ్బులు, జల్సాలు తప్ప రాహుల్‌కు ఏమీ తెలియదు. నాగార్జున సాగర్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో వచ్చే నేతలను నమ్మొద్దు. యువనాయకుడు భగత్‌ను కాపాడుకోవలసిన బాధ్యత నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలపై ఉంది’’ అని అన్నారు. Live: Addressing a mammoth public meeting in Nagarjuna sagar https://t.co/MiBZMZIUC5 — KTR (@KTRTRS) May 14, 2022 ఇది కూడా చదవండి: అమిత్‌షాకు 9 ప్రశ్నలు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ.. -
కాంగ్రెస్‌లో ‘నల్లగొండ’ కాక!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కాక మొదలైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన విజయవంతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న జిల్లా పర్యటనల్లో భాగంగా నల్లగొండ జిల్లాకు వెళ్తుండడం ఇందుకు కారణమయ్యింది. రేవంత్ నల్లగొండ పర్యటన ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, తాజాగా శుక్రవారం ఆయన నాగార్జునసాగర్‌కు వెళ్తుండడం, ఆయన పర్యటన గురించి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. రేవంత్ నల్లగొండ జిల్లాకు వెళ్లాల్సిన అవసరం లేదని, అక్కడ పార్టీ బలంగా ఉందని, ఉత్తమ్‌తో పాటు జానా, తాను అన్నీ చూసుకుంటామని, తామే అక్కడ పహిల్వాన్లమని కోమటిరెడ్డి గురువారం మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ బలంగా ఉన్న చోట్ల సమీక్షలు పెట్టినా పెట్టక పోయినా రాహుల్ సభకు జనాలు వస్తారని, బలం గా లేని జిల్లాలకు వెళ్లి అక్కడి నేతలు, కార్యకర్తలను సిద్ధం చేయాలంటూ కోమటిరెడ్డి సూచించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తమ్ ఓకే.. కోమటిరెడ్డి నో రేవంత్‌ను నల్లగొండకు రావద్దని నేరుగా చెప్పేందుకే కోమటిరెడ్డి అలా వ్యాఖ్యానించారని, రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా అంగీకరించేందుకు ఆయన లోలోపల ససేమిరా అంటున్నారని చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమనే చర్చ జరుగుతోం ది. వాస్తవానికి, ఈ నెల 27న రేవంత్ నల్లగొండ జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకత్వంతో సమావేశం కావాల్సి ఉంది. కానీ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలతో చెప్ప కుండానే షెడ్యూల్ రూపొందించారనే కారణంతో కోమటిరెడ్డి, ఉత్తమ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన పర్యటన వాయిదా పడిందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మరోమారు పార్టీ నేతలతో మాట్లాడిన రేవంత్ తనకు అనుకూలంగా ఉండే పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకోవ డం గమనార్హం. ఈ సమావేశానికి హాజరు కావా లని ఉమ్మడి జిల్లాలోని నాయకులందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశానికి హుజూర్నగర్ నుంచి ర్యాలీగా సాగర్‌కు వెళ్లేందుకు నల్ల గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కోమటిరెడ్డి మాత్రం ఈ సమావేశానికి తాను వెళ్లడం లేదని చెప్పడం చర్చకు తావిస్తోంది. తన నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి గడ్కరీ కార్యక్రమం ఉన్నందున తాను సాగర్‌కు వెళ్లడం లేదని కోమటిరెడ్డి చెప్పడం గమనార్హం. వెళ్లొద్దని ఎలా అంటారు? కోమటిరెడ్డి మనసులో ఏమున్నప్పటికీ, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని రాష్ట్రంలో ఫలానా చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడం భావ్యం కాదనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా రేవంత్ వెళ్లవచ్చని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర నేతలు కూడా.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను ఏఐసీసీ నియమించిన తర్వాత అన్ని జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యే అధికారం ఆయనకు ఉంటుందని, దీన్ని అడ్డుకునేందుకు, అభ్యంతర పెట్టేందుకు ఎవరికీ అధికారం ఉండదని అంటున్నారు. మొత్తంమీద రేవంత్ నల్లగొండ పర్యటన, ఆ పర్యటన గురించి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. -
వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్.నారాయణమూర్తి
హాలియా : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అంతమొందించే వరకు కార్మికులు, కర్షకులు ఐక్యతతో పోరాడాలని, రైతుల పోరాటానికి మద్దతుగా వారిని చైతన్య పరిచేందుకు రైతన్న సినిమాను తీసినట్లు సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. బుధవారం హాలియాలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కున్రెడ్డి నాగిరెడ్డి, కొండేటి శ్రీను, అవుతా సైదయ్య, కుర్ర శంకర్‌నాయక్, దుబ్బా రామచంద్రయ్య, జువాజీ వెంకటేశ్వర్లు, పొదిల వెంకన్న, రవినాయక్, యూసూబ్, శ్రీను, యాదయ్య, యడవెల్లి శ్రీను, ఎస్కె జానీపాషా, రవి, రవీందర్ తదితరులు ఉన్నారు. (చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం) ‘రైతన్న’ను ఆదరించాలి: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ సమాజహితం కోసం ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి నిర్మించిన రైతన్న సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ కోరారు. బుధవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్ నారాయణమూర్తి ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన వ్యవసాయ విద్యుత్ సంస్కరణలను పునర్ సమీక్షించాలన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడడంతో పాటు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతన్న సినిమాను చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వి«ధానాలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో అనుముల, తిరుమలగిరి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గౌరవసలహాదారు వెంపటి శంకరయ్య, వైస్ చైర్మన్ సుధాకర్, కౌన్సిలర్ వెంకటయ్య, నాయకులు చాపల సైదులు, సురభి రాంబాబు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, బందిలి సైదులు, రావుల లింగయ్య ఉన్నారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం -
ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గెలుపొందిన నోముల భగత్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భగత్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్ ఒకటిన నోముల నర్సింహయ్య మరణించడంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్ టీఆర్ఎస్ అభ్యర్థిగాగా పోటీ చేసి గెలిచారు. -
‘ఇంకొంచెం వడ్డించమ్మా’.. కేసీఆర్ పర్యటనలో ఆసక్తికర ఫోటోలు..
సాక్షి, నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను మించి వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు అడిగిన సమస్యలను పరిష్కరిస్తానని ఆనాడు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. సోమవారం వాటి అమలు కోసం హాలియాకు వచ్చారు. అక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టడంతో మరిన్ని వరాలు ఇచ్చారు. సాగర్ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తాను భగత్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ది ఏమిటో చేసి చూపిస్తానని చెప్పానని, తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. నియోజకవర్గం అభివృద్దిలో చాలా వెనుకబడి ఉందని, పట్టణం ఏమీ బాగా లేదని చెబుతూనే.. అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను ఇస్తానని ప్రకటించారు. ఇంకొంచెం వడ్డించమ్మా: ఎమ్మెల్యే భగత్ నివాసంలో భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్ వంటలు భేష్ పెద్దవూర: సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ స్వగృహంలో మధ్యాహ్న భోజనం చేశారు. సీఎంతో పాటు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకే టేబుల్‌పై కూర్చుని భోజనాలు చేయగా వారికి ఎమ్మెల్యే , ఆమె సతీమణి భవాని వడ్డించారు. భోజనంలో మాంసం, తలకాయ కూర, బొటీ, నాటుకోడి కర్రీ, చికెన్ ఫ్రై, చేపల కర్రీ, రోస్టు, పప్పు, సాంబారు, పెరుగు, ఒక స్వీటు వడ్డించారు. ఎమ్మెల్యే భగత్ భోజనాలు వడ్డిస్తుండగా మాతో పాటు భోజనం చేయమని సీఎం అనడంతో అతను కూడా వారితో కూర్చుని తిన్నారు. వంటలు బాగున్నాయమ్మా అంటూ సీఎం కేసీఆర్ కితాబు ఇచ్చాడు. వెల్కం సార్ : ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇస్తున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మీ రాక మాకెంతో ఆనందం : ముఖ్యమంత్రికి మంగళహారతితో స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే భగత్ కుటుంబ సభ్యులు వెళ్తొస్తా : హెలికాప్టర్లో తిరిగి వెళ్తున్న ముఖ్యమంత్రి -
Dalita Bandhu: రూ.లక్ష కోట్లయినా సరే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా, అనేక విజయాలు సాధించినా దళిత జాతి మాత్రం వెనుకబడే ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే వారి కోసం అద్భుతమైన తెలంగాణ దళిత బంధు పథకం తీసుకొచ్చామని తెలిపారు. ‘రూ.లక్ష కోట్లయినా సరే ఖర్చు చేస్తాం. ఆరు నూరైనా దళిత బంధు అమలు చేసి తీరతాం. రాష్ట్రంలో సుమారు 16 – 17 లక్షల దళిత కుటుం బాలు ఉంటే అందులో అర్హత కలిగిన కుటుంబాలు దాదాపు 12 – 13 లక్షల వరకు ఉన్నాయి. వారం దరికీ ఇంటికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు మంజూరు చేసి అమలు చేస్తాం.’ అని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా హాలియాలో సోమవారం నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారివి ఎన్నడూ చేసిన ముఖాలు కావు ‘దళితబంధుపై కొంతమంది అపోహలతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. అయితదా.. పోతదా.. అంటున్నారు. వారివి చేసిన ముఖాలు కావు కాబట్టి, ఎన్నడూ చేయలేదు కాబట్టే అలా మాట్లాడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను వారి ఖర్మకు వారిని వదిలేశారు తప్ప.. ఎవరూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. పుట్టగతులుండవనే అవాకులు, చెవాకులు దళిత బంధు పథకం తీసుకురావడంతో కేసీఆర్ చెబితే మొండిగా చేస్తారని ఇప్పుడు అందరికీ గుండెదడ మొదలైంది. కొంతమందికి బ్లడ్ ప్రెషర్ వస్తోంది. దళిత బంధు అమలైతే రాజకీయంగా వారికి పుట్టగతులు ఉండవనే భయంతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే గీత కార్మికులను, చేనేత కార్మికులను ఆదుకున్నాం. గీత కార్మికుల పన్ను మాఫీ చేశాం. ఇలా అనేక వర్గాల సంక్షేమం చేపడుతున్నాం. నేనే తెచ్చా .. నేనే పర్యవేక్షిస్తా ఇప్పుడు దళిత వర్గాల కోసం ఈ కార్యక్రమం తెచ్చాం. వాస్తవానికి ఈ పథకం పెట్టమని నాకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఎవరూ డిమాండ్ చేయలేదు. తెలంగాణ తెచ్చిన వాడిగా, తెలంగాణ బిడ్డగా నేనే మేథోమథనం చేసి దీనికి రూపకల్పన చేశా. దీనిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. తెలంగాణ దళితజాతి భారత దళిత జాతికే ఆదర్శంగా నిలిచేలా చేసి చూపిస్తా. చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఊరికీ నీళ్లు ఇస్తామని చెప్పాం. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తామన్నాం. రేషన్ కార్డులు, 24 గంటల కరెంటు ఇస్తామని కూడా చెప్పాం. ఏయే మాటలు చెప్పామో అవన్నీ ఆచరించి చూపిస్తున్నాం. గతంలోనూ తెలంగాణ తెస్తామంటే ఎవరూ నమ్మలేదు. అంతా ఇంట్లో పడుకున్నారు. సమైక్య పాలకులు సంచులు మోశారు. కానీ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నేను చావు అంచులవరకు వెళ్లి తెలంగాణ తెచ్చి చూపించాం..’ అని కేసీఆర్ చెప్పారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గురించి సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్. పక్కన మంత్రి జగదీశ్‌రెడ్డి కృష్ణా నీళ్లలో ఇబ్బంది జరగొచ్చు ‘రాబోయే రోజుల్లో కృష్ణా నీళ్లలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే పాలేరు రిజర్వాయర్ నుంచి పెద్దదేవులపల్లి చెరువు వరకు అనుసంధానం చేసి గోదావరి నీటిని తీసుకువచ్చే సర్వే జరుగుతోంది. అది పూర్తయితే రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఆయకట్టు సేఫ్‌గా (సురక్షితంగా) ఉంటుంది. గతంలో నీళ్లను మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే, నేనే వచ్చి 50 వేల మంది ఆయకట్టు రైతాంగంతో కలిసి సాగర్ కట్టపై దండోరా మోగించా. ఏది ఏమైనా కృష్ణా నుంచి మన వాటా తీసుకొని ఖచ్చితంగా సాగర్ ఆయకట్టులో రెండు పంటలు పండించుకునే ఏర్పాటు చేస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 7 మెడికల్ కళాశాలలను ఇటీవల మంజూరు చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం..’ అని సీఎం తెలిపారు. సాగర్ ప్రజలు నా మాట నమ్మారు ‘సాగర్ నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులు. ప్రతిపక్షాల కుక్కిడి పురాణాలు, చెప్పుడు మాటలు వినిపించుకోలేదు. ఎమ్మెల్యేగా భగత్‌ను గెలిపించాలని కోరా. ప్రజలు నా మాట నమ్మి అద్భుతమైన తీర్పును, ఫలితాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ తీసిపోని విధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ప్రజల దీవెన ఉన్నంత కాలం అదే పద్ధతిలో ముందుకుపోతాం. జానారెడ్డికి గుణపాఠం చెప్పారు రాష్ట్రం ఏర్పడిన మొదట్లో అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. రెండేళ్లలో 24 గంటల కరెంటు ఇస్తానంటే ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి ఎగతాళి చేశారు. రెండేళ్లు కాదు 20 ఏళ్లయినా చేయలేరన్నారు. రెండేళ్లలో చేస్తే తాను గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీచేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. హాలియా పట్టణం ఉండాల్సినంత గొప్పగా లేదు. రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై మంత్రి, కలెక్టర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయిస్తారు. నేను హైదరాబాద్‌లో సమీక్షిస్తా. అవసరమైతే మరోసారి సాగర్‌కు వస్తా..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ‘జిల్లాలో దాదాపు 15 ఎత్తిపోతల పథకాలను వచ్చే సంవత్సరంన్నర కాలంలో పూర్తి చేస్తా. నెల్లికల్లు లిఫ్ట్‌తో పాటు కుంకుడు చెట్టుతండా లిఫ్ట్ మంజూరు చేశాం. నెల్లికల్లు ద్వారా గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీరిస్తాం. అలాగే గుర్రంపోడు తండా లిఫ్ట్‌ను సర్వే చేసి మంజూరు చేస్తాం. జిల్లాలో ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు దేశంలోనే నంబర్ వన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు దామరచర్లలో రావడం జిల్లా ప్రజలకు గర్వకారణం. పోడు భూముల సమస్య పరిష్కారానికి సిద్ధం భగత్‌ను గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని మాట ఇచ్చా. అందులో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చా. ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చా. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 2005 కటాఫ్ మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. నందికొండలో ఎన్ఎస్పీ క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారికి, ఖాళీ స్థలాల్లో సొంతగా ఇళ్లు కట్టుకున్నవారికి రెగ్యులరైజేషన్ చేసి హక్కు పత్రాలు ఇస్తాం. నందికొండలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం. రెడ్డి కళ్యాణ మండపానికి భూమిని కేటాయిస్తాం. బంజారా భవనం నిర్మిస్తాం..’ అని సీఎం హామీ ఇచ్చారు. నల్లగొండలో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగానికి అడ్డుతగిలిన మహిళ తిరుమలగిరి (నాగార్జునసాగర్): సమావేశంలో సీఎం ప్రసంగిస్తుండగా సమ్మక్క సారక్కల వన దేవతల పూజారి నాగపురి లక్ష్మీ అడ్డుతగిలారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ క్రాస్‌రోడ్డు సమ్మక్క సారక్క దేవస్థానం వద్ద తాము గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నామని తెలిపారు. అయితే అటవీ అధికారులు తమ గుడిసెలను కూల్చివేసి, కరెంట్ సరఫరా రాకుండా అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రికి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను స్టేజీ మీదకు తీసుకురావాలని సీఎం ఆదేశించినా.. పోలీసులు ఆమెను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే.. కుంకుడుచెట్టు తండాకు చెందిన ఓ గిరిజన రైతు కుంకుడుచెట్టు తండా లిప్టును ప్రారంభించాలని కోరారు. నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేసీఆర్ చెప్పారు. ఒక్కసారి చెప్పానంటే 100% అమలు కేసీఆర్ ఒక్కసారి చెప్పారంటే వంద శాతం దానిని అమలు చేసి తీరుతారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పిన పనులన్నీ జరిగాయి. అవి ప్రజల ముందున్నాయి. దళిత బంధు పథకాన్ని కూడా ఆరునూరైనా అమలు చేస్తాం. వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధులు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు వచ్చేలా బడ్జెట్లో పెట్టిన రూ.1,000 కోట్లకు మరో రూ.200 కోట్లు కలిపి అమలు చేస్తాం. వచ్చే బడ్జెట్లో అధిక నిధులను కేటాయించి ప్రతి ఏటా దశల వారీగా అమలు చేస్తాం. సాగర్ అభివృద్ధికి రూ.150 కోట్లు నాగార్జునసాగర్, హాలియా అభివృద్ధికి ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున ఇస్తున్నాం. వాటికి అదనంగా రూ.120 కోట్లు ఇస్తాం. మొత్తంగా రూ.150 కోట్లతో సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. కేంద్రానిది వ్యతిరేక వైఖరి.. ఆంధ్రా దాదాగిరీ కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు. ఆంధ్రావాళ్లు చేస్తున్న దాదాగిరీ కావచ్చు. కృష్ణా నీళ్లపై వారు అక్రమ ప్రాజెక్టులు ఎలా కడుతున్నారో ప్రజలంతా చూస్తున్నారు. -
హామీల అమలుపైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పట్టణానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరనున్న ఆయన హెలికాప్టర్లో 10:40 గంటలకు హాలియా చేరుకుంటారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జరగనున్న సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పురోగతే ప్రధాన ఎజెండాగా ఈ సమీక్ష జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో భోజనానంతరం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి మొత్తం మీద మూడున్నర గంటల పాటు హాలియాలో గడపనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎత్తిపోతల పథకాలపై ప్రధాన చర్చ సాగర్ ఉప ఎన్నికల సమయంలో తాను ఇచ్చినnal హామీల అమలు, వాటి పురోగతితో పాటు ఇంకా ప్రారంభించాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణపై జిల్లా యంత్రాంగానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఇప్పటికే శంకుస్థాపన చేసిన నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలోని మరో 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను కూడా ఆయన సమీక్షించనున్నారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీటిని దిగువన ఉన్న త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే అంశంపైనా సీఎం సమీక్షిస్తారని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద మంజూరు చేసిన రూ.199 కోట్లతో చేపట్టాల్సిన పనుల గురించి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని జిల్లా అధికార వర్గాలు వెల్లడించాయి. -
సాగర్ ఫలితం: ప్చ్.. డిపాజిట్ దక్కలే!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం కమలనాథులకు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపినా డిపాజిట్ కూడా దక్కకపోవడం బీజేపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న తరుణంలో సాగర్ ఉప ఎన్నిక ఫలితం కమలనాథులకు మింగుడు పడటం లేదు. సాగర్ ఎన్నికలో గెలిచి గ్రామీణ తెలంగాణలోనూ పుంజుకుంటున్నామని చెప్పుకోవాలని భావించినా.. అలా జరగకపోవడంతో ఏం చేయాలో పాలుపోనిస్థితిలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి రవినాయక్‌కు 7,676 ఓట్లే రావడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పనిచేయని మంత్రం... బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డిని కాదని.. లంబాడా సామాజిక వర్గానికి చెందిన రవినాయక్‌ను బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా బరిలోకి దింపింది. అయితే, ఈ ఎన్నికలో గెలుస్తామని లేదా రెండో స్థానంలో నిలుస్తామనే ఆశలు బీజేపీ నాయకత్వంలో మొదటి నుంచీ కనిపించలేదు. కానీ, ఎస్టీ అభ్యర్థిని రంగంలోకి దింపిన నేపథ్యంలో పరువు నిలుపుకునే ఓట్లు వస్తాయని, కనీసం 20వేలకు పైగా సాధిస్తే తాము గెలిచినట్లేనని ఆ పార్టీ నేతలు భావించారు. అయితే బీజేపీ ప్రయోగించిన మంత్రం పనిచేయకపోవడంతో రవినాయక్ డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చింది. దుబ్బాక అసెంబ్లీ ఫలితం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న పార్టీకి ఈ ఫలితం షాక్ ఇచ్చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సాగర్ ఎన్నిక ఒక్కటే పార్టీ భవిష్యత్‌ను తేల్చదని పార్టీ నేతలు కొందరు పేర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలను బట్టి పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, ఆ ఫలితాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ అడ్రస్ గల్లంతు టీడీపీ తరపున పోటీ చేసిన మువ్వా అరుణ్ కుమార్ పరిస్థితి మరీ దారుణం. ఆయన కేవలం 1708 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. అరుణ్ కుమార్ కంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తలారి రాంబాబు(2970) ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. ‘నోటా’కు 498 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో జానారెడ్డి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 70,504 ఓట్లు దక్కాయి. 26 రౌండ్ల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో కేవలం రెండు రౌండ్లలో (10,14) మాత్రమే జానారెడ్డి ఆధిక్యత కనబరిచారు. విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 88,982 ఓట్లు వచ్చాయి. -
ఈ విజయం కేసీఆర్‌కు అంకితం: నోముల భగత్
నాగార్జునసాగర్: ఉప ఎన్నికలో తనను గెలిపించిన ఓటర్లకు, నాగార్జునసాగర్ ప్రజలకు విజేత నోముల భగత్ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు నా పాదాభివందనం అని తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని చెప్పారు. నాన్న ఆశయాలు నెరవేరుస్తానని, అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విజయం కేసీఆర్‌కు అంకితం అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని తెలిపారు. విజయంతో పొంగిపోవడం లేద: మంత్రి సాగర్ నియోజకవర్గంలో 19 వేలకు పైగా మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం సీఎం కేసీఆర్ పట్ల నమ్మకానికి, నాయకత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యానికి కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ నోటికి వచ్చినట్లు మాట్లాడాయని తెలిపారు. ఈ విజయంతో పొంగిపోవడం లేదు అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారని గుర్తుచేశారు. 60 ఏళ్లలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడ్డ నల్గొండ జిల్లా తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోనే అత్యధికంగా వరి దిగుబడి తెచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నాగార్జునసాగర్‌పై గెలుపుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ ఫలితాలను చూసైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మరు అని కొట్టిపడేశారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రం నుంచి రావాల్సిన వాటికోసం పోరాడండి అని సూచించారు. వాక్సిన్లు, రిమిడిసివర్ ఇంజక్షన్లు తేవడంలాంటివి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు, అబద్ధాలు చెప్పారు అని గుర్తు చేశారు. విషబీజాలు నాటితే ప్రజలు విశ్వసించరు అని పేర్కొన్నారు. ప్రతి మండలంలో టీఆర్ఎస్ఖే స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని చెప్పారు. చదవండి: బెంగాల్ తీర్పుతో బీజేపీ తెలుసుకోవాల్సింది -
నాగార్జున సాగర్ మళ్లీ టీఆర్ఎస్దే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తిరిగి నాగార్జునసాగర్ స్థానాన్ని సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ఆరా, ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. పోలైన ఓట్లు ఎవరికి ఎంత శాతం వస్తాయో ఓ అంచనా వేసి చెప్పాయి. ఆరా: టీఆర్ఎస్ - 50.48%, కాంగ్రెస్ - 39.93%, బీజేపీ 6.31% ఆత్మసాక్షి: టీఆర్ఎస్- 43.5%, కాంగ్రెస్ - 36.5%, బీజేపీ -14.6% టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సయ్య అకాల మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఏప్రిల్ 17వ తేదీన ఉప ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ రవి నాయక్ మధ్య ప్రధాన పోటీ నడిచింది. అయితే జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఓట్ల శాతం ఆధారంగా చెప్పవచ్చు. ఈ ఎన్నిక మాత్రం టీఆర్ఎస్కు, జానారెడ్డికి చాలా కీలకంగా మారనుంది. అయితే ఎవరు విజేత అనేది మాత్రం మే 2వ తేదీన తేలనుంది. చదవండి: తిరుపతిలో వైఎస్సార్ సీపీదే హవా చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
కామ్రేడ్... ‘కారెందుకెక్కారో’?
సాక్షి, హైదరాబాద్: పార్టీ సిద్ధాంతాలకి రాష్ట్ర కామ్రేడ్లు కొత్త భాష్యం చెబుతున్నారా? ప్రజల తరఫున అధికార పక్షంపై పోరాటమే కాదని, రాజకీయ అవసరాన్ని బట్టి అధికార పార్టీకి కూడా అండగా నిలవాలని భావిస్తున్నారా? నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటన వెనుక సీపీఎం వ్యూహం అదేనా? ఎన్నికలనే తాత్కాలిక ఎత్తుగడలు కూడా పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగపడాలని రాష్ట్రంలోని మార్క్సిస్టులు నిర్ణయిం చుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి సీపీఎం శ్రేణులు. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడం వెనుక వ్యూహం కూడా అదేనని, తెలంగాణలో బీజేపీని అడ్డుకోవాలంటే తమకు ఉన్న ఎంతో కొంత బలాన్ని టీఆర్ఎస్కు అందించడమే తక్షణ రాజకీయ కర్తవ్యమని సీపీఎం నేతలు నిర్ణయించు కున్నారని తెలుస్తోంది. అవసరమైతే 2023లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అవలంబించాలన్న అంచనాకు కూడా ఆ పార్టీ నేతలు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. శత్రువుకి శత్రువు... మిత్రుడే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరింత పుంజు కుంటుందనే అంచనాకు సీపీఎం రాష్ట్ర నాయకత్వం వచ్చింది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ప్రత్యామ్నాయ రాజ కీయ శక్తి రేసులో ఆ పార్టీని బీజేపీ వెనక్కు నెట్టి వేస్తుందని అభిప్రాయపడుతోంది. ఈ పరిస్థి తుల్లో తాము ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పక్షాన నిలబడి ఉపయోగం లేదని కామ్రేడ్లు ఓ అంచనాకు వచ్చారు. టీఆర్ఎస్ మద్దతుతో చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కించుకునే వ్యూహాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ‘రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఎన్నికల అంశాన్ని భిన్న కోణంలో ఆలోచించాల్సిందే. ఎన్నికలు జరిగే సమయంలో కేవలం పార్టీ సిద్ధాంతాలే కాదు.. అనేక అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ దశలో గుడ్డిగా వెళ్లడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికి నష్టపోయింది చాలు. ఇంకా మేం నష్టపోకుండా ఉండాలంటే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు’ అని సీపీఎం రాష్ట్ర నాయకుడొకరు వ్యాఖ్యానించడం ఆ పార్టీ మూడ్‌ను తేటతెల్లం చేస్తోంది. ప్రజల్లో చర్చ జరిగితే మంచిదే! కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయాలా... ఎవరికైనా మద్దతివ్వాలా అనే అంశంపై సీపీఎం పెద్ద కసరత్తే చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై పార్టీ జిల్లా కమిటీ నుంచి లెక్కలు తెప్పించుకున్న రాష్ట్ర నాయకత్వం తాము పోటీ చేయకపోవడమే మేలనే అంచనాకు వచ్చింది. ఇక, ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై పార్టీ రాష్ట్ర కమిటీలో పెద్ద చర్చే జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయమై జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నేతలు రెండుగా చీలిపోయినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రతిపాదనను కొందరు నేతలు వ్యతిరేకించారని తెలిసింది. కాంగ్రెస్‌కు మద్దతివ్వడమే రాజకీయంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వారు వెలిబుచ్చినట్టు వారు సమాచారం. కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ అభిప్రాయాలను అంగీకరించలేదు. ‘ఇప్పుడు టీఆర్ఎస్కు మద్దతిస్తే పార్టీ గురించి చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. అయినా సరే... అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయమున్నందున దీనిపై ప్రజల్లో చర్చ జరగాల్సిందే. బీజేపీ దూసుకొచ్చిన తర్వాత కూడా మనం శషభిషలకు పోతే నష్టపోతాం. దుబ్బాకలో కూడా తప్పుడు అంచనాతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించి టీఆర్ఎస్ ఓటమికి పరోక్షంగా దోహదపడ్డాం. అందుకే సాగర్‌లో టీఆర్ఎస్కు మద్దతివ్వడమే కరెక్ట్. ఈ ఎన్నికలే కాదు 2023 ఎన్నికలకు కూడా నిర్ణయం ఇదే విధంగా ఉండొచ్చు. పార్టీ శ్రేణులకు, అటు ప్రజలకు సర్దిచెప్పాల్సిందే’ అని రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మార్క్సిస్టు వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తోనే కలిసి వెళ్లాలనే మార్క్సిస్టు పార్టీ నేతల వ్యూహం చూస్తే ఎప్పటిలాగే 2023లో కూడా వామపక్షాల ఐక్యత ఎండమావేనని, సీపీఐ, సీపీఎంలు మళ్లీ పొత్తు పెట్టుకున్నా, టీఆర్ఎస్ మాటునే పెట్టుకోవాల్సి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
కరోనా కల్లోలం రేపిన ‘నాగార్జునసాగర్ సభ’
నల్లగొండ: ఉప ఎన్నిక సందర్భంగా నాగార్జునగర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభ కరోనా వైరస్ విజృంభణకు కేంద్రంగా నిలిచింది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ సాగర్ అభ్యర్థి నోముల భగత్‌తో పాటు అక్కడి కీలక టీఆర్ఎస్ నాయకులకు కరోనా సోకింది. దీంతో పాటు ఆ బహిరంగ సభకు హాజరైన వారిలో చాలామందికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఒక్కరోజే కేవలం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 160 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా ఈనెల 17వ తేదీన ఉప ఎన్నిక ఉండడంతో ఈసారి గెలుపు కోసం టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఈనెల 14వ తేదీన హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న వేళ అందరూ సభ వద్దన్నా కూడా నిర్వహించారు. ఆ సభ వలనే సీఎంతో పాటు ఆ పార్టీ అభ్యర్థికి ఇతర ముఖ్య నాయకులకు కరోనా సోకిందని నిఘా వర్గాలు గుర్తించాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్‌తో పాటు అతడి కుటుంబసభ్యులకు, టీఆర్ఎస్ సాగర్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకు కూడా పాజిటివ్ తేలింది. ఆ బహిరంగ సభకు కేసీఆర్‌తో పాటు వీరంతా హాజరైన వారే. సభకు వచ్చిన వారిలో కరోనా బాధితులు ఉండడంతోనే అందరికీ వ్యాపించిందని తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్, బీజేపీ నేతలకూ కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా కూడా కరోనా తీవ్రంగా విజృంభిస్తోందని తేలింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు గుమికూడడం, ప్రజలను కలవడం.. కరోనా నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాలతో సాగర్ నియోజకవర్గంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మాస్క్‌లు ధరించినా భౌతిక దూరం విస్మరించడం వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. శానిటైజర్ వినియోగం కూడా అంతంతమాత్రమేనని సమాచారం. చదవండి: కేసీఆర్‌కు కరోనా.. కేటీఆర్, కవిత భావోద్వేగం -
సాగర్ ఉప ఎన్నిక: పోలింగ్‌కు సర్వం సిద్ధం!
సాక్షి, నల్గొండ : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆరెస్, కాంగ్రెస్,బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాయి. ఇక ఇన్నాళ్లూ చేసిన ప్రచారానికి ఓటర్లు తమ మద్దతును, అభిప్రాయాలను ఓటు రూపంలో రేపు పోలింగ్‌లో ఇవ్వనున్నారు. అయితే పోలింగ్ సమయం ఎక్కువగా ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నమోదైన సుమారు 80 శాతంకి పైగా ఈసారి పోలింగ్ శాతం నమోదు చేపించేలా ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు మాస్క్ తప్పనిసరి నిబంధన చేశారు. కరోనా నేపథ్యంలో రేపు 17న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లకు సమయాన్ని కేటాయించారు. పోలింగ్‌కు సంబంధించి మొత్తం 5వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. సాగర్ నియోజకవర్గంలో 2లక్షల 20 వేల300 మంది ఓటర్లు ఉండగా లక్ష 9వేల 228 మంది పురుషులు, లక్షా11 వేల72 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి 8151మంది నమోదు చేసుకోగా 1153 మంది తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 108 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 15 మంది పోలీస్ సిబ్బందికి తగ్గకుండా బందోబస్తు నిర్వహించనున్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల వద్ద 4వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అందులో 1000 మంది సాయుధ దళాల పోలీసులున్నారు. 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో పోలింగ్ బూత్ లో 1000మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ ఏర్పాటు చేశారు. రాత్రి7గంటల వరకు ఓటు వేసేందుకు సమయం ఉండగా చివరి గంట కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కేటాయించారు. 7లోపు లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేంత వరకు అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇప్పటికే రూ. 90లక్షలకు పైగా డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నారు..పోలింగ్ అనంతరం నల్గొండ అర్జాలబావి స్ట్రాంగ్ రూంలో సామగ్రి భద్రపరచనున్నారు. సాగర్ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి హిల్ కాలనీలో, టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్ ఇబ్రహీంపేట, బీజేపీ అభ్యర్థి త్రిపురారం మండలంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
కేసీఆర్ @ సాగర్ ఫినిషింగ్ టచ్
-
కేసీఆర్ @ సాగర్ ఫినిషింగ్ టచ్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. 17వ తేదీన పోలింగ్ నేపథ్యంలో గురువారం సాయంత్రం ప్రచార పర్వం ముగియనుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ బుధవారం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత, ముఖ్య మంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. హాలియా పట్టణ శివారులోని పెద్దవూర మార్గంలో సాయంత్రం ఐదు గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ యంత్రాంగం భారీయెత్తున ఏర్పాట్లతో పాటు జన సమీకరణకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. కోవిడ్ నిబంధనలతో.. సుమారు లక్ష మంది హాజరవుతారనే అంచనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. సభకు తరలివచ్చే వారు మాస్కులు ధరించడంతో పాటు, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు సభ ఏర్పాట్లలో క్రియాశీలంగా పనిచేస్తున్న నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. 20 ఎకరాల స్థలంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 30 ఎకరాలను పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. విజయ దుందుభే లక్ష్యంగా.. కోవిడ్ పరిస్థితుల్లో సభ నిర్వహణపై చివరి నిమిషం వరకు సందిగ్ధత కొనసాగినప్పటికీ.. జన సమీకరణపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్ల రవీందర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితరాలను సమన్వయం చేస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఇన్‌చార్జీలుగా మున్సిపాలిటీలు, మండలాల్లో ప్రచార, సమన్వయ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్యేలకు జన సమీకరణ బాధ్యతలు అప్పగించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ శాసనసభ్యులు కూడా జన సమీకరణ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాలతో కంగుతిన్న టీఆర్ఎస్ గత నెలలో జరిగిన శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు స్థానాలను కైవసం చేసుకుంది. అదే ఊపులో సాగర్‌లో కూడా విజయదుందుభి మోగించాలనే పట్టుదలతో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 46.34 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్ ఈసారి 55 శాతానికి చేరువలో ఓట్లు సాధించే దిశగా లెక్కలు వేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజారిటీ సాధించడం, బీజేపీకి డిపాజిట్ దక్కకుండా చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలకు కళ్లెం వేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. రెండు నెలలుగా ముమ్మర ప్రచారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండుసార్లు పోటీ చేసిన టీఆర్ఎస్ ఒక్కసారి గెలిచింది. 2014 ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున పోటీ చేసిన నోముల నర్సింహయ్య ఓటమి పాలుకాగా, ఆ తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై విజయం సాధించారు. అయితే ఆయన హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ అధినాయకత్వం నోముల కుమారుడు భగత్‌ను బరిలోకి దించింది. నామినేషన్ల దాఖలు గడువుకు కేవలం రెండురోజుల ముందు మాత్రమే అభ్యర్థిని ప్రకటించినా.. అంతకు ముందు రెండు నెలల నుంచే టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేపట్టింది. నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన నేతలంతా పార్టీ ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. అభివృద్ధి మంత్రం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి లక్ష్యంగానే టీఆర్ఎస్ ఇన్ని రోజులపాటు ప్రచారం చేసింది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదంటూ .. ఏడున్నరేళ్లలో టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గానికి ఏమేం చేశామో వివరించింది. సాగునీటి రంగంతోపాటు.. మౌలిక వసతుల కల్పన, వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజలకు ఎలా అండగా నిలిచిందీ సీఎం సభ ద్వారా మరోమారు నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేయనున్నారని చెబుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు రైతులు కావడంతో.. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాల గురించి సీఎం విస్తృతంగా వివరించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. టీఆర్ఎస్పై, ముఖ్యమంత్రిపై చేసిన విమర్శలకు దీటైన కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది. వాస్తవానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే సీఎం కేసీఆర్ ఓ మారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు , ముఖ్యంగా సాగునీటి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. హాలియా మండల పరిధిలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి వరాలు ప్రకటించి వెళ్లారు. -
అంబేడ్కర్ ఆలోచనలే.. మోదీకి స్ఫూర్తి
దేశం కోసం అంబేడ్కర్ కన్న కలలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉందని, ఆయన సూచించిన దిశలో జాతి పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూని వాటి ఆచరణకు నడుం బిగించారు. స్వాతంత్య్రానంతరం 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించే సందర్భంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఉద్దేశించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. భారత్ ఒక దేశంగా మారిందని, ఒక పటిష్టమైన జాతిగా పునర్నిర్మాణం జరిగే అవకాశాన్ని పొందిందని, అందుకు కొన్ని లక్షణాలు కలిగివుండాలని.. అవి సమాజంలో నెలకొన్న కుల, మత, ప్రాంతీయ, భాషా అసమానతలను అధిగమించడమేనని పేర్కొన్నారు. స్వతంత్ర భారత మొదటి న్యాయ శాఖ మంత్రిగా, భారత రాజ్యాంగ ప్రధాన రూపకర్తగా భారతదేశ పురోగతికి వారు చూపిన మార్గం సదా అనుసరణీయం. ఆర్థికవేత్త, విద్యావేత్త, రాజ కీయవేత్త, సంఘసంస్కర్త అయిన బీఆర్ అంబేడ్కర్.. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో రాంజీ మాలోజీ సక్పాల్, భీమాబాయి సక్పాల్ దంపతులకు జన్మించారు. భారతీయ సమాజంలో కుల వివక్ష, బడుగు, బలహీన వర్గాలకు సౌకర్యాల లేమికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ తన జీవితమంతా పోరాడారు. ఆధునిక బౌద్ధ ఉద్యమాన్ని ప్రోత్సహించి.. దళి తులు, మహిళలు, శ్రామికుల సామాజిక వివక్షను రూపుమాపేందుకు అహర్నిశలు శ్రమించారు. ఏ సమసమాజ నిర్మాణం జరగాలని అంబేడ్కర్ ఆశిం చారో.. ఆ సమాజాన్ని నిర్మించే దిశగా, ఆయన సూచించిన దిశలో జాతి పునర్నిర్మాణానికి మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ మంత్రంతో అందరికీ అభివృద్ధి ఫలాలను అందించే లక్ష్యంతో.. ఎటువంటి వివక్షత లేకుండా పనిచేస్తున్నది. అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజం గురించి అంబేడ్కర్ కలలుగన్నారు. ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తి నుండే మొదలు కావాలన్న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ బోధించిన ‘అంత్యోదయ’ లక్ష్యం కూడా అంబేడ్కర్ కలగన్న సమసమాజ నిర్మాణానికి ఒక ప్రాతిపదికగా భావించవచ్చు. దేశం కోసం అంబేడ్కర్ కన్న కలలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉందని, వారు చూపిన ఆలోచనలు, ఆదర్శాలు కోట్లమందికి సరికొత్త శక్తిని ఇస్తూనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ’మహాపరినిర్వాన్ దివస్’ సందర్భంగా పునరుద్ఘాటించారు. ‘కొన్నిసార్లు, బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని దళితుల సమస్యలకే పరిమితం చేయడం ద్వారా, జాతి నిర్మాణానికి వారుచేసిన కృషిని తక్కువ చేసి చూపిస్తున్నారు. కానీ వారు అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ పరితపిం చారు. ప్రపంచం మార్టిన్ లూథర్ కింగ్‌ను చూసినట్లుగానే మేం అంబేడ్కర్‌ని చూస్తాం’ అని ప్రధాని నరేంద్రమోదీ.. రాజ్యాంగ నిర్మాతపై తమ ప్రభుత్వానికున్న గౌరవాన్ని స్పష్టంగా వెల్లడించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ రాజకీయ ఐక్యత కోసం పనిచేసినట్లుగానే.. అంబేడ్కర్ సామాజిక ఐక్యత, దేశ సమానత్వం కోసం పనిచేశారని ప్రధాని గుర్తు చేశారు. సమాజంలోని పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ తన జీవితాన్నంతా ధారపోశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చాలా పథకాలను ప్రతిపాదిం చింది. అధికారంలోకి వచ్చినప్పటినుంచే ఆయా వర్గాల సమగ్రాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నడుం బిగించారు. వచ్చే ఐదేళ్లలో 4 కోట్లకు పైగా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రాయోజిత ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్’ పథకంలో మార్పులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకుగానూ మొత్తం రూ. 59 వేల కోట్లను కేటాయించింది. ‘స్టాండప్ ఇండియా’ పథకంలో భాగంగా దేశంలో 2.5 లక్షల ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కూడా కేంద్రం వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉంది. ప్రధాని ఆలోచనల మేరకు స్టాండప్ ఇండియా పథకం ఎస్సీ, ఎస్టీలలో ప్రత్యేకించి మహిళా వ్యాపారులను, పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది. సమాజంలో అణచివేతకు గురైన పేద, దళిత వర్గాల ఆర్థిక సంక్షేమం కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం దళిత మూలధన నిధిని ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని సామాజిక వర్గాలలో ఉన్న పేద వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో పది శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. దళితులు, గిరిజనులు, ఓబీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ ప్రయోజనాలు ప్రభావితం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉన్నత వర్గాల్లోని పేద ప్రజలకు రిజర్వేషన్లు వర్తింపజేసింది. విద్య, ఉపాధిలో అందరికీ అవకాశాలను కల్పించే ఆశయంతో ఈడబ్ల్యూఎస్ కోటాను తీసుకొచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం.. అంబేడ్కర్ జీవనంతో సంబంధమున్న (జన్మిం చినప్పటి నుంచి నిర్యాణం వరకు) అన్ని ముఖ్యమైన ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ‘అంతేకాకుండా అంబేడ్కర్ గౌరవార్థం స్మారక చిహ్నాలను నిర్మించడానికి కృషి చేస్తోంది. నిరంతర ప్రయత్నాల తరువాత, బాబాసాహెబ్‌కు సంబంధించిన ముఖ్యమైన క్షేత్రాలను పంచతీర్థ్గా అభివృద్ధి చేయడాన్ని బీజేపీ గర్వంగా భావిస్తోందని, ఇది తమకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తామని ప్రధాని పలు సందర్భాల్లో వెల్లడించారు. అంబేడ్కర్ జన్మస్థలం సందర్శన అయినా, చైత్య భూమి (అంబేడ్కర్ అంత్యక్రియలు జరిగిన స్థలం) వద్ద ఒక స్మారక చిహ్నాన్ని అభివృద్ధి చేయడానికి, మహారాష్ట్రలోని ఇందూ మిల్లు భూమిని కొనడం, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నాగ్‌పూర్‌లోని దీక్షాస్థలిని అభివృద్ధి చేయడం, ఢిల్లీలోని 15 జనపథ్‌లో అంబేద్కర్ మహాపరినిర్వాన్ స్థల్ వద్ద ఒక స్మారకాన్ని నిర్మిస్తూ.. ఈ కేంద్రాలను పంచతీర్థ్గా అభివృద్ధి చేయడానికి మోదీ ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది. అంబేడ్కర్ విశిష్టతను ప్రస్తావిస్తూ, బాబాసాహెబ్ బోధనలు, వారి సందేశాలను అర్థం చేసుకోవటానికి భక్తి భావం ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ, సామాజిక ప్రయోజనాలతో పని చేయడం బాబాసాహెబ్ మాకు నేర్పించారని, వారు చూపిన మార్గం ఎప్పటికీ తమను సరైన దిశలోనే తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త హోంశాఖ సహాయ మంత్రి -
జానారెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత: నోముల భగత్‌కు నో ఎంట్రీ
నాగార్జున సాగర్: ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేసేందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేరుకునేసరికి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీఆర్ఎస్ నాయకులు రావొద్దంటూ కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. అనుముల గ్రామానికి టీఆర్ఎస్ ప్రచారానికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కారులో హాలియా వైపు వెళ్తుండగా జై తెలంగాణ అంటూ కారు వద్ద నినాదాలు చేశాడు. దీంతో ఇబ్బందికి గురిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వ్యక్తం చేసింది. తమ నాయకుణ్ణి ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ నాయకులు అనుముల గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తనయుడు జయవీర్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. జీపు టాప్‌పైకి ఎక్కి టీఆర్ఎస్, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాడు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరుపక్షాలకు సర్దిచెబుతున్నారు. అనుముల గ్రామం జానారెడ్డి సొంతగ్రామం కావడంతో టీఆర్ఎస్కు ప్రవేశం నిషేధించారు. కాగా టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా విస్తృత ప్రచారం చేస్తూ అనుముల గ్రామానికి వచ్చారు. -
సాగర్ ఉప ఎన్నిక: సీపీఐ (ఎం) సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయమై సీపీఐ (ఎం) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఒక పక్క ప్రభుత్వ విధానాలపై పోరాడుతూనే మరోపక్క టీఆర్ఎస్కు మద్దతు పలకడం విస్మయం కలిగిస్తోంది. నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ తీసుకోవాల్సి వచ్చిందని సీపీఎం(ఎం) వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. సీపీఐ (ఎం) కూడా మద్దతు ప్రకటించడంతో టీఆర్ఎస్ జోష్ మీద ప్రచారం చేయనుంది. దివంగత నోముల నర్సింహయ్య తనయుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఐ (ఎం) సోమవారం ప్రకటించింది. కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు, వామపక్ష అభిమానులు నోముల భగత్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని పై కమిటీలు సూచించాయి. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ నోముల భగత్‌ను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కున్ రెడ్డి నాగిరెడ్డి తెలిపారు. -
నోటిఫికేషన్ల కోసం యువత మరో ఉద్యమం చేపట్టాలి: భట్టి
నాగార్జునసాగార్: రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి మార్గాలు లేక ఆదాయంరాక తీవ్ర నిరుత్సాహంలో ఉందని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏడాదిగా ఉపాధి లేక నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉంటున్న రవి అనే ప్రయివేటు టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవి పార్థివ దేహానికి ఈ సందర్భంగా భట్టి విక్రమార్కమల్లు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్న సునీల్ నాయక్, నిన్న మహేందర్ యాదవ్.. నేడు రవి ఆత్మహత్యలు ముఖ్యమంత్రి పాపమేనని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొలువుల కోసమేనని.. ఆ కొలువులు రావని తెలిసి యువత ఆత్మహత్యకు పాల్పడుతోందని భట్టి ప్రశ్నించారు. ఆత్మహత్యలు దీనికి సమాధానం కాదని ఆయన యువతను ఉద్దేశించి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు కోసం యువత మరో ఉద్యమం మొదలు పెట్టాలని.. ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రజలను మాటలతో భ్రమలో ఉంచుతూ తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలను నీరు గార్చుతున్నారని భట్టి మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురౌవుతోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ దోపిడీని ఆపాలంటే యువత రోడ్డుమీదకు వచ్చి.. ఉద్యమానికి నడుం బిగించాలని సిఎల్పీ నేత పిలుపునిచ్చారు. ఎన్నికలను కుటిల ప్రయత్నాలతో గెలుస్తూ.. తాను చేసింది కరెక్ట్ అని ప్రజలు తీర్పు ఇస్తున్నారని చెబుతున్న కేసీఆర్ కు ఎన్నికల్లోనే ప్రజలు బుద్ది చెప్పాలని సూచించారు. -
డ్రక్స్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు మీవారే!
మల్కాజిగిరి: తెలంగాణలో బీసీ వ్యతిరేక పాలన సాగుతోందని బీజేపీ ఓబీసీ జాతీయ విభాగం అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి పద్మావతి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఓబీసీ విభాగం కార్యవర్గ భేటీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ, దశాబ్దాలపాటు పరిపాలించిన కాంగ్రెస్ కూడా బీసీలకు ద్రోహమే చేసిందని, మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాతనే బీసీలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. రాష్ట్రంలో పెత్తందార్ల, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే బీసీలు ఐక్యం కావాల్సిన అవసరముందన్నారు. గడీల రాజ్యాన్ని బద్దలుకొట్టాలి.. రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గడీల రాజ్యం నడుస్తున్నదని దానిని బద్దలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కర్ణాటక డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారని, కేసీఆర్ వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. వారిలో ఇద్దరు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారన్నారు. 50 శాతం పైగా బీసీ జనాభా ఉన్న రాష్ట్రంలో ఇద్దరే మంత్రులు ఉన్నారని ఆయన విమర్శించారు. కులవృత్తులకు ద్రోహం చేస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీయేనని, ఎక్కడ చూసినా వారే దుకాణాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యుడు ఆచార్య మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగితే వారి పక్షాన కమిషన్ నిలబడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి, సునీతాయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నోముల భగత్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తన పబ్లిసిటీని పెంచుకుంటారు. ఓ వైపు సంచలన సినిమాలను తీస్తూ, మరోవైపు పలు రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ ఆభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనకు ఓటు హక్కు ఉంటే సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఆభ్యర్థి నోముల భగత్‌కే ఓటు వేస్తానని ఆర్జీవీ అన్నారు. ఈ మేరకు చిరుతపులితో నోముల భగత్ కలిసి నడిచే వీడియోను వర్మ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అదే విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను సింహంతో పోల్చారు. చిరుతపులిని వాకింగ్‌కు తీసుకువెళుతున్న నోముల భగత్‌ను తాను ఇష్టపడుతున్నట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నోములు భగత్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. నోముల భగత్ తండ్రి నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే. ఇక రామ్ గోపాల్‌వర్మ నేతృత్వంలో తెరకెక్కుతున్న ‘డీ కంపెనీ’ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. The candidate @BagathNomula says “VOTE FOR US, that is ME and TRS —WE WILL ROAR in NAGARJUNA SAGAR byelection and no other party can DAM us” —and me saying Not in world history I saw a candidate campaigning with a chained CHEETAH 😘😍💐💃 Hats off to #KCR and @KTRTRS pic.twitter.com/d9Tpu8ebMa — Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021 VAAMMO we know #KCR and @KTRTRS are TIGER and LION but I love this candidate @BagathNomula who is taking a CHEETAH for a walk ..If I had a VOTE I will vote for this REAL HERO on 17th by-election of Nagarjuna Sagar pic.twitter.com/sYETa51Zq0 — Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021 -
సాగర్ ఉపఎన్నిక: ఇక దూకుడే..
హైదరాబాద్: చావోరేవో తేల్చుకోవాల్సిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు మంత్రం జపించనుంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి విజయం కోసం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలు శనివారం నుంచి దాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మిగిలిన నాయకులు శనివారం నుంచి నియోజకవర్గంలోనే మకాం వేయనున్నారని, పోలింగ్ ముగిసే వరకు ప్రచారంలో అధికార టీఆర్ఎస్కు తీసిపోకుండా ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 27న హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారంలో ఊపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార గడువు ముగిసేలోపు మరోమారు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తోంది. చివరి వారం రోజుల్లో నియోజకవర్గాన్ని చుట్టుముట్టి పోలింగ్‌కు ఉత్సాహంగా సిద్ధం కావాలని నేతలు భావిస్తున్నారు. మండలాలవారీగా ఇన్చార్జీలు ఇతర పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అంతకు రెండు నెలల ముందు నుంచే జానారెడ్డితోపాటు ఆయన తనయులు రఘువీర్, జైవీర్‌లు నియోజకవర్గంలో రెండు దఫాలుగా పర్యటించారు. స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించడం, వారిని ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు దూరమైన కొందరు నేతలను కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జానా అండ్ కో గత నెల 27న హాలియాలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభకు ఆశించిన మేర జనం హాజరు కావడం, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ సభకు రావడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జానా, ఆయన తనయులకు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా తోడు కానుంది. ఇప్పటికే టీపీసీసీ పక్షాన మండలాలవారీ ఇన్చార్జీలను నియమించిన ఉత్తమ్ శనివారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ప్రచారానికి హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆదివారం నుంచి ముఖ్యులంతా నియోజకవర్గంలోనే ఉండి టీఆర్ఎస్ను తలదన్నేలా ప్రచారం చేయాలని టీపీసీసీ నాయకత్వం నిర్ణయించింది. సాగర్ ఎన్నికల ప్రచారంపై టీపీసీసీ అ«ధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లి, మద్యం పారించి గ్రామాల్లో హల్చల్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ఎన్ని డబ్బులిచ్చినా, ఎంత మద్యం పోసినా జానారెడ్డి గెలుపు ఖాయం. కాంగ్రెస్ కేడర్ విజయంపట్ల పూర్తిస్థాయి విశ్వాసంతో ప్రచారంలో ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో జానా గెలుపే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులంతా ఐక్యంగా, ప్రణాళిక ప్రకారం ప్రచారంలో పాల్గొంటారు’అని వ్యాఖ్యానించారు. చివరి వారమే కీలకం ఎన్నికల ప్రచారంలో చివరి వారంరోజులు చాలా కీలకమని, ఆ సమయంలో విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మరోమారు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉండటం, ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో తాము ఎక్కడా తగ్గలేదనే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లేలా రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు. కోవిడ్‌తో ఇంటికే పరిమితమైన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఈ నెల 5 తర్వాత ప్రచారంలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. సీఎం బహిరంగసభ నిర్వహించే తేదీని బట్టి మరోమారు తాము కూడా బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌తోపాటు జానాతో సన్నిహిత సంబంధాలున్న జాతీయ నేతలను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నారు. చివరి వారంపాటు నియోజకవర్గంలోని గడప గడపనూ తొక్కి జానా గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించే వ్యూహంతో టీపీసీసీ సిద్ధమవుతోంది. -
సాగర్‌లో బీజేపీకీ షాక్..టీఆర్ఎస్లోకి బీజేపీ కీలక నేత!
గజ్వేల్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేడి ఊపందుకున్న వేళ మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నుంచి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ అసంతృప్త నేత కడారి అంజయ్య యాదవ్ వందలాది మంది అనుచరులతో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, బాబురావు నాయక్, బొల్లి రాంచంద్రం, లింగాల పెద్దన్న తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కడారి అంజయ్య విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం యాదవులను విస్మరించేలా కుట్రలు చేయడం తనకు నచ్చలేదన్నారు. టీఆర్ఎస్లో శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిగా నియమించడం, లింగయ్య యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమివ్వడం, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తర్వాత ఆయన కుమారుడు భగత్‌కు టికెట్ ఇవ్వడం యాదవులపట్ల టీఆర్ఎస్ చిత్తశుద్ధిని తెలియ జేస్తోందన్నారు. బీజేపీలో యాదవులను అణచివేసే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే సమస్యలను పరిష్కరించు కోగలుగుతామన్న నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. సాగర్‌లో నోముల భగత్ ఘన విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు, డిగ్రీ కళాశాల, రోడ్లు, మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు కడారి వివరిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రవీంద్రకుమార్ తదిరులు పాల్గొన్నారు. -
సాగర్ ఉప ఎన్నిక.. చివరి రోజు నామినేషన్లు వేసిందేవరంటే..
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 55 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నిడమనూరులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రోహిత్‌సింగ్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మొత్తంగా గడువు ముగిసే సమయానికి 78 మంది అభ్యర్థులు 128 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో నామినేషన్ వేయించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందే కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డి నామినేషన్ వేశారు. ఆయన వెంట స్థానిక నేతలు లింగారెడ్డి, కొండేటి మల్లయ్య ఉండగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు. చివర్లో బీజేపీ అభ్యర్థి పి.రవికుమార్ నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ కార్యక్రమానికి హాజరవగా నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఎస్.వెంకటేశ్వర్రావు నామినేషన్ వేయించారు. ‘టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది’ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని చూస్తున్న టీఆర్ఎస్ గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని జానారెడ్డి విమర్శించారు. నామినేషన్లు వేశాక ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా ప్రచారం చేయకుండా ఉండాలని టీఆర్ఎస్, బీజేపీలకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కొత్త సంప్రదాయానికి సాగర్ నుంచే శ్రీకారం చుట్టాలన్నారు. కాగా, నియోజకవర్గానికి ఏం చేస్తానో చెప్పుకోవడానికి ఏమీ లేకనే నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుందామని జానారెడ్డి కొత్త పాట ఎత్తుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మీ బిడ్డగా ఆశీర్వదించండి: నోముల భగత్ 2014 ఎన్నికల్లో తన తండ్రి నోముల నర్సింహయ్య ఓడిపోయినా.. నియోజకవర్గంలోనే, ప్రజల మధ్య లోనే ఉండి 2018 ఎన్నికల్లో విజయం సాధించారని, ఇప్పుడు ఆయన హఠాన్మరణంతో జరుగు తున్న ఈ ఎన్నికలో మీ బిడ్డగా ఆశీర్విందించాలని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని, టీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు. -
బంపర్ బొనాంజా.. సాగర్‌లో గెలిస్తే ఆ పదవి ఆయనకే!
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలవేళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితంవస్తే ఎన్నికల అనంతరం రాష్ట్ర పార్టీలో భారీ మార్పులుంటాయని, ఈ విషయమై పార్టీ అధిష్టానం వద్ద ఇటీవల కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి గెలిస్తే, ఆయన్నే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం లో ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న పార్టీ పెద్దలు.. ‘పెద్దాయన’అనే మంత్రంతో జానాను తెరపైకి తెచ్చి ఎలాంటి విభేదాలు, గొడవలు లేకుండా కార్యక్రమాన్ని ముగిస్తారని తెలుస్తోంది. అదే విధంగా 2023 ఎన్నికలను ఎదుర్కొనే బాధ్యతలను కూడా జానారెడ్డికి అప్పగించి, ప్రత్యామ్నాయ నేతగా ప్రతిపాదించి, ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళతారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనైతే అందరికీ ఓకే టీపీసీసీ అధ్యక్ష వ్యవహారాన్ని సాగర్ ఉప ఎన్నికల వరకు వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినా, ఇటీవల 10 జన్‌పథ్‌లో తెలంగాణ కాంగ్రెస్ గురించి కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన కీలక నేత ఒకరు ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా అధిష్టానంలోని ముఖ్య నాయకులతో ఇదే విషయమై చర్చించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించిన మరో పెద్దాయన సూచన మేరకు ఈ ప్రతిపాదన పార్టీ ముందుంచి అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించారనే గుసగుసలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. ‘రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష వ్యవహారం తలనొప్పిగా మారింది. ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు అసలే కనిపించడం లేదు. జానారెడ్డి అయితే పార్టీలో చాలా సీనియర్. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో సీఎల్పీ నేతగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎల్పీ నాయకుడిని చేయాలి. కానీ, ఆ పదవిలో దళిత నాయకుడు భట్టి విక్రమార్క ఉన్నారు. దళితుడిని ఆ పదవి నుంచి తొలగించి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. అలాగని ఎమ్మెల్యేగా జానారెడ్డి గెలిచిన తర్వాత కూడా ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా పీసీసీ హోదాలో మరో నేతను కూర్చోబెట్టడం ఆయన స్థాయికి తగింది కాదు. పార్టీలో ఏ స్థాయి నేతలనైనా సమన్వయం చేసుకునే సామర్థ్యం జానాకు ఉంది. పీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి, రేవంత్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని కాదనలేరు. వారికి ఇంకో రూపంలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చు. అప్పుడు అధిష్టానం పని కూడా సులువవుతుంది.’అని ఆయన రాహుల్ అండ్ టీమ్‌కు వివరించినట్టు చర్చ జరుగుతోంది. అంతా విన్న 10 జన్‌పథ్ ముఖ్య నేతలు ఈ విషయంలో స్పష్టత ఇవ్వనప్పటికీ, ముందు నాగార్జునసాగర్‌లో గెలిచి రావాలని చెప్పినట్టు సమాచారం. ముందస్తు వ్యూహంతోనే..! వాస్తవానికి, గత రెండేళ్లుగా టీపీసీసీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం అదుగో, ఇదుగో అంటూ నానుతూ వస్తోంది. ఈ పదవి కోసం పోటీ పడే నేతల జాబితా చాంతాడంత ఉండడం, షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఫలానా నాయకుడికి ఇవ్వాలని కొందరు, ఇవ్వొద్దని కొందరు, ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా తమకు ఓకేనని కొందరు, ఫలానా నేతకు పగ్గాలిస్తే పార్టీ వీడతామని మరికొందరు చెప్పడంతో అధిష్టానం కూడా వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, గత రెండు నెలల క్రితం టీపీసీసీ అధ్యక్ష వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని, ఆ పదవికి సీనియర్ కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిందనే లీకులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన జానా, మరికొందరు నేతలు అధిష్టానంతో సంప్రదింపులు జరిపి టీపీసీసీ అధ్యక్ష ప్రకటన నిలిపి వేయించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిని ప్రకటిస్తే తలనొప్పులు వస్తాయని, త్వరలోనే తాను పోటీ చేయబోయే సాగర్ ఉప ఎన్నిక వస్తున్నందున అప్పటివరకు ప్రకటించవద్దని నేరుగా అధిష్టానంతో మాట్లాడిన జానా.. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో అధికారిక ప్రకటన కూడా చేయించారు. సాగర్‌లో గెలిస్తే రాష్ట్ర పార్టీని హస్తగతం చేసుకోవాలనే వ్యూహంతోనే ఆయనతో పాటు ఆయనకు మద్దతిచ్చే కీలక నాయకులు ఈ వ్యూహాన్ని అమలు చేశారనే చర్చ ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి బీజేపీ నేత అంజయ్య
సాక్షి, హైదరాబాద్: సాగర్ ఉపఎన్నిక బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి నేత కడారి అంజయ్య ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి చేరారు. కాగా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఖరారు అంశంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించి, రవికుమార్(ఎస్టీ వర్గం)కు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, అంజయ్య మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను సంప్రదించి చర్చలు జరుపగా ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. అప్పుడు ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన నివేదితారెడ్డికి 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్ ఆశించిన అంజయ్య 27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సాగర్ ఉప ఎన్నిక: బీజేపీకి భారీ షాక్ హైదరాబాద్: రోడ్డు పైకి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! -
సాగర్ ఉప ఎన్నిక: బీజేపీకి భారీ షాక్
సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్ శాసన సభ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ నేత కడారి అంజయ్య అధికార టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాగా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఖరారు అంశంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించి, రవికుమార్(ఎస్టీ వర్గం)కు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, అంజయ్య మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను సంప్రదించి చర్చలు జరుపగా ‘కారు’ ఎక్కేందుకు సమ్మతించినట్లు సమాచారం. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. అప్పుడు ఆ పార్టీ తరఫున బరిలోకి దిగన నివేదితారెడ్డికి 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్ ఆశించిన అంజయ్య 27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. విజయం మాదే: మంత్రి ఎర్రబెల్లి మరోవైపు సిట్టింగ్స్థానంలో విజయంపై గులాబీ దళం ధీమాగా ఉంది. నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్‌కు టికెట్ కేటాయించిన అధికార పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ‘‘ సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్దే విజయం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బీజేపీ చతికిల పడింది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతోంది. టీఆర్ఎస్ వైపు బీజేపీ నేతలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. చదవండి: సాగర్ బీజేపీ అభ్యర్థిగా ‘పానుగోతు రవికుమార్’ -
సాగర్ బీజేపీ అభ్యర్థిగా ‘పానుగోతు రవికుమార్’
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సోమవారం రాత్రి అధికారిక ప్రకటన జారీ చేశారు. అంతకుముందు అభ్యర్థి ఖరారు ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. కె.నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డి టికెట్ ఆశించినప్పటికీ ఎక్కువమంది రాజకీయ, సామాజిక కోణాల ఆధారంగా ఎస్టీ వర్గానికి చెందిన రవి కుమార్ వైపే మొగ్గు చూపారు. ఆయనను పోటీలో నిలిపితే బీజేపీ ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకోవడానికి వీలవుతుందని భావించారు. మనం ఎస్టీ వర్గానికి కేటాయిస్తే ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు వీలవుతుందని, పైగా నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం కూడా రాష్ట్ర నేతల అభిప్రాయంతో ఏకీభవించి రవికుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది, అప్పుడు పోటీ చేసిన నివేదితారెడ్డికి 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్ ఆశించిన అంజయ్య యాదవ్ 27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. పూర్తి పేరు : పానుగోతు రవికుమార్ స్వగ్రామం: పలుగు తండా, త్రిపురారం మండలం, నల్లగొండ జిల్లా పుట్టిన తేదీ: 09–06–1985 భార్య: పానుగోతు సంతోషి తల్లిదండ్రులు: పానుగోతు హరి, పానుగోతు దస్సి పిల్లలు: మనస్విత్, వీనస్ విద్యార్హతలు: ఎంబీబీఎస్ ఉద్యోగం: పలు ప్రభుత్వ ఆస్పత్రులలో (ప్రస్తుతం రాజీనామా) సివిల్ సర్జన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నిర్మల ఫౌండేషన్ చైర్మన్‌గా ఉన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థిగా ‘నోముల భగత్’
హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌ను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. భగత్‌కు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సోమవారం బీ ఫామ్‌ను అందజేయడంతో పాటు ఎన్నికల ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు భగత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య కుమారుడైన భగత్‌ను పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. తెలంగాణ భవన్‌కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్న ముఖ్యమంత్రి.. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్‌కుమార్ రెడ్డి తదితరుల సమక్షంలో భగత్‌కు బీ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా భగత్ తల్లి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కేసీఆర్ సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ‘నోముల నర్సింహయ్యతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కుమారుడికి అవకాశం ఇస్తున్నాం. గతంలో మాదిరిగా కాకుండా పార్టీ నేతలందరూ కలసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలి. నేను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా’అని చెప్పారు. కోటిరెడ్డి, చిన్నపరెడ్డితో భేటీ సాగర్ టికెట్ ఆశించిన పార్టీ నేతలు ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. కోటిరెడ్డి, చిన్నపరెడ్డితో వేర్వేరుగా సమావేశమైన కేసీఆర్ వారిద్దరినీ బుజ్జగించినట్లు సమాచారం. ‘నాగార్జునసాగర్‌లో పార్టీ గెలిచేందుకు బాధ్యత తీసుకోండి. మీరు స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నా కొన్ని పరిస్థితుల్లో అవకాశం ఇవ్వలేక పోతున్నా. భవిష్యత్తులో రాజకీయంగా అనేక అవకాశాలు ఉంటాయి. ఈ ఏడాది మేలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో మీకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇస్తా..’అని కోటిరెడ్డికి సీఎం హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా కింద మరోసారి అవకాశం ఇస్తానని చిన్నప రెడ్డికి నచ్చజెప్పారు. వారితో కలసి భోజనం చేసిన అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్లారు. భగత్‌కు బీ ఫామ్ అందజేసిన తర్వాత పార్టీ నేతలందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. ‘టికెట్ ఆశించిన నేతలను కూడా కలుపుకొని పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లాలి. అలాగే ఈ టికెట్ ఆశించినవారు కూడా మనసులో ఇతర అభిప్రాయాలకు తావులేకుండా పనిచేయాలి..’ అని సూచించారు. బీజేపీకి అక్కడ సొంత బలం లేనందునే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన వచ్చేవరకు వేచి చూస్తోందన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పరంగా సర్వేలు చేయించామని, సాగర్‌లో మంచి మెజారిటీతో గెలుస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఈ సందర్భంగా నోముల నర్సింహయ్య భార్య లక్ష్మిని వారి కుటుంబ బాగోగులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సామాజికవర్గ సమీకరణాలతోనే భగత్‌కు సాగర్ నియోజకవర్గం పరిధిలో 2.17 లక్షల ఓటర్లు ఉండగా, వీరిలో 34 వేల మందికి పైగా బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2014, 2018 ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన నోముల నర్సింహయ్యకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. నర్సింహయ్య హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఆయన స్థానంలో దుబ్బాక తరహాలోనే ఆయన కుమారుడు భగత్‌కు అవకాశం ఇచ్చారు. నర్సింహయ్య పట్ల ఉన్న సానుభూతి కూడా కలసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసింది. ఓటర్ల సంఖ్యా పరంగా లంబాడాలు 38 వేలు, రెడ్డి 23 వేలు, మాదిగ 26 వేలు, ముదిరాజ్ 12 వేలకు పైగా ఉండటంతో పార్టీ ఇన్‌చార్జీలుగా అదే సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ మోహరించి ప్రచారం నిర్వహిస్తోంది. ఇక జోరుగా ప్రచారం ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుండగా వచ్చే పక్షం రోజులు ప్రచారాన్ని హోరెత్తించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. గత నెల 10న హాలియాలో జరిగిన సభలో పాల్గొన్న కేసీఆర్.. ఈసారి త్రిపురారం లేదా నాగార్జునసాగర్ మున్సిపాలిటీలో నిర్వహించే బహిరంగ సభకు హజరవుతారని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రోడ్ షోల్లో పాల్గొంటారని సమాచారం. వీరిద్దరి ప్రచార సభలు, రోడ్ షోల షెడ్యూలు ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, జాజుల సురేందర్ (తిరుమలగిరి మండలం), కోరుకంటి చందర్ (హాలియా), బాల్క సుమన్ (పెద్దవూర), కంచర్ల భూపాల్‌రెడ్డి (గుర్రంపోడ్), నల్లమోతు భాస్కర్‌రావు (నిడమనూరు), భానోత్ శంకర్ నాయక్ (త్రిపురారం) కోనేరు కోణప్ప (అనుముల), జీవన్‌రెడ్డి (మాడ్గుపల్లి) ఇన్‌చార్జీలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా (కరీంనగర్) చైర్మన్ జీవీ రామకృష్ణారావు ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. నాన్న ఆశయాలు నెరవేరుస్తా: భగత్ ‘నాన్న నోముల నర్సింహయ్య 2014లో టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆయనకు సముచిత స్థానం కల్పించారు. కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే నర్సింహయ్యను గెలిపించాయి. ఆయన వారసుడిగా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తా..’అని భగత్ అన్నారు. బీ ఫామ్ అందుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్ల లోపే మా నాన్నను కోల్పోయి ఉప ఎన్నిక రావడం దురదృష్టకరం. అయితే నా మీద నమ్మకముంచి టికెట్ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా’ అని భగత్ అన్నారు. నర్సింహయ్య వారసుడిగా ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. పేరు : నోముల భగత్ తండ్రి : దివంగత నోముల నర్సింహయ్య తల్లి : నోముల లక్ష్మి ప్రస్తుత నివాసం: హాలియా పుట్టిన తేదీ: 10–10–1984 భార్య : నోముల భవానీ పిల్లలు: రానాజయ్, రేయాశ్రీ విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ, ఎల్ఎల్ఎం చేసిన ఉద్యోగాలు: సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్‌లో జూనియర్ ఇంజనీర్, (2010–2012), విస్టా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ప్రస్తుతం : హైకోర్టు న్యాయవాది, నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ చైర్మన్ -
సాగర్ ఉప ఎన్నిక.. నామినేషన్లు వేసేది వీరే!
హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు గాను మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారమే తుది గడువు కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కె. జానారెడ్డి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ నాయక్ నామినేషన్లు వేస్తారని ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి. జానా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరుకానున్నారు. భగత్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావులతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నామినేషన్ దాఖలు చేశాక భగత్ మాడ్గుపల్లి మండలం అభంగాపురంనుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కె. జానారెడ్డి ఇక బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నట్టు సమాచారం. మనసు మార్చుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ఉప ఎన్నికలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని సమాచారం. ఫీల్డ్ అసిస్టెంట్ల బృందంతో టీఆర్ఎస్ పెద్దలు చర్చలు జరిపారని, వారిని మళ్లీ విధుల్లో నియమించుకునే హామీ ఇవ్వడంతో వారు మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి డాక్టర్ పానుగోతు రవికుమార్ నాయక్ ఇప్పటివరకు సాగర్‌లో చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులు కలిపి 23 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో భారీ ర్యాలీలు, అట్టహాసాలకు తావు లేకుండా సాదాసీదాగానే నామినేషన్ల కార్యక్రమాన్ని ముగించేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
సాగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!
-
సాగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!
-
సాగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!
సాక్షి, నల్గొండ: నాగర్జున సాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కాసేపట్లో భగత్‌కు సీఎం కేసీఆర్ బీ-ఫామ్ అందజేయనున్నారు. రేపు ఉదయం భగత్ తన నామినేషన్ వేయనున్నారు. కాగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. ఇక బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. కాగా ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(టీఆర్ఎస్) ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. చదవండి: ఇలాంటి సవాల్ చేసిన చరిత్ర దేశంలో నా ఒక్కడిదే -
మీ మద్దతు మాకివ్వండి: ఉత్తమ్
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో మద్దతివ్వాలంటూ వామపక్షాలను కాంగ్రెస్ కోరింది. తమ పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి గెలుపునకు సహకరించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సీపీఐ, సీపీఎంలకు లేఖలు రాశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి, అప్రజాస్వామ్య పాలన, బీజేపీ మత రాజకీయాలను ఓడించేందుకు తెలంగాణలోని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు తమతో కలసి రావాలని ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులను కోరారు. తమ అభ్యర్థి జానారెడ్డి.. సమితి అధ్యక్షుడిగా, 7 సార్లు ఎమ్మెల్యేగా, 17 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా, 5 సంవత్సరాలు సీఎల్పీ నేతగా పనిచేశారని, ప్రజాజీవితంలో గౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఆయన గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు అవుతుందని, ఈ నేపథ్యంలో తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పార్టీల నేతలకు లేఖలు రాయడంతో పాటు ఆ పార్టీ నేతలతో ఫోన్లో కూడా మాట్లాడారని, తమ పార్టీల్లో చర్చించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని కామ్రేడ్లు చెప్పారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ విషయమై ఒకట్రెండు రోజుల్లో ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
‘సాగర్’.. సస్పెన్స్: పోటీదారులెవరో..?
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 30తో ముగియనున్న సం గతి తెలిసిందే. నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఉన్న ఓట్లను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయడంపై టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. బీసీ సామాజికవర్గానికే టికెట్ ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, నియోజక వర్గంలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న యాదవ సామాజికవర్గానికే టికెట్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా, బీజేపీ తమ అభ్యర్థిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యం లోనే చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించాలనే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో నోముల భగత్ తదితరులు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌తో పాటు అదే సామాజికవర్గానికి చెందిన రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, దూది మెట్ల బాలరాజు యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు టికెట్ రేసులో ఉండటంతో, ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు చేజారకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుం టోంది. అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతల అభిప్రాయాలను కేసీఆర్ ఇప్పటికే సేకరించారు. నోముల భగత్‌కు మినహా ఎవరికి టికెట్ దక్కినా అది అనూహ్యమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముమ్మరంగా ప్రచారం గత ఏడాది డిసెంబర్ నుంచే స్థానికంగా పార్టీ యం త్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై దృష్టి సారించిన టీఆర్ఎస్, ప్రస్తుతం అభ్యర్థిని ప్రకటించకుండానే పూర్తి స్థాయిలో ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహి స్తోంది. గత నెల 10న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు హాలియాలో బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా కేసీఆర్ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. ప్రైవేటు సంస్థల సర్వేతో పాటు వివిధ వర్గాల నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా ఆ పార్టీ ఎప్పటికప్పుడు తన ఎన్నికల ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు సుమారు మూడు నెలలుగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధినేతకు వివరించడంతో పాటు, పార్టీ వ్యూహాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. 15 రోజులుగా ఎమ్మెల్యేల మకాం ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే క్షేత్ర స్థాయిలో ప్రచారం కోసం ఇన్చార్జిలుగా నియమితులైన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పదిహేను రోజులుగా సాగర్ నియోజకవర్గంలో తమకు బాధ్యతలు అప్పగించిన చోట ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, కోణప్ప, కోరుకంటి చందర్, భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జీవీ రామకృష్ణారావు తమ నియోజకవర్గాలకు చెందిన నేతలు, క్రియాశీల కార్యకర్తలతో బృందాలుగా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సైతం వీరు దూరంగా ఉండటం గమనార్హం. సామాజికవర్గాల వారీగా సమావేశాలు 2.17 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధానంగా యాదవ, లంబాడీ, రెడ్డి, మాదిగ, మాల, ముస్లిం, ముదిరాజ్, గౌడ, రజక, మున్నూరుకాపు సామాజికవర్గాలకు చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్చార్జిలు సామాజికవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అభ్యర్థి ఎవరనే అంశంతో సంబంధం లేకుండా టీఆర్ఎస్కు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. -
‘అతి’ విశ్వాసమే.. ముంచిందా?
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది. రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థుల ఓటమికి కారణాలను బీజేపీ విశ్లేషించుకుంటోంది. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో వచ్చిన ఊపును (సాను కూల వాతావరణాన్ని) చేజేతులా జారవిడుచుకు న్నామన్న అభిప్రాయం ఈ సమీక్షల్లో వ్యక్తమ వుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిన స్థానంలోనూ ఎందుకు ఓడిపోయామని పార్టీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎలాగూ గెలుస్తామన్న అతివిశ్వాసమే తమను దెబ్బకొట్టిందని, అదే టీఆర్ఎస్ విజయానికి కారణమైందన్న విశ్లేషణలు పార్టీ వర్గాల్లో జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇంకొంచెం కష్టపడితే సిట్టింగ్ దక్కేది హైదరాబాద్ స్థానంలో తాము ఇంకొంచెం కష్ట పడితే బయటపడేవారమనే అభిప్రాయం పార్టీలో పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ప్రచారంలోనూ టీఆర్ఎస్ చేసే విమర్శలను తిప్పికొట్టడం పైనే ప్రధానంగా దృష్టి సారించిన పార్టీ నేతలు... కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలను, గెలిపిస్తే తామేం చేస్తామన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చర్చ బహిరంగం గానే జరుగుతోంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై దృష్టి సారించినంతగా, హైదరాబాద్ ఓటర్లపై దృష్టి పెట్టలేదని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను సమన్వయం చేసుకుని వారి సేవలను వినియోగిం చుకునే విషయంలో కొంత వెనుకబడ్డామన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇక నల్లగొండ– ఖమ్మం–వరంగల్ నియోజకవర్గంలోనూ క్షేత్ర స్థాయికి వెళ్లడంలో వెనుకబడటం వల్లే నాలుగో స్థానానికి పడిపోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంకొంచెం కష్టపడితే తమకు సిట్టింగ్ స్థానం దక్కేదన్న భావన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి, తమకు మధ్య తొలి ప్రాధాన్యత ఓట్లలో 8 శాతమే తేడా ఉండటాన్ని ఉదహరిస్తున్నారు. ఈ స్వల్ప వ్యత్యాసాన్ని భర్తీ చేసే విధంగా క్షేత్రస్థాయి కేడర్‌ను కదిలించడంలో పార్టీ నాయకత్వం విఫలమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈ స్థానంలోని వేయి బూత్‌లలో ఒక్కో బూత్ నుంచి అదనంగా 10 చొప్పున ఓట్లను పొందేందుకు ఇంకొంచెం కష్టపడితే గెలుపు దక్కేదని విశ్లేషణలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించినా ప్రయోజనం చేకూరలేదని, వారు నిరంతరం ఓటర్లతో టచ్‌లో ఉండటంలో విఫలమయ్యారని అభిప్రాయపడుతున్నారు. క్రమశిక్షణగల పార్టీగా పేరున్న బీజేపీలో ఇన్చార్జుల స్థాయిలో విఫలమైతే భవిష్యత్తులో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పునాదే లేకుండా పోతుందనే ఆందోళన బీజేపీ కీలకనేతల భేటీలో వ్యక్తమైనట్లు సమా చారం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. -
నేటినుంచి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ
-
‘సాగర్’ అభ్యర్థిగా మళ్లీ యాదవులకే చాన్స్!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందని భావించినా.. నేటికీ స్పష్టత రావట్లేదు. ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా 3 నెలలుగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్లో అభ్యర్థి ఎంపిక కసరత్తు ఇంకా కొనసాగుతోంది. తాజాగా కొత్తపేర్లు తెరపైకి వచ్చాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబీకులకే టికెట్ ఇస్తారని, ఆయన కుమారుడు భగత్‌కు పోటీచేసే అవకాశం ఉందని మొదట్లో ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, స్థానిక నేత కోటిరెడ్డి పేర్లు సైతం పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది. ఈ ముగ్గురి అభ్యర్థిత్వానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పార్టీ నేతల నుంచి కేసీఆర్ సేకరించి వివిధ కోణాల్లో విశ్లేషించినట్లు సమాచారం. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎదురయ్యే పోటీ, రెండు జాతీయ పార్టీల నుంచి పోటీ చేసే అవకాశమున్న ఆశావహులు, వారి బలాబలాలు... తదితర అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్న కేసీఆర్ అభ్యర్థి ఖరారు విషయంలో మాత్రం ఆచితూచి అడుగువేస్తున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ప్రచార ఇన్‌చార్జీలుగా ఎమ్మెల్యేలు ఓ వైపు దీటైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోవైపు క్షేత్రస్థాయి ప్రచారంలో పార్టీ వెనుకబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదివరకే మండలాల వారీగా పార్టీ ఇన్చార్జిలను నియమించి కార్యకర్తలతో టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహించింది. గత నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ నియోజకవర్గం పరిధిలోని హాలియా బహిరంగ సభలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు మూడు నెలలుగా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ పరిస్థితితో పాటు, కాంగ్రెస్, బీజేపీ కదలికలపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తున్నారు. నేడో రేపో ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో తాజాగా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఓ మున్సిపల్ మేయర్‌కు క్షేత్రస్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ వారిని ఇన్చార్జీలను నియమించారు. ఇన్‌చార్జీలుగా నియమితులైన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, కోరుకంటి చందర్, శంకర్ నాయక్, కోనేరు కోనప్ప, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు తదితరులు ఇప్పటికే నియోజకవర్గానికి చేరుకుని తమకు కేటాయించిన మండలాలు, మున్సిపాలిటీల్లో పార్టీ క్రియాశీల నేతలు, సర్పంచ్‌లు, ఇతర నేతలతో సమావేశమవుతున్నారు. ఎన్నికలు ముగిసేవరకు సాగర్ నియోజకవర్గంలోనే ఉండాలని ఇన్చార్జీలను కేసీఆర్ ఆదేశించారు. కాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది. యాదవులకే చాన్స్! నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నా అభ్యర్థి ఎంపికలో వివిధ సామాజికవర్గాలకు చెందిన ఓటర్ల గణాంకాలు కీలకంగా మారాయి. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దివంగత ఎమ్మెల్యే నోముల కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఆయన కుమారుడు నోముల భగత్‌కు వేరే అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే యాదవ సామాజికవర్గానికి చెందిన ఇతరులకు టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం యాదవ సామాజికవర్గానికి చెందిన స్థానికులు మన్నె రంజిత్ యాదవ్, పెద్దబోయిన శ్రీనివాస్, కట్టెబోయిన గురువయ్య యాదవ్‌తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు ఈ ముగ్గురు నేతల పూర్వపరాలను తెలుసుకున్నారు. నోముల నర్సింహయ్య మరణం తర్వాత నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణుల సమన్వయ బాధ్యతలు చూస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయం అభ్యర్థి ఎంపికలో కీలకమని పార్టీ నేతలు చెబుతున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో వలసల దడ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలవేళ బీజేపీ విసిరిన వలసల అస్త్రం కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శ్రీశైలంతోపాటు మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోపే కాషాయ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఒకరిద్దరు నాయకులు, ఇద్దరు పార్టీ అనుబంధ సంఘాల నేతలు వలసబాట పట్టనున్నట్టు సమాచారం. సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీ విసిరిన వలసల అస్త్రం కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. శ్రీశైలంతోపాటు మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక లోపే కాషాయ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఒకరిద్దరు నాయకులు, ఇద్దరు పార్టీ అనుబంధ సంఘాల నేతలు వలసబాట పట్టనున్నట్టు సమాచారం. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బీజేపీ నేతలు కాంగ్రెస్ అసంతృప్తులపై వల విసురుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన కూన శ్రీశైలం గౌడ్‌కు నిరాశ ఎదురుకావడంతోనే ఆయన పార్టీ మారినట్టు చర్చ జరుగుతోంది. గతంలోనూ బీజేపీలో చేరే జాబితాలో కూన పేరు వినిపించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉత్తరాది రాష్ట్రాల ఓటర్ల ప్రభావం ఉండడం కూడా బీజేపీలో చేరికకు కారణమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇంకా ఎవరెవరంటే.. బీజేపీలో చేరనున్న నాయకుల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్ పేరు వినిపిస్తోంది. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థి సోయం బాపూరావు ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందారు. అయితే, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని, రాథోడ్‌కు ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే టికెట్‌పై హామీ ఇవ్వడంతో ఆయన కూడా త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌రావుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో భేటీ అయ్యారనే వార్తలు కూడా గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈమెతోపాటు మరో అనుబంధ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న యువనాయకుడిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు డీకే.అరుణ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిల పేర్లు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నా వారు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుండటం గమనార్హం. టికెట్ టికెట్... కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకునే క్రమంలో పార్టీ టికెట్ ఇస్తామనే హామీలు కమలనాథుల నుంచి వస్తున్నాయని, అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా వారు బీజేపీలోకి వెళుతున్నారని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు మూడు అసెంబ్లీ టికెట్లు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీ టికెట్లపై బీజేపీ నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభించిందని, కూన శ్రీశైలం గౌడ్‌కు కూడా కుత్బుల్లాపూర్ టికెట్ హామీ ఇవ్వడంతోనే ఆయన బీజేపీలో చేరారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. నియోజకవర్గ స్థాయి నాయకులతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన క్షేత్రస్థాయి నేతలకు కూడా బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు క్షేత్రస్థాయి నేతలతో మంతనాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి వలసలపర్వం ఏయే మలుపులు తిరుగుతుందో... పార్టీలో ఉండేదెవరో, మిగిలేదెవరో అనే అంశం గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
సాగర్ ఉప ఎన్నిక: జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో ఇది కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ తరఫున బరిలో నిలబడి విజయం సాధించారు. అయితే ఆయన అకాల మరణంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ జానా రెడ్డిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ ఆయన తనయుడు రఘువీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని.. టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. (చదవండి: ‘సాగర్’లో పోటీకి.. నన్నెవరూ అడగలేదు) ఈ నేపథ్యంలో నేడు జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉప ఎన్నిక బరిలో తోటి అనుచరులంతా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీలో ఉంచుందాం అంటే తననే నిలబెడతామన్నారు. అలా కాదని.. తన అనుచరులు వేరే ఎవరైనా పోటీలో ఉంటాము అంటే వారికే తన మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని జానా రెడ్డి ప్రకటించారు. -
మూడుముక్కలాట.. విజయం ఎవరిదో
సాక్షి, హైదరాబాద్ : ఒకవైపు వరుస ఎదురుదెబ్బలు తగిలిన అధికార టీఆర్ఎస్. పైగా వారికది సిట్టింగ్ స్థానం. మరోవైపు కాంగ్రెస్ అత్యంత సీనియర్ నేతకు రాజకీయంగా జీవన్మరణ సమస్య. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలు గాలివాటం కాదని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీది. ఇలా అందరికీ ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు ‘పరీక్ష’గా నిలిచి... రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. సాగర్ ఫలితంతో రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండనుందనే విషయంలో ఒక స్పష్టత రానుంది. కాబట్టి సాగర్‌లో విజయం మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు అనివార్యమయిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్తో పాటు మంచి ఊపు మీదున్న బీజేపీకి, ఈ ఎన్నికపై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వచ్చే ఫలితం అత్యంత కీలకం కానుంది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి రాజకీయ భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నిక నిర్దేశించనుంది. సానుకూల ఫలితం వస్తే జానా గ్రాఫ్ రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిపోతుందని, అనూహ్య ఫలితం వస్తే మాత్రం ఆయన దాదాపు రాజకీయాల నుంచి తప్పుకుంటారనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రాభవానికి పరీక్ష నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభం అయింది. అభ్యర్థి ఎంపికపై కసరత్తు, పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల మధ్య సమన్వయం, నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించి అధికార టీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందంజలో ఉంది. నోముల సంతాప సభ పేరిట ఇప్పటికే రెండు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న కోణంలో సర్వేలు కూడా పూర్తి చేసింది. మొత్తం మీద నర్సింహయ్య కుమారుడు భగత్, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ. కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే సాగర్ ఉపఎన్నిక ఫలితం రాష్ట్రంలో టీఆర్ఎస్ చరిష్మాకు పరీక్షగా మారుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే సిట్టింగ్ సీటు దుబ్బాకను కోల్పోయి, జీహెచ్ఎంసీలో ఆశించిన ఫలితం రాని పరిస్థితుల్లో... మరో సిట్టింగ్ స్థానంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్కు అత్యంత అవసరం. పార్టీ ప్రాభవం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అనివార్యత. ఒకవేళ కారు అంచనా ఈ ఎన్నికల్లో తప్పితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాగర్‌ను మళ్లీ దక్కించుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డనుంది. పెద్దాయనకు ‘ఇమేజ్’కలిసొస్తుందా! గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఎక్కువగా అక్కడే గడుపుతున్నారు. వారానికి కనీసం రెండు రోజులు సాగర్‌లోనే ఆయన మకాం వేస్తున్నారు. ఇక, నోముల మరణం తర్వాత జానా మరింత చురుకుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పార్టీ బూత్ కమిటీల సమావేశాలు ఓ దఫా పూర్తి చేసిన జానా రెండో దశలో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని, దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకున్న విస్తృత పరిచయాలను ఉపయోగించుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. రెండో విడతలో ఆయనకు కుమారుడు రఘువీర్ కూడా తోడయ్యారు. తండ్రీ కొడుకులిద్దరూ నియోజకవర్గంలోని చెరో మండలంలో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత చరిష్మా కలిగిన నాయకుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందిన జానాకు ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీ నుంచి వెళ్లిపోవడం ప్రతికూలంగా కనిపిస్తోంది. అయితే, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ బలంగానే ఉందని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ కోణంలోనే నియోజకవర్గంలోని యువతను ఆకట్టుకుని వారిని నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆయన ప్రధాన నాయకుడు కావడం, టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉండడం, తాజాగా ఆయన విజ్ఞప్తి మేరకు టీపీసీసీ అధ్యక్ష ఎన్నికను పార్టీ అధిష్టానం వాయిదా వేయడం లాంటి అంశాలు... ఆయనకు సానుకూలంగా మారుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి ఎవరో? ఇక, బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గతంలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోవడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని రాజకీయ వర్గాలంటున్నాయి. సంస్థాగత నిర్మాణం కూడా బీజేపీ అంతగా లేకపోవడంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితకు పోలైన ఓట్లలో కేవలం 1.48 శాతం (2.675) ఓట్లే వచ్చాయి. తాజా రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన పోటీదారుల్లో ఒకరుగా నిలువడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇప్పుడు అక్కడ బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి, గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితతో పాటు కొంతకాలం క్రితం పార్టీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇద్దరూ పోటీపోటీగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, అంజయ్య నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకపోవడం ఆయన అభ్యర్థిత్వానికి ఆటంకం అవుతుందని భావించినా.... సాగర్‌లో ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడం కలిసిరానుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ లాగే సాగర్‌లోనూ కమలనాథులు దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం సమీపించే కొద్దీ వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని, గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెట్టి ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటి తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలన్నది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుందని, మార్చిలో సాగర్ ఉపఎన్నిక జరుగుతందనే అంచనాతో అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతుండటం గమనార్హం. -
సాగర్ ఉప ఎన్నిక వరకు వాయిదానే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి అభిప్రాయాన్ని గౌరవించి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగేంత వరకు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక విషయంలో జానారెడ్డికి చిన్న ఇబ్బంది కలిగినా అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని, ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారాన్ని తేల్చకపోవడమే మంచిదని వారు స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌తో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఈ భేటీ రేవంత్ మినహా మిగిలిన నలుగురు హాజరై తమ అభిప్రాయాలను చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తామని, అయితే సాగర్ ఉప ఎన్నిక కూడా రెండు నెలల్లోపు ముగిసే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధ్యక్షుడు ఎవరన్న దానిపై అధికారిక ప్రకటన చేయకపోవడమే మేలని దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో మాణిక్కంకు వారు చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశానికి ముందే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవాలని సీఎల్పీ నేత భట్టికి హైకమాండ్ నుంచి ఆదేశాలొచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన భట్టి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను రాష్ట్ర ఇన్చార్జికి చెప్పినట్టు సమాచారం. పార్టీలోని ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సాగర్ ఉప ఎన్నిక వరకు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని ఆయన వెల్లడించారు. అలాగే ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చలు జరిపారు. ప్రకటనలో ఆలస్యం వద్దని.. వెంటనే వెల్లడిస్తే బాగుంటుందని సంపత్ అభిప్రాయపడగా, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, వంశీలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని చెప్పారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఇన్చార్జీ.. ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని నేతలకు చెప్పి సమావేశాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో సోనియా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, ఇతర కమిటీల నియామక ప్రక్రియలు వాయిదా పడటం లాంఛనమే. -
‘సాగర్’లో పోటీకి.. నన్నెవరూ అడగలేదు
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీకి సంబంధించి టీఆర్ఎస్ నుంచి ఎవరూ సంప్రదించలేదని, ప్రస్తుత పదవితో సంతృప్తిగా ఉన్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది జూన్‌లో శాసనమండలి సభ్యుడిగా తన పదవీకాలం ముగుస్తుందన్నారు. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును పార్టీ అధినేత నిర్ణయిస్తారన్నారు. మండలిలోని తన కార్యాలయంలో శనివారం గుత్తా మీడియాతో మాట్లాడారు. సాగర్‌లో స్థానికులు, స్థానికేతరులు అనే నినాదం అర్ధరహితమని, నాయకులందరూ హైదరాబాద్‌లో మకాం వేసి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. సీఎంగా కేటీఆర్‌కు అన్ని అర్హతలు ‘ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మంత్రి కేటీ రామారావుకు అన్ని అర్హతలు ఉన్నాయి. పాలనా సామర్ద్యం ఉంది’అని గుత్తా పేర్కొన్నారు. ‘ఇటీవలి కాలంలో కొందరు ఎంపీలు వాడుతున్న పదజాలం ఘోరంగా ఉంటోంది. తాత్కాలికంగా నాలుగు ఓట్లు వస్తాయేమో కానీ భవిష్యత్తు తరాలకు ఇది తప్పుడు సంకేతాలను ఇస్తుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరహాలో సాగర్ ఫలితం ఉండదు. నల్గొండ జిల్లా రాజకీయ పరిస్థితులు వేరు. రాజకీయాల్లో ఎవరికీ ఎవరూ పోటీ కాదు’ అని గుత్తా వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసమే ప్రమోషన్లు, పీఆర్సీ: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ అంశాలను ముందుకు తెచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. విద్యా వ్యవస్థ, ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని ధ్వజమెత్తారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ఒక్క పోస్టయినా భర్తీ చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4 వేల ప్రధానోపాధ్యాయుల పోస్టులు, 92 శాతం ఎంఈవోలు, సగం డీఈవో పోస్టులతో పాటు వెయ్యికి పైగా ఉర్దూ మీడియం పోస్టుల ఖాళీలతో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిందని విచారం వ్యక్తంచేశారు. తక్షణమే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే పీఆర్సీని వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి తాబేదారులై అడుక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ముందు పార్టీకి రాజీనామా చెయ్: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వేరే పార్టీ లో చేరాలనుకుంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని జీవన్‌రెడ్డి అన్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, కొందరు నేతలు వ్యక్తిగత స్వార్థంతోనే పార్టీలు మారుతున్నారన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొద్దంటూ రాజగోపాల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అభ్యర్థి ఎంపికే... అసలు సవాల్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ శాస నసభ నియోజకవర్గం ఉపఎన్నిక ఫిబ్రవ రి లేదా మార్చిలో జరుగుతుందనే అంచనాతో పార్టీ అభ్యర్థి ఎంపిక, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం మధ్య సమన్వయం తదితర అంశాలపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. అన్నికోణాల్లోనూ లెక్కలు కడుతూ కసరత్తును ముమ్మరం చేసింది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకుని పొరపాట్లకు తావులేకుండా సాగర్ ఉపఎన్నికకు సన్నద్ధం కా వాలని భావిస్తోంది. ఎన్నికల షెడ్యూలు వెలువడే లోగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల అమలును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని... బలమైన అభ్యర్థి ఎంపికకు ప్రాధాన్యమిస్తోంది. పార్టీ టికెట్ కోసం స్థానికంగా పోటీ పడుతున్న నేతలు, కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీ చేసే అవకాశమున్న అభ్యర్థులు, వారి బలాబలాలు, నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యా బలం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని అభ్యరి్థని ఎంపిక చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం నివేదికలు, అంతర్గత సర్వేలతో పాటు పార్టీ ఇన్చార్జీలు, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల నివేదికల ఆధారంగా సాగర్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి, టికెట్ ఆశిస్తున్న నేతల బలాబలాలపై లోతుగా మదింపు జరుగుతోంది. సామాజిక వర్గాల లెక్కలు.. పార్టీ బలం పార్టీ సంస్థాగత బలం, సామాజిక వర్గాల ఓట్ల సంఖ్య తదితరాల ఆధారంగా అభ్య రి్థని ఎంపిక చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మరో వైపు అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇటీవల నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతల అభిప్రాయాలను కూడా ప్రభుత్వ మాజీ విప్, పార్టీ ఇన్చార్జి నేతృత్వంలోని బృందాలు వేర్వేరుగా సేకరించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో 2.16 లక్షల ఓట్లకుగాను బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా యాదవులు పెద్ద సంఖ్యలో ఉండగా, రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గాల ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలు (మాడ్గులపల్లి మండలం పాక్షికం), రెండు మున్సిపాలిటీల్లో (హాలియా, సాగర్) టీఆర్ఎస్ సంస్థాగతంగా బలంగా కనిపిస్తోంది. 179 గ్రామ పంచాయతీల్లో 153 మంది సర్పంచ్‌లు, ఐదుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు, ఎనిమిదింటిలో ఏడుగురు సహకార సంఘాల చైర్మన్లు టీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో పారీ్టలో అంతర్గత సమన్వయం సాధించి నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తేవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అభ్యర్థి ఎవరైనా కేడర్ మద్దతు అతనికి పూర్తిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఒకటి రెండు రోజుల్లో పార్టీ ఇన్చార్జీలను నియమించే అవకాశం ఉంది. దుబ్బాక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొనాలని అంతర్గత నివేదికల్లో పార్టీ నేతలు పేర్కొన్నట్లు సమాచారం. నలుగురిలో ఎవరికో చాన్స్! స్థానికులకే టికెట్, సానుభూతి వంటి నినాదాల నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఔత్సాహికుల వడపోతను టీఆర్ఎస్ పూర్తి చేసింది. ప్రధానంగా నలుగురి పేర్లు పరిశీలనలో ఉండటంతో క్షేత్రస్థాయిలో వారికి ఉండే బలాబలాలపైనా వివిధ కోణాల్లో కసరత్తు జరుగుతోంది. శా సనమండలి సభ్యులు తేరా చిన్నపరెడ్డి, న్యాయవా ది కోటిరెడ్డి, దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, మాజీ శాసనసభ్యులు రామ్మూర్తి యాదవ్ మనుమడు మన్నెం రంజిత్ యాదవ్ పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నాయి. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం తో తమకు అవకాశం వస్తుందని కోటిరెడ్డి, రంజిత్ యాదవ్ భావిస్తున్నారు. ఓవైపు సొంత పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్న టీఆర్ఎస్ విపక్ష పార్టీ ల వ్యూహంపైనా ఓ కన్నేసింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి, బీజేపీ నుంచి నివేదితరెడ్డి లేదా కడా రి అంజయ్య యాదవ్ పోటీలో ఉంటే ఎదురయ్యే పరిస్థితులను కూడా టీఆర్ఎస్ బేరీజు వేస్తోంది. -
జానాకి పోటీ.. రంగంలోకి యువనేత
సాక్షి, నల్గొండ : ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మరోవైపు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపినా టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ బలమైన స్థానిక నేతను అన్వేషించే పని పడినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. కానీ, దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్.. సిట్టింగులు ఉన్న చోట ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీఆర్ఎస్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే.. ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ జోరందుకుంది. జానా రెడ్డికి గట్టి పోటీ! ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్ఎస్ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌కు ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రముఖంగా వినబడుతోంది. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్‌కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యువ నేత నియోజకవర్గ స్థాయిలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మద్దతును కూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా సీనియర్ నేతైన జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు రంజిత్ యాదవ్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే స్థానికంగా బలమైన యాదవ సామాజిక వర్గంనికి చెందిన నేత కావడంతో.. సీనియర్లు సైతం ఆయనవైపే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజవర్గంలో రెడ్డి ఓట్లతో పాటు పెద్ద ఎత్తున యాదవ్ సామాజిక ఓటర్లు కూడా ఉన్నారు. ఇది రంజిత్ యాదవ్‌కు కలిసొచ్చే పరిణామం. మరోవైపు మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి టిక్కెట్ దక్కే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
సాగర్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ 6 నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి సాగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. చదవండి: జమిలి ఎన్నికలకు సిద్ధం కండి.. ఈ ఎన్నికలో గెలిచి మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తాను నిలుపుకోవాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తక్షణ చర్యలు ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందే రైతులందరి ఖాతాల్లో ఈ ఏడాది రెండో విడత రైతుబంధు డబ్బులను జమ చేసేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి యాసంగి సాగు కోసం రైతు బంధు పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి: ఢిల్లీతో ఢీకి టీఆర్ఎస్ రెడీ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు సాగర్ నియోజకవర్గంలో చేపట్టదలిచిన నాలుగు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో పాటు మరో పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కోసం.. మొత్తంగా దాదాపు రూ.600 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశారు. బోతలపాలెం–వడపల్లి ఎత్తిపోతల పథకాన్ని దామరచెర్ల మండలం వడపల్లి వద్ద నిర్మించేందుకు రూ.229.25 కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా, సాగర్ కాల్వలపై దున్నపోతులగండి– బాల్నేపల్లి–చంపాల తండా ఎత్తిపోతల పథకాన్ని అడవిదేవునిపల్లి మండల పరిధిలోని చిట్యాల గ్రామం వద్ద నిర్మించేలా రూ.219.90 కోట్లతో అనుమతులు ఇచ్చారు. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా అప్రోచ్ చానల్, ఫోర్‌బే, పంప్‌హౌస్, ప్రెషర్‌మెయిన్, డెలివరీ సిస్టమ్, గ్రావిటీ కెనాల్ల నిర్మాణ పనులు చేయనున్నారు. ఇక రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మూసీ నదిపై కేశవాపురం–కొండ్రపోల్ ఎత్తిపోతల పథకాన్ని దామరచర్ల మండల పరిధిలోని కేశవాపురం గ్రామం వద్ద నిర్మించేలా రూ.75.93 కోట్లతో అనుమతులు ఇచ్చారు. ఈ ఎత్తిపోతల ద్వారా 5,875 ఎకరాలు సాగులోకి తేనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక టీఎస్ఐడీసీ కిందే నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఫోర్ షోర్లో నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు అనుమతులిచ్చారు. రూ.72.16 కోట్లతో దీనికి అనుమతులు ఇవ్వగా, 4,175 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందివ్వాలని నిర్ణయించారు. వీటితో పాటే ఏఎంఆర్పీ హైలెవల్ కెనాల్ పరిధిలోని డి్రస్టిబ్యూటరీ 8, 9లకు లో లెవల్ కెనాల్ పంప్‌హౌస్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాతో పాటు, ఈ డి్రస్టిబ్యూటరీల పరిధిలోని పొదలు, పూడిక తీసివేత కోసం 2.76 కోట్లతో అనుమతులు ఇచ్చారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ ఎత్తిపోతల పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వగా, ప్రస్తుతం ఏ సమయమైనా ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ముందే వీటికి అనుమతులిచ్చారు. -
కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాగావేయాలని పావులు కదుపుతున్న బీజేపీ.. కాంగ్రెస్ సీనియర్ నేతలపై గాలంవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు రఘువీర్‌రెడ్డితో బీజేపీ రాష్ట్ర నేతలు సైతం ఇదివరకే సంప్రదింపులు జరిపారని, టికెట్ ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కమలం ఆఫర్‌తో ఆలోచనలోపడ్డ రఘువీర్.. తన తండ్రితో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. (కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు) మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచిపట్టున్న జానారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తమకూ లాభిస్తుందని కాషాయదళం లెక్కలువేస్తోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న జానారెడ్డి.. కుమారుడి భవిష్యత్ కోసం బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని జానారెడ్డి కోరగా.. ఆయన అభ్యర్థనను కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. దీంతో అయిష్టంగానే బరిలో నిలిచి.. ఊహించని విధంగా ఓటమి చెందారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్ ఫలితంతో జోరుమీదున్న కాషాయదళం.. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్లు, అసంతృప్తులను ఆకర్షిస్తోంది. బీజేపీ గూటికి మాజీ మంత్రి... గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ ఎదురైంది. ఆ పార్టీ మాజీమంత్రి, వికారాబాద్‌కు చెందిన సీనియర్ నేత చంద్రశేఖర్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఆహ్వానం అందినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో భేటీ నిర్వహించనున్నారు. వారి అభిప్రాయం తీసుకున్న అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. -
జంతు సంరక్షణకు చర్యలేవీ..?
నాగార్జునసాగర్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ఫారెస్ట్‌లో భాగమైన నాగార్జునసాగర్ రిజర్వ్‌ఫారెస్ట్ కోర్ ఏరియాలో జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అనివార్యంగా మారింది. గతంలో పోలిస్తే జంతువుల సంఖ్య పెరిగినట్లుగా అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఫిబ్రవరి మాసంలోనే ఎండలు మండిపోతుండడంతో తాగునీటికి మూగజీవాలు ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే తగు చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు. కానరాని పులుల జాడ పలురకాల జంతువులు అటవీ ప్రాంతంలో తిరుగాడుతున్నప్పటికీ పులుల జాడ మాత్రం కనిపించడం లేదు. గతంలో ఇక్కడ పులులు తిరగడంతో టైగర్‌వ్యాలి అనే పేరున్న లోయ కూడా ఉంది. నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్లో దేవరకొండ, నాగార్జునసాగర్ కంబాలపల్లి రేంజ్‌లలో కలిపి 41వేలహెక్టార్లలో అటవీప్రాంతం ఉంది. అభయారణ్యమంతా సాగర్ జలాశయంతీరం వెంట ఉంది. దేవరకొండ రేంజ్లో 26,785హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 30కెమెరాల ద్వారా 20కి పైగా చిరుతలు ఉన్నట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పెరిగిన జంతువుల సంఖ్య అడవిలో మనుబోతులు, దుప్పులు, కణితులు, ఎలుగుబంట్లు చౌసింగ, సింకార, రేస్‌కుక్కలు, హైనాలు, మూసిక జింకలు, నెమల్లు తదితర జంతువుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగినట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా.. గతంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే సంబంధిత అధికారులు ముందస్తుగానే మేల్కొ ని వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. గతంలో అటవీ ప్రాంతంలోకి జీవాలు రాకుండా కందకాలు తవ్వడంతో పాటు పలు చోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా ఆ కందకాల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. అటవిని ఆనుకుని ఉన్న తండాల ప్రజలు ఎవరైన సిగరెట్, బీడీ పీకలు పడేసిన అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముందుగా అధికారులు సమీప తండాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నీటి వసతికి చర్యలు చేపడుతున్నాం అటవీ ప్రాంతంలోని జంతువుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గతంలో అడవిలో శాసర్‌పీట్స్‌ను నిర్మించాం. వాటిలో నీటిని నింపేందుకు సిబ్బందిని ఆదేశించాం. అదే విధంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా సమీప తండాల్లో దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.– డీఎఫ్ఓ గోపి రవి -
గుండెబోయిన రాంమూర్తి యాదవ్ కన్నుమూత
సాక్షి, నల్గొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమ్మూర్తి యాదవ్ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1947 ఆక్టోబర్ 26 న గుండెబోయిన మట్టయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. మొదటిసారిగా 1981 లో పెద్ద దేవులపల్లి గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994 నుంచి 1999 వరకు అప్పటి చలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారు. ఈ ఎన్నికల్లో అప్పటి వరకు ఓటమి ఎరుగని మాజీ మంత్రి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తిగా రాంమ్మూర్తికి మంచి పేరు ఉంది. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన రాంమూర్తి యాదవ్ పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం తాపత్రయ పడ్డారు. -
మైమరిపించేలా.. మహాస్తూపం
సాక్షి, హైదరాబాద్: ఆ ప్రాంతానికి వెళ్తే బుద్ధుడి జీవితచక్రం కళ్లముందు కదలాడుతుంది.. ఆ మహనీయుని బోధనలు అడుగడుగునా ప్రేరణ కల్పించేలా వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ప్రధాన బౌద్ధ స్థూపాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు ఆ ప్రాంతం దేశంలోనే ప్రధాన బౌద్ధపర్యాటక ప్రాంతంగా మారబోతోంది. అంతర్జాతీయ పర్యాటకులనూ ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంటోంది. అదే నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం. 249 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణాల పరంపరలో కీలకమైన మహాస్తూపం ప్రత్యేక తరహాలో సిద్ధమవుతోంది. నంద్యాలలో చెక్కిన శిల్పాలు ఇటీవలే బుద్ధవనం చేరుకున్నాయి. వాటిని ప్రతిష్టించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాశ గుమ్మటం... ఆకర్షణీయం.. మహాస్తూపాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 70 అడుగుల ఎత్తు, 140 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. పైన గుమ్మటం తరహాలో నిర్మాణం ఉంటుంది. అదే ప్రధాన మందిరం. లోపలి వైపు నిలబడి పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది. పైకప్పునకు ఆకాశం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాని చుట్టూ 16 వరసల్లో గులాబీ పూరేకుల తరహాలో తీర్చిదిద్దా రు. ఈ ఏర్పాటు సిమెంటుతో కాకుండా అల్యూమినియం ఫ్యాబ్రికేషన్‌తో ఏర్పాటు చేయటం విశేషం. అందులోనే నాలుగు దిక్కులా ఒక్కోటి 9 అడుగుల ఎత్తులో ఉండే నాలుగు బుద్ధుడి భారీ రాతి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ధర్మచక్ర ప్రవర్ధన ముద్రలో ఇవి ఉంటాయి. వీటి మధ్య ఒక్కోటి మూడు అడుగుల ఎత్తుతో మరో 4 విగ్రహాలుం టాయి. అవి ధ్యాన ముద్ర, భూస్పర్శ ముద్ర, అభయముద్ర, వర్ణముద్రల్లో ఉంటాయి. వీటి ప్రతిష్ట పూర్తయితే ప్రధాన నిర్మాణం పూర్తయినట్టే. ప్రధాన ద్వారం వద్ద అష్టమంగళ చిహ్నాలు, బుద్ధుడి జాతకచిహ్నాలను రాతితో చేయించిన 104 ప్యానెల్స్‌పై చెక్కించి ఏర్పాటు చేయించారు. మధ్య 17 అడుగులతో ధర్మచక్ర స్తంభం ఠీవిగా నిలబడి ఆకట్టుకుంటోంది. ఇక బుద్ధచరిత్ర వనంలో బుద్ధుడి జీవితగాథలోని ప్రధానఘట్టాలు ప్రతి బింబించేలా 10 కాంస్యవిగ్రహాలు ఏర్పాటు చేయించారు. బుద్ధుడి జాతక కథలను తెలిపే 40 రాతి ఫలకాలను ఏర్పాటు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేకంగా 27 అడుగుల ఎత్తుతో ఔకాన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. మన దేశంలోని ప్రధాన 5 బౌద్ధ స్తూపాలు, వివిధ దేశాల్లోని ప్రధాన 8 స్తూపాల సూక్ష్మ నమూనాలతో మినియేచర్ పార్కును ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భక్తులతోపాటు సాధారణ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ బుద్ధవనాన్ని సిద్ధం చేస్తున్నామని ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. -
‘నందికొండ’కు క్వార్టర్లే అండ..!
నాగార్జునసాగర్ : అరవైఏళ్లుగా స్థానిక పాలనను నోచుకోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలనీలు నందికొండ మున్సిపాలిటీ పేరుతో స్వయం పాలనలోకి వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాట ప్రకారం సాగర్ కాలనీలన్నింటినీ కలిసి నందికొండ పేరుతో మున్సిపాలిటీగా చేస్తూ ప్రకటించారు. అయితే ఇన్నాళ్లూ కేవలం ప్రాజెక్టు మెయింటెనెన్స్ నిధులతోనే ఎన్నెస్పీ అధికారులు కాలనీల ప్రజల అవసరాలు తీరుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నందికొండ మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో అన్ని కాలనీల్లోని ప్రజలకు సకల సౌకర్యాలు సమకూర్చాలన్నా.. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నా రూ.లక్షలాది కోట్ల నిధులు అవసరం. ఇందుకు ఇక్కడ నున్న ప్రభుత్వ క్వార్టర్లను విక్రయించాల్సిందేనని..అప్పుడే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని స్థానికుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే డిమాండ్‌ను సైతం ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. క్వార్టర్లను విక్రయించి వచ్చిన నిధులతో తమ మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని కోరుతున్నారు. ఇదే నినాదాంతో గత అసెంబ్లీభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన నోముల నర్సింహయ్య.. క్వార్టర్లలో నివాసముంటున్న వారికే వాటిని విక్రయింపజేసే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించిన సమయంలో కూడా సాగర్‌లోని క్వార్టర్లు విక్రయించే విషయాన్ని సీఎంకు విన్నవించి చర్చించారు. దీంతో ముఖ్యమంత్రి గతంలో నామినల్ రేటుకే పేదలకు విక్రయించిన క్వార్టర్ల వివరాలు, విక్రయించాల్సిన క్వార్టర్ల వివరాల నివేదికను పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో సోమవారం హైదరాబాద్‌లోని సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ క్యాంపు కార్యాలయానికి ఎన్ఎస్పీ ఇంజనీర్లు వివరాలతో కూడిన పైల్‌ను పంపారు. సాగర్ కాలనీల్లోని క్వార్టర్లు 2,861.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీరుల, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కూలీలు నివాసముండేందుకుగాను తాత్కాలికంగా హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ, రైట్‌బ్యాంకు కాలనీలను ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన సమయంలో రైట్‌బ్యాంక్ కాలనీ ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లింది. రెండు కాలనీలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2,861 క్వార్టర్లు ఉన్నాయి. గతంలో నందమూరితారక రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో సీ–230, డి–113, ఈ–748, ఎండీ–180, బి2–100 మొత్తం సుమారుగా 1,510క్వార్టర్లను విక్రయించారు. ఇక మిగిలినవి ఈఈ–33, ఏఈ–93, ఏ–278, బి–872 క్వార్టర్లు ఉన్నాయి. అంటే మొత్తం 1,351క్వార్టర్లు మిగిలాయి. వీటిని కూడా ప్రభుత్వం మెయింటనెన్స్ బాధ్యతులు చూడకుండా ఏనాడో వదిలేసింది. ఇందులో కొన్ని క్వార్టర్లు కూలిపోగా మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు నివాసముంటున్న క్వార్టర్లను వారే మరమమ్మతులు చేసుకుని ఉంటున్నారు. ఆ క్వార్టర్లు మాత్రమే ప్రస్తుతం పటిష్టంగా ఉన్నాయి. మిగతావన్నీ అవసాన దశకు చేరాయి. -
ఓటర్ల లెక్క తేలింది..!
సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన హాలియా మున్సిపాలిటీలో ఎన్నికలకు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధమయ్యింది. ఇప్పటికే మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఒక్కో సెట్ జాబితాను అందించారు. ఈనెల 12వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి, 13న క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించనున్నారు. ఈనెల 14న తుది జాబితాను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కుదించిన షెడ్యూల్‌తో మరో నాలుగు రోజుల ముందే ఓటర్ల జాబితాను ప్రదర్శనకు పెట్టారు. ఈనెలలోనే ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు పోలింగ్ పర్యవేక్షణకు అధికారుల నియామకం కూడా చేపట్టారు. హాలియా మున్సిపాలిటీల్లో బీసీ ఓటర్లు అధికం.. హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12 వార్డుల్లో సిబ్బంది ఓటర్ల గణనను పూర్తి చేసి జాబితాను సిద్ధం చేశారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,388 మంది కాగా స్త్రీలు 6,382 మంది ఉన్నారు. దీనిలో బీసీ ఓటర్లు మొత్తం 8,242 మంది ఉండగా పురుషులు 4,118 మంది, స్త్రీలు 4,124 మంది ఉన్నారు. అదే విధంగా ఎస్సీ ఓటర్లు మొత్తం 1,703 మంది ఉండగా వీరిలో పురుషులు 850 మంది కాగా స్త్రీలు 853 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు మొత్తం 479 మంది కాగా వీరిలో పురుషులు 220 మంది, స్త్రీలు 259 మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు 2,346 మంది ఉండగా పురుషులు 1,200 మంది, స్త్రీలు 1,146 మంది ఉన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. మున్సిపాలిటీ పరి«ధిలోని ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను త్వరలో స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. మున్సిపాలిటీలో విలీనమైన కాలనీలు.. హాలియా మున్సిపాలిటీల్లో విలీనమైన కాలనీలు ఇలా ఉన్నాయి. అనుముల, అనుములవారిగూడెం, ఈశ్వర్‌నగర్, సాయిప్రతాప్‌నగర్, గంగారెడ్డినగర్, వీబీనగర్, గణేష్‌నగర్, ఎస్సీ కాలనీ, సాయినగర్ కాలనీ, శాంతినగర్, వీరయ్యనగర్, అంగడి బజార్, రెడ్డికాలనీ, బీసీకాలనీ, హనుమాన్‌నగర్, కేవీ కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఇబ్రహీంపేట, అలీనగర్ కాలనీలను కలుపుతూ 12 వార్డులుగా విభజించారు. నందికొండ మున్సిపాలిటీలో తేలిన లెక్క నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలో గల హిల్‌కాలనీ, పైలాన్ కాలనీల్లోని 12వార్డుల్లో సామాజిక వర్గాల వారిగా గల ఓటర్ల లెక్కను తేల్చారు. ఓటర్ల సంఖ్య 12,800మంది ఉండగా బీసీ ఓటర్లు 6,839మంది ఉన్నారు. పురుష ఓటర్లు 6,204మంది ఉండగా మహిళా ఓటర్లు 6,596 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 2,941 మంది ఉండగా ఎస్టీ ఓటర్లు 716 మంది ఉన్నారు. ఓసీ ఓటర్ల సంఖ్య 2,304 మంది ఉన్నారు. -
‘డిగ్రీ కళాశాల’ కల నెరవేరేనా..?
సాక్షి, త్రిపురారం : మారుతున్న సమాజంలో ఉన్నత చదువులు ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిందే. నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటర్ పూర్తి చేసి బయటకు వచ్చే విద్యార్థుల చదువులు ప్రస్తుతం ప్రశ్నార్థంకంగా మారాయి. నియోజకవర్గ కేంద్ర బిందువైన హాలియా పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. నియోజకవర్గంలోని హాలియా పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రతి ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇవ్వడం ఆ తరువాత మరిచిపోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సమీపంలో హాలియా పట్టణం ఉండగా, ఈ పట్టణం వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ విద్యా రంగంలో మాత్రం వెనకబడిపోయింది. గతంలో సాగర్ నియోజకవర్గం నుంచి కుందూరు జానారెడ్డి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచారు. అనేక మంత్రుత్వశాఖలు చేపట్టి ఈ ప్రాంతాన్ని పలు రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. గత మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన నోముల నర్సింహయ్య డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇచ్చిన హామీ మేరకు 2019–20 విద్యా సంవత్సరంలోనైనా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. చదువును మధ్యలోనే ఆపేస్తున్న విద్యార్థులు.. సాగర్ నియోజకవర్గంలో అనుముల, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడు, తిరుమలగిరి మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల నుంచి ప్రతి ఏటా ఇంటర్ ఉత్తీర్ణులైయ్యే విద్యార్థుల సంఖ్య సుమారు 800 మందికిపైగానే ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళా శా ల లేకపోవడంతో ఇంటర్ పాసైన విద్యార్థులు ఉ న్నత విద్య కోసం మిర్యాలగూడ, నల్లగొండ వం టి పట్టణాలకు వెళ్లాల్సివస్తోంది. అయితే ఆ యా పట్టణాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిం చాలంటే ఆర్థికస్థోమత సరిగా లేని పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీ ఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాదైనా నియోజకవర్గం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తుందని గంపెడు ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో.. బౌద్ధ విశ్వవిద్యాలయం!
ఎందుకు సాగర్? బౌద్ధంలో మహాయాన పద్ధతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చైనా, సింగపూర్, కంబోడియా, మలేసియా, జపాన్.. తదితర దేశాలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మహాయాన పద్ధతిని విశ్వవ్యాప్తం చేసిన ఆచార్య నాగార్జునుడంటే.. ఆ దేశాల్లో బౌద్ధులకు ప్రత్యేక ఆరాధన భావముంది. నాగార్జునుడు నివసించిన ప్రాంతం నాగార్జునసాగర్ పరిసరాలే కావటంతో ఇక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. నాగార్జునుడి కాలంలో ఈ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందించిన విశ్వవిద్యాలయం విలసిల్లింది. అప్పట్లోనే ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. అందుకే చరిత్రకు సరైన గౌరవం ఇవ్వడంతోపాటు నాటి యూనివర్సిటీని పునరుద్ధరించినట్లవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్‌లో ప్రపంచ స్థాయి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ తక్షశిల తరహాలో పెద్ద విశ్వవిద్యాలయం ఉన్నట్టు చారిత్రక ఆధారాలున్న నేపథ్యంలో దీన్ని పునరుద్ధరించేందుకు ఓ ప్రపంచస్థాయి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే యోచన చాలాకాలంగా ఉంది. ఇప్పుడు ఈ కలను నిజం చేసేందుకు మలేసియా ముందుకొచ్చింది. ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనం పేరుతో బౌద్ధ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీని పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ బుద్ధవనంలోనే ఇప్పుడు మలేషియా ఆర్థికసాయంతో అంతర్జాతీయస్థాయి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. మలేషియాకు చెందిన డీఎక్స్ఎన్ గ్రూపు ఇందుకోసం రూ.200 కోట్లను వెచ్చించేందుకు సంసిద్ధత తెలిపింది. డీఎక్స్ఎన్ గ్రూపు అధినేత, చైనా మూలాలున్న పారిశ్రామిక వేత్త లిమ్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నారు. దాదాపు రూ.200 కోట్లు వ్యయమయ్యే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆ సంస్థ ఇటీవల ప్రతిపాదన అందజేసింది. ప్రాజెక్టు త్రీడీ యానిమేటెడ్ చిత్రాన్ని కూడా రూపొందించింది. దీనికి 40 ఎకరాలు అవసరమవుతాయని పేర్కొంది. కావాల్సిన భూమి కేటాయించాలని కోరుతూ బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మలేసియా సంస్థ పనులు ప్రారంభించనుంది. సంప్రదాయ విద్య, ఆధునిక మేళవింపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక విద్యాబోధనతో ఈ విశ్వవిద్యాలయం అలరారనుంది. ఓవైపు ఆధునిక విద్యను అందిస్తూనే సంప్రదాయ బోధనకు పెద్ద పీట వేస్తామని బుద్దవనం ప్రత్యేకాధికారి లక్ష్మయ్య తెలిపారు. ఒత్తిడిని జయించటం, సన్మార్గం, సంప్రదాయం, ప్రపంచ శాంతి.. వంటివి ఒంటబట్టే విధంగా విద్యాబోధన ఉంటుందని, బౌద్ధాన్ని అనుసరిస్తున్న దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ పర్యాటకానికి ఇది కొత్త కోణం కల్పిస్తుందన్నారు. అత్యాధునిక హంగులతో.. - బుద్ధగయలోని ప్రధాన మందిరం నమూనాలోనే ఇక్కడ యూనివర్సిటీ ప్రధాన భవనం రూపుదిద్దుకోనుంది. ఇది 21 అంతస్తుల్లో 6.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 15 ఎకరాల్లో రూ.147 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారు. దీనికి నలుదిక్కులా ఒక్కోటి 7 అంతస్తుల్లో.. నాలుగు భవనాలుంటాయి. - మూడు ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ భిక్షువుల వసతి గృహ సముదాయాలు నిర్మిస్తారు. 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.3.3 కోట్లతో దీన్ని సిద్ధం చేస్తారు. - యాభై పడకల సామర్థ్యం ఉండే ఆసుపత్రిని రూ.11 కోట్లతో నిర్మిస్తారు. ఇది చాలా ఆధునికంగా ఉంటుంది. - ఔషధ మొక్కలు, మామిడి మొక్కలతో 8 ఎకరాల్లో పెద్ద తోట పెంచుతారు. తైవాన్ చేయూతతో! - బౌద్ధాన్ని అనుసరించే మరోదేశం తైవాన్ కూడా నాగార్జునసాగర్‌లో నిర్మాణాలకు ముందుకొచ్చింది. - 20 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ భిక్షువుల పాఠశాలను నిర్మించనుంది. రూ.16.50 కోట్ల వ్యయంతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ భవనం ఉంటుంది. - దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో ఓ భారీ బౌద్ధ మందిరాన్ని నిర్మిస్తారు. ఇక్కడ 70 అడుగుల ఎత్తుతో ఆచార్య నాగార్జునుడి భారీ విగ్రహం ఏర్పాటు చేస్తారు. - సైన్స్, మెకానికల్, కార్పెంటరీ శిక్షణతో కూడిన వృత్తి విద్యా కేంద్రం ఉంటుంది. 60 వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.18 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తారు. - బెంగళూరుకు చెందిన లోటస్ నిక్కో గ్రూపు 5–స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇందుకు రూ.42 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. – సాక్షి, హైదరాబాద్ -
సాగర్‌లో మరో బీసీ బాలుర గురుకుల పాఠశాల
నాగార్జునసాగర్ : అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో మరో బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తెలిపారు. మంగళవారం పైలాన్ కాలనీలోని బీఈడీ కళాశాలలో పెద్దవూర మండలపార్టీ అధ్యక్షుడు కర్నబ్రహ్మానందరెడ్డితో కలిసి రికార్డులను పరిశీలించారు. గురుకుల పాఠశాల ఏర్పాటుకు కావాల్సిన భవనం కోసం ఆ కళాశాల ఆవరణలోనే మధ్యంతరంగా నిలిచిపోయిన భవనంతో పాటు మరికొన్ని ఎన్ఎస్పీకి చెందిన గోదాంలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 119 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరైనట్లు వెల్లడించారు. అందులో భాగంగానే సాగర్ నియోజకవర్గానికి పాఠశాల మంజూరైనట్లు తెలిపారు. విద్యపరంగా ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆచార్య నాగార్జునుడి సన్నిధిలో ప్రపంచ దేశాలనుంచి విద్యార్థులు వచ్చి అభ్యసించినట్లు పేర్కొన్నారు. అందుకే ఆ పాఠశాలను సాగర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన భవనం నిర్మించే వరకూ పాఠశాల తాత్కాలికంగా నడిచేందుకు భవనం అవసరమని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలోనే ప్రారంభించాల్సి ఉందని అందుకే భవనాలను పరిశీలించినట్లు తెలిపారు. బీఈడీ కళాశాల కూడా ఇక్కడే ఉంటుందని ఆ కళాశాలను నల్లగొండకు తరలించడమనేది లేదన్నారు. ఎమ్మెల్యే వెంట తుమ్మడం బీసీగురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జనార్థన్‌రెడ్డి, కర్నబ్రహ్మానందరెడ్డి, శేఖరాచారి, శ్రీను తదితరులున్నారు. -
ఆస్పత్రి బయటే మహిళ ప్రసవం
సాక్షి, నాగార్జునసాగర్ : ఆస్పత్రి ఆరుబయటే ఓ మహిళ ప్రసవించింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి ఇక్కడ కాన్పు చేయలేమని నల్లగొండకు తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పడంతో.. వారు ఆసుపత్రి బయటకు రాగానే అక్కడే కాన్పు అయ్యింది. ఈ సంఘటన నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రి వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం జాల్‌తండాకు చెందిన విమోజకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు సాగర్ తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ అరవింద్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేడని.. గర్భిణి విమోజ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని నల్లగొండకు తీసుకెళ్లాలని రెఫర్ చేశాడు. ఆమె నొప్పి ఎక్కువగా ఉందని చెప్పినా.. డాక్టర్, సిబ్బంది పట్టించుకోకుండా నల్లగొండకు వెళ్లమని ఒత్తిడి చేశారు. వారు ఆస్పత్రి బయటకు వెళ్లగానే నొపులు ఎక్కువై అక్కడే కాన్పు అయ్యింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. తండాకు చెందిన ఆడవాళ్లే కాన్పు చేశారు. అనంతరం తల్లీ బిడ్డను ఆస్పత్రిలోకి అనుమతించారు. పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్నా.. కనికరం చూపని డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త మోతీలాల్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డాక్టర్ అరవింద్‌ను వివరణ కోరగా.. తల్లి వద్ద రక్తం సరిపోయేంత లేకపోవడంతో పాటు గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతోనే నల్లగొండకు రెఫర్ చేసినట్లు తెలిపారు. అంబులెన్స్ మాట్లాడి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో ఇక్కడే డెలివరీ అయ్యిందని ఆ సమయంలో మా సిబ్బందిని వారు దగ్గరకు రానివ్వలేదని పేర్కొన్నారు. -
జనంపై జానారెడ్డి ఫైర్
-
సాగరమంత సానుభూతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రెండోరోజు గురువారం షర్మిల నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మూడు కుటుంబాలను పరామర్శించారు. షర్మిల రాకతో పరామర్శకు వెళ్లిన గ్రామాలతో పాటు నియోజకవర్గమంతా సందడి నెలకొంది. తమ అభిమాన నేత కుమార్తె షర్మిలను చూసేందుకు, ఆమెను పలకరించేందుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. పొలం పనులు చేసుకుంటున్న వారు కూడా షర్మిల కాన్వాయ్‌ను చూసి రోడ్డు మీదకు వచ్చి స్వాగతం పలికారు. వరినాట్లు వేస్తున్న కూలీలు తినే అన్నాన్ని పక్కనపెట్టి షర్మిలను కలిసేందుకు పరుగులుపెట్టడం వైఎస్ కుటుంబంపై జిల్లా ప్రజానీకానికి ఉన్న ప్రేమను తెలియజేస్తోంది. రెండో రోజు యాత్ర సాగిందిలా.... గురువారం ఉదయం 9:30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయలుదేరారు. తొలుత నేరుగా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఉన్న కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. అక్కడ స్థానికులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. వెంకటనర్సయ్య భార్య రంగమ్మతోపాటు ఇతర కుటుంబసభ్యులు ఆమెకు కష్టసుఖాలు తెలియజేశారు. ఆ తర్వాత షర్మిల అనుముల మండలంలోని గరికేనాటితండాకు వెళ్లారు. బాణావత్ బోడియా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ బోడియా కుటుంబ సభ్యులతో అరగంటకుపైగా షర్మిల మాట్లాడారు. వారి కుటుంబసభ్యులు తమ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా షర్మిల వారితో ఆ కుటుంబానికి సంబంధించిన సమస్యలే కాకుండా రైతులు, ఇతర గ్రామస్తుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి కోటమైసమ్మ దేవాలయం సమీపంలో భోజనం పూర్తి చేసుకున్న త్రిపురారం వెళ్లారు. అక్కడ మైల రాములు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. రాములు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె తమ కుటుంబ స్థితిగతులను షర్మిలకు వివరించారు. అయితే, రాములు భార్య ధనమ్మ పరిస్థితిని చూసి స్పందించిన షర్మిల ఆమెకు అవసరమైన వైద్యసాయం చేస్తానని మాట ఇచ్చారు. వెంటనే మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అక్కడినుంచి షర్మిల మిర్యాలగూడ వెళ్లారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలను ఆమె శుక్రవారం పరామర్శిస్తారు. రైతుల సమస్యలంటే ఎంత ఆసక్తో! దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి రైతులు, రైతుకూలీలంటే ఎంత ప్రేమో ఆయన తనయ షర్మిలకు కూడా ఆ వర్గాలంటే అంతే ప్రేమ ఉందని తెలియజెప్పారు. పరామర్శ యాత్రలో భాగంగా గరికేనాటితండాలో బాణోతు బోడియా నాయక్ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆయన పెద్దకుమారుడు బిచ్చానాయక్ మాట్లాడుతూ ఈ యేడు కాలం కాలేదని, వానలు లేక ఆలస్యంగా సాగు చేశామని చెప్పారు. పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని వాపోయాడు. ‘మీ నాన్న పాలించినప్పుడు రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడేమో అంతా దివాళా తీశారు. ఇంకో ఏడాది ఇదే పరిస్థితి ఉంటే ఉన్నది అమ్ముకోవాల్సిందేనమ్మా.’ అని వివరించారు. అప్పుడు షర్మిల మాట్లాడుతూ పంటలు సరిగా వేయలేదు.. వేసిన పంటకు మద్దతు ధర లేదా అని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తిగా కట్టలేదన్న బిచ్చా సమాధానానికి ఆమె స్పందిస్తూ మరి కొత్త రుణం ఇచ్చారా అని ఆరా తీశారు. కొత్త రుణం ఇవ్వలేదని, ప్రభుత్వం అసలు మినహాయించకుండా వడ్డీ చెల్లించడంతో రుణం ఇవ్వలేదని చెప్పారు. అదేంటి ప్రభుత్వమే వడ్డీ చెల్లించినా మీకు రుణం ఇవ్వడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లో అందరికీ పింఛన్లు వస్తున్నాయా అని కూడా షర్మిల ప్రశ్నించారు. మా బాధ సగం తీరిందమ్మా! బోడియానాయక్ కూతురు కమల, చిన్నకోడలు పద్మ మాట్లాడుతూ ‘మాకు ఒకపక్క చాలా సంతోషంగా ఉంది. మరోపక్క సంతోషంగా బాధగా ఉంది. మీ మా దగ్గరకు వస్తే మా బాధ సగం తీరిందమ్మా! మీరు మా ఇంటి మనిషే అనిపిస్తోంది. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాతయినా వచ్చినందుకు ఎంతో కతజ్ఞతలు. మా నాన్న మీ నాన్నను నమ్ముకున్నందుకు మాకు వచ్చిన అవకాశం ఇది. మీ నాన్న ఈ విధంగా కూడా మాకు సాయం చేశాడు.’ అని చెప్పడంతో షర్మిల ఆప్యాయంగా వారిని దగ్గరకు తీసుకున్నారు. మా అమ్మను కాపాడండమ్మా! ఇక, త్రిపురారంలోని మైల రాములు కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నప్పుడు ఆ ఇంటిల్లిపాది కన్నీటిపర్యంతమయ్యారు. నాన్న ఎలా చనిపోయారని అడిగి తెలుసుకున్న షర్మిల పిల్లలు ఏం చేస్తున్నారని ఆరా తీశారు. రాములు కుమార్తె సంధ్య తాను డిగ్రీ చదువుతున్నానని చెప్పగా, ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఇంటర్‌సెకండియర్ చదువుతున్న శ్రీకాం త్‌కు కూడా అదే సలహా ఇచ్చారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ కుమారుడు సుతారి పని చేసి కుటుం బాన్ని నెట్టుకొస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న షర్మిల కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాములు భార్య ధనమ్మకు ఆరోగ్యం బాగాలేదని పిల్లలు షర్మిల దష్టికి తీసుకెళ్లడంతో ఆమె చలించిపోయారు. వెంటనే ధనమ్మకు అవసరమైన వైద్యసాయం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని, తాను అండగా ఉంటానని చెప్పారు. షర్మిల వెంట పరామర్శ యాత్రలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, జిల్లా నాయకులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, నాగార్జునసాగర్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి మల్లు రవీందర్‌రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జి ఎం.డి.సలీం, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.