సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయమై సీపీఐ (ఎం) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఒక పక్క ప్రభుత్వ విధానాలపై పోరాడుతూనే మరోపక్క టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడం విస్మయం కలిగిస్తోంది. నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ తీసుకోవాల్సి వచ్చిందని సీపీఎం(ఎం) వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. సీపీఐ (ఎం) కూడా మద్దతు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ జోష్ మీద ప్రచారం చేయనుంది.
దివంగత నోముల నర్సింహయ్య తనయుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఐ (ఎం) సోమవారం ప్రకటించింది. కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు, వామపక్ష అభిమానులు నోముల భగత్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని పై కమిటీలు సూచించాయి. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ నోముల భగత్‌ను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కున్ రెడ్డి నాగిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment