CPI (M)
-
విద్యుత్ ఛార్జీల పెంపు పై కమ్యూనిస్టులు ఫైర్
-
నేడు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజా స్వామ్య హక్కులను కాల రాస్తోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఎస్.వీరయ్య మండిప డ్డారు. వామపక్ష పార్టీల సమావేశం శుక్రవారం ఎంబీ భవన్లో జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛందంగా పనిచేసే ఈడీ, ఐటీ, సీబీఐలను తమ జేబు సంస్థలుగా కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకుండా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నా యకులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు. అందులో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోపా టు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలను అరెస్టు చేసిందన్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్, ఎస్ యూసీఐ(యు) నాయకులు తేజ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. -
ఘనమైన చరిత్ర నుంచి గట్టెక్కలేని స్థితికి..
స్వతంత్ర భారతావనికి జరిగిన తొలి ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఎంపీతోనే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలన్న నిర్ణయం జరిగింది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు కూడా దక్కని ఆ ఖ్యాతి కమ్యూనిస్టులకు దక్కింది. 1952 మార్చిలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుల అభ్యర్థి రావినారాయణ రెడ్డి, నెహ్రూకన్నా అత్యధిక మెజారిటీలో విజయం సాధించారు. రావి నారాయణ రెడ్డికి ఆ ఎన్నికల్లో 3,09,162 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ కమ్ జౌన్పూర్ (పశ్చిమ) ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జవహర్లాల్ నెహ్రూకు మాత్రం 2,33,571 ఓట్లు పడ్డాయి. దీంతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అరుదైన అవకాశం కమ్యూనిస్టులకు దక్కినట్లయ్యింది. ఇపుడు ఈ చరిత్రనంతా నెమరు వేయడం ఎందుకంటే.. కమ్యూనిస్టుల ప్రాభవం ఏ విధంగా ఉండేదో గుర్తు చేసుకోవడం కోసం.. ఇప్పటి వారి పరిస్థితిపై ఓ అంచనాకు రావడం కోసం. ఉనికి కోసం వారు పడుతున్న ఆరాటాల గురించి చర్చించుకోవడం కోసం. తెలంగాణ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ బీఆర్ఎస్ నిరాదరణకు గురై, కాంగ్రెస్ కు స్నేహ హస్తం చాచినా ఆ పార్టీ పట్టించుకోక పోవడంతో ఇపుడు ఎలాంటి ఎన్నికల పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకునే స్థితి నుంచి కమ్యూనిస్టులు ఎపుడో కిందకు జారిపోయారు. కమ్యూనిస్టులది ఘనమైన చరిత్రే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు అంటే 1983 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వైరి వర్గాలు కాంగ్రెస్, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలే. కమ్యూనిస్టులు సీపీఐ, సీపీఎంలుగా విడివడ్డాక క్రమేణా కాంగ్రెస్ ను ధీటుగా ఎదుక్కోవడంలో ఉభయ కమ్యూనిస్టులు విఫలమవుతూ వచ్చారు. ఈ తరుణంలోనే ఎన్టీ రామారావు నాయకత్వంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీకి దగ్గరై, పోత్తులు పెట్టుకోవడం మొదలు పెట్టారు. నాటి ఆర్ధిక మంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు, తెలుగుదేశంలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ ను తిరిగి సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో వామపక్షాలది తీసివేయలేని పాత్ర. వాస్తవానికి 1983లో ఎన్టీఆర్ ప్రభంజనలో సైతం వామపక్షాలు తమ ఉనికిని చాటాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ 4 నియోజకవర్గాల్లో, సీపీఎం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అంటే అప్పటికి ఆ పార్టీలకు ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయలేం. కానీ, తర్వాత వరసగా జరిగిన 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీతో జతకట్టి బరిలోకి దిగాయి. ఇక్కడి వరకు సవ్యంగా సాగిన టీడీపీ, లెఫ్ట్ పార్టీల స్నేహం ( ఒక విధంగా ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఉన్నన్ని రోజులు..) ఆతర్వాత బ్రేక్ అయ్యింది. చంద్రబాబు అవకాశవాదంతో టీడీపీకి దూరమైన వామపక్షాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన 1999 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో చంద్రబాబు అవకాశవాదానికి షాకైన వామపక్షాలు, టీడీపీకి దూరమయ్యాయి. ఆ ఎన్నికల్లో సీపీఎం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించగా, సీపీఐకి ఒక్క చోటా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జరిగిన పొత్తులో లాభపడిన సీపీఐ 6, సీపీ ఎం 9 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌తో వచ్చిన పొరపొచ్చాల వల్ల 2009 ఎన్నికల్లో మహాకూటమి లో భాగంగా టీడీపీ, బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) తో ఎన్నికలు వెళ్లాయి. అప్పుడు కూడా సీపీఐ 4 చోట్ల , సీపీఐఎం ఒక చోట గెలిచాయి. గడిచిన నాలుగు దశాబ్ధాల కాలంలో అంటే 1983 నుంచి ఇప్పటి దాకా ఏదో ఒక పార్టీ అండలేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకోలేని స్థితికి వామపక్షాలు చేరుకున్నాయి. చివకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణలో సీపీఐ(ఎం) వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టకుని ఒక చోట, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక చోట గెలిచాయి. 2018 ఎన్నికలు తెలంగాణలో ఆ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా చేశాయి. మునుగోడు ఉప ఎన్నికతో.. బీఆర్ఎస్ తో దోస్తీ 2023 ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్ తో కలిసి వెళతాయని భావించినా, అది బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలు వేదికగా ఆ నియోజకవర్గంలో బీజేపీని ఎదుర్కునే శక్తి బీఆర్ఎస్ కే ఉందని పేర్కొంటూ ఆ పార్టీతో జతకట్టాయి. ఆ ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచిందని అంతా భావించినా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం వామపక్షాలను కరివేపాకులా తీసి పక్కన పడేశారు. 2023 ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సమయంలో తమ మిత్రపక్షాలుగా భావిస్తున్న వామపక్షాలతో మాటమాత్రంగా కూడా చర్చలేవి జరపకుండా ఏక కాలంలో 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సీపీఎం, సీపీఐ పోటీ చేయాలని భావించిన స్థానాలు కూడా ఉండడం విశేషం. దీంతో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య చెడిందని, పొత్తు లేనట్టేనన్న అర్థమై పోయింది. జాతీయ రాజకీయాల్లో భాగంగా ‘ ఇండియా ’ కూటమిలో కాంగ్రెస్ తో వామపక్షాలు కలిసి నడుస్తున్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని భావించినా.. ఆ పార్టీల మధ్య ఇంకా పొత్తు పొడవలేదు. దాదాపు తెలంగాణలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉండక పోవచ్చని, ఒంటరిగానే వామపక్షాలు పోటీ చేయనున్నాయని తెలుస్తోంది. దీంతో వామపక్ష పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు ఎవరి జయాపజయాల్లో కీలకం కానుందన్న సమీకరణలు మొదలయ్యాయి. వామపక్షాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నాయి..? చివకు కనీసం ఉభయ కమ్యూనిస్టుల పార్టీల మధ్యనైనా సరైన అవాగాహన కుదురుతుందా అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది. :::మిత్రా. ఎన్ -
‘కమ్యూనిస్ట్‌లు అంటే ఏంటో అందరికీ తెలియజేస్తాం’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ పదే పదే చెప్పారని, కానీ, ఏకపక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించారని వామపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అనంతరం వామ పక్ష నేతలు సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తమ్మినేని మాట్లాడుతూ.. ‘‘మునుగోడులో మద్ధతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. బీజేపీ దూకుడును నిలువరించాలన్నది అప్పుడు మా విధానం. ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు బీఆర్ఎస్కు మద్ధతు ఇవ్వాల్సి వచ్చింది. లెఫ్ట్‌పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆరే ప్రకటించారు. ఇప్పుడు ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. మేం కోరిన సీట్లలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది సీట్ల సర్దుబాటు సమస్య కాదు. కేసీఆర్ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందేమో అని తమ్మినేని అన్నారు. మాతో చర్చలకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఇండియా కూటమిలో ఉండడం నచ్చలేదని చెప్పారు. ఎన్డీయేకు దూరంగా ఉంటామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని పదే పదే కేసీఆరే స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. కేసీఆర్ రాజకీయ విధానంతో సమస్య వచ్చింది అని తమ్మినేని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేస్తుంది. ఎవరితో కలవాలనేది భవిష్యత్తులో నిర్ణయిస్తాం. మాతో కలిసి వచ్చేవారితో పని చేస్తాం. కమ్యూనిస్ట్‌లు అంటే ఏంటో అందరికీ తెలియజేస్తాం. నిర్ణయాత్మక పాత్ర రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో పోషిస్తాం. బీజేపీతో బీఆర్ఎస్కు ఎక్కడో మిత్రత్వం జరిగింది. బీజేపీకి దగ్గరైతే.. కేసీఆర్ మిత్ర ధర్మం పాటించరా. లెఫ్ట్లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ గెలిచేదా?. మునుగోడులో బీజేపీ గెలిస్తే ఇవాళ ఇంతటి ప్రశాంత వాతావరణ ఉండేదా?. ఎంతటి బేరసారాలు జరిగాయో కేసీఆర్ మర్చిపోయారా? కేసీఆర్‌కు బీజేపీ అండదండలు ఉంటే చాలు అనుకుంటున్నారా? అని కూనంనేని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉందని.. ఈ నెల 27 తర్వాత వామపక్ష పార్టీలు మరోసారి ఉమ్మడిగా భేటీ అవుతామని, ఆ తర్వాతే కార్యచరణ ప్రకటిస్తామని వామపక్ష నేతలు వెల్లడించారు. -
కమ్యూనిస్టుల దారెటు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కమ్యూనిస్టు, బీఆర్ఎస్ పార్టీలు వచ్చే సాధారణ ఎన్నికలో పొత్తు పెట్టుకుంటాయని అంతా భావించినా అది కుదరలేదు. తమకు అవకాశం వస్తుందని భావించిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో అంచనాలు తలకిందులయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీతో బీఆర్ఎస్ జత కట్టింది. ఆ సందర్భంలోనే.. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పనిచేస్తామని ఇరుపార్టీల నేతలు ప్రకటించారు. నిన్నటి వరకు కూడా కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని అంతా అనుకున్నారు. కానీ, కమ్యూనిస్టులు అడిగే స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు లేనట్లేనని తేలిపోయింది. కామ్రేడ్ల పొత్తు ఎవరితో.. దేశంలోనే ఎప్పుడూలేని విధంగా మునుగోడు ఉప ఎన్నిక పోటాపోటీగా జరిగింది. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాయి. ఇక ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో సహా ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగింది. ఈ రెండు పార్టీలు యుద్ధాన్ని తలపించేలా ప్రచారం కొనసాగించాయి. మొత్తానికి ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంలోనే కమ్యూనిస్టుల పొత్తుతోనే విజయం సాధించినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. భవిష్యత్తులోనూ ఎన్నికల్లో కలిసే పనిచేస్తామని ప్రకటించింది. ఆ తరువాత పొత్తుల్లో భాగంగా స్థానాల కేటాయింపుపై అంచనాలు పెరిగిపోయాయి. మునుగోడు ఎలాగైనా సీపీఐకి వస్తుందని అంచనా వేసుకున్నారు. లేదంటే మిర్యాలగూడను సీపీఎంకు కేటాయిస్తారని ఆ పార్టీ భావించింది. గతంలో సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి అక్కడ నుంచి గెలుపొందారు. దీంతో ఆ స్థానంపై సీపీఎం ఆశ పెట్టుకుంది. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం, సీపీఐలకు ఒకటి చొప్పున టికెట్ ఇస్తారని, సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు ఇస్తారన్న చర్చ సాగింది. అయితే సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితా ప్రకారం పొత్తు లేదని తేల్చేశారు. మిర్యాలగూడలో సిట్టింగ్ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావుకు, మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బరిలో ఉంటారని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? సొంతంగా పోటీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. -
బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?.. సీపీఎం నేతలు ఫైర్
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబుపై సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకి చెప్పాలని నిలదీశారు. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలంటూ తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ‘‘బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలి. రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా? బాబు చెప్పాలి. 2022 కల్లా దేశంలో బుల్లెట్ ట్రైన్ మోదీ నడుపుతామన్నారు.. బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ ‘‘18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన మోదీ అవి ఇచ్చారా.. చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోదీలో చూస్తున్నది అభివృద్ధి కాదు, పచ్చి అవకాశవాదం. గడ్డిపరకనైనా పట్టుకుని ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న మోదీ విజన్‌లో పేదలకు, ప్రజలకు స్థానం ఎక్కడ?, పెట్టుబడిదారుల విజన్ మతోన్మాదుల విజన్ అసలు విజన్ కాదు. మోదీ, చంద్రబాబుది విజన్ కాదు.. అదొక డివిజన్’’ అంటూ తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏ విజన్‌తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు:శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణను టీడీపీ వ్యతిరేకిస్తామని చెబుతోంది. మరి మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోంది. మరి చంద్రబాబు ఏ విజన్‌తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు’’ అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని మోదీ అంటున్నారు. చంద్రబాబు మరి కంటిన్యూ చేస్తా అంటున్నారు.. ఇందులో ఉన్న విజన్ ఏమిటి?. చంద్రబాబుది రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి లేదు. ఈ వైఖరితో చంద్రబాబు ఎన్నడూ ప్రజల విశ్వాసాన్ని పొందలేరు’’ అని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. చదవండి: ఒక ముఖ్యమంత్రికి ఇంతటి స్పందన రావడం జగన్ విషయంలోనే.. -
పార్లమెంటరీ విచారణ బృందంపై దాడి.. వాహనాలు ధ్వంసం
త్రిపురలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై విచారణ చేపట్టేందుకు వెళ్లిన పార్లమెంటరీ బృందంపై దాడి జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఎవరికీ ఏం కాలేదు. అయితే మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పార్లమెంటరీ బృందం తన షెడ్యూల్లో మార్పులు చేసుకుంది. అయితే.. ఇది బీజేపీ పనేనంటూ కాంగ్రెస్, సీపీఎంలు ఆరోపణలకు దిగాయి. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఎనిమిది జిల్లాల్లో హింస చెలరేగింది. మార్చి 2వ తేదీ నుంచి ఇప్పటిదాకా వెయ్యి దాడులు చోటు చేసుకోగా.. 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింసలో ముగ్గురి ప్రాణాలు పోయాయి కూడా. ఈ నేపథ్యంలో.. నలుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులతో కూడిన పార్లమెంటరీ బృందం ఒకటి ఆ హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు త్రిపుర వెళ్లింది. మూడు బృందాలుగా విడిపోయి.. శుక్ర, శనివారాల్లో వెస్ట్ త్రిపుర, సెపహిజల, గోమతి జిల్లాల్లో పర్యటనకు సిద్ధం అయ్యాయి. అయితే.. శుక్రవారం సాయంత్రం బిసల్‌ఘడ్‌లోని నేహల్‌చంద్ర నగర్ బజార్లో పార్లమెంటరీ బృందం పర్యటించగా.. కొందరు నినాదాలు చేస్తూ వాళ్లను అడ్డుకునే యత్నం చేశారు. ఆ సమయంలో ఎంపీలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, కొందరు నేతలు కూడా అక్కడ ఉన్నారు. అయితే.. పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోవడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఎంపీల బృందాన్ని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఎవరికీ గాయలు కాలేదని, వాహనాలు మాత్రం ధ్వంసం అయ్యాయని పోలీసులు చెప్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు.. అలాగే మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది పోలీస్ శాఖ. ఇదిలా ఉంటే.. దాడి యత్నాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఖండించారు. బిలాస్‌ఘడ్‌తో పాటు మోహన్‌పూర్‌లోనూ కాంగ్రెస్ నేతల బృందంపై బీజేపీ గూండాలు దాడి చేశారని, పోలీసులు అక్కడే ఉండి కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారాయన. అంతేకాదు ఈ ప్రాంతంలోనే బీజేపీ ఎన్నికల విక్టరీ ర్యాలీకి ప్లాన్ చేసిందని, కాబట్టి ఇది బీజేపీ ఆధ్వర్యంలోనే జరిగిన దాడి అంటూ ఆరోపించారాయన. మరోవైపు సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి జితేంద్ర చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. దాడి నేపథ్యంలో పార్లమెంటరీ బృందం తన కార్యక్రమాలను నిలిపివేసిందని, షెడ్యూల్లో మార్పు చేసుకుందని చెప్పారు. A delegation of Congress leaders was attacked by BJP goons today in Bishalgarh & Mohanpur in Tripura. Police accompanying the delegation did NOTHING. And tomorrow BJP is having a victory rally there. Victory of party-sponsored violence. pic.twitter.com/gZfBm4qEWB — Jairam Ramesh (@Jairam_Ramesh) March 10, 2023 -
పొలిటికల్ కారిడార్: పాలేరు నాదే అంటున్న ఎర్రన్న..
-
అధికార పార్టీతో అంటకాగుతూ.. బీజేపీకి చుక్కలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజ్‌భవన్ పంచాయితీలు రసవత్తరమైన రాజకీయాలకు వేదిక అవుతున్నాయి. జగదీప్ ధన్కర్ ఉప రాష్ట్రపతి కావడంతో ఆయన స్థానంలో బెంగాల్‌కు గవర్నర్‌గా(అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు లా గణేశన్ అయ్యర్. అయితే ఆయన తీరు ఇప్పుడు బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్న గవర్నర్ గణేశన్.. బీజేపీ నేతలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. మణిపూర్ గవర్నర్‌గా ఉన్న ఆయన.. బెంగాల్‌కు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తాజాగా చెన్నైలో జరిగిన తన సోదరుడి పుట్టినరోజుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం ఆహ్వానించారాయన. ఇక మంగళవారం నాటి పరిణామం అయితే ప్రతిపక్ష నేత సువేందు అధికారికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తోటి ప్రతినిధులతో కలిసి రాజ్ భవన్‌కు ర్యాలీగా వెళ్లగా.. ఆ సమయంలో గవర్నర్ నగరంలో లేరనే సమాచారం తెలుసుకుని సువేందు అధికారి అసంతృప్తిగా కనిపించారు. అంతకు ముందు రోజు బీజేపీ ప్రతినిధులంతా గవర్నర్‌ను కలిసి ఓ మెమోరాండం ఇచ్చేందుకు ప్రయత్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బెంగాల్ మంత్రి అఖిల్ గిరి భర్తరఫ్ కోసం సీఎం మమతా బెనర్జీకి సిఫార్సు చేయాలని గవర్నర్‌ను కోరాలనుకున్నారు. కానీ, ఆ సమయంలో రాజ్‌భవన్‌లో ఆయన లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మంగళవారం రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన సువేందు అధికారి.. ‘‘తాము రాజ్‌భవన్‌కు అభ్యర్థన చేయడానికి రాలేదని, గట్టి డిమాండ్‌తోనే వచ్చామని, గవర్నర్ కార్యదర్శితో టీ తాగడానికి రాలేదంటూ తీవ్ర అసహనం ప్రదర్శించారు. ఆయన(మంత్రి అఖిల్) కామెంట్లు చేసి 72 గంటలు గడుస్తున్నా.. సీఎం ఆయన్ని తొలగించలేదని, కనీసం గవర్నర్‌కు సిఫార్సు కూడా చేయలేదని సువేందు ఆగ్రహం వెల్లగక్కారు. శనివారం రాజ్‌భవన్‌కు తాము మెయిల్ చేశామని, గవర్నర్ ఢిల్లీ, చెన్నై, ఇంపాల్.. ఇలా ఎక్కడున్నా ఒక మంత్రిని తొలగించేలా ముఖ్యమంత్రికి సిఫార్సు చేసే రాజ్యాంగబద్ధమైన హక్కును కలిగి ఉంటారని, మా సందేశం గవర్నర్‌కు చేరే ఉద్దేశంతోనే తాము వచ్చామని సువేందు అధికారి మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇక ధన్కర్ లేనిలోటుపై బీజేపీ నేత అగ్రిమిత్ర పాల్ స్పందించారు. జగ్దీప్ ధన్కర్ బెంగాల్‌కు గవర్నర్‌గానే కాకుండా.. తమకు సంరక్షకుడిగానూ వ్యవహరించారని వ్యాఖ్యానించారు. అన్నిరకాలుగా ఆయన మమ్మల్ని చూసుకునేవారన్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన్ని భావించామని, ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నామని వ్యాఖ్యానించారు. ఇక గవర్నర్ గణేశన్పై బీజేపీ చేసిన వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ నుంచి కనెక్షన్లు లేకపోతే ఆయన(సువేందు అధికారిని ఉద్దేశించి..) జీరో అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత కేవలం ఢిల్లీ నుంచి ఉన్న రాజకీయ పలుకుబడిని ప్రదర్శించేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాడని, రేపు కేంద్రంలో అధికారం దూరమైతే ఆయన ఏమైపోతారో అని వ్యాఖ్యానించారామె. మరోవైపు కేరళలో గవర్నర్‌తో వైరం నడుపుతున్న వామపక్ష సైతం.. బెంగాల్ గవర్నర్ రాజకీయాలపై స్పందించాయి. గవర్నర్ అంటే ఒకప్పుడు రాజ్యాంగబద్ధమైన హోదా. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్‌గా వ్యవహరించే పరిస్థితులు వచ్చాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాళ్లను నియమిస్తోంది కాబట్టి.. బీజేపీ నేతలు గవర్నర్ భవనాలను తమ పూర్వీకుల ఆస్తులుగా భావిస్తున్నారు అని విమర్శించారు సీపీఐ(ఎం) నేత మహమ్మద్ సలీం. గతంలో గవర్నర్‌గా ఉన్న సమయంలో జగదీప్ ధన్కర్.. దీదీ సర్కార్‌కు ట్రబుల్ మేకర్‌గా ఉండేవారు. రాజకీయ అంశాలపై బీజేపీ ప్రతినిధులతో తరచూ చర్చించేవారు. అంతేకాదు.. దీదీ ప్రభుత్వంపై వచ్చే ప్రతీ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకునేవారు కూడా. కానీ, అందుకు భిన్నంగా ఉన్న ప్రస్తుత గవర్నర్ తీరు బీజేపీని ఇబ్బందికి గురి చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత, తమిళనాడుకు చెందిన లా గణేశన్ అయ్యర్.. ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడం బీజేపీ తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఆయన్ని తప్పించాలనే డిమాండ్ బెంగాల్ బీజేపీ నుంచి కేంద్రానికి బలంగా వినిపిస్తోంది. ::ఇంటర్నెట్ డెస్క్, సాక్షి -
పొలిటికల్ కారిడార్ : ఖమ్మం టీఆర్ఎస్ లో కొత్త టెన్షన్
-
ప్రతిష్టాత్మక ‘మెగసెసె’ అవార్డు తిరస్కరించిన మాజీ మంత్రి!
సాక్షి, తిరువనంతపురం: ప్రతిష్టాత్మక ‘రామన్ మెగసెసె’ అవార్డును తిరస్కరించారు కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ. అవార్డు అందుకోవటంపై పార్టీతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అవార్డు కమిటీ నుంచి తనకు లేఖ అందిందని, ఆ గౌరవాన్ని వదులుకోవాలని పార్టీ సమష్టిగా నిర్ణయించినట్లు సీపీఎం నేత తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రిగా అందించిన సేవలకుగానూ, ముఖ్యంగా రాష్ట్రంలో నిఫా వైరస్, కోవిడ్-19 వైరస్ విజృంభించిన సమయంలో ఆమె కృషికి గానూ.. 64వ మెగసెసె అవార్డుకు ఎంపిక చేసింది కమిటీ. ‘నేను సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యురాలిని. దీనిపై మా పార్టీ నాయకత్వంతో చర్చించాను. అవార్డును తీసుకోకూడదని అంతా కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకున్నాం. అది పెద్ద అవార్డు. అయితే, అది ఒక ఎన్జీఓ అందిస్తోంది. సాధారణంగా వారు కమ్యూనిస్టుల ప్రిన్సిపుల్స్‌ను వ్యతిరేకిస్తారు. నా పేరును పరిగణనలోకి తీసుకున్నందుకు నేను ఆ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపాను. నా నిర్ణయాన్ని వారికి తెలియజేశాను.’ అని వెల్లడించారు మాజీ మంత్రి శైలజ. ఇది మొత్తం రాష్ట్రానికి జరిగిన గౌరవాన్ని నిరాకరిస్తున్నట్లుగా చూడకూడదని చెప్పారు. రాజకీయ నేతలకు గతంలో మెగసెసే అవార్డు ఇవ్వలేదన్నారు. ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మహిళకు రెప్పపాటులో తప్పిన ప్రమాదం! -
రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం..
తిరువనంతపురం: గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాకు అవమానం ఎదురైంది. ఈ ఘటన కేరళలోని కాసర్గడ్ జిల్లాలో చోటుచేసుకుంది. కాసర్గఢ్లోని మున్సిపల్ స్టేడియంలో పోర్టులు,ఆర్కియాలజీ శాఖ మంత్రి అహ్మద్ దేవరకోవిల్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండాను తలకిందులుగా ఎగరవేశారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, అక్కడే ఉన్న కొంత మంది మీడియా సిబ్బంది, ఇతర కార్యకర్తలు దీన్ని గమనించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జెండాను అవనతం చేసిన మంత్రి.. తిరిగి దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు. ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. కాగా, సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డిఎఫ్ మిత్రపక్షమైన ఇండియన్ నేషనల్ లీగ్(ఐఎన్ఎల్) మంత్రి అయిన దేవర్కోవిల్ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హజరయ్యారు. అయితే, అధికారులు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో చేశారు. చాలా సేపటికి ఎవరు కూడా జాతీయ జెండా తలకిందులుగా ఎగరడం గమనించకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే, దీనిపై ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. అహ్మద్ దేవరకోవిల్ వెంటనే రాజీనామా చేయాలని.. కేరళ బీజేపీ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ డిమాండ్ చేశారు. అదే విధంగా జెండాను అవమానపర్చిన మంత్రి దేవరకోవిల్ పై పోలీసులు కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసి.. కనీసం గమనించకుండా సెల్యూట్ చేసి వెళ్లిపోవడం మంత్రి బాధ్యతారాహిత్యానికి అద్దంపడుతుందని, అధికారులు కూడా లోపాన్ని గుర్తించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఇదే ఘటనపై కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితాన్ స్పందించారు. జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడం దురదృష్టకరమన్నారు. చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు -
ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్లు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్లు ఏర్పడుతాయని చరిత్ర చెబుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్, 2004లో యూపీఏ, 1998లో ఎన్డీఏ వంటివన్నీ ఎన్నికల పూర్తయిన తర్వాత ఏర్పడినవేనని ఉదహరించారు. 1977లో ఇందిరాగాంధీ ఓడిన సమయంలో జనతా పార్టీ కూడా ఎన్నికల తర్వాతే ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుచేశారు. అందువల్ల ఎన్నికలకు ముందు ఎలాంటి ఫ్రంట్లు ఏర్పడాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాను ఆమోదించాం. దీనిపై కార్యకర్తలు తమ అభిప్రాయాలను, సవరణలను నేరుగా కేంద్ర కమిటీకి పంపొచ్చు. ఆయా సవరణలను పార్టీ జాతీయ మహాసభల ముందుంచుతాం. పార్టీ జాతీయ మహాసభలు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు కేరళలోని కన్నూరులో జరపాలని నిర్ణయించాం. మా రాజకీయ ముసాయిదాలో ప్రధానంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పిలుపునిచ్చాం. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించాం. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి బీజేపీని ఓడించాల్సిన అవసరముంది, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఎత్తుగడలు రచిస్తాం’అని ఏచూరి చెప్పారు. ప్రజల్లో మోదీపై అసంతృప్తి దేశ ప్రజల్లో బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా తీవ్ర వ్యతిరేకత ఉందని సీతారాం ఏచూరి అన్నారు. ‘ఆర్థిక సంక్షోభం పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో పెట్రో ఉత్పత్తులు నిరంతరం పెరుగుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం, ఆకలి వంటి సమస్యలతో జనం తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేస్తారు. ప్రధానమంత్రి సహా ఎవరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల విరాళాలను బాండ్ల రూపంలో తీసుకొచ్చి రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేశారు. ఎన్నికల బాండ్లలో 80 శాతం బీజేపీకే వెళ్తున్నాయి. ఈ డబ్బును బీజేపీ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎన్నికల కమిషన్ దీన్ని అడ్డుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించగల సత్తా ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి మేము మద్దతు ఇస్తాం’అని ఏచూరి వివరించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే కేసీఆర్‌కు స్వాగతం బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తే తాము స్వాగతిస్తామని ఏచూరి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేస్తామా లేదా అన్నది ఇప్పుడు నిర్ణయించబోమని, ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి ఎత్తుగడలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పరిస్థితులు ఉంటాయని, అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఎతుగడలు ఉంటాయని చెప్పారు. ఏదిఏమైనా బీజేపీని ఓడించడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. సీపీఐ, సీపీఎంల విలీనం ప్రతిపాదనేదీ రాలేదన్నారు. బీజేపీపై సానుకూలంగానే టీఆర్ఎస్: తమ్మినేని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ‘బీజేపీని టీఆర్ఎస్ సూటిగా విమర్శించడంలేదు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలని టీఆర్ఎస్ చెప్పట్లేదు. రైతు సమస్యలు వంటి విషయాలు తప్పిస్తే ఇతరత్రా బీజేపీ పట్ల టీఆర్ఎస్ ఇంకా సానుకూల వైఖరితోనే ఉంది. రాష్ట్రంలో బీజేపీ ప్రమాదకరంగా ఎదుగుతోంది. దాన్ని ఒంటరి చేయాల్సిన అవసరం ఉంది’అని తమ్మినేని చెప్పారు. -
మహిళపై అత్యాచారం.. న్యూడ్ వీడియోలతో పైశాచికత్వం
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. అధికార పార్టీ స్థానిక నేత.. మహిళా కార్యకర్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గత మేనెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తిరువల్ల పరిధిలోని స్థానిక నేత.. సజిమోన్ తన కార్యాలయంలో బాధిత మహిళకు కూల్‌డ్రింక్‌లో మత్తు పానీయాన్ని కలిపి తాగించారు. ఆ తర్వాత.. ఆమెను కారులో బలవంతంగా ఎక్కించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఆమెను వివస్త్రను, వీడియోలు తీశారు. ఈ దారుణంలో 12 మంది నిందితుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు.. బాధిత మహిళా న్యూడ్ వీడియోలు తీసి వేధించడమే కాకుండా డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. దీనికి మహిళా ఒప్పుకోకపోవడంతో ఆమె న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ క్రమంలో.. బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సజిమోన్, నాసర్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో 10 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు దర్యాప్తులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విపక్షాలు తీవ్ర విమర్షలు చేస్తున్నాయి. -
అగర్తలలో ఉద్రిక్తత: ఆగంతకుల దాడిలో సీపీఎం కార్యాలయానికి నిప్పు
అగర్తల: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కార్యాలయంపై దుండగులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అనంతరం నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా త్రిపుర రాజధాని అగర్తలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎం ప్రధాన కార్యాలయం భాను స్మృతి భవన్‌పై బుధవారం సాయంత్రం కొందరు యువకులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డాయి. ఆ భవనంతో పాటు పక్కనే ఉన్న దశరథ్ భవన్‌ను కూడా నిప్పు పెట్టారు. అక్కడ కనిపించిన వాహనాలను కూడా దగ్ధం చేశారు. ఈ ఘటనకు పాల్పడింది బీజేపీ అని సీపీఎం ఆరోపిస్తోంది. బీజేపీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది. అయితే బీజేపీ వాటిని తిప్పికొట్టింది. వారి పార్టీ కార్యాలయాల్లో బాంబులు ఉన్నాయని, అవి పేలడంతో నిప్పు చెలరేగిందిన బీజేపీ ఆరోపిస్తోంది. చదవండి: గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి -
బీజేపీ విధానాలను తిప్పికొడతాం: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలకు ఎదురుదెబ్బ తగిలినా ఆ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమాలతో బీజేపీ విధానాలను తిప్పికొడతామన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెపె్టంబర్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని తమ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. రెండ్రోజులపాటు జరిగే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. రాఘవులు మాట్లాడుతూ, పార్టీ మహాసభల టైంటేబుల్‌ను కేంద్ర కమిటీ ప్రకటించిందని తెలిపారు. ఫిబ్రవరిలోపు శాఖ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మహాసభలను పూర్తిచేసుకోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో అఖిల భారత మహాసభలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కేరళలోని కన్నూరు జిల్లాలో అఖిలభారత మహాసభలను నిర్వహించబోతున్నామని తెలిపారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రక్రియలను ధ్వంసం చేస్తోందని ఆయన ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతున్నారన్నారు. వర్షపాతం మెరుగ్గా ఉండి పంటల దిగుబడి పెరిగినా, గిట్టుబాటు ధరల్లేక రైతాంగం సంక్షోభంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
వాటిపై చర్చించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు: డీ. రాజా
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ బిల్లుల ప్రవేశం అసంబద్ధంగా జరుగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ. రాజా మండిపడ్డారు. పెగాసిస్ స్పైవేర్ ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి చర్చలు లేకుండా పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడడం బాధాకరమన్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల తీవ్ర నష్టాలు ఉన్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని 9 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు తమ పార్టీ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా వ్యవసాయం కార్పొరేట్ పరమవుతుందని అన్నారు. ప్రభుత్వ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ అంశాలపై మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధంగా లేదని ద్వజమెత్తారు. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత పరిస్థితిపై యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలన్నారు. -
44 ఏళ్ల చరిత్రను తిరగ రాసిన పినరయి విజయన్
సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కేరళలో రెండవసారి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ఎన్నికలలో గెలిచి 44 ఏళ్ల చరిత్రను పినరయి విజయన్ తిరగ రాయనున్నారు. కేరళ రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు తర్వాత ఎల్డిఎఫ్ 95 స్థానాల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్(యుడిఎఫ్) 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు. గత నాలుగు దశాబ్దాల చరిత్రలో కేరళలో అధికార పార్టీ రెండవసారి విజయం సాధించిన సందర్భాలు లేవు. కానీ, ఈసారి సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ఆ చరిత్రను తిరగ రాయనుంది. గెలుపు అంచులకు చాలా దగ్గరలో ఉంది. 2016లో 91 స్థానాలను దక్కించుకున్న ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఈ సారి 95 నుంచి 100 వరకు స్థానాలను గెలిచే అవకాశం ఉంది. బహుళ ఎగ్జిట్ పోల్స్, ప్రీ-పోల్స్ అన్నీ అంచనా వేసినట్లుగా స్పష్టమైన మెజారిటీతో ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమిపై విజయాన్ని సొంతం చేసుకోనుంది. మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్ తగిలింది. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. చదవండి: చెత్తకుప్పలో మెతుకులే పరమాన్నం -
కామ్రేడ్... ‘కారెందుకెక్కారో’?
సాక్షి, హైదరాబాద్: పార్టీ సిద్ధాంతాలకి రాష్ట్ర కామ్రేడ్లు కొత్త భాష్యం చెబుతున్నారా? ప్రజల తరఫున అధికార పక్షంపై పోరాటమే కాదని, రాజకీయ అవసరాన్ని బట్టి అధికార పార్టీకి కూడా అండగా నిలవాలని భావిస్తున్నారా? నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటన వెనుక సీపీఎం వ్యూహం అదేనా? ఎన్నికలనే తాత్కాలిక ఎత్తుగడలు కూడా పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగపడాలని రాష్ట్రంలోని మార్క్సిస్టులు నిర్ణయిం చుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి సీపీఎం శ్రేణులు. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడం వెనుక వ్యూహం కూడా అదేనని, తెలంగాణలో బీజేపీని అడ్డుకోవాలంటే తమకు ఉన్న ఎంతో కొంత బలాన్ని టీఆర్ఎస్కు అందించడమే తక్షణ రాజకీయ కర్తవ్యమని సీపీఎం నేతలు నిర్ణయించు కున్నారని తెలుస్తోంది. అవసరమైతే 2023లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అవలంబించాలన్న అంచనాకు కూడా ఆ పార్టీ నేతలు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. శత్రువుకి శత్రువు... మిత్రుడే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరింత పుంజు కుంటుందనే అంచనాకు సీపీఎం రాష్ట్ర నాయకత్వం వచ్చింది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ప్రత్యామ్నాయ రాజ కీయ శక్తి రేసులో ఆ పార్టీని బీజేపీ వెనక్కు నెట్టి వేస్తుందని అభిప్రాయపడుతోంది. ఈ పరిస్థి తుల్లో తాము ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పక్షాన నిలబడి ఉపయోగం లేదని కామ్రేడ్లు ఓ అంచనాకు వచ్చారు. టీఆర్ఎస్ మద్దతుతో చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కించుకునే వ్యూహాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ‘రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఎన్నికల అంశాన్ని భిన్న కోణంలో ఆలోచించాల్సిందే. ఎన్నికలు జరిగే సమయంలో కేవలం పార్టీ సిద్ధాంతాలే కాదు.. అనేక అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ దశలో గుడ్డిగా వెళ్లడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికి నష్టపోయింది చాలు. ఇంకా మేం నష్టపోకుండా ఉండాలంటే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు’ అని సీపీఎం రాష్ట్ర నాయకుడొకరు వ్యాఖ్యానించడం ఆ పార్టీ మూడ్‌ను తేటతెల్లం చేస్తోంది. ప్రజల్లో చర్చ జరిగితే మంచిదే! కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయాలా... ఎవరికైనా మద్దతివ్వాలా అనే అంశంపై సీపీఎం పెద్ద కసరత్తే చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై పార్టీ జిల్లా కమిటీ నుంచి లెక్కలు తెప్పించుకున్న రాష్ట్ర నాయకత్వం తాము పోటీ చేయకపోవడమే మేలనే అంచనాకు వచ్చింది. ఇక, ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై పార్టీ రాష్ట్ర కమిటీలో పెద్ద చర్చే జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయమై జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నేతలు రెండుగా చీలిపోయినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రతిపాదనను కొందరు నేతలు వ్యతిరేకించారని తెలిసింది. కాంగ్రెస్‌కు మద్దతివ్వడమే రాజకీయంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వారు వెలిబుచ్చినట్టు వారు సమాచారం. కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ అభిప్రాయాలను అంగీకరించలేదు. ‘ఇప్పుడు టీఆర్ఎస్కు మద్దతిస్తే పార్టీ గురించి చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. అయినా సరే... అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయమున్నందున దీనిపై ప్రజల్లో చర్చ జరగాల్సిందే. బీజేపీ దూసుకొచ్చిన తర్వాత కూడా మనం శషభిషలకు పోతే నష్టపోతాం. దుబ్బాకలో కూడా తప్పుడు అంచనాతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించి టీఆర్ఎస్ ఓటమికి పరోక్షంగా దోహదపడ్డాం. అందుకే సాగర్‌లో టీఆర్ఎస్కు మద్దతివ్వడమే కరెక్ట్. ఈ ఎన్నికలే కాదు 2023 ఎన్నికలకు కూడా నిర్ణయం ఇదే విధంగా ఉండొచ్చు. పార్టీ శ్రేణులకు, అటు ప్రజలకు సర్దిచెప్పాల్సిందే’ అని రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మార్క్సిస్టు వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తోనే కలిసి వెళ్లాలనే మార్క్సిస్టు పార్టీ నేతల వ్యూహం చూస్తే ఎప్పటిలాగే 2023లో కూడా వామపక్షాల ఐక్యత ఎండమావేనని, సీపీఐ, సీపీఎంలు మళ్లీ పొత్తు పెట్టుకున్నా, టీఆర్ఎస్ మాటునే పెట్టుకోవాల్సి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
కరోనాతో ఎంసీపీఐ(యూ) జాతీయ నేత మహ్మద్‌గౌస్ మృతి
సాక్షి, ఉప్పల్: ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్(60) కరోనా బారినపడి ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఈ నెల 14న ఆస్పత్రిలో చేరారు. గౌస్ స్వగ్రామం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు. ఈయనకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో నివాసం ఉంటున్నారు. దేశంలో వామపక్షాల ఐక్యత, సామాజిక న్యాయం సాధనపై మహ్మద్ గౌస్ తన వంతు కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బహుజన ప్రజలు అధికారం సాధించాలని కోరుకున్న ఆయన నిరంతరం అందుకు కృషి చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను దేశవ్యాప్తంగా నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా అనేక మేధావులు సామాజికవేత్తలతో చర్చలు జరిపారు. మంగళవారం గౌస్ స్వగ్రామం కొత్తూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఎంసీపీఐ(యూ)నేత వనం సుధాకర్ తెలిపారు. చాడ, తమ్మినేని సంతాపం మహ్మద్ గౌస్ మృతిపై సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. వామపక్ష ఉద్యమ బలోపేతానికి గౌస్ నిరంతరం కృషి చేశారని, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారని నివాళులర్పించారు. గౌస్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. చదవండి: రెండేళ్ల కింద హడావుడి.. తరలింపు అంతా కాగితాల్లోనే -
సాగర్ ఉప ఎన్నిక: సీపీఐ (ఎం) సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయమై సీపీఐ (ఎం) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఒక పక్క ప్రభుత్వ విధానాలపై పోరాడుతూనే మరోపక్క టీఆర్ఎస్కు మద్దతు పలకడం విస్మయం కలిగిస్తోంది. నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ తీసుకోవాల్సి వచ్చిందని సీపీఎం(ఎం) వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. సీపీఐ (ఎం) కూడా మద్దతు ప్రకటించడంతో టీఆర్ఎస్ జోష్ మీద ప్రచారం చేయనుంది. దివంగత నోముల నర్సింహయ్య తనయుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఐ (ఎం) సోమవారం ప్రకటించింది. కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు, వామపక్ష అభిమానులు నోముల భగత్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని పై కమిటీలు సూచించాయి. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ నోముల భగత్‌ను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కున్ రెడ్డి నాగిరెడ్డి తెలిపారు. -
సీపీఐ(ఎం) సీనియర్ నేత తంగవేలు మృతి
సాక్షి, చెన్నై : కార్మిక హక్కులకోసం పోరాడిన సీపీఐ(ఎం) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కె తంగవేలు(69) కరోనా కారణంగా మరణించారు. గత14 రోజులుగా ఓప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తంగవేలుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తగా సుమారు 25 సంవత్సరాలుగా సేవలందించిన ఆయన కార్మికహక్కుల కోసం అనేకప పోరాటాలు చేశారు. బనియన్ మిల్లు కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన తంగవేలు వివిధ కార్మిక సంఘాలలో పనిచేశారు. నిజయితీ గల నాయకుడిగా తంగవేలుకు పార్టీలోనూ ప్రజల్లోనూ మంచి పేరుంది. 2011-16 సంవత్సరంలో తిరుపూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తంగవేలు మరణం పట్ల పలువురు నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు మూడు రోజులపాటు సంతాపదినాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది. గౌరవ చిహ్నంగా పార్టీ జెండాను మూడు రోజులపాటు అవతనం చేస్తామని నేతలు తెలిపారు. (రఘువంశ్ ప్రసాద్ సింగ్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం) -
ఏజెంట్లకు మావోయిస్టు బెదిరింపు లేఖ!
సాక్షి, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన అమాయకులైన ఆదివాసీ వలస కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భద్రాచలానికి చెందిన కొందరు.. ఏజెంట్లుగా అవతారమెత్తి వారి శ్రమను డబ్బు రూపంలో దోచుకుంటున్నారని సీపీఐ (మావోయిస్టు) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంత కమిటీ జోనల్ సెక్రటరీ గణేశ్ పేరుతో విడుదలైన లేఖలో పేర్కొన్నారు. సదరు ఏజెంట్లు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం భద్రాచలంలోని పత్రిక కార్యాలయాల ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖలను కవర్లో పెట్టి విడిచి వెళ్లారు. లేఖలోని సారాంశం.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు పని కల్పిస్తామని వలస కార్మికులుగా మార్చి భద్రాచలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏజెంట్లుగా మారారని, ఈ ఆదివాసీలను పనులకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. వారి శ్రమను పెట్టుబడిగా మార్చుకొని ఈ ఐదుగురు వ్యక్తులు భద్రాచలంలో తమ ఆస్తులను విపరీతంగా పెంచుకుంటున్నారని, వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని తెలిపారు. అమాయక ఆదివాసీలకు కూలీ పనులు చూపెడతామంటూ ఇక్కడకి రప్పించి, వారిని పలు పనులకు గుండుగుత్తగా అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. ఆదివాసీలకు భాష రాకపోవడం, కూలీ పనులకు ఎంత సొమ్ము చెల్లిస్తారో తెలియకపోవడంతో ఈ ఐదుగురు ఏజెంట్లు పనికల్పించే వారితో కుమ్మక్కై వారికి చెల్లించే కూలీ సొమ్మును కూడా ఏజెంట్లే తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. కొన్ని సమయాల్లో కూలీ డబ్బులు అడిగితే ఈ ఆదివాసీ కూలీలను పశువుల కన్నా హీనంగా కొట్టి హింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఐదుగురు ఏజెంట్ల ఇంటి ఆవరణలో ఉన్న షెడ్లలో బంధించి సగం డబ్బులే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్, పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఈ ఐదుగురు ఏజెంట్లు రూ.కోట్లతో భవంతులు నిర్మించుకుంటున్నారని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘పరువు హత్యలపై చట్టం చేయాలి’
సాక్షి, చిత్తూరు : దళితుల పేరుతో ఓట్లు పొందిన వారు..ఇంతవరకు వారిని ఎందుకు చూడటం లేదని సీపీఐ(ఎం) కేంద్ర నాయకురాలు బృందా కారత్ మోదీ సర్కారును ప్రశ్నించారు. మంగళవారం పలమనేరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్క్రూటినీ లేకుండానే మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేసిందని విమర్శించారు. పరువు హత్యలపై తాను గతంలో ప్రైవేటు బిల్లు పెట్టినా.. ఇప్పటికీ చట్టం జరుగలేదని తెలిపారు. ఇందుకు గల కారణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని.. పరువు హత్యలపై కచ్చితంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం
సాక్షి, చర్ల: భద్రాచలం నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తమ అభ్యర్థిని గెలిపించాలంటే తమ అభ్యర్థినే గెలిపించాలంటూ రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. ఓ పక్క ఎండలు మండిస్తుండగా, మరో పక్క నేతలు ఎండను లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రస్తుతం కొనసాగిస్తున్న కల్యాణలక్ష్మి, మిషిన్ భగీరధ, మిషిన్ కాకతీయ, డబుల్బెడ్రూం ఇళ్లు, వ్యవసాయానికి పంట సాయం, ఆసరా పించన్లు తదితర సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తోంది. బీజేపీ కేంద్రంలో అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ పంపిణీ, పంటసాయం, ప్రదానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనా పథకం, ప్రదానమంత్రి సురక్షా యోజనా పథకం, దీన్ ధయాల్ ఉపాద్యాయ గ్రామ జ్యోతి యోజనా తదితర పథకాలను వివరిస్తూ బీజేపీ నాయకులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో పంట రుణాలను రద్దు చేస్తామని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ తదితర పథకాల గురించి ప్రచారం చేస్తూ ఉంటే వామపక్షాలు మాత్రం స్థానిక సమస్యలపై ఇప్పటి వరకు చేసిన పోరాటాలు, భవిష్యత్తులో చేపట్టబోయే పోరాటాల గురించి వివరిస్తూ గ్రామాల్లోకి దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న పార్టీలు ఓటర్లను పలు విధాలుగా ప్రసన్నం చేసుకునేందుకు ఈ క్రమంలో ప్రలోబాలకు గురి చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. -
వామపక్ష ఉద్యమ ప్రకాశం
వెబ్ ప్రత్యేకం : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ (సీపీఎం) ఉద్యమ నిర్మాణంలో ప్రకాశ్ కారత్‌ది కీలక పాత్ర. విద్యావంతుడిగా పేరొందిన కారత్.. కరడుగట్టిన మార్క్సిస్ట్ వాదిగా, విమర్శకుడిగా గుర్తింపుపొందారు. డెభై ఏళ్ల వయసులో కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ మార్క్సిస్ట్ సిద్ధాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బూర్జువా, ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికరంగాన్ని ఏకం చేయడం కోసం ఎర్రజెండా పట్టి వామపక్ష ఉద్యమానికి ప్రకాశ్ కారత్ ఊపిరిలూదారు. విద్యార్థి నాయకుడిగా మార్క్సిజంలోకి అడుగుపెట్టిన కరత్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి పార్టీలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో అసువులుబాసిన ఎందరో అమరవీరులు చూపిన బాటను అనుసరిస్తూ.. ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తూ పోరాడేతత్వం కారత్‌ది. ప్రముఖ మార్క్సిస్ట్ మహిళా నేత బృందా కారత్ను (1975)ను వివాహం చేసుకుని దంపతులిద్దరూ ప్రజాసమస్యలకై పోరాడుతున్నారు. కేవలం ప్రజా ఉద్యమాలతోనే కాక .. పదునైన రచనలతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని చరిత్రలోకి ఎక్కించారు కారత్. తానే స్వయంగా రచయితగా అవతారమెత్తి ఎన్నో పుస్తకాలను రచించి కమ్యూనిస్ట్‌ల ఔనత్యాన్ని ప్రపంచాన్నికి పరిచయం చేశారు. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉచ్చస్థితిలో ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో కమ్యూనిస్ట్‌ల ప్రాతినిథ్యం కోల్పోయే రెండు రకాల విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం కరత్కుంది. బూర్జువా పార్టీల ఆధిపత్యం ఓవైపు, దశాబ్దాల చరిత్రగల కమ్యూనిస్ట్ కంచుకోటలు బీటలు బారుతూ.. ఎర్రజెండా ఉద్యమాలు బలహీనపడుతున్న పరిస్థితి మరోవైపు. ఈ నేపథ్యంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రజెండాను ఎగరేసేందుకు సీనియర్ నేతగా ప్రకాశ్ ఏవిధంగా వ్యూహాలు రచిస్తారో వేచిచూడాలి. రాజకీయ నేపథ్యం ఐదు దశాబ్దాల ప్రజాజీవితంలో కమ్యూనిస్ట్‌గా అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మార్స్ సిద్ధాంతానికే కట్టుబడి నిలిచారు. దేశంలో పేరొందిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడిగా 1971లో మార్క్సిజంలోకి అడుగుపెట్టిన ప్రకాష్ కారత్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి వరకు ఎదిగారు. సీపీఎంకు చెందిన విద్యార్థి సంఘం సంస్థ ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వ్యవస్థాపకుల్లో ఇతను కూడా ఒక్కరు. మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ విధించిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడి.. ఏడాది పాటు అజ్ఞాతంలో గడిపాడు. జేఎన్‌యూలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు సీపీఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి, కమ్యూనిస్ట్ అగ్రనేత ఏకే గోపాలన్‌ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి ఆడుగుపెట్టారు. 1974-79 మధ్య విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అ తరువాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన కారత్ 1985లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులైన్నారు. 1992లో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పార్టీలో అనేక సంస్కరణలను అమలుచేసిన ప్రకాష్.. 2005లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2015 వరకు ఆ పదవిలో కొనసాగారు. ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో మార్స్సిస్ట్ పార్టీ అధికారంలో ఉండి.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బలంగా ఉంది. యూపీఏ-1 ప్రభుత్వంలో సీపీఎం ప్రధానమైన భాగస్వామి కావడంలో కేంద్ర ప్రభుత్వంలోను ఆయన చక్రం తిప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు సోమనాథ్ చటర్జీని లోక్‌సభ స్పీకర్‌గా సోనియా గాంధీ నియమించారు. అమెరికాతో న్యూక్లీయర్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకొచ్చి సంచలనం సృష్టించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 9 తొమ్మిది స్థానాల్లోనే విజయం సాధించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు సీపీఎంకు కంచుకోటాలా ఉన్న బెంగాల్లో ఈ నాయకత్వంలోనే దారుణ ఓటమి చవిచూసి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఆయన స్థానంలో సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత వారిద్దరి మధ్య విభేదాలు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఏచూరి, కరత్ మధ్య విభేదాలు పార్టీని రెండు వర్గాలుగా చీల్చే పరిస్థితి వరకు వెళ్లింది. కుటుంబ నేపథ్యం ప్రకాశ్ కరత్ 1948 ఫిబ్రవరి 8న బర్మాలో జన్మించారు. అనంతరం కేరళలో స్థిరపడ్డారు. తండ్రి బర్మా రైల్వేస్‌లో ఉద్యోగి. తన పాఠశాల విద్య అంతా మద్రాస్‌లో కొనసాగించారు. ఉన్నత విద్యవంతుడైన ప్రకాశ్ తనకు కాబోయే సహచరి కూడా తన ఆలోచనలకు దగ్గరగా ఉండాలని మొదటి నుంచి అనుకునే వారు. ఆ నేపథ్యంలో లండన్‌లో విద్యనభ్యసించిన సామాజిక కార్యకర్త బృందా కరత్‌ను 1975లో వివాహం చేసుకున్నారు. భర్త అడుగుజాడల్లోనే నేను కూడా అంటూ మార్స్సిస్ట్ ఉద్యమంలోకి ప్రవేశించారు బృందా. 2005లో బెంగాల్ నుంచి ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సీపీఎం పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. - సురేష్ అల్లిక -
కమ్యూనిస్ట్ (కలం) యోధుడు
సాక్షి వెబ్ ప్రత్యేకం : సీతారాం ఏచూరి... కమ్యూనిస్టు యోధుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి. పేరుకు సీతారాముడైనా మతతత్వంపై పరశురాముడిలా విరుచుకుపడుతుంటారు. బెంగాలీ, మలయాళం, తమిళం, పంజాబీ, ఉర్దూ, హిందీ, ఆంగ్లాలను అనర్గళంగా మాట్లాడే పదహారణాల తెలుగువాడు. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో గుర్తింపు పొందారు. కమ్యూనిస్టు అయినప్పటికీ తన ప్రసంగాల్లో భగవద్గీత, ఉపనిషత్తులు ప్రస్తావిస్తూ ఉంటారు. విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సీపీఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్న నాయకుడు సీతారం ఏచూరి. ప్రస్తుతం సీపీఎం పార్టీ దేశంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండటం, త్రిపురలోనూ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఏచూరికి ఈ పదవీ బాధ్యతలు పెద్ద సవాల్‌గానే ఉన్నాయి. అంతేకాకుండా.. కరత్, ఏచూరి మధ్య ఏర్పడిన భేదాభ్రిపాయాలు ఇటీవల తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో విద్యావంతుడైన ఏచూరి పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారో వేచిచూడాల్సిందే.. డాక్టరేట్ పూర్తి చేయలేక 1952 లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. సోమయాజీ ఆర్టీసీలో డివిజినల్ మేనేజర్‌గా పని చేసేవారు. సీతారం ఏచూరి విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. సీబీఎస్ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బీఏ (ఆనర్స్) ఆర్థికశాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975 లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీహెచ్‌డీలో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. సీమా చిస్తీని అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. గతంలో ఆమె బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్‌గా పనిచేశారు. వీరికి ముగ్గురు సంతానం. విద్యార్థి లీడర్ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా 1974 లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978 లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985 లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988 లో కేంద్ర కార్యవర్గంలో, 1999 లో పొలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005 లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015 లో విశాఖపట్నంలో జరిగిన 21 వ మహాసభలో మొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైయ్యారు. 2018లో హైదరాబాద్‌లో జరిగిన 22 వ మహాసభలో రెండో సారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చరిత్రలోనే.. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3 న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారి. ఇష్టాయిష్టాలు ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటారు. భగవద్గీతను, మహాభారతం లాంటి ఇతిహాసాలను చదివారు. టెన్నిస్ ఆట అంటే ఇష్టం. విద్యార్థి దశలో టెన్నిస్ ఆడేవారు.1968లో నిజాం కాలేజీ ఛాంపియన్‌ను కూడా. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్ టైమ్స్‌లో కాలమ్స్ రాస్తుంటారు. - ఆంజనేయులు శెట్టె -
ఆ రెండు పార్టీల పేర్లు మాత్రమే వేరు..
తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమలలో తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించడంలో పినరయ్ విజయన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కమ్యూనిస్టులది, కాంగ్రెస్ పార్టీది ఒకే రకమైన తత్వమని పేర్కొన్నారు. కమ్యూనిస్ట్‌లు భారతదేశ సంస్కృతిని, ఆధ్యాత్మిక సంప్రదాయాలను గౌరవించరని మండిపడ్డారు. అంతేకాక శబరిమల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే మాట మీద నిలబడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పార్లమెంట్లో ఒకలా.. పథనంథిట్టలో మరొకలా మాట్లాడతారని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పేర్లు మాత్రమే వేరు.. కానీ అవినీతి, కులతత్వం, మతతత్వం, కేరళ సాంస్కృతిక కల్పనను దెబ్బతీయడంలో రెండు ఒకేలా పని చేస్తాయని ఆరోపించారు. ఇవి రెండు పెద్ద అవకాశవాద పార్టీలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీజేఎస్‌కు సీట్లు ఖరారు చేసిన కాంగ్రెస్
-
వైఎస్ జగన్‌పై దాడి దుర్మార్గం : సీపీఎం మధు
-
వైఎస్ జగన్‌పై దాడి దుర్మార్గం : సీపీఎం మధు
సాక్షి, కడప : వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దాడి సంఘటనపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనలో సెక్కూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆ కత్తి ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. జగన్ అనుచరులే దాడి చేశారనటం చిత్రవిచిత్రంగా ఉందని అన్నారు. అభిమానులు కూడా నాయకులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ దాడిని సీపీఎం పూర్తిగా ఖండిస్తోందని అన్నారు. ప్రజాతంత్రవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. జగన్‌కు మరింత సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంఘటన జరిగిన కొద్ది సమయంలోనే అభిమాని అంటూ చెప్పడం విచారణ చేసే అధికారుల ఉత్సాహంపై నీళ్లు చల్లడమేనని మండిపడ్డారు. దాడిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలు ఉంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని అన్నారు. -
‘ఎస్పీ రాజకీయ నేతగా వ్యవహరించకూడదు’
-
‘ఎస్పీ రాజకీయ నేతగా వ్యవహరించకూడదు’
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రజల నుంచి దూరమవుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటం అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేరలేదనే సీఎం సభలో ముస్లిం యువకులు ప్రశ్నించారని పేర్కొన్నారు. ప్లకార్డులు చూపినందుకు నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టారు.. సీఎం సభలో జరిగిన దానిని వైఎస్సార్సీపీ కుట్ర అని చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎస్పీ ఒక అధికారిగా ఉండాలే కానీ.. రాజకీయ నేతగా కాదని అభిప్రాయపడ్డారు. అధికారులు ఇలా బరితెగించి మాట్లాడటం సరికాదని హితవుపలికారు. చంద్రబాబుది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై చంద్రబాబు సర్కార్ యుద్ధం చేస్తోందని మండిపడ్డారు. ఉండవల్లిలో రైతుల అనుమతి లేకుండా విద్యుత్ వైర్లు ఎలా వేస్తారని నిలదీశారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలను అడ్డుకున్న రైతులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో మైనార్టీలకు, గిరిజనులకు, దళితులకు భద్రత లేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా చంద్రబాబు చేసిన అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించేవారిని అరెస్ట్‌లు చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ వైఖరికి నిరసనగా బంద్‌కు సైతం పిలుపునిస్తామని తెలిపారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. -
సాధారణ వర్షాలకే ముంపుబారిన రాజధాని!
విజయవాడ: సాధారణ వర్షాలకే రాజధాని ప్రాంతాలైన విజయవాడ, అమరావతిలు ముంపుబారిన పడ్డాయని సీపీఎం నేత, సీఆర్డీఏ ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబూరావు అన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..నగరంలో వర్షాలకు 5 వేల ఇళ్లు ముంపునకు గురయ్యాయని తెలిపారు. రూ.461 కోట్లతో వర్షపు నీటి కాలువలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది..మరి భారీ వర్షానికి రోడ్లు జలమయం ఎలా అయ్యాయని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులు పొంగుతున్నాయని, సెక్రటేరియట్‌లోని మంత్రుల కార్యాలయాలు కూడా వర్షం ప్రభావానికి గురయ్యాయని వెల్లడించారు. అలాగే రాజధానిలో అనేక గ్రామాలు ముంపు బారిన పడ్డాయని, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. 60 మిల్లీమీటర్ల వర్షపాతానికే విజయవాడ నగరం ముంపునకు గురవుతోందని వ్యాఖ్యానించారు. 150 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన వర్షపు నీటి కాలువలను కుదించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే వర్షపు నీటి కాలువల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై తక్షణం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న జింఖానా గ్రౌండ్స్‌లో జనసేన, వామపక్షాల ఆధ్వర్యంలో నగర సమస్యలపై భారీ సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. -
బీజేపీపై ఈగ వాలకుండా చూసి..ఇప్పుడేమో
ఢిల్లీ: పీడీ ఖాతాల కుంభకోణంపై విచారణ జరిపించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్ల పాటు బీజేపీపై ఈగ వాలకుండా టీడీపీ చూసిందని..ఇప్పుడేమో అన్నింటికీ బీజేపీయే కారణమని అంటున్నదని విమర్శించారు. అధికారంలో ఉండి రెండు పార్టీలూ కీచులాడుతున్నాయని మండిపడ్డారు. ఇదేదో జీవీఎల్ నరసింహారావు, కుటుంబరావు మధ్య వ్యవహారం కాకూడదని, పీడీ ఖాతాలపై సీబీఐ విచారణ జరిగి తీరాల్సిందేనని పట్టుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో కాగ్ అనేక లోటుపాట్లను ఎత్తి చూపిందని వ్యాఖ్యానించారు. టీడీపీ రాష్ట్రంలోని గనులను దోచుకుని వచ్చే ఎన్నికలకు ఆదాయవనరుగా మార్చుకుందని విమర్శించారు. గనుల శాఖ దీనికి ఒక సాధనంగా మారిందని చెప్పారు. గనుల శాఖలో పూర్తి ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ గనుల తవ్వకానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గనుల్లో అనేక మంది కూలీలు బలవుతున్నా సర్కారు చోద్యం చూస్తోందని విమర్శించారు. విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పద్ధతుల ప్రకారం ఇసుక, గనులు దోచుకుంటున్నారని ఆరోపించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ మృతిపట్ల సీపీఎం ప్రగాఢ సంతాపం తెలియజేస్తోందని వెల్లడించారు. -
పోటీకి ‘ఫ్రంట్’
గతంలో ఒంటరిగా లేదా ప్రధాన పార్టీల కూటమి భాగస్వామిగా పోటీ చేసిన సీపీఎం వచ్చే సాధారణ ఎన్నికల్లో తానే సొంత కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట ఇప్పటికే ప్రజా సంఘాలు, చిన్నా చితకా పార్టీలతో జట్టు కట్టిన సీపీఎం, ఎన్నికల నాటికి భావసారూప్య పార్టీలకు చేరువ కావాలని భావిస్తోంది. పార్టీ పరంగా క్షేత్ర స్థాయిలో బలోపేతమవుతూనే, ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనుంది. పార్టీ అనుబంధ ప్రజా సంఘాల సభ్యులను ఓటు బ్యాంకుగా మా ర్చుకోవాలనే వ్యూహంతో పనిచేస్తోంది. అదే సమయంలో ప్రధాన పార్టీల్లోని అసంతృప్తులను ఎన్నికల నాటికి బీఎల్ఎఫ్ గొడు గు కిందకు తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సీపీఎం) వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించింది. గతంలో మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఐతో కలిసి ప్రధాన రాజకీయ పార్టీల కూటమి భాగస్వామిగా పోటీ చేసిన సీపీఎం వచ్చే ఎన్నికల్లో సొంతంగా ఏర్పాటు చేసే రాజకీయ కూటమికి నేతృత్వం వహించాలని నిర్ణయించింది. సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు మిత్ర పక్షం సీపీఐ.. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమితో జట్టు కట్టే అవకాశం ఉందని సీపీఎం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐతో సంబంధం లేకుండా వివిధ ప్రజా సంఘాలు, భావ స్వారూప్యత కలిగిన చిన్నా, చితకా పార్టీలతో కూటమిగా ఏర్పడాలని నిర్ణయించింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట ఇప్పటికే జిల్లాలో ఎంసీపీఐ, మహాజన సమాజ్‌పార్టీ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, మజ్లీస్ బచావో తహరీక్ (ఎంబీటీ) తదితర పార్టీలతో కలిసి పనిచేస్తోంది. వీటితో పాటు అంబేడ్కర్ భావజాల సంఘాలు, పలు ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు కూడా బీఎల్ఎఫ్లో భాగస్వామిగా ఉన్నాయి. ఎన్నికల నాటికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఏర్పాటయ్యే రాజకీయ పార్టీతోనూ కలిసి పనిచేయాలని భావిస్తోంది. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితితో కూడా రాజకీయ అవగాహన కోసం మంతనాలు జరుపుతోంది. మూడు స్థానాలపై ప్రత్యేక దృష్టి బీఎల్ఎఫ్ పక్షాన పూర్వపు మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు, అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను నిలపనుంది. పార్టీ పరంగా మాత్రం కేవలం మూడు అసెంబ్లీ స్థానాలపైనే దష్టి కేంద్రీకరించాలని సీపీఎం భావిస్తోంది. సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో పార్టీ సంస్థాగతంగా కొంత బలంగా ఉన్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో సంగారెడ్డి, పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని భారీ, మధ్య తరహా పరిశ్రమల ఎన్నికల్లో పార్టీ అనుబంధ కార్మిక విభాగం సీఐటీయూ వరుస విజయాలు సాధిస్తోంది. పార్టీ అనుబంధ సంఘాలు సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం తదితరాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరంగా సుమారు 1.50లక్షల మంది సభ్యులున్నారు. ఎన్నికల నాటికి అనుబంధ సంఘాల సభ్యుల ఓట్లను పార్టీ ఓటు బ్యాంకు మార్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పార్టీ సంస్థాగతంగా బలంగా లేని బీఎల్ఎఫ్ అభ్యర్థులను బరిలోకి దించాలనేది సీపీఎం వ్యూహంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 350 గ్రామ కమిటీలను ఏర్పాటు చేసింది. మండల, నియోజకవర్గాల కమిటీల నిర్మాణంపై కసరత్తు చేస్తోంది. అసంతృప్తులపైనా వల ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, క్రియాశీల కార్యకర్తలు సీపీఎంలో ఇమడలేరనే భావనను తొలగించాలని సీపీఎం భావిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో రాజకీయ అవకాశం దక్కని అసంతృప్త నేతలను ఎన్నికల నాటికి బీఎల్ఎఫ్ కూటమి గొడుగు కిందికి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలతో పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం మంతనాలు సాగిస్తోంది. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో ప్రధాన పార్టీలకు చెందిన ఎనిమిది మంది ముఖ్య నేతలు, టికెట్ దక్కని పక్షంలో బీఎల్ఎఫ్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు సీపీఎం లెక్కలు వేస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఎన్నికల నాటికి రాజకీయ వేడిని పెంచేందుకు పార్టీ పరంగా, బీఎల్ఎఫ్ ద్వారా ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సీపీఎం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాట అటుంచి, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగాలన్నదే తమ ప్రయత్నమని పార్టీ ముఖ్య నేత ఒకరు చేసిన వ్యాఖ్య పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది. -
లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్య పరిస్థితి విషమం
కోల్కత్తా : లోక్‌సభ మాజీ స్పీకర్, సీపీఎం సీనియర్ నేత సోమనాథ్ చటర్జీ (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్ని సంబంధిత వ్యాధితో భాదపడుతున్న ఆయనను కోల్‌కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమ్‌నాథ్‌కు డయాలసిస్ నిర్వహించడంతో పాటు వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నామని ఆదివారం వైద్యులు పేర్కొన్నారు. బెంగాల్ నుంచి సీపీఎం తరుఫున పదిసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. యూపీఏ-1 ప్రభుత్వంలో 2004-2009 మధ్య కాలంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. ఆయన 1971 నుంచి 2009 వరకు ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కేవలం ఒక్కసారి మాత్రమే 1984 ఎన్నికల్లో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సీపీఎంలో చేరిన సోమనాథ్ 2008 వరకు ఆ పార్టీలో కొనసాగారు. అయితే 2008లో యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించుకున్నప్పటీకి స్పీకర్‌గా కొనసాగడంతో పార్టీలో నుంచి బహిష్కరించారు. -
వెలిగొండను విస్మరించింది చంద్రబాబు సర్కారే
యర్రగొండపాలెం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2008 నాటికే, పూర్తి చేయాల్సి ఉన్నా తట్టెడు మట్టి కూడా తవ్వకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టును విస్మరించిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఆరోపించారు. 2014లో మళ్లీ అధికారంలో కొచ్చిన చంద్రబాబు ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది మేమే, పూర్తి చేసేది మేమే అంటూ ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా, వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, సీపీఎం పశ్చిమ ప్రకాశం కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేడ్కర్ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ గద్దెనెక్కిన నాలుగేళ్ల కాలంలో కేవలం 4 కి.మీ, కూడా సొరంగ మార్గం పూర్తి కాలేదన్నారు. ఒక వైపు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో అర్ధం కాక ప్రజలు ఆందోళన చెందుతుంటే, సీఎం చంద్రబాబు 2019 సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి, సాగు నీరందిస్తామని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రాజక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.200 కోట్లు కేటాయించి సంక్రాంతి నాటికి ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని, చంద్రబాబుకు ఏమైనా మలయాళీ మంత్రాలు వచ్చా అని ఎద్దేవా చేశారు. ఇది కేవలం ప్రజలను మోసగించడమేనని ఆరోపించారు. దీనిని తాము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. సంక్రాంతికి నీరిస్తారా, లేకుంటే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. మాటలు చెప్పడం కాదు, ప్రాజెక్టును పూర్తి చేసి చూపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వస్తే వర్షాలకు కరువే.. టీడీపీ అధికారంలో కొస్తే వర్షాలు కురవవని ప్రజల్లో గట్టి నమ్మకం ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ఈ నాలుగేళ్లలో సరైన వర్షాలు కురవలేదన్నారు. ఫలితంగా పంటలు పండక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ఏటా కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారే తప్ప, కరువు సాయం అందడం లేదని విమర్శించారు. జిల్లాలో 56 మండలాలు ఉండగా, ఈ యేడాది 40 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో త్రిపురాంతకం మినహా 4 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించక పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రాంతంలో కరువు అధికారులకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. 4, 5 విడతల రుణమాఫీని కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు గుమ్మా బాలనాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గాలి వెంకటరామిరెడ్డి, పీవీ శేషయ్య, డి.సోమయ్య, కార్యవర్గ సభ్యులు డీఎంకే రఫీ, కె.కళావతి, దాసర్రెడ్డి, రూబేను, ఆవులయ్య, ఏరియా నాయకులు షేక్ వలీసాహెబ్, అమీర్‌బాషా, కందుల ప్రభాకర్, కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరేబీయన్ లీగ్‌లో కింగ్ ఖాన్ చిందులు!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సందడి చేశారు. శుక్రవారం జమైకా తలవాస్‌తో జరగిన మ్యాచ్‌కు షారుఖ్ హాజరై తన జట్టు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్(టీకేఆర్)కు మద్దతు తెలిపాడు. ఇక మ్యాచ్‌కు ముందు చీర్ గర్ల్స్‌తో కలిసి మైదానంలో చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సీపీఎల్ తమ అధికారిక ట్విటర్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక షారుఖ్ ఉత్సాహాన్ని జమైకా తలవాస్ సారథి ఆండ్రూ రస్సెల్ ఆవిరి చేశాడు. భారీ లక్ష్యం నిర్దేశించిన తమ జట్టు గెలుస్తుందని భావించిన షారుఖ్‌కు నిరాశే ఎదురైంది. రస్సెల్ ఆల్‌రౌండ్ షోతో షారుఖ్ టీమ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. ఇక ఐపీఎల్లో రస్సెల్ షారుఖ్ జట్టు కోల్‌కతా నైటరైడర్స్ అన్న విషయం తెలిసిందే. ❤❤😘😘😘😍 #cpl18 #biggestpartyinsport @iamsrk pic.twitter.com/eA7VPFbKuq — CPL T20 (@CPL) August 11, 2018 టీకేఆర్ ప్రమోషనల్ సాంగ్.. ఇక తమ జట్టు ప్రచార సాంగ్‌ను బ్రావో తన ట్విటర్ వేదికగా విడుదల చేశారు. టీకేఆర్ ప్రమోషన్ సాంగ్‌ను విడుదల చేస్తున్నానని, ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్‌కు ధన్యవాదాలంటూ బ్రావో ట్విట్ చేశాడు. ఇక ఈ ప్రమోషన్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. (చదవండి: ఆండ్రూ రస్సెల్ అద్భుత రికార్డు!) -
వ్యభిచార దందాలపై చర్యలు తీసుకోండి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో జరుగుతున్న వ్యభిచార దందా, అకృత్యాలపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వీటికి కారణమైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. యాదాద్రిలో వెలుగుచూస్తున్న విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని.. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి, వ్యభిచార కేంద్రాలకు అమ్మడం, వారికి పశువులకు వాడే ఇంజెక్షన్లు ఇవ్వడం చాలా దారుణమని పేర్కొన్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. యాదగిరిగుట్టలో సుమారు 100కు పైగా కుటుంబాలు వ్యభిచార వృత్తిలో ఉన్నాయని వెల్లడించారు. వ్యభిచార గృహాల నిర్వాహకులకు రాజకీయ నేతల అండదండలుండటం, పోలీసులకు ప్రతీ నెలా మామూళ్లు అందుతుండటంతోనే ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. -
వామపక్షాల దారి ఎటు?
తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి, అశ్రిత పక్షపాతం, అహంకార ధోరణులపై నేడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పడే ఓట్లు చీలిపోవాలని బాబు కోరుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం మాటలతో గందరగోళ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు చిక్కుకుని చివరికి తమతో చేతులు కలుపుతారేమోనన్న ఆశ బాబులో ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గతంలో అవసరం తీరాక మిత్రపక్షాలతో టీడీపీ వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్షాలు ఏపీలో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభు త్వాన్ని ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా వామపక్షాలు భావిస్తున్నాయి. ఆ కర్తవ్య నిర్వహణకు కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఏ కూట మిలోనూ ఎన్నికల ముందు చేరడానికి తాము సిద్ధంగా లేమని సీపీఎం స్పష్టం చేసింది. ఎన్నికల తర్వాతే వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రత్యేక పరిస్థితులను బట్టి ఏర్పడే వివిధ పార్టీలకు వచ్చే సీట్లను బట్టి ప్రభుత్వాన్ని ఎవరితో కలసి ఏర్పాటు చేయాలో నిర్ణ యిస్తామని ఈ పార్టీ తెలిపింది. కాంగ్రెస్‌ను, బీజేపీని ఒకే గాటిన కట్టేందుకు సీపీఐ సిద్ధంగా లేదు. తమ వ్యూహానికి అనుగుణంగా ఎన్నికల పొత్తులు నిర్ణ యించుకునే స్వేచ్ఛను పార్టీ శాఖలకు సీపీఎం ఇచ్చింది. జలంధర్‌లో 1978లో జరిగిన పదో జాతీయ మహాసభల సందర్భంగా సీపీఎం వ్యవ స్థాపక ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య కూడా ఇలాంటి సూచన చేశారు. ఆయన ప్రతిపాదన అప్పట్లో వీగిపోయింది. నాటి సుందరయ్య సూచన ఆచరణాత్మక రూపం దాల్చేందుకు నేటి సీపీఎం వైఖరి కొంతవరకు దోహదం పడుతోందని ఆశిం చవచ్చు. ఈ నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాన్న ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలో సీపీఎం ఓ చరిత్రాత్మక ప్రయో గానికి రెండు సంవత్సరాల ముందే స్వీకారం చుట్టింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఉధృతంగా సాగుతున్నప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వం సూచిం చిన సమైక్య విధానంతో తెలంగాణ ప్రజల మనోభా వాలకు భిన్నంగా వ్యవహరించింది. అంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోనే కొంత బలం కలిగిన పార్టీగా ఉన్న∙సీపీఎం ప్రజలకు దూరమైంది. తిరిగి తెలంగాణ ప్రజలతో మమేక మయ్యే అవకాశం కోసం ఎంతగానో ప్రయత్నిం చింది. ఇందులో భాగంగా ‘బహుజన వామపక్ష సంఘటన’ ఆవిర్భావంలో ప్రధాన పాత్ర వహిం చింది. హైదరాబాద్‌లో ‘లాల్–నీల్’ ఐక్యత నినాదం మొదటిసారి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హైదరాబాద్‌లో ప్రకటించారు. నిజానికి ఎన్నికల్లో కూడా బహుజన, వామపక్ష సంఘటన పేరుతో పాల్గొనాలని నిర్ణయించింది. దళిత, ఆది వాసీ, నేత, గీత తదితర వృత్తుల వారికి తగినన్ని స్థానాలను సైతం కేటాయిస్తామని ప్రకటించింది. సీపీఎం కృషి అభినందనీయమే కాక అనుసరణీయం కూడా. దేశంలో మార్కిజాన్ని అనుసరించాలంటే శ్రామికవర్గ పోరాట మార్గమే సరిపోదు. పార్టీ నేతలు పుట్టుకతో వచ్చిన వర్గ దృక్పథాన్ని వదిలించుకోవ డమే కాదు, ఆధిపత్య కుల అహంకారాన్ని విడి చిపెట్టడం కూడా అవసరం. బాబు పాలనకు ముగింపే ప్రధాన కర్తవ్యం నేటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో కంటే మరీ అధ్వానంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రలో బీజేపీని ఓడించడమన్నది అంత ముఖ్యమైన అంశం కాదు. సీఎం బాబు నాయ కత్వంలోని టీడీపీ పాలన నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పురోగతి, శాంతి సౌభాగ్యాలకు ప్రధమ శత్రువు. కనుక వామపక్షాల కర్తవ్యం తెలుగుదేశం పార్టీని ఓడించడమే. పైగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాల నను వ్యతిరేకిస్తున్నట్టు చంద్రబాబు చెబుతున్నారు. నరేంద్ర మోదీకి నాలుగేళ్లు సాగిలపడిన తెలుగుదేశం బూటకాన్ని తెలుగు ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. అలాగే పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ అమలు వంటి మోదీ ప్రజా వ్యతిరేక చర్యలను వేనోళ్ల పొగిడింది చంద్ర బాబు అన్న సంగతి కూడా ప్రజలకు గుర్తుంది. ఇప్పుడు మోదీపై లాలూచీ కుస్తీకి చంద్రబాబు తెర తీశారు. ఈ పరిస్థితుల్లో బాబు టీడీపీ పాలనకు చర మగీతం పాడటం రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన తక్షణ కర్తవ్యం. ఇదే నేడు ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూ నిస్టులు గుర్తించాల్సిన వాస్తవం. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు– ఇదీ చంద్ర బాబు నైజం. తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవ నినాదం అందించి, అంతవరకు ఓటమెరుగని కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించిన ఎన్టీఆర్ చంద్రబాబుకు పిల్లనిచ్చి, రాజకీయ పునర్జన్మ కూడా ప్రసాదించారు. పదవీ వ్యామోహంతో బాబు ఎన్టీఆర్‌నే పదవీచ్యుతుడ్ని చేసిన విషయం మరచిపోలేము. ఆ విషయం నేటి తరం యువతకు కూడా నిరంతరం గుర్తు చేయాలి. గెలుపుపై ధీమా లేకనే బీజేపీతో బాబు పొత్తు! 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీపై తెలుగుదేశం ఒంట రిగా పోటీచేసి విజయం సాధించగలదనే నమ్మకం లేకనే చంద్రబాబు అప్పటికే వీస్తున్న మోదీ హవాను వాడుకోవాలనుకున్నారు. వెంటనే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అంతకు ముందు 1999, 2004లో కూడా ఏబీ వాజ్పాయ్ ప్రధానిగా ఉండగా బీజేపీతో చేతులు కలిపారు. 2004లో పరాజయంతో ఇక ఎన్న టికీ బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రశ్నే లేదని ప్రకటిం చారు. కాని ఒట్టు తీసి గట్టున పెట్టి 2014లో ప్రధాన మంత్రి పదవికి బీజేపీ అభ్యర్థి మోదీ అండతోనే ఎన్ని కల్లో పాల్గొన్నారు. అయినా ఆంధ్రలో బీజేపీ బలం సరిపోదని భావించి, సినీ హీరో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ తనకు మద్దతు ఇవ్వమని అర్థిం చారు. అయితే అందుకు బదులు జనసేనకు రాజ్య సభ సీటు ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఈ విషయం ఇటీవలే పవన్ కల్యాణ్ స్వయంగా ప్రక టించారు. ఇలా మాట తప్పడం, తప్పుడు వాగ్దా నాలతో ‘పోయేదేముంది మాటే కదా.. వచ్చేది పదవి కదా’ అనే ధోరణి చంద్రబాబుది. అప్పటికి తెలుగు దేశం అధినేత నైజం తెలియని పవన్ ఎన్నికల్లో తెలు గుదేశం పార్టీకి సహకరించారు. నిజానికి నాడు తెలుగుదేశం పార్టీకి ఈ సహకారమే లేకపోతే ఆ ఎన్నికల్లో ఓడిపోయేది. ఇక చంద్రబాబు మోసానికి బలైన పార్టీల్లో వామపక్ష పార్టీలూ ఉన్నాయి. 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుడ్ని చేసిన చంద్రబాబు దొడ్డిదారిన ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు వామపక్షాలు అండగా ఉన్నాయి. ఆ తర్వాత కొంత కాలానికి ఇదే ముఖ్యమంత్రి కమ్యూనిస్టు పార్టీలకు కాలంచెల్లిందని హేళన చేశారు. అయినా 2009లో మళ్లీ ఆ కమ్యూనిస్టుల వద్దకే వెళ్లి మహా కూటమిలో చేరాలని చంద్రబాబు అభ్యర్థించారు. అందుకు రెండు కమ్యూనిస్ట్ పార్టీలూ అంగీకరించి మహాకూట మిలో చేరినా ఫలం దక్కలేదు. ఎంతో అనుభవ మున్న కమ్యూనిస్టులు ఎలా చంద్రబాబు బుట్టలో పడ్డారో తెలియదు. 2014లో చంద్రబాబు మళ్లీ బీజేపీతో చేతులు కలిపి అధికారం సంపాదించారు. ఇలాంటి చంద్రబాబుతో గతంలో పొత్తు పెట్టుకో వడం, ఎన్నికల్లో చేతులు కలపడం పొరపాటని కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతవరకు బహిరంగ ఆత్మ విమర్శ చేసుకోలేదు. కాపులకు ద్రోహం చేసింది ఎవరు? వామపక్షాలు పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపి, తృతీ యఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీపీఎం నేత బీబీ రాఘవులు చెప్పారు. చంద్రబాబు మాది రిగా ఓట్ల కోసం వైఎస్ఆర్సీపీ ప్రజలను వంచిం చడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల అమలుకు కేంద్రంలో ఏ పార్టీ కృషి చేస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు ఇస్తామని ఈ పార్టీ గతంలోనే స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు కార ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము అంతకు మించి ప్రస్తుత రిజర్వేషన్ల అమలు చేయడం సాధ్యం కాదు కనుక చంద్రబాబులా ఓట్ల కోసం రిజర్వేషన్లు వచ్చేలా చూస్తామని చెప్పలేనని వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. అంటే కాపు లను గాలికొదిలేశారని కాదు. వారికి తమ పరిధిలో ఎంత ఎక్కువ మేలు చేయగలనో అంత ఎక్కువగా చేస్తానని, కాపు కార్పొరేషన్‌కు నిధులు రెట్టింపు చేసి, కాపుల సంక్షేమానికి కృషిచేస్తానని కూడా చెప్పారు. నాలుగేళ్ల పాటు తానిచ్చిన కాపు రిజర్వేషన్ హామీని తుంగలో తొక్కిన తెలుగుదేశం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఇలాంటి స్వభావం వైఎస్ఆర్సీపీది కాదు. అమలు చేయగలిగితేనే హామీ ఇవ్వాలి. వాగ్దానం చేశాక నిలబెట్టుకోవాలి. కాపు లకు మేలు జరిగే పోరాటానికి తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని వైఎస్ఆర్సీపీ హామీ ఇస్తూనే ఉంది. 2014లో చంద్రబాబు అవకాశవాద రాజకీయా లను మరోసారి ఆచరణలో అమలు చేసి విజయం సాధించారు. బీజేపీతో పొత్తుపెట్టుకుని, జనసేన మద్దతు తీసుకుని అధికారంలోకి వచ్చారు. ఈసారి ఈ తరహా రాజకీయ ఎత్తుగడలు చంద్రబాబుకు సాధ్యపడకపోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం అవి నీతి, అశ్రిత పక్షపాతం, అహంకార, ఆధిపత్య ధోర ణులపై నేడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. పైగా బాబుది మాటల గారడీయేగాని ఆయన కార్య శూరుడు కాదన్న భావన కూడా ఈ నాలుగేళ్లలో బలపడింది. అందుకే తెలుగుదేశం పార్టీకి వ్యతి రేకంగా పడే ఓట్లు చీలిపోవాలని చంద్రబాబు కోరు కుంటున్నారు. కిందటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ లకు ఆంధ్రప్రదేశ్‌లో సీట్లేమీ రాని మాట నిజమే. అయితే, ఇంకా వామపక్షాలకు ప్రజల్లో ఎంత లేదన్నా ఇంగువ కట్టిన గుడ్డ మాదిరిగా పేరు ప్రతిష్ట లున్నాయి. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర ప్రత్యా మ్నాయం మాటలతో గందరగోళ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు చిక్కుకుని చివరికి తమతో చేతులు కలుపుతారేమోనన్న ఆశ చంద్రబాబులో ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది జరగని పక్షంలో ఎన్నో కూటములు, పార్టీలు ఎన్ని కల్లో పోటీ చేస్తే తన వ్యతిరేక ఓట్లు చీలిపోయి తెలు గుదేశం విజయం సాధిస్తుందని ఆయన భావిస్తు న్నారు. ఏదో దింపుడు కళ్లెం ఆశ చంద్రబాబులో ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో అవసరం తీరాక మిత్ర పక్షాలతో తెలుగుదేశం వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్షాలు ఏపీలో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి చేతులు కలపాల్సిన సమయం ఆస న్నమైంది. వ్యాసకర్త: డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
విజయవాడను ముజ్రా పార్టీలకు అడ్డా చేశారు!
సాక్షి, విజయవాడ: టీడీపీ సర్కారుపై కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం) తీవ్ర విమర్శలు చేసింది. విజయవాడలో 3,774 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతికి, భూ కబ్జాలకు విజయవాడను అడ్డాగా మార్చారని విమర్శించారు. ఎంతో గొప్ప పేరున్న నగరాన్ని కాల్‌మనీ, ముజ్రా డ్యాన్స్‌లతో టీడీపీ నేతలు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పరిష్కారించాల్సిందిపోయి సొంత సంపాదనకే టీడీపీ నేతలు పరిమితమయ్యారంటూ నిరసనలు చేపట్టారు. -
గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం: తమ్మినేని
మహేశ్వరం: రాష్ట్రంలో బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ప్రంట్) అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అగ్రకులాల్లోని ధనవంతులే దేశాన్ని పాలించారని, 93 శాతం ఉన్న బహుజన వర్గం నుంచి ముఖ్యమంత్రిని చేసి చూపుతామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణలో బహుజన ప్రభుత్వం వివిధ పార్టీల వైఖరి పాత్ర అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగిం ది. సదస్సులో తమ్మినేని మాట్లాడుతూ.. బీఎల్ఎఫ్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో బహుజన భోజనశాల పెట్టి రూ.5కే పేదలకు భోజనం పెడుతుందని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కులా లు, మతాల పేరుతో విభజించి నియంత పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో టీమాస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు జేబి రాజు, రాష్ట్ర నాయకుడు భూపాల్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ సభ్యుడు అలువాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ప్రజాక్షేత్రంలోకి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఎన్నికల నాటికి ఆయా పార్టీలు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంతో పాటు తమ కు పట్టున్న ప్రాంతాల్లో మరింత బలపడేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌లవారీగా కమిటీలు వేసే ప్రక్రియను ప్రారంభించగా.. ప్రతి కార్యకర్తను శక్తియాప్ ద్వారా పార్టీకి అనుసంధానం చేసే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. ఇక సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీడీపీ సైతం క్షేత్రస్థాయి పర్యటనలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. జిల్లాలో బీజేపీ సైతం తమ కార్యకలాపాలను వేగవంతం చేయడంతోపాటు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను నియమించడంతో ఆ పార్టీ వర్గాల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించింది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు, పది శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా తమ సత్తా నిరూపించుకునేందుకు, జిల్లాలో వైఎస్ ప్రభంజనాన్ని మరోసారి చాటిచెప్పేందుకు కార్యాచరణ రూపొందించుకుంది. ఇటు ఖమ్మం.. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడమే కాకుండా.. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా జిల్లా ప్రజలకు కలిగిన ప్రయోజనం, వైఎస్ పట్ల వారికి గల అభిమానాన్ని పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జిల్లాలో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన రాష్ట్రస్థాయి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు వేర్వేరుగా టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలో టీఆర్ఎస్ను బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ ఇప్పటికే ఒకవైపు అభివృద్ధి పనుల మంజూరు.. చేసిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే విధంగా ప్రచారం నిర్వహించేందుకు బహుముఖ వ్యూహం రూపొందించుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడం.. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో, మంత్రి తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయిలో విస్తృతంగా పర్యటించడం ద్వారా రాజకీయంగా పట్టు సాధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక టీడీపీ జిల్లాలో తన ఉనికి చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. ఆ పార్టీ ఎన్నికల పొత్తుపైనే ప్రధానంగా ఆధారపడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. వచ్చే ఎన్నికల్లో తమ భవిష్యత్ ఏమిటనే అంశం ద్వితీయ శ్రేణి నాయకుల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఇక సీపీఎం, సీపీఐలు పలు అంశాలపై ఉద్యమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో నిలిచేం దుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. కాంగ్రెస్‌లో వర్గపోరు కారణంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తోంది. పార్టీలో నూతనోత్తేజం నింపడానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ జిల్లాలో పర్యటించి.. పార్టీ శ్రేణులను ఏకం చేసే ప్రయత్నం చేసినా వర్గపోరు మూడు గ్రూపులు.. ఆరు వర్గాలుగా విరాజిల్లుతూనే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం నియోజకవర్గాలపై దృష్టి సారించి.. క్షేత్రస్థాయిలో రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీ కార్యకలాపాలు.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజా మద్దతు సమీకరించడం, పలు రూపాల్లో ఆందోళనలు చేయడం ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో వేగిరపరిచింది. దళితులకు మూడెకరాల భూమి, రైతులకు వ్యవసాయ ట్రాక్టర్ల మంజూరు.. డబుల్ బెడ్రూం ఇళ్లు అర్హులందరికీ అందకపోవడం వంటి అంశాలపై దీర్ఘకాలిక ఆందోళనలు నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం వైఎస్సార్ సీపీ వేర్వేరు జిల్లా కమిటీలను రాష్ట్ర పార్టీ ఇదివరకే నియమించింది. జిల్లా రాజకీయ కార్యకలాపాలపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ ప్రపుల్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలను పరిశీలించడం, కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేయడంతోపాటు రెండు జిల్లాల అధ్యక్షులతో కలిసి పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా లక్కినేని సుధీర్‌బాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కొల్లు వెంకటరెడ్డి ఆయా జిల్లాల్లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపట్టడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుని.. ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలను, పార్టీ కోసం నిరంతరం శ్రమించే నాయకులను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులు అన్ని పార్టీల్లో ఉండడం.. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు వైఎస్సార్ సీపీ పోటీ చేయడం వల్ల ఇబ్బంది తప్పదన్న రాజకీయ విశ్లేషణతో పార్టీ ముందుకెళ్తోంది. కొత్త ప్రాంతాల్లో పార్టీని విస్తరింపజేసేలా కృషి చేస్తోంది. ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టేందుకు పలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తోంది. ఖమ్మం జిల్లాలో రైతులకు పలు రకాలుగా జరిగిన అన్యాయం, నష్టాలపై గళమెత్తిన ఆ పార్టీ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఇతర పక్షాలతో కలిసి అఖిలపక్షంగా ఏర్పడి రైతు సమస్యలపై పోరాడటమే కాకుండా.. ప్రభుత్వం స్పందించేలా ఆందోళనలు చేపట్టింది. విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రత్యేక ఆందోళనలు నిర్వహించేం దుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఆందోళన నిర్వహించిన పార్టీ.. ఈనెల 8 నుంచి నిరుద్యోగ యువకుల నుంచి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి నిరుద్యోగుల గోడు వినిపించేలా కార్యాచరణ రూపొందించింది. హామీల వైఫల్యాలే ఆయుధంగా పోరాడుతాం ఎన్నికల ముందు కేసీఆర్ గుప్పించిన హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇప్పటికే మం డల, జిల్లా స్థాయిల్లో ఉద్యమాలు చేశాం. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు బస్సుయాత్ర కూడా చేపట్టబోతున్నాం. వైఎస్ఆర్ పాలన, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో అభిమానం చెక్కు చెదరలేదు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మండల, బూత్‌స్థాయిల్లో కమిటీలు వేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. -కొల్లు వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు -
క్వారీ వద్ద పోలీసుల అత్యుత్సాహం
కర్నూలు జిల్లా: హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనాస్థలి వద్ద పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. సంఘటనాస్థలాన్ని సందర్శించడానికి వచ్చిన బీజేపీ, వామపక్షాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల తీరును తప్పుపట్టారు. టీడీపీ నాయకుడు శ్రీనివాసుల చౌదరీకి సంబంధించిన క్వారీ కాబట్టే వారిని తప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఘటనకు కారకులైన టీడీపీ నాయకులతో పాటు సంబంధిత అధికారులు కూడా బాధ్యత వహించాలన్నారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ ప్రమాదాన్ని నిరసిస్తూ విజయవాడలో సీఐటీయూ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ అండతోనే యధేచ్ఛగా అక్రమంగా క్వారీలు తవ్వుకుంటున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఆర్ధికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు. -
క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్
విజయవాడ: కర్నూలు జిల్లా క్వారీ పేలుడు ఘటనపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు స్పందించారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆలూరు మండలం హత్తిబెళగల్ కొండ క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్ జరుగుతుందని, ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పెడచెవిన పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. వీటిని టీడీపీ ప్రభుత్వ హత్యలుగా భావించాలని పేర్కొన్నారు. కార్మికులకు భద్రతా చర్యలు లేవని, లేబర్ డిపార్ట్‌మెంట్‌పై కేసులు పెట్టకుండా ఉండాలన్నదే టీడీపీ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వలస కూలీలకు సంబంధించి లేబర్ రూల్ ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తే కార్మిక శాఖ రిజిస్టర్లో నమోదు చేయాలి..కార్మికులు ఏ కంపెనీలో పని చేస్తారో ఆ కంపెనీ రిజిస్టర్లో కూడా నమోదు చేయాలి..కానీ అలా చేయడం లేదని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ప్రజలకు రక్షణ లేకుండా చేస్తోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చట్టాలపై పునరాలోచన చేయాలని సూచించారు. గ్రామదర్శిని టీడీపీ ప్రచార కార్యక్రమంలా మారిందని, అది ఒట్టి బోగస్ కార్యక్రమమని విమర్శించారు. క్వారీ ఘటనపై అన్ని రాజకీయపక్షాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. విద్యార్థులపై దాడులు, నాయకుల అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయ్. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. నెల్లూరు జిల్లా రాపూర్‌లో వామపక్షాలు పర్యటిస్తాయి. దళితులు, విద్యార్థులు, కార్మికుల రక్షణ కోరుతూ సెప్టెంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నా’ మని వెల్లడించారు. -
ఆగస్టు 9న బంద్‌కు సీపీఎం మద్దతు: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే చర్యలకు వ్యతిరేకంగా భారత్ అంబేడ్కర్ మహాసభ పిలుపిచ్చిన ఆగస్టు 9న బంద్‌కు సీపీఎం మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో తెలిపారు. 70 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా కుల వివక్ష, అంటరానితనం యథేచ్ఛగా కొనసాగటం సభ్య సమాజానికి మాయని మచ్చగా ఉందన్నారు. దేశవ్యాప్త నిరసనల తర్వాత కేంద్రం ఆలస్యంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో గోరక్షక దళాల ముసుగులో అరాచక శక్తుల దాడులు, దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. దళిత సమస్యలపై జరుగుతున్న బంద్‌కు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. -
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాల్సిందే
నిజామాబాద్‌నాగారం: తెలంగాణ వచ్చాక కేసీఆ ర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితకు పదవులొచ్చాయి తప్ప ప్రజల బతుకులు మారలేదని టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ‘బహుజనుల రాజ్యాధికారం– ఓటర్ పాత్ర రాజకీయ పార్టీల వైఖరి’ అంశంపై జిల్లా కేంద్రంలోని లక్ష్మీకళ్యాణ మండపంలో టీమాస్ జిల్లా కన్వీనర్ పెద్ది వెంకట్రాములు అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల బతుకులు మార్చలేని సీఎం కేసీఆర్‌ను మార్చాల ని పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికారానికి ఓటే మార్గమని, వచ్చే ఎన్నికల్లో బహుజనుల బలం చూపించాలన్నారు. టీఆర్ఎస్ హయాంలో పేదలకు న్యాయం జరగలేదని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. త్వరలో బహుజన క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో భూ కబ్జాదారుల చెరలో ఉన్న భూములు కక్కిస్తామని, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే లా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. గుడిసెలు వేసుకొని పట్టాలు వచ్చే వరకు పేదల తరపున సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. బీఎల్ఎఫ్ను బలపరిచేందుకు ముందుకొచ్చే డ్వాక్రా సంఘాల మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి ఓటే బలమైన ఆయుధమని, ఇది ఏకే–47 కంటే శక్తివంతమైందని టీమాస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాజు పేర్కొన్నారు. వివిధ పార్టీలు, సంఘాల నేతలు ప్రభాకర్, దండివెంకట్, సాయిబాబా, ఉప్పు సంతోష్, భూపాల్, ప్రకాశ్, పాలడుగు భాస్కర్, రమేశ్‌బాబు, నూర్జహాన్, మాల్యాల గోవర్ధన్, సాజుద్దిన్, మార్టిన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
సెగ రగిలింది..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికలకు సమయం ఉన్నా.. జిల్లాలో మాత్రం రాజకీయ సెగ ప్రారంభమైంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఆయా రాష్ట్ర పార్టీల సూచన మేరకు పలు పార్టీలు తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభమైన సందడితో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు గుర్రాల కోసం.. పూర్వ వైభవం కోసం.. సత్తా చాటేందుకు ఎవరికి వారే వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ సైతం వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు తాపత్రయ పడుతోంది. కాంగ్రెస్ వంటి పార్టీలతో ఎన్నికల పొత్తే మేలన్న భావనతో పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలో బలమైన రాజకీయ పక్షాలుగా పేరున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈసారి ఎన్నికల్లో ఎటువంటి వ్యూహం రచిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు వేర్వేరు పార్టీల మద్దతుతో జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగగా.. ఈసారి కూడా అదే పరిస్థితి ఆవిష్కృతమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీపీఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) కూటమితో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుండగా.. సీపీఐ.. కాంగ్రెస్‌తో మరోసారి ఎన్నికల మైత్రి కొనసాగించే అవకాశం ఉన్నట్లు ప్రచారమవుతోంది. దీంతో కాంగ్రెస్ తరఫున కొత్తగూడెం నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ కలుగుతోంది. ఎన్నికల పొత్తులో ఏ నియోజకవర్గం ఎటువైపు వెళ్తుందో అనే అంశం ఒక పట్టాన తేలకపోవడంతో ఆయా నియోజకవర్గాలపై తమ పట్టు సడలకుండా పార్టీ కార్యకలాపాలను ఎవరికి వారే హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క స్థానం గెలుచుకున్న టీఆర్ఎస్.. ఈసారి పది నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకటరావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి.. 2014లో టీఆర్ఎస్లో చేరారు. ఆయన వెంట జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ, డీసీసీబీ చైర్మన్ వంటి నేతలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు వంటి నేతలు గులాబీ గూటికి చేరగా.. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్ఎస్లో చేరారు. పాలేరు నుంచి గెలుపొందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించారు. దీంతో 2014 ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందిన కాంగ్రెస్‌కు.. ప్రస్తుతం మధిర ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాత్రమే జిల్లాలో మిగిలారు. పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. ఇక గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించింది. ఖమ్మం ఎంపీతోపాటు వైరా, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. అయితే ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేర్వేరుగా టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్కు జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వీటిని నిలబెట్టుకోవడంతోపాటు రాజకీయంగా అత్యంత కీలకంగా, ప్రతిష్టాత్మకంగా భావించే సత్తుపల్లి, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో సైతం గులాబీ జెండా ఎగరేసేందుకు టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఆయా నియోజకవర్గాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించడం.. తరచూ రాజకీయ పర్యటనలు చేస్తూ పార్టీశ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పట్టున్న వాటిపై దృష్టి.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ వంటి రాజకీయ పక్షాలు తమకు పట్టున్న నియోజకవర్గాలపై ఇప్పటికే దృష్టి సారించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుండగా.. అందుకు దీటుగా అధికార పార్టీ జిల్లాలో అన్ని ఎమ్మెల్యే స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీఆర్ఎస్ కొద్ది రోజులుగా రాజకీయంగా దూకుడు పెంచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఆయా మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా మధిరలో తమకు సానుకూల పవనాలు వీస్తున్నాయన్న భావన కల్పించే ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. ఇక పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ విజయ పతాకం ఎగురవేసే బాధ్యతను తానే తీసుకుంటానని మంత్రి తుమ్మల స్వయంగా ప్రకటించడంతో పార్టీ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిందన్న అభి ప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. తమ బలాలు, బలహీనతలపై దృష్టి సారించి ఎన్నికల ప్రచార పర్వానికి అందరికంటే ముందు సిద్ధమవుతున్నారన్న భావన కలుగుతోంది. ఉత్తేజం నింపే యోచన.. ఇక ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్లో నెలకొన్న వర్గ విభేదాలు పార్టీకి నష్టం చేయకుండా.. వారికి సర్ది చెప్పడంతోపాటు నామినేటెడ్ పదవుల పందేరాన్ని మరోసారి ప్రారంభించడం ద్వారా జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతల్లో ఉత్తేజం నింపాలన్న యోచనతో పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి తరచూ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. పార్టీ కార్యకర్తలను ఎన్నికల కోసం కార్యోన్ముఖులను చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతోపాటు జిల్లాలోని టీఆర్ఎస్యేతర రాజకీయ పక్షాల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తులు, కీలక నేతల వ్యవహార శైలి, ఆయా పార్టీలతో వారు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మంత్రి తుమ్మలకు చేరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని టీఆర్ఎస్లో నెలకొన్న పరిస్థితులపై మంత్రి ఆయా నియోజకవర్గాల నేతల ద్వారా ఆరా తీయడంతోపాటు పార్టీ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరంగా నెలకొన్న జఠిల సమస్యలపై దృష్టి సారించేందుకు పార్టీ యంత్రాంగం సమాయత్తమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో జనరల్ స్థానాలుగా ఉన్న పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకటరావు, ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అక్కడ తిరిగి విజయం సాధించేందుకు ఆయా నేతలు ఇప్పటి నుంచే చెమటోడుస్తున్నారు. నియోజకవర్గాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తాము ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. -
బలవంతపు భూసేకరణను నిలిపివెయ్యాలి
-
గట్టులో టీచర్లను నియమించండి
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న కొన్ని పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడని, మండలానికి 218 పోస్టులను మంజూరు చేయగా కేవలం 54 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పారు. -
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి ప్రతినిధి, విజయనగరం/ కాశీబుగ్గ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యవత కదం తొక్కింది. రాష్ట్రంలో విద్యార్థి, యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు పలు చోట్ల పెద్ద ఎత్తున మానవహారాలు చేపట్టారు. బుధవారం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో వందలాది మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆమ్ ఆద్మీ, అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విభజన హామీలన్నీ అమలు చేస్తున్నామని బీజేపీ పార్లమెంటులో చెప్పడం సిగ్గుచేటన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. విద్యార్థులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరించారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ గంగాధర్‌తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ బస్‌స్టాండ్ వద్ద వందలాది మంది బుధవారం మానవహారం చేపట్టారు. అలాగే విజయనగరం జిల్లాలో, పార్వతీపురంలో విద్యార్థులు ఆందోళన చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలను, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకుడు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దిల వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నేతల అరెస్టు సాక్షి, గుంటూరు: ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వారిని అరెస్టు చేసి చెంపలపై కొట్టడం వివాదానికి దారితీసింది. వివరాల్లోకెళ్తే.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పొన్నూరులో మానవహారం నిర్వహించారు. పోలీసులు వచ్చి మానవహారాన్ని విరమించాలని కోరడంతో ఎస్ఎఫ్ఐ నేతలు ఎస్.కె.జాఫర్‌ఖాన్, ఎం.కిరణ్, తిరుమలరెడ్డి విద్యార్థులను పంపివేశారు. ఇదే తరుణంలో అక్కడకు వచ్చిన పొన్నూరు పోలీసులు ముగ్గురిని బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ వీరిని అసభ్యపదజాలంతో దూషిస్తూ చెంపలపై తీవ్రంగా కొట్టడమే కాకుండా ఒంటిపై ఉన్న బట్టలన్నీ తీయించి లాకప్‌లో పడేశారు. ఎస్ఎఫ్ఐ నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భగవాన్‌దాస్‌తోపాటు మరికొందరు గుంటూరు రూరల్ జిల్లా ఏఎస్పీ వరదరాజులును కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు ఖండించారు. -
బలవంతపు భూసేకరణ నిలిపేయాలి: సీపీఎం
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేయడాన్నిచంద్రబాబు ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రాజధాని రైతులతో బుధవారం మధు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్యాయం అని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ సవరణలను వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. పార్లమెంటులో ఆమోదించిన 2013 భూసేకరణ చట్టానికి నవంబర్ 20, 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు తయారు చేసిందని.. 2013 భూసేకరణ చట్టం రైతులకు కల్పించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. భూసేకరణ చట్టం సవరణపై, టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. రైతుల కోసం సీపీఎం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. చాలా ప్రమాదకరమైన భూసేకరణ చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన చట్టం వల్ల కోర్టుకు వెళ్లినా ఎటువంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అసెంబ్లీలో లేని సమయంలో టీడీపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టిందని, ఇలాంటి పని చేయడం చాలా మోసపూరిత చర్య అని విమర్శించారు. -
హోదా కోసం ఉద్యమిస్తే అరెస్టులా?
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోరుతూ జరిగే ఆందోళనను అణగదొక్కడం అంటే పరోక్షంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్రం చేసిన విద్రోహానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బంద్ చేస్తున్న ఉద్యమకారుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగిన టీడీపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కావాలంటూ దీక్షలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. బంద్‌ను విఫలం చేయడానికి నిర్బంధాన్ని ప్రయోగించడం ఆక్షేపణీయమని తప్పుబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని అణచివేసే చర్యలు విడనాడాలని వారు హితవు పలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగే ‘మానవహారం’ను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మందితో మానవహారం నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. -
ఉద్యమాన్ని బాబు అణచడం దారుణం: సీపీఎం
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ కార్యదర్శి పి.మధు తెలిపారు. మరో నేత బాబూరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చూడటం దారుణంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒక వైపు హోదా కోసం తామే పోరాడుతున్నామని చంద్రబాబు చెబుతూ మరో వైపు పోలీసులతో అరెస్టులు చేయించడం చంద్రబాబుకు తగదని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక హక్కు..దాన్ని చంద్రబాబు కాలరాస్తున్నారని మండిపడ్డారు. గతంలోననూ చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు..హోదా ఉద్యమానికి చంద్రబాబు మద్ధతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయవద్దని విన్నవించారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేయలేదా అని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్నిఅణచివేస్తామనుకోవడం చంద్రబాబు అవివేకమని వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
కొత్తపట్నం (ప్రకాశం): టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మండల సీపీఎం, సీపీఐ కార్యదర్శిలు సూరిని స్వామిరెడ్డి, పురిణి గోపీ డిమాండ్ చేశారు. మండలంలో జీపు జాతాలో భాగంగా సీపీఎం, సీపీఐ ఆధ్యర్యంలో కొత్తపట్నం బస్టాండ్ కూడలీలో శుక్రవారం జీపు జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలైన హామీలు అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయలేదని విమర్శించారు. ఇతర దేశాలు నుంచి నల్ల డబ్బు తీసికొస్తానని చెప్పి ఒక్క పైసా తీసురాలేదని దుయ్యబట్టారు. ఒంగోలు స్మార్ట్ సిటీగా మార్చడం, అర్హులైన పేదలందరికి పక్కా ఇళ్ళు నిర్మించలేదని ధ్వజమెత్తారు. రిమ్స్‌లో ఖాళీగా ఉన్న 300 పోస్టులు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటున్నారు. రిమ్స్ హాస్పిటల్లో కావల్సిన మౌలిక వసుతలు కరువయ్యాని విమర్శించారు. స్వామిరెడ్డి మాట్లాడుతూ మండలంలో నాలుగు సంవత్సరాల నుంచి పంటలు పండక కరువుతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం పాలకలు పటించుకున్న పాపాన పోలేదన్నారు. పంటలు పండటానికి సాగర్, గుండ్లకమ్మ నుంచి కాలువ తీసికొచ్చి పాదర్తి చెరువుకు, అల్లూరులో ఉన్న చాపాయి, చక్రాయి చెరువుకు కలిపితే పంటలు పండుతాయన్నారు. కొత్తపట్నం బీచ్‌ను పర్యటరంగంగా ఏర్పాటు చేయాలనిన తీర పాంత ప్రజలకు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కిష్టం పిచ్చయ్య, మల్లికార్జున, పట్టపు ప్రకాశం, ఏడుకొండలు పాల్గొన్నారు. -
ఇదీ సీపీఎం రామాయణం
సాక్షి, న్యూఢిల్లీ : పౌరాణిక రామాయణ గ్రంధాన్ని ఆరెస్సెస్ లాంటి శక్తులు రాజకీయాల కోసం ఉపయోగించుకోకుండా అందుబాటులో ఉన్న వివిధ రామాయణాల పట్ల రాష్ట్ర ప్రజలకు చైతన్యం కల్పించడం కోసం సీపీఎం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్న ‘కేరళ సంస్కత సంస్థ’ జూలై 15వ తేదీ ఆదివారం నుంచి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు వివిధ రామాయణాలపై చర్చా గోష్ఠిలు, సదస్సులు నిర్వహించనుంది. వాల్మీకి, కబీర్, తులసిదాస్తోపాటు పలువురు రాసిన రామాయణాలతోపాటు ప్రాంతాల వారిగానున్న రామాయణాలన్నింటిని ఈ కార్యక్రమాల్లో విశ్లేషిస్తారు. జాతీయ, ప్రాంతీయ రామాయణాలను కలుపుకొని మలయాళంలో ప్రస్తుతం 29 రామాయణాలు అందుబాటులో ఉన్నాయి. అందులో కేరళ ప్రాంతానికి చెందిన ఆద్యమ రామాయణం కూడా ఉంది. మలయాళం క్యాలెండర్ ప్రకారం జూలై 15వ తేదీన రామాయణం మాసం ప్రారంభమైంది. అదే రోజున రామాయణ కార్యక్రమాన్ని సీపీఎం ప్రారంభించడం పట్ల విమర్శలు వెల్లువెత్తగా, అది యాధశ్చికంగా జరిగిందని, అయినా రామాయణంపైనే తాము అవగాహనా కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు ఆ రోజున ప్రారంభిస్తే మాత్రం తప్పేమిటని పార్టీ సీనియర్ నాయకులు అచ్యుతానందన్ లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ లాంటి శక్తులు రామాయణాన్ని సంకుచిత స్వభావంతో చూపించడమే కాకుండా అదే స్వభావాన్ని ప్రజలకు రుద్దేందుకు ప్రయత్నిస్తోందని పార్టీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న భారతీయ సంస్కతి రామాయణం లాంటి ఇతిహాసాల్లో ప్రతిబింబిస్తుందా, లేదా? ఇన్ని రామాయణాలు ఏ కారణంగా పుట్టుకొచ్చాయో ప్రజల ముందుకు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని తాము అన్నారు. ఈ కార్యక్రమంలో తాము కూడా పాల్గొంటున్నప్పటికీ ‘కేరళ సంస్కత సంస్థ’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని వారు చెప్పారు. సంస్కత సంస్థ ఓ లౌకిక సంస్థ అందులో లౌకికవాదులు, మేథావులు, పండితులు, టీచర్లు, విద్యార్థులు ఉన్నారని వారు తెలిపారు. సంస్థ రాష్ట్ర కన్వీనర్ టీ. తిలక్‌రాజ్ పదవీ విరమణ చేసిన సంస్కత టీచరు. ఆయన సీపీఎం టీచర్స్ విభాగానికి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కూడా. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జాతీయ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర సీపీఎం కమిటీ సభ్యుడు డాక్టర్ వి. శివదాసన్ కూడా ఈ సంస్కత సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇది వరకు మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలు విజయవంతం అవడం, వాటికి లక్షలాది మంది ప్రజలు రావడంతో ఇప్పుడు రామాయణంపై కూడా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డాక్టర్ శివదాసన్ వివరించారు. రామాయణ, మహాభారతంల పేరిట ప్రజల్లో విద్వేషాలు తీసుకరావడం ద్వారా రాష్ట్రంలో బలపడేందుకు హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తుంటే తాము అవే రామాయణ, భారతాలు చెబుతున్న బహుళత్వంలో భిన్నత్వాన్ని చెబుతున్న హిందూ ఇజం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీఎం నాయకులు వివరించారు. హిందూత్వ శక్తులను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో సీపీఎం కార్యకర్తలు ‘ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యోగా స్టడీ సెంటర్ పేరిట యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
సామాజిక ఐక్యతను దెబ్బతీసే కుట్ర
హైదరాబాద్: తెలంగాణలో బహుజన ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఏర్పడకుంటే అది నినాదంగానే మిగులుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి సామాజిక ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. దేశభక్తి పేరుతో దళితులు, మైనార్టీ లు, రాజ్యాంగ సంస్థల మీద దాడులు చేసి ఆ సంస్థల్లో ఆర్ఎస్ఎస్ వాళ్లను నింపి దేశచరిత్ర, ప్రజాస్వామ్య పునాదులను పెకిలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో ఎన్నికల సంస్కరణల ఆవశ్యకత– బహుజన ప్రభుత్వం ఓటర్ పాత్ర అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీని గద్దె దించకపోతే దేశ భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ కాలరాస్తోందన్నారు. బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే వెనుకబాటుతనం పోతుందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఓటుపడేలా ఈవీఎంల తయారీలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. వేలాది ఎకరాలు ఆక్రమణ: తమ్మినేని ఎర్ర జెండాల ఐక్యతకు బీఎల్ఎఫ్ కట్టుబడి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నా రు. హైదరాబాద్‌లో వేలాది ఎకరాల భూములు ఆక్ర మణకు గురయ్యాయని విమర్శించారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కంచ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో ఉద్రిక్తత.. మధు అరెస్టు
-
గుంటూరులో సీపీఎం ఆందోళన.. ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : నగరంలో గురువారం ఉదయం సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో అమాయకులను అరెస్టు చేశారంటూ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారిని పరామర్శించేందుకు ఆయన గురువారం పోలీసు స్టేషన్ వచ్చారు. అయితే, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అయినా మధు వెనుకకు తగ్గకపోవడంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో సీపీఎం శ్రేణులు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. -
సీపీఎం ఆందోళన: గుంటూరులో ఉద్రిక్తత
-
జేసీ దివాకర్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి
-
‘కేసీఆర్.. దమ్ముంటే ఎన్నికలకు రా’
సాక్షి, యాదాద్రి : కేసీర్‌కు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు సవాల్ విసిరారు. సోమవారం ఆయన భువనగిరిలో మాట్లాడుతూ.. ఓట్లకోసమే పాలకులు పథకాలు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. పేదలకు అందించాల్సింది ఓట్ల పథకాలు కాదని వారికి ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టాలనివ్యాఖ్యానించారు. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, నరేంద్ర మోదీలకు ప్రజాగోడు పట్టదని ఆరోపించారు. తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల లెక్కలు లేవనడం భూటకమని ఆరోపించారు. సమగ్ర సర్వే లెక్కలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీల జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సామాజిక ఎజెండాతో ముందుకెళ్తున్నది బీఎల్ఎఫ్ మాత్రమేనని పేర్కొన్నారు. ఓటర్ల చైతన్యం కోసం జులై 15న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
ప్రత్యేకహోదా సాధించే వరకు పోరాటం
అనంతపురం అర్బన్: ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ సాధించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని సీపీఎం, సీపీఐ, జనసేన నాయకులు అన్నారు. విభజన హామీలు అమలు చేయలని డిమాండ్ ఆ పార్టీల అధ్వర్యంలో శనివారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, జనసేన నాయకుడు బాబురావు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోగా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదం టూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడివిటీ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విభజన చట్టంలోని హామీల్లో ఒకటి రెండు మినహా అన్ని అమలు చేశామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రకటించడం సిగ్గుచేట్టన్నారు. ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. హామీలు అమలు చేసి ఉంటే రాయలసీమకు బుం దేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కింద రూ.40 వేల కోట్లు డబ్బులు వచ్చేవన్నారు. కేవలం రూ.100 కోట్లు జిల్లాకు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. బెల్, నాసన్, ఎనర్జీ విండ్ యూనివర్సిటీ, ఐటీ కారిడార్, ఇలా ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. కేంద్ర మంత్రులు స్వయంగా వచ్చి భూ మి పూజ చేసి వెళ్లారే తప్ప వాటిని పూర్తి చేయలేదన్నారు. నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వానికి మిత్రపోంగా ఉండి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే, బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు. -
బీజేపీని తరిమికొట్టండి
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): ఏపీకి విభజన హామీలన్నీ నెరవేర్చామని సుప్రీంకోర్టులో మోసపూరిత అఫిడివిట్ దాఖలు చేసిన బీజేపీని తరిమికొట్టాలని వామపక్ష పార్టీల నాయకులు శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రానికి రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు అమలు, విశాఖ రైల్వేజోన్, రాష్ట్ర రాజధాని నిర్మాణానికినిధులు, పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రజలతో ఓట్లు వేయించుకుని బీజేపీ గడిచిన నాలుగేళ్లల్లో మోసం చేసిందన్నారు. హామీలన్నీ నెరవేర్చాం అని దుర్మారగపు అఫిడివిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా ఇచ్చి అన్ని విధాలా అదుకుంటామని హామీ ఇచ్చి కోర్టును సైతం మోసం చేసిన బీజేపీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కడపలో ఉక్కు కర్మాగారం, అమరావతి నిర్మాణానికి నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భుందేల్‌ఖండ్ తరహాలో నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ఇప్పుడు అబద్దాలు చెప్పి 5 కోట్లమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ను వెంటనే వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్షాల నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ద్వారకానగర్, సెంట్రల్ పార్కు, జీవీఎంసీగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పైడిరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు డి. మార్కండేయులు, జె.డి.నాయుడు,జి. రాంబాబు, ఆర్.శ్రీనివాసరావు, ఎస్.కె.రెహ్మన్, జి.వామనమూర్తి, ఏయూ విద్యార్థి సంఘం నాయకులు సమయం హేమంత్‌కుమార్, సనపల తిరుపతిరావు, ఏసీపీ పార్టీ అధ్యక్షుడు కె. రామానాయుడు, ఎంసీపీఐ నాయకులు కె.శంకరావు, సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వీ.కుమార్, కృష్ణారావు, పి. చంద్రశేఖర్, వై.నందన్న పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరోసారి బహిర్గతమైంది
రాజంపేట రూరల్: ఏపీకి ప్రత్యేక హోదా పై అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరొకసారి బహిర్గతమైందని సీపీఐ, సీపీఎం ఏరియా కార్యదర్శులు పి.మహేష్, సి.రవికుమార్ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక బైపాస్ రహదారిలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కేంద్ర వైఖరిని నిరసిస్తూ మెడకు ఉరితాళ్లను వేసుకొని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏపీని మోసం చేస్తూనే ఉందన్నారు. విభజన హామీలన్ని అమలు చేశామని బూటకపు అఫిడవిట్ దాఖలు చేసిందని విమర్శంచారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీపీఐ నాయకులు ఎంఎస్ రాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, ఏఐఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శి ఈ.సికిందర్, గురుసాయి, ఏఐటీయూసీ నాయకులు ఎస్ఎస్ షరీఫ్, సుబ్రమణ్యంరాజు, వెంకటేష్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు
ఆస్పరి: ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని సీపీఎం, సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆస్పరిలో సీపీఐ, సీపీఎం నాయకులు శుక్రవారం వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. సీపీఐ నాయకులు స్థానిక బస్టాండ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీపీఎం నాయకులు అంబేడ్కర్ సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు నాగేంద్రయ్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ తర్వాత పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా ప్రజలను మోసం చేశాడన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, సీపీఐ, సీపీఎం, విరుపాక్షి, మాణిక్యప్ప, రామాంజినేయులు, నవీన్, రంగస్వామి, బ్రహ్మయ్య, రాజ్‌కుమార్, అంజినయ్య, రాజశేఖర్, ఉరుకుందప్ప, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. దేవనకొండ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, సాధించుకునేందుకు ఎందాకైనా పోరాటాలు నిర్వహిస్తామని సీపీఎం డివిజన్ నాయకులు వీరశేఖర్ అన్నారు. శుక్రవారం దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలియజేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి, ఇప్పుడు చేతులెత్తేయడం ఏంటని ప్రశ్నించారు. -
11మంది సీపీఎం కార్యకర్తలకు జీవితఖైదు
తిరువనంతపురం : సీపీఎం పార్టీకి చెందిన 11 మంది కార్యకర్తలకు కేరళలోని తలస్సెరీ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. 2008లో బీజేపీ కార్యకర్త మహేశ్ హత్య కేసులో నిందితులగా ఉన్న వీరిని దోషులుగా గుర్తించిన కోర్టు గురువారం శిక్ష ఖరారు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆటో నడుపుతూ జీవనం సాగించే మహేశ్ తొలుత సీపీఎం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. ఆ తర్వాత అతడు బీజేపీలో చేరాడు. అది జీర్ణించుకోలేకపోయిన కొంతమంది సీపీఎంకు చెందిన కార్యకర్తలు అతనిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. 2008 మార్చి 6వ తేదీన పథకం ప్రకారం మహేశ్‌పై దాడికి దిగి అతన్ని హతమార్చారు. ఆ తర్వాత తలస్సెరీ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ కేసుపై సుదీర్ఘ కాలంపాటు విచారణ జరిపిన కోర్టు సీపీఎం పార్టీకి చెందిన ధనేశ్, ఉత్తమన్, బాబు, ప్రకాశన్, ఉమేశ్, రంజిత్, ముకేశ్, పురుషోత్తమన్, సునేశ్, సూరజ్, శిజులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరింది. -
నాలుగేళ్ల పాలనలో ఎన్డీఏ విఫలం
అనంతపురం న్యూసిటీ: కేంద్రంలో నాలుగేళ్ల పాలనలో ఆర్థిక, సాంఘిక తదితర అన్ని రంగాల్లో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు విరుచుకుపడ్డారు. సోమవారం అనంతపురంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని దించడానికే వచ్చే ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పి కూడా అమలు చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా తామే ప్రభుత్వం నడపాలని బీజేపీ యత్నిస్తోందని, అందుకు గోవా, మణిపూర్ ఎన్నికల్లే నిదర్శనమన్నారు. ఈ అనైతిక విధానాన్ని తిప్పికొట్టేందుకు కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీయేతర పార్టీలు ఒకే వేదికపై కలిశాయన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎన్నడూలేని విధంగా దెబ్బతిన్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపాయన్నారు. నల్లధనం విదేశాల్లో నుంచి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్న ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇటీవల స్విస్ బ్యాంకులో రూ.7 వేల కోట్ల భారతీయుల సంపద జమయ్యిందని, ఈ డబ్బు బ్యాంకుల్లో వేసుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఏవిధంగా అనుమతిచ్చిందో చెప్పాలన్నారు. నాలుగేళ్ల ఎన్డీఏ దుష్పరిపాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశ వ్యాప్త ప్రచారానికి సీపీఐ శ్రీకారం చుట్టనుందన్నారు. బీజేపీ ముందస్తు ఎన్నికలు చేపట్టాలని ప్రచారం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య హక్కులకు నష్టం అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ జిల్లాలో...‘ఉక్కు’పిడికిలి!
సాక్షి, కడప/కడప వైఎస్సార్ సర్కిల్/కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జిల్లా బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. విద్యా సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కి ఉక్కు పరిశ్రమ ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. అఖిలపక్షం నేతల పిలుపు మేరకు గత పది రోజులుగా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం, సంతకాల సేకరణ, ర్యాలీలు, ముఖాముఖి, రిలే నిరాహార దీక్షలు, మానవహారాలతో వరుసగా పది రోజులపాటు ఆందోళన చేసిన నేతలు శుక్రవారం బంద్‌ను విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో.. ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉక్కు పరిశ్రమ కోసం ఆందోళనలు మిన్నంటాయి. పులివెందులలో కడప తాజా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో తెల్లవారుజామున 4 గంటలకే పులివెందుల ఆర్టీసీ డిపోకు చేరుకుని బంద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ బస్టాండు వద్ద ఆందోళన చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో జరుగుతున్న బంద్‌లో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. అలాగే, రైల్వేకోడూరు పరిధిలోని కుక్కలదొడ్డి వద్ద ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జమ్మలమడుగు, బద్వేలులో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య బంద్‌ను పర్యవేక్షించారు. కడప ఉక్కు బంద్‌లో వామపక్ష నేతలు వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చేపట్టిన బంద్ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్యతోపాటు పలువురు ఆమ్ ఆద్మీ, జనసేన పార్టీల నేతలు పాల్గొని ర్యాలీలు నిర్వహించారు. సీపీఐ, సీపీఎం కార్యాలయాల నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంలో పాల్గొన్నారు. బంద్‌కు దూరంగా టీడీపీ జిల్లాలో ఉక్కు పేరుతో దీక్షలు చేస్తున్నా బంద్‌కు మాత్రం తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండడం చర్చకు దారితీసింది. ఉక్కు పరిశ్రమ కోసమే దీక్ష చేస్తున్నట్లయితే అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన బంద్‌లో పాల్గొనకపోవడం విస్మయానికి గురిచేస్తోందని అఖిలపక్షం నేతలు వ్యాఖ్యానించారు. జిల్లాలో ఎక్కడా కూడా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొనలేదు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యే వరకు ఉద్యమం కాగా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ మెడలు వంచి తీరుతామని అఖిలపక్ష నేతలు స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేసే వరకూ ఉద్యమం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా బంద్‌లో పాల్గొన్న సీపీఎం జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, మాజీమంత్రి సీ రామచంద్రయ్య వేర్వేరుగా మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమపై వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజుబిలిటీ లేదని కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంటే చంద్రబాబు నాలుగేళ్లు మాట్లాడకుండా నేడు దీక్షలు చేయించడం హాస్యాస్పదమన్నారు. బంద్ సందర్భంగా కడపలో ర్యాలీ చేస్తున్నవైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్ బాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర అఖిల పక్ష, ప్రజాసంఘాల నేతలు -
‘పన్నులు పెంచితే ఉద్యమిస్తాం’
సాక్షి, అమరావతి : పన్నులు పెంచమని అధికారంలోకి వచ్చిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దొడ్డిదారిన పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు విమర్మించారు. ఆస్తి పన్ను కట్టకపోతే రెండు రూపాయలు వడ్డీతోపాటు సర్వీసు చార్జీలు వసూలు చేస్తామని నోటీసులు పంపడం అనైతికమన్నారు. నగరపాలక సంస్థతో పాటు ఇతర పాంత్రాల్లో వాటర్, డ్రైనేజీ, చెత్త ఇతర సర్వీసు ఛార్జీలతో పాటు అడ్డగోలుగా పన్నులు వసూలు చేస్తున్నరని తెలిపారు. నగర పాలక సంస్థ మరుగు దొడ్ల మీద కూడా వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. నగర ప్రజలకు పన్నుల చెల్లింపులో నోటీసులు సీడీఎమ్ఎ తరుఫున ప్రభుత్వమే ఇవ్వడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. టీడీపీకి అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇళ్ల పన్నులు రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పుడు పన్నులు రెట్టింపు చేసి దోచుకుంటున్నారని విమర్శించారు. పెంచిన మంచినీటి, డ్రైనేజి పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30 దాటితే వడ్డీ వేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సెప్టెంబర్ చివరి వరకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నుల వడ్డీల భారాన్ని తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని బాబురావు హెచ్చరించారు. -
27న బీఎల్ఎఫ్ మహాధర్నా
ఖమ్మంమయూరిసెంటర్ : జిల్లాలోనిప్రజలు, రైతులు, ఇతర రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 27న బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27న ఉద యం 10 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో మహాధర్నా ఉంటుందన్నారు. ఈ నెల 3 నుంచి గ్రామా ల్లో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో 21 మండ లాల్లో 75 బృందాలు 560 గ్రామాల్లో సర్వే నిర్వహించామన్నారు. ఈ సర్వేలో ప్రతి మండలంలో 20 శాతం మంది ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేనివారు ఉన్నారని, అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం డబుల్‌బెడ్ రూం ఇళ్లు అంది స్తామని చెప్పిందని, కానీ ఎక్కడా అవి అర్హులకు అందడం లేదని ఆరోపించారు. జిల్లాలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, ప్రతి సీజన్లో అటవీశాఖ అధికారులు పంట లు ధ్వంసం చేస్తూ గిరిజనులు, ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారికి రైతు బంధు పథకం అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షల బీమా, పోడు భూమికి హక్కుపత్రాలు ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఖమ్మంలోని గోళ్లపాడు చానెల్‌పై నివసిస్తున్న మూడువేల మంది లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఈ ధర్నాకు బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి హాజరవుతారన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘కుటుంబాల్లో పిట్టల్లా రాలిపోతున్న జనం’
సాక్షి, విజయవాడ : కిడ్నీ వ్యాధితో ఒక్కొక్క కుటుంబంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారుని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు అన్నారు. పశ్చిమ కృష్ణా మెట్ట ప్రాంతంలో 3 వేల మంది కిడ్నీ బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. గత రెండున్నర ఏళ్లలో దాదాపుగా103 మంది చనిపోయారని చెప్పారు. ‘25మందికిపైగా డయాలసిస్ చెయించుకోవాల్సి ఉండగా మందులకు కూడా డబ్బులు లేని పరిస్థతి. కిడ్నీ వ్యాధి మెట్ట ప్రాంతంలోని 15 మండలాలకు విస్తరించింది. పిల్లలతో సహా అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపు రూ. 60 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు’. అని ఆయన పేర్కొన్నారు. సీపీఎం నిర్వహించిన సర్వేలో 1284 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. ప్రభుత్వానికి దుబారా ఖర్చు పెట్టడంలో ఉన్నా శ్రద్ధ.. కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో లేదని ఆయన విమర్శలు గుప్పించారు. దాదాపుగా 1000మంది తమ సొంత భూములను అమ్ముకొని, అప్పులు చేసి కిడ్నీ వ్యాధి కోసం చికిత్స చేయించుకునే పరిస్థితి అని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో చెందుతున్న జిల్లాలో 15 మండల్లాలో కిడ్నీ వ్యాధితో ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కనిపించలేదా అని బాబురావు ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం స్పందించినా కూడా ఒక డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గంలో ఈ విధమైన పరిస్థితి ఉన్నా మంత్రి పట్టించుకోకపోవడం బాధాకరమని సీపీఎం నేత అన్నారు. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం సమగ్ర సర్వే జరపాలి. అంతేకాక చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్ క్రేషియా ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు వారికి రూపాయి కూడా ఇవ్వలేదు.. వైద్య ఖర్చులకు సత్వర ఆర్ధిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కిడ్నీ బాధితులకు నెలకు రూ. 2500 రూపాయల పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూజివీడుతో పాటు తిరువూరు, మైలవరం, నందిగామలలో కూడా డయాలసిస్ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. వైద్యాశాఖ కూడా సీఎం దగ్గర ఉంది కాబట్టే చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించాలి. ఈ నెల చివరిలోపు కృష్ణాజిల్లాలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే జూలైలో కిడ్నీ బాధితులతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం నేత బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
కశ్మీర్లో తీవ్ర గందరగోళం: రాఘవులు
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ పాలనలో తీవ్ర గందరగోళం నెలకొందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశంలో భాగంగా కశ్మీర్ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు వెల్లడించారు. దేశ న్యాయవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని, కొలీజియం సూచించిన వ్యక్తిని సుప్రీం కోర్టు జడ్జిగా నియమించకుండా కేంద్రం జాప్యం చేస్తోందని చెప్పారు. న్యాయవ్యవస్థలో వివాదాలకు తావులేకుండా జాతీయ జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు. రైతాంగం సమస్యల మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి, రైతుల దుస్థితిని ఇంకా పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 8న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలసి ఛలో పార్లమెంటు నిర్వహించాలని పిలుపునిచ్చారు. త్రిపుర, బెంగాల్, కేరళ రాష్ట్రాలలో పరిస్థితులు గురించి కూడా కేంద్ర కమిటీ సమీక్షించినట్లు తెలిపారు. ఆరెస్సెస్, సంఘ్ పరివార్లు సీపీఎంను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే సీపీఎం కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ దాడులను ఖండించాలని కోరారు. 2019 సాధారణ ఎన్నికల ఎత్తుగడలు గురించి వచ్చే సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ అన్నారని, ఇంతవరకూ ఆ ఊసే లేదని చెప్పారు. బీజేపీ, ఏఏపీపై వ్యవహరించిన తీరును కేసీఆర్ ఖండించి ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన నిరసన దీక్షకు కేసీఆర్ మద్దతు ఇచ్చింటే బావుండేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కలిసి ఉందని ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని అన్నారని, మరి కేజ్రీవాల్‌కు ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన లాభం చేకూరదని కేసీఆర్ గమనించాలని హితవు పలికారు. -
బాబూ నీ పాపాలు ఎవరు కడుగుతారు?
సాక్షి, అమరావతి / మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన సీఎం చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని, ఆ నాలుగేళ్ల పాపాలు ఎవరు కడుగుతారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జరిగిన ద్రోహంలో బీజేపీతోపాటు టీడీపీకి వాటా ఉందని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు నిప్పులు చెరిగారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం రాజకీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో సీపీఐ, సీపీఎంల జాతీయ, రాష్ట్ర నేతలు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలపై ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ డి.రాజా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపైనా, దేశంలోని ఆదివాసీ, రైతులు, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాలిస్తున్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ నాలుగేళ్లపాటు బీజేపీ కాళ్లు పిసికిన చంద్రబాబు ఇప్పుడు అవే కాళ్లు పట్టుకుని లాగుతానంటే ప్రజలు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని చంద్రబాబు పాలనలో అవినీతి పెచ్చుమీరిందనే విషయం ఏసీబీ దాడుల్లో తేటతెల్లమవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. రూ.2,620 కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు దుబారా చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా రాజకీయ కూటమి ఏర్పాటు అవసరమని మధు రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు. కాగా, ఈ ఏడాది జూలై, ఆగష్టు మాసాల్లో ప్రజా రంగాల వారీగా సమస్యలపై రాష్ట్ర సదస్సులు నిర్వహించనున్నారు. జూలై 22న మూడు వెనుకబడిన ప్రాంతాలకు చెందిన కడపలో రాయలసీమ, శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర, ఒంగోలులో ప్రకాశం జిల్లా సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఆగస్టులో మండల స్థాయి పాదయాత్రలు నిర్వహించి సమస్యలను గుర్తించి వాటిపై మండల కేంద్రాల వద్ద ధర్నాలు, పికెటింగ్‌లు నిర్వహిస్తారు. ఆగష్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు రాష్ట్ర స్థాయి బస్సు యాత్రల్లో రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రజలను కలుస్తారు. సెప్టెంబర్ 15న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి మహార్యాలీ నిర్వహించాలని సదస్సు తీర్మానించింది. కాగా సదస్సును కవర్ చేయడానికి వచ్చిన ఓ టీవీ చానల్‌కు చెందిన ఓబీ వ్యాన్ డ్రైవర్ ప్రవీణ్ సభ ప్రారంభమైన కొద్ది సేపటికే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. -
‘చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదు’
సాక్షి, విజయవాడ: నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇపుడు నీతులు చెబుతున్నారని సీపీఎం జాతీయ నాయకులు బీవీ రాఘవులు విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగేళ్ల బురదను ఎవరు కడుగుతారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీజేపీ కాళ్లు పట్టుకుని, ఇపుడు కాళ్లు లాగుతానంటున్నారన్నారు. తనకు అధికారమిస్తే 15 ఏళ్లు రాష్ట్రానికి హోదా తెస్తానన్న బాబు ఇప్పుడేం మాట్లాడుతున్నారు?.. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్న వెంకయ్య నాయుడు ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఎన్నో హామిలిచ్చి.. చివరకు బెల్లం ముక్క కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఎప్పుడో ప్రకటించామన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్నారు.. మరీ ఈ నాలుగేళ్ళ నుంచి ఏం చేస్తున్నారన్నారు. ఇప్పుడు దీక్ష చేస్తే నాలుగేళ్ళగా చేసిన పాపం పోతుందా అని నిలదీశారు. రమేష్ చేసే దీక్షలో చిత్తశుద్ది లేదన్నారు. ఏ సమస్యపైనైనా దీక్షలు, నిరసనలు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం తమని అరెస్టు చేస్తుందని, కానీ చంద్రబాబు దీక్ష చేస్తే ఆయన్ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చేస్తే ప్రజాస్వామ్యం, తాము చేస్తే అరాచకమా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి ఇష్టమొచ్చినట్లు తినేశారని, ఇప్పుడు అమరావతిని తింటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని, గిట్టుబాటు ధర కోసం పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ వ్యవస్థను అమెరికా చేతిలో పెడుతోందని పేర్కొన్నారు. -
మమతా బెనర్జీ, సీపీఎం కలిసి పోటీ చేస్తారా..?
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీరు, కేజ్రీవాల్‌కు మద్దతు తదితర అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సోమవారం విలేకరులతో మాట్లాడిన మాకెన్... బెంగాల్లో మమతా బెనర్జీ, సీపీఎం కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావిస్తూ.. ‘ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉండే అధికారాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. బహుశా అది ఆ నలుగురికి(మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామి, చంద్రబాబు నాయుడు) తెలియదేమో’ అంటూ మాకెన్ వ్యాఖ్యానించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే... కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాలు తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయంటూ మాకెన్ విమర్శించారు. ‘అయినా ప్రభుత్వ అధికారులు(ఐఏఎస్‌లను ఉద్దేశించి) తమ కర్తవ్యాలను నిర్వర్తించడానికి వెనకడుగు వేయరు. కానీ ప్రభుత్వం వారిచేత అక్రమ పనులు చేయించాలనుకున్నపుడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకవేళ వారు సరిగా పనిచేయడం లేదంటే దాని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా రాజకీయం చేయడం ఏమాత్రం బాగాలేదు. అధికారులు ఏ పార్టీకి చెందిన వారు కారన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందంటూ’ వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో.. అజయ్ మాకెన్ వ్యాఖ్యలను బట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే దానిపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. -
ఢిల్లీలో ఆప్ భారీ ర్యాలీ
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఏడురోజులుగా దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలిపి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించడం లక్ష్యంగా ఆప్ ఈ ర్యాలీని తలపెట్టినప్పటికీ, పోలీసులు అడ్డుకోవడంతో మోదీ ఇంటికి చాలా దూరంలోనే ర్యాలీ ఆగిపోయింది. ఢిల్లీలోని మండీహౌస్ ప్రాంతం నుంచి ఆప్ ఈ ర్యాలీని ప్రారంభించగా, అక్కడకు ఎక్కువ మంది కార్యకర్తలు రాకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీకి అనుమతించేది లేదని ప్రకటించిన పోలీసులు.. మండీహౌస్‌కు దగ్గర్లోని ఐదు ఢిల్లీ మెట్రోరైల్ స్టేషన్లను మధ్యాహ్నమే మూసివేశారు. ఆ ప్రాంతానికి చేరుకునే బస్సులను కూడా నిలిపివేశారు. ప్రధాని మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌లు ర్యాలీని అడ్డుకోవాలని పోలీసుల ద్వారా ఎంత ప్రయత్నించినప్పటికీ 45 వేల మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు కూడా పాల్గొన్న ఈ ర్యాలీ సాయంత్రం 4.45 గంటలకు మండీహౌస్ వద్ద ప్రారంభమై ఆరు గంటల సమయంలో పార్లమెంట్ స్ట్రీట్ వద్దనే ఆగిపోయింది. ర్యాలీ సమయంలో ఏచూరి మాట్లాడుతూ ‘బీజేపీ పాలనలో దేశంలో సమాఖ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో ఉంది. ఇందుకు నిరసనగానే ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం’ అని చెప్పారు. మేం సమ్మె చేయడం లేదు: అధికారులు ఐఏఎస్ అధికారులు సమ్మె చేస్తున్నారంటూ ఆప్ చెబుతుండటాన్ని ఢిల్లీ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. అనవసరంగా ఆప్ నేతలు తమను లక్ష్యంగా చేసుకుని బా«ధ్యులుగా చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు కలసి ఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఢిల్లీ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తమకు భద్రత లేని సమావేశాలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారులపై కేజ్రీవాల్ వెనక్కు తగ్గారు. అధికారులంతా తమ కుటుంబంలో భాగమేనన్న ఆయన.. మంత్రులతో సమావేశాల్లో పాల్గొనే సమయంలో వారికి పూర్తి భద్రత ఉంటుందని హామీనిచ్చారు. ఆప్ ప్రభుత్వాన్ని బాయ్‌కాట్ చేయడం మానేసి పనుల్లో నిమగ్నం కావాలని విజ్ఞప్తి చేశారు. నా స్థానంలో ఎలా వెళ్తారు.. నీతి ఆయోగ్ పరిపాలక మండలి సమావేశానికి తన స్థానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వెళ్లేందుకు తాను అనుమతినివ్వలేదని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్‌కు బదులుగా బైజల్ నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యారని వచ్చిన వార్తలపై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి స్థానంలో ఎల్జీ భేటీకి వెళ్లారు?’ అని ప్రశ్నించారు. అయితే బైజల్ సమావేశానికి రానేలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. -
కాంగ్రెస్‌తో వామపక్షాల కూటమి?
కోల్‌కతా: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే విషయంపై వామపక్ష పార్టీలు సీరియస్‌గా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను ఎదుర్కొనేందుకు తప్పని పరిస్థితుల్లో పొత్తుగా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్లు బోగట్టా. అయిష్టంగానే... 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం కంచుకోట పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో ఒప్పందం ప్రకారం లెఫ్ట్ ఫ్రంట్ మరియు సీపీఎంలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశాయి. కానీ, ఎన్నికల్లో కూటమి కన్నా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ లాభపడింది(ఎక్కువ ఓట్లు పోలయ్యాయి). దీంతో మరోసారి పొత్తు తెరపైకి రాగా.. పునరాలోచన చేసుకోవాలని వామపక్ష ఫ్రంట్(ఫార్వర్డ్ బ్లాక్.. ఆర్పీఎస్.. మరికొన్ని చిన్న పార్టీలు) సీపీఎంకు సూచిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారంపై సీపీఎంలో భేదాభిప్రాయాలు వ్యక్తం కావటం చూశాం. అయితే బీజేపీ, టీఎంసీలను ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గమని ఓ వర్గం నేతలు బలంగా వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై బెంగాల్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్వపన్ బెనర్జీ మాట్లాడుతూ..‘పొత్తులో భాగంగా వామపక్షా పార్టీలు కాంగ్రెస్‌కు ఓట్లు పడుతున్నాయి. కానీ కాంగ్రెస్ వైపు నుంచి మాకు ఓట్లు పడటం లేదు. పొత్తు వల్ల అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే లబ్ధిచేకూరుతోంది’ అని అన్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం పార్టీ పెద్దలదేనని ఆయన స్పష్టం చేశారు. -
పదేళ్లకు కూడా అమరావతి అభివృద్ధి చెందదు..
తెనాలి: చంద్రబాబు తీరు వల్ల వచ్చే పదేళ్లకు కూడా రాజధాని అమరావతి అభివృద్ధి చెందదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిపై పడ్డారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల కార్యాలయాన్ని సోమవారం బీవీ రాఘవులు ప్రారంభించారు. అనంతరం సీపీఎం తెనాలి డివిజన్ కన్వీనర్ ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో రాఘవులు ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరిగినప్పుడే అందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు. లేకుంటే ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. రాష్ట్ర పాలకుల శ్రద్ధ అంతా ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి కాకుండా.. ఎంటర్టైన్మెంట్ మీదే ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి ముందుకు సాగాలంటే ప్రత్యేకమైన నమూనా కావాలని, అది వామపక్షాలు మాత్రమే తేగలవని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న నేరాల్లో యాభై శాతం మద్యం కారణంగానే జరుగుతున్నాయని వెల్లడైనా.. మరిన్ని మద్యం, బెల్టు షాపులకు అనుమతిస్తుండటం దారుణమన్నారు. సమావేశంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు షేక్ హుస్సేన్‌వలి, అన్నపరెడ్డి కోటిరెడ్డి, పాశం రామారావు, నెల్లూరు ప్రజా వైద్యశాల డాక్టర్ పి.అజయ్‌కుమార్, డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, దండ లక్ష్మీనారాయణ, డాక్టర్ సింహాచలం, కంఠంనేని హనుమంతరావు, బొనిగల అగస్టీన్, ప్రధాన దాత పండా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.