ఎంఎన్ రాయ్ 1920లో ఎంఎన్ రాయ్ తాష్కెం ట్‌లో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపిం చారు. రెండేళ్లలో భారత కమ్యూ నిస్టు ఉద్యమ శతాబ్ది ఉత్స వాలు జరగనున్నాయి. చీలి కలు, పీలికల అనం తరం చివరికి సీపీఎం కమ్యూనిస్టు ఉద్యమంలో పెద్దన్నగా మిగిలింది. గతంలో పశ్చిమ బెంగాల్లో – తాజాగా త్రిపురలో అధికారం కోల్పో వడం.. చట్ట సభల్లో పార్టీ ప్రాతినిధ్యం భారీగా ం వంటి పరిణామాల నేపథ్యంలో–ఈ పార్టీ హైదరా బాద్‌లో అఖిల భారత మహాసభలు జరుపు కుంటోంది.
విలాసవంతమైన జీవితం, అమ్మాయిల జీవితా లతో ఆటలాడుకోవడం వంటి కారణాలపై పశ్చిమ బెంగాల్‌లో ఓ రాజ్యసభ సభ్యుడు పార్టీ నుంచి బహి ష్కరణకు గురయ్యాడు. కేరళలో అనుయాయులకు నామినేటెడ్ పదవుల పందేరం వ్యవహారం పెద్ద దుమారం రేపింది. మీడియా పెద్దఎత్తున ఎత్తి చూపాక గానీ ఈ రెండు అంశాల్లోనూ దిద్దుబాటు జరగలేదు. పార్టీ రాజకీయ–నైతిక పతనాన్ని ఇవి సూచిస్తున్నాయి. మరోవైపు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మిత్రత్వం వ్యవహారం సీతా రామ్ ఏచూరి–ప్రకాశ్ కారత్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా పరిణమించింది. మహా సభల ముసా యిదా తీర్మానం ఓటింగ్‌లో తన వాదన ఓటమి చెంది నందుకు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించేవరకూ వెళ్లారు సీతారామ్ ఏచూరి. పొత్తులు పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారాయని, స్వతంత్రంగా ఎదగాలని విశాఖ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు గందరగోళంలో పడింది.
పేదలు, బహుజనులు అధికంగా ఉన్న భారత దేశానికి మార్క్సిజాన్ని వర్తింపచేయడంలో చేసిన తప్పిదాలు, వ్యూహాత్మక వైఫల్యాల తాలూకూ చేదు ఫలితాలు ఇప్పుడు సంపూర్ణంగా సీపీఎం అనుభవం లోకి వచ్చాయి. అంబేడ్కర్‌ను బొంబాయిలో దగ్గ రుండి ఓడించారు. బాబా సాహెబ్ జయంతి నిర్వ హించిన పార్టీ నేతలపై సైతం చర్యలు తీసుకున్నారు. అలాంటి పార్టీకి ఇన్నాళ్లకు జ్ఞానోదయమైంది. వైఫ ల్యాలు నేర్పిన పాఠాలివి. ఫలితమే లాల్–నీల్ నినాదం. అయితే ఇందులోనూ పూర్తి నిజాయితీ కొరవడినట్టే అగుపిస్తోంది. దళిత సంఘాలకు సైతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అగ్రవర్ణాల నాయక త్వం, బాక్ సీట్ డ్రైవింగ్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ నేత అగ్రవర్ణానికి చెందినవారనే విషయం అందరికీ తెలిసిందే.
కేంద్రీకృత ప్రజాస్వామ్యం సీపీఎంలో సృజనా త్మకతను పూర్తిగా చంపేసింది. తీస్తా సెతల్వాద్, జిగ్నేష్ మేవానీ వంటి వారు పార్టీలో కనిపించరు. ఇందుకు కారణం సృజనాత్మక నేతల్ని పార్టీ పోత్స హించకపోవడమే. సృజనాత్మకత లేని ఏ సంస్థ / ఉద్యమం అయినా ఎదగకపోగా పతనావస్థకు చేరు కుంటుంది. స్పష్టమైన సిద్ధాంతం – నిజాయితీ లేకుండా, కేవలం వైఎస్ జగన్‌ను ఓడించడమే వ్యూహంగా రాజకీయాలు నడుపుతున్న పవన్‌క ల్యాణ్ వద్ద సీపీఎం నేతలు సాగిలపడటం ఇందుకు ఒక ఉదాహరణ.
ప్రగతిశీల శక్తులు బలోపేతమైనప్పుడే సామా జిక న్యాయరథం ముందుకెళుతుంది. మతతత్వ రాజ కీయాలకు అడ్డుకట్టపడుతుంది. మరి ఈ దిశగా హైద రాబాద్ కాంగ్రెస్ తన కార్యక్రమాన్ని రూపొందించు కోగలుగుతుందా? నేటి క్లిష్ట పరిస్థితులకు అనుగు ణంగా స్పందించగలుగుతుందా? నయా ఉదారవాద, మార్కెట్ సమాజం తెచ్చి పెట్టే పెడధోరణుల్ని సీపీఎం తరచూ విమర్శిస్తుంటుంది. ఈ చట్రంలో తమ పార్టీ నాయకులు కూడా చిక్కుకున్నారని గుర్తిం చగలిగి నప్పటికీ.. దిద్దుబాటు చేసే చిత్తశుద్ధి అగ్ర నాయ కత్వంలో కనిపించడం లేదు. పార్టీలో 30 శాతం వరకు చీడ పురుగులున్నారని, వారిని ఏరి వేయాలని కలకత్తా ప్లీనం చెప్పి ఏళ్లు గడిచినా ఫలితం శూన్యం.
సీపీఎం అగ్రనాయకులు, సీనియర్ కార్యక ర్తలతో ఈ రచయిత మూడు దశాబ్దాల నుంచి ఇలాంటి పలు అంశాలపై చర్చించారు. ఉద్యమం ఎదగగలదన్న నమ్మకం అగ్ర నాయకత్వంలో సన్న గిల్లడం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది యాంత్రిక పని విధానానికి, అనేక పెడధోరణులకు దారితీసింది. పార్టీ డాక్యుమెంట్లలో ఈ అంశాల్ని వారే పొందుపరి చారు. అయితే, నిజాయితీ – నిబద్ధత గల కార్యకర్త లకు కొదవ లేదు. నాక్కొంచెం నమ్మకమివ్వు.. కొండలు పిండి కొట్టేస్తాను.. అంటాడు ఆలూరి బైరాగి. ఈ తపనను పై నుంచి కింది దాకా పున రుద్ధరించగలిగితే, లోపాల్ని దిద్దుకోగలిగితే సీపీఎం ఎదగగలుగుతుంది. లేకుంటే ఒక విప్లవపార్టీ స్థానంలో ప్రెజర్ గ్రూప్‌గా ఇలాగే మిగిలిపోవాల్సి వస్తుంది. కేజ్రీవాల్, కోర్బిన్, బెర్నీ సాండర్స్‌లు అసా ధ్యాన్ని సుసాధ్యం చేయగలమని నిరూపించారు. ఎంతటి ప్రతికూల వాతావరణంలోనైనా ముంద డుగు వేయగలమని చేసి చూపించారు. సీపీఎం నాయకత్వం ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాల్సి ఉంది.
(ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా)
బి.భాస్కర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
మొబైల్ : 99896 92001
Comments
Please login to add a commentAdd a comment