Dr Br Ambedkar
-
దేశ పునర్నిర్మాణానికి మార్గం
భారతదేశం ఈనాడు సామాజిక, ఆర్థిక సంక్షోభంలో ఉంది. రూపాయి విలువ అంతకంతకూ పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థ దుఃస్థితిని తెలియజేస్తుంది. యువత నైరాశ్యంలో, మత్తులో కునారిల్లుతోంది. స్త్రీలైతే నిరక్షరాస్యతలో, మత కర్మకాండల్లో, పనిలేని తనంతో ఉత్ప్రేరక రహిత జీవితం జీవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థల్లో కులవివక్ష, అస్పృశ్యత ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని వర్గాల వారే సంపదలను స్వాధీనం చేసుకోవడం పెరుగుతోంది. కొన్ని కులాల వారే వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార వ్యవస్థల మీద తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కులం పేరుతో సాంఘిక, ఆర్థిక సంస్థలు, విద్యా వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. కుల ఆర్థిక వ్యవస్థ బలీయమైనదిగా రూపొందుతున్నదని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. హర్షద్ మెహతా లాంటి ఒక సామాన్య వ్యక్తి ప్రభుత్వ ఆర్థిక సంస్థలను వినియోగించుకొని వేల కోట్ల సొమ్మును ఏమార్చాడు. అదే చిన్న పొరపాట్లకే ఎస్సీ, ఎస్టీ సివిల్ సర్వీసు ఉద్యోగులు శిక్షలను అనుభవిస్తున్నారు. నూతన ఆర్థిక విధానం, ఉన్నత కులాలకు తమ ఆర్థిక, సామాజిక అధికారాన్ని పటిష్ఠపరుచుకోడానికి కొత్త అవకాశాల్ని ఏర్పరచింది. ఇటీవల ఒక ఏజెన్సీ భారతదేశంలోని వంద మంది ధనవంతుల పేర్లని వెల్లడించింది. వారిలో ఒక్కడు కూడా దళితుడు లేడు. భారతదేశంలోని అస్పృశ్యతా భావం వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. కారణం భూమి పంప కాన్ని ప్రభుత్వాలు నిరాకరించడం! భూములను కార్పొరేట్లకే ధారా దత్తం చేస్తున్నారు కానీ, పేద ప్రజలకు పంచడం లేదు. ఇటీవల సీపీఎం మహాసభలు జరిగినా వారు అస్పృశ్యతా నివారణ మీద, దళితులకు సాగు భూమి పంచాలనే అంశం మీద, కులనిర్మూలనా అంశం మీద తీర్మానం చేయకపోవడం గమనించదగ్గ విషయం.పెరగని శాస్త్రీయ భావనలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 45 మంది ప్రాణాలు కోల్పోవటం విషాదకరం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని విపరీత ప్రచారం జరగటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి చేరారు. అంత మందికి అవసరమైన ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.అదే రాష్ట్రంలో అంతకుముందు హత్రాస్‌లో జరిగిన ఒక అధ్యాత్మిక కార్యక్రమంలో బోలే బాబా పాద ధూళి కోసం జనం ఎగబడిన సందర్భంలో తొక్కిసలాట జరిగి, 121 మంది చని పోయారు. ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తుల తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం చెందారు. హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పో యిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలోనూ శాస్త్రీయ భావనలు దేశంలో వెల్లివిరియడం లేదు. సాంకేతిక, వైజ్ఞానిక భావచైతన్యం పెరగడం లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.అంబేడ్కర్ బాట అందరూ తమ రాజకీయ మేనిఫెస్టోల్లో దళిత వర్గాల స్త్రీల గురించే హమీలిస్తున్నారు. కానీ చివరకు శూన్య హస్తాలే చూపిస్తు న్నారు. ఈ విషయంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1951 అక్టోబర్ 28న తన ముంబయి ఎన్నికల ప్రచారంలో ఇలా విశ్లేషించారు: ‘ప్రతి రాజకీయ పార్టీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని ప్రతి రాజకీయ పార్టీ వాగ్దానం చేస్తుంది. భారత్‌లో అసలు సమస్య పేదరికం. ప్రతి ఏటా కోట్లాది రూపాయిల విలువ గల ఆహార ధాన్యాలు దిగుమతి చేసు కోవాల్సి వస్తే ప్రజలు ఎలా నెట్టుకు రాగలుగుతారు? ఈ విషయా లన్నింటికీ ప్రభుత్వ ఆలోచనల్లో తావులేదు’ అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పాలక వర్గాల మనస్తత్వంలో ఏ విధమైన మార్పూ లేదు. దీన్ని ఎదిరించి నిలబడే దళిత బహు జనులకు స్వీయ రాజకీయ చైతన్యం కావాలని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. రాజ్యాధికారమే ప్రధానమైన ‘కీ’ అని, దళిత బహుజన రాజ్యాన్ని నిర్మించినప్పుడే సంపద పంపిణీ అవుతుందని అన్నారు. లేదంటే పరిస్థితుల్లో మార్పులు రాకపోగా, మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘ఇవాళ దళితుల పరిస్థితి ఏమిటి? నాకు తెలిసినంత వరకూ ముందు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. అదే నిరంకుశత్వం, అదే అణచివేత. పరిపాలనలో అంతకుముందున్న వివక్షే కొనసాగుతోంది’ అన్నారు. అయినా వారికి ఉపశమనం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉద్దేశించి ఈ విశ్లేషణ చేశారు. అవి ఇప్పటికీ స్పష్టంగా అన్వయం అవుతున్నాయి. భారతీయుల బాధ్యతనిజానికి దేశంలో నిరుద్యోగం, పేదరికం, స్త్రీ అణచివేత ఇంకా కొనసాగుతున్నాయి. మరో పక్క ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కానీ తయారీ రంగానికి అవస రమైన సమస్త యంత్రాలనూ దిగుమతి చేసుకుంటున్నాం. పరి శోధన, అభివృద్ధి రంగంలో మనం చేస్తున్న వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో 1 శాతం కంటే తక్కువ! పరిశోధన అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చడం, నవకల్పనలను ఇతోధికంగా ప్రోత్సహించడం, కార్మిక శ్రేణుల నైపుణ్యాలను మెరుగుపరచడం అవసరమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలూ ఏవీ అమలు జరగడం లేదు. రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక సూత్రాలు విధ్వంసానికి గురి అవుతున్నాయి. సమాఖ్య భావన తగ్గడంతో రాష్ట్రాల అస్తిత్వాలు సంఘర్షణలో ఉన్నాయి. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గిస్తూ కేంద్రం ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునే క్రమం సాగుతోంది. మేలిమి చదువులు, తీరైన వసతులు, ఉపాధి అవకాశాల కల్పన, అసమా నతల నివారణ ద్వారా జనం బతుకుల్లో వెలుగులు నింపాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని ప్రలోభస్వామ్యంగా మారుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద శక్తులు ఏకం కావలసిన సమయం ఆసన్నమయింది. దేశంలో ఉత్పత్తిని పెంచు కొని, దేశ గౌరవాన్ని పెంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీ యుని మీద ఉంది. ఈ క్రమంలో అంబేడ్కర్ ఆలోచనలను స్వీకరించి అభివృద్ధి భారతానికి బాటలు వేయాలి.డా"కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులుమొబైల్: 98497 41695 -
అంబేడ్కర్ పేరు ఒక భరోసా!
అంబేడ్కర్ గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పటివరకూ కప్పి ఉంచిన కొన్ని వాస్తవాలను వెలికి తీశాయి. ‘తాము మాట్లాడితే ప్రేమ, ఎదుటివారు మాట్లాడితే ఫ్యాషన్’ అన్నంతగా బీజేపీ ప్రభుత్వానికి అంబేడ్కర్ పట్ల స్వాధీనత ఉందని మాట వరసకి అనుకుందాం. కానీ తర్వాతి వాక్యాలని గుడ్డిగా సమర్థించుకోవడం ఆశ్చర్యమే. కాంగ్రెస్ సభ్యులు అంబేడ్కర్‌ని ప్రస్తావించడం మీద అమిత్ షా వ్యాఖ్యానిస్తూ ‘అంబేడ్కర్ అంబేడ్కర్ అంబేడ్కర్... వారు ఇన్ని సార్లు దేవుడి నామం స్మరిస్తే ఏడేడు జన్మల స్వర్గలోక ప్రాప్తి వచ్చే’దని అనడం అంబేడ్కర్ పట్ల గౌరవాన్ని వ్యక్త పరిచినట్లు కాదు; అలాగని ఆ కామెంట్స్ కేవలం కాంగ్రెస్ మీద చేసిన విమర్శగా కూడా చూడలేము. కాంగ్రెస్ మీది కోపాన్ని అంబేడ్కర్ మీద చూపినట్లుగా మాత్రమే కాక, లోపల జీర్ణించుకున్న చులకనభావం బైట పడి నట్లుగా కూడా ఆ మాటలు ఉన్నాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కోసం పాటుపడిన అంబేడ్కర్‌ని – విశ్వాసాల మీద ఆధారపడిన దైవభావనతో పోల్చి తక్కువ చేయడం వ్యతిరేకించాల్సిన విషయం. కడుపు నిండిన వారికి స్వర్గలోక ద్వారాల వైపు చూపు ఉండొచ్చు. కానీ కులం, మతం, జెండర్ వంటి అనేక వివక్షలకి లోనయ్యే పీడితులు, పేదలు అంబేడ్కర్‌ని తమ ‘అన్నం గిన్నె’గా అభివర్ణించుకుంటారు. అంబేడ్కర్ పేరు పదేపదే స్మరించడం వారి జీవితాలకి భరోసా. ప్రధాని ‘ఎక్స్’ వేదికగా అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించడం మరొక విచిత్రం. అసలు వ్యాఖ్యల సంగతి వదిలేసి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌కి చేసిన అన్యాయాలను తవ్వితీయడం గొప్ప చతురత. కాంగ్రెస్ చేసిన అన్యాయాలను అంబేడ్కర్‌వాదులు తప్పక ప్రశ్ని స్తారు కానీ ఇప్పటి అమిత్ షా వ్యాఖ్యల సంగతేమిటి? ప్రజలకి నిజం తెలుసుననీ, అది కాంగ్రెస్ వారి దురదృష్టమనీ అన్నారు. అవును, ప్రధానమంత్రి గారూ, ప్రజ లకి నిజం తెలుసు. అయితే అది మీరు నిర్మించే నిజం కాదు. అంబేడ్కర్ చరిత్రను తుడిపివేసేందుకు కాంగ్రెస్ చేసిన పన్నాగాలను బట్టబయలు చేశామన్న ప్రధానమంత్రి, అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ వివరించారు. పంచ తీర్థ, చైత్యభూమి సమస్య, అంబేడ్కర్ చివరి దశలో గడిపిన ఇల్లు, లండన్‌లో అంబేడ్కర్ నివసించిన ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా ఆయన ఆశ యాలు నెరవేర్చే పనులు చేశామని అన్నారు. ఇవన్నీ అంబేడ్కర్ పట్ల కృతజ్ఞతతో ప్రజలూ ప్రభుత్వాలూ తమ కోసం తాము ప్రతీకగా చేసే పనులు. నాయకారాధన పట్ల స్పష్టమైన అవగాహనతో మాట్లాడిన అంబేడ్కర్ ఎపుడూ తన చిహ్నాల ఉద్ధరణ తన ఆశయ మని చెప్పలేదు. ఆయన రచనలు, ప్రసంగాలు, ఆచరణ గురించి తెలుసుకుంటే ఆశయాలు ఏమిటో తెలుస్తాయి. అవి మతతత్వ, కులవాద, పితృస్వామిక రాజకీయ పార్టీలను, వ్యవస్థలను నిరంతరం నిలదీస్తాయి. వాటి పీడనకి, వివక్షకి గురయ్యేవారిని అక్కున చేర్చుకుని ‘సమీకరించు, బోధించు, పోరాడు’ అని వెన్ను తడతాయి. కానీ పీడక పార్టీలు, వ్యవస్థలు ఈరోజు అంబేడ్కర్ ప్రభావాన్ని విగ్రహాలకి, నివసించిన స్థలాలకి కుదించి అవే ఆయన ఆశయాలని ప్రచారం చేస్తున్నాయి.బీజేపీ ప్రభుత్వానికి అంబేడ్కర్ ఆశయాలను నెర వేర్చాలన్న ఆకాంక్ష బలంగా ఉంటే రాజకీయాల్లో మెజారిటీ మత చొరబాట్లను నిరోధించి లౌకిక విలువలను స్వయంగా ప్రచారం చేయాలి. కుల నిర్మూలనకి అంబే డ్కర్ ఇచ్చిన సూచనలు అమలు చేయాలి. కులాంతర, మతాంతర పెళ్లిళ్లను ప్రోత్సహించాలి. వేదాలు, పురా ణాలు స్త్రీలను, దళితులను ఎంత అమానవీయంగా చూశాయో గుర్తించి వాటిని కల్పనా సాహిత్యంగా మాత్రమే పరిగణించాలి.దళితుల విద్యా ఉద్యోగ రాజ్యాధికారాలకి ప్రణాళికలు వేయాలి. పౌరులకు ఉన్న రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించాలి. మరీ ముఖ్యంగా మాట్లాడితేనో, నచ్చిన ఆహారం తింటేనో తీసుకెళ్ళి జైళ్ళలో పడేయకూడదు. ప్రజాస్వామ్య భావనని దాని నిజార్థంలో ఆచరించాలి. ఏకత – ఐక్యతలు ఒకటి కావని గుర్తించాలి. ఇలా మన ప్రభుత్వ వ్యవస్థల నియంతృత్వాన్ని సమూలంగా మార్చేయగల అనేక మార్పులను చేయడమే ఆయన ఆశయాలను నెరవేర్చడం. అందుకే కేవలం ఎక్కడో నాలుగు విగ్రహాలు పెట్టి గొప్ప ఆచరణగా ప్రకటించడం కన్నా, అసంఖ్యాకంగా ఉన్న అంబేద్కర్ రచనలను, ప్రసంగా లను, వివిధ ఘట్టాల్లో ఆయన పని తీరును అధ్యయనం చేయడం ద్వారా ప్రజలకు మేలు చేసే నిజమైన కార్యాచరణ రూపొందించుకోవచ్చు. ‘అంబేడ్కర్ ఆలోచనల తాత్వికత’ పేరిట ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అంతర్జాల మాధ్యమంలో 21 వారాల పాటు 48 ప్రసంగాల సిరీస్ నిర్వహిస్తున్నది. 2024 డిసెంబర్ 22 నుంచి 2025 మే 18 వరకూ నడిచే ఈ సిరీస్‌లో తెలుగు సమాజంలోని మేధావులు అంబేడ్కర్ ఆలోచనల తాత్వికతను ఆయన రచనలు, ప్రసంగాల ఆధారంగా పరిచయం చేస్తారు. ఆసక్తి ఉన్నవారు (zoom ID: 8254545523 Password PRARAVERK) ద్వారా పాల్గొనవచ్చు. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శి ‘ 88850 16788 -
‘అమిత్‌షా క్షమాపణలు చెప్పాల్సిందే’
ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో భారత రాజ్యాంగం పై చర్చ రెండు రోజుల పాటు చర్చ జరిగింది. మంగళవారం జరిగిన చర్చ సమయంలో అమిత్‌షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వినియోగించుకోవడం 'ఫ్యాషన్'గా మారిందని అన్నారు. అంబేద్కర్,అంబేద్కర్ అని జపం చేస్తున్నారు. బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా పుణ్యం వస్తుంది. స్వర్గానికి వెళ్లొచ్చని విరుచుకు పడ్డారు. "अभी एक फैशन हो गया है- अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर..इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता."अमित शाह ने बेहद घृणित बात की है. इस बात से जाहिर होता है कि BJP और RSS के नेताओं के मन में बाबा साहेब अंबेडकर जी को लेकर बहुत नफरत है.नफरत… pic.twitter.com/UMvMAq43O8— Jairam Ramesh (@Jairam_Ramesh) December 17, 2024 అయితే, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. మనుస్మృతిని విశ్వసించే వారు ఖచ్చితంగా అంబేద్కర్‌తో విభేదిస్తారు' అని ట్వీట్లో పేర్కొన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్‌ను హోంమంత్రి అవమానించడంతో బీజేపీ-ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకానికి వ్యతిరేకమని, వారి పూర్వీకులు అశోక్ చక్రాన్ని వ్యతిరేకించారని, సంఘ్ పరివార్ ప్రజలు మనుస్మృతిని అమలు చేయాలనుకుంటున్నారని ఖర్గే అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడి కంటే తక్కువేం కాదు.. ఆయన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేదల దూతగా ఉంటారని చెప్పారు. -
దళిత సంఘాల కన్నెర్ర
సాక్షి నెట్వర్క్: ఎమ్మెల్యేలు కె.రఘురామకృష్ణరాజు, పంతం నానాజీ దురాగతాలపై దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. వారిద్దరి తీరుపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి తెగబడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నేతలు నినదించారు. విశాఖ ఎల్ఐసీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత హక్కుల పోరాట సమితి, భీమ్‌సేన, కేవీపీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రఘురామకృష్ణరాజు దురాగతాన్ని హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావును దూషించి దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుడి ఘటనపై స్పందించని కాకినాడ ఎస్పీ, కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని కోరారు. కాగా.. ఉండి ఎమ్మెల్యే రఘురామ తీరుపై పల్నాడు జిల్లా అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. రఘురామను శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నాయకుడు తోకల సూరిబాబు, మండల సీఐటీయు కార్యదర్శి బి.సూరిబాబు, వైఎస్సార్సీపీ కారి్మక విభాగం నాయకుడు దారా ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు అంబేడ్కర్‌ను అవమానపరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు బాపట్ల జిల్లా రేపల్లెలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైభీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. తక్షణ చర్యలకు కార్పొరేటర్ల డిమాండ్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్టరాజు, దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను, దళిత డాక్టర్‌ను అవమానించిన ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలను అడ్డుకునేందుకు జనసేన, టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారు వెనక్కి తగ్గలేదు.డీజీపీకి మెమోరాండం అంబేడ్కర్ ఫొటోతో ఫ్లెక్సీ చించేసి దళితుల్ని అవమానపర్చిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, దళిత ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు పీవీ రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విజయవాడలో తెలిపారు. మంగళవారం డీజీపీని కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేసినట్టు తెలిపారు. ఇద్దర్నీ అరెస్ట్ చేయాల్సిందే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. -
సమానతే కులానికి ప్రత్యామ్నాయం
కులానికీ, వర్ణానికీ ఉన్న సంబంధాన్ని సామాజిక శాస్త్ర పునాదిగా చర్చిస్తే గానీ కులానికి ఉన్న పట్టు మనకు అవగతం కాదు. వర్ణ వ్యవస్థ నాలుగు వర్ణాలను పేర్కొంది. అవర్ణులుగా పంచములను పేర్కొంది. ఐతే ఆ విభజన సిద్ధాంతం, ప్రయోగంలో భారతదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. అంబేడ్కర్ కులనిర్మూలనను శాస్త్రబద్ధంగా నమ్మారు. భారతదేశంలో కులం పునాదులను అర్థం చేసుకున్న తర్వాత కుల నిర్మూలనా సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము, ఒక నీతిని నిర్మించలేమని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను బోధించారు. సమానత్వపు విలువలను బోధించే భారత రాజ్యాంగమే కులనిర్మూలనా జీవన విధానానికి దిక్సూచి.భారతదేశంలో కులం మూలాల గురించి చాలా చర్చ జరిగింది. కులం పునాదుల గురించి రాసిన వారిలో వి.ఎ.స్మిత్, జె.హెచ్.హట్టన్, హెచ్.హెచ్.రిజ్లీ, ఎస్.వి. కేత్కర్, జి.ఎస్.ఘుర్యే, జ్యోతిబా ఫూలే, బి.ఆర్.అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా లాంటి ఎందరో ఉన్నారు. హట్టన్ కులాన్ని ఇలా విశ్లేషించారు: ‘‘క్యాస్టు అనే మాట, కాస్టా అనే పోర్చుగీసు శబ్దం నుండి వచ్చింది. ‘కాస్ట’ అను శబ్దము ‘చాలు’, ‘జాతి’, ‘రకము’ అను పదముల అర్థమును తెలుపును. ఆ భాషలో ‘హోమెన్ డీబోవ కాస్టియ అను పద సమూహమునకు ‘మంచి కుటుంబంలోని మనిషి’ లేక ‘కులీనుడు’ అని అర్థము’’. 1563లో గార్సియా డి ఓర్టా ‘తన తండ్రి వృత్తి నుండి ఎవడూ మారడు. చెప్పులు కుట్టు ఒకే కులం వారంతా ఒకటే’ అని రాసిన నాటి నుండి ఈ ‘కాస్ట’ మాటను మనమిపుడు గ్రహించు పరిమితమైన ‘కులం (కాస్టు)’ అనే అర్థములో వాడుతున్నట్లు కనిపిస్తున్నది. హట్టన్ ‘కాస్ట్ ఇన్ ఇండియా’ అనే గొప్ప గ్రంథం రాశారు. అది ప్రపంచ వ్యాప్తంగా చాలా చర్చకు దారి తీసింది. అలాగే రిజ్లీ కులం గురించి ఇలా రాశారు: ‘‘కులం కొన్ని కుటుంబాల సముదాయంగా లేదా కుటుంబ సమూహాల సముదాయంగా ఉండి సామాన్య (ఒకే) నామాన్ని కలిగి ఉంటున్నది. ఒకే మానవుని నుండి లేదా దైవాంశ గల పురాణ పూర్వీకుని నుండి వంశక్రమాన్ని చెప్పుకుంటున్నది. వారస త్వంగా వచ్చిన ఒకే వృత్తిని అనుసరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించుకుంటున్నది.’’. కులం అనేది వర్ణ వ్యవస్థ నుండి రూపొందించబడిందని ఘుర్యే విశ్లేషించారు: ‘రంగు అను అర్థం గల ‘వర్ణం’ సమాజంలోని వర్గాలను వివరించుటకు వాడబడింది. తరువాత ‘జాతి’ పదం పుట్టుకతో వచ్చిన సమూహ సభ్యత్వమును ‘కులము’గా తెలుపుటకు ప్రత్యేక ముగా ఉపయోగించబడింది’. ‘ఒకడు దేనిలో పుడతాడో అది’ అని ‘జాతి’ శబ్దానికి వ్యుత్పత్తి అర్థం. దీనిని ‘వర్ణా’నికి సమానార్థంలో యోగ్యులైన ప్రాచీన సాధికారులు అడపా దడపా వాడారు.ఈ కులం మూలాల మీద జరిగిన చర్చ తరువాత కులం మూలాలు వర్ణ వ్యవస్థలో ఉన్నాయనేది స్పష్టమైంది. ఒంటి రంగును బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు ప్రత్యేకింపబడినట్లు తెలుస్తుంది. ‘కపిల వర్ణం బ్రాహ్మణుడు, అరుణ వర్ణం క్షత్రియుడు, గోధుమ వర్ణం వైశ్యుడు, కృష్ణ వర్ణం శూద్రుడు’ అని నామలింగాను శాసనం చెబుతుంది. ఈ సందర్భంగా సామాజిక శాస్త్రవేత్తలు పంచమ వర్ణం ఎలా పుట్టిందో చర్చించారు. వర్ణశబ్దం ఋగ్వేదంలో ప్రార్థ, మలాని ఆర్యులకూ, దస్యులకూ తేడాని తేల్చేదిగా వాడారు. ఋగ్వేదం పదవ మండలం రచనా కాలానికి 4 వర్ణాలు పేర్కొన బడ్డాయి. నాలుగు వర్ణాలలో మూడు ఆర్య వర్ణాలు కాగా నాల్గవది ఆర్యేతర వర్గం. అందుకే ఈ నాల్గవ వర్ణం వారు బ్రహ్మ పాదాల నుండి జనించారని చెప్పబడింది. వీరు ఆర్య సమాజంలో కలిసి నాల్గవ మెట్టులో జీవించే సామాజిక చారిత్రక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వర్ణ సమాజానికి దూరంగా జీవించిన చండాలురు, పిపీలకాదులు, నిషాదులు పంచములుగా పిలవబడి ఆ తరువాత కాలంలో అస్పృశ్యులు అయి నారు. వీరిని ఋగ్వేద కాలంలో వైదికార్యులు అస్పృశ్యులుగా పరిగణించలేదు, పంచజనులుగా మాత్రమే పరిగణించారు. వర్ణ వ్యవస్థ నాలుగు వర్ణాలను పేర్కొంది. అవర్ణులుగా పంచములను పేర్కొంది. ఐతే ఆ విభజన సిద్ధాంతం ప్రయోగంలో భారతదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. అవి శాఖలుగా ఉపశాఖలుగా వంశపారంపర్య తత్వంతో అంతశ్శాఖ వివాహ సంబంధాలు మాత్రమే కలిగి కుంచించుకు పోయాయి. ఆర్యులు వర్ణతత్వాన్ని భారతదేశానికి మోసుకు రాకముందు ఈ విధమైన విభజన భారతదేశంలో లేదు. అంబేడ్కర్ భారతదేశంలో కులం పునాదులను అర్థం చేసుకున్న తర్వాత కుల నిర్మూలనా సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. ఈ సంద ర్భంగా ఆయన అప్పటికి ప్రసిద్ధంగా ఉన్న అన్ని పార్టీల సిద్ధాంతాల తోనూ, నాయకులతోనూ పోరాడారు. మహత్మాగాంధీకి సమాధాన మిస్తూ తన కులనిర్మూలనా వాదనను లేఖ ద్వారా తెలియజేశారు:‘నా ఉద్దేశంలో హిందూ సమాజం కులరహిత సమాజం అయినప్పుడు మాత్రమే అది తనను తాను రక్షించుకొనే శక్తినీ, సామర్థ్యాన్నీ సంతరించుకోగలదు. ఆంతరంగికమైన బలం లేకుండా హిందువులకు స్వరాజ్యం వచ్చినా, అది మళ్ళీ దాస్యం వైపు ఒక అడుగు ముందుకు వెయ్యడమే కావచ్చు. బాగా ఆలోచించండి’ అని గాంధీకి విన్నవించారు. అంబేడ్కర్ కులనిర్మూలనను శాస్త్రబద్ధంగా నమ్మారు. కులం చేత పీడింపబడుతున్న వారిలో అస్పృశ్యులుగా చెప్పబడుతున్న పంచమ వర్ణులు ప్రధానంగా ఉన్నారని గుర్తించారు. అస్పృశ్యతను పాటించడం వల్ల భారతదేశంలో సోషలిజం రాదని కూడా చెప్పారు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. బుద్ధుడు, మహత్మా ఫూలే స్ఫూర్తితో అంబేడ్కర్ తన సిద్ధాంతాలు రూపొందించు కున్నారు. భూములను జాతీయం చేయండి, పరిశ్రమలను జాతీయం చేయండి, స్త్రీలకు సమాన హక్కులు కలుVýæజేయండి, బహుజనులు రాజ్యాధికారానికి సొంతంగా ఉద్యుక్తులు కండి అని ప్రబో ధిస్తూ వెళ్ళారు. రామ్ మనోహర్ లోహియా తన ‘కులాల సమస్య’ గ్రంథంలో భారత రాజకీయాలు కులాల గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నా యని రాశారు. ప్రజా సోషలిస్టు, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు కూడా కులీనులు, ధనవంతుల గుప్పిళ్లలోనే ఉన్నాయి. ఒకప్పుడు పండిత నెహ్రూ కూడా దేశంలో విప్లవ నాయకుడుగానే ఉండేవారు. కాంగ్రెసులోని ఈ నాయకులే సమానత్వం గురించి మాట్లాడుతూ ఉండేవారు. కాని ఇప్పుడు వారు ఎలా మారిపోయారు? వర్గ స్వభావం, వర్గ పక్షపాతం ఎప్పుడూ అంతరించవు. రామ్ మనోహర్ లోహియా రాజకీయాల్లో కులాధిపత్యాన్ని నిర్మూలించి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పారు. పెరియార్ రామ స్వామి నాయకర్ 1924 మార్చిలో కేరళలో అస్పృశ్యత నివారణ కోసం ‘వైకోమ్’ ఉద్యమం నడుపుతూ, ఆత్మగౌరవ పోరాటానికి పిలుపు నిచ్చారు. ‘‘ఆత్మగౌరవం పట్ల అవగాహన ఉంటేనే స్వతంత్రం గురించి మాట్లాడగలుగుతాం. అయితే ఇప్పుడు స్వతంత్రం గురించి మాట్లాడుతున్నవాళ్ళు ఆత్మగౌరవాన్ని విస్మరిస్తున్నారు. ఆత్మగౌరవం లేని స్వతంత్రానికి అర్థమే లేదు’’ అని ఆయన ఆనాటి కాంగ్రెస్ నాయకులకు చురకలు వేశారు. తన ఇరవై యేళ్ళ వయస్సులోనే కాంగ్రెస్ సభలో రామాయణం, మహాభారతం, పురాణాలు, శాస్త్రా లను తీవ్రంగా విమర్శించేవారు.నిజానికి భారతదేశంలో కుల నిర్మూలనా ఉద్యమాలుగా నడిచిన బౌద్ధం, జైనం, సాంఖ్యం ప్రేరణతో... ఫూలే, పెరియార్, లోహియా భావజాలంతో అంబేడ్కర్ మార్గంలో నడిస్తే ప్రత్యామ్నాయ సంస్కృతి రూపొందుతుంది. బహుజన రాజ్యాధికారాన్ని అనతి కాలంలో సాధించుకోవచ్చు. భారతదేశ రాజకీయాల్లో, సామాజిక వ్యవస్థల్లో, అన్ని మతాల్లో, పార్టీల్లో కులతత్వం చొచ్చుకుపోవడానికి కారణం అంబే డ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అందుకోకపోవడమే. అందుకే కులం పునా దుల మీద ఒక జాతిని నిర్మించలేము, ఒక నీతిని నిర్మించలేమని అంబేడ్కర్ చెప్పారు. కులానికి ప్రత్యామ్నాయంగానే ఆయన లక్ష పేజీల వాఙ్మయాన్ని రచించారు. కులనిర్మూలనా సిద్ధాంతకర్తగా పేరు పొందారు. అంబేడ్కర్ రచించిన రాజకీయ ప్రణాళికల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను బోధించారు. ఆయన బౌద్ధ సూత్రాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. భారత రాజ్యాంగమే కుల నిర్మూ లనా జీవన విధానానికి దిక్సూచి. ఆ మార్గంలో నడుద్దాం!డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
అమలాపురంలో విస్ఫోటం
అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని నల్ల వంతెన సమీపాన రావులచెరువు ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో విస్ఫోటం సంభవించింది. డాబా ఇల్లు నేల కూలి తునాతునాకలైంది. మొత్తం 14 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... రావులచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న గొవ్వాల నాగేశ్వరరావుకు చెందిన డాబా ఇంట్లో ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇల్లు పూర్తిగా ధ్వంసమై నేలకూలిపోయింది. ఇరుగు పొరుగున ఉన్న నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి నాగేశ్వరరావు ఇంట్లో ఉన్న నలుగురు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. వారితోపాటు సమీపంలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రెండు బైక్‌లు కూడా ఎగిరి కింద పడి కాలిపోయాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన ఇంట్లో అప్పుడప్పుడూ బాణసంచా తయారు చేస్తారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ బి.కృష్ణారావు పరిశీలించారు. బాణసంచా పేలుడు వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎస్పీ తెలిపారు. విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపిస్తున్నామని, వారి నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో జి.కేశవవర్ధనరెడ్డి కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. -
దేశ పునర్నిర్మాణానికి ఊపిరి
అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక విప్లవ సిద్ధాంతం భారతీయ సామాజిక పునర్నిర్మాణానికీ, దళితజాతుల విముక్తి పోరాటానికీ లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించింది. తరతరాలుగా భారతీయ సంస్కృతి కోల్పోయిన మానవతను, సమతను ఆయన విముక్తి పోరాటం పునరుజ్జీవింప జేసింది. నేడు భారత దేశంలో సమసమాజ నిర్మాణానికి ఉద్యుక్తులవుతున్న వారందరూ అంబేడ్కర్‌ను అధ్యయనం చేయకుండా, సమన్వయ పర్చుకోకుండా వారి పోరాటాల్లో విజయం సాధించటం అసాధ్యం. అంబేడ్కర్‌ను విస్మరించినవారు తమ లక్ష్యాల్లో, గమ్యాల్లో వైఫల్యం చెందుతూ ఆ వైఫల్యానికి కారణాలు గుర్తెరగలేక తిరోగమిస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా పునాదులతో సహా మార్పు తేవాలన్నప్పుడు, ఆ సామాజిక వ్యవస్థను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాలి.వికసిత భారత నిర్మాణం ద్వారా మన ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం కావా లని ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన తన 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉద్ఘాటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒక ప్రధాని చేసిన సుదీర్ఘ ప్రసంగం ఇది. మోదీ ఇప్పటికి ఎర్రకోట మీద 11 సార్లు జెండా ఎగురవేసి, ఎక్కువసార్లు ఎగురవేసిన మూడో ప్రధానిగా నిలిచారు.భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట మీద 17 సార్లు జెండా ఎగురవేశారు. ఆయన ప్రసంగాలు ప్రపంచ దేశా లను ఆకట్టుకున్నాయి. నెహ్రూ తన ప్రసంగాలలో భారత భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక అంశాలతో పాటు ఆర్థిక అంశా లను, అంతర్జాతీయ అంశాలను ఉటంకించేవారు. నెహ్రూ గొప్ప చదువరి. స్వతహాగా పండితుడు. ప్రపంచ దేశాల ప్రధాన మంత్రులతో విస్తృతమైన స్నేహం ఉన్నవారు. ఆ తరువాత ఇందిరా గాంధీ 16 సార్లు ఎర్రకోట మీద పతాకను ఎగురవేశారు. ఇందిర ప్రసంగాలలో కూడా విస్తృతమైన అంశాలు చర్చలకు వచ్చేవి. పేదరిక నిర్మూలన, బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణల వంటి అనేక అంశాల్ని ఆమె పేర్కొన్నారు. భారత దేశ మౌలిక స్వభావాన్ని మార్చే భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ పెద్ద చర్చనీయాంశాలుగా మారాయి. స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశ జనాభా 40 కోట్ల లోపే. ఇందిరాగాంధీ పాలన వరకు అది సుమారు 80 కోట్లు. ఇప్పుడు 140 కోట్లకు పెరిగింది. జనాభా ఇంతగా పెరిగిన ఈ సందర్భంలో ప్రజలందరూ ప్రధాని ఉపన్యాసంలో వచ్చే ముఖ్యమైన అంశాల కోసం ఎదురు చూడటం సహజం. ఇప్పటి జనాభాలో ప్రధానమైన శక్తిగా యువత 40 కోట్ల మందిగా ఉన్నారు. దగ్గర దగ్గర 67 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. భారత సమాజంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు. 20 కోట్ల మంది కోటీశ్వరులు ఉంటే, పేదలు 70 కోట్ల మంది ఉన్నారు. సమాజం ఇంకా సామాజిక అసమానతలతోనూ, స్త్రీల అణచివేతల తోనూ, నిరుద్యోగ భారతంగానూ ఉన్న సందర్భమిది. అందుకే ప్రధాని ప్రసంగంలోని నిర్మాణాత్మకమైన అంశాల కోసం ప్రజలు ఎదురుచూశారు. ప్రధాని యువతకు నూత్న ఉపాధి అంశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. దేశాభివృద్ధికి మరిన్ని నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామన్నారు. దేశాన్ని గ్లోబల్ మ్యాను ఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడానికి ఇది సువర్ణావకాశం అని కూడా అన్నారు. ఇవన్నీ దేశ ప్రజలను ఉత్తేజితం చేసే మాటలే అయినప్పటికీ రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం కనుమరు గైనట్టేనని అనిపించింది. నిజానికి ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న రైల్వేలు, టెలిఫోన్లు, విద్యుత్, ఇంధన, అనేక భారీ పరిశ్రమలు కార్పొరేట్ చేతుల్లోకి వెళుతున్న సందర్భమిది. భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తేనే భారత ఆర్థిక సంపద ఇతర దేశాల ఆర్థిక సంపదకు దీటుగా పెరుగుతుందని చెప్పారు.ఇకపోతే మోదీ గ్లోబల్ కంపెనీలను భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలనీ, వాటిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభు త్వాలు తమలో తాము పోటీ పడాలనీ సూచించారు. నిజానికి మోదీ లక్ష్యం చేసిన 2047వ సంవత్సరానికి భారత జనాభా 170 కోట్లను దాటవచ్చును. ఇప్పటికే 70 కోట్ల మంది ప్రజలకు ఇళ్ళ స్థలాలు లేవు. 170 కోట్లకు జనాభా పెరిగినప్పుడు, విదేశీ కంపెనీలకు స్థలాలు యిచ్చుకుంటూపోతే 2047 కంతా భారతదేశ ప్రజలకు ఇళ్ళ స్థలం దొరక్కపోగా, కొన్ని దేశాలవలే మనమూ సముద్రాల పైన ఇళ్ళు నిర్మించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని భౌగోళిక శాస్త్రవేత్తలు అంటున్నారు. నరేంద్ర మోదీ ప్రసంగంలో దేశంలో సాంకేతిక రంగంలో ప్రధాన భూమికను వహిస్తున్న మైనారిటీలకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల విషయంలో మార్పులు తేవాలనే భావన కనిపిస్తుంది. ఈ విషయా లను హ్యూమన్ రైట్స్ వాచ్ ఖండించింది. ప్రధాని సహజంగా మతా తీత భావనలో ప్రసంగిస్తేనే దేశంలో సామరస్యత, శాంతి, క్రాంతి కలుగుతాయని లౌకికవాదుల భావన. నిజానికి సాంస్కృతిక లౌకిక వాదం అంటే చర్చనీయాంశం అవుతుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, వి.పి. సింగ్... వీరంతా భారతదేశం లౌకిక ప్రజాస్వామ్యదేశం అని చెప్పారు. ఇకపోతే రాజ్యాంగ సభ సమయంలో అంబేడ్కర్ మతాతీత లౌకిక భావనతో పాలకవర్గం ఉన్నప్పుడు దేశంలో సామరస్యం నెల కొంటుందనీ, ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు, జైనులుగా చెప్పబడు తున్న ప్రజలంతా భారతీయులేననీ నొక్కి వక్కాణించారు. మైనారిటీలు, దళితుల వెనుకబాటుతనాన్ని గూర్చి, వారి అభ్యున్నతికి పాటు పడాల్సిన అంశాలను గూర్చి అంబేడ్కర్ ఇలా చెప్పారు: సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో మనలో మనకు తీవ్రమైన భేదాభిప్రా యాలున్నవని నేనేరుగుదును. అయినప్పటికీ మనమంతా కలిసి వివిధ ధోరణులనన్నింటిని సమన్వయింపజేసికొని ఒక దేశం, ఒకే ప్రజలు అనిపించే జాతీయ భావంతో మెలగ్గలిగే రోజులు రాగలవనే విశ్వసిస్తున్నాను. ఇకపోతే అనుక్షణం మారుతున్న ఆధునాతన యుగంలో విద్యకున్న విలువ మరి దేనికీ లేదు. అందులోనూ సాంఘిక గౌరవాన్ని పెంపొందించుకోవాల్సివున్న నిమ్న జాతుల్లో విద్య చాలా అవసరం.ఇకపోతే అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక విప్లవ సిద్ధాంతం భారతీయ సామాజిక పునర్నిర్మాణానికీ, దళితజాతుల విముక్తి పోరాటానికీ లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించింది. తరతరాలుగా భారతీయ సంస్కృతి కోల్పోయిన మానవతను, సమతను ఆయన విముక్తి పోరాటం పునరుజ్జీవింప జేసింది. నేడు భారతదేశంలో సమసమాజ నిర్మాణానికి ఉద్యుక్తులవుతున్న వారందరూ అంబేడ్కర్‌ను అధ్యయనం చేయకుండా, సమన్వయ పర్చుకోకుండా వారి పోరాటాల్లో విజయం సాధించటం అసాధ్యం. అంబేడ్కర్‌ను విస్మరించినవారు, అంబేడ్కర్‌ను అధ్యయనం చేయనివారు తమ లక్ష్యాల్లో, గమ్యాల్లో నిరంతర వైఫల్యం చెందుతూ ఆ వైఫల్యానికి కారణాలు గుర్తెరగలేక తిరోగమిస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా పునా దులతో సహా మార్పు తేవాలన్నప్పుడు, ఆ సామాజిక వ్యవస్థను మొత్తం శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని విస్మరించిన ఏ వాదమూ సజీవమైనది కాదు. ఈ వాస్తవాన్ని హిందూ కర్మవాదులు, కులవాదులు నిరంతరం విభేది స్తూనే ఉంటారు. అంబేడ్కర్ వారసులుగా వారితో మన యుద్ధం సాగుతూనే ఉంటుంది.ఇకపోతే భారతదేశాన్ని పాలించే పాలకులకు తప్పక కొన్ని అభ్యుదయ భావాలు ఉంటాయి, కాదనలేము, స్త్రీలపై జరిగే అత్యాచారాల విషయంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును అందరూ స్వీకరించాల్సిందే. ప్రతిపక్ష నాయకుణ్ణి మొదటి వరుసలో కూర్చో బెడితే బాగుండేది. ఎందుకంటే నెహ్రూ, వాజ్‌పేయి ఈ సంప్రదా యాన్ని పాటించారు. నిజానికి తన సుదీర్ఘమైన ప్రసంగంలో రాజ్యాంగ కర్తను బహుదా ప్రస్తావించటం ఆయన ధర్మం. అస్పృశ్యతా నివారణ, కులనిర్మూలన, దళితుల రక్షణ, పౌరహక్కుల రక్షణ, విశ్వ విద్యాలయాల్లో శాస్త్రీయభావాల పెంపునకు సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తి కలిగి ఉండటం ఒక చారిత్రక అవసరం. ఏమైనా అంతిమంగా అంబేడ్కర్ రాజ్యాంగమే స్వాతంత్య్ర దినోత్సవ ఆశయాలకు దిక్సూచి. అంబేడ్కర్ మార్గమే భారతదేశ అభివృద్ధికి ప్రధాన భూమిక. ఆ మార్గంలో పయనిద్దాం!డా‘‘ కత్తి పద్మారావువ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
ఇది రాజ్యాంగంపై దాడే!
ఆకతాయిల పని కాదది. పథకం ప్రకారమే జరిగింది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే జరిగింది. అదేదో చాటుమాటు ప్రాంతం కాదు. నిర్జన ప్రదేశం కాదు. విజయవాడ నడిగడ్డ. నగరంలోనే ఏక్ నంబర్ బిజినెస్ రాస్తా. బందర్ రోడ్. రాత్రి తొమ్మిది గంటల వేళ ఆ రోడ్డు మీద ప్రవహించే రణగొణ పీక్ స్థాయిలో ఉంటుంది. అటువంటి సమయంలో అంబేడ్కర్ స్మృతివనం లోకి కొందరు వ్యక్తులు ‘పనిముట్ల’తో ప్రవేశించి, సందర్శకు లను వెళ్లగొట్టి, లైట్లార్పేసి దాడికి తెగబడ్డారంటే... ఈ దాడికి స్వయానా పోలీసు యంత్రాంగమే కాపు కాసిందంటే... అధికార పీఠం అండదండలు లేవని ఎలా అనుకోగలం? అందుకే ఈ దాడి రాజ్య ప్రేరేపితం.మీడియా ప్రతినిధులతోపాటు పలువురు పురజనులు హుటాహుటిన అక్కడికి చేరుకోకపోతే ఆ దాడి ఎంతదూరం వెళ్లేదో? టాప్ ప్రయారిటీ టాస్క్‌గా అక్కడున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేరును తొలగించగలిగారు. ఇంకా ముందు కెళ్లడం జనం రాకతో కుదరలేదు. స్మృతి వనంలోకి దొంగల్లా ప్రవేశించి, లైట్లార్పేసి దాడికి తెగబడుతున్న వైనంపై సమా చారం అందించినా వెంటనే పోలీసులు స్పందించకపోవడం ఏమిటి? ప్రతిపక్ష నాయకుడి పేరునే కదా తొలగించింది... విగ్రహంపై దాడి జరగలేదు కదా అనే సన్నాయి నొక్కులు పాలక పార్టీ తైనాతీల నోటి వెంట వినబడుతున్నాయి. ఈ లెక్కన ప్రతిపక్షాలకు చెందిన వారి ఇళ్లల్లో అక్రమంగా ప్రవేశించి దొంగతనం చేసినా ఫరవాలేదన్న మాట. పోలీసులు రక్షణ కూడా కల్పిస్తారేమో! నంద్యాల జిలాల్లో ఒక వైసీపీ కార్యకకర్తను పబ్లిగ్గా తెగనరుకుతుంటే ఆ హంతకులకు రక్షణగా పోలీసులు నిలబడిన వైపరీత్యాన్ని కూడా ఈ వారమే చూడవలసి వచ్చింది. ఏపీలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ అంతస్సారం... సర్వమానవ సమతావాదం. ఈ సిద్ధాంతానికీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి భావజాలానికీ అస్సలు పొసగదు. కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం గిట్టదు. బీజేపీ తోలుబొమ్మను ఆడించే తెర వెనుక ఆరెస్సెస్‌కు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే యాలన్నది చిరకాల వాంఛ. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. నాలుగు రోజుల్లోనే (నవంబర్ 30) ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ దాన్ని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది.భారత రాజ్యాంగంలో భారతీయతే లేదని ‘ఆర్గనైజర్’ దుయ్యబట్టింది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టాకు లైకర్గస్లాగా, ఏథెన్స్కు సోలాన్ లాగా భారత్‌కు మనువు ఉండగా, ఆయన రూపొందించిన మనుస్మృతి ఉండగా ఈ రాజ్యాంగమెందుకని ‘ఆర్గనైజర్’ ప్రశ్నించింది. ఈ మనుధర్మ శాస్త్రం ఎటువంటిదో తెలిసిందే కదా! అసమానతలతో కూడిన కుల వ్యవస్థను సమర్థించిన శాస్త్రం. దళితులనైతే వర్ణవ్యవస్థకు ఆవల బహిష్కృతులుగా, అస్పృశ్యులుగా పరిగణించిన న్యాయ సంహిత ఇది. స్త్రీలకు స్వాతంత్య్రం అవసరం లేదని కూడా మనుస్మృతి అభిప్రాయపడింది. ‘పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, రక్షంతి స్థవిరే పుత్రా, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమా రుని రక్షణలో ఉండాలి. స్త్రీలకు స్వతంత్రత అవసరం లేదు)... ఇదీ మనుస్మృతి!ఇటువంటి మనుధర్మ సంహిత భారత రాజ్యాంగంగా ఉండాలని ఒక్క ‘ఆర్గనైజర్’ మాత్రమే కోరుకోలేదు. ఆరెస్సెస్ సిద్ధాంతవేత్తగా ప్రసిద్ధుడైన గురు గోల్వాల్కర్ (బంచ్ ఆఫ్ థాట్స్), ఆరెస్సెస్‌కు ప్రాతఃస్మరణీయుడైన వినాయక్‌రావు దామోదర్ సావర్కర్లు కూడా వివిధ సందర్భాల్లో అభిలషించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే కాదు, ఆ తర్వాతి కాలంలో కూడా ఆరెస్సెస్ అభిప్రాయం మారలేదని ప్రముఖ కన్నడ రచయిత దేవనూర్ మహాదేవ ఆరెస్సెస్‌పై రాసిన ఒక చిన్న పుస్తకంలో నిరూపించారు. ఆ సంస్థ 1993 జనవరిలో విడుదల చేసిన శ్వేతపత్రంలో భారత రాజ్యాంగాన్ని ‘విదేశీ భావాలతో కూడిన హిందూ వ్యతిరేక సంహిత’గా అభిశంసించారని మహాదేవ రాశారు.ఆరెస్సెస్ అనే సంస్థ ప్రస్తుతం మూడు అంతర్లీన లక్ష్యాల కోసం పనిచేస్తున్నదని మహాదేవ వివరించారు. భారతదేశ ఫెడ రల్ స్వభావానికి విరుద్ధంగా కేంద్రీకృత అధికార స్థాపన మొదటి లక్ష్యం. ఇక రెండవది – మనుధర్మ శాస్త్రం ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మం. అసమానతలతో కూడిన కుల వ్యవస్థను కాపాడటం – సమాజంపై ఆర్యుల ఆధిపత్యాన్ని రుద్దడం మూడవది. ఆర్యులంటే ఎవరు? వర్ణాశ్రమంలో వారి స్థానాలేమిటి? తదితర అంశాలపై వివరణలు అవసరం కాకపోవచ్చు. ఇదిగో ఈ మూడు లక్ష్యాల సాధనలో భాగంగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల సిలబస్ సవరణ, మతాంతీకరణ వ్యతిరేక బిల్లును తేవడం తదితర చర్యలు చేపట్టిందని మహాదేవ అభియోగం.స్థూలంగా మనుషులంతా సమానం కాదని మనుధర్మ శాస్త్రం అభిప్రాయపడుతుంది. మనుషుల్లో కొందరు ఉత్తమ జాతులవారు, కొందరు నీచ జాతులవారు. ఈ నీచ జాతుల వారు ఉత్తమ జాతులను సేవిస్తూ జీవించాలి. అన్ని జాతుల్లోనూ పురుషుల స్థాయి ఎక్కువ. స్త్రీల స్థాయి తక్కువ. పురుషుల అడుగుజాడల్లో వారి పాదధూళిని తలదాల్చుతూ స్త్రీలు మనుగడ సాగించాలి. ఇటువంటి మనువాద తుప్పు భావాలను చీల్చి చెండాడుతూ మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్పిన నవీన ధర్మ శాస్త్రం అంబేడ్కర్ విరచిత భారత రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగంతో మనువాదులు రాజీపడటం అంత సులభసాధ్య మేమీ కాదు. అందుకే గడిచిన డెబ్బయ్ ఐదేళ్లుగా ఈ రాజ్యాంగంపై, దాన్ని రచించిన బాబాసాహెబ్‌పై వివిధ రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగంలో మనువాదుల ప్రాబల్యం కారణంగానే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడం ఇప్పటి దాకా సాధ్యం కాలేదు.ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయకత్వం మొదలైన దగ్గర నుంచీ తెలుగుదేశం పార్టీలో వచ్చిన భావజాల మార్పు దాన్ని బీజేపీకి సహజ మిత్రపక్షంగా మార్చింది. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం ఆ పార్టీ ఆర్థిక సిద్ధాంతంగా మారింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నిజాం షుగర్స్, ఆంధ్ర పేపర్, ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ తదితర 56 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమో, మూసివేయడమో చేశారు. ప్రైవేట్ వ్యక్తులు బాగా బలిస్తే... వారి దగ్గర నుంచి జారిపడే చిల్లరతో పేదలు బతికేస్తారనే ట్రికిల్‌డౌన్ ఆర్థిక సిద్ధాంతం చంద్రబాబుది. భారత రాజ్యాంగం కోరుకున్న పేదల సాధికారతతో ఈ ఆర్థిక సిద్ధాంతా నికి సాపత్యం కుదరదు.పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యనూ, వైద్యాన్నీ ఆయన అందనీయలేదు. కనీస వైద్య సేవలు కూడా ఉచితంగా అందడానికి వీల్లేదని యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే! వరస కరువుకాటకాలతో, నకిలీ ఎరువులు, పురుగుల మందుల వాడకంతో చితికిపోయిన రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీల్లేదని ఆయన చెప్పిన పాఠాలు ఎప్పటికీ తెలుగు ప్రజలు మరిచిపోరు. విభజిత రాష్ట్ర ముఖ్య మంత్రిగా కూడా ఈ ఆర్థిక విధానాలకే ఆయన కట్టుబడి ఉన్నారు. ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ ఆయన భావజాలానికీ, మనుస్మృతికీ మధ్యన పెద్దగా తేడాలుండవు. తన కులతత్వ ఆలోచనలు, పురుషాహంకార అభిప్రాయా లను దాచుకోవడం కూడా ఆయనకు సాధ్యపడలేదు. విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీల తోకలు కత్తిరిస్తానని ఆయన బహిరంగంగానే బెదిరించారు. ‘ఎస్సీ కులాల్లో పుట్టా లని ఎవరు కోరుకుంటార’ని ప్రెస్‌మీట్‌లోనే ఈసడించు కున్నారు. ‘న్యాయస్థానాల్లో జడ్జీ పదవులకు బీసీలు పనికిరారం’టూ కేంద్రానికి లేఖలు రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని తన మనువాద భావాలను బయటపెట్టుకున్నారు.ఈ మనువాద రాజకీయాలకు పూర్తి భిన్నంగా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగింది. భారత రాజ్యాంగ లక్ష్యాల సాధన ఆశయంగా, సుస్థిర అభివృద్ధి ధ్యేయంగా సాగిన ఆయన ఐదేళ్ల పరిపాలన దేశం ముందు ఒక ఆదర్శ నమూనాను ఆవిష్కరించింది. ఈ నమూనాపై జరిగిన విద్వేషపూరిత విష ప్రచారం బహుశా ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదు. సమాజంలోని పేదవర్గాల సంక్షే మానికీ, మధ్య తరగతి కలల సాకారానికీ, మహిళల సాధికా రతకూ మనువాద సంపన్న వర్గాలు మనస్ఫూర్తిగా సహకరించవు. ఈ వర్గాలను చంద్రబాబు ఏకం చేసుకున్నారు. వారి వద్ద నున్న సకల అస్త్ర శస్త్రాలు, హంగు ఆర్భాటాలతో యుద్ధానికి దిగారు. విద్వేషపు విషవాయువులతో కార్పెట్ బాంబింగ్ చేశారు. ఒక్కో నియోజకవర్గం ఒక్కో భోపాల్ మాదిరిగా విష వాయువులతో ఉక్కిరి బిక్కిరైంది.విష ప్రచారాన్ని కొంతమందైనా నమ్మి ఉండవచ్చు. అరచేతిలో చూపెట్టిన వైకుంఠానికి మరికొంతమంది మోస పోయి ఉండవచ్చు. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్‌డీ), అసోసి యేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థలు బల్లగుద్ది చెబుతున్నట్టుగా ఈవీఎమ్లలో మాయాజాలం జరిగి ఉండ వచ్చు. ఈ మాయాజాలంలో దేశంలోనే అత్యధికంగా యాభై లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్టు వీఎఫ్‌డీ వాదిస్తున్నది. కారణమేదైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలవాటు ప్రకారం చేతిలోని వైకుంఠాన్ని చెట్టెక్కించారు. ముసుగు చీల్చు కొని మనువాదం బయటకొచ్చింది.మహిళా సాధికారతపై దాడి జరిగింది. ‘అమ్మ ఒడి’, ‘చేయూత’ వగైరా పథకాలు ఆగిపోయాయి. పేద విద్యార్థుల నాణ్యమైన చదువుపై దాడి జరిగింది. జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, రీయింబర్స్మెంట్, వసతి దీవెన తదితర కార్యక్రమాలు పట్టాలు తప్పాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’ మాయ మయ్యాడు. ‘ఆరోగ్యశ్రీ’నీ నీరుకార్చారు. పాలనా వికేంద్రీకర ణకు చాపచుట్టారు. వలంటీర్ వ్యవస్థ మాయమైంది. ఆర్బీకేల సేవలు ఆవిరయ్యాయి. విత్తనాల కోసం ఐదేళ్ల తర్వాత రైతులు మళ్లీ క్యూలైన్లలో రోజుల తరబడి నిలబడుతున్నారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రభుత్వ వైద్యశాలలపై ప్రైవేటీ కరణ కత్తి వేలాడుతున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర రహదారులపై సైతం టోల్ వసూలుకు రంగం సిద్ధమైంది. రాజ్యాంగ లక్ష్యాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. అంబే డ్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఒక ప్రతీకాత్మక దాడిగానే పరిగణించాలి. విజయవాడ నడిబొడ్డున ఆకాశమెత్తు అంబేడ్క రుడి మహాశిల్పాన్ని జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రా మనువాదుల్లో కడుపు మంటకు కారణమైంది. నలభ య్యేళ్ల నాటి కారంచేడు కండకావరం తిమ్మిరి ఇంకా వదల్లేదు. జగన్మోహన్రెడ్డి పేరును తొలగించి కొంత ఆనందాన్ని పొంది ఉండవచ్చు. ముందు ముందు మరిన్ని దాడులు జరగవచ్చు. ఆ దాడుల అసలు లక్ష్యం – భారత రాజ్యాంగం మాత్రమే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈ ‘బరితెగింపు’.. ఎల్లో మీడియాకు కనబడలేదా?
ఏమిటి ఈ బరి తెగింపు.. ఏమిటీ అరాచకం. చివరికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలిపెట్టరా! ఏపీలో జరుగుతున్న దుష్టపాలనకు ఇది నిలువుటద్దంగా నిలుస్తుంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున భాసిల్లుతున్న అంబేద్కర్ విగ్రహం. అక్కడే ఉన్న పార్కు, లైబ్రరీ అంతా ఒక విజ్ఞాన సంపదగా ఉన్న టూరిస్టు స్పాట్‌పై గురువారం రాత్రి దాడి జరగడం అత్యంత శోచనీయం.ఏపీ సమాజంలో అశాంతి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి మరింత ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు గవర్నర్ బంగళా, మరో వైపు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్న విజయవాడ స్వరాజ్మైదాన్లోని అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడికి సాహసించారంటే కచ్చితంగా దీని వెనుక ఎవరో కొందరు పెద్దల హస్తం ఉందన్న అనుమానం సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి అంబేద్కర్ కేంద్రాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును శిలాఫలకం నుంచి తొలగించడానికి జరిగిన యత్నం చూస్తే ఇది టీడీపీ అల్లరి మూకల పనేనన్న సంగతి అర్ధం అవుతుందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల ప్రమేయంతోనే ఇలాంటి నీచమైన అకృత్యాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. అంబేద్కర్‌ను దేశ వ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన పట్ల మానవ సమాజం ఎంత అభిమానంతో ఉండేదో తెలుస్తుంది. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన రావడం, దానిని ఎక్కడో మారుమూల కాకుండా విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి జగన్ ప్రభుత్వం సంకల్పించి పూర్తి చేసింది. వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూల నుంచి తరలిరాగా, విగ్రహం.. అంబేద్కర్ లైబ్రరీ, పార్కు మొదలైనవాటిని జగన్ ఆవిష్కరించారు.నిత్యం వేలాది మంది అక్కడకు వెళ్లి అనుభూతి పొందుతారు. 2014 టరమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని, ఆయన పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాని విజయవాడ వంటి సెంటర్లో కాకుండా, అమరావతిలో ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం చివరికి దానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన. జగన్ ప్రభుత్వం ఏదో కుగ్రామంలో కాకుండా, విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సముచితంగా ఉంటుందని భావించింది. స్వరాజ్మైదాన్ను అటు అంబేద్కర్ కేంద్రంగాను, ఇటు పార్కు, వాకింగ్ ట్రాక్ మొదలైనవాటితో టూరిస్టు స్పాట్‌గా అభివృద్ది చేయాలని ప్లాన్ చేసి సుమారు రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసింది.సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్‌ను అంతా చూసుకుంటారు. పేదల గుండెల్లో, ప్రత్యేకించి దళితుల హృదయాలలో ఆయన కొలువై ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. స్వరాజ్మైదాన్ను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చైనా మాల్గా మార్చాలని ప్రయత్నించింది. కాని విజయవాడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ముందుకు వెళ్లలేదు. జగన్ ప్రజలందరికి ఉపయోగపడేలా దానిని తీర్చిదిద్దారు. అంతే కాక అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా రాజకీయం జరిగింది.తొలుత అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు కోనసీమ జిల్లా అని పేరు పెట్టగా దళితవర్గాలు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసి ఆందోళనలకు దిగాయి. ఆ ఉద్యమంలో టీడీపీ, జనసేన వంటివి కూడా పాల్గొని దళితవర్గాలను రెచ్చగొట్టాయి. జగన్ ప్రభుత్వం అందరి అభిప్రాయాల మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా జత చేసింది. అప్పుడు ఇదే టీడీపీ, జనసేన నేతలు ఇతర వర్గాలను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించాయి. చివరికి అప్పటి మంత్రి, ఒక ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టి అరాచకానికి పాల్పడ్డాయి. టీడీపీ, జనసేనలు డబుల్‌గేమ్ ఆడినా జగన్ ప్రభుత్వం నిర్దిష్ట విధానంతో ముందుకు వెళ్లింది. దాని వల్ల వైఎస్సార్సీపీకి కొంత నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాతకాలంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టారు.విజయవాడకు ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నా విగ్రహం కనబడుతుంటుంది. అలాంటి టూరిస్ట్ స్పాట్ పై టీడీపీకి చెందిన కొందరు గూండాలు దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణంగా ఉంది. అంబేద్కర్ కేంద్ర సిబ్బంది నుంచి సెల్ పోన్లు లాక్కుని మరీ టీడీపీ కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడ్డారు. ఈ విగ్రహాన్ని ప్రారంబించిన జగన్ పేరు అక్కడ ఉండడం వారికి నచ్చలేదు. అంతే ఆ అక్షరాలను పీకేశారట. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమాచారం అంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడం శోచనీయం. టీడీపీ గూండాలు హత్యలు, దాడులు, విద్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చూసి-చూడనట్లు ఉండడం, పైగా వాటిని ప్రోత్సహించే విదంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వ్యాఖ్యలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ రౌడీలకు అడ్డు, ఆపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.ఇక తెలుగుదేశం మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి. చివరికి ఆంద్రజ్యోతి మీడియా ఈ దాడిని సైతం సమర్ధించే రీతిలో కదనాలు ఇస్తోందంటే అది ఏ రకంగా తయారైంది అర్థం చేసుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వారు ఎంత అరాచకం చేసినా కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. ఆయనకు పదవి రావడం పరమాన్నంగా మారింది. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. గతంలో ఎప్పుడూ ఇలా విగ్రహాలపై, శిలాఫలకాలపై ఏ రాజకీయ పార్టీ దాడి చేయలేదు. ఒక్కడైనా ఒకటి, అరా జరిగినా, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం, జగన్ పేరు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న శిలాఫలకాలను ద్వసం చేయడం వంటి అల్లర్లతో టీడీపీ అరాచక శక్తులు రెచ్చిపోయాయి.గుంటూరులో స్వయంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేనే గుణపం పట్టుకుని శిలాఫలకాన్ని కూల్చుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ భరత్ ఆద్వర్యంలో ఒక వంతెన నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా టీడీపీ గూండాలు ద్వంసం చేశారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలు నీచంగా వ్యవహరిస్తుంటే నిరోధించవలసిన నాయకత్వం వారిని ఎంకరేజ్ చేసేలా కామెంట్స్ చేస్తూ వచ్చింది. టీడీపీ దళిత నేతలు సైతం నోరు విప్పడం లేదు. గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎవరైనా కొద్దిపాటి అపచారం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. అలా వార్తలు ఇవ్వడం తప్పు కాదు. ఏ నాయకుడి విగ్రహంపైన ఎవరూ దాడులు చేయకూడదు. కాని వైఎస్ విగ్రహాలను ద్వంసం చేసినా, చివరికి అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రముఖంగా వార్త ఇవ్వలేదంటే వారు ఏ స్థాయికి దిగజారింది అర్ధం చేసుకోవచ్చు.టీడీపీ మీడియాలో ఈ ఘటనలు రిపోర్టు చేయకపోతే, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా టీడీపీ రౌడీ గ్యాంగ్‌లు, టీడీపీ మీడియా మాఫియా మాదిరి ప్రవర్తిస్తున్న తీరు ఏపీ బ్రాండే ఇమేజీని నాశనం చేస్తున్నాయి. చంద్రబాబు ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోకపోతే మానే, ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు. ఇదంతా ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నలలో జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు టీడీపీ ఇష్టారీతిన విధ్వంసానికి పాల్పడితే, అప్పటి సీఎం పేరును, మంత్రుల పేర్లను ఫలకాల నుంచి తొలగించి ఆనందపడితే, భవిష్యత్తులో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు ఇదే పరిస్తితి వారికి ఎదురు కాదా అన్న ప్రశ్న వస్తుంది. కాని సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం పలుమార్లు అనుభవం అవుతున్నా, టీడీపీకి చెందిన కొందరు మూర్ఖులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అంబేడ్కర్ దారిలో అలుపెరుగక..
‘ఈ ప్రపంచాన్ని జయించడానికి ప్రేమతో మొదలవ్వు. ప్రేమ త్యాగమై, యుద్ధ గీతమై, అదో గొప్ప పోరాటాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. నిన్ను విజేతగా నిలబెడుతుంది’ అంటారు 71 ఏళ్ల సాహితీ వేత్త, దళితోద్యమ నాయకుడు డా‘‘ కత్తి పద్మారావు. ఆయన జీవితం – సాహిత్యం – ఉద్యమాలు వేర్వేరు కావు. పరిణామ క్రమంలో ప్రవాహ సదృశ్యంగా కొన సాగుతూ వచ్చిన, గుణవాచి అయిన కాల ధర్మం! అంబేడ్కర్ దార్శనికతనూ, తాత్వికతనూ, వివేచనా నిపుణతనూ ఆకళింపు చేసుకున్న ప్రథమ శ్రేణి ఆచరణ శీలుడాయన.అంబేడ్కర్ మార్గంలో పూలే నుండి పెరియార్ మీదగా చార్వాకుడు, బుద్ధుని వరకూ... ఆ తరువాతి నవ్య సిద్ధాంతకర్తలనూ, చరిత్రకారులనూ పరి శీలించి ఆకలింపు చేసుకున్నారు. సంస్కృత పాండిత్యం వల్ల అపా రమైన అధ్యయనం, పరిశీలన, రచనా శక్తి అబ్బింది. జలపాతం సదృశ్యమైన వాక్చాతుర్యం, సమయ స్ఫూర్తి, ఉత్తేజ పరచటం, వాదనా పటిమలతో అత్యుత్తమ రీతిలో ప్రజ లకు చేరువయ్యారు. కారంచేడు, కొత్తకోట, నీరుకొండ, పిప్పర్ల బండ్ల పల్లి, చుండూరు, పదిరి కుప్పం, వేంపెంట, లక్షింపేట వంటి ఉద్యమాలలో నాయకునిగా నిలిచి, ప్రభుత్వాలతో పోరాడి, ప్రజాయుద్ధంతో విజ యాన్ని సాధించారు.కారంచేడు, చుండూరు వంటి ఉద్యమాలలో బాధితుల పక్షాన నిలబడి వారికి వందల ఎకరాల భూములు ఇప్పించి, బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ సహాయం ఏర్పాటు చేసి, ఉద్యోగాలు ఇప్పించి, చిల్లిగవ్వ కూడా ప్రభుత్వ సొమ్ములను ఆశించకుండా నిజాయితీగా, నిబద్ధతతో తమ రచనలను నమ్ముకుని, అమ్ముకుని జీవనం సాగిస్తున్న అక్షర సంపన్ను లాయన. పార్లమెంటు సాక్షిగా 111 మంది ఎంపీలతో ‘1989 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టా’న్ని తీసుకు రాగలిగారు.‘బౌద్ధ దర్శనం’, ‘చార్వాక దర్శనం’, ‘దళితుల చరిత్ర,’ ‘బ్రాహ్మణవాద మూలాలు’, ‘కులం ప్రత్యామ్నాయ సంస్కృతి’, ‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ’, ‘భారత రాజకీయాలు – కులాధిపత్య రాజకీయం – ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాలు’, ‘అంబేడ్కర్ చూపు’ వంటి 89 రచనలను అందించారు. ఆయన కుటుంబం అంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. స్వయంగా తన చేతుల మీదుగా కొన్ని వేల కులాంతర వివాహాలు జరిపించడం ద్వారా ఒక సామాజిక మార్పునకు మార్గదర్శిగా నిలిచారు. మొత్తంగా ఆయన రచనల సారాంశం... ఉద్యమ రూపం, ప్రశ్న, ప్రతిఘటన, ప్రగతిగా సాగుతుంది. సమకాలీన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సామా జిక రంగాల్లో కత్తి పద్మారావు పాత్ర ఎవరూ తిరస్కరింపలేనిది. – శిఖా ఆకాష్, నూజివీడు, 93815 22247 (రేపు డా. కత్తి పద్మారావు 71వ జన్మదినం సందర్భంగా...) -
అంబేడ్కర్ ఆలోచనల్ని ప్రతిఫలిస్తాయా?
నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ 3.0 ప్రభుత్వం 2024–25కి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతోంది. దీనిమీద అందరిలోనూ ఆసక్తి నెలకొని వుంది. అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచ వ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని అంబేడ్కర్ ఏనాడో చెప్పారు. షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన జరగాలంటే, వారికి భూములను పంచే ముఖ్య విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా అంబేడ్కర్ సూచించారు. దానికి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వాలి. కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచేందుకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి.2024–25 సంవత్సరానికి కేంద్రంలోని నూతన ఎన్డీఏ ప్రభుత్వం జూలై 22, 23 తేదీల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా దళితుల్లోనూ, స్త్రీలలోనూ, ఆదివాసీలలోనూ కొత్త ఆశలు కలుగుతున్నాయి. మొత్తం పార్లమెంట్లో 111 మంది దళిత ఎంపీలు ఉన్నారు. అస్పృశ్యతా నిర్మూలనకు, కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచే అంశాల పట్ల దేశంలో ఎంతో ఆసక్తి నెలకొనివుంది. ఈ క్రమంలో ముఖ్యంగా స్త్రీ సాధికారత భారతదేశంలో చాలా అవసరంగా కనిపిస్తుంది. పురుషుల సంఖ్యతో దాదాపు సమానంగా ఉన్న స్త్రీలలో 20 కోట్ల మందికి పనిలేదు. ముఖ్యంగా దళిత స్త్రీలకు సొంత భూమి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. భూమి చరిత్ర చూస్తే భూస్వామ్య ఆధిపత్య కులాలకే భూమి ఉంది. భూమి ఉత్పాదకతపై వారికి పూర్తి అవగాహన ఉండేది. సమాజంలో వారు బలమైన వర్గంగా వ్యవహరించేవారు. అందుకే కేంద్ర పాలకులు వారిని విస్మరించడం కానీ, వారితో వైరం పెట్టుకోవడం కానీ జరిగేది కాదు. తరతరాలుగా పాలకవర్గాలు అగ్రకులాలకు భూ వసతిని కల్పించడంలోనూ, వాటికి నీటి వసతి కల్పించడంలోనూ జాగరూకతతో ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ భూపరిమితి చట్టాన్ని 1958లో అప్పటి ప్రభుత్వం తెచ్చింది. అది జూన్ 1961లో అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకూ దానికి తూట్లు పడుతూనే వున్నాయి. ప్రధానమైన విషయం ఆంధ్రప్రదేశ్ వ్యావసాయిక రాష్ట్రం. ఇందులో 69.7 శాతం మంది వ్యవసాయ కూలీలు. అందులో 90 శాతం మంది దళితులు. ఈ దళితులకు ఉన్నత స్థాయి కలిగించాలంటే తప్పకుండా వీరికి భూమి ఇవ్వాలి. రాను రాను వ్యవసాయ కూలీపని మీద శిథిలమౌతున్న వృత్తులవారందరూ ఆధారపడుతున్నారు.పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి రేటు విపరీతంగా పెరగడం వల్ల ఏ వ్యవసాయ కూలీలైతే భూమిని చదును చేసి వ్యవసాయీకరించారో వారు భూమి కొనలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. అలాగే కృష్ణా డెల్టాలో అసలు మిగులు భూమి లేదని అధికారులు ప్రకటిస్తున్నారు. ఇటు వ్యవసాయ కూలి పని లేక, అటు ప్రభుత్వం భూమి ఇవ్వక, గ్రామాల్లో ఉండే పరిస్థితులు లేక తీవ్రమైన వలసలకు దళితులు గురి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం రూ.1,000 కోట్లు అయినా భూమి కొనుగోలు పథకానికి కేటాయించవలసిన అవసరం ఉందని సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మొదటి ప్రణాళిక సంఘంలోనే భూమి కొనుగోలు పథకానికి 20 కోట్ల కేటాయింపు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి.అంబేడ్కర్ 1954 సెప్టెంబర్ 6వ తేదీన రాజ్యసభలోని చర్చల్లో ఇలా నివేదించారు: ‘‘ఆర్యా! నేనిప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన సమస్యను ప్రస్తావిస్తున్నాను. చదువుతో పాటుగా ఉద్యోగాలు కూడా షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఎక్కువ ప్రాధాన్యమైనవి. అయితే ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఏమి అవకాశాలున్నాయి? షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన లాభదాయకమైన వృత్తులలో ప్రవేశం పొందే అవకాశం మీదనే ఆధారపడి ఉందని స్పష్టమైంది. లాభదాయకమైన వృత్తుల్లోకి ద్వారాలు తెరవబడనంత వరకు, వారి ఆర్థిక విమోచన జరిగే వీలు లేదు. వారు బానిసలుగానే మిగిలి పోతారు. బానిసలు కాకపోయినా, గ్రామాలలో భూస్వాముల సేవకులుగా మిగిలిపోతారు. ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఆర్యా! నిస్సందేహంగా షెడ్యూల్డ్ కులాల వారికి ప్రభుత్వంవారు భూమిని పంచే ముఖ్యమైన విషయంపై దృష్టి ఉంచాలి. భూస్వాముల పొలాలపై పరిమితిని విధించి, అంతకన్నా ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానిని షెడ్యూల్డ్ కులాల వారికి ఇవ్వాలి. రెండవదేమిటంటే అమ్మకానికి వచ్చిన భూమిని కొనుక్కోవటం కోసం వారికి ఋణాలివ్వాలి.’’ఇకపోతే స్త్రీలకు భారతదేశ వ్యాప్తంగా కుటీర పరిశ్రమలు రూపొందించి వాటిని వస్తూత్పత్తి కేంద్రాలుగా రూపొందించాలి. అక్కడ తయారైన వస్తువులకు ప్రపంచ మార్కెట్లో స్థానం ఏర్పాటు చేయగలిగితే మన స్త్రీలు చైనాను మించిపోతారు. నిజానికి గత రెండు దశాబ్దాలుగా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చైనా నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల గ్రాడ్యుయేట్ యువతలో నిరుద్యోగ రేటు 42 శాతానికి పెరిగింది. దీని వల్ల నిరుద్యోగులలో నిరాసక్తత, సోమరితనం పెరుగుతున్నాయి. మత్తు మందుల వాడకం పెరగడానికి కూడ నిరుద్యోగితే కారణం. ఈ నిరుద్యోగుల్లో మహిళలు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. స్త్రీల విద్య, ఉపాధి విషయాల గురించి అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లులోనూ, ఆ తరువాత పార్లమెంట్ చర్చల్లోనూ ఎన్నో సలహాలు ఇచ్చారు. వాటిని పెడచెవిన పెట్టడం వల్లే ఈ రోజున స్త్రీలు చదువుకొని కూడా అటు వ్యవసాయపని చేయలేకా, ఇటు ఉద్యోగం దొరక్కా సంక్షోభంలో ఉండిపోయారు. నిరుద్యోగ నిర్మూలన కోసం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి. దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను దేశం మొత్తంగా మండలానికి ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి గురుకుల పాఠశాలల్లోనే దళితులకు సరైన విద్య, ఆహారం లభిస్తాయి. ఈ బడ్జెట్లో కుల నిర్మూలన కోసం, కులాంతర వివాహితుల రక్షణ కోసం కూడా కేటాయింపులు తప్పకుండా అవసరం. కుల నిర్మూలనను ఒక ఉద్యమంగా చేపట్టడం వల్ల సమాజంలో విస్తృతమైన మార్పులు వస్తాయనీ, సామాజిక సమతుల్యత ఏర్పడుతుందనీ అంబేడ్కర్ స్పష్టం చేశారు. అందుకే సాంఘిక స్వాతంత్య్రాన్ని, మేధా స్వాతంత్య్రాన్ని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని, రాజకీయ స్వాతంత్య్రాన్ని ప్రజలకు కలిగించాలంటే దానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని సూచించారు. దేశ బడ్జెట్ అనేది ఉత్పత్తి శక్తుల మానసిక, శారీరక సౌష్టవాన్ని పెంచే దిశగా ఉండాలన్నారు. తాగుడు, సిగరెట్, ఇతర వ్యసనాల నుండి దూరం చేసే నైతిక అధ్యయన కేంద్రాలు పెంచడం వల్ల సంపద మిగులు ఏర్పడుతుందని చెప్పారు. యువకుల నైపుణ్యాలను పెంచే కేంద్రాలను పెంచడం వల్ల వాళ్లు ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందగలుగుతారనీ, ఆధీనత భావాన్ని తగ్గించే దిశగా బడ్జెట్ ఉండాలనీ సామాజిక, ఆర్థికవేత్తలు కోరుతున్నారు. శ్రమ నుండే మానవాళి అభివృద్ధి జరుగుతుంది. శ్రమ నుండే చైతన్యం వస్తుంది. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు కల్పించినా ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందరు. వారిలో ఉత్సాహాన్ని, జీవన భద్రతని కల్పించాలంటే వారు చేసే పనికి ప్రతిఫలం లభించాలి. ‘ప్రభుత్వం ఏదైనా ఇస్తే బతుకుదాం’ అనే పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. దీని వల్ల చాలా నష్టం కలగడమే కాక జాతుల్లో అలసత్వం పెరిగే ప్రమాదం ముంచుకొస్తుందని అంబేడ్కర్ ప్రజలకు ఉద్బోధించారు. నిజానికి ఆయన భూమిని జాతీయం చేయండి, పరిశ్రమలను జాతీయం చేయండి అని పిలుపును ఇచ్చిన మేధావి. భారతదేశంలో అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచవ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని చెప్పారు. విద్య, విజ్ఞానం, ఉత్పత్తి, భూపంపిణీ, సామాజిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, స్త్రీ అభివృద్ధి, యువశక్తి వినియోగం, వృద్ధుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, నదుల అనుసంధానం... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగినపుడు భారతదేశం నిజమైన వికాసాన్ని, ప్రాభవాన్ని పొందుతుందని చెప్పారు. ఆ దిశగా పాలకులు, ప్రజలు నడుస్తారని ఆశిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
డా. బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికీ తలమానికం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల… pic.twitter.com/Da4B5jWmQo — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2024 -
దేశ భవిష్యత్తుకు దిక్సూచి!
ప్రపంచ మేధావి, ఆలోచనాపరుడు, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్న ఒక చారిత్రక ఉత్సవం. అంబేడ్కర్ నిరంతర అధ్యయనం, విశ్లేషణ, తర్కం, హేతు వాదం, మానవతావాదం; ఆర్థిక,సాంఘిక, రాజకీయవాదాలు; బౌద్ధ విప్లవ ప్రస్థానం... ఆయన విస్తృతినీ, వ్యాప్తినీ, ప్రాపంచిక తాత్విక దృక్పథాన్నీ మనకు సాక్షాత్కరింప జేస్తున్నాయి. ఆయన ఒక వాల్టేర్ లాగా, రూసో లాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు. ఆయన వ్యక్తిత్వంలో విద్యా జ్ఞానం, పరిశోధన, నైతికత, విమోచన కలిసి నడుస్తాయి. ఆయన బహుభాషా నిష్ణాతులు. మరాఠా భాష ఎంత బలంగా వచ్చో ఇంగ్లీషు, జర్మనీ కూడా అంతే నిశితంగా వచ్చు. ఆయన ఒక భాషా నిఘంటువు. ఆయన విద్యాభ్యాసంలో ఒక యుద్ధ ప్రక్రియ ఉంది. ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణులు. అంబేడ్కర్ అపారమైన జ్ఞాపక శక్తి కలవారు. రాజ్యాంగ సభ డిబేట్స్‌లో కొన్ని వందల అంశాలు చూడకుండా చెప్పగలిగే వారు. ఆయన వాక్చాతుర్యా నికీ, వాదనా పటిమకూ, విషయ పరిజ్ఞానానికీ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజాజీ వంటి వారు అచ్చెరువొందేవారు. అంబేడ్కర్ సున్నితమైన హాస్య చతురుడు. చక్కని చిరునవ్వుతో ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవి. ఆయన చూపుడు వేలు ప్రపంచానికి ఓ ప్రశ్నోపనిషత్తు వంటిది. అంబేడ్కర్ 1913లో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా ‘బ్రిటిష్ ఇండియాలో ప్రొవెన్షియల్ ఫైనాన్స్ పరిణామం’ అనే థీసిస్ రాసి ఎందరి మెప్పునో పొందారు. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పుచ్చు కోవడం కోసం రాత్రింబవళ్లు శరీరం శుష్కించే వరకూ చదివారు. విద్య పట్ల అంబేడ్కర్ దృక్పథాన్ని గమనిస్తే ఆయన విద్య అంటే కేవలం అక్షరాస్యత అనో, చదువనో అనుకోలేదని స్పష్టమ వుతుంది. విద్య మనిషిని సంపూర్ణంగా మార్చగలిగే సాధనమ న్నది అంబేడ్కర్ నమ్మకం. ఈ విషయంలో ఆయనపై బౌద్ధ ధర్మ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడి బోధనలు, తాత్విక చింతన కేంద్రంగానే అంబేడ్కర్ విద్యను అభ్యసించారు. విద్య పర మార్థం ప్రజ్ఞ, కరుణ, సమత అనీ, ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుతుందనీ అంబేడ్కర్ భావించారు. సమాజంలో విద్య ద్వారా చైతన్యం వస్తుందన్న ఉద్దేశంతో ఆయన విద్యా వ్యాప్తి కోసం 1945 నుంచి ఒక ఉద్యమం ప్రారంభించారు. ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అనేక విద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. జ్ఞానం, కరుణ అనేవి తాను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యా లుగా పేర్కొన్న అంబేడ్కర్ ‘హక్కుల సాధన కోసం చదువుకోండి! సంఘటితం కండి! పోరాడండి! మీపైన మీరు విశ్వాసం పెంచుకోండి! ఏ రకంగా కూడా మనకు ఓటమి ఉండదు. ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం, స్వేచ్ఛ కోసం సాగిస్తోన్న యుద్ధం, ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగిపొందడానికి చేస్తున్నది’ అని ఉద్బోధించారు. సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విజ్ఞానం ద్వారా, విజ్ఞానం విద్య ద్వారా అందుతాయన్నది అంబేడ్కర్ మార్గం. అలాగే దళితులు చదువు కోవడం ద్వారా సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడే అవకాశం ఉండదనీ, తద్వారా తమ తరతరాల కులవృత్తులు చేస్తున్నందువల్ల ఎదురవుతున్న చిన్నచూపు తప్పుతుందనీ అంబేడ్కర్ ఆలోచన. అంబేడ్కర్ మనుస్మృతి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన పాండిత్యం, విజ్ఞత, మానవతా దృష్టి, బౌద్ధనీతి, సమ సమాజ భావన, భారత రాజ్యాంగంలో సముచితంగా సమన్వయించబడ్డాయి. అంబేడ్క ర్లో కుల నిర్మూలనా భావం, దార్శనికత, అహింసాతత్వం, భారతదేశాన్ని రక్తపాతం లేని దేశంగా సృష్టించగలిగింది. రాజ్యాంగంలో స్త్రీలందరికీ చదువుకునే హక్కు ఇవ్వటం ద్వారానూ, అçస్పృశ్యులందరికీ రిజర్వేషన్ కల్పించడం ద్వారానూ, శూద్రులందరికీ హక్కులు కల్పించడం ద్వారానూ ఆయన సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. అంబేడ్కర్ విద్యా విప్లవంతో పాటు రాజకీయోద్యమాన్నీ నడిపారు. 1936 ఆగస్టులో దళిత జాతుల సముద్ధరణకు ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’(ఐఎల్పీ)ని ఆయన స్థాపించారు. ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన పది హేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్ సీట్లను కూడా రెండింటిని కైవసం చేసుకుంది. ఆయన ‘లేబర్’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్ని రూపొందించారు. ఆర్థికంగా, సాంఘికంగా అణగదొక్కబడిన వారందరినీ ఈ పార్టీ లోనికి తేవడానికి ప్రయత్నించారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును బట్టి ఆ పార్టీ దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదని డా‘‘ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశ్యంతో అంబేడ్కర్ 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్) ను స్థాపించారు. ఆ సందర్భంగా దళితుల సాంఘిక, ఆర్థిక హక్కు లను సాధించడానికి వారికి రాజకీయ అధికారం కావాలని ప్రబోధించారు. 1962లో విడుదల చేసిన ప్రణాళికలో ఆయన తన వామ పక్షాల భావాలను ప్రకటించారు. భారతీయుడైన ప్రతివాడూ ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు. ప్రతి మనిషికీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛను సాధించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగదొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని కోరారు. ఏఐఎస్‌సీఎఫ్ నుండి రిపబ్లికన్ పార్టీ వరకు నడిచిన దారిలో దళితుల కోసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానతల కోసం తన శక్తిని ధారపోశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను పార్టీగా ప్రకటించక ముందే ఆయన పరి నిర్వాణం చెందారు. ఈ విధంగా అంబేడ్కర్ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, తాత్వికంగా, భారతీయ సమాజాన్ని పునః నిర్మించటానికి కృషి చేశారు. ఆయన ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు. ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవి ష్యత్తుకు దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 (నేడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ జయంతి) -
రాజ్యాంగమే సమ సమాజానికి దిక్సూచి
భారతదేశంలో రాజ్యాంగం అమలైన జనవరి 26 ఒక మహత్తరమైన పండుగదినం. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తానని భరోసా ఇచ్చింది. సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యతా భావన, సోదర భావన కలిగించడానికే రాజ్యాంగం రూపొందింది. సమతా భావాలను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాల నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆయన స్ఫూర్తి పొందినా... బౌద్ధ తత్వంలోని ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, తర్కం, ప్రశ్న వంటి అనేక భావాల్ని పొందుపర్చడం వల్లే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రక్తపాతం లేని సమాజంగా భారతదేశం రూపుదిద్దుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్... మహా మేధావి, ఆలోచనాపరుడు, లౌకికవాద శిఖరం, సమతా దర్శనకర్త, గొప్పవక్త, లోతైన రచయిత. ఆయన శైలిలో గాఢత, విశ్లేషణ బలంగా వుంటాయి. విద్యా సంపన్నమైన ఆయన భాషలో సరళత, అభివ్యక్తిలో సాంద్రత కనిపిస్తాయి. అంబేడ్కర్ మానవ హక్కుల పోరాట ధీరుడు. బౌద్ధంలో ఉన్న సామాజిక సమతా నీతిని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆయన జీవితంలో అస్పృశ్యతను ఎదుర్కోవడం ప్రధాన అంశం అయ్యింది. మానవోత్తేజితమైన, వైజ్ఞానికమైన ఎన్నో కార్యక్రమాల్లో అస్పృశ్యులకు చోటు లేకపోయిందని మథనపడ్డారు. అందువలననే అస్పృశ్యతా నివారణా చట్టం గురించి పోరాడారు. ఈ సమాజాన్ని అస్పృశ్యత లేని సమాజంగా రూపొందించాలని తపన పడ్డారు. దాని వల్ల ఎంతో మంది తమ ప్రతిభకు తగిన స్థానం లేక సంఘర్షణకు గురయ్యారు, అణచి వేయబడ్డారు. అంబేడ్కర్ ఒక తాత్వికుడు కూడా. కుల సమాజానికి ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలనా సమాజాన్ని బోధించారు. అగ్రకుల రాజ్యాధికారంలో దళితులకు విముక్తి లేదని చాటారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవడానికి రాజ్యాధికారం అవసరం అని ప్రబోధించారు. ఆయన రాజకీయ తత్వశాస్త్రం భావాత్మకమైంది కాదు... అది సాంఘిక, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల సత్తా కలిగినది. బొంబాయి వంటి నగరాల్లో కూడా కులతత్వం వ్యాపించి ఉండ టంతో అంబేడ్కర్ సోదరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుల తత్వపు గొడ్డలి వేటు వారిని చిన్నప్పుడే తాకింది. ఒకే పాఠశాలలో చదివే పిల్లలు ఒక కూజా నీళ్ళు తాగలేకపోవడం, తోటి విద్యార్థులు ఆ కూజాలోని నీళ్ళను పైనుంచి పోస్తే దోసిళ్ళు పట్టి త్రాగవలసి రావడం వంటి ఘటనలు అంబేడ్కర్ గుండెల్ని పిండివేశాయి. ఆ గాయాలే రాబోయే కాలంలో కుల నిర్మూలన గ్రంథం రాయడానికి పునాదులేశాయి. కేవలం నీటి దగ్గరే కాదు, భాష దగ్గర కూడా ఆయనకు అస్పృశ్యత ఎదురైంది. అంబేడ్కర్ హైస్కూల్లో ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని కోరుకున్నారు. ఒక అస్పృశ్యుడు సంస్కృతం నేర్చుకోవడం ఏమిటని నిరాకరించారు. దాంతో పర్షియన్ భాషను తీసుకోవలసి వచ్చింది. కానీ సంస్కృతాన్ని స్వయంగా కష్టపడి నేర్చుకున్నారు. వాల్మీకి, వ్యాసుడు, కపిలుడు, లోకాయతులు ఇంకా ఎందరో బ్రాహ్మణేతరులు, క్షత్రియులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. ఎందరో పాశ్చాత్య పండితులు సంస్కృతం నేర్చుకుని, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కావ్యాలు, అన్నీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అంబేడ్కర్ కూడా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అన్నింటినీ అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ఏ భాషైనా, ఏ మనిషైనా నేర్చుకోవచ్చని నిరూపించారు. అభివృద్ధిని తరచిచూస్తే... దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు గొప్పగా చెప్పుకొంటున్నాం. కానీ గణతంత్ర దినోత్సవ వేళ కొన్ని కఠిన వాస్తవాలను మనం అంగీకరించాల్సి ఉంటుంది. 2023 ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల్లో ఇండియా 111వ స్థానంలో ఉంది. దేశంలో 81.35 కోట్ల మందికి ఇప్పటికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వస్తున్నదంటేనే దేశం ఎక్కడ ఉన్నదో అర్థమవుతుంది. కూడు, గూడు, బట్ట లేని ప్రజలు ఇంకా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలవుతున్నట్టా అనే ప్రశ్న ఎదురవుతుంది. అంబేడ్కర్ భూమిని జాతీయం చెయ్య మన్నారు. కానీ అదేమో కార్పోరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తిండి గింజల వల్ల ఇక్కడి వ్యవసాయం సంక్షోభంలో వుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్త్రాల వల్ల చేనేత పరిశ్రమ కుంటుపడింది. భారతదేశంలో పేదరికం ఎందుకు ఉందంటే రాజ్యాంగాన్ని నూటికి 90 శాతం ఉల్లంఘించడం వల్లనే అని చెప్పొచ్చు. ప్రజలు ఇప్పటికీ అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టినా, ఎన్నో పట్టణాలు ఇంకా మురికి కూపాలుగానే వున్నాయి. వందశాతం బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించినవాటిల్లో కూడా 71 శాతం మేరకే నిరోధించగలిగారని జాతీయ గణాంక కార్యాలయ సర్వే వెల్లడించింది. ఇళ్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరువాతే బయటకు వదిలే నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ వ్యవస్థ సరిగ్గా లేని నగరాలకూ పురస్కారాలు ఇవ్వడం... పోటీ నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తుతోంది. ఇకపోతే రోడ్లు నెత్తుటిమయం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకూ 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, 19 మంది మృత్యువాత పడుతున్నారని 2022 నాటి గణాంకాల్ని కేంద్ర సర్కారే ప్రస్తావిస్తోంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ప్రమాదాల్లో 11.9 శాతం, మృతుల సంఖ్యలో 9.45 శాతం, క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదల రహదార్ల రక్తదాహ తీవ్రతను కళ్లకు కడుతోంది. రోడ్డు ప్రమాద మృతుల్లో 18–45 ఏళ్ల వయస్కులే 69 శాతం దాకా ఉంటున్నారన్న వాస్తవం గుండెల్ని మెలిపెట్టేదే. కుటుంబ పోషణకు రోడ్డెక్కిన మనిషి అకాల మృత్యువాత పడితే, ఇంటిల్లిపాదీ రోడ్డున పడే దుఃస్థితి ఏటా లక్షల మంది అభాగ్యుల్ని దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకా తగ్గితే, అంతకు రెట్టింపు ఇండియాలో పెరగడం నిశ్చేష్టపరుస్తోంది. రహదార్ల మారణహోమానికి కారణమేమిటో సుప్రీంకోర్టే నియమించిన నిపుణుల కమిటీ పూసగుచ్చినా, సరికొత్త మోటారు వాహనాల చట్టం ద్వారా అవ్యవస్థను ఊడ్చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా జరిగిందీ ఒరిగిందీ ఏమీ లేదు. వాహన వేగాన్ని 5 శాతం తగ్గించ గలిగినా ప్రమాద మరణాల్ని 30 శాతం దాకా నియంత్రించగల వీలుందని తెలిసినా ‘ఏడెనిమిది సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగం’ అందుకొనే శకటాలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు? ఇకపోతే వాయు కాలుష్య భూతం భయపెడుతోంది. శారీరక మానసిక సమస్యలు పెంచి, ఏటా లక్షల కుటుంబాల్లో శోక సంద్రాల్ని ఉప్పొంగిస్తున్న వాయు కాలుష్య భూతం గర్భస్త పిండాల్ని సైతం కర్కశంగా కాటేస్తోంది. వాయు కాలుష్యంతో పోటీపడుతూ... గాలిలో, నీటిలో, భూమిపై అంతటా పరుచుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆరోగ్య, ఆహార రంగాల్లో పెను సంక్షోభం సృష్టిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా ప్రమా దమే. అవి మనుషుల దేహాల్లోకి చొచ్చుకుపోయి, శరీర కణాలను దెబ్బతీస్తాయనీ, క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందనీ ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరించారు. అందుకే అంబేడ్కర్ ఆశయాలు రాజ్యాంగంలో ప్రతిఫలిస్తు న్నాయా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి రాజ్యాంగంలో ఆయన ఆలోచనలు ప్రతిఫలిస్తే 100 శాతం అక్షరాస్యత ఏర్పడుతుంది. విద్య మహోన్నత స్థాయికి చేరుతుంది. ప్రపంచం గర్వించే మేధో సంపన్నులు ఆవిర్భవిస్తారు. పేదరిక నిర్మూలన జరిగి, సమ సమాజం ఏర్పడుతుంది. స్త్రీలు ఆత్మ రక్షణతో, పురుషులతో సమానంగా జీవించగలుగుతారు. యువత శక్తి సంపన్నులై సంపదను సృష్టించగలుగుతారు. నిరుద్యోగం, పేదరికం లేని సమ సమాజం ఏర్పడుతుంది. అందుకే రాజ్యాంగ మార్గంలో నడుద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: విజయవాడ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు..
మనం ఎవరిమైనా అమెరికాకు వెళ్లినప్పుడో, ప్రత్యేకంగా న్యూయార్క్ నగరానికి వెళ్లినప్పుడో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని అనుకుంటాం. మనం ఆ నగరానికి వెళ్లామన్న సంగతి తెలిసిన స్నేహితులు కూడా లిబర్టి విగ్రహాన్ని చూసి వచ్చావా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అమెరికానే వెళ్లనవసరం లేదు. ఆ స్థాయి విగ్రహాన్ని చూడాలంటే విజయవాడ నగరాన్ని సందర్శిస్తే చాలు. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం అంతకన్నా గొప్పగా కనిపిస్తుంంది. కృష్ణానది ఆవల నుంచి సుమారు పది, పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహం దర్శనమిస్తుంది. దేశ రాజ్యాంగ నిర్మాతగా వాసికెక్కిన డాక్టర్ BR అంబేడ్కర్ భారీ విగ్రహం అది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా, ఒక ప్రఖ్యాత టూరిస్టు కేంద్రంగా రూపుదిద్దుకునే అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుంది. ఇది వినడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది! మూడేళ్ల క్రితం వరకు విజయవాడలో ఇంత పెద్ద టూరిస్ట్ స్పాట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని ఒక నేత సమర్ధతకు నిదర్శనంగా ఇది రూపొందింది. ఆయన ఎవరో కాదు.. ఏపీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అని వేరే చెప్పనవసరం లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా మూడు అంతస్థులలో అంబేడ్కర్‌కు చెందిన వివిధ చిత్రపటాలు, డాక్యుమెంటరీలు, ఆయన గురించి తెలియచేసే సినిమాను వేయడానికి వీలుగా ఒక హాలు, ఎన్నో విశేషాలు అందులో కనిపిస్తాయి. 206 అడుగుల ఎత్తున తయారైన ఈ విగ్రహ ప్రాంగణం అంతా రంగు, రంగుల కాంతుల మధ్య అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. అక్కడే పలు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. నగర ప్రజలకే కాకుండా, విజయవాడ సందర్శించే టూరిస్టులకు కూడా అదొక విజ్ఞాన, వినోద కేంద్రంగా భాసిల్లబోతోంది. దేశ ప్రజలకు స్వేచ్చను, ప్రత్యేకించి బలహీనవర్గాలకు ఎంతో స్పూర్తిని ఇచ్చే ఈ విగ్రహ ప్రతిష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటికీ, దానిని మించిన రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఢిల్లీలో విగ్రహం తయారీతో పాటు హంగులను స్థానికంగా హనుమాన్ జంక్షన్‌కు చెందిన శిల్పిద్వారా చేయించడం కూడా హర్షించదగిన అంశమే. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నారు. అందులో వివిధ బలహీనవర్గాల ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెబుతున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలియజేసినట్లయింది. కేవలం విగ్రహంతోనే అభివృద్ది అయిపోతుందని కాదు. కాని ఆ విగ్రహాన్ని చూస్తే వచ్చే చైతన్యం, అనుభూతి చెప్పనలవికానిది. ఏదో కొద్ది మంది అగ్రవర్ణ దురహంకారులకు తప్ప, సమానత్వం కోరుకునే ఎవరికైనా ఈ విగ్రహం చూడగానే ఒక అనుభూతి కలుగుతుంది. ఏపీలోని వివిద జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ విగ్రహాన్ని వీక్షించనున్నారు. గతంలో అమరావతి రాజధాని పేరుతో ఒక భ్రమరావతిని సృష్టించాలని భావించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడో మారుమూల, ఎవరికి కనిపించని చోట అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని చూశారు. ఇందు కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయం చేశారు. అయినా ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. చంద్రబాబు హయాంలో చాలామంది అంబేడ్కర్ అభిమానులు ఎవరికి కనిపించని చోట విగ్రహం పెట్టడమేమిటని విమర్శించేవారు. అయినా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదు. చిత్తశుద్దితో చేసి ఉంటే అక్కడ విగ్రహం తయారై ఉండేదేమో! మొక్కుబడి కార్యక్రమంగా సాగించారన్న భావన ఉంది. తదుపరి వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కన్నా, విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలనే కాక, దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకర్షించవచ్చని భావించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరుగాంచిన అంబేడ్కర్ విగ్రహంతో పాటు విజయవాడ నగరవాసులకు ఆహ్లాదంగా ఉండేలా అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తలపెట్టారు. మూడేళ్ల నుంచి అందుకు సన్నాహాలు సాగించారు. నిజానికి ఆరు నెలల క్రితమే ఈ పనులు పూర్తి చేయాలని అనుకున్నారు కాని, సాధ్యపడలేదు. అయినా పనుల వేగం పెంచి జనవరి 19న ప్రారంభోత్సవానికి రంగం సిద్దం చేశారు. ఇది జగన్ సమర్ద నాయకత్వ లక్షణానికి దర్పణం పడుతుంది. 'చెప్పాడంటే చేస్తాడంతే!' అన్న నమ్మకానికి అనువుగా ఈ విగ్రహం ఏర్పాటు పూర్తి అయింది. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఏర్పాటు అవుతోంది. ఇప్పటికే విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద, కనకదుర్గమ్మ గుడి వద్ద భారీ వంతెనలను పూర్తి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణలంక ప్రాంతంలో నివసించే వేలాది మంది బీద ప్రజలకు పెద్ద ఊరట కల్పిస్తూ.. నది అంచున రిటైనింగ్ వాల్ నిర్మించింది. కిలోమీటర్ల కొద్ది నిర్మించిన ఈ వాల్ కూడా విజయవాడ అభివృద్ధికి మారుపేరుగా కనిపిస్తుంది. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేని విశిష్టమైన పనులను చేపట్టి, పూర్తి చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మన్ననలు పొందగలుగుతున్నారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అందరికి ఆహ్వానం పలుకుతూ జగన్ ఇచ్చిన సందేశం కూడా హృద్యంగా ఉంది. ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశగతిన మార్చిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని ఆయన ప్రశంసించారు. పెత్తందార్ల భావాలపై తిరుగుబాటుకు స్పూర్తి ఇచ్చేలా అంబరాన్ని తాకేలా ఈ సమాజిక న్యాయ మహాశిల్పం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) ఏర్పాటు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు తన చేతితో ఒక దిశను చూపుతున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం నిజంగానే విజయవాడ ప్రతిష్టను అకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంత బ్రహ్మాండంగా విగ్రహ ప్రారంభోత్సవం జరుగుతుంటే నిత్యం ఏడ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా యధా ప్రకారం పెత్తందారి, అగ్రవర్ణ దురహంకార మనస్తత్వంతో చెత్త కథనాలను ప్రచురించింది. నీచత్వానికి పరాకాష్టగా రామోజీ, రాధాకృష్ణలు వ్యవహరిస్తూ తమ మీడియాను దిగజార్చుతూ ఈ రోజు కూడా ఛండాలపు స్టోరీలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. సుమారు నాలుగు వందల కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
సామాజిక బందీల విముక్తి ప్రదాత!
ప్రపంచంలోని వివిధ సమాజాలు తమకు నచ్చిన తాత్త్విక మార్గాల్లో ప్రయాణిస్తూ మనుగడ సాగించడం అనాదిగా వస్తున్నదే.. అయితే కొన్ని సమాజాల్లో అనేక సమూహాలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా బందీలై కనీస మానవ హక్కులకూ దూరమయ్యాయి. భారతీయ సమాజంలోని అస్పృశ్యులూ, ఆదివాసులూ, మహిళలూ, ఇతర అణగారిన సమూహాల వారు అటువంటి వారిలో కొందరు. తత్త్వశాస్త్రానికి మూల జీవం మానవ దుఃఖ నివారణ. ఇందుకోసం బుద్ధుడు, సోక్రటీస్, మార్క్స్ వంటి వారు ఎంతగానో ప్రయత్నించారు. ఇటువంటి తాత్త్వికులను అధ్యయనం చేసి అంబేడ్కర్ తన ఉపన్యాసాలు, రచనల ద్వారా పీడిత, తాడిత జనుల ఉద్ధరణకు ప్రయత్నించారు. ఆయన ఫిలాసఫీ భారత రాజ్యాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. అంబేడ్కర్ ప్రాసంగికత నానాటికీ పెరుగు తుందనడానికి నవంబర్ 26వ తేది రాజ్యాంగ అవతరణ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరగడం వల్ల మనకు అర్థమౌతోంది. అంబేడ్కర్ సిద్ధాంతాలు ప్రపంచ తాత్త్వికులకు సమ తుల్యమైనవి, తులనాత్మకమైనవి కూడా. అంబేడ్కర్ రచనా వైవి ధ్యంలో సోక్రటీస్, ప్లేటో, బుద్ధుడు, అరిస్టాటిల్ ఉన్నారు. ‘జ్ఞానవం తుడైనవాడు తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పకపోతే మూర్ఖుడ వుతాడు’ అనే సత్యాన్ని సోక్రటీస్ చెప్పాడు. అందుకు రాజ్యానికి, దేశానికి భయపడని నిర్భీతి తత్త్వాన్ని ఆయన ప్రదర్శించాడు. అదే తత్త్వం అంబేడ్కర్లో మనకు కనిపిస్తుంది. అందుకు సత్యాన్వేషణ, ధీశక్తి, శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధత అవసరం. వాటిని సోక్రటీస్ స్థాయిలో ఆధునిక యుగంలో వ్యక్తీకరించిన వాడు అంబేడ్కర్. ఆయన ముఖ్యంగా వేదాలకూ, స్మృతులకూ ప్రత్యామ్నా యంగా భారత రాజ్యాంగ దర్శనాన్ని రూపొందించాడు. అందుకు బుద్ధుని తత్త్వం ఆయనకు వాహిక. ఆయన సమాజంలో మానవతా స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేశాడు. అందుకు కారణం ఆయన హృదయ భావం, ఆయన చాలా సున్నిత హృదయుడు. ఆయన సున్నితత్వంలో కరుణ వుంది, ప్రేమ వుంది, ఆత్మీయత వుంది. అంకిత భావం వుంది. ఈ గుణాలు నాయకుణ్ణి ప్రవక్తగా తీర్చిదిద్దాయి. అందుకే ఆయన అణ గారిన ప్రజల తరఫున మాట్లాడాడు. ఈ దేశంలో కోట్లాదిమంది ప్రజలు అస్పృశ్యత అనే శాపంతో క్రుంగిపోయారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఉపద్రవం ఇది. ప్రతి మానవుడికీ ఉండవలసిన ప్రాథమిక హక్కులు వారికి తిరస్క రించబడ్డాయి. నాగరికత, సంస్కృతి ఫలాల లబ్ధిని వారికి అంద నివ్వలేదు. అస్పృశ్యులే కాకుండా ఈ దేశంలో అంతే పెద్ద సంఖ్యలో ఆదిమ జాతులు, గిరిజన తెగలు ఉన్నాయి. నాగరిక, సాంస్కృతిక స్రవంతిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయకుండా వారిని ఆటవిక, సంచార జాతులలా తిరిగేలా వదిలి పెట్టారు కులీనులు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన తన వాదాన్ని తాత్త్వికంగా మలిచాడు. కుల నిర్మూలనా వాదాన్ని ఇలా ప్రతిపాదించాడు. ‘‘కుల వ్యవస్థను సమర్థించడానికి వారసత్వం గురించీ, నరసంతతి శుద్ధి శాస్త్రం గురించీ చెత్తవాదన ఎంతో లేవనెత్తబడింది. నరవంశ శుద్ధిశాస్త్రం (యూజెనిక్స్) ప్రాథమిక సూత్రానికి కుల వ్యవస్థ అనుగుణంగా ఉంటే దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఎందు కంటే స్త్రీ పురుషులను వివేకంతో జత కలపడం ద్వారా జాతి అభి వృద్ధిని సాధించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే వివేక వంతమైన స్త్రీ, పురుష సంయోగాన్ని కుల వ్యవస్థ ఏ విధంగా సాధిస్తున్నదో అర్థం కావడం లేదు. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన ఒక కృత్రిమ వ్యవస్థ. అది చేస్తున్నదల్లా వివిధ కులాల స్త్రీ పురుషులు కులాంతర వివాహాలను చేసుకోకుండా నిషేధించడం. ప్రకృతి సిద్ధమై నది కాదది, ఒక కులంలో ఏ ఇద్దరు కలసి వివాహం చేసుకోవాలని ఉన్నదో నిర్ణయించే పద్ధతి కాదది. జాతి శుద్ధి శాస్త్రం దృష్ట్యా ఒక కులమే ఒక ప్రత్యేక మూల జాతి అయితే... ఉపకులాల పుట్టుక కూడా అదే విధంగా అయి వుండాలి. అయితే ఉప కులాల మూలం కూడా యూజినిక్సే అని నిజంగా ఎవరైనా వాదించగలరా? అలాంటి వాదన పూర్తిగా అసంగతం.’’ ఇకపోతే ఈ కులనిర్మూలన సిద్ధాంత ఆచరణకు మహాత్మాగాంధీ రాజకీయంగా మతవాద ధోరణితో అడ్డు వచ్చారు. అంబేడ్కర్ సాంఘికంగా కుల నిర్మూలనా వాది. ఆర్థికంగా స్టేట్ సోషలిజం ప్రతిపాదకుడు. రాజకీయంగా బహుజన రాజ్య నిర్మాణ దక్షుడు. ఈ మూడింటినీ సాధించడానికి ఆయన బుద్ధునిలో సంఘ వాదాన్నీ, మహాత్మా ఫూలేలోని సాంస్కృతిక విప్లవ వాదాన్నీ పోరాట ఆయుధాలుగా మలచుకున్నాడు. అందువల్ల ఆయన కుల నిర్మూలనా పునాదులపై పునర్నిర్మించే తత్త్వశాస్త్ర నిర్మాతగా ముందుకొచ్చాడు. జ్యోతిబా ఫూలే స్త్రీల కోసం చేసిన ఉద్యమం అంబేడ్కర్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. స్త్రీని విముక్తి చేయడం భారత పునరుజ్జీవ నోద్యమంలో ప్రధానాంశంగా ఆయన భావించాడు. హిందూ సంస్కరణవాదులు ప్రతిపాదించే పద్ధతిలో విధవా వివాహాలు, సతీసహగమన నిర్మూలన వంటి సంస్కరణల వలే కాక స్త్రీల హక్కులకు సంబంధించిన అంశం మీద ఆయన ఎక్కు పెట్టాడు. స్త్రీని భావ దాస్యం నుండి విముక్తి చేయడం, సాంఘిక, ఆర్థిక, సాంస్కృ తిక, రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులతో సమానంగా స్త్రీలకు కల్గించడానికి ఆయన తీవ్రమైన కృషి చేశాడు. అంబేడ్కర్ తనకు ముందున్న భారతీయ పాశ్చాత్య తత్త్వశాస్త్రాలన్నింటినీ చదివి భారత దేశ పున ర్నిర్మాణానికి పూనుకున్నాడు. అంబేడ్కర్‌లోని మరొక కోణం సామాజిక వ్యక్తిత్వ మనో విశ్లేషణ. ఈ ప్రత్యేకతను ప్లేటోలోని రచనా వైవిధ్యం, జ్ఞానతృష్ణ, సంభాషణా ప్రావీణ్యత, అంతరాంతర పరిశీలనల నుండి ఆయన సంతరించుకున్నారు. తత్త్వశాస్త్రానికి మూల జీవమైన మానవ దుఃఖ నివారణ పట్ల సోక్రటీస్ ఎంత వేదన పడ్డాడో, అంబేడ్కరూ అంత వేదన పడ్డాడు. వ్యక్తిగతమైన దుఃఖాన్ని అధిగమించి, సామాజిక దుఃఖాన్ని గుర్తించి, దాని నివారణ కోసం సిద్ధాంతపరంగా, ఆచరణ పరంగా కృషి చేసినవారు సోక్రటీస్, అంబేడ్కర్లు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చినా వారు సత్య నిరూపణ కోసం ముందడుగు వేస్తారు. ఇకపోతే అంబేడ్కర్ విద్యా తాత్త్విక వాది. ఆయన తన ప్రతిభా సంపత్తితో అçస్పృశ్యుల గురించి అనేక కమిషన్లకు వివరాలు అందించి అనేక హక్కులు సాధించాడు. ఏ పాఠశాల అయితే తనకు ప్రవేశాన్ని నిరాకరించిందో తనను తరగతి గదిలో బయట కూర్చో బెట్టి, బైట పాఠాలు చెప్పిందో, అదే భారతంలో తన ప్రజలను విద్యావంతులను చేయడానికి... అన్ని ప్రభుత్వ పాఠశాలల ద్వారాలు తెరిపించగలిగాడు. ఆయన ఒక్కడుగా ఒక సైన్యంగా పని చేశాడు. అంబేడ్కర్‌కు అధ్యయనంతో పాటు లోతైన అవగాహన, అనుభవం, ఆచరణ వున్నాయి. అందుకే ఆయన మాటలు సత్య నిష్టం అయ్యాయి. బుద్ధుని ధార్మిక సూత్రాలను, నీతి సూత్రాలను అంబే డ్కర్ రాజ్యాంగంలో అవసరం అయిన చోటంతా పొందుపరుస్తూ వెళ్ళాడు. ఈనాడు అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం అనే పేరు మీద భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసీహెచ్ఆర్) హిందూ పునరుద్ధరణవాద పత్రాన్ని రాష్ట్రాల గవర్నర్లకు, విశ్వవిద్యాలయాలకు పంపింది. అంటే అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను దెబ్బతీయాలనే ప్రయత్నం జరగు తోందన్న మాట! రాజ్యాంగం పీఠికలో చెప్పబడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దెబ్బతీయాలనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం బౌద్ధ యుగాన్ని దెబ్బతీయడానికి కౌంటర్ రివల్యూషన్‌గా వచ్చిన గుప్తుల కాలం నాటి మతోద్ధరణ వాదం లాగా వుంది. అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాన్ని ప్రచారం చేయా లనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని సామా జిక సామ్యవాద భావాన్ని దెబ్బతీయలేరనేది కూడా మరో ప్రక్క రుజువవుతూ వస్తోంది. మతం ఎప్పుడూ తత్త్వశాస్త్రానికి ప్రత్యా మ్నాయం కాలేదు. మతం కొందరికే పరిమితమైంది. రాజ్యాంగం అందరిని సమన్వయీకరించుకుంటుంది. ఆ శక్తి దానికుంది. ప్రపంచ తాత్త్విక దృక్పథం నుంచి ఏర్పడింది రాజ్యాంగం. అంబేడ్కర్‌వాదులు, మార్క్స్వాదులు, లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు ఐక్యంగా అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని తప్పక కాపాడుకుంటారు. ఈ యుగం అంబేడ్కర్‌ది. ఆయన నిర్మిం చిన తాత్త్విక సామాజిక మార్గంలో నడుద్దాం. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు (ఈ వ్యాసం Dec 06, 2022 రోజున sakshi.comలో ప్రచురితమైనది) -
సామాజిక విప్లవ చైతన్యమూర్తికి నీరాజనం
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్‌లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్లలో; జపాన్‌లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్‌టౌన్, డర్బన్‌లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్‌తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్‌కు ‘డాక్టర్ భీమ్రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది. మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్‌లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు. మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655 -
అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్‌కే ఉంది!
సాక్షి, అమరావతి: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 56 నెలలుగా ఆవిష్కరించిన సామాజిక మహా విప్లవంతో రాష్ట్రమంతటా సాధికారత ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు సింహభాగం అవకాశాలతో దూసుకెళుతుండటం ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అనుసరించాల్సిన విధానమని జగన్ స్పష్టం చేశారు. తొలి మంత్రివర్గం ఏర్పాటులోనే దీన్ని రుజువు చేశారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రతి అడుగులో ఆచరిస్తూ సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. రాజ్యాధికారంలో వాటా.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటైన క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురికి (80 శాతం) ఆయా వర్గాల నుంచే అవకాశం కల్పించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించగా శాసన మండలి ఛైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజుకు అవకాశమిచ్చారు. మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపించలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ కాగా అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం జగన్ రాజ్యసభకు పంపారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉండగా వీరిలో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీకి 48 ఎమ్మెల్సీ స్థానాలు దక్కితే చంద్రబాబు కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. ఆర్థిక తోడ్పాటు.. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించేలా సీఎం జగన్ బాటలు వేశారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా నగదు బదిలీ(డీబీటీ) రూపంలో రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. ఇక ఇతర పథకాల ద్వారా (నాన్ డీబీటీ) రూ.1.67 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పేదలకు రూ.4.13 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించాయి. పేద బిడ్డలకు పెద్ద చదువులు.. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేసిన సీఎం జగన్ పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. విప్లవాత్మక సంస్కరణలతో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు విద్యా సాధికారత సాధించేందుకు మార్గం సుగమం చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి రాష్ట్రంలో ఇప్పటిదాకా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా అందులో గత 56 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షల ఉద్యోగాలున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే 80 శాతం ఉద్యోగాలు దక్కాయి. దీన్ని పరిశీలిస్తే ఆయా వర్గాలు విద్యా సాధికారత సా«ధించినట్లు స్పష్టమవుతోంది. మహిళా సాధికారతలో అగ్రగామి.. వైఎస్సార్ ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా సీఎం జగన్ మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించారు. రాష్ట్రంలో 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75,670 కోట్ల విలువైన ఇంటి స్థలాలను ఇవ్వడమే కాకుండా పక్కా ఇళ్లను సైతం నిర్మించి ఇస్తూ వారి సొంతింటి కలను సాకారం చేశారు. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. హోంమంత్రిగా ఎస్సీ మహిళకు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవులు, పనులు 50% మహిళలకే ఇవ్వాలని దేశ చరిత్రలో తొలిసారిగా చట్టం చేసి మరీ మహిళలకు న్యాయం చేశారు. మహిళా సాధికారతలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. స్థానిక సంస్థల్లో సంచలనం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే దీనిపై చంద్రబాబు హైకోర్టులో టీడీపీ నేతలతో కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ పార్టీ పరంగా తాము 34 శాతం కంటే ఎక్కువే ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులిచ్చారు. రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరగ్గా 637 చోట్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో ఏకంగా 9 పదవులు (69 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 14 మేయర్ పదవుల్లో 12 పదవులను (86 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరగ్గా 84 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు (69%) ఇచ్చారు. చారిత్రక చట్టం.. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక చట్టం చేసి మరీ ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే తొలిసారి. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 79 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే 280 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి ఆయా వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. -
ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం
ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అరుదైన భారతీయుడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్. అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటూ, విద్యను ఆయుధంగా ఎంచి ఎన్నో ఉన్నత డిగ్రీలు పొంది దేశానికి రాజ్యాంగ రచనలో దీపధారి అయ్యారు. దళితులూ, ఆదివాసీలూ, మహిళలూ, ఇతర అణగారిన వర్గాలకు ఆయన ఒక ధైర్య వచనం. తన కాలంలోనే గాక, ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం ఆయన. ఆ మహాను భావుడి జ్ఞాపకార్థం 125 అడుగుల భారీ విగ్రహాన్నీ, ఓ స్మృతి వనాన్నీ నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారాశుల ఆదరణను చూరగొంటోంది. జనవరి 19వ తేదీన విజయవాడ ‘అంబే డ్కర్ నగర్’గా వెలుగొందుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణంలో స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెలుగొందిన అంబేడ్కర్ శిల్ప నిర్మాణం అత్యు న్నతమైంది, విస్తృతమైంది. దక్షిణ భారతదేశానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం, ఆవిష్కరణ, స్మృతివన వికాసం చెరపలేని సంఘటనలు. అశోకుని సాంచీ స్తూపానికి ఎంత పేరు వస్తుందో విజయవాడలోని స్మృతివనానికీ అంతే పేరు వస్తుందనడం అతిశయోక్తి కాదు. బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధునిగా మహాపరినిర్వాణం పొందిన అంబేడ్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం కానీ, స్మృతివనం కానీ ప్రపంచ బౌద్ధ పర్యా టకులను ఆకర్షించడం తథ్యం. నిజానికి బౌద్ధానికి ఈ ప్రాంతం కొత్తేమీ కాదు. అశోకుని కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి బౌద్ధం విస్తరించింది. అమరావతి స్తూపం మొదటి దశ నిర్మాణాలు మౌర్యుల వాస్తు నిర్మాణాలనే పోలి ఉండటం, అనేక విద్దాంక నాణెములు (పంచ్ మార్క్డ్ కాయిన్స్) లభించడం, అశోకుని కాలపు నాటి బ్రాహ్మీ లిపిలోనే కొన్ని శాసనాలు లభించడాన్ని బట్టి ఆయన కాలంలోనే బౌద్ధం ఇక్కడికి వ్యాపించిందని చెప్పవచ్చు. అలాగే అప్పట్లోనే ఇవ్వాళ దళితులుగా వ్యవహరించ బడుతున్న జన సమూహాలు బౌద్ధాన్ని అవలంబించాయి. అమరావతి స్తూపంపై ఉన్న... ఓ చర్మకారుడు స్తూపానికి ఇచ్చిన దానాన్ని తెలియచేసే శాసనం ఇందుకు మంచి ఉదాహరణ. దళితులు, కులవృత్తులవారే ఆ నాటి స్తూప నిర్మాణానికి రాళ్లు, మట్టినీ మోశారు. అద్భుత శిల్పాలను మలిచారు. అందుకే భారతదేశ చరిత్రలో మొదటి సాంస్కృతిక విప్లవం బౌద్ధం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. హిందూ మతోన్మాదం బౌద్ధ శిల్పాలను, స్తూపాలను, చైత్యాలను, ఆశ్రమాలను హింసాత్మకంగా కూల్చివేసింది. కానీ మళ్లీ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ శిల్పంలో ఒక ప్రత్యామ్నాయ ప్రకాశిత, విభాసిత శిల్ప కాంతులు వెల్లివిరుస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహమే ఒక విశ్వవిద్యాలయంలా ఉంటుంది. ఆయన వేలు ఒక ప్రశ్నోపనిషత్తు. ఆయన విగ్రహం విద్యా వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ప్రపంచ మానవుడు. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం భారత దేశ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన చిత్రపటం ప్రపంచ మేధావుల పంక్తిలో మెరుస్తుంది. లండన్ ఇండియన్ హౌస్‌లో ఆయన బంగారు విగ్రహం ఆయన జీవన సాఫల్యానికి గుర్తుగా వుంది. అంబేడ్కర్ పోరాటం ద్వారానే అధికార ప్రతిష్ఠ జరుగుతుందని నొక్కి వక్కాణించాడు. దళితులను దేవుడిపైన లేక సూపర్ మ్యాన్ పైన ఆధారపడవద్దని హెచ్చరించాడు. ‘మీపై మీరు విశ్వాసం ఉంచుకొని నడవండి. ఎవరిపైనా ఆధార పడకండి. నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించండి. దేనికీ లోబడకండి. ఎవరికీ తలవంచకండి’ అని అంబేడ్కర్ పిలుపు నిచ్చాడు. అంబేడ్కర్ ఒక ప్రవక్త, దార్శనికుడు. ఆయన ఒక జీవన వ్యవస్థల నిర్మాత. అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. ఆయన జీవించిన కాలంలోనే గాక ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. జాన్డ్యూ యిని అధ్యయనం చేసిన అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాది. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మా ణాత్మక సామాజిక విప్లవాన్ని ఆయన నడిపించారు. ఇకపోతే అంబేడ్కర్ పార్క్‌ను మాయావతి గవర్నమెంట్ 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందించింది. ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆ పార్కు విస్తరించింది. అంబేడ్కర్, మహాత్మాఫూలే, పెరియార్, నారాయణ్ గురూ, సాహూ మహరాజ్ వంటి వారినే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఎందరో పోరాట వీరుల విగ్రహాలను ఆ పార్క్‌లో ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆ పార్కు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. వ్యక్తిత్వ నిర్మాణానికి సాంస్కృతిక విప్లవ పునరుజ్జీవానికి సాహిత్యంతోపాటు శిల్పసంపద కూడా ఎంతో ఉప యుక్తం. కొన్ని శిల్పాలు మానవ మస్తిష్కాన్ని ప్రజ్వలింపచేస్తాయి. భారతదేశంలోని ఆర్కిటెక్చర్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్కిటెక్చర్లను సమన్వయం చేసుకుంది. భారతదేశానికి వలస వచ్చిన కుషానులు, అరబ్బులు, తురుష్కులు, పారసీకులు ఎందరో భారతీయ శిల్ప సౌందర్యానికి మురిసిపోయారు. వారి శిల్పనైపుణ్యాలు, భారతీయ శిల్ప నైపుణ్యానికి సమన్వయించారు. ‘గాంధార శిల్పం’ వంటివి రూపు దిద్దుకున్నాయి. మన అమరావతి శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. భారతదేశంలో ఈనాడు ప్రత్యామ్నాయ శిల్పసంపద అభివృద్ధి చెందు తోంది. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ఉన్న డా‘‘ బీఆర్ అంబే డ్కర్ నిలువెత్తు విగ్రహం స్ఫూర్తితో ప్రతి ఊరిలో అంబేడ్కర్ విగ్రహం ఉండాలని ‘ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ’ కృషి చేసింది. అనేక గ్రామాలకు ఆ మహానుభావుడి విగ్రహాలను అందించింది కూడా! ఈ సందర్భంగానే అంబేడ్కర్ 150 అడుగుల విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ముందు నిలపాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేసింది. 40 రోజులు సచివాలయం ముందు ధర్నా చేసింది. అంబేడ్కర్ యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలూ సపోర్ట్ చేశాయి. అయితే అంబేడ్కర్ వ్యతిరేక భావ వాది, అగ్రవర్ణ కుల అహంకారి, రాజకీయ కపటి, మానవ వనరుల విధ్వంసకుడు, ప్రకృతి వనరుల దోపిడీదారు, నేర రాజకీయ కోవి దుడు, దళిత ద్రోహి నారా చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహా నికి బదులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ సచి వాలయం ముందే అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్ర హానికి పూనుకొని నిర్మించింది. జనవరి 19వ తేదీన ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఒక చరిత్రాత్మక సంఘటన. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంతో విజయవాడకు ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజ్వలనం వస్తుంది. అంతేగాకుండా చైనా, టిబెట్, థాయ్‌లాండ్, జపాన్, జర్మనీ, బర్మా, శ్రీలంక దేశాల నుండి యాత్రికులు వస్తారు. ఇక విజయవాడ భారతదేశానికే తలమానికమైన నగరంగా వెలుగొందుతుంది. కుల, మత, జాతి, లింగ భేదాలు తరమబడతాయి. ప్రపంచంలో పేరెన్నిక గన్న నగరాల్లో ఒకటిగా కీర్తించబడుతుంది. విద్యావ్యాప్తి పెరుగుతుంది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేడ్కర్ నినా దాన్ని ఈ నిలువెత్తు విగ్రహం పదే పదే గుర్తుచేసి ప్రజారాశులను చైతన్యవంతం చేస్తుంది. అంబేడ్కర్ స్మృతివనం ఏమి చెప్తుందంటే పిల్లల్ని విద్యావంతులు చేసుకోండి. కుల, మత భేదాలు లేని సమసమాజాన్ని నిర్మించుకోండి. హింసలేని కరుణ, ప్రజ్ఞ, నీతి, ఆత్మీయత, అనుబంధం కలిగిన భారత రాజ్యాంగ సూత్ర నిబద్ధమైన ఒక సమాజాన్ని నిర్మించుకోండని ఎలుగెత్తి చాటుతుంది. ఇక విజయవాడ అంబేడ్కర్ నగర్ అవుతుంది. ప్రపంచ కీర్తిని పొందుతుంది. అంబేడ్కర్ స్మృతివనంలోని లైబ్రరీ,అంబేడ్కర్ చిత్రపటాల దృశ్య మాలిక సందర్శనం, అంబేడ్కర్ సమా వేశ మందిరం ప్రపంచ పర్యాటకులకు దృశ్యమాన సౌందర్యం. జ్ఞానభాండాగార సదృశం. బహుముఖ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిద ర్శనం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఓ వెలుగుతున్న ప్రత్నా మ్నాయ వెలుగుల సంద్రం. ఆ వెలుగుల తరంగాలలో మనమూ ప్రకాశిద్దాం. ప్రజ్వరిల్లుదాం, ప్రమోదిద్దాం. ఇక పదండి ముందుకు అంబేడ్కర్ ఆశయాలతో... కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ) -
‘అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 19న విజయవాడలో జరిగే125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం రాజన్న దొర, బీసీ సంక్షేమం, సమాచార శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. 139 కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర కార్పొరేషన్లలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఛైర్మన్లు, డైరక్టర్ల సమావేశం తాడేపల్లిలోలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి శాసనమండలి విప్, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం అని అన్నారు. విజయవాడ నగరంలో నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్ననిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంబేద్కర్ సిధ్దాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను నమ్మి సీఎం జగన్ సామాజిక న్యాయం చేస్తున్నారన్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం.. ఎంతో ఆనందం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మి దాన్ని ఆకళింపు చేసుకున్నారన్నారు. అంబేద్కర్ అడుగుజాడలలో నడుస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా స్వేచ్చా, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రజలందరూ మెచ్చే నిర్ణయమని కొనియాడారు. సాధారణంగా దళితవాడలలో, పల్లెల్లో అంటే ప్రతి ఊరి చివరన కాలనీలలో కనబడే అంబేద్కర్ విగ్రహాలను సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ నెల 19 న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణను పండుగలా నిర్వహించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహం కింద ఏర్పాటుచేస్తున్న వేదికతో కూడితే దాదాపు 195 అఢుగుల ఎత్తులో కారణజన్ముడైన అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుందన్నారు. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం సగర్వంగా చూడవచ్చన్నారు. వివిధ దేశాలలో అధ్యయనం చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంత పెద్ద భారత దేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ పరిఢవిల్లేలా చేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ఘనత సీఎందే.. గ్రామసచివాలయాల పరిధిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి ప్రచారం చేయాలని కోరారు. ఆ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు పాలకులు కాదు సేవకుడు అని అంబేద్కర్ చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటిస్తున్ననాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించింది జగన్ మాత్రమేనని చెప్పారు. జనరల్ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా కూడా బడుగు,బలహీనవర్గాలను నియమించిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. -
అనుమానాలు వీడని అంబేడ్కర్ మరణం
బాబా సాహెబ్ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 1956, అక్టోబర్ 14న నాగపూర్‌లో లక్షల మంది అనుచరులతో హిందూ మతాన్ని వదిలి, బౌద్ధం స్వీకరించారు. నాగపూర్ నాగజాతి ప్రజలు జీవించిన భూమి గనుక,వారంతా బౌద్ధులు గనుక, తాను బౌద్ధం స్వీకరించడానికి నాగ పూర్‌ను ఎంచుకున్నానని ఆయన ప్రకటించారు. అంతే గాని, నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ వారి ప్రధాన కార్యాలయం ఉంది గనుక, వారి ప్రాముఖ్యం తగ్గించడానికి తను ఆ పట్టణాన్ని ఎంచుకోలేదనీ వివరణ ఇచ్చారు. అయితే,ఆ తర్వాత 52 రోజులకే (డిసెంబర్ 6) అంబేడ్కర్ కన్ను మూశారు. ఆయన మరణం వెనుక ఓ కుట్ర ఉందనీ, ఆయన మరణించిన నాటి నుండి నేటి దాకా ఒక ఆరో పణ ఉంది. ఆ ఆరోపణ నిజం కాదని అటు భారత ప్రభుత్వం గానీ, ఇటు ఆరోపణలు ఎదుర్కొన్న వర్గాలు గానీ ఆధారాలు, వివరణలు ప్రజల ముందు పెట్టలేదు. అందువల్ల అనుమానాలు అనుమానాల్లాగే ప్రజల మన సుల్లో సజీవంగా ఉన్నాయి. ఆ రోజుల్లో జీవించి ఉన్న ఇ.వి.ఆర్. పెరియార్ తన వార్తా పత్రిక ‘విడుదలై’లో ఇలా రాశారు. ‘డాక్టర్ అంబే డ్కర్ చనిపోయారని అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది. గాంధీ మరణం వెనుక ఏ కారణం, ఏ కుట్ర ఉన్నాయో అలాంటివే అంబేడ్కర్ చనిపోవడం వెనక ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను’ అంటూ చాలా వివరంగా రాశారు. మొత్తం మీద ఆయన వెలిబుచ్చిన ఆవేదనలోని సారాంశం ఏమిటంటే – గాంధీ మరణానికి కారకులెవరో, వారే అంబేడ్కర్ మరణాకి కూడా కారకులని! అందుకు అవకాశమిచ్చే పలు అంశాలు కూడా ఆ రోజుల్లో చాలా బయటికి వచ్చాయి. ‘తన తండ్రికి విషమిచ్చి తెలియకుండా చంపేశారని’ స్వయానా అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అంబేడ్కర్ అభిమానులంతా యశ్వంత్‌ను బలపరిచారు. అంబేడ్కర్ మరణవార్త ఈ దేశ ప్రజలకు అనుమానాస్పదమైన వార్త అయింది. ‘తన తండ్రిది సహజ మరణం కాదనీ, హత్య అనీ – దోషులెవరో తేల్చాలనీ – అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ నాటి ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ మరణం తర్వాత పదకొండవ రోజున, ఆయన అనుయాయులు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నాటి ప్రధాని, రాష్ట్ర పతులకు లిఖితపూర్వక నివేదికలు, విన్నపాలు అంద జేశారు. అంబేడ్కర్ మరణం వెనక ఏం జరిగిందో తేల్చాలని వారు డిమాండ్ చేశారు. నాటి ప్రధాని నెహ్రూ స్పందించి నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ భారత ప్రభుత్వానికి అందజేసిన రిపోర్టు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల ముందుపెట్టలేదు. ఒకవేళ రహస్యాలేవీ లేకపోతే, అది బయటపెడితే అన్ని అనుమానాలకూ తెరపడినట్ట య్యేది కదా! ఢిల్లీ పోలీస్ ఐజీ ఇచ్చిన వివరణను మాత్రం 1957 నవంబర్ 27 నాడు – అంటే దాదాపు సంవత్సరం తర్వాత, అప్పటి హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌తో పార్లమెంట్లో ఒక ప్రకటనగా ఇప్పించారు. ‘అంబేడ్కర్ మరణం సహజమైందని’– ఆ ప్రకటన సారాంశం! అదొక కంటి తుడుపు ప్రకటన అని దేశ ప్రజలు ఆనాడే భావించారు. అసంతృప్తితో రగిలిపోయారు. ఆనాటి నుండి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యాసాలు, పుస్త కాలు ప్రచురింప బడుతూనే ఉన్నాయి. అసహనం, అసంతృప్తి ఏదోరకంగా బయట పడుతూనే ఉంది. తాజాగా ఈ మధ్యే 2021 జనవరి 26 నాడు నాగపూర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు – అంబేడ్కర్ ఎలా చని పోయారో తేటతెల్లం చేయాలని పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నా రంటే... ఆ తేదీన అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది గనుక! వారి పాత్ర లేకపోతే జనం వెళ్ళి వారి కార్యాలయం ముందు ఎందుకు నిరసన ప్రదర్శనలిస్తారూ? అర్థం చేసుకోవా ల్సిన విషయం! నెహ్రూజీ తొలి ప్రధాని అయ్యారు కాబట్టి, సోష లిజానికి, వైజ్ఞానిక ప్రగతికి ఆయన ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అప్పుడు వీరి ఆటలు అంతగా సాగలేదు. అయినా, వారి లక్ష్యసాధనకు వారు నిరంతరం కృషి చేస్తూనే వస్తున్నారు. దాని ఫలితాలను నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం! అంబేడ్కర్‌ది సహజ మరణమా? లేక హత్యా అనేది ఆరోజుల్లో బయటికి రాలేదు. 67 ఏళ్ళ తర్వాత, ఆధారాలన్నీ చెదిరిపోయిన తర్వాత, ఇప్పుడు బయటికి వస్తుందన్న నమ్మకం లేదు గానీ – గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు ఈ తరానికి తెలియజేయడం అవసరం అనిపించింది. అయితే,బాబా సాహెబ్ అర్ధంతరంగా వదిలేసిన కర్తవ్యాలనూ, రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధననూ ఈ తరం యువతీ యువకులు ముందుకు తీసుకుపోవాల్సి ఉంది. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉండా ల్సిందే! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత (నేడు అంబేడ్కర్ వర్ధంతి) -
అస్తమించని మేధా సూర్యుడు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆయన విశుద్ధంగా, వినిర్మలంగా, ద్వేష రహితంగా జీవించారు. అదే జీవన విధానం అందరికీ ఆచరణీయం. ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ , ఆర్థిక సమత, మానవ హక్కులు, బహుజన సాధికారితలను సాధించడానికి మనందరం ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. అంబేడ్కర్‌కి పూర్వం, అంబేడ్కర్ తర్వాత అని భారతదేశ చరిత్రను మనం లిఖించాల్సి ఉంటుంది. అంబేడ్కర్‌కి పూర్వం భారతదేశం మనుస్మృతి రాజ్యం, వర్ణ వ్యవస్థ రాజ్యం, బ్రాహ్మణాధిపత్య రాజ్యం, లౌకికేతర రాజ్యం, అప్రజాస్వామిక రాజ్యం, నియంతృత్వ రాజ్యం. అంబేడ్కర్ భారత దేశం రూపురేఖలను మార్చారు. లౌకిక ప్రజాస్వామిక దేశంగా చేశారు. ఆయన భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు లభించడానికి కారకులయ్యారు. కులాతీత, మతాతీత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి కానుకగా సమ ర్పించారు. భారత దేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచి. అంబేడ్కర్ ప్రపంచంలోనే పేరెన్నిక గన్న మేధావి. తత్వవేత్త, దార్శనికుడు అని ఎవరిని అంటారు? ప్రపంచ గమన సూత్రాలను మార్చ గలిగిన వారినే అంటారు. అంబేడ్కర్‌కు ముందు ఒక బుద్ధుణ్ణి, ఒక మార్క్స్‌ను ప్రజలు తత్వవేత్తగా కొనియాడారు. ఆయన బుద్ధుని కంటే, మార్క్స్ కంటే కూడా విశిష్ట లక్షణాలు ఉన్న మేధావి. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అçస్పృశ్యతా నిర్మూలనకు నిర్మాణాత్మకమైన సిద్ధాంతాలు, సూత్రాలు అందించారు. అణగారిన ప్రజల హక్కుల సిద్ధాంతానికి కర్త అయ్యారు. అంతే కాక, దానికి చట్ట రూపాన్ని తీసుకొచ్చిన నిర్మాణ కర్త ఆయన. అంబే డ్కర్ పరినిర్వాణం 67వ ఏట అడుగు పెడుతున్నా ఆయన కీర్తి తరగ లేదు. ఆయన సిద్ధాంతాలు విశ్వవ్యాప్తమవ్వడానికి కారణం, ఆయన జీవితం అంతా అనంత పరిశోధన చేసి, కుల నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలనం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు బాటలు వేయడమే. ఆయనలా విశుద్ధంగా, నిర్మలంగా, ద్వేష రహితంగా జీవించిన మేధావులు అరుదు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాణాన్ని భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రూపొందించారు. అందుకు ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. ఆయన విద్యార్జన గమ్యం అçస్పృశ్యుల ఉద్ధరణ. అదీ దళిత విద్యావంతులలో ఉండాల్సిన ఆదర్శం. దళిత విద్యార్థులు ఆ నిర్దేÔè కత్వం నుండి తప్పితే అంబేడ్కర్ మార్గాన్ని నిరోధించిన వారే అవు తారు. ఈ సత్యాన్ని ప్రతి అంబేడ్కర్‌వాది గుర్తుంచుకోవాలి. ఆయన లండన్‌లో ఉన్నప్పుడు కూడా తన మనస్సు మాత్రం భారతదేశ అస్పృశ్య సమాజం మీదే ఉండేది. భారతదేశంలో అస్పృశ్యుల కోసం పని చేస్తున్న సంఘాలు ఏమి చేస్తున్నాయా అని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉండేవారు. అంబేడ్కర్ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను సంతరించుకున్నారు. నాయకుడు కేవలం తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. తన జాతి గురించే ఆలోచిస్తాడు. త్యాగపూరితంగా పనిచేయడం ద్వారా తన జాతీయుల మనసులను చూరగొంటాడు. నాయకుడు తన భావజాలాన్ని జాతికి అందించడానికి వాహికను రూపొందించుకుంటాడు. అది ఉత్తరాల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా గావచ్చు, సభలు, సమావేశాల ద్వారా గావచ్చు. ఆయన చేసిందీ అదే! ఆయన అనేక పత్రికల్లో రాయడమే కాక స్వయంగా ‘మూక్ నాయక్’, ‘బహిష్కృత్ భారత్’, ‘జనత’, ప్రబుద్ధ భారత్’ వంటి పత్రికలు స్థాపించి వాటి ద్వారా తాను చెప్పాలనుకున్నది నిర్భ యంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్నో సభల్లో ఉపన్యసించి అణగారిన వర్గాలను ఉత్తేజితులను చేశారు. నాటి ప్రభుత్వ పెద్దలకూ, రాజకీయ నాయకులకూ ఆయన రాసిన ఉత్తరాలు ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అంబేడ్కర్ నిశిత పరిశీలకుడు. ముఖ్యంగా ఆయన పోరాటానికి పునాది పూర్తి కుల త్యాగ నిరతి. అందుకే పూర్వీకుల వీరోచిత గాథ లను వర్ణించారు. ఆయన క్రమశిక్షణతో కూడిన నిర్భయత్వాన్ని ప్రద ర్శిస్తూ వీరోచితమైన సాహసాన్నీ, మొక్కవోని నిబ్బరాన్నీ, ధైర్యాన్నీ కొనియాడదగిన నిశ్చితత్వాన్నీ ప్రదర్శించిన మహర్ సైనికులకు శాశ్వతమైన గుర్తింపును తెచ్చారు. ‘ఇద్దరిలో ఎవరి కీర్తి గొప్పదో చెప్పడం కష్టం. అది భారతీయ సైనికులదో లేక అంతటి విధేయతను, విశ్వాసాన్ని పొందేలా వ్యవహరించిన బ్రిటిష్ ఆఫీసర్లదా?’ (భారతీయ సైనికులలో అధికులు మహర్లు) అంటూ మేజర్ జె.టి. గోర్మన్ తన ‘హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ ది సెకండ్ బెటాలియన్ ఫోర్త్ బాంబే గ్రెనెడీర్స్, 1796–1933’లో పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. అనతికాలంలోనే కోరెగాంవ్ చర్యకున్న ప్రాముఖ్యతను గుర్తించారు. కోరెగాంవ్‌లో మొదటి తూటా పేలిన స్థలంలో 65 అడుగుల ఎత్తు, 32 చదరపు అడుగుల వెడల్పు ఉన్న స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని తల పెట్టారు. దీనికి 1821 మార్చి 26న పునాది రాయి వేశారు. ఈ దళం సాహసానికి స్మృతిగా ఈ స్తూపాన్ని నిర్మించారు. ఈ సాహసాన్ని కొనసాగించే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. అస్పృశ్యులు అనబడినవారు వీరోచితమైన జాతులు అని అంబేడ్కర్ తన అస్పృశ్యుల వాడలో నిరూపించారు. పల్నాటి యుద్ధంలో తెలుగు నేలలో దళితులే పాల్గొన్నారు. కృష్ణదేవరాయల సైన్యంలో ఏనుగులను, గుర్రాలను నడిపింది దళితులే. ముఖ్యంగా పల్నాటి వీర చరిత్రలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు. ఆయన ఉపయోగించిన కత్తి ఇప్పటికీ కారంపూడిలో ఉంది. డా‘‘ అంబేడ్కర్ కృషి వలన అస్పృశ్యత ఒక నేరంగా రాజ్యాంగం పరిగణిస్తూ ఉంది. కాని భారతదేశంలో లక్ష లాది గ్రామాలలో ఇంకా అస్పృశ్యత వెన్నాడుతోంది. ఎన్నో హోట ళ్ళలో గ్లాసులు అస్పృశ్యులకు వేరుగా ఉంచుతున్నారు. కొన్ని ప్రభు త్వాలు ఊరికి దూరంగా ఇళ్ళు కట్టిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్‌ను వివరిస్తూ డా‘‘ అంబే డ్కర్ ‘ప్రభుత్వ సొమ్మును మత బోధకులకు, మత కార్యకలాపాలకు ఉపయోగించరాదు. మత బోధలకు సంబంధించి స్వయంగా లేక ప్రయివేటు సంస్థల ద్వారా ప్రభుత్వం ఖజానా డబ్బును ఖర్చు చేయ డానికి వీలులేదు’ అని స్పష్టం చేశారు. దీనికి పూర్తిగా, భిన్నంగా ఈనాడు జరుగుతూ ఉంది. ప్రభుత్వ ప్రచార సాధనాలయిన రేడియో, టీవీ వంటివాటిలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఆనాడు అంబేడ్కర్ వివరించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ ఉంది. సెక్యులరిజం అంటే ‘మత ప్రమేయం లేని రాజ్యం’ అని అర్థం. ఈనాడు ప్రభుత్వం పూర్తిగా మతపరంగా వ్యవహరిస్తూ వుంది. ఇది భారత రాజ్యాంగ శిల్పి అంబేడ్కర్‌కూ, ఆయన ఆలోచనలకూ పూర్తిగా వ్యతిరేకమయిన విషయం. అందుకే రానురానూ అంబేడ్కర్ అవసరం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్ మేధావిగా గుర్తింపు పొందారు. లండన్‌లోని ‘ఇండియా హౌస్’లో ఆయన బంగారు విగ్రహం ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ ఎదురుగా ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది. ఇక భారత్‌లో సరేసరి. ఇండియన్ పార్లమెంట్ ఎదురుగా ఆయన సము న్నత విగ్రహం వుంది. ఇవాళ హైద్రాబాద్ నడిబొడ్డులో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం వెలుగులీనుతోంది. విజయవాడలో 125 అడుగుల విగ్రహం జనవరిలో ఆవిష్కరించబడుతుంది. ఆయన రాజ్యాంగ నిర్మాణ దక్షత, ప్రతిభా సామర్థ్యాలను గుర్తిస్తూ కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహాలు నిరంతరం వెలుస్తూనే ఉన్నాయి. ఈనాడు ఆయన భావజాల అవసరం చాలా ఉంది. మన మందరం ఆయన వర్ధంతికి నివాళిగా ఆయన సిద్ధాంతా లైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, ఆర్థిక సమత, మానవ హక్కుల పోరాట దీక్షలతో బహుజన సాధికారిత రాజ్యాధికార భావనలతో ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి) -
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడం చారిత్రక నిర్ణయం
-
పరిషత్తులో అంబేడ్కరే లేకుంటే?!
‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. ఇదొక్కటే కాదు లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ అంబేడ్కర్ గురించి వెల్లడించిన నమ్మశక్యం కాని నిజం. రాజ్యాంగ పరిషత్తుకు అంబేడ్కర్ ఏనాడూ నేరుగా ఎన్నికవలేదన్నదీ అలాంటి వాస్తవమే. 1945–46 ఎన్నికల్లో అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కాలేకపోయినప్పుడు ఆయనకు స్థానం కల్పించడం కోసం ముస్లిం లీగ్ శాసనసభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ తన స్థానాన్ని త్యాగం చేశారు. అంబేడ్కర్ ఆనాడు పరిషత్తు సభ్యుడిగా లేకుంటే భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది. మన జాతిరత్నాల గురించి నిజంగా మనకు తెలుసునా? వాళ్లను మనం పీఠాలపై ప్రతిష్ఠించుకుని గౌరవించుకుంటాం. వారి గురించి తరచుగానూ, అనర్గళంగానూ మాట్లాడు కుంటూ ఉంటాం. వాళ్ల మాటల్ని కూడా యథాతథంగా స్వీకరించి మన జీవితాలకు బాటలు పరుచుకుంటాం. అయితే అదంతా వేరు, వాళ్ల గురించి తెలియడం వేరు. ఇటీవల నేను చదివిన ఒక పుస్తకం బి.ఆర్.అంబేడ్కర్ గురించి నాకు తెలియని అనేకమైన విషయాలను వెల్లడించింది. అవేవీ వాస్తవ విరుద్ధమైనవి కావు. అలాగే సుప్రసిద్ధమైనవి కూడా! అయితే అవి అందరికీ తెలిసిన మనిషిగా అంబేడ్కర్లో భాగమై ఉన్నవి కావు. ఎలాంటివంటే, నిజంగా ఆయనొక స్వాతంత్య్ర సమరయోధుడు కాదని మీకు తెలుసా? 1942 నుండి 1946 వరకు ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు, 1931లో ఆయన: ‘‘బ్రిటిష్ వారి నుండి భారత ప్రజలకు తక్షణ అధికార మార్పిడి జరగాలని అణగారిన వర్గాలవారు (అప్పుడు షెడ్యూల్డ్ కులాలు అని పిలిచేవారు) నిరసించలేదు. నినదించలేదు. ఉద్యమించలేదు’’ అని వ్యాఖ్యానించి ఉన్నవారు. ఈ విషయాన్ని నేను అశోక్ లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ నుంచి గ్రహించాను. ‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం అన్నది ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. అది నన్నెంతో విస్మయానికి గురి చేసిందని నేను ఒప్పుకొని తీరాలి. అయితే ఇదొక్కటి మాత్రమే కాదు లాహిరి పుస్తకం బహిర్గతం చేసిన నమ్మలేని నిజం. అంబేడ్కర్ అసలు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికే కాలేదని తెలుస్తోంది. 1945–46 ఎన్నికల్లో ఆయన పార్టీ ‘ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్’ (ఎస్.సి.ఎఫ్.) 151 రిజర్వుడు సీట్లలో కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకుంది. ‘బాంబే ప్రొవిన్షి యల్ అసెంబ్లీ’ నుంచి ఎస్.సి.ఎఫ్. ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఫలితంగా అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు కాలేకపోయారు. దాన్ని మించిన పరాజయం... అంబేడ్కర్‌కు మద్దతు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం! ‘‘డాక్టర్ అంబేడ్కర్‌కు రాజ్యాంగ పరిషత్తు తలుపులతో పాటుగా కిటికీలు కూడా మూసి వేయబడ్డాయి’’ అని సర్దార్ పటేల్ ప్రకటించారు. ‘‘చూద్దాం... రాజ్యాంగ పరిషత్తులోకి అతడెలా ప్రవేశిస్తాడో’’ అని కూడా అన్నారు. ఆ పరిస్థితుల్లో ముస్లిం లీగ్ శాసన సభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ కాస్తా అంబేడ్కర్ వైపు నిలబడ్డారు. అంబేడ్కర్ కోసం తన సీటును త్యాగం చేశారు. అలా మండల్‌తో పాటు ఒకరిద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒకటీ లేదా రెండు ఆంగ్లో–ఇండియన్ ఓట్లతో బెంగాల్ నుంచి అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారు.1947 జూలైలో మళ్లీ ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఇండియాకు ఒకటి, పాకిస్థాన్‌కు ఒకటిగా రాజ్యాంగ పరిషత్తు విభజన జరిగింది. పర్యవసానంగా బెంగాల్ నుంచి అనేకమంది సభ్యులు తమ భారత రాజ్యంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోయారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. అయితే మళ్లొకసారి ఆయన్ని ఊహించని అదృష్టం కాపాడింది. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా ఎం.ఆర్. జయకర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. అంతేకాదు... ఈసారి భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు అంబేడ్కర్ సభ్యత్వా నికి తోడ్పాటును అందించేందుకు íసిద్ధమయ్యారు. వారిలో రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. అప్పటి బొంబాయి ప్రధానమంత్రి బి.జి.ఖేర్‌కు ఆయన లేఖ రాశారు. ‘‘ఏ ఇతర పరిగణనలతోనూ నిమిత్తం లేకుండా తన సేవలను ఎవరూ వదులుకోలేని విధంగా ఉన్న ఆయన పనితీరును మాత్రమే గుర్తిస్తూ రాజ్యాంగ పరిషత్తులో, వివిధ కమిటీలలో ఆయన నియామకానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆయన బెంగాల్ నుంచి ఎన్నిక య్యారని మీకు తెలిసిందే! ఆ ప్రావిన్సు విభజన వల్ల 1947 జూలై 14 నుంచి ఆయన తన రాజ్యాంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది కనుక వెంటనే ఆయనను ఎన్నుకోవలసిన అవసరం ఉంది’’ అని అంబేడ్కర్‌కు ఆసరాగా నిలిచారు. చివరికి పటేల్ కూడా అంబేడ్కర్ పట్ల తన వైఖరి మార్చు కున్నారు. అంబేడ్కర్‌కు సభ్యత్వం ఇప్పించేందుకు ఖేర్‌ను ఒప్పించడంతో పాటు, జయకర్ రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయ బోయిన జి.వి. మావలంకర్కు నచ్చజెప్పి, ఆయన్ని పక్కకు తప్పించ డంలో పటేల్ కీలకమైన పాత్ర పోషించారని లాహిరి రాశారు. అంటే దేశానికి ఇది త్రుటిలో తప్పిన ముప్పు. అంబేడ్కర్ కనుక ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా లేకపోయుంటే ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది. ఈ పుస్తకంలోని నమ్మశక్యం కాని వాస్తవాలు నాలా మీలోనూ జనింపజేసే అవకాశం ఉన్న ఒక ప్రశ్నను లేవనెత్తడం ద్వారా నేను ఈ వ్యాసాన్ని ముగిస్తాను. అంబేడ్కర్‌కు, బహుశా భారతదేశానికి కూడా మార్గనిర్దేశం చేసిన హస్తం ఏదైనా ఉండిందా? అంబేడ్కర్ మన రాజ్యంగ పరిషత్తులో భాగం అని నిర్ధారించడానికి ఎవరిదైనా, లేదా ఏదైనా గట్టిగా ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్లెవరు? అది ఏమిటి? అన్నదే ఆ ప్రశ్న. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
అంబేడ్కర్ ఆశయాలతో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన
-
విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్
-
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
పుత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి ఆర్కే రోజా నివాళులు
-
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అంబేడ్కర్ అగ్రగణ్యుడు :సీఎం జగన్
-
భాగ్యనగరం నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత విగ్రహం
-
హెలీకాఫ్టర్ పై నుంచి పూలాభిషేకం..అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
-
యోధుడొకరు... విప్లవ వీరుడొకరు
భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 14 ఒక మైలురాయి వంటిది. సమాజంలో మార్పు కోసం, సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాబూ జగ్జీవన్‌రామ్ వంటి ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ కోవకు చెందినవారే అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14. ఈ తేదీకే ఇంకో ప్రాముఖ్యం కూడా ఉంది. యూనివర్సిటీలలోనే సమాజం మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరచిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి అమర వీరుడైన రోజు కూడా ఇదే! ఇద్దరి ఆశయం సమాజంలోని అసమానతల్ని నిర్మూలించడమే! అంతరాలు లేని మానవీయ సమాజాన్ని నిర్మించడమే! ప్రయాణించిన మార్గాలు వేరైనా, ఇద్దరూ అడుగడుగునా సమాజ హితం కోసం పోరాడిన వారే! అందుకే ఈ రోజుకు ఇంత ప్రాధాన్యం. చరిత్రపుటల్లో ఇంతటి ప్రత్యేక స్థానం. సమాజంలోని కుల వివక్ష, అంటరాని తనం నిర్మూలనకు అహోరాత్రులు శ్రమించి బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేందుకు అవసరమైన హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచినవారు అంబేడ్కర్. స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛా ఫలాలు అందకుండా పోతున్న సమయంలో సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ లాటిన్ అమెరికా దేశాల విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తిగా యూనివర్సిటీలలోనే సమాజ మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరిచే పోరాటంలో మతోన్మాదుల చేతిలో బలి అయిన ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి. నేటి ‘ప్రగతిశీల ప్రజా స్వామిక విద్యార్థి సంఘం’ (పీడీఎస్‌యూ) స్థాపక కారకులు జార్జి రెడ్డి అమరుడైన రోజు, సామాజిక న్యాయం కోసం పరితపించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జన్మదినం ఒకే రోజు కావడం యాదృచ్ఛికమే అయి నప్పటికీ.. స్ఫూర్తి చేతనలను ప్రేరేపించే ఒక ప్రత్యేక సందర్భం ఇది. అంబేడ్కర్ సమసమాజ స్థాపన కోసం పాటు పడితే, జార్జిరెడ్డి సామాజిక న్యాయం కోసం పోరాడిన విప్లవ వీరుడు. అంబే డ్కర్ ఒక ధ్రువతార అయితే, జార్జిరెడ్డి ఒక అరుణతార. ఇద్దరూ చరిత్రపుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పచుకున్న వారే. ప్రజల గుండెల్లో నిలిచి పోయినవారే. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమా నత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే. ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచనాపరులే. సమాజ హితం కోసం అడుగడుగునా పోరాడిన వీర యోధులే. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నాలో ఒక సంఘర్షణను రేపుతుంది. ఒక సామాజిక విప్లవకారుని జననం, మరొక విప్లవకారుడు నేల కొరిగిన దినం! ఒకరిది పుట్టుక, ఒకరిది మరణం. ఇద్దరినీ ఒకే రోజు స్మరించుకోవడం సంఘర్షణ కాదా? ‘సమీకరించు, బోధించు, పోరాడు’.. అన్న నినాదంతో చైతన్యం కోసం పాటుపడిన వారు ఒకరు; ‘జీనా హైతో మర్నా సీఖో... కదం కదం పర్ లడ్నా సీఖో’ అనే నినాదం ఇచ్చి విప్లవ ఆదర్శాలను అందించిన సాహసోపేతమైన శక్తి ఒకరు. పుట్టినవారు మరణించక తప్పదు అని తెలిసినా, ఆ ఆలోచనకు ఒకింత బాధ కలుగుతూనే ఉంటుంది. కానీ అమరత్వం రమ్యమైనది. మనిషి తన కోసమే పుట్టి తన కోసమే మరణించడం సహజం. కానీ సమాజం కోసం, సమాజంలోని బాధితుల తరఫున గళమెత్తి, కలమెత్తి పోరాడి, పరుల కోసం మరణించడం రమ్యమైన అమరత్వం కాక మరేమవుతుంది? ఈ ఇద్దరు మహనీయులు కూడా ఉన్నత చదువులను అభ్యసించి ప్రతి క్షణం పేదవారి గురించే ఆలోచించి, ఏ మాత్రం స్వార్థం లేకుండా తమ అమూల్యమైన జీవితాలను ప్రజల కోసం త్యాగం చేశారు. ఇరువురి దారులు వేరైనా అంతిమ లక్ష్యం ఒక్కటే... మతోన్మాద మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం సాగించడం. ‘‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును..’’ అని గురజాడ గారన్నట్లు జ్ఞానం ద్వారానే జీవితానికి వెలుగు అని, విద్య ద్వారానే అసమానతలు, అంతరాలు తొలగిపోతాయని ఇద్దరూ నమ్మారు. రిజర్వేషన్ ఫలాలు అందించి అణగారిన వర్గాలు విద్యాగంధానికి నోచుకునేలా అంబేడ్కర్ కృషి చేశారు. కులం అణచివేతలు, కుల దురహంకార పీడనలు లేని ఆత్మ గౌరవ సమాజం కోసం పోరాడిన సాంఘిక విప్లవకారుడు అంబేడ్కర్. దోపిడీ, పీడన లేని సమసమాజాన్ని కలలుగన్న విప్లవ స్వాప్నిక కార్యశీలి జార్జిరెడ్డి. ఇద్దరి జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శ ప్రాయం, అనుసరణీయం. ఒకరు బాధిత కులంలో పుట్టి అన్యాయాలను, అక్రమాలను, అవమానాలను భరించి... కుల ఆధిపత్యా నికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి తమ జాతిని, బాధితులను పీడితులను చైతన్య పరిచారు. మరొకరు మధ్యతరగతి వర్గంలో జన్మించి, సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ పేదల, శ్రామికవర్గ, గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల బాధలను అవగాహన పరచుకునేందుకు వారి స్థాయికి దిగి సాధారణ జీవితాన్ని అనుభవించిన విద్యార్థి. 1972లో కామ్రేడ్ జార్జిరెడ్డిని ‘సంఘ్ పరివార్’లోని కొన్ని మతో న్మాద హిందూత్వ శక్తులు హత్య చేశాయి. నాటి పరిస్థితులే నేటికీ సమాజంలో కనిపిస్తున్నాయి. అంతేకాదు, పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నేడు కూడా మత మౌఢ్యాన్ని, మూఢనమ్మకా లను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక భావాలను పెంపొందింప చేయడా నికి ప్రయత్నించిన, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రజా స్వామిక వాదులను కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయి. యూనివర్సిటీలలో అణగారిన వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి పరి శోధనలు జరపడానికి లేకుండా వారిని అడ్డుకుంటూ, మానసిక క్షోభకు గురిచేసి బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించడం జరుగుతోంది. అదే సమయంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు పెరిగిపోతున్నాయి. విద్యను కాషాయీకరణ, వ్యాపారీకరణ చేసేందుకు ప్రభుత్వాలు ఆతురతను కనబరుస్తున్నాయి. అందుకే అన్న ట్లుగా ఆగమేఘాల మీద జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ప్రైవేటీకరణ విధానాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఆ విధానాలను సవరించాలని విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కోరినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి ఏకపక్షంగా బలవంతంగా అశాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నించడం వల్ల బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి ఆశించినట్టుగా ప్రజాస్వామిక, ప్రజాతంత్ర, శాస్త్రీయ విద్యా విధానం అమలు కావడం లేదు, అమలు చేసే పరిస్థితులు కూడా లేవు. అమలు చేయాలని అడిగే విద్యార్థిలోకం కూడా నేడు బలంగా లేదు. అయినా నిరుత్సాహ పడనవసరం లేదు. ప్రజాస్వామిక, మానవీయ విలువలు పెంపొంది ఆదర్శవంతమైన సమాజం రూపుదిద్దుకోవాలంటే అంబే డ్కర్, జార్జిరెడ్డిల ఆశయాలు నెరవేర్చే అవకాశం ప్రగతి శీలులందరికీ ఉంటుంది. చదువే ఆయుధంగా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది బడుగువర్గాల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ అవిరళ కృషి చేసిన అంబేడ్కర్ జీవితాన్ని; అన్యాయాలకు అక్రమానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసే స్వభావం, తప్పులేనప్పుడు ఎవరినైనా ఎది రించే సత్తా, తోటి వారి కోసం తన ప్రాణాలను సైతం అర్పించే త్యాగగుణం, సమ సమాజం కోసం పరితపించే మనస్తత్వం గల జార్జిరెడ్డి పంథాను ఆదర్శంగా తీసుకుని అనుసరించాలి. జార్జిరెడ్డి ఆందోళన , పోరాటాలతోపాటు నిరంతర అధ్యయనశీలిగా గడిపారు. పాతికేళ్ల జీవితంలో ప్రపంచ విప్లవాలను పట్టుదలతో పరిశీలించి విప్లవ మార్గాన్ని అనుసరించారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రజ్ఞ కలిగిన అపర మేధావి అతడు. భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించి స్కాలర్ అయిన జార్జి రెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అంబేడ్కర్ ప్రబోధించిన విలువలతో నేటి యువత సామాజిక ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి. శాస్త్రీయ విద్యా విధానం కోసం, ప్రజాతంత్ర విద్య కోసం పోరాడాలి. ఈ ఇద్దరు వీరులకు మనం ఇవ్వగలిగిన నిజమైన, ఘనమైన నివాళి ఇదే! తండ సదానందం వ్యాసకర్త టి.పి.టి.ఎఫ్. రాష్ట్ర కౌన్సిలర్ మొబైల్: 99895 84665 -
‘మూల’ సంస్కృతికి రక్ష అంబేడ్కరిజం
ప్రకృతి నుంచి నేర్చుకొంటూ ఎక్కడికక్కడ మానవ సమూహాలు తమవైన సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నాయి. సాధారణంగా ఆహారావసరాలు తీర్చగలిగే నదీలోయల్లో విభిన్న సాంస్కృతిక విశిష్టతలతో కూడిన నాగరికతలు రూపుదిద్దుకొంటాయి. మన గోదావరి, కృష్ణా వంటి నదీలోయల్లో విలసిల్లిన ‘మూల సంస్కృతి’ ఇలా అభివృద్ధి చెందినదే. ఇక్కడి మూలవాసులు ఏ ప్రకృతి వనరులను ఉపయోగించుకుని వ్యవసాయం, టెక్నాలజీలను అభివృద్ధి చేసుకున్నారో... అవే ప్రకృతి శక్తులను దేవుళ్లుగా పూజించారు దేశం బయటి నుంచి వచ్చిన ఆర్యులు. వారే ఇక్కడివారిపై ‘రాక్షసులు’ అని ముద్రవేశారు. ఆ వైదిక సంస్కృతీ వాహకులు ఇప్పటికీ మూలవాసుల సంస్కృతిని కబళించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భారతదేశం ఈనాడు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ఘర్షణల్లో ఉంది. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తుల విజృంభణే ఇందుకు కారణం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటి మతతత్త్వ శక్తులు రాజ్యాంగేతర జీవనాన్ని కొనసాగిస్తూ... దానిని దేశం మీద రుద్దాలనే తాపత్ర యంలో ఉన్నాయి. కారణం వారు స్వాతంత్య్రానికి ముందు నుంచీ భారతదేశ సాంస్కృతిక, సాంకేతిక వ్యవస్థలకు విరోధులు కావడమే. నిజానికి భారతదేశ మూలాలు భౌతికవాద, హేతువాద, తాత్వికవాద భావజాలంలో ఉన్నాయి. భౌతిక వాదం, జీవశాస్త్రం, మానవ పరిణా మవాదాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమన్వయించి హిందూ ప్రత్యా మ్నాయ వాదాన్ని రూపొందించారు. అందులో తత్త్వ శాస్త్రానికి ప్రాధాన్యమిచ్చి ఆధ్యాత్మిక వాదం ఒక ఊహాత్మక వైయక్తిక భావ జాలం నుండి రూపొందిందేననీ, అందుకే వేలకొద్ది దేవుళ్ళు భారత దేశంలో సృష్టించబడ్డారనీ ఆయన చెప్పారు. ఎంఎన్ రాయ్ తన ‘మెటీరియలిజం’ గ్రంథంలో శాస్త్రీయ భావ జాల చారిత్రక దృక్పథం గురించి వివరిస్తూ... భారతదేశమే భౌతిక తత్త్వ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిందని నొక్కి వక్కాణించారు. భారతీయ మూలవాసులు భౌతికవాద జీవులనీ; వారు నిçప్పునూ, నీరునూ, గాలినీ, శూన్యాన్నీ జీవితానికి అన్వయించుకున్న మహోన్నత శాస్త్రవేత్తలనీ ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. మరీ ముఖ్యంగా సింధు నాగరికతలో వచ్చిన నదీ నాగరికత సంస్కృతి నుండి నదులకు కాలువలు నిర్మించే బృహత్తరమైనటువంటి ఇంజనీరింగ్‌ను దళితులు కనిపెట్టారు. అంబేడ్కర్ దళిత బహుజనులు ‘మొదటి ఇరిగేషన్ ఇంజ నీర్లు’ అని చెప్పారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా సింధు, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, కావేరి, సువర్ణ రేఖ, మహానది, పెన్నా, మహి, సబర్మతి, నర్మదా, తపతి వంటి ఎన్నో నదులకు ఆనకట్టలు కట్టి నదీ నాగరికతలనూ, వ్యవసాయ సంస్కృతినీ నిర్మించారు. ఈ నదులన్నింటినీ వైజ్ఞానిక దృష్టితో చూడకుండా దిగజార్చింది మత వ్యవస్థ. భారతదేశంలో అత్యుత్తమమైన నదుల్లో గోదావరి చాలా గొప్పది. ఈ నది ప్రవహించే ప్రాంతం ఎక్కువగా గుట్టలు, పర్వతాలు, లోయలు; ఎగువ, దిగువ ప్రాంతాలు; చిన్న చిన్న గుట్టలతో కూడి ఉంది. ఈ నది అంచుల్లో నివసించే వాళ్ళు గిరిజనులు, దళితులే. వారే ఈ నదీ వ్యవస్థను ఇప్పటికీ రక్షిస్తున్నారు. ఈ గోదావరి సంస్కృతికీ, హిందూ మత సంస్కృతికి సంబంధమే లేదు. సుమారు 1600 సంవత్సరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో బౌద్ధ సంస్కృతి విలసిల్లింది. ఈ హిందూ వాద సంస్కృతి వచ్చిన తర్వాత ఈ నదీ నాగరికత మీద గొడ్డలి వేటు పడింది. గోదావరి తర్వాత గొప్ప సంస్కృతులు సృష్టించింది కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. దీని పరీవాహక ప్రాతంలోనూ దళితులు, గిరిజ నులే అధికంగా జీవిస్తున్నారు. వీరే ఇక్కడ విలసిల్లిన సంస్కృతికి సృష్టికర్తలు. హిందూ సంస్కృతికీ, ఇక్కడి సంస్కృతికి కూడా ఎటువంటి సంబంధం లేదు. హిందూ సామ్రాజ్యవాదం నదీ సంస్కృతులను ధ్వంసం చేయాలనే పెద్ద ప్రయత్నంలో ఉంది. అంబేడ్కర్ అందుకే నదుల అనుసంధానానికి సంబంధించి ఉద్గ్రంథాలను రచించారు. ఆదివాసీల నుండీ, దళితుల నుండీ ఆయుధాలు ఉన్న అగ్ర వర్ణాల వారే భూమిని కొల్లగొట్టారని నిరూపించారు. అంబేడ్కర్ దళితుల, ఆదివాసీల జీవన సంస్కృతులన్నీ నదీ పరీవాహక వ్యవ సాయక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. దీనికి తోడు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంలో జీవిస్తున్న బెస్తలు, కొండల మీద గొర్రెలను మేపుకొని జీవిస్తున్న యాదవులు, తాటాకు కొట్టి గృహ నిర్మాణ సంస్కృతికి పునాదులు వేసిన గౌడలు, శెట్టి బలిజలు; వస్త్రాలు నేసి మానవ నాగరికతను కాపాడిన పద్మశాలీలు, దేవాంగులు, దళితులు... వీళ్లంతా కూడా నదీ నాగరికత సృష్టికర్తలే అని అంబేడ్కర్ చెప్పారు. మైనార్టీలపైనా, దళితులపైనా... ద్వేషం, మాత్సర్యం, క్రోధం కలిగి ఉండటం ఆర్ఎస్ఎస్ భావజాలంలో ప్రధానమైన అంశం. నిజానికి మైనారిటీలుగా చెప్పబడుతున్న ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ పరాయివారు కారు. హిందూమత అస్పృశ్యతను వారు భరించలేక ఇస్లాం మతాన్నీ, క్రైస్తవ మతాన్నీ తీసుకున్నవారే. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని రొమిల్లా థాపర్, డీడీ కోశాంబి, ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర వంటి వారు తేల్చారు. ఆర్యులు మూల వాసులకు శత్రువులని అంబేడ్కర్ చెప్పారు. ఇకపోతే బౌద్ధం భారత ఉపఖండంలో జన్మించింది. సిక్కుమతం భారతదేశంలో పుట్టింది. ఆయా సందర్భాలలో చారిత్రకంగా వివిధ మతాలు స్వీకరించిన దళిత బహుజన మైనారిటీలను శత్రువులుగా చూడటం అశాస్త్రీయ విషయం. నిజానికి మూలవాసులైన దళితులు ఏవైతే ఉత్పత్తి సాధనాలుగా శాస్త్రీయ పరికరాలు కనిపెట్టారో వాటిని ఆర్యులు పూజించారు. అంటే మూలవాసుల కంటే వారు ఎంత వెనుక బడి ఉన్నారో మనకు అర్థం అవుతుంది. నాగరికతలో, మానవతలో, సౌజన్యంలో, ప్రేమలో, కరుణలో మూల వాసులది అద్వితీయమైన పాత్ర. ఆర్యులు మూలవాసుల సుగుణాలను అధ్యయనం చేయలేక పోయారు. మూలవాసులు ప్రకృతి వనరులను ఉపయోగించి నాగరి కతా నిర్మాణం చేస్తే... ఆర్యులు ఆ ప్రకృతి శక్తులను దేవుళ్లుగా కొలి చారు. వేదాల్లో ఉన్న దేవుళ్ళు అందరూ ఇందుకు ఉదాహరణ. మనిషి దేవుణ్ణి సృష్టించుకున్నాడు. కానీ ఆ దేవుడు మనిషి మీద ఆధిపత్యం వహిస్తున్నాడు. చివరకు మనిషిని బలిచ్చేవరకు ఈ మూఢ భక్తి పరిఢవిల్లింది. సాటి మనిషిలో ఉన్న జ్ఞానాన్నీ, హేతుభావాన్నీ నిరాకరించి దైవాధీన భావాన్ని అలవాటు చేసుకున్నాడు మానవుడు. తన తోటి మనిషిని ప్రేమించడం మానేసి, తను పూజించే దేవుణ్ణి కొనియాడమని బలవంతం చేశాడు. పూజించకపోతే వధించాడు. ఒక్కొక్క దేవుణ్ణి పూజించేవారు ఒక్కో సమూహంగా ఏర్పడ్డారు. ఇతర దేవుళ్లను పూజించే వారిని చంపడం ప్రారంభించారు. దీన్ని ‘దుష్ట శిక్షణ’ అన్నారు. వేదాల్లో తమ శత్రువులను చంపమని వాళ్ళ దేవత లను వేడుకొన్నారు ఆర్యులు. చివరకు దేవుళ్ళనే అవతార పురుషు లుగా కిందకు దించారు. మూలవాసులకు ‘రాక్షసులని’ పేరు పెట్టి వారిని హతమార్చటానికే ‘దశావతారాలు’ ఆవిర్భవించాయని ప్రచారం చేశారు. వేద కాలం నుంచే ఈ హననం, హత్యాకాండ, అణచివేత, దౌర్జన్యం, విధ్వంసం ప్రారంభమయ్యాయి. సంస్కృతిని, సంపదను మూలవాసులు సృష్టిస్తూ వెళ్లారు. ఆర్యుల వారసులు వీరిని వధిస్తూ, సంపదను ధ్వంసిస్తూ వెళ్లారు. ఈ చరిత్రను వక్రీకరించాలనే ఉద్దేశ్యంతోనే హిందూ మతవాద శక్తులు విద్యావ్యవస్థలో సిలబస్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘ద ఆరెస్సెస్: రోడ్‌మ్యాప్స్ ఫర్ ద 21సెంచరీ’ వంటి పుస్త కాలు విశ్వవిద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇకపోతే ఎన్నో విలువైన గ్రంథాలను హిందూత్వ శక్తులు నిరాక రించాలనీ, ధ్వంసం చేయాలనీ ప్రయత్నిస్తున్నాయి. కమ్యూనిస్టు భావాలకూ, సోషలిస్టు భావాలకూ, అంబేడ్కరిస్టు భావాలకూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మూలవాసుల జీవన సంస్కృతులకు మూలమైన నదీ నాగరికతా సాంస్కృతిక విప్లవానికీ, రాజ్యాంగ మూల సూత్రాలకూ భిన్నంగా ఆ శక్తులు జీవిస్తున్నాయి. రాస్తున్నాయి. ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అంబేడ్కర్ ఆలోచనలతో పునరుజ్జీవన ఉద్యమం, ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ మార్గమే ఈనాటి సామాజిక జీవన సూత్రం కావాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 9849741695 -
తెలంగాణ: కొత్త సచివాలయ ప్రారంభానికి డేట్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. శుక్రవారం సచివాలయ పనులను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఈ మేరకు తేదీని వెల్లడించారు. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అలాగే.. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సచివాలయ పనులను పర్యవేక్షించడంతో పాటు అక్కడి రోడ్లను సైతం ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన ఏపీ మంత్రులు
-
అది అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతదేశం అనాదిగా నాస్తిక, అస్తిక వాదాలకు నిలయంగా ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. నగరంలోని కళాభారతిలో 10 రోజులపాటు కొనసాగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా సమతా స్ఫూర్తిని ప్రజలమధ్య నింపడానికి కృషిచేశారని, నాస్తికులు, ఆస్తికులు పోట్లాడుకుని జైళ్లకు వెళ్లడం అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అప్పటి సామాజిక విధానాల్లో ఉన్న అస్పృశ్యతను తొలగించడానికి అంబేడ్కర్ బౌద్ద మతాన్ని స్వీకరించి, అందులోని విధానాల ద్వారానే సౌభాతృత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. వీటికి సంబంధించిన విజ్ఞానం లభించాలంటే ఇలాంటి పుస్తక ప్రదర్శనలు అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహన్ని తయారుచేయించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో గ్రంథాలయాలు: ఇంటర్నెట్తో పిల్లల్లో వచ్చిన మార్పులు చూశాక అందోళన అనిపించినా ఇలాంటి పుస్తక ప్రదర్శన ద్వారా ఆ భయాలు తొలగిపోయాయని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని తెలిపారు. హైదరాబాద్‌లో 100 స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సిలబస్ మార్చే విధంగా కృషి చేస్తున్నామని, అందులో నీతి కథలు, పర్యావరణం, వ్యక్తిత్వ నిర్మాణం పాఠ్యాంశాలుగా చేర్చబోతున్నామని పేర్కొన్నారు. భిన్న వాదనలు ఉన్నా పుస్తకం మనుషులను ఏకం చేస్తుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయా చితం శ్రీధర్, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ సోమ భరత్ కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్ పాల్గొన్నారు. -
కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ఉండాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని, నూతన పార్లమెంట్‌కు ఆయన పేరు పెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని పరశురామ్ చేస్తున్న ఉద్యమం చాలా గొప్పది కాబట్టి.. ఈ అంశంపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం, అంబేడ్కర్‌పై అభిమానం ఉంటే పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టి అమలు చేయాలని.. లేని పక్షంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ పాల్గొన్నారు. -
మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే
నాగోలు (హైదరాబాద్): అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించి వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నందున వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్నే గెలిపిస్తారని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా సాగుతున్నాయన్నాయని తెలిపారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు రూ.55 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఫతుల్లగూడలో జరిగిన సభలో మాట్లాడారు. పేదల్ని ఆదుకుంటున్న పథకాలు పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామని కేటీఆర్ చెప్పారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్ కిట్ వంటి వంద రకాల సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది పేదలను ఆదుకుంటున్నాయని తెలిపారు. మెట్రో రైలు మొదటి దశలో నాగోలు వరకు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని, నాగోలు నుంచి ఎల్బీ నగర్ వరకు మిగిలిపోయిన 5 కిలోమీటర్ల మెట్రోను రెండో దశలో చేపడతామని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. పెరిగిన తలసరి ఆదాయం.. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ తెలిపారు. జీఎస్డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6 లక్షల కోట్లని, అదే ఈ రోజు 11.55 లక్షల కోట్లుగా ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేస్తే..19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని స్వయంగా కేంద్రమే చెబుతోందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో రాష్ట్రానికి అత్యధికంగా 26 అవార్డులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. 31.7 శాతానికి పెరిగిన గ్రీన్ కవర్.. రాజకీయ నాయకులు ఎన్నడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని కేటీఆర్ అన్నారు. చెట్లకు ఓట్లు ఉండవని, వాటితో ఎక్కువ లాభం ఉండదు కాబట్టే మాట్లాడరన్నారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో గతంలో 24 శాతం ఉన్న గ్రీన్ కవర్ ఇవాళ 31.7 శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో ఫతుల్లగూడ ఏరియా అడుగుపెట్ట వీల్లేకుండా దుర్వాసనతో అటవీ ప్రాంతంలా ఉండేదని, ప్రస్తుతం డంప్‌యార్డ్‌ను అపురూపమైన పార్క్‌గా తీర్చిదిద్దామని, దేశంలోని ఎక్కడా లేని విధంగా ముక్తిఘాట్‌ను ఏర్పాటు చేసి రూ.16 కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంత్రి మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్‌కు ప్రముఖుల నివాళులు
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం జరిగిన పలు కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్‌భవన్‌లో అంబేడ్కర్ చిత్రపటానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ట్యాంక్‌బండ్‌పైనున్న అంబేడ్కర్ విగ్రహానికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ప్రజాగాయకుడు గద్దర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, తెలంగాణ వైద్యసేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర బెవరేజస్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గజ్జెల నాగేశ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ఆమ్ఆద్మీ పార్టీ నేత ఇందిరాశోభన్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, బహుజన సమాజ్ పార్టీ, మాలమహానాడు నాయకులు తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అనుసరించే ప్రధాని నరేంద్రమోదీ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పర్యాటకులు, అభిమానులు సందర్శించడానికిగాను పంచతీర్థ పేరుతో ఏప్రిల్ 14న నూతన రైలును ప్రారంభిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో నడిచే రాజ్యాంగం అంబేద్కర్‌ది కాదని, ఇక్కడ కేసీఆర్ రాజ్యాంగమే నడుస్తోందని షర్మిల ఆరోపించారు. పంజగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని వి.హనుమంతరావు రెండు గంటలపాటు మౌనదీక్ష చేపట్టారు. కాగా, బీజేపీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, నాయకులు రావుల రాజేందర్ నివాళులర్పించారు. -
చావనైనా చస్తాం... కేసీఆర్‌ను వదిలివెళ్లం...
సాక్షి, హైదరాబాద్: చావనైనా చస్తాం, కానీ సీఎం కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లబోమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ మారే శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ బాన్సువాడ పేరు మీడియాలో వచ్చిందని, కానీ బాన్సువాడ శాసనసభ్యుడిగానే తన వైఖరిని స్పష్టం చేస్తున్నానని అన్నారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి స్పీకర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ శాసనసభ్యులు ఎవరు కూడా డబ్బులకు అమ్మడుపోయేవారు కాదు. అది ఊహాజనితం మాత్రమే, ఎవరైనా ఆశపడితే చేతులు కాల్చుకుని భంగపడతారు’ అని వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బలపరచడంతోపాటు సీఎంగా ఆయన తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తాం. ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి’అని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను నూరు శాతం అమలు చేయడంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని స్పీకర్ పేర్కొన్నారు. ఆరోపణలు చేసేవారు కాకుండా ఆలోచించేవారే పారిపాలన చేయగలరని పేర్కొన్నారు. పాదయాత్రల పేరిట విమర్శలు, అసత్యాలు ప్రచారం చేయకుండా ప్రజలకు ఏం చేస్తారో నాయకులు చెప్పాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్‌రావు, దండె విఠల్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు
-
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళి
తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. -
సామాజిక బందీల విముక్తి ప్రదాత!
ప్రపంచంలోని వివిధ సమాజాలు తమకు నచ్చిన తాత్త్విక మార్గాల్లో ప్రయాణిస్తూ మనుగడ సాగించడం అనాదిగా వస్తున్నదే. అయితే కొన్ని సమాజాల్లో అనేక సమూహాలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా బందీలై కనీస మానవ హక్కులకూ దూరమయ్యాయి. భారతీయ సమాజంలోని అస్పృశ్యులూ, ఆదివాసులూ, మహిళలూ, ఇతర అణగారిన సమూహాల వారు అటువంటి వారిలో కొందరు. తత్త్వశాస్త్రానికి మూల జీవం మానవ దుఃఖ నివారణ. ఇందుకోసం బుద్ధుడు, సోక్రటీస్, మార్క్స్ వంటి వారు ఎంతగానో ప్రయత్నించారు. ఇటువంటి తాత్త్వికులను అధ్యయనం చేసి అంబేడ్కర్ తన ఉపన్యాసాలు, రచనల ద్వారా పీడిత, తాడిత జనుల ఉద్ధరణకు ప్రయత్నించారు. ఆయన ఫిలాసఫీ భారత రాజ్యాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. అంబేడ్కర్ ప్రాసంగికత నానాటికీ పెరుగు తుందనడానికి నవంబర్ 26వ తేది రాజ్యాంగ అవతరణ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరగడం వల్ల మనకు అర్థమౌతోంది. అంబేడ్కర్ సిద్ధాంతాలు ప్రపంచ తాత్త్వికులకు సమ తుల్యమైనవి, తులనాత్మకమైనవి కూడా. అంబేడ్కర్ రచనా వైవి ధ్యంలో సోక్రటీస్, ప్లేటో, బుద్ధుడు, అరిస్టాటిల్ ఉన్నారు. ‘జ్ఞానవం తుడైనవాడు తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పకపోతే మూర్ఖుడ వుతాడు’ అనే సత్యాన్ని సోక్రటీస్ చెప్పాడు. అందుకు రాజ్యానికి, దేశానికి భయపడని నిర్భీతి తత్త్వాన్ని ఆయన ప్రదర్శించాడు. అదే తత్త్వం అంబేడ్కర్లో మనకు కనిపిస్తుంది. అందుకు సత్యాన్వేషణ, ధీశక్తి, శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధత అవసరం. వాటిని సోక్రటీస్ స్థాయిలో ఆధునిక యుగంలో వ్యక్తీకరించిన వాడు అంబేడ్కర్. ఆయన ముఖ్యంగా వేదాలకూ, స్మృతులకూ ప్రత్యామ్నా యంగా భారత రాజ్యాంగ దర్శనాన్ని రూపొందించాడు. అందుకు బుద్ధుని తత్త్వం ఆయనకు వాహిక. ఆయన సమాజంలో మానవతా స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేశాడు. అందుకు కారణం ఆయన హృదయ భావం, ఆయన చాలా సున్నిత హృదయుడు. ఆయన సున్నితత్వంలో కరుణ వుంది, ప్రేమ వుంది, ఆత్మీయత వుంది. అంకిత భావం వుంది. ఈ గుణాలు నాయకుణ్ణి ప్రవక్తగా తీర్చిదిద్దాయి. అందుకే ఆయన అణ గారిన ప్రజల తరఫున మాట్లాడాడు. ఈ దేశంలో కోట్లాదిమంది ప్రజలు అస్పృశ్యత అనే శాపంతో క్రుంగిపోయారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఉపద్రవం ఇది. ప్రతి మానవుడికీ ఉండవలసిన ప్రాథమిక హక్కులు వారికి తిరస్క రించబడ్డాయి. నాగరికత, సంస్కృతి ఫలాల లబ్ధిని వారికి అంద నివ్వలేదు. అస్పృశ్యులే కాకుండా ఈ దేశంలో అంతే పెద్ద సంఖ్యలో ఆదిమ జాతులు, గిరిజన తెగలు ఉన్నాయి. నాగరిక, సాంస్కృతిక స్రవంతిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయకుండా వారిని ఆటవిక, సంచార జాతులలా తిరిగేలా వదిలి పెట్టారు కులీనులు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన తన వాదాన్ని తాత్త్వికంగా మలిచాడు. కుల నిర్మూలనా వాదాన్ని ఇలా ప్రతిపాదించాడు. ‘‘కుల వ్యవస్థను సమర్థించడానికి వారసత్వం గురించీ, నరసంతతి శుద్ధి శాస్త్రం గురించీ చెత్తవాదన ఎంతో లేవనెత్తబడింది. నరవంశ శుద్ధిశాస్త్రం (యూజెనిక్స్) ప్రాథమిక సూత్రానికి కుల వ్యవస్థ అనుగుణంగా ఉంటే దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఎందు కంటే స్త్రీ పురుషులను వివేకంతో జత కలపడం ద్వారా జాతి అభి వృద్ధిని సాధించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే వివేక వంతమైన స్త్రీ, పురుష సంయోగాన్ని కుల వ్యవస్థ ఏ విధంగా సాధిస్తున్నదో అర్థం కావడం లేదు. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన ఒక కృత్రిమ వ్యవస్థ. అది చేస్తున్నదల్లా వివిధ కులాల స్త్రీ పురుషులు కులాంతర వివాహాలను చేసుకోకుండా నిషేధించడం. ప్రకృతి సిద్ధమై నది కాదది, ఒక కులంలో ఏ ఇద్దరు కలసి వివాహం చేసుకోవాలని ఉన్నదో నిర్ణయించే పద్ధతి కాదది. జాతి శుద్ధి శాస్త్రం దృష్ట్యా ఒక కులమే ఒక ప్రత్యేక మూల జాతి అయితే... ఉపకులాల పుట్టుక కూడా అదే విధంగా అయి వుండాలి. అయితే ఉప కులాల మూలం కూడా యూజినిక్సే అని నిజంగా ఎవరైనా వాదించగలరా? అలాంటి వాదన పూర్తిగా అసంగతం.’’ ఇకపోతే ఈ కులనిర్మూలన సిద్ధాంత ఆచరణకు మహాత్మాగాంధీ రాజకీయంగా మతవాద ధోరణితో అడ్డు వచ్చారు. అంబేడ్కర్ సాంఘికంగా కుల నిర్మూలనా వాది. ఆర్థికంగా స్టేట్ సోషలిజం ప్రతిపాదకుడు. రాజకీయంగా బహుజన రాజ్య నిర్మాణ దక్షుడు. ఈ మూడింటినీ సాధించడానికి ఆయన బుద్ధునిలో సంఘ వాదాన్నీ, మహాత్మా ఫూలేలోని సాంస్కృతిక విప్లవ వాదాన్నీ పోరాట ఆయుధాలుగా మలచుకున్నాడు. అందువల్ల ఆయన కుల నిర్మూలనా పునాదులపై పునర్నిర్మించే తత్త్వశాస్త్ర నిర్మాతగా ముందుకొచ్చాడు. జ్యోతిబా ఫూలే స్త్రీల కోసం చేసిన ఉద్యమం అంబేడ్కర్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. స్త్రీని విముక్తి చేయడం భారత పునరుజ్జీవ నోద్యమంలో ప్రధానాంశంగా ఆయన భావించాడు. హిందూ సంస్కరణవాదులు ప్రతిపాదించే పద్ధతిలో విధవా వివాహాలు, సతీసహగమన నిర్మూలన వంటి సంస్కరణల వలే కాక స్త్రీల హక్కులకు సంబంధించిన అంశం మీద ఆయన ఎక్కు పెట్టాడు. స్త్రీని భావ దాస్యం నుండి విముక్తి చేయడం, సాంఘిక, ఆర్థిక, సాంస్కృ తిక, రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులతో సమానంగా స్త్రీలకు కల్గించడానికి ఆయన తీవ్రమైన కృషి చేశాడు. అంబేడ్కర్ తనకు ముందున్న భారతీయ పాశ్చాత్య తత్త్వశాస్త్రాలన్నింటినీ చదివి భారత దేశ పున ర్నిర్మాణానికి పూనుకున్నాడు. అంబేడ్కర్‌లోని మరొక కోణం సామాజిక వ్యక్తిత్వ మనో విశ్లేషణ. ఈ ప్రత్యేకతను ప్లేటోలోని రచనా వైవిధ్యం, జ్ఞానతృష్ణ, సంభాషణా ప్రావీణ్యత, అంతరాంతర పరిశీలనల నుండి ఆయన సంతరించుకున్నారు. తత్త్వశాస్త్రానికి మూల జీవమైన మానవ దుఃఖ నివారణ పట్ల సోక్రటీస్ ఎంత వేదన పడ్డాడో, అంబేడ్కరూ అంత వేదన పడ్డాడు. వ్యక్తిగతమైన దుఃఖాన్ని అధిగమించి, సామాజిక దుఃఖాన్ని గుర్తించి, దాని నివారణ కోసం సిద్ధాంతపరంగా, ఆచరణ పరంగా కృషి చేసినవారు సోక్రటీస్, అంబేడ్కర్లు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చినా వారు సత్య నిరూపణ కోసం ముందడుగు వేస్తారు. ఇకపోతే అంబేడ్కర్ విద్యా తాత్త్విక వాది. ఆయన తన ప్రతిభా సంపత్తితో అçస్పృశ్యుల గురించి అనేక కమిషన్లకు వివరాలు అందించి అనేక హక్కులు సాధించాడు. ఏ పాఠశాల అయితే తనకు ప్రవేశాన్ని నిరాకరించిందో తనను తరగతి గదిలో బయట కూర్చో బెట్టి, బైట పాఠాలు చెప్పిందో, అదే భారతంలో తన ప్రజలను విద్యావంతులను చేయడానికి... అన్ని ప్రభుత్వ పాఠశాలల ద్వారాలు తెరిపించగలిగాడు. ఆయన ఒక్కడుగా ఒక సైన్యంగా పని చేశాడు. అంబేడ్కర్‌కు అధ్యయనంతో పాటు లోతైన అవగాహన, అనుభవం, ఆచరణ వున్నాయి. అందుకే ఆయన మాటలు సత్య నిష్టం అయ్యాయి. బుద్ధుని ధార్మిక సూత్రాలను, నీతి సూత్రాలను అంబే డ్కర్ రాజ్యాంగంలో అవసరం అయిన చోటంతా పొందుపరుస్తూ వెళ్ళాడు. ఈనాడు అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం అనే పేరు మీద భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసీహెచ్ఆర్) హిందూ పునరుద్ధరణవాద పత్రాన్ని రాష్ట్రాల గవర్నర్లకు, విశ్వవిద్యాలయాలకు పంపింది. అంటే అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను దెబ్బతీయాలనే ప్రయత్నం జరగు తోందన్న మాట! రాజ్యాంగం పీఠికలో చెప్పబడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దెబ్బతీయాలనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం బౌద్ధ యుగాన్ని దెబ్బతీయడానికి కౌంటర్ రివల్యూషన్‌గా వచ్చిన గుప్తుల కాలం నాటి మతోద్ధరణ వాదం లాగా వుంది. అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాన్ని ప్రచారం చేయా లనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని సామా జిక సామ్యవాద భావాన్ని దెబ్బతీయలేరనేది కూడా మరో ప్రక్క రుజువవుతూ వస్తోంది. మతం ఎప్పుడూ తత్త్వశాస్త్రానికి ప్రత్యా మ్నాయం కాలేదు. మతం కొందరికే పరిమితమైంది. రాజ్యాంగం అందరిని సమన్వయీకరించుకుంటుంది. ఆ శక్తి దానికుంది. ప్రపంచ తాత్త్విక దృక్పథం నుంచి ఏర్పడింది రాజ్యాంగం. అంబేడ్కర్‌వాదులు, మార్క్స్వాదులు, లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు ఐక్యంగా అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని తప్పక కాపాడుకుంటారు. ఈ యుగం అంబేడ్కర్‌ది. ఆయన నిర్మిం చిన తాత్త్విక సామాజిక మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు మొబైల్: 98497 41695 (నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి) -
ఏప్రిల్‌లో అంబేడ్కర్ భారీ విగ్రహం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మిస్తున్న 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని వచ్చే ఏప్రిల్‌లో ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నాటికి విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి అవుతున్నందున, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున పర్యాటకుల వీక్షణకు వీలుగా విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సోమవారం విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ భారీ విగ్రహాన్ని ఢిల్లీలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత, శిల్పి రాంసుతార ఆధ్వర్యంలో తయారు చేసినట్లు చెప్పారు. తరలింపునకు వీలుగా ముక్కలుగా రూపొందించిన విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడి వేదికపై పేర్చి అతికిస్తున్నట్లు తెలిపారు. మొత్తం పదకొండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని మంత్రులు వెల్లడించారు. దిగువ పార్లమెంటు ఆకృతిలో నిర్మించిన భవనంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించే ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇంకా అంబేడ్కర్‌కు సంబంధించిన చిత్రాలు, పార్లమెంటులో ఆయన ప్రసంగించిన వీడియోలను ప్రదర్శించేందుకు మినీ థియేటర్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ భవనం మీద అంబేడ్కర్ విగ్రహం ఉంటుందని చెప్పారు. -
కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో కోసం పోరాడతా: ఆర్.కృష్ణయ్య
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని కోరుతూ పార్లమెంటులో పోరాటం చేస్తానని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. కరెన్సీపై ఇప్పటికే అనేకమంది ఫొటోలను ముద్రించారని ఆర్బీఐ వ్యవస్థాపకుడైన అంబేడ్కర్ ఫొటోను మాత్రం ఎందుకు ముద్రించడంలేదని ప్రశ్నించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ‘కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి’ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమా వేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బల హీన వర్గాలకు రిజర్వేషన్లు అందించిన మహానీ యుడు అంబేడ్కర్ అని, కరడుగట్టిన వ్యవస్థపై పోరాడి మనకు హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి ఫొటోను కరెన్సీపై ముద్రిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆయన ఫొటో ముద్రించాలనే ఆలోచన పాలకులకు లేకపోవడం దుర్మార్గమన్నారు. అంబేడ్కర్ అందరి వాడని ఆయనను ఒక్క కులానికే పరిమితం చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, పోకల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనులకు గతేడాది డిసెంబర్ 22న శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. పనుల పురోగతిపై మంత్రుల కమిటీ, అధికారులు ప్రతివారం సమీక్షిస్తున్నారు. దీంతో అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో పనులు పూర్తికావచ్చాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతికి ఈ విగ్రహాన్ని ప్రారంభించేలా 400 మంది సిబ్బంది రాత్రి, పగలు శ్రమిస్తున్నారు. విగ్రహ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలోని ఒక మారుమూల ప్రాంతంలో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తామని హడావుడి చేసి ఆ ప్రాజెక్టును అటకెక్కించింది. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే విజయవాడ నగర నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 2020 జూలైలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు కాంట్రాక్టు సంస్థను ఖరారు చేశారు. డిజైన్లు పూర్తి చేసి గతేడాది డిసెంబర్లో పనులు చేపట్టారు. దాదాపు వంద అడుగుల ఎత్తైన పీఠం(ఫెడస్టాల్)పై 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. దీంతో 225 అడుగుల ఎత్తుతో దేశంలో ఈ విగ్రహం కూడా ప్రత్యేకంగా నిలవనుంది. హరియాణాలోని నాథురామ్ ఆర్ట్స్ చేపట్టిన విగ్రహ తయారీ పనులను మంత్రుల కమిటీ ఇటీవల పరీశీలించింది. 125 అడుగుల విగ్రహాన్ని 1200 ముక్కలు (భాగాలు)గా తయారు చేసే పని దాదాపు 40 శాతం పూర్తి అయ్యింది. ఈ విగ్రహాన్ని జనవరి నెలాఖరు నాటికి విజయవాడకు తరలించనున్నారు. అలాగే విగ్రహం ఏర్పాటుకు సపోర్టుగా ఉండేందుకు 125 అడుగుల ఎత్తైన స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్‌ను హైదరాబాద్‌లోని నాచారంలో వేగంగా రూపొందిస్తున్నారు. 350 టన్నుల స్టీల్‌తో ఇది తయారవుతోంది. దీన్ని నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక విగ్రహం ఏర్పాటు కోసం విజయవాడలో చేపట్టిన మొదటి దశ పనులను జనవరి 18 నాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశ పనుల్లో భాగంగా కన్వెన్షన్ సెంటర్, బేస్మెంట్ పార్కింగ్ జీ ప్లస్ 2, పరిసరాల అభివృద్ధి పనులను కూడా వేగంగా పూర్తి చేస్తామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. -
అంబేడ్కర్ చూపుతోనే సోషలిజం!
ఇవ్వాళ కమ్యూనిస్టులైనా, సోషలిస్టులైనా, మత తత్త్వ వాదులైనా అంబేడ్కర్‌ను స్మరించడం సాధారణ దృశ్యమయ్యింది. సంఘ్ పరివార్ శక్తులతోపాటూ... కాంగ్రెస్‌లో ఉన్న హిందూ తత్త్వం ఒంటబట్టించుకున్న అనేక మంది నాయకులూ అంబేడ్కర్ బతికున్న కాలంలోనూ అనేక సందర్భాల్లో ఆయన్ని వ్యతిరేకించినవారే. భారత్‌లో వర్గం అంటే కులమేననీ... కుల వ్యవస్థ నశిస్తే కానీ వర్గ వ్యవస్థ కనుమరుగు కాదనీ, అప్పుడుకానీ సామ్యవాద సమాజ స్థాపన సాధ్యంకాదనీ అంబేడ్కర్ అన్న మాటలను కమ్యూనిస్టులూ, సోషలిస్టులూ పట్టించుకోలేదు. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడూ, బీసీ నేత ములాయం సింగ్ యాదవ్ తుది శ్వాస విడిచిన ఈ తరుణంలో మరొకసారి ఈ దిశలో చర్చ జరగవలసిన అవసరం ఉంది. భారతదేశ రాజకీయాల్లో రామ్ మనోహర్ లోహియా ప్రతినిధిగా రాజకీయాల్లో జీవిం చిన ప్రముఖ నాయకుడు ములాయం సింగ్ యాదవ్. అక్టోబర్ 11న ఆయనకు తుది వీడ్కోలు పలకడం భారతదేశానికి ఒక విషాద ఘట్టమే. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత ఒక సోషలిస్ట్ బీసీ రాజకీయ నాయకుడు చనిపోయినప్పుడు ఇవ్వకపోవడం బ్రాహ్మణవాద భావజాలమే ఇంకా నడుస్తుందనడానికి ఒక నిద ర్శనం. ఇది చాలా బాధాకరమైన విషయం. భారతీయ సోషలిస్ట్ విధానాన్ని రూపొందించిన రావ్‌ు మనోహర్ లోహియా ఒక మార్వాడీ కులం నుండి వచ్చారు. కానీ ఆయన బీసీ లకు రాజకీయ అధికారం కావాలని నినదించారు. ఆ స్ఫూర్తి నుండి వచ్చిన వారే లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్, ములాయం సింగ్ యాదవ్ వంటివారు. ఇంకా ఎందరో రాజకీయ నాయకులు లోహియా ప్రభావంతో రాజకీయాల్లో బ్రాహ్మణవాద రాజకీయాలకు ఎదురు నిలబడ్డారు. ఈరోజు బీజేపీ అనే ఒక పార్టీ ఏర్పడిందంటే ఆరోజు వాళ్ల కాంగ్రెస్‌కు వ్యతిరేక పోరాటాలే అనేది మరువరాదు. మండల్ కమిషన్ నివేదిక అమలు జరపాలని లోహియా స్ఫూర్తితో వీపీ సింగ్ ముందుకు వచ్చేటప్పటికి జనతా పార్టీ చీలిపోయి మతోన్మాద బీజేపీ ఏర్పడింది. కమ్యూనిస్టులు, కార్ల్ మార్క్స్ వర్గ సిద్ధాంతాన్ని భారతదేశానికి అన్వయం చేయలేకపోయారు. అలా అన్వయం చేసి వుంటే భారత దేశంలో నిజమైన వైరుధ్యం కులం అని గుర్తించేవారు. అమానవీయ అస్పృశ్యతా నిర్మూలన ద్వారానే కుల నిర్మూలనా సాధ్యమనే లోహియా వాదులూ దీనిని విస్మరించారు. మొదటి నుండి లోహియా వర్గంలో సోషలిస్టులు అగ్ర వర్ణాలకు సంబంధించినవారే ఎక్కువ. లోహియాకి గాంధీ మీద అపారమైన గౌరవం వుంది. కానీ ఇద్దరి అభిప్రాయాలూ చాలా భిన్నమైనవి. లోహియాకు దేవుడిపై విశ్వాసం లేదు. ఆయన నాస్తికుడు. గాంధీజీ దేవుడు, సత్యం, అంతర్వాణి వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయినా గాంధీజీతో లోహియా చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చాడు. 1948 జనవరి 28న గాంధీజీ లోహియాతో ‘నీతో చాలా విషయాలు వివరంగా మాట్లాడాలని వుంది. కానీ నాకు సమయం దొరకటం లేదు. నా గదిలోనే నీవు కూడా పడుకో. మనం రాత్రికి మాట్లాడు కుందాం’ అన్నాడు. లోహియా గాంధీతో పాటు ఆయన గదిలోనే పడుకున్న ప్పటికీ గాంధీజీ లోహియా నిద్రకు భంగం కలిగించలేక పోయాడు. మరుసటి రోజు లోహియాతో గాంధీజీ, ‘నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని, సోషలిస్టు పార్టీ గురించీ, కాంగ్రెస్ గురించీ ఏదో ఒకటి నిర్ణయించాలని అందువల్ల మరుసటి రోజు (జనవరి 30) సాయంత్రం తప్పకరావాలని’ అన్నాడు. కానీ ఆ రోజే ఆయన మతోన్మాది చేతుల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. లోహియా అనుచరులంతా ఆయన భావజాలాన్ని తీసుకోలేదు. గాంధీ భావాలే లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఇతర సోష లిస్టుల్లోనూ ఎక్కువగా వున్నాయి. అందుకే వీరు బీజేపీని ఎదిరించలేక పోతున్నారు. ఇకపోతే అస్పృశ్యుల జీవితాలు చూసి అంబేడ్కర్ తన జీవితంలో ఎన్నోసార్లు కంటతడి పెట్టాడు. ఈ సమాజంలో తన ప్రజలు ఎందుకు అస్పృశ్యులుగా జీవిస్తున్నారు. ఈ హిందువులు కుక్కలకు సబ్బుపెట్టి స్నానం చేయిస్తూ, వాటికి పసుపు రాస్తూ వాటిని గౌరవిస్తూ... సాటి మనిషిని నువ్వు అంటరాని వాడివి అంటూ ఎందుకు హింస చేస్తు న్నారు? అని ఎంతో మథనపడ్డాడు. ఆ మథనం నుండే ఆయన వ్యక్తిత్వం రూపొందింది. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్డీ తీసుకున్న మేధావికి బరోడాలో ఒక మామూలు బంట్రోతు మంచి నీళ్ళు ఇవ్వకుండా నిరాకరించినందుకు ఆయన తపన చెందాడు. ఆ తపన నుండే ఆయన ఉద్యమాన్ని సృష్టించాడు. తన లక్ష్య సాధన కోసం, అస్పృశ్యుల సమస్యలను ప్రభుత్వం ముందు వుంచడం కోసం, వారి కష్టాలను తొలగించడం కోసం ఒక కేంద్ర వ్యవస్థ ఏర్పాటుపై అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం 1924 మార్చి 9వ తేదీన బొంబాయిలోని దామోదర్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తీవ్రమైన చర్చోపచర్చల తర్వాత ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తదనుగుణంగా జూలై 20వ తేదీన ‘బహిష్కృతకారిణి సభ’ను 1860 చట్టం కింద నమోదు చేశారు. దళితుల చరిత్రను రూపొందించడంలో అంబేడ్కర్ త్యాగపూరిత మైన కృషిని నిర్వహించారు. భారత సామాజిక వ్యవస్థలో కులం, అస్పృశ్యత ఎలా ఏర్పడ్డాయో తెలియకుండా భారతదేశంలో నూతన వ్యక్తిత్వ నిర్మాణం జరగడం సాధ్యం కాదు. ఇప్పుడు మనకు కులంలేని మనుషులు కావాలి. కుల జీవితం భారతదేశంలో ఒక నిబద్ధతగా మారిపోయింది. అందుకే అంబేడ్కర్ కులం గురించి తన కుల నిర్మూ లనా గ్రంథంలో ‘హిందూ సమాజం ఒక కులాల సమ్మేళనం. ప్రతి కులమూ అదొక పరిమిత సంస్థ కాగా అందులోకి క్రొత్తవాడికి ప్రవేశం లేదు. ఇతర మతాల వాళ్ళను, జాతులను తమ మతంలో కలుపుకొని తద్వారా తమ మతాన్నీ, తమ సమాజాన్నీ విస్తరింపజేసుకొనే అవ కాశం హిందువులకు లేకుండా పోవడానికి కారణం కేవలం కులవ్యవస్థే’ అని పేర్కొన్నాడు. అంబేడ్కర్‌ను పూర్తిగా వ్యతిరేకించాలనే బీజేపీ వ్యూహం సామాజిక న్యాయం వైపుకు నడవడంలేదు. దళితులపై ద్వేషాన్ని ప్రకటిస్తుంది. ఆవు పేరు చెప్పి ఎంతోమంది దళితులను వేటాడారు. ముస్లివ్ులపై ద్వేషాన్ని కుమ్మరించారు. తేజస్వినీ యాదవ్, శరద్ యాదవ్, మమతా బెనర్జీ వంటివారంతా దళితులపై అణచివేతను నివారించడానికి గొప్ప ఉద్యమం నడపలేకపోయారు. మధ్యతరగతి రైతులు, మధ్య తరగతి భూస్వాములుగా వ్యవహరించారు. వీళ్ళకు అంబేడ్కర్ భావజాలం ఒంటబట్టే వరకూ బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేరు. ఆ పార్టీకీ వీళ్ళకు సన్నని గీత మాత్రమే తేడా వుంది. అంబే డ్కర్ భావజాల స్ఫూర్తిలో బౌద్ధం దాగి వుంది. ముఖ్యంగా స్త్రీ విముక్తి పోరాటంలో కూడా వీరు అంబేడ్కర్ ఆలోచనలను తీసు కోలేదు. కనీసం మహాత్మాఫూలే, సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తి కూడా వీరి దగ్గర లేదు. అంబేడ్కర్ భార్య చనిపోయిన తరువాత కూడా కామతృష్ణకు గురికాకుండా జీవించాడు. గాంధీ, నెహ్రూల స్త్రీలకు సంబంధించిన కథనాలు లాంటివి అంబేడ్కర్‌కు లేవు. ఆయన మరో బుద్ధుడిలా జీవించాడు. స్త్రీ వ్యామోహం అనేక మంది నాయకుల్ని పతనావస్థకు తీసుకెళ్ళింది. వ్యక్తిత్వం అనేది వ్యామోహ రహితమైన దైతే కానీ విశ్వవ్యాపితమైన ప్రేమను అందించ లేరు. అంబేడ్కర్ స్త్రీల పట్ల గౌరవంగా వుండడమే గాక ‘హిందూ కోడ్ బిల్’ ద్వారా వారి హక్కులను సాధించిన మహోన్నత వ్యక్తి. ఏ నాయకుడైతే స్త్రీల చేత గౌరవించబడతారో ఆ నాయకుడే ప్రపంచ వ్యాపిత కీర్తిని ఆర్జిస్తాడు. స్త్రీలు నిశ్శబ్ద ప్రచారకులు. వారొక వ్యక్తిత్వాన్ని గౌరవిస్తే దాన్ని మౌఖికంగా ప్రచారం చేస్తారు. అంబే డ్కర్కి విపరీతమైన స్త్రీల ఫాలోయింగ్ వుండేది. బ్రాహ్మణ స్త్రీల దగ్గర నుండి దళిత స్త్రీల వరకు వారి విముక్తి కోసం ఆయన తన మంత్రి పదవికే రాజీనామా ఇచ్చాడు. స్త్రీలలో ప్రేమనూ, దుఃఖాన్నీ, వ్యధనీ చూశాడు. స్త్రీల అభ్యున్నతి కోసం మథన పడ్డాడు. లోహియా భావాలు కూడా సామ్యవాద భావాలే. అయితే ఇప్పుడున్న సోషలిస్టులు సామాజిక న్యాయ సాధనలో అస్పృశ్యతా నివారణ, కుల నిర్మూలన కోసం సామాజిక సాంస్కృతిక విప్లవ భావాలతో ముందుకు రావాల్సివుంది. బహుజన, దళిత, మైనార్టీల విముక్తి కోసం కొత్త రాజకీయ ఎజెండాతో ముందుకు నడవవలసిన బాధ్యత అందరి మీదా ఉంది. ములాయం సింగ్ స్మృతిలో లోహియా భావాల పునరుజ్జీవనమే గాక... అంబేడ్కర్ ఆలోచనలతో వాటిని సమన్వయం చేసుకోవడం అవసరం. ఈనాటి రాజకీయాలకు ఈ సమన్వయం అవసరం. అప్పుడే భారత్‌లో సామ్యవాద, సాంఘిక వాద రాజకీయ పునరుజ్జీవనం జరుగుతుంది. ఆ దిశగా నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి
భారతదేశం ఈనాడు అంబేడ్కర్ మార్గంలో నడవాలా? గాంధీ మార్గంలో నడవాలా? అనే పెద్ద ప్రశ్న దేశంలోని పార్టీల ముందు ఉంది. భారత దేశంలో ఈనాడు రాజకీయ కూటములు ఎక్కువ ఏర్పడు తున్నాయి. బీజేపీ కూటమి గాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్ భావజాలాల్లో నడుస్తోంది. కాంగ్రెస్ కూటమి గాంధీ, నెహ్రూ భావజాలాల్లో నడుస్తున్నది. కేసీఆర్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి వారితో ఏర్పడుతుందని చెబుతున్న మూడవ కూటమి ఇంకా తన భావజాలాన్ని ప్రస్పుటం చేయలేదు. కానీ భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మౌలికమైన మార్పు రావాలంటే తప్పకుండా అంబేడ్కర్ భావజాలమే ఈనాడు భారతదేశానికి అవసరం. బీజేపీ పైకి గాంధీ పేరు చెప్తున్నా అది హిందూ మతోన్మాద భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ మార్గంలో నడుపుతోంది. హిందూ మతోన్మాదాన్ని భారతదేశంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సరిగ్గా అంచనా వేశారు. హిందూ మతాన్ని నిర్మూలించకుండా భారతీయ సామాజిక విప్లవం విజయవంతం కాదనీ, హిందూ మతోన్మాదం ప్రమాదకరమైనదనీ అంబేడ్కర్ నొక్కి వక్కాణించాడు. భారత సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోయిన బౌద్ధ ఉద్యమంలోని మాన వతా వాదాన్ని ఆయన పరివ్యాప్తం చేశాడు. కమ్యూని స్టులు ప్రాచీన భారత సామాజిక ఉద్యమకారులను, ఆధునిక సామాజిక ఉద్యమకారులైన మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరియార్ వంటి వారినీ; వారి సిద్ధాంతా లనూ నిర్లక్ష్యం చేశారు. దాని ఫలితంగా భారతదేశంలో ఈనాడు మతోన్మాదం తెట్టెం కట్టుకుపోయింది. మతోన్మాదులు, సామ్రాజ్యవాదుల అండ తీసుకొని మరింతగా బలపడటం ప్రారంభించారు. ఇక దీనికి రాజ్య వ్యవస్థ తోడైందంటే ఎంత ప్రమాదమో చూడండి! అంబేడ్కర్ విషయానికి వస్తే... మొదటి నుండి ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రత్యామ్నా యంగా... భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, తాత్విక రంగాలలో ప్రామాణికమైన కాంగ్రెస్ నాయకులు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూలను ఎదిరిస్తూ వచ్చాడు. తన ‘వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హావ్ డన్ టు ది అన్‌టచ్‌బుల్స్’ అనే గ్రంథంలో కాంగ్రెస్ నాయకుల నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. నిజానికి కాంగ్రెస్‌లో అంత ర్గతంగా హిందూయిజం వుంది. బీజేపీ తమ సిద్ధాంతకర్తలుగా కాంగ్రెస్ నాయకులను తలకెత్తు కోవడంలోని ఆంతర్యం అదే. అంబేడ్కర్ అసలు హిందూమతం అంటే ఏమిటి? హిందూ మత భావజాలంతో నడిచేవి అసలు పార్టీలు అవుతాయా? అని ప్రశ్నించాడు. నిషేధాల శిక్షాస్మృతినే హిందూ మతంగా చలామణీ చేసి ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించడం జరుగుతోందని అంబే డ్కర్ అన్నారు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరొక న్యాయం... వీటిలో ఎప్పటికీ మార్పు లేకుండా చేసి అన్యాయాన్ని శాశ్వతీకరించడం మరీ దురన్యాయం అన్నారాయన. లేని ‘హిందూ’ మతాన్నీ, వాదాన్నీ గాంధీ తలకెత్తుకున్నాడు. దానితో ముస్లిం లీగ్ విజృంభించింది. మతవాద రాజకీయాలు, స్వాతంత్య్ర ఉద్యమాలతోనే హిందూ రాజకీయ వాదం ప్రారం భమైంది. హిందూ శబ్దం వేదాల్లో లేదు. భారత, రామాయణ, భాగవత అష్టాదశ పురాణాల్లో లేదు. వైదిక మతం, బ్రాహ్మణమతం ఉన్నాయి కానీ హిందూ మతం లేదు. ఇప్పుడు బీజేపీ హిందూ మతోన్మాదాన్నీ, కాంగ్రెస్ హిందూ సాంప్రదాయ వాదాన్నీ ముందుకు తెస్తున్నాయి. ఇప్పటికే అంబేడ్కర్ హిందూ ప్రత్యా మ్నాయ రాజకీయ వ్యవస్థను రూపొందించారు. ఆయన కొత్త మ్యానిఫెస్టోలు ఎప్పటికప్పుడు రచిం చారు. అంబేడ్కర్ రాజకీయ ఉద్యమంలో బౌద్ధ తత్వ ప్రభావం వుంది. బౌద్ధ తాత్వికతలో వున్న సమసమాజ నిర్మాణ భావన ఆయనలో వ్యక్తమయ్యింది. అంబేడ్కర్ మానవతావాది. హేతువాది సామ్య వాది. ఆయన జాన్‌డ్యూయీ శిష్యుడు. జాన్‌డ్యూయి లోని ప్రజాస్వామ్య భావాలనూ, కారల్ మార్క్స్‌లోని సామ్యవాద భావాలనూ, కబీరులోని మానవతావాద భావాలనూ ఆయన రాజకీయాలతో సమన్వయిం చారు. ఆయన నిర్మించిన రాజకీయ పార్టీలో సామ్య వాద భావాలు నిండి వున్నాయి. మార్క్స్ భావజాలాన్ని కూడా ఆయన తన రాజకీయ ప్రణాళికలో చేర్చాడు. మార్క్సియన్ పద్ధతిలో కాకపోయినా, భారతీయ సామాజిక విప్లవకారుడిగా సమసమాజం కోరుతున్న అంబేడ్కర్ కుల నిర్మూలనా వాదం వర్గపోరాటానికి సజీవశక్తి అనడంలో అతిశయోక్తి లేదు. అంబేడ్కర్ కొన్ని అంశాల్లో మార్క్స్‌తో విభేదించాడు. కొన్ని అంశాల్లో అంగీకరించాడు. అంగీకరించిన ప్రధాన అంశం ‘సమ సమాజం’. అంగీకరించని అంశం సాధించే పద్ధతిలోనే బలప్రయోగం లక్ష్యం. ఇద్దరిదీ సమ సమాజమే. సాధించే పద్ధతిలోనే కొంత తేడా వుంది. ఇద్దరి సామా జిక తత్త్వవేత్తల వైరుద్ధ్యాలను, సమన్వయాలను పరి శీలించి భారత సామాజిక విప్లవానికి వారిరువురి సిద్ధాంతాలను ఉపయుక్తం చేసుకోవలసిన ‘సమ సామాజిక వాదులు’ ఆ చారిత్రక బాధ్యతను విస్మరిం చారు. కులవాదం మీద అంబేడ్కర్ విశ్లేషణలను మార్క్స్ మీద అంబేడ్కర్ చేసిన విశ్లేషణలుగా ప్రచారం చేసి అంబేడ్కర్‌ను మార్క్స్ వ్యతిరేకిగా చిత్రించడంలో హిందూ కమ్యూనిస్టులు కృతకృత్యులయ్యారు. అంబేడ్కర్, లోహియా, మార్క్స్‌ల భావజాలాల సమన్వయమే హిందూ భావజాల రాజకీయాలకు ప్రత్యామ్నాయం. దళిత బహుజన మైనార్టీ లౌకిక వాదులు ఈ మార్గంలో నడిస్తేనే భారతదేశానికి భావ జాల విముక్తి. భావజాల విముక్తి వల్లే రాజకీయాలకు ప్రత్యామ్నాయ యుగం ఆవిర్భవిస్తుంది. ఆ దిశగా పయనిద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నేత మొబైల్: 98497 41695 -
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం
-
డిసెంబర్ నాటికి అంబేడ్కర్ విగ్రహ పనులు పూర్తి
ఖైరతాబాద్: నగరంలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో నిర్మించ తలపెట్టిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ తయారీ పనులను సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో శాసన సభ్యుల బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్న గౌరవమన్నారు. డిసెంబర్ నాటికి విగ్రహ తయారీ పనులు పూర్తవుతాయన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన అభినందనీయమన్నారు. అందుకు అనుకూలంగా తెలంగాణ శాసనమండలి తీర్మానం హర్షనీయమన్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టే విషయంపై బీజేపీ క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇదే అంశంపై బీజేపీ పాలిత రాష్ట్రాల వైఖరిని వెల్లడించాలన్నారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ కేంద్ర మంత్రులు తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు తప్పితే దళితుల ఇంట్లో అన్నం తినలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం తప్ప దళిత వర్గాలకు చేసింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, చిరుమర్తి లింగయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
తొలుత డిమాండ్ చేసి.. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి
కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును జత చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీంతో గత కొంతకాలంగా ఈ విషయంలో ఏర్పడిన సందిగ్ద పరిస్థితి తొలగిపోయిందని అనుకోవచ్చు. దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు కూడా వివాదం అవుతుందని ఎవరూ ఊహించలేరు. బహుశా స్థానిక సామాజిక పరిస్థితులు, రాజకీయ కారణాలతో ఇలా జరిగి ఉండవచ్చు. ఇందులో రాజకీయ పార్టీలు తమ వంతు ఆజ్యం పోశాయి. చివరికి వ్యవహారం ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇంటిని దగ్దం చేసేవరకు వెళ్లింది. ప్రభుత్వం అమలాపురంలో జరిగిన హింసాకాండను అదుపు చేసినప్పటికి, కొంత డామేజీ జరిగిందని చెప్పవచ్చు. కోనసీమ ప్రాంతం పాడి,పంటలతో , గోదావరి జలాలతో సస్యశ్యామలంగా ఉండే ప్రదేశం. అక్కడ మొదటి నుంచి షెడ్యూల్ కులాలవారు అదిక సంఖ్యలో నివసిస్తున్నారు. దాని కారణంగానే అమలాపురం లోక్ సభ నియోజకవర్గం పరిదిలో అమలాపురం, రాజోలు, గన్నవరం మూడు అసెంబ్లీ స్థానాలు రిజర్వుడ్ కేటగిరిలో ఉన్నాయి. అమలాపురం లోక్ సభ కూడా రిజర్వుడు నియోజకవర్గమే. అంతకుముందు రిజర్వుడ్ గా ఉన్న ముమ్మడివరం డిలిమిటేషన్ లో జనరల్ సీటు అయింది. ఏపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేసినప్పుడు కోనసీమ ప్రాంత ప్రజల కోరిక మేరకు అమలాపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటైన కొత్త జిల్లాకు కోనసీమ పేరును ప్రకటించింది. కాని ఆ తర్వాత ఆ జిల్లాకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ మొదలైంది. ఆయా ప్రజా సంఘాలు ఈ డిమాండ్ తో ఆందోళనలు సాగించగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ డిమాండ్ ను ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు పెట్టేవరకు పోరాటం జరుగుతుందని ప్రకటించారు. అలాగే మరో విపక్ష పార్టీ అయిన జనసేన స్థానిక నేతలు కూడా అంబేద్కర్ జిల్లా ఏర్పాటుకు ధర్నాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముమ్మడి వరం ప్రాంతానికి పర్యటనకు వెళ్లినప్పుడు ఆయా సంఘాలవారు, రాజకీయ నేతలు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును ఖరారు చేయాలని కోరారు. అందుకు ఆయన ఆమోదం తెలిపి కోనసీమ పేరును యధాతధంగా ఉంచుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును జతచేశారు.ప్రభుత్వం ఈ డిమాండ్ ను ఆమోదించదని అనుకున్నారేమో తెలియదుకాని, రాజకీయాల కోసం టీడీపీ, జనసేనలు వెంటనే ప్లేట్ ఫిరాయించాయి. కొన్ని సంఘాలు కూడా దీనికి తోడయ్యాయి. ఆ డిమాండ్ పై వారు శాంతియుతంగా నిరసనలు చెబితే ఎవరూ అభ్యంతరం చెప్పనవసరం లేదు.కాని సడన్ గా అవి హింసాత్మకంగా మారి ఏకంగా మంత్రి విశ్వరూప్ ఇంటిని, ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ ఇంటిని దుండగులు దగ్దం చేసేంతవరకూ వెళ్లాయి. ఈ ఘటనతో రాష్ట్రం అంతా నిర్ఘాంతపోయింది.అంబేద్కర్ పేరు పెట్టాలని తొలుత డిమాండ్ చేసిన విపక్షాలు ఆ తర్వాత ప్లేట్ పిరాయించి , అదికార వైసీపీనే కులచిచ్చు పెట్టిందని ,కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్యకేసును డైవర్టు చేయడానికి జిల్లా కు అంబేద్కర్ పేరు పెట్టారని ఆరోపించడం ఆరోపించారు. అంతే తప్ప అంబేద్కర్ పేరు ఉండాలో, వద్దో అన్నదానిపై చంద్రబాబుకాని, పవన్ కళ్యాణ్ కాని ఒక్క ముక్క మాట్లాడలేదు. తెలంగాణ అంశంలో మాదిరే చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం పాటించినట్లుగానే ఇక్కడ కూడా వ్యవహరించారు. అయినా ప్రభుత్వం నిర్దిష్ట నిబందనలు పాటించి,నెల రోజుల గడువు తో ప్రజాభిప్రాయం తీసుకుని చివరికి క్యాబినెట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్డడానికి ఓకే చేసింది.ఒకవేళ పొరపాటున అంబేద్కర్ పేరును ఇప్పుడు వెనక్కి తీసుకుని ఉంటే ప్రభుత్వానికి అది మరింత పెద్ద సమస్య అయి ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత, వివిధ వర్గాలు ఆందోళనకు దిగేవి. అయితే అమలాపురం ఏరియాలో కాపు, ఎస్సి, బిసి సామాజికవర్గాల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల అక్కడ అంబేద్కర్ పేరుకు కొందరు వ్యతిరేకించారే తప్ప,ఎవరికి అంబేద్కర్ పట్ల గౌరవడం లేక కాదని చెప్పాలి. నిజానికి అంబేద్కర్ వాదానికి ఆంద్రప్రదేశ్ లో బలమైన కేంద్రంగా కోనసీమ ప్రాంతం ఉందన్న విషయం చరిత్ర తెలియచెబుతుంది. అంబేద్కర్ మొదట ఇండిపెండెంట్ లేబర్ పార్టీని, ఆ తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ను, తదుపరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ను స్థాపించారు. రిపబ్లిక్ పార్టీ పూర్తిగా రూపొందడానికి ముందుగానే ఆయన కన్నుమూశారు.కాగా తొలి ప్రధాని జవహర్ లాల్ కోరిక మేరకు తొలి క్యాబినెట్ లో న్యాయశాఖ మంత్రిగా కూడా బాద్యతలు తీసుకున్నారు. తదుపరి ఎన్నికల రాజకీయాలలో ఆయన రాణించలేకపోయినా, సిద్దాంత రాజకీయాలలో మహాత్మాగాందీ తర్వాత అంబేద్కర్ మాదిరి దేశ వ్యాప్తంగా బలమైన ముద్ర వేసుకున్న నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు. పలు రాష్ట్రాలలో ఆయన పేరుతో జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. కాగా 1952 లో మదరాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంద్ర ప్రాంతంలో షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఒక సీటును గెలుచుకుంది కూడా కోనసీమ ప్రాంతంలోనే కావడం విశేషం. అమలాపురం ద్విసభ్య నియోజకవర్గం లో బి.అప్పలస్వామి అనే నేత ఈ ఫెడరేషన్ తరపున గెలుపొందారు. తదుపరి 1967లో అల్లవరం రిజర్వుడ్ నియోజకవర్గంలో రిపబ్లికన్ పార్టీ పక్షాన బి.వి.రమణయ్య అనే దళిత నేత గెలుపొందారు. ఆంద్రప్రాంతం నుంచి ఈ పార్టీ తరపున ఈయన ఒకరే గెలిచారు. దీనిని బట్టి అక్కడ అంబేద్కర్ కు ఉన్న ప్రాధాన్యత, ప్రాచుర్యం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి విశిష్టత ఉన్న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని అంతా స్వాగతించాలి. కాని అక్కడ ఉన్న కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా కొన్నివర్గాలు వ్యతిరేకించాయి. అంబేద్కర్ పేరు పెడితే కోనసీమ ప్రాశస్థ్యం పోతుందని వీరు ప్రచారం చేశారు. అయితే జిల్లాకు కోనసీమ పేరు కూడా ఉన్న విషయాన్ని గుర్తించాలి. ఏదో ఒక వర్గం మీద ద్వేషంతో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఒక భారత ప్రముఖుడిని అగౌరవపరిచే విధంగా ఎవరూ వ్యవహరించకూడదని చెప్పాలి. కొందరు సృష్టించిన హింసాకాండ కు బాద్యులైన కొన్ని వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో అత్యధిక శాతం టిడిపి, జనసేన కార్యకర్తలు,స్థానిక నేతలే ఉన్నారు. వారు ఇప్పుడు కేసులలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. వెనుక ఉన్న రాజకీయ పార్టీల పెద్ద నేతలు అంతా సేఫ్ గానే ఉన్నారు.ఆ విషయాన్ని ఇలాంటి గొడవలలో పాల్గొన్నవారు గుర్తించాలి. అంబేద్కర్ పేరు కొనసాగించడం వల్ల వైసిపికి రాజకీయంగా ఆ ప్రాంతంలో కొంత నష్టం జరగవచ్చని కొందరు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కాని, ఒకవేళ అంబేద్కర్ పేరు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గితే దేశం అంతటా పెద్ద చర్చ అయ్యేది. రాష్ట్రం అంతటా దీని ప్రభావం పడేది. మళ్లీ ఇవే విపక్షాలు ఆ పరిస్థితిని తమ అడ్వాంటేజ్ కు వాడుకునే యత్నం చేసేవి. ఈ రాజకీయాలు ముఖ్యమంత్రి జగన్ కు తెలియనివి కావు. అందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ముందుకు వెళ్ళింది. కనుక అన్ని వర్గాలు ఈ రాద్దాంతాన్ని ఇంతటితో ముగించాలని కోరుకుందాం. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
శతమానం భారతి లక్ష్యం 2047
గత 75 ఏళ్లలో ఆరోగ్య రంగంలో భారతదేశం అనేక విజయాలు సాధించింది. వచ్చే 25 ఏళ్లలో మరింతగా ప్రజలకు ఆరోగ్య భద్రతను ఇచ్చేందుకు లక్ష్యాలను ఏర్పరచుకుంది. ‘హెల్త్ సర్వే–డెవలప్మెంట్’ అనే అంశంపై సర్ జోసెఫ్ విలియం భోర్ కమిటీ 1946లో సమర్పించిన నివేదిక ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో ఉన్న వైద్య కేంద్రాల సంఖ్య చిన్నవి, పెద్దవి కలిపి దాదాపుగా 10 వేలు! నాటి జనాభా 34 కోట్లు. అంటే.. ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లకు వైద్యం, చికిత్స అన్నట్లు ఉండేది. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం అలక్ష్యానికి గురయ్యేది. అందుకే భోర్.. ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి రావడం అనేదాన్ని ప్రాధాన్యతా లక్ష్యంగా నిర్దేశించారు. స్వాతంత్య్రం వచ్చాక ఆరోగ్య రంగంలో అభివృద్ధికి అవసరమైన సూచనలు కోసం భారత ప్రభుత్వం మొదలియార్ కమిటీని నియమించింది. 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. ఇక ఈ రంగంలో దేశం సాధించిన విజయాల విషయానికి వస్తే.. ప్లేగు, మశూచి వ్యాధులను సమూలంగా నిర్మూలించగలిగాం. కలరా మరణాలు తగ్గాయి. మలేరియా దాదాపుగా అదుపులోనికైతే వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి మూడు దశాబ్దాలలోనే సగటు ఆయఃప్రమాణం 33 నుంచి 53 ఏళ్లకు పెరిగింది. మరణాల రేటు 28 నుంచి 13 శాతానికి తగ్గింది. 2002లో విడుదలైన రెండో జాతీయ విధానం పోలియో, బోదకాలు, కుష్టు వంటి వ్యాధుల పూర్తి నిర్మూలనకు; క్షయ, మలేరియా, అతిసార మరణాల తగ్గింపునకు సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్వావలంబన తర్వాత ఇతర దేశాలకు ఆలంబనగా ఉండేందుకు కూడా భారత్ తన ఆరోగ్య ప్రణాళికలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ వస్తోంది. -
చైతన్య భారతి.. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1891–1956
సంకల్ప బలుడు అంబేడ్కర్ నినాదం ఒక్కటే.. చదవండి, సంఘటితమవండి, ఉద్యమించండి. భారతీయుల్ని విద్యావంతుల్ని చేయడానికి ఆయన కళాశాలల్లో పాఠాలు బోధించారు. ఆ తర్వాత ముంబైలో, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. వారిని సంఘటితం చెయ్యడానికి ఆయన ఒక రచయితగా, ప్రచురణకర్తగా, శ్రామిక నాయకుడిగా మారారు. స్వయంగా రాజకీయ పార్టీలు స్థాపించారు. ఇక ఉద్యమాన్ని నడిపించడానికి తన సమాకాలికులైన ఇతర నేతలతో పోరాడారు. 1930–32 మధ్యకాలంలో ఆయన లండన్‌లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలలో ‘అస్పృశ్య జనావళి’కి ప్రాతినిధ్యం వహించారు. తద్వారా ఆయన 1932లో హిందువుల నుంచి వేరుగా నిమ్నవర్గాలకు ప్రత్యేక ఓట హక్కు కల్పించడానికి హామీ సంపాదించారు. నిమ్న కులస్థులకు ప్రత్యేక రాజకీయ హక్కులు ఉండాలని, సామాజిక సంస్కరణలు చేపట్టాలని కోరారు. అందరికీ సమాన హక్కులు ఉండాలని సాగించిన పోరాటం వల్ల ఆయనకు విభిన్న మత విశ్వాసాలతో పరిచయం ఏర్పడింది. బుద్ధుడి బోధనలకు ప్రభావితుడైన అంబేడ్కర్ వైయక్తిక సాధన, సామాజిక సేవలతో సంఘ సంస్కరణలు తేవడానికి బౌద్ధం ఒక గొప్ప సాధనం అని భావించారు. 1956లో నాగపూర్‌లో బౌద్ధ మతాన్ని స్వీకరించడం ద్వారా ఆయన తన కులస్థులకు మార్గదర్శిగా నిలిచారు. సామాజిక మార్పును సాధించడం ఎలాగో తెలుసుకోడానికి ఆయన జీవితమే ఒక పాఠశాల. ఆయన జీవితం నుంచి, సంకల్పం నుంచి ప్రపంచ సమాజం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. భీమ్రావ్ రామ్‌జీ అంబేడ్కర్ భారతదేశంలో దళిత నిమ్నకులం నుంచి పైకి ఎదిగారు. భారతదేశంలో, పశ్చిమ దేశాలలో విద్యాభ్యాసం చేసి జాతీయ నాయకుడి స్థాయికి చేరుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయ సాధన కోసం ఆలుపెరుగని పోరాటం సాగించారు. స్వతంత్ర భారతదేశంలో అంబేడ్కర్ తొలి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన భారత జాతి రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశాన్ని లౌకికవాద దేశంగా చేయడమే కాక, జాతీయ పతాకంలో ఆశోక ధర్మ చక్రం, మూడు సింహాల సూచనా ఆయదే. – డేవిడ్ బ్లండెల్, తైవాన్ నేషనల్ షెంగ్చీ వర్సిటీలో కోర్స్ ఇన్స్ట్రక్టర్ -
అమలాపురానికి అదనపు బలగాలు.. నిలిచిపోయిన బస్సులు
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను అధికారులు తరలించారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులను రద్దు చేశారు. అమలాపురంలో పరిస్థితి అదుపులోకి తెచ్చామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. డీఐజీ, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఆందోళనలపై విచారణ చేపడతామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! ‘సాక్షి’తో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు మాట్లాడుతూ, అమలాపురంలో ఆందోళనల్లో పాల్గొని విధ్వంసం సృష్టించిన వారిని గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకూడదని అమలాపురంలో కర్ఫ్యూ విధించడం లేదన్నారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. -
అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'!
అమలాపురం నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ భగ్గుమంది. జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. జిల్లాకు చెందిన దళిత మంత్రి పినిపె విశ్వరూప్, బీసీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగలబెట్టాయి. పక్కా పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకూ చడీచప్పుడూ లేకుండా... ఒక్కసారిగా వేల మంది యువకులు రోడ్లమీదకు వచ్చి హింసకు తెగబడ్డారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడానికి నిరసనగా శాంతియుతంగా ర్యాలీ చేస్తామని రెండుమూడు రోజులుగా కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి చెబుతూ వస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో మెసేజులు పంపింది. కానీ సోషల్ మీడియాలో మెసేజీలు అందుకున్న వేల మంది యువకులు మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతూ... పెట్రోలు డబ్బాలతో ఆస్తుల్ని తగలబెడుతూ రెచ్చిపోవటంతో ఇదంతా ముందస్తు కుట్ర మేరకే జరిగిందన్న అనుమానాలకు బలం చేకూరింది. అల్లరి మూకలు రాళ్ల దాడులకు దిగటంతో సాక్షాత్తూ జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు ఏకంగా 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి విధిలేక ఒకచోట లాఠీచార్జి చేయటంతో పాటు ఒకదశలో గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.ఆందోళనకారులు అమలాపురంలో దాదాపు ఆరున్నర గంటలపాటు వి«ధ్వంసానికి తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విధ్వంసం... రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగింది. అమలాపురంలో ర్యాలీగా వెళుతున్న ఆందోళనకారులు ర్యాలీగా మొదలై.. విధ్వంసం వరకు.. ‘కోనసీమ జిల్లాకు మరో పేరు పెట్టవద్దు.. ఆ పేరే ముద్దు’ అనే నినాదంతో కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి జేఏసీ అమలాపురంలోని కలశం సెంటర్ నుంచి మంగళవారం మూడు గంటలకు ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం ఇవ్వనున్నట్లు రెండు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు మంగళవారం అమలాపురం సహా ఆ జిల్లాలోని పలు సున్నిత ప్రాంతాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 విధించారు. అమలాపురానికి బయట వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకున్నారు. సరిహద్దుల్లో పికెట్లు ఏర్పాటు చేసి.. సుమారు 450 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా ఉన్నా... దాదాపు 3 గంటలకు పట్టణంలోని సందులు, చిన్న చిన్న వీధుల్లోంచి ఆందోళనకారులు ఒక్కసారిగా అమలాపురం మెయిన్ రోడ్డులోకి దూసుకొచ్చారు. ఆర్టీసీ బస్‌స్టేషన్, గడియారం స్తంభం, హైస్కూలు సెంటర్లు, తదితర ప్రాంతాల నుంచి ఒకేసారి వేల మంది రోడ్లపైకి రావడంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా లెక్క చేయకుండా ఆందోళనకారులు కలెక్టరేట్ సమీపంలోని నల్లవంతెన వద్దకు వచ్చేసరికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి అదుపు తప్పింది. వీరంతా పాతికేళ్ల లోపు యువకులేనని, అంబేడ్కర్ పేరు వద్దని నినాదాలు చేస్తూ చెలరేగిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. బస్సుల ధ్వంసం.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు.. నల్లవంతెన వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, పోలీసు వలయాన్ని ఛేదించుకుని ఆందోళనకారులు వారితో వాదనకు, తోపులాటలకు దిగారు. కలెక్టరేట్ వైపు దూసుకెళ్లారు. ఈ సమయంలో రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. అనంతరం లాఠీఛార్జ్ చేసి పోలీసులు ఆందోళనకారులను కొంతమేరకు చెదరగొట్టారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన రెండు ప్రైవేటు బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అమలాపురంలో ఆందోళనకారుల దాడితో మంటల్లో కాలిపోతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు అంతేకాక కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై ఉన్న ఒక ప్రైవేటు బస్సును తగులబెట్టారు. అనంతరం అమలాపురం ఎర్ర వంతెన సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడికి దిగి నిప్పు పెట్టారు. అల్లరి మూకలు తమ చేతిలోని పెట్రోల్ డబ్బాలను ఇంట్లోకి విసరటంతో ఇంటిలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు బీభత్సంగా వ్యాపించాయి. ఇంటిలో ఉన్న మంత్రి గన్‌మెన్ శ్రీనివాస్, వంట మనిషి ప్రకాష్‌కు గాయాలయ్యాయి. ఈ సమయంలో మంత్రి విశ్వరూప్‌తోపాటు కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేకపోవటంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లి అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యేపై దాడి జరగకుండా ఆ సమయంలో అక్కడున్న ఆయన అనయాయులు అడ్డుకోగలిగారు. ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు మంత్రి పినిపె విశ్వరూప్ నివాసం పెచ్చరిల్లిన విధ్వంసం... ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి నుంచి ఎర్ర వంతెన వద్దకు వెళ్లిన ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పు పెట్టారు. మరో రెండు బస్సులతో పాటు జిల్లా ఎస్పీ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారిపై తీవ్ర స్థాయిలో రాళ్లు రువ్వారు. దీంతో ఎస్పీ సుబ్బారెడ్డి, భీమవరం డీఎస్పీ రవిప్రకాష్, అమలాపురం రూరల్ సీఐ వీరబాబు, రూరల్ ఎస్ఐ పరదేశీతో పాటు 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఎస్పీ సుబ్బారెడ్డి ఎస్పీని కిమ్స్ ఆస్పత్రికి, ఇతర పోలీసులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంత్రి విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇంటిని తగలబెట్టడంతో ఊరుకోని ఆందోళనకారులు ఎర్రవంతెన దిగువన జాతీయ రహదారికి ఆనుకుని మంత్రి నిర్మించుకుంటున్న ఇంటికి కూడా నిప్పంటించారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా వారు మరింత రెచ్చిపోయారు. ఇంతలో కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన అదనపు పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఏలూరు రేంజ్ డీఐజీ పాల్రాజు పర్యవేక్షణలో కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. దీంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు పోలీసు వలయంలో కోనసీమ – వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు – సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో పోలీసు పిక్కెట్లు కోనసీమ అంతటా పోలీసులు మొహరించారు. కోనసీమ కేంద్రం అమలాపురంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ పరిణామాలను రాష్ట్ర డిజిపి తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి కోనసీమ జిల్లాకు పోలీసులను హుటాహుటిన తరలించారు. ఇప్పటికే అక్కడ ఉన్న 450 మంది పోలీసు బలగాలకు అదనంగా సుమారు వెయ్యి మంది పోలీసులను మొహరించారు. కోనసీమలోని అమలాపురం సహా ముఖ్యమైనన కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించడంతో ఆ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణు, అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు కోనసీమ ఎమ్మెల్యేల ఇంటి వద్ద ఎస్సై, కానిస్టేబుళ్లతో ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాగాన్ని సిద్ధం చేశారు. ఏలూరు రేంజి డీఐజీ పాలరాజ్ ఆధ్వర్యంలో కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీలు ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఐశ్వర్య రస్తోగి, అమలాపురంలోని పలు కీలక ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. -
దీపస్తంభాల వెలుగులో...
చీకటి తెరలు కరిగిపోయే వేళ, వెలుగు రేకలు ప్రసారమయ్యే క్రమంలో దృగ్గోచరాలపై ఒక స్పష్టత వస్తుంది. లోకం మీద, దాని నడవడి మీద అవగాహన కుదురుకుంటుంది. భారత రిపబ్లిక్ ‘అనే నేను’ పేరుతో ప్రజాపాలన ప్రారంభమై డెబ్బయ్ రెండేళ్లు గడిచింది. ఈ కాలంలో అధికారం చెలాయించిన నాయకుల చిత్తశుద్ధిలో తరతమ భేదాలున్నాయి. అయినప్పటికీ భారత రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం ప్రభావం ఫలితంగా కొందరు పాలకులు నిండు మనసుతో, మరికొందరు అర్ధమనస్కంగా సామాజిక పరివర్తన క్రమానికి లంగరెత్తక తప్పలేదు. ఫలితంగా ‘నిమ్న’ జాతి పొరల్ని చీల్చుకుంటూ సామాజిక నిచ్చెనమెట్లను ఒక్కొక్కటే ఎక్కుకుంటూ కొందరు అధోజగత్ సహోదరులు ‘సోషల్ డెమోక్రసీ’ అనే అంతస్థుకు చేరుకోగలిగారు. చదువు అనే చేదోడు లభించిన కారణంగా వారికీ అధిరోహణ సాధ్యమైంది. ఇరుగుపొరుగు పరిసరాలు వారికిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిచ్చెన కింది మెట్టు మీద నిలబడి ఉన్నప్పుడు విన్న కాకమ్మ కథల డొల్లతనం ఇప్పుడు వెల్లడవుతున్నది. అద్భుతాలుగా వినిపించిన స్వాములోర్ల ప్రతిమల కంటే, సర్దార్ల విగ్రహాల కంటే సమున్నతమైన శిఖర సమానమైన మూర్తిని మనోనేత్రంతో వాళ్లు చూడగలుగుతున్నారు. ఆ మూర్తి చూపుడువేలు ప్రబోధం వారికిప్పుడు సరైన రీతిలో అర్థమవుతున్నది. ఇన్నాళ్లూ మన నాయకులూ, బోధకులూ చెబుతున్నట్టుగా అంబేడ్కర్ కేవలం దళిత నాయకుడు కాదు. జాతీయ నాయకుడు. నేటి దేశావసరాలకు గాంధీ, నెహ్రూల కంటే అంబేడ్కర్ ఎక్కువగా సరితూగగలడని నిరూపణవుతున్నది. ఆయనను కేవలం రాజ్యాంగ రచయితగానే మన పాఠ్య పుస్తకాలు మనకు పరిచయం చేశాయి. కానీ, ఈనాటి సామాజిక, రాజకీయ సమస్యలను కూడా ఏడెనిమిది దశాబ్దాలకు పూర్వమే దర్శించి భాష్యం చెప్పిన మహోపాధ్యాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన పుట్టిన తేదీ ఏప్రిల్ 14. రోజురోజుకూ ఈ తేదీకి ప్రాధాన్యం పెరుగుతున్నది. భారతీయ సమాజం విద్యాప్రపూర్ణమవుతున్న కొలదీ, వివేకపూరితమవుతున్న కొలదీ ఈ తేదీ మరింత కాంతులీనబోతున్నది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏప్రిల్ 14వ తేదీతో ముడిపడిన మరో ఉత్తేజభరితమైన వృత్తాంతం కూడా ఉన్నది. ఉస్మానియా విద్యార్థి నాయకుడైన జార్జిరెడ్డిని పెత్తందారీ శక్తులు కుట్రపూరితంగా మట్టుపెట్టిన రోజది. అది జరిగి ఇప్పటికి యాభయ్యేళ్లయింది. జార్జిరెడ్డిని గురించి ఆనాటి పరిశీలకుల్లో రెండు రకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. జార్జిరెడ్డి ఇంకొంతకాలం జీవించి ఉంటే, రాజకీయాల జోలికి – గొడవల జోలికీ వెళ్లకుండా ఉండి ఉంటే ఈ దేశానికి ఐన్‌స్టీన్ వంటి ఒక గొప్ప శాస్త్రవేత్త లభించి ఉండేవాడని కొందరు అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో జార్జి గోల్డ్‌మెడలిస్ట్. పరిశోధక విద్యార్థి. జార్జి పరీక్ష పేపర్లు దిద్దడానికి ఉస్మానియా ప్రొఫెసర్లు తటపటాయిస్తే, వాటిని బొంబాయి యూనివర్సిటీకి పంపించారట. జార్జి సమాధానాలు చదివిన అక్కడి ప్రొఫెసర్ ఒక్కసారి ఈ యువ మేధావిని వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న కోరికతో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారట. జార్జిరెడ్డి బతికి వుంటే ఇండియాకు ఇంకో చేగువేరా లభించి ఉండేవాడని మరికొందరు వ్యాఖ్యానిస్తుంటారు. గ్రామీణ పేద రైతు కుటుంబాల నుంచీ, బీసీ, ఎస్సీ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ స్థాయికి అప్పుడప్పుడే చేరుకుంటున్న రోజులవి. పెత్తందారీ, సంపన్న వర్గాల పిల్లల్లో కొందరు గూండా తండాలను వెంటేసుకుని యూనివర్సిటీలో అరాచకం సృష్టిస్తున్న రోజులు. గ్రామీణ విద్యార్థుల్ని ర్యాగింగ్ చేయడం, అవమానించడం, వారిపై దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యంగా మారింది. ఈ దశలో యూనివర్సిటీలో ప్రవేశించిన జార్జి గ్రామీణ విద్యార్థులను సంఘటితం చేసి, వారికి అండగా నిలబడ్డాడు. వారికి తిరగబడడం నేర్పించాడు. జార్జి స్వయంగా బాక్సర్. ధైర్యశాలి. అతని ధాటికి గూండా గ్యాంగ్‌లు హడలిపోయేవి. ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందం’ పేరుతో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో జార్జి విజయబావుటా ఎగరేశాడు. ఈ దశలోనే జార్జిరెడ్డి హత్య జరిగింది. విద్యార్థిలోకంపై ఈ హత్య తీవ్రమైన ప్రభావం చూపింది. అనంతర కాలంలో జార్జిరెడ్డి స్ఫూర్తితో వందలాదిమంది విద్యార్థులు విప్లవకారులుగా తయారయ్యారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత కథ అందరికీ తెలిసిందే. అణచివేతను, అవమానాలను స్వయంగా అనుభవించి కృషితో, సాహసంతో ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన ధీశాలి. భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించే వ్యక్తిగా ఆయన పేరును విస్మరించడానికి వీల్లేని దశకు ఆయన ఎదిగారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని దేశంలో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సామాజిక పరివర్తనకు దోహదపడే బాటలు వేశారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అట్టడుగున పడి దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతికి ఆయన రాజ్యాంగంలో చోటు కల్పించారు. భిన్న భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలతో కూడిన ఈ దేశాన్ని ఒక సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలదొక్కుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది రాజకీయ భావన మాత్రమే కాదు. సామాజిక భావన కూడా! ఆర్థిక భావన కూడా! అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల వెనుకబడిపోయిన విశాల ప్రజానీకం మిగిలిన వారితో పోటీపడగలిగే స్థాయికి చేరుకోవడానికి ప్రత్యేక అవకాశాలు కల్పించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ముఖ్యంగా రాజ్యాంగ పీఠిక ఈ దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అద్దంపడతాయి. పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వేచ్ఛ, అవకాశాల్లోఅందరికీ సమానత్వం, వ్యక్తిగత గౌరవాన్ని జాతి సమగ్రతను సంరక్షిస్తూ అందరి నడుమ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం రాజ్యాంగ లక్ష్యాలుగా పీఠికలో సంకల్పం చెప్పుకున్నారు. ఈ రాజ్యాంగ లక్ష్యాలను ఇప్పటికే సంపూర్ణంగా సాధించి ఉన్నట్లయితే సమాజంలో ఇంత విపరీతమైన వ్యత్యాసాలు ఉండేవి కావు. రాజ్యాంగం నిర్దేశించినట్లు అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించి ఉన్నట్లయితే జార్జిరెడ్డి వంటి యువకులు విప్లవ మార్గం వైపు మొగ్గు చూపేవారు కాదు. అంతరాలు లేని రాజ్యాన్ని సృష్టించాలని ఆ మార్గంలో వెళ్లిన వేలాదిమంది యువకులు ఆత్మబలిదానాలు చేశారే తప్ప గమ్యం మాత్రం ఇంతవరకూ కనుచూపు మేరలోకి రానేలేదు. అదే లక్ష్యసాధన కోసం అంబేడ్కర్ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకోసం దారిచూపే పవిత్ర గ్రంథంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. పాలకుల సహాయ నిరాకరణ వలన రాజ్యాంగ లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరకపోయినా కొంతమేరకైనా సత్ఫలితాలనిస్తున్నాయి. నెమ్మదిగానైనా సామాజిక పరివర్తన జరుగుతున్నది. నాణ్యమైన విద్యను దళిత, గిరిజన వెనుకబడిన వర్గాలకు ఉచితంగా అందజేసి ఉన్నట్లయితే పరివర్తన మరింత వేగంగా జరిగేది. దోపిడీ – పీడనా లేని సమాజాన్ని కాంక్షించేవారెవరైనా సరే, మనిషి మనిషిగా ఆత్మగౌరవంతో బతకగలిగే వ్యవస్థను కోరుకునేవారు ఎవరైనా గానీ, పేదరికం లేని కరువు కాటకాలు లేని రోజులు రావాలని కోరుకునేవారందరూ కూడా, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య కావాలని నినదించేవారందరూ కూడా ఆ దిశలో పడుతున్న ప్రతి అడుగునూ స్వాగతించాలి. ప్రేమించాలి. అభినందించాలి. ఆ అడుగు విప్లవకారులదైనా, ప్రజాస్వామికవాదులదైనా సరే! కేంద్ర ప్రభుత్వాలదైనా, రాష్ట్ర ప్రభుత్వానిదైనా సరే! ఒక్కో ముందడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుందని మరిచిపోరాదు. అంబేడ్కర్ జయంతికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. 70 శాతం మంత్రిపదవులను బలహీనవర్గాలకు కేటాయించారు. ఇన్ని పదవులు ఈ సెక్షన్లకు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇది అభినందించదగిన సందర్భం కాదా? ఐదు ఉపముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకు కేటాయించారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే చర్య కాదా? దేశవ్యాప్తంగా దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్న వారిలో దళితులు, మహిళలే అత్యధికంగా ఉన్నారంటూ దశాబ్దాలుగా జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. ఆ సవాల్‌కు జవాబుగా ఒక దళిత మహిళకే హోంశాఖను అప్పగించడాన్ని మనం స్వాగతించలేమా? ఇలా అప్పగించడం వరుసగా ఇది రెండవసారి కూడా! హోం, రెవెన్యూ, వైద్యం–ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్, పురపాలన, పరిశ్రమలు, రవాణా – ఇలా కీలకమైన శాఖలన్నింటినీ ఈ వర్గాలకే కేటాయించడాన్ని ఇదివరకెప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలోగానీ, వేరే రాష్ట్ర చరిత్రలో గానీ, దేశ చరిత్రలో గానీ చవిచూసి ఉన్నామా? గతంలో యాదవ – కురుబ కులాలకు కలిపి జాయింట్‌గా ఒకటి, గౌడ – శెట్టిబలిజలకు కలిపి జాయింట్‌గా ఒకటి, పొలినాటి వెలమ – కొప్పుల వెలమలకు కలిపి ఒకటి చొప్పున కేటాయించే సంప్రదాయాన్ని వదిలిపెట్టి విడివిడిగా మంత్రి పదవులిచ్చారు. రాయలసీమలో జనాధిక్యం కలిగిన బోయలకూ, ఉత్తరాంధ్రలో అధికంగా వుండే తూర్పు కాపులకూ, సముద్ర తీరం వెంబడి నివసించే మత్స్యకారులకూ మంత్రి పదవులు దక్కాయి. ఎక్కువ మంత్రి పదవులను ఇవ్వడమే కాకుండా కీలక శాఖలను కట్టబెట్టడం సాధికారత సాధనలో ఒక గొప్ప ముందడుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ముందు స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు యాభై శాతం కుర్చీలను కట్టబెట్టింది. మొత్తం స్థానిక సంస్థల పదవుల్లో యాభై శాతాన్ని మహిళలకు రిజర్వు చేసింది. నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం, నామినేటెడ్ పనుల్లో యాభై శాతం ఈ వర్గాలకు కేటాయింపును చట్టబద్ధం చేసింది. ఈ మొత్తంలో కూడా సగం మహిళలకు! ఈ చర్యలు రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణమైనవే కదా! గమ్యాన్ని మరింత దగ్గర చేసేవే కదా! విద్య – వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విప్లవాత్మకమైనవిగా ఇప్పటికే నీతి ఆయోగ్, కేంద్రం, ఇతర రాష్ట్రాలు ప్రశంసించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు గానీ, మీడియా గానీ వీటి గురించి ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. వ్యవసాయ రంగంలో చిన్న కమతాలు లాభదాయకం కాదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తల నుంచి సోషలిస్టు ఆర్థికవేత్తల వరకూ అందరూ అభిప్రాయ పడతారు. దీనికి పరిష్కారంగా కార్పొరేట్ వ్యవసాయాన్ని కొందరు సూచిస్తున్నారు. సమష్టి వ్యవసాయాన్ని మరికొందరు సూచిస్తున్నారు. ఇవేవీ కూడా భారతీయ వ్యవసాయ సంస్కృతికి సరిపడేవి కావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్బీకే సెంటర్లు చిన్న కమతాలకు శ్రీరామరక్షగా నిలబడగలుగు తాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని కూడా స్వాగతించలేమా? రాజ్యాంగం నిర్దేశించిన గమ్యాన్ని ముద్దాడే దిశగా పడే ప్రతి అడుగునూ స్వాగతించడం, అభినందించడమే అభ్యుదయమవుతుంది. వ్యతిరేకించడం అభివృద్ధి నిరోధకమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
స్వేచ్ఛ, సమానత్వమే అంబేడ్కర్ జీవిత సూత్రాలు
సాక్షి, అమరావతి: స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా గుర్తించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. కుల, మత రహిత భారతదేశం కోసం జీవితకాలం పాటు పోరాటం చేశారన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి గవర్నర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేడ్కర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సంఘ సంస్కర్త, రాజకీయవేత్తగా ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. వర్ధమానుడి బోధనలు సదా ఆచరణీయం వర్ధమాన మహావీరుడు ప్రబోధించిన అహింసా మార్గం సదా ఆచరణీయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. గురువారం రాజ్‌భవన్‌లో జరిగిన వర్ధమాన మహావీరుడి జయంతి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జైన్ సమాజ్ ప్రతినిధులు గవర్నర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జైన్ సమాజ్ ప్రతినిధులు మనోజ్ కొఠారి, పబ్నాలాల్, సుక్రజ్, దినేష్, కిశోర్, నరేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ భావాలు అజరామరం
సాక్షి, అమరావతి: భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన భావాలకు మరణం లేదని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం తాడేపల్లిలోని తన నివాసంలో బాబాసాహెబ్ చిత్రపటానికి సీఎం జగన్ ఘనంగా నివాళులర్పించారు. అలాగే రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్లకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పాల్గొన్నారు. జీసస్ మహాత్యాగానికి గుర్తు ‘గుడ్ ఫ్రైడే’ ‘కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ముఖ్య ఘట్టాలు’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ ఏసు ప్రభువు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన సందేశాలని సీఎం తెలిపారు. -
అంబేద్కర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు: మంత్రి కేటీఆర్
-
అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ షర్మిల..
-
అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా సీఎం జగన్ పాలన
-
ఎవరేం తినాలో కూడా బీజేపీనే చెబుతోంది: కేటీఆర్
-
మంత్రి కేటీఆర్ ఇన్స్పిరేషనల్ స్పీచ్
-
అంబేడ్కర్ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘నేడు బాబా సాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాల మీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. నేడు బాబా సాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాలమీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది. pic.twitter.com/OApa1WIQUB — YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2021 ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కె కనకారావు పాల్గొని నివాళులర్పించారు. చదవండి: సాధికారత సాధించని ఒడంబడిక అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీకి -
3 టన్నుల ఇనుముతో 14 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
తెనాలి: తెనాలి శిల్పకారులు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 14 అడుగుల విగ్రహాన్ని ఇనుప వ్యర్థాలతో తయారు చేశారు. సూర్య శిల్పశాల నిర్వహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రలు 3 టన్నుల ఇనుప వ్యర్థాలను ఉపయోగించి, 3 నెలల శ్రమతో అంబేడ్కర్ విగ్రహాన్ని వీరు తీర్చిదిద్దారు. శిల్పశాల ఎదుట ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆదివారం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహంతో ఎమ్మెల్యే శివకుమార్ -
అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీకి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు.. ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి శాసనసభ దాకా పాదయాత్రగా వెళ్లనున్నారు. ఈ సమావేశాల్లో దళితబంధు, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములు, పోడు భూములు, ఎస్టీలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు ప్రస్తావించాలని బీజేపీ నిర్ణయించింది. అలాగే అసరా పింఛన్లు ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను చర్చించాలని భావిస్తోంది. గురువారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో రాజాసింగ్, రఘునందన్‌రావు భేటీ అయ్యారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు సంజయ్ సూచించారు. అధికార పార్టీ నియంతృత్వ ధోరణిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీదేనని చాటాలని సూచించారు. -
సాధికారత సాధించని ఒడంబడిక
ఎన్నికల్లో ఇప్పుడు రిజర్వుడు స్థానాలుగా ప్రతిఫలించిన పూనా ఒడంబడిక జరిగి తొమ్మిది దశాబ్దాలు గడిచింది. స్వాతంత్య్ర పూర్వ భారతదేశంలో అంబేడ్కర్‌కూ, మహాత్మాగాంధీకీ కుదిరిన ఈ ఒడంబడిక గట్టి వాదోపవాదాలకు కేంద్రబిందువైంది. అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్లే ప్రతినిధులుగా ఎన్నిక కావాలని అంబేడ్కర్ వాదించారు. ఇది హిందూ సమాజాన్ని మరింత చీల్చుతుందని గాంధీజీ భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిమధ్యా కుదిరిన, కుదిర్చిన రాజీయే పూనా ఒడంబడిక. ఈ ఒడంబడిక రావడానికి కారణమైన ముందటి, అనంతర పరిణామాలు స్వాతంత్య్ర పోరాటానికి సమాంతరమైన చరిత్ర! ‘‘భారత సామాజిక నిర్మాణం రెండు ముఖ్యమైన భాగాలుగా విభజితమైంది. అందులో ఒకటి వర్ణం, రెండవది అవర్ణం. వర్ణంలో ద్విజులు, ద్విజులు కానివారు ఉంటారు. అవర్ణంలోని వారిని అంటరాని తెగలు, నేరస్థ, ఆదిమ తెగలుగా వర్గీకరించారు. అయితే వర్ణంలోని ద్విజులు, ద్విజులు కానివారి మధ్య విభజన ఉంటుంది. అది పెద్దగా కనిపించని సన్నని పొర. అవర్ణంలోని ఆదిమ తెగలు ఎవరికి వారుగానే జీవిస్తారు. వర్ణంలోని కులాలతో వీరికి అంతగా సంబంధాలుండవు. అయితే వర్ణా నికి బయట అవర్ణులుగా ఉన్న అంటరాని కులాలకు, మిగతా సమా జానికీ మధ్య ఉన్న వైరుధ్యం ఇనుప కంచె లాంటిది. దానిని ఛేదిం చడం అంత సులువు కాదు.’’ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1940కి ముందే చేసిన విశ్లేషణ ఇది. ఆ రోజు అంటరాని కులాలుగా పిలిచిన నేటి షెడ్యూల్డ్ కులాలు, రాజకీయ పరిభాషలో దళితులు ఈ సమా జంలో ఇప్పటికీ భాగం కాలేకపోయారు. భారతదేశంలో ప్రజా ప్రభుత్వాల ఏర్పాటు, ప్రజాప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య స్థాపన అవగాహనల కోసం 1919లో భారత దేశం సందర్శించిన సౌత్‌బరో కమిటీ ముందు ఒక ముప్ఫై యేళ్ళ యువ కుడైన అంబేడ్కర్, అమెరికాలో చదివిన ఉన్నత విద్యావంతుడిగా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. భారతదేశంలో కులాల మధ్య ఉన్న అంతరాలు, ముఖ్యంగా అంటరాని కులాలకూ, ఇతర కులాలకూ మధ్య ఉన్న అసమానతలు ప్రభుత్వాల ఏర్పాటులో ప్రభావం చూప కూడదంటే, అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించా లని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారానే వాళ్ళ ప్రతినిధులుగా ఎన్నిక కావాలని, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగా లని సూచించారు. అంటే సమాజంలోని విద్యావంతులకు, సంపన్ను లకు, భూస్వాములకు, వ్యాపారస్తులకు మాత్రమే ఓటు హక్కు కల్పిం చడం సరిపోదని, కుల, మత, ప్రాంత భేదం లేకుండా ప్రతి వయో జనుడికీ ఓటు హక్కు కల్పించాలని సౌత్ బరో కమిటీ ముందు ప్రతిపాదించాడు ఆ యువకుడు. ఆ తర్వాత సైమన్ కమిషన్ ముందు, 1930–32 మధ్య జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలోనూ ఆయన ఇదే అంశాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రిస్టియన్లకు అమలు జరుగుతున్న ప్రత్యేక ఎన్నిక విధా నాన్ని, అంటే తమ అభ్యర్థులకు తామే ఓట్లు వేసుకునే పద్ధతిని అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్‌గా పిలుస్తోన్న అంటరాని కులాలకు వర్తిం పజేయాలని వాదించారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీజీ హాజరుకాలేదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మొదటి సభలో ఈ విషయంపై చేసిన ప్రతిపాదనను విని బెంబేలెత్తిపోయిన గాం«ధీజీ, రెండో సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీజీ అత్యంత శ్రద్ధపెట్టిన అంశం డిప్రెస్డ్ క్లాసెస్‌కు ప్రత్యేక ఎన్నిక విధానాన్ని వ్యతిరేకించడమే. అంబేడ్కర్, గాం«ధీ మధ్య ఈ విషయమై తీవ్ర వాదోపవాదాలు జరి గాయి. అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారని, హిందువు లలో భాగంగా వారిని ఎన్నడూ చూడలేదని, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారని అంబేడ్కర్ వాదించారు. ఈ కారణంగానే వారికి రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని; వారి ప్రతినిధు లను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలని కుండబద్దలు కొట్టారు. లేదంటే, రాజకీయ స్వేచ్ఛకు బదులు దళితులు తరతరాల బానిసత్వా నికి బలి కావాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అంబేడ్కర్ సూచించి నట్టుగా, అంటరాని కులాలకు ప్రత్యేక ఎన్నిక విధానంలో తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. అందుకు అనుగుణంగా నాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ ఒక ఉత్తర్వును జారీచేశారు. దానిపేరే కమ్యూనల్ అవార్డు. అయితే, గాంధీ దీనిని జీర్ణించుకోలేకపోయారు. 1932, మార్చి 11న బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒక లేఖ రాశారు. ‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ విధానం కల్పించి, వారి అభ్యర్థిత్వాన్ని వారే ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తే, నేను ఆమరణ దీక్షకు పూనుకుం టాను’ అన్నారు. రామ్సే మెక్‌డొనాల్డ్ గాంధీ లేఖకు, ‘‘మీ ఉద్దేశం హిందువులకు, అంటరాని కులాలకు కలిపి ఓటింగ్ ఉండాలని కాదు. హిందువుల మధ్య ఐక్యత సాధించాలని కాదు. అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకోవడమే తప్ప మరొకటి కాదు’’ అని తీవ్రంగా జవాబి వ్వడం గమనించాల్సిన విషయం. రామ్సే మెక్‌డొనాల్డ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దానితో కాంగ్రెస్ పార్టీ, హిందూ సంఘాల నాయకులు అంబేడ్కర్ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. చివరిదాకా అంబేడ్కర్ వాళ్ళ ఆలోచనలకు తలొగ్గలేదు. కానీ, ఒకవేళ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే గ్రామాల్లో అల్పసంఖ్యాకులుగా ఉన్నవారిపై, అగ్రవర్ణాలు దాడులకు తెగబడతారనే భయంతో రామ్సే మెక్‌డొనాల్డ్ ఇచ్చిన ఉత్తర్వులను వదులుకోవాల్సి వచ్చింది. దాని స్థానంలో 1932 సెప్టెంబర్ 24వ తేదీన పూనా ఒడంబడిక జరిగింది. పూనా ఒడంబడిక ద్వారా ప్రత్యేక ఓటింగ్, అంటే తమ అభ్యర్థులను తాము మాత్రమే ఎన్నుకునే విధానానికి బదులుగా, రిజర్వుడు నియోజక వర్గాల విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న రిజర్వుడు స్థానాల ఎన్నికల విధా నంలో కేవలం ఆధిపత్య కులాల, సవర్ణ హిందువుల అంగీకారం ఉన్నవాళ్ళే ఎస్సీ ప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. దళితుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళు, కులసమాజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు ఎస్సీల ప్రతినిధులు కాలేకపోతున్నారు. కారణం మనందరికీ తెలుసు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మెజారిటీగా ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్నాయి. అంతేకాకుండా, ఓటర్లలో నూటికి 70 నుంచి 80 శాతం మంది దళి తులు కానివారే. అందువల్ల కూడా నిజమైన దళిత ప్రజాప్రతి నిధులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నిక కావడం లేదు. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. దీనికి ప్రస్తుతం ఎన్నికవుతున్న ఎస్సీ ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఎన్నికల విధానమే తప్ప వ్యక్తులు కాదు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించినట్టుగా, తమ ప్రతి నిధులను తామే ఎన్నుకునే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే భారత సామాజిక, రాజకీయ రంగంలో మౌలికమైన మార్పులు వచ్చేవి. కానీ ఎస్సీ ప్రతినిధులందరూ ఈ రోజుకు కూడా అసెంబ్లీలోగానీ, పార్లమెంటులో గానీ దళితుల పక్షాన నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు కొంత మంది మాట్లాడుతుంటారు. వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళే అధికార పక్షంలోకి వెళ్తే నోటికి తాళాలు పడిపోతాయి. ఇది ఒక కఠోర వాస్తవం. అయితే దీనికి పరిష్కారమేమిటి అనే సందేహం వస్తుంది. తక్షణమైతే ప్రజా ప్రతినిధులు తమలో తాము అవలోకనం చేసు కోవాలి. కనీసం తక్షణ సమస్యలపైనైనా దళితుల పక్షాన నిలబడ టానికి ప్రయత్నించాలి. అంతిమంగా ఈ ఎన్నికల విధానాన్ని మార్చడానికి మళ్ళీ ఒక రాజకీయ ఉద్యమం జరగాలి. తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే విధానంపైన ఒక చర్చ జరగాలి. ఇందుకుగాను దళితులు రాజకీయ ఉద్యమానికి సన్నద్ధం కావాలి. సమాజంలోని ప్రజాస్వామిక శక్తులు, అసమానతలు తొలగిపోవాలనే వ్యక్తులు, సంస్థలు, దళిత ప్రజాప్రతినిధుల ఎన్నిక విధానంలో మార్పు కోసం కలిసి రావాలి. లేనట్లయితే సామాజిక ఆర్థిక అసమానతలకు తోడుగా రాజకీయ బానిసత్వం ఇంకా పాతుకుపోయే ప్రమాదం ఉంటుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
అంబేడ్కర్‌కు నివాళి అర్పించే తీరిక కేసీఆర్‌కు లేదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంబేడ్కర్, ఇతర మహనీయుల జయంతి, వర్ధంతి కార్య క్రమాలకు సీఎం కేసీఆర్ ఎందుకు హాజరుకావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. దీనిపై సీఎం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లక్ష మందితో ఎన్నికలసభ పెట్టేందుకు సమయం దొరుకుతుంది కానీ అంబేడ్కర్‌కు నివాళి అర్పించే తీరిక దొరకడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్‌కు సంబంధించిన ప్రాంతాలను పంచతీర్థాలుగా కేంద్రం అభివృద్ధి చేస్తోందన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ అంబేడ్కర్ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పే సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నా రు. లోయర్ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్ర హం వద్ద బండి సంజయ్‌తోపాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్, విజయశాంతి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఘనంగా నివాళులు ఆర్పించారు. గాంధీభవన్‌లో... బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతిని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్, ఓబీసీ సెల్‌చైర్మన్ నూతి శ్రీకాంత్, ఎస్సీ సెల్ విభాగం చైర్మన్ ప్రీతమ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ( చదవండి: ఢిల్లీ బస్సు వచ్చింది.. వంద కోట్లు మింగింది! ) -
బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి
-
బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఆదివారం రోజున సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
భారత ఏకీకరణకు అంబేడ్కర్ పునాది
స్వతంత్ర భారత ఏకీకరణ కర్తగా చరిత్రకెక్కిన సర్దార్ పటేల్ కంటే చాలా కాలం క్రితమే అంటే 1931లోనే అంబేడ్కర్.. దేశమంతటా విస్తరించి ఉన్న సంస్థానాలు విలీనం కావడం ద్వారా భారత ఏకీకరణ అనివార్యమని చెప్పి ఉన్నారు. భారత్‌ను వదిలి వెళుతున్నందున దేశంపై తన సార్వభౌమాధికారం ఇక చెల్లదని, తమ తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో సంస్థానాలు చేరవచ్చు లేక స్వతంత్రంగా ఉండవచ్చు అంటూ 1946వో బ్రిటిష్ కేబినెట్ మిషన్ చేసిన ప్రకటన డొల్లతనాన్ని న్యాయకోవిదుడిగా అంబేడ్కర్ విప్పి చెప్పారు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వానికి అంతకు ముందటి ప్రభుత్వం చలాయించిన కొన్ని హక్కులు వారసత్వంగా సంక్రమిస్తాయంటూ వారసత్వానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టం చెబుతోందని అంబేడ్కర్ పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విదేశీ ప్రభుత్వాలుగా సంస్థానాల ఉనికిని భారత్ గుర్తించదని అంబేడ్కర్ తేల్చిచెప్పారు. సంపూర్ణ ఏకీకరణ పూర్తి చేసుకున్న స్థిరమైన జాతిగా భారత్‌ను ముందుకు నడిపించారు. వైవిధ్యపూరితమైన భారతదేశం కోసం హక్కుల ప్రాతిపదికన రాజ్యాంగ రూపకర్తగా సుపరిచితులైన బీఆర్ అంబేడ్కర్ భారత ఏకీకరణలో కూడా అద్వితీయ పాత్ర నిర్వహిం చారు. భారత్ తొలి హోంమంత్రిగా, స్వతంత్ర భారత్‌ని ఏకీకరణ చేసిన వాడిగా కీర్తిపొందిన సర్దార్ పటేల్ కంటే చాలా కాలం క్రితమే అంటే 1931లోనే అంబేడ్కర్.. చెల్లాచెదురుగా విస్తరించి ఉన్న సంస్థానాలు భారత్‌లో విలీనమైపోవడం ద్వారా భారత్ ఏకీకరణ అనివార్యమని చెప్పి ఉన్నారు. భారత యూనియన్‌లో చేరబోమని, కొత్తగా ఏర్పడిన ఐక్యరాజ్య సమితికి అప్పీల్ చేస్తామన్న హైదరాబాద్ నిజాం, ట్రావెన్కోర్ సంస్థానాల తలంపును 1947 జూన్‌లో న్యాయపరంగానే చెల్లకుండా చేసిన ఘనత కూడా అంబేడ్కర్‌దే. భారత ప్రభుత్వం 1935 చట్టం నిర్దేశకత్వంలో నిర్వహించిన మూడు రౌండ్ టేబుల్ సదస్సులకూ హాజరైన అతికొద్దిమంది వ్యక్తుల్లో అంబేడ్కర్ ఒకరు. గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. 1930లలో లండన్‌లో జరిగిన ఈ సదస్సులలో దురదృష్టవశాత్తూ సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూలకు ప్రతినిధులుగా పాత్ర లేకపోయింది. వారు హాజరై ఉంటే లండన్ సదస్సుల్లో అంబేడ్కర్ న్యాయ సూక్ష్మత, పటిమను వారు ప్రత్యక్షం గా చూడగలిగేవారు. సంస్థానాల ఉనికిని తోసిపుచ్చిన అంబేడ్కర్ ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో భాగంగానే ఫెడరల్/స్ట్రక్చర్ కమిటీలో చాంబర్ ఆప్ ప్రిన్సెస్‌కు ప్రాతినిధ్యం వహించిన బికనీర్ మహారాజుతో 1931 సెప్టెంబర్ 16న అంబేడ్కర్ ఘర్షించారు. 1935 తర్వాత బ్రిటిష్ ఇండియా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోసం సంస్థానాధిపతులు చేసిన ప్రయత్నాన్ని అంబేడ్కర్ ఈ సమావేశంలోనే తోసిపుచ్చారు. బ్రిటిష్ ఇండియాలో ఒక జిల్లా సగటున నాలుగు వేల చదరపు మైళ్ల విస్తీర్ణం, 8 లక్షల జనాభాతో కూడి ఉండగా, దేశంలోని 562 సంస్థానాల్లో 454 సంస్థానాలు వెయ్యికంటే తక్కువ చదరపు మైళ్ల విస్తీర్ణం, లక్షకంటే తక్కువ జనాభాను మాత్రమే కలిగి ఉన్నాయని, వీటిలో 374 సంస్థానాలు లక్షరూపాయలకంటే తక్కువ వార్షికాదాయాన్ని కలిగి ఉన్నాయని అంబేడ్కర్ పేర్కొన్నారు. వీటిలో కొన్ని సంస్థానాలు ఎంత చిన్నవంటే వాటికి దక్కిన గౌరవం పట్ల ఎవరూ కనీస సానుభూతి కూడా చూపేవారు కాదు. 15 సంస్థానాలయితే ఒక చదరపు మైలు కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండేవి. 27 సంస్థానాలు సరిగ్గా చదరపు మైలు విస్తీర్ణంలో ఉండేవి. 14 సంస్థానాలు ఒక్క సూరత్ జిల్లాలోనే ఉండేవి. వీటి వార్షికాదాయం సంవత్సరానికి 3 వేల రూపాయలకు పైబడి ఉండేది. వీటిలో మూడు రాష్ట్రాల్లో ఒక్కో దాని జనాభా నూరుకంటే తక్కువే. అయిదు సంస్థానాలకైతే వార్షికాదాయం వంద రూపాయలలోపే ఉండేదని అంబేడ్కర్ వివరించారు. సంస్థానాన్ని ప్రత్యేకంగా, స్వతంత్రంగా ఉంచడం ద్వారా ఆ సంస్థానాధిపతిని రాజాధిరాజుగా సంబోధిస్తూ నిత్యం సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగమూ లేదని అంబేడ్కర్ ఆ సమావేశంలో తేల్చి చెప్పారు. సంస్థానాల పరిస్థితి ఇలా ఉండగా, స్వావలంబన లేకుండా, కుహనా దర్పంతో, గర్వంతో జీవిస్తున్న ఇలాంటి సంస్థానాధిపతులకు భారత యూనియన్‌లో చేరడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కానీ రెండే రెండు సంస్థానాలు మాత్రం 1947 ఆగస్టు 17న స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. తాను భారత్‌ను వదిలి వెళుతున్నందున సార్వభౌమాధికారం అనేది ఇక చెల్లదని, తమ తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో సంస్థానాలు చేరవచ్చు లేక స్వతంత్రంగా ఉండవచ్చు అంటూ 1946లో బ్రిటిష్ కేబినెట్ మిషన్ చేసిన ప్రకటనతో ఈ గందరగోళం ఏర్పడింది. ఇదే విషయాన్ని 1947 జూన్ 3న మౌంట్‌బాటన్ మళ్లీ చెప్పారు. సార్వభౌమాధికారంపై న్యాయపరమైన స్పష్టత బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. 1947 జూన్ 17న ఒక ప్రకటన చేస్తూ సంస్థానాలకు స్వాతంత్య్రాన్ని అనుమతించిన బ్రిటిష్ పాలకులపై అంబేడ్కర్ విరుచుకుపడ్డారు. అంబేడ్కర్ ప్రకటన నాటి పత్రికల్లో విస్తృతంగా ప్రచురితమైంది. సార్వభౌమాధికార సిద్ధాంతం ద్వారానే బ్రిటిష్ పాలకులు స్థానిక రాజ్యాలను నియంత్రించేవారు. సంస్థానాలపై సార్వభౌమాధికారం చలామణి అవుతూ వచ్చేది. అంబేడ్కర్ దీనిపైనే వాదిస్తూ, 1947 జూన్ 17 నాటికి భారత ప్రభుత్వం బ్రిటిష్ అధినివేశ ప్రతిపత్తికిందే ఉంటూ వస్తోందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, ఐర్లండ్ దేశాల్లాగే 1950 జనవరి 26 వరకు భారతదేశం బ్రిటిష్ వారి అధినివేశ ప్రతిపత్తి కిందే ఉండేది. భారత ప్రభుత్వం (నెహ్రూ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం) స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నందున దానికి స్థిరమైన విశేష అధికారంతో చక్రవర్తికి సూచించగల ప్రత్యేక హక్కు ఉందని, ఆ సూచనను బ్రిటిష్ చక్రవర్తి తిరస్కరించలేరని అంబేడ్కర్ రాజ్యాంగ చట్టాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సార్వభౌమాధికారాన్ని వదులుకుంటూ బ్రిటిష్ ప్రభుత్వం సంస్థానాలకు స్వాతంత్య్రాన్ని మంజూరు చేయడం పట్ల అంబేడ్కర్ తప్పు పట్టారు. చక్రవర్తి తన ప్రత్యేకాధికార హక్కులను వదులుకోవడం లేక మరొకరికి అప్పగించడం చేయలేరని, చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని మరొకరికి (భారత ప్రభుత్వానికి) అప్పగించలేనట్లయితే, దాన్ని చక్రవర్తి వదులుకోలేరని కూడా అంబేడ్కర్ వాదించారు. ఈ ప్రాతిపదికన కేబినెట్ మిషన్, మౌంట్ బాటన్ ప్రకటనలు రద్దు చేయదగినవని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వానికి అంతకు ముందటి ప్రభుత్వం చలాయించిన కొన్ని హక్కులు వారసత్వంగా సంక్రమిస్తాయని వారసత్వానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టం చెబుతోందని అంబేడ్కర్ పేర్కొన్నారు. సార్వభౌమాధికారం నుంచి భారతీయ సంస్థానాలు తమను తాము విముక్తి చెందించుకోగల ఏకైక మార్గం ఏదంటే, సౌర్వభౌమాధికారాన్ని, రాజ్యాధికారాన్ని విలీనం చేయడమేనని అంబేడ్కర్ స్పష్టం చేశారు. స్వతంత్ర భారతదేశం సంస్థానాల స్వతంత్రతను గుర్తించదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విదేశీ ప్రభుత్వాలుగా వాటి ఉనికిని భారత్ గుర్తించదని అంబేడ్కర్ హెచ్చరించారు. సంస్థానాల వక్రమార్గంపై అంబేడ్కర్ తీవ్ర హెచ్చరిక ఐక్యరాజ్యసమితి గుర్తింపును, రక్షణను పొందుతామని సంస్థానాలు ఆశించడం అంటే పిచ్చివాళ్ల స్వర్గంలో నివసించినట్లే కాగలదని అంబేడ్కర్ హెచ్చరించారు. సంస్థానాలపై తన అధికారాన్ని భారత్ చాటుకోవడాన్ని పక్కనపెట్టి ఐక్యరాజ్యసమితి సంస్థానాలను గుర్తిస్తుందా అని అంబేడ్కర్ సందేహం వ్యక్తపరిచారు. తమ పరిధిలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పర్చకుంటే విదేశీ దాడి నుంచి లేక అంతర్గత తిరుగుబాటు నుంచి భారతీయ సంస్థాన ప్రభుత్వాలకు ఐక్యరాజ్యసమితి ఎన్నటికీ సహకారం అందించదని, కాబట్టి వక్రమార్గం పడుతున్న భారతీయ సంస్థానాలు.. ఐక్యరాజ్యసమతి జోక్యం చేసుకుంటుదని ఆశలు పెట్టుకోలేవని అంబేడ్కర్ స్పష్టం చేశారు. సంస్థానాలకు మినహాయింపునిస్తూ 1946లో కేబినెట్ మిషన్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మౌనం పాటించిన సమయంలో అంబేడ్కర్ అందించిన న్యాయపరమైన స్పష్టత సంస్థానాలకు తలుపులు మూసివేసి భారత సంపూర్ణ ఏకీకరణకు దారి కల్పించింది. ఈ క్రమంలోనే ఊగిసలాటకు గురవుతూ వచ్చిన ట్రావెన్కోర్, జోధ్‌పూర్, బికనీర్, జైసల్మీర్, రాంపూర్, భోపాల్ సంస్థానాలు భారత్‌లో విలీనం కాగా, జునాగఢ్ సంస్థానం మాత్రం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లింది. 1947 జూన్ 17న తాను ప్రకటన చేసిన కొన్ని వారాల తర్వాత అంబేడ్కర్ భారత న్యాయశాఖ మంత్రిగా నెహ్రూ ప్రభుత్వంలో చేరడమే కాకుండా సంపూర్ణ ఏకీకరణ పూర్తి చేసుకున్న స్థిరమైన జాతిగా భారత్‌ను ముందుకు నడిపించారు. హైదరాబాద్ ఏకీకరణ ఆపరేషన్ని పోలీస్ యాక్షన్ అని పిలవాలని, దాన్ని భారత సైనిక చర్యగా పిలవవద్దని నెహ్రూకు సలహా ఇచ్చిన ఘనత కూడా అంబేడ్కర్‌కే దక్కుతుంది. తన రాజ్యాంగ పదవి ఆధారంగా, హైదరాబాద్‌ని భారత్‌లో విలీనం చేయడం ప్రభుత్వాధికారానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమని గుర్తించబట్టే అంబేడ్కర్ హైదరాబాద్ విలీన చర్యను పోలీస్ యాక్షన్‌గానే పేర్కొన్నారు. వ్యాసకర్త: రాజశేఖర్ ఉండ్రు ,సీనియర్ ఐఏఎస్ అధికారి, రచయిత -
ఈ నిశ్శబ్దానికి పునాది పూనా ఒడంబడిక
‘‘మీకు రాజకీయ అధికారాలను అందించడానికి ఎంతో ప్రయాసపడ్డాను. పార్లమెంటులోనూ, శాసనసభల్లోనూ మీకు సీట్లు రిజర్వు చేయించడానికి ముప్పై సంవత్సరాలు రాత్రీ, పగలూ శ్రమించాను. ఎవరైనా మిమ్మల్ని తమ రాజభవనంలోకి ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్ళండి. కానీ, మీరు నివసించే చిన్న ఇల్లును తగులబెట్టుకొని మాత్రం అక్కడకు వెళ్ళకండి. కొన్ని రోజుల తర్వాత ఏదో రోజు మీకు మీమీద కోపం కలిగితే, మిమ్మల్ని గెంటివేస్తే ఎక్కడికి వెళతారు. మీరు అమ్ముడుపోవాలనుకుంటే అమ్ముడుపోండి. కానీ మీ సొంత బలాన్ని ధ్వంసం చేసుకొని మాత్రం వెళ్ళవద్దు’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1956 మార్చి 18న ఆగ్రాలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో చేసిన ఉపన్యాసంలోని కొంత భాగం ఇది. రిజర్వేషన్ల ద్వారా పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధుల పనితీరును చూసి బాబాసాహెబ్ అన్న మాటలివి. మరోచోట, ‘‘మా ప్రజాప్రతి నిధులు ఆవులింత వస్తే తప్ప నోరు తెరవరు’’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని శాసనసభల్లో 578 మంది ఎస్సీ సభ్యులు, 526 మంది ఎస్టీ శాసనసభ్యులు ఉన్నారు. పార్లమెంటులోని లోక్‌సభలో ఎస్సీ ప్రతినిధులు 84 మంది, ఎస్టీలు 47 మంది ఉన్నారు. లోక్‌సభలో ఇది దాదాపు నాల్గోవంతు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కాంక్షించినట్లు వీరంతా ఐక్యంగా నిలబడి, ప్రజల పక్షం వహిస్తే, ప్రభుత్వాలు తల్లకిందులవుతాయి. 1956 నాడే కాదు, నేటికీ ఎస్సీ, ఎస్టీల ప్రజాప్రతినిధులు తమ స్వీయచిత్తంతో పనిచేస్తోన్న దాఖలాలు లేవు. అంబేడ్కర్ ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి కారణమేమిటి? ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు అసమర్థులా? వేరే ఏదైనా కారణాలున్నాయా? ఎన్నో తిరస్కారాల నడుమ, మరెన్నో కుయుక్తులను ఎదుర్కొంటూ బాబాసాహెబ్ చేసిన యుద్ధ ఫలితమే ఈ రాజకీయ రిజర్వేషన్లు. 1919 నుంచి అంటరాని కులాలకు ఎన్నికల్లో ఓటింగ్ హక్కు కల్పించాలని, అప్పుడే వారికి పాలనలో భాగస్వామ్యం లభిస్తుందని, అందుకోసం సుదీర్ఘం పోరాటం చేశారు. మొదటిసారిగా 1919లో సౌత్‌బరో కమిటీ ఎదుట తన వాదనలను వినిపించారు. ‘‘అంటరాని కులాలకు స్వయం నిర్ణయాధికారం కావాలి. మా సమస్యలపైన దళితేతరులు కాకుండా, దళితులే మాట్లాడాలి అనే ప్రజాస్వామ్య సూత్రం అమలు జరగాలి. అగ్రవర్ణాల దయాదాక్షిణ్యాలకు దళితులను వదిలేయొద్దు’’అంటూ ప్రజాస్వామ్య భావనలోని సారాంశాన్ని బయట పెట్టారు. 1927లో భారత దేశానికి వచ్చిన సైమన్ కమిషన్ ముందు, ప్రాతినిధ్యం లేని వర్గాలు ప్రజాస్వామ్య దేశంలో పౌరులుగా ఉండలేరని తేల్చి చెప్పారు. 1930–32ల మధ్య జరిగిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. లండన్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంటరాని కులాలు హిందూ సమాజంలో భాగం కాదని, ముస్లింలు, క్రైస్తవులు, ఆంగ్లోఇండియన్స్, సిక్కులు మతపరమైన మైనారిటీలైనట్టే, నిమ్న వర్గాలు సామాజికంగా మైనారిటీలని, వీరికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రైస్తవులకు ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాలేదు. రెండో సమావేశానికి మహాత్మాగాంధీ హాజరయ్యారు. అంబేడ్కర్ వాదనను గాంధీ వ్యతిరేకించారు. దళితులను హిందూ సమాజం నుంచి వేరు చేసి చూస్తే సహించలేనని అభ్యంతరం తెలిపారు. అయితే అంబేడ్కర్ వాదనను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి కమ్యూనల్ అవార్డు పేరుతో ప్రత్యేక ఎన్నికల విధానంతో కూడిన ప్రత్యేక నియోజక వర్గాలను అంగీకరిస్తున్నట్టు ప్రకటించింది. గాంధీ నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. దీనితో కాంగ్రెస్‌తోపాటు, హిందూ సంఘాలు, మహాత్మాగాంధీ ప్రాణాలు కాపాడమని అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఒక్క గాంధీ కోసం తన జాతి భవిష్యత్తును ఫణంగా పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ గాంధీకి ఏదైనా జరగరానిది జరిగితే, దీన్ని సాకుగా చూపెట్టి తన ప్రజలపై, హిందూ అగ్రకులాలు దాడులు చేసి, మారణహోమం సృష్టిస్తాయని ఆందోళన చెంది, గాంధీతో రాజీకి అంగీకరించారు. దానిపేరే పూనా ఒడంబడిక. సరిగ్గా ఇదే రోజున అంటే 1932 సెప్టెంబర్ 24న బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఛాటింగ్‌లో అంటే తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి స్వస్తి చెప్పి, సమాజంలోని అందరి ఓట్లతో జరిగే ఉమ్మడి ఎన్నిక విధానానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే 1937, 1946లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన అనుభవంతో అంటే సమాజంలోని అన్ని కులాల ఓట్లతో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌కు బాసటగా ఉన్నారని, దీనివల్ల ప్రయోజనం లేదని, మళ్ళీ ప్రత్యేక ఓటింగ్ విధానం (సపరేట్ ఎలక్టోరల్) కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. ‘రాష్ట్రాలు–మైనారిటీలు’ అనే పేరుతో రా>జ్యాంగ సభకు సమర్పించిన నివేదికలో ప్రధానమైన అంశం ఈ సపరేట్ ఎలక్టోరేట్ విధానమే. రాజ్యాంగ సభ అంబేడ్కర్ ప్రతిపాదనను అంగీకరించలేదు. రిజర్వేషన్ల విధానాన్నే రద్దు చేయాలని చూశారు. ఇందులో ప్రధాన సూత్రధారి సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే అంబేడ్కర్ కూడా అదే స్థాయిలో సర్దార్ పటేల్‌ను ప్రతిఘటించారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అంగీకరించకపోతే, తాను రాజ్యాంగ రచనా సంఘానికి రాజీ నామా చేస్తానని, రాజ్యసభలో తాను కొనసాగలేనని కరాఖండీగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చింది. అంటే 1919 నుంచి, 1949 నవంబర్ 25 వరకు అంబేడ్కర్ సాగించిన పోరాట ఫలితమే ఇప్పుడు అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్లు. అయితే అంబేడ్కర్ ఆశించిన రాజకీయ రిజర్వేషన్లు రాలేదు. పూనా ఒడంబడిక ప్రభావమే నేటికీ ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధుల మీద ఉందన్నది వాస్తవం. ఎస్సీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి నూటికి 60 నుంచి 80 శాతం వరకు దళితేతరుల ఓట్లు కావాల్సి ఉంటుంది. ఒకవేళ 1932లో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నియోజక వర్గాల పద్ధతి అమలు జరిగితే, ఈరోజు దళిత ప్రజల స్థితిగతులు వేరే విధంగా ఉండేవి. పూనా ఒడంబడిక కుట్రను, ఐఏఎస్ అధికారి, దళిత మేధావి డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు తాను రాసిన ‘అంబేడ్కర్, గాంధీ, పటేల్’ పుస్తకంలో అద్భుతంగా అక్షరీకరించారు. సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి తెలుగులోకి అనువదించిన ఈ చారిత్రక నేపథ్యాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నది రెండే మార్గాలు. కమ్యూనల్ అవార్డులో లాగా ప్రత్యేక నియోజకవర్గాల సాధనకు ఉద్యమించడం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయడానికి కావాల్సిన మార్గాలను అన్వేషించడం. పూనా ఒడంబడిక వల్ల నష్టపోయిన నేటి దళిత జాతి తమ భవిష్యత్ కోసమే కాదు, దళిత జాతి జాగృతి కోసం పోరాడాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
అంబేడ్కర్‌కు సముచిత గౌరవం
సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని కలిగించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల నిలువెత్తు విగ్రహ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చారిత్రక ఘట్టానికి విజయవాడలోని స్వరాజ్ మైదాన్ వేదిక కానుంది. విగ్రహ ఏర్పాటుతో పాటు పార్కు తదితర నిర్మాణ పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ పార్క్‌కు వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా శంకుస్థాపన చేసి మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ► విజయవాడ నగరం నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేస్తే అంబేడ్కర్‌కు తగిన గౌరవం ఇచ్చినట్టు అవుతుందని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్గా నామకరణం ► నీటిపారుదల శాఖకు చెందిన 20.22 ఎకరాల విస్తీర్ణంలో పీడబ్ల్యూడీ మైదానం ఉంది. ► విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 1997లో దీని పేరు ‘స్వరాజ్ మైదాన్’గా మార్చింది. ► ఇప్పుడు ఈ మైదానానికే ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్’గా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామకరణం చేసింది. ► ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విగ్రహ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఏపీఐఐసీకి అప్పగించింది. ► 20 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మారక మందిరంతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే విగ్రహం చుట్టూ ఆహ్లాదకరమైన (పార్కు), ఓపెన్ ఎయిర్ థియేటర్‌తోపాటు వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. -
రాత్రిపూట అంబేడ్కర్ నివాసంపై దాడి
సాక్షి, ముంబై: రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గృహంలో గుర్తు తెలియన దుండగులు ప్రవేశించి దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ముంబైలోని అంబేడ్కర్ గృహం రాజ్‌గృహలో మంగళవారి రాత్రి గుర్తు తెలియని దుండగులు లోనికి చొరబడ్డారు. చెట్ల కుండీలను పగలగొడుతూ, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేస్తూ తోట, వరండాలో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దర్యాప్తుకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు నేడు (బుధవారం) నిరసన చేపట్టనున్నారు. అంబేడ్కర్ వారసులు ప్రకాశ్ అంబేడ్కర్, భీమ్రావ్ అంబేడ్కర్ ఈ దాడి గురించి స్పందిస్తూ ప్రజలు సహనం పాటించాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారని ఎవరూ రాజ్‌గృహ దగ్గర గుమిగూడవద్దని విజ్ఞప్తి చేశారు. (అంబేడ్కర్ పత్రికకు వందేళ్లు) చదవండి: కుల నిర్మూలనతోనే భవిష్యత్తు -
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్)లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈనెల 8న సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విగ్రహం శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సోమవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ శంకుస్థాపనలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, మెమోరియల్ హాలు, మెమోరియల్ లైబ్రరీ, స్టడీ సెంటర్, ల్యాండ్ స్కేపింగ్, గార్డెన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జాయింట్ కలెక్టర్ డా. కె.మాధవీలత, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, జేసీ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్‌కి ఆంధ్రలో ‘పరీక్ష’?!
‘‘మన భారతీయ సమాజం కుల వ్యవస్థలో కూరుకుపోయింది. అందువల్లనే ప్రతీ సమస్యను కుల ప్రాతిపదిక దృష్ట్యా అల్లుకుంటూ వచ్చారు. మీరు భారతీయ సమాజంలోకి అడుగుపెట్టండి – దాదాపు అన్ని స్థాయిల్లోనూ ఈ కులాల జాడ్యం మీకు కొట్టొచ్చినట్టు ఎదురవుతుంది.హోటళ్ళలో, పరిశ్రమల్లో, వ్యాపారంలో, ఎన్నికల్లో , దానధర్మాలలో ఒకచోటేమిటి, సర్వత్రా కులం ఎదురవుతూనే ఉంటుంది! ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఉదార స్వభావంలో, దానధర్మాలలో అన్నింటా ఈ కులం ఎదురవుతూనే ఉంటుంది. ఒక పార్శీ మరణిస్తే అతని డబ్బు పార్శీలకు మాత్రమే,ఒక జైనుడు చనిపోతే అతని ఆస్తి జైనులకు మాత్రమే, ఒక మార్వాడీ గతిస్తే అతని ఆస్తి మార్వాడీలకే, భారత చాతుర్వర్ణ్య వ్యవస్థలో ఒక అగ్రకులస్తుడు మరణిస్తే ఆ అగ్రకులం వాడికే అన్నీ సంక్రమించాలి. కాని అణగారిన పేద వర్గాలకు,కులం పేరిట వెలివేతలకు గురైన అసంఖ్యాక వర్గాలకు రాజకీయాల్లో, పరిశ్రమల్లో, వర్తక వాణిజ్యాలలో, విద్యలో ఉద్యోగ సద్యోగాల్లో చోటు ఉండదు’’–డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, 20–05–1956(‘‘వాయిస్ ఆఫ్ అమెరికా ఇంటర్వ్యూ’’) వందల సంవత్సరాలుగా సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థ కుళ్ళు.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్ళు గడిచిపోయినా ఈ నాటికీ వదలకుండా పట్టి పీడిస్తూనే ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ‘‘గ్రామ స్వరాజ్యం’’ పేరిట తలపెట్టిన ‘‘నవరత్నాల’’లో భాగంగా అమలులోకి వచ్చిన పరిమిత ప్రజాతంత్ర సంస్కరణలను కూడా కులాలతో కూడిన వర్గ–వర్ణ వ్యవస్థ సహించలేకపోతుంది. దాని పర్యవసానమే ప్రస్తుతం రాష్ట్రాలలో జడలు విప్పుకుని తిరుగుతున్న కుల–వర్గ వ్యవస్థ! ఆబోతుల మధ్య కుమ్ములాటలో లేగదూడలు ఇరుక్కునిపోతే వాటి మనుగడ ఏమవుతుందో నేడు దేశంలో వివిధ దశల్లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. దేశంలో రాబోయే రోజుల్లో కుల వ్యవస్థపై ఆధారపడి, సమసమాజ వ్యవస్థా నిర్మాణ ప్రయత్నాలను ఎలా దేశ పాలకులు తుత్తునియలు చేయబోతున్నారో కూడా స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, ప్రధాని నెహ్రూ క్యాబినేట్ నుంచి తప్పుకుంటూ పార్లమెంటులో (1956)లో చేసిన ఆఖరి ప్రసంగంలో హెచ్చరించారు. ఆనాడు దేశ స్వాతంత్ర ప్రకటనకు ఎంతో సంతోషించి, కళ్ళలో ఆనంద బాష్పాలు వెల్లివిరుస్తున్న సమయంలో మహాకవి జాషువా ‘‘కులముల కొమ్ముల తోడ కుమ్ముకుని చిక్కుల్ సృష్టించు, పెద్దల కాలాలు ఇక గతించిపోయినట్టే’’ నన్న అల్ప సంతోషాన్ని కూడా పది కాలాల పాటు నిలబడనివ్వకుండా మన పాలకులు చేస్తారని ఆశించలేదు! అంబేద్కర్ జోస్యానికి ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న కనీస ప్రజాసంస్కరణలను కూడా సహించలేక పోవడానికి కారణం బహుశా భారత సెక్యులర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ జనాభాలో అసంఖ్యాక అట్టడుగు వర్గాలుగా నమోదై ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, బి.సి, మైనారిటీ వర్గాలకు జిల్లా, మండల,గ్రామ స్థాయి నుంచి మంత్రి వర్గ స్థాయితో గ్రామ సచివాలయ స్థాయి వరకూ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి బీజాలు నాటిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే కావటం! పరాయి సామ్రాజ్య వాద పాలనను పారదోలడంలో అసంఖ్యాక త్యాగాలు చేసిన భారత ప్రజలలో మెట్టు. భాగంగా ఉండి స్వాతంత్య్రానంతర భారతంలో పేద వర్గాలందరి తరపున గళం విప్పి ‘‘స్వతంత్ర భారతంలో మా మెట్టు వాటా మాకు దక్కి తీరవలసిందే’’నని రాజ్యాంగం సాక్షిగా ఎలుగెత్తి చాటిన వారిలో జాషువా ఒకరు.! చివరికి వెనకటి తరాల నాటి భాగవత పోతన్న సహితం ‘‘కులాన్ని గోదావరిలో కలిపేయమన్నవాడే! ఆ మాటకొస్తే భారతదేశంలో కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రాల వరకూ ఉన్న న్యాయవ్యవస్థలలో కూడా బడుగు బలహీన అసంఖ్యాక బహుజన వర్గాల గొంతుకను సహేతుకంగా వినిపించగల న్యాయవాదుల సంఖ్య కూడా వారి దామాషాన అతి స్వల్పంగానే ఉందన్న నగ్న సత్యాన్ని ఎవరూ దాచలేరు! ఈ వాస్తవాన్ని కూడా అంబేద్కర్ మరో రూపంలో బహిర్గతం చేశారు. ‘‘భారత దేశంలో స్వేచ్చాయుతమైన, వివక్షా రహితమైన ఎన్నికలంటే అర్ధం ఏమిటీ? అని ప్రశ్నించమని ఇక్కడొక పచ్చి సత్యాన్ని మాత్రం మర్చిపోరాదు. మన దేశ రాజకీయ జీవితంలో బడా బడా వ్యాపార వర్గాలు గణనీయమైన పెద్ద పాత్ర వహించడానికి ప్రయత్నిస్తున్నామని మరవరాదు. ఈ బడా వ్యాపారవేత్త వర్గాల తరపున దేశ పాలక రాజకీయ పక్షాలకు ముట్టజెప్పే ధన సంచులే అసలు సిసలు ప్రమాదం! అని నెహ్రూ మంత్రివర్గం నుంచి, తొలి భారత పార్లమెంటు నుంచి వైదొలుగుతూ వచ్చిన ప్రసంగంలోనే (1956) అంబేద్కర్ కుండ బద్దలు కొట్టేశారు! ఈ వర్గాలే తమ ధన సంచులతో తాము ఆర్థికంగా ఆదుకున్న పార్టీ.. పార్టీలు అధికారంలోకి వచ్చినపుడు తమకు అనుకూలమైన రాయితీలను ఆ పార్టీల నుంచి పొందడం సాధ్యమని ఆశించడం, ప్రయత్నించడం సహజమన్నాడు అంబేడ్కర్. అధికారంలో ఉన్న పార్టీ ద్వారా లెజిస్లేచర్ ద్వారా తమ వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా బిల్లులను రూపొందించడంలో, చట్టాలను సవరింపజేయడంలో తమ పలుకుబడిని వినియోగించడం వీరికి అనివార్యమవుతుందని వెల్లడించారు. (అదే ప్రసంగం – 1956). నేటికి 64 ఏళ్ళ నాడే రానున్న రోజుల్లో భారత పాలక వర్గాలను భారత యుద్ధంలో కౌరవ పక్షపాతి అయిన భీష్ముడితో పోల్చుతూ ఒక సాదృశ్యాన్ని అంబేడ్కర్ ఉదాహరించాడు. పాండవులకు, కౌరవులకూ మధ్య సాగిన ఈ యుద్ధంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు కౌరవుల పక్షం వహించారు. కాని ధర్మం పాండవులది కాగా అధర్మ ప్రవర్తన కౌరవులది. ఈ సత్యాన్ని కౌరవ పక్షపాతి భీష్ముడే స్వయంగా అంగీకరిస్తాడు. అయితే మరి పాండవులదే ధర్మప్రవర్తన అయినప్పుడు కౌరవుల పక్షాన ఎందుకు నిలబడ్డావని భీష్ముణ్ణి ఎవరో ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం సమర్థనీయమూ కాదు, క్షమించదగినదీ కాదని అంబేడ్కర్ భావించాడు. ఏమిటా వయస్సు మళ్లిన మరవరాని భీష్మన్న సమాధానం? ‘‘నేను కౌరవుల ఉప్పు తింటున్నాను. కనుక వాళ్లకు విధేయుడనై ఉండాల్సివస్తుంది గదా, వాళ్లు తప్పుడుగా వ్యవహరించినప్పటికీ కూడా’’ అని! ( అంబేడ్కర్ః ‘‘ఫెయిల్యూర్ ఆఫ్ పార్లమెంటరీ డెమొక్రసీ విల్ రిజల్ట్ ఇన్ రెబెలియన్ అండ్ ఎనార్కీ’’ జలంధర్‌లో స్టూడెంట్స్ పార్లమెంట్లో ప్రసంగం (28–10–1951) ‘‘అంబేద్కర్ స్పీక్స్’’ వాల్యూం 1. పే.283) అంబేడ్కర్‌కి ఎంత ధిషణ అంటే, స్వాత్రంతోద్యమకాలంలో లండన్‌లో జరిపిన రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్‌కు కాంగ్రెస్ తరపున గాంధీతో పాటు తాను కూడా పాల్గొన్న ఆ సందర్భంలో డా.అంబేడ్కర్ః భారతదేశ ప్రయోజనాలను రక్షించడంలో మహాత్మాగాంధీ కన్నా నేను 200 మైళ్లు ముందు నడుస్తున్నా’’ అని చెప్పడం మరో ప్రత్యేకత. ఎందుకంటే ఈ గొప్ప భారతదేశంలో అణచివేయబడుతున్న వర్గాలనీ, అభ్యున్నతి రాకుండా తొక్కివేయబడుతున్న వర్గాలంటూ ఉండడానికి వీల్లేదనీ, హక్కులన్నింటినీ భుక్తం చేసుకునే వర్గాలు, అన్ని కష్టాలు, బరువులూ మీద మోయాల్సి వచ్చే వర్గాలంటూ ఉండరాదనీ, అలాంటి సమాజ విభజన లేదా వ్యవస్థ గానీ ఉనికిలో ఉంటే ఆ సమాజం నుంచి రక్తపాత విప్లవ బీజాలు మొలకెత్తకతప్పవనీ, ప్రజాస్వామ్యానికి ఆ బీజాలను తొలగించడం సాధ్యం కాదనీ అంబేద్కర్ భావించాడు. (పూణే న్యాయశాస్త్ర గ్రంధాలయ సభలో ప్రసంగం 22–12–1952)!! అలాగే సమాజంలోని దళిత ప్రజాబాహుళ్యం బతుకుల్ని మెరుగు పరచడానికి అధికార వికేంద్రీకరణ అనివార్యమని ఈ విషయం పట్ల ‘‘శ్రద్ధలేని న్యాయమూర్తులు రాజకీయంగా నిరక్షరాస్యులనీ సమసమాజ వ్యవస్థ తాత్వికతకు దూరమైన వ్యక్తులనీ శఠించిన వాడు ప్రసిద్ధ భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి. ఆర్ కృష్ణయ్యర్ (జస్టిస్ వీఆర్కే ‘లీగల్ స్పెక్ట్రమ్’ పేజీ 87) హిరణ్యకశిపులకు ‘ప్రహ్లాదులు’ పుట్టడం సమాజంలో అరుదైన సన్నివేశంః తనయందు అఖిల లోకులందు ఒక భంగిసము (తేడా చూపకుండా) మెలిగేవాడు మాత్రమే అంతో ఇంతో సమాజానికి వ్యవస్థ పరిమితులలో మంచి చేయగలడు. గ్రామ స్వరాజ్య వ్యవస్థ అనే సదాశయం సంపూర్ణ విజయం సాధించడం అనేది భూస్వామ్య ,పెట్టుబడిదారి వ్యవస్థ చట్టంలో విధించే పరిమితులకు లోబడి సాధ్యం కాకపోవచ్చు! ఈ లోగా వర్గ ఘర్షణకు ఆటవిడుపు ఉండదు. తప్పితే ఈలోగా జరిగేపని బొలీవియా విప్లవ కారుడు చేగువేరాను అంతమొందించిన అమెరికా పెట్టుబడి దారీ సామ్రాజ్యవాదం లాభాల.వేటలో భాగంగా అదే గువేరా బొమ్మలతో టీషర్టులు తయారు చేసి మార్కెట్లకు విడుదల చేసినట్టే– ఇక్కడ ఆంధ్రాలో మాజీ చంద్రబాబు బిసిలను ఉద్ధరించకపోగా తన అధికార లాలసకొద్దీ.బలిపశువులుగా వాడుకుంటున్నాడు! అందుకే అంబేడ్కర్ అన్నాడు. ‘‘నేను కోరుకున్నది గుడులు, గోపురాలు కాదు.కులాల మధ్య విందుభోజనాలూ కావు, నేను కోరుకున్నది దళిత బహుజనులకు ప్రభుత్వోద్యోగాల్ని, కడుపుకింత తిండిని తదితర అవకాశాలనూ’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అంబేడ్కర్ ఆలోచనలే కరోనా కట్టడికి మార్గం
మనిషి లాభాపేక్షకు ప్రతిగా ప్రకృతి ప్రకోపం నుంచి ఉద్భవించినది కరోనా. కరోనా వంటి విపత్తులను ఎదుర్కోవాలంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల నుంచి స్ఫూర్తిని పొందాలి. ఆదేశిక సూత్రాలలో అంబేడ్కర్ ప్రకృతి పరిరక్షణను, ప్రకృతిని ఆలంబనగా చేసుకొని జీవనం సాగించడాన్ని ప్రబోధిం చారు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆశయాలకు ఒక సుదీర్ఘ సామాజిక సాంస్కృతిక నేపథ్యం వుంది. కుటీర పరిశ్రమలను ప్రభుత్వ బాధ్యతగా చేయాలనీ, పశుపోషణ, వ్యవసాయాభివృద్ధిని ప్రభుత్వ విధుల్లో చేర్చాలనీ ప్రతిపాదించారు. రాజ్యాంగం నాలుగో భాగంలో అధికరణం 37 నుంచి 51 వరకూ ఈ ఆదేశిక సూత్రాలను వివరించారు. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అవసరమైన ఆర్థికాభివృద్ధి, సామాజిక, రాజకీయ ప్రణాళికకు ఆదేశిక సూత్రాలు దోహదం చేస్తాయి. ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, సమానత, సౌభ్రాతృత్వంలను సాధించడానికి, ఇవి మార్గదర్శకాలుగా నడిపిస్తాయి. ఒకానొక సందర్భంలో రాజ్యాంగ నిర్ణయసభ సలహాదారు బి.ఎన్.దావ్రో మాట్లాడుతూ ఒకోసారి దేశ ప్రామాణిక ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే తన ప్రాథమిక బాధ్యతను నిర్వహించడంలో భాగంగా రాజ్యం/ప్రభుత్వం వ్యక్తిగత హక్కులలో జోక్యం చేసుకోవలసివస్తుంది అని చెప్పాడు. దేశ నాయకత్వం రాష్ట్ర నాయకులను కలుపుకొని ఒక ధన్వంతరీ అవతారమెత్తి మొత్తం ఆరోగ్య వ్యవస్థను దాని చుట్టూ పరివేష్టించివున్న ఆర్థిక, సామాజిక రుగ్మతలకు మందు కనిపెట్టాలి. కేవలం చప్పట్లు కొట్టడం, వీధుల్లో దీపాలు వెలిగించడం మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకై ప్రణాళికలు సిద్ధంచేసి ప్రజలను ముందుకు నడిపించాలి. అభివృద్ధి చెందామని చెప్పుకుంటూ ఇప్పుడు కూలిపోయిన దేశాల వ్యాపారధోరణులు, విధానాలు మన దేశానికి పనికిరావని గుర్తించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యం, విద్య, సామాజిక న్యాయం అను మూడు అంశాలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి. ముందుగా ప్రజారోగ్య వ్యవస్థలోని సబ్–సెంటర్లను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వ్యవస్థను పటిష్టపరచాలి. అందుకు కావలసిన ఆర్థిక వనరులను వెంటనే సమకూర్చి పారామెడికల్ సిబ్బందిని, డాక్టర్లను యుద్ధ ప్రాతిపదికన భర్తీచేయాలి. గతంలో మనదేశానికి టి.బి., ఎయిడ్స్, ఆటలమ్మ వంటి మహమ్మారులను పారదోలిన చరిత్ర వుంది. అవసరమయితే అమెరికాతో కుదుర్చుకున్న ఆయుధ సరఫరా ఒప్పందాన్ని రద్దుచేసుకొని ఆ డబ్బుతో దేశంలో ఒక లక్షమంది డాక్టర్లను, పది లక్షలమంది పారా మెడికల్ సిబ్బం దిని నియమించి కరోనాపై యుద్ధాన్ని ప్రకటించాలి. ఆరోగ్యంతోపాటుగా అత్యంత కీలక విషయం విద్య. మనదేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్యపై కొన్ని మెరుగైన విధానాలు ఉన్నా ఇంకా విద్య సార్వజనీనం కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిశోధనపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. సాధ్యమైనంతవరకూ మన చుట్టుపక్కలనే వున్న వనరులను ఉపయోగించుకోవాలి. దానివలన దూరం నుండి కాక మనకు దగ్గరలోనే అవసరమైన వనరులను పొందగలుగుతాము. దేశంలో అమలవుతున్న విని మయ విధానాన్ని కట్టడిచేయాలి. విలాస వస్తువులపై పెద్దస్థాయిలో పన్ను విధించాలి. ప్రకృతి వనరులను భవిష్యత్తు తరాలకోసం ఒక పద్ధతిలో వినియోగించాలి. దేశం స్వయంపోషకంగా ఉంటూ మన దేశంలో తయారుచేసిన వస్తువులను ఉపయోగించుకోవాలి. అంబేడ్కర్ సహజవనరులను, ప్రధాన పరిశ్రమలను, ఆర్థిక వ్యవస్థలోని కీలక అంశాలను ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాలని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆదేశిక సూత్రాలను భారత ప్రజలు అంతరాత్మగా స్వీకరించి ముందుకు సాగాలి. భారత స్వాతంత్య్ర ప్రకటన బ్రిటిష్ వలసపాలకుల నుంచి విముక్తి మాత్రమే కాదు. అది భారత ప్రజల రాజకీయార్థిక, సామాజిక సాంస్కృతిక స్వావలంబన. ఇటువంటి భావనలు వాస్తవరూపం దాల్చాలంటే సంక్షేమ రాజ్యస్థాపనే పరమ లక్ష్యంగా రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాల అమలు ఒక్కటే మార్గం. ఆర్థిక సమానత్వాన్ని సాధించి సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించడమే వీటి ముఖ్య ఉద్దేశ్యం. అధికరణం 38 ప్రకారం సామాజిక , ఆర్థిక, రాజకీయ న్యాయంతో కూడిన ప్రజాసంక్షేమానికి అనుగుణమైన వ్యవస్థ ఏర్పడటానికి ఆదాయంలో హోదాలో సౌకర్యాలలో అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం (రాజ్యం) కృషి చేయాలి. అలాగే అధికరణం 39 (బి) – ప్రజలందరి సమష్టి మేలు సమకూర్చేలా సమాజంలోని భౌతికవనరులపై యాజమాన్యం నియంత్రణలను చేకూర్చేందుకు విధానాన్ని రూపొందించుకోవాలి. 39 (సి) ప్రకారం ‘జన సామాన్యానికి హాని కలగకుండా, సంపద, ఉత్పత్తి సాధనాలను వికేంద్రీకరించేలా ప్రభుత్వం తన విధానాన్ని రూపొందించుకోవాలి. ఇటువంటి ప్రజా విధానాల రూపకల్పనే లక్ష్యంగా రూపొందిన అదేశిక సూత్రాల అమలులోని ఉదాసీనతే కరోనా వైరస్ వంటి వ్యాధులకు కారణమై.. ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను సామాజిక జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ వైఫల్యాల ఫలితమే నేడు దేశంలో 40 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. అధికరణం 40 ప్రకారం గ్రామ పంచాయితీలను వ్యవస్థీకరించి, స్వపరిపాలనా సంస్థలుగా అవి పని చేయడానికి అవసరమైన అధికారాలను, ప్రాధికారాలను ప్రభుత్వం ఇవ్వాలి. మానవతా పరిస్థితులతో కూడిన పనిని చూపేందుకు ప్రభుత్వం ప్రసూతి, వైద్య సదుపాయాలు ఇవ్వాలి. కార్మికులకు జీవన భృతిని, ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనాన్ని గడిపేందుకు అవసరమైన పరిస్థితులను సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించేందుకు, ప్రభుత్వం కృషిచేయాలి– అధికరణం 43. పౌష్టికాహార స్థాయిని, జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించి, ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడంలో ప్రభుత్వం కృషి చేయాలి– అధికరణం 47 ప్రకారం. గోవులను, ఇతర పాడి పశువులను, పెంపుడు జంతువుల వధని నిషేధించి, వాటి ఉత్పాదనను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలి– అధికరణం 48. అధికరణం 51 (జి) ప్రకారం ప్రాకృతిక సంపదలైన అడవులు, నదులు, నదీ జలాలు వన్యప్రాణుల సంరక్షణ కొరకు ప్రభుత్వం కృషి చేయాలి. ఈ ఆదేశిక సూత్రాల వైఫల్యాల పాలన ఫలితమే కరోనా వంటి వైరస్ల ఉధృతికి కారణం. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే అంబేడ్కర్ ఆలోచనా విధానం లోంచి రాజ్యాంగ స్ఫూర్తిలోంచి భారత దేశం తనదైన ‘గ్రీన్ పాలిటిక్స్’ను నిర్వహించుకోవాలి. డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాసకర్త మాజీ మంత్రి -
ఆయన చాలా గొప్ప వ్యక్తి : సెహ్వాగ్
ఢిల్లీ : భారత మాజీ విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనమైన నివాళి అర్పించాడు. ' భారత రాజ్యాంగాన్ని తనదైన శైలిలో చెక్కిన శిల్పి అంబేద్కర్‌కు ఇవే నా ఘనమైన నివాళి' అంటూ ట్విటర్ వేదికగా స్పందించాడు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. ' బీఆర్ అంబేద్కర్ నిజంగా చాలా గొప్ప వ్యక్తి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ గొప్పగా పోరాడరని కొనియాడాడు. స్వాతంత్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషిస్తూ.. అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దళితులు, ఇతర అణగారిన వర్గాల వారిపై వివక్షను అణగదొక్కేందుకు తన వంతు కృషి చేసి భారతరత్న సాధించారని' తెలిపాడు. (అందుకే అతన్ని పాక్ 'వివ్ రిచర్డ్స్' అంటారు) Humble tributes to the architect of Indian Constitution, Bharat Ratna Dr Bhimrao Ambedkar on his birth anniversary. May his ideals continue to inspire. #AmbedkarJayanti pic.twitter.com/0gPRZAhc1i — Virender Sehwag (@virendersehwag) April 14, 2020 -
అంబేడ్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి
సాక్షి, తాడేపల్లి : రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు విశ్వరూప్, అదిమూలం సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కైలే అనిల్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి : మరణం లేని మహా శక్తి ఆయన : సీఎం జగన్) అంబేద్కర్ సిద్ధాంతాలకు సీఎం జగన్ కట్టుబడి : సజ్జల రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలనుకున్నాం.. కానీ కరోనా వల్ల చేయలేకపోతున్నామని తెలిపారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. మహిళా సాధికారితకు సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని సజ్జల అన్నారు.