
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. శుక్రవారం సచివాలయ పనులను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఈ మేరకు తేదీని వెల్లడించారు.
ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అలాగే.. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సచివాలయ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సచివాలయ పనులను పర్యవేక్షించడంతో పాటు అక్కడి రోడ్లను సైతం ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment