సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కలను సాకా రం చేసిన అమరులకు ఇక నుంచి నిత్య నివాళి ప్రతిధ్వనించబోతోంది. వెలకట్టలేని త్యాగధనులకు ఆరని రీతిలో నీరాజనాల దివ్వె జ్వలించబోతోంది.
ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి తెలంగాణ కలను సాకారం చేసిన త్యాగ దనులకు ఘనమైన నివాళిగా ప్రభుత్వం గొప్ప స్మారకాన్ని నిర్మించింది. చారిత్రక హుస్సేన్‌సాగర్ చెంత లుంబిని పార్కును ఆనుకొని మరో అద్భుత దృశ్యంగా.. అ మరుల జ్ఞాపకాలు అరుణకాంతులై ఆకాశాన్ని ఎరుపెక్కించే ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’గురువారం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ దశాబ్ది ఆరంభ ఉత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఆవిష్కరించనున్నారు.
రూ.180కోట్లతో..
ఇటీవలే ఘనంగా ప్రారంభించుకున్న సచివా లయానికి ఎదురుగా రూ.180 కోట్ల వ్యయంతో వెలుగుతున్న ప్రమిద ఆకృతిలో ఆరు అంతస్తులుగా దీన్ని రూపొందించారు. అతుకులు లేని జర్మనీ నుంచి తెప్పించిన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వెలుపలి భాగాన్ని డిజైన్ చేశారు. ఈ తరహాలో ప్రపంచంలో ఇప్పటి వరకు చికా గో, చైనా, దుబాయ్ లోనే నిర్మాణాలు రూ పొందాయి.
లుంబినీ పార్కులోని 3.29 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం దీనికి కేటాయించింది. ఇందులో 26800చ.మీ. విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. రెండో అంతస్తు సెల్లార్‌తో కలుపుకొని 6అంతస్తులుగా ఈ భవనం రూపుదిద్దుకుంది. ప్రమిద ఆకృతి లో భవనం ఉండగా, దానికి జ్వలిస్తున్న దీపం ఆకృతిని 26 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేశారు. అద్దంతో రూపొందించిన తరహాలో ఆ భవనంలో వెలుపలి వాటి ప్రతిబింబాలు దర్శనమిస్తుండటం ప్రత్యేకంగా కనిపిస్తోంది.
బేస్‌మెంట్2లో పార్కింగ్ వసతి
బేస్‌మెంట్2లో 175 కార్లు, 200 ద్విచక్రవాహనాలకు, బేస్‌మెంట్1లో 160 కార్లు, 200 ద్విచక్రవాహనాల పార్కింగ్, లాంజ్, ప్యానెల్ రూమ్, పంప్ రూమ్ నిర్మించారు. మొదటి అంతస్తులో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, 70 మంది సామర్థ్యంతో ఆడియో విజువల్ రూమ్స్, ఎస్కలేటర్ ఏర్పాటు చేశా రు. రెండో అంతస్తులో 500 మంది సామర్థ్యంతో సమావేశమందిరం, లాబీ ఏరియా ఏర్పాటు చేశారు.
మూడో అంతస్తులో రెస్టారెంట్, వ్యూ పాయింట్, ఓపెన్ టెర్రస్ సీటింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. నాలుగో అంతస్తులో గ్లాస్ రూఫ్‌తో ఉన్న రెస్టారెంట్, ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉన్నాయి. పైన ఉక్కుతో రూపొందించిన దీపం ఆకృతి ఏర్పాటు చేశా రు. దీనిపై బయటి నుంచి బంగారు రంగు లో లైటింగ్ ప్రసరిస్తుంది. 15 మంది సామర్థ్యం ఉన్న 3 లిఫ్టులు ఏర్పాటు చేశారు.
డ్రోన్లతో మెగా లేజర్ షో..
స్మారకం ఆవిష్కరణ సందర్భంగా గురువా రం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి సెక్రటేరియట్ వరకు అమరుల త్యాగాలను తెలిపేలా 5000 మంది కళాకారులతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. తెలంగాణలోని వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. స్మారకం ఎదురు గా బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ చా రిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటేవిధంగా సుమారు 800 డ్రోన్లతో లేజర్ షో కూడా ఉంటుంది. సీఎం స్మారకాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి ప్రతి రోజూ సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు వెలుగులు విరజిమ్మేవిధంగా జ్యోతి (దియా)లో లైటింగ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
మంత్రి శ్రీనివాసగౌడ్ సమీక్ష
అమరవీరుల స్మారక కేంద్రం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం వద్ద గురువారం నిర్వహించనున్న లేజర్ మెగా డ్రోన్ల షోపై మంగళవారం మంత్రి శ్రీనివాసగౌడ్ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. డ్రోన్లషోను టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్‌తో కలిసి పరిశీలించా రు. వివిధ జిల్లాల్లో 400 డ్రోన్లతో లేజర్ షో నిర్వహిస్తామని చెప్పారు.
ముందుగా మహబూబ్‌నగర్‌లో, తర్వాత వరంగల్, సిద్దిపేట, నిజా మాబాద్, ఖమ్మం జిల్లాలో లేజర్ షో ప్రదర్శిస్తామన్నారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ, డీజీపీ పరిశీలన బహిరంగసభను నిర్వహించనున్న ప్రాంతాన్ని మంత్రులు తలసాని, మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సభలో కేసీఆర్ ప్రసంగిస్తా రని తలసాని చెప్పారు. సభ ఏర్పాట్లకు సంబంధించిన మంత్రులు అధికారులకు తగిన సూచనలు చేశారు.
దేవాలయాల్లో నిత్య పూజలు ఎలా జరుగుతాయో, తెలంగాణను కలను సాకారం చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన తెలంగాణ అమరవీరులకు నిత్య నీరాజనాలు పలికే తరహాలో ఈ నిర్మాణానికి ముఖ్యమంత్రి దీనికి డిజైన్ చేశారు. ఆయన ఆలోచనలకు తగ్గ రీతిలో దీన్ని రూపొందించాం. ఆ నిర్మాణంలో కీలక భూమిక పోషించే అవకాశం నాకు రావటం గర్వంగా అనిపిస్తోంది. ఢిల్లీకి వచ్చే ప్రముఖులు బాపూ సమాధి వద్ద ఎలా నివాళులు అరి్పస్తారో, అదే తరహాలో.. నగరానికి వచ్చే ప్రముఖులు తెలంగాణ అమరుల స్మారకం వద్ద నివాళులు అరి్పంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment