prashanth reddy
-
టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృతంగా ముందుకు వెళుతున్నందునే, ప్రభుత్వం టార్గెట్ చేసి రచ్చచేస్తోందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల సొంతంగా ఫామ్‌హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారని, దాన్ని రేవ్‌పార్టీ అంటూ కుట్రలకు తెరతీశారని వారు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వా రు మాట్లాడారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ప్రభుత్వంపై కేటీఆర్ దూకుడుగా వెళ్తున్నందునే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ బావమరిది కాబట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు రాజకీయాల్లో ఇప్పుడే చూస్తున్నాం అన్నారు. వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని, ఆయనపై కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.పోలీసు కుటుంబాలు రోడ్డెక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదని, రాజ్ పాకాల విషయంలో మా త్రం వీడియో రిలీజ్ చేశారని విమర్శించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు లేవని, ఇప్పుడు కొత్తగా అలాంటి సంస్కృతిని తీసుకురావద్దని అన్నారు. లేని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కాగా, మాజీ మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తు న్నారని బీఆర్ఎస్ సీని యర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నమిదికాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమ లు చేయకుండా, సమస్యలపై నిలదీస్తున్న కేటీఆర్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్, నాయకు లు గెల్లు శ్రీనివాస్, సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. జన్వాడ పార్టీ వ్యవహారంలో ఆయనను కావాలనే ఇరికిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. -
‘హరీష్ నామినేషన్ ఏమైంది?’.. పీఏసీ భేటీలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. అనంతరం, బీఆర్ఎస్ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.కాగా, పీఏసీ చైర్మన్ గాంధీ అధ్యక్షతన నేడు మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, ఎంఐఎం నుంచి బలాల, బీజేపీ నుంచి రామరావు పవార్, బీఆర్ఎస్ నుంచి పశ్రాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, భాను ప్రసాద్ రావు, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ హాజరయ్యారు.ఈ సమావేశం సందర్భంగా పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని ఎలా నియమిస్తారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ అన్నారు. అలాగే, పీఏసీకి ఎన్ని నామినేషన్లను వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం, సమావేశం నుంచి వాకౌట్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మా ప్రశ్నలకు పీఏసీలో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు.. అందుకే వాకౌట్ చేశాం. స్పీకర్ స్పందించడం లేదు.. అన్ని శ్రీధర్ బాబే మాట్లాడుతున్నాడు. వాళ్ల తప్పుడు పనులు మేము బయటపెడతామని భయపడుతున్నారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే మా ఎల్పీ ఆఫీసుకు ఎందుకు రావడం లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తికి పీఏసీ చైర్మన్ ఇచ్చారు.గాంధీకి మా పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వలేదు. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైంది. గాంధీ నామినేషన్ ఎలా వచ్చింది. ఆయన ఎంపిక ఎలక్షన్ ప్రకారం జరిగిందా.. సెలక్షన్ ప్రకారం జరిగిందా అనేది మాకు తెలియాలి. పీఏసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనది. ప్రతీ రూపాయిని ప్రజల పక్షాన పీఏసీ ఆడిట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మా సభ్యుల సంఖ్య ప్రకారం ఐదుగురి పేర్లు ఇవ్వమన్నారు. ఐదుగురి పేర్లు ఇచ్చాం. కానీ, అందులో గాంధీ పేరు లేదు. అయినప్పటికీ గాంధీకి ఎలా పదవి ఇచ్చారు.2014లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేదు.. అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పార్లమెంట్ పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌ను చేశారు. రాహుల్ గాంధీ సూచన మేరకే ఇది జరిగింది. 2014లో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కే పీఏసీ పదవి ఇచ్చాం. 2018లో కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంఐఎంకు ఉన్నారు. 2018లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎంఐఎం కాబట్టి అక్బరుద్దీన్‌కు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చాం. 2018లో పీఏసీ చైర్మన్ శ్రీధర్ బాబు అడిగారనేది అవాస్తవం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘నామినేషన్ వేయకుండానే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారనేది మా వాదన. ఎజెండా ఏంటో ఇంకా చూడలేదు.. ఆలోపే వాకౌట్ చేశాం. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం తీసుకోవాలి. మొదట పార్టీ మారిన ముగ్గురిపై కేసు వేశాం. మిగతా వారిని ఇంప్లీడ్ చేస్తాం. స్పీకర్ తీర్పును న్యాయ సమీక్ష చేస్తామని హైకోర్టు చెప్పింది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి: కేటీఆర్ -
అలైన్మెంట్ మార్పు వెనుక అరాచకం: మాజీ మంత్రి వేముల
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్పుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల సొంత లాభం కోసం అలైన్మెంట్ మార్చు తూ పేదల భూముల నుంచి రోడ్డును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలైన్మెంట్ మా ర్పు వెనకాల దందాలు, అరాచకాలు ఎవరి కోసం జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పాలన్నా రు.అలైన్మెంట్ మార్పుపై ప్రజలకు ఉన్న అనుమానాలను సీఎం రేవంత్ నివృత్తి చేయాలన్నా రు. పార్టీ నేతలు శుభప్రద్ పటేల్, కిషోర్, రాకేశ్‌కుమార్ తదితరులతో కలసి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగు రోడ్డు ఉత్తరభాగం అలైన్మెంట్ ఇప్పటికే అమోదం పొందగా, గతంలోనే ఖరారు చేసిన దక్షిణ భాగం అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం లభించాల్సి ఉందన్నారు. నాలుగు చోట్ల అలైన్మెంట్ మార్పు ఫోర్త్‌సిటీ సౌలభ్యం పేరిట సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డులో 4 కిలోమీటర్లు మార్చడంతో పాత, కొత్త అలైన్మెంట్ల మధ్య 10 నుంచి 12 కిలోమీటర్లకు దూరం పెరిగిందని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆమన్‌గల్ మండలం కుందారంలో పేదలు సా గు చేసుకుంటున్న 400 ఎకరాల భూమిని రాజవంశీయులతో బేరం చేసుకుని కాంగ్రెస్ నేతలు ‘బిగ్ బ్రదర్స్’అండతో లాక్కుంటున్నారని ఆరోపించారు. మాడుగులలో సీఎం బంధువుల భూ ముల్లో ఏం జరుగుతుందో చెప్పాలని, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు లబ్ధి జరిగేలా అలైన్మెంట్ మా రిందన్నారు. బిగ్ బ్రదర్స్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలకు మేలు చేసేలా చేవెళ్ల మా ర్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి 5 కిలోమీటర్లు జరిపి మన్నెగూడ క్రాస్ రోడ్‌కు అలైన్మెంట్ మా ర్చారన్నారు. -
కాంగ్రెస్ నేతలు ప్రోటోకాల్ పాటించడంలేదు: ప్రశాంత్‌రెడ్డి
-
TS: అత్తా, అల్లుళ్ల మధ్య యుద్ధం
నిజామాబాద్: రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు ప్రశాంత్‌రెడ్డి. ఈసారి మేనల్లుడు అయిన ప్రశాంత్‌రెడ్డిపై ఎలాగైన విజయం సాధించాలని మేనత్త అన్నపూర్ణమ్మ పంతం. బీజేపీ అభ్యర్థిగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పోటీ చేస్తుండగా ఆమె సోదరుని కుమారుడు మేనల్లుడైన వేముల ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వేముల సురేందర్‌రెడ్డికి స్వయానా చెల్లెలు అన్నపూర్ణమ్మ. ఆమె పుట్టినిల్లు వేల్పూర్ కాగా మెట్టినిల్లు కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి. మేనత్త, అల్లుడు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల్లో ప్రశాంత్‌రెడ్డి మేనత్త కొడుకైన మల్లికార్జున్‌రెడ్డితో పోటీ పడి విజయం సాధించారు. ఇప్పుడు మేనత్తతో పోటీలో నిలువడం విశేషం. వీరి మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. -
వర్షాలు, వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు ‘గృహలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా ధ్వంసమైన 419 ఇళ్లకు గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న 7,505 ఇళ్లకు తగిన విధంగా పరిహారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు–భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గురువారం శాసనమండలిలో ‘భారీ వర్షాల పర్యవసానాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యల’పై నిర్వహించిన లఘు చర్చకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. వరదల సమయంలో ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఆదుకోకున్నా.. 2020లో, తర్వాత రాష్ట్రం వరదలతో నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదని.. అయినా సీఎం కేసీఆర్ ధైర్యం కోల్పో కుండా పకడ్బందీగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇళ్లు నీట మునిగిన వారికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర సర్కారే ఆర్థిక సాయం చేసిందని చెప్పారు. గతంలో భారీ వర్షాలకు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల ఆర్థిక సా యాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. అందులో ఇప్పటివరకు రూ.150 కోట్లు చెల్లించిందని, త్వరలోనే మిగతా రూ.300 కోట్ల ను చెల్లించనున్నామని తెలిపారు. ప్రస్తుత వరదల నేపథ్యంలోనూ సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసానిచ్చేలా రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర సమీక్ష తెలంగాణలో ఎన్నడూ లేనంత భారీ వర్షా లు నమోదయ్యాయని, ఈ వానలు, వరదలపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షించార ని వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో అర్ధరాత్రి దాకా గంటలకొద్దీ సమీక్షలు, ప్రాజెక్టుల వారీగా పరిశీలనలతో ఆస్తి, ప్రాణనష్టం తగ్గించగలిగామని వివరించా రు. వరద ప్రాంతాలకు సీఎం రాలేదన్న వి మర్శలు సరికాదని.. సీఎం కేసీఆర్ ఫొటోల కవరేజీ కోసం ఫోజులిచ్చే నాయకుడు కాద ని, ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక బృందాలను పురమాయించి. మంత్రులు, కలెక్టర్లు, అధికారులను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నం చేయడంలో కేసీఆర్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. వరదలతో కోతకు గురైన భూములపై సర్వే చేయాలని ఆదేశించారని తెలిపారు. నష్టంపై పూర్తి అంచనాలు అందాక ఆర్థిక సాయంపై సీఎం తగిన నిర్ణయం ప్రకటిస్తారని వివరించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో చెరువుల అలుగులు పటిష్టమై, కాలువల కట్టలు బలపడటంతో ఎక్కువ నష్టం జరగలేదని పేర్కొన్నారు. వరదలు, వానల నష్టం ఇదీ.. రాష్ట్రంలో వరంగల్ కార్పొరేషన్, నిర్మల్, పరకాల, కోరుట్ల, భూపాలపల్లి, జమ్మి కుంట, ఖమ్మం కార్పొరేషన్, మహబూ బాబాద్, భైంసా, నిజామాబాద్ కార్పొరేషన్, పెద్దపల్లి, నర్సంపేటలలో అధిక నష్టం సంభవించిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసన మండలిలో చెప్పారు. 141 పురపాలికల్లో ముందస్తు, సహాయ చర్యలు చేపట్టామని, తాత్కాలిక మరమ్మతులకు రూ.76 కోట్లు అవసరమని అంచనా వేశామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాల శాశ్వత పునరుద్ధరణకు మొత్తం రూ.304 కోట్లు, యూఎల్బీల పునరుద్ధరణ పనులకు రూ.380 కోట్లు అవసరమన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.255.66 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, అవి మంజూరు దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. సహాయ చర్యల్లో భాగంగా 1,500 మందిని కాపాడామని మంత్రి చెప్పారు. 139 గ్రామాలకు చెందిన 27,062 మందికి 157 సహాయ శిబిరాల్లో ఆశ్రయం కలి్పంచామని.. తాగునీరు, ఆహారం, దుప్పట్లు, మందులు సరఫరా చేశామని వివరించారు. ములుగు జిల్లా కొండాయి గ్రామానికి హెలికాప్టర్ ద్వారా ఆహారం, మందులు పంపామన్నారు. 64 గ్రామాలు/ప్రదేశాలలో నీటిపైపులు దెబ్బతిని.. 1,199 జనావాసాలు 25,418 కుటుంబాలపై ప్రభావం పడగా.. వందశాతం తాగునీటి పునరుద్ధరణ జరిగిందని చెప్పారు. 773 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. 769 గ్రామాల్లో పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. 23,075 స్తంభాలు, 3,405 డీటీఆర్లు దెబ్బతిని దాదాపు రూ.62.98 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. -
వరదలపై తెలంగాణ మండలిలో స్వల్పకాలిక చర్చ
-
ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోంది. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది అని ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో నాలుగు రోజులు గట్టి వానలే.. -
కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. పొలిటికల్ ప్లాన్ రివర్స్!
గులాబీ బాస్‌కు కొరుకుడు పడని సీటుగా హుజూరాబాద్ పేరు తెచ్చుకుంది. తనను ధిక్కరించి కమలం గుర్తు మీద మళ్ళీ గెలిచిన ఈటల రాజేందర్‌ను ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఈటలకు సరిజోడు అనుకున్న కౌశిక్‌రెడ్డి దుందుడుకు స్వభావం సీఎం కేసీఆర్‌ను చికాకు పెడుతోందట. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ కారు అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌లో గులాబీ పార్టీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి పాలు కావడంతో గులాబీ దళపతి కేసీఆర్ మరింత కసిగా వచ్చే ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. అక్కడి ప్రజల్ని ఆకర్షించడానికి ఉప ఎన్నికల సమయంలోనే దళితబంధు సహా పలు పథకాలు హుజూరాబాద్ నుంచే ప్రకటించారు. పార్టీ నియమించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ ఓటమితో.. కాంగ్రెస్ నుంచి కౌశిక్‌రెడ్డిని తీసుకువచ్చి ఎమ్మెల్సీని చేసి, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంక్ కల్పించారు. హుజూరాబాద్ ఇన్చార్జ్గా నియమించి వచ్చే ఎన్నికల కోసం రెడీ అవ్వమని కౌశిక్‌రెడ్డిని ఆదేశించారు. అయితే, కౌశిక్‌రెడ్డి దూకుడు స్వభావి అనుకుంటే.. ఆయన దుందుడుకు పోకడలతో అందరికీ దూరం అవుతున్నారు. వివాదాస్పద వ్యవహారాలతో పార్టీ పరువును తీస్తున్నారని కేసీఆర్‌కు నివేదికలందాయి. తెరపైకి ప్రశాంత్ రెడ్డి.. కౌశిక్‌రెడ్డిని తీసుకువచ్చి అత్యంత ప్రాధాన్యమిచ్చి, పదవి ఇచ్చి, ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడు మొత్తం రివర్స్ కావడంతో కేసీఆర్‌కు ఆలోచన మొదలైంది. కౌశిక్‌రెడ్డి ప్రత్యామ్నాయంగా మరొకరిని చూడాలని నిర్ణయించుకున్నారు. కొత్త ముఖాన్ని తీసుకువచ్చి హుజూరాబాద్‌లో నిలపాలని భావిస్తున్నారు. ఆ ఆలోచనతోనే సర్వేలు నిర్వహించగా.. కౌశిక్‌రెడ్డి, ఉప ఎన్నికల అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్‌ను కాదని.. ఓ పోలీస్ ఆఫీసర్‌ను నియోజకవర్గ ప్రజలు ఆదరించడం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అంతర్గత సర్వేల్లో డీఎస్పీగా ఉన్న పింగళి ప్రశాంత్‌రెడ్డి పేరు బాగా వినిపించిందట. అయితే, అంతకుముందే మాజీ మంత్రి పెద్దిరెడ్డిని హుజూరాబాద్‌లో ఉండమని కేసీఆర్ ఆదేశించారట. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్బాబును హుజూరాబాద్ బరిలో దించితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోందట. ఈటలకు దూరపు బంధువు.. హుజూరాబాద్‌లో ఈటలకు ధీటుగా డీఎస్పీ పింగళి ప్రశాంత్ రెడ్డి పేరు వినిపించడంపై గులాబీ బాస్ కూడా ఒకింత ఆశ్చర్యపోయారట. కుల, మతాల మధ్య సమైక్యతతో పాటు జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంచే క్రమంలో ప్రశాంత్ రెడ్డి.. జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిత్య జనగణమన కార్యక్రమం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. నిత్య జనగణమన కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అమలుచేస్తున్నారు. ఆ కార్యక్రమంతో ప్రజలకు చేరువైన ప్రశాంత్ రెడ్డి అయితే ఈటలకు ధీటైన వ్యక్తిగా ప్రచారం సాగుతోంది. ఆయనకు ప్రజల ఆదరణ కూడా ఉండటంతో.. ప్రశాంత్‌పై ఇప్పుడు గులాబీ బాస్ గుడ్ లుక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈటలకు దూరపు బంధువు కూడా అయిన ప్రశాంత్‌నే బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతోందని సమాచారం. తన ప్రమేయమేమీ లేకుండానే ప్రజల్లో ఆదరణ కనిపిస్తున్నప్పుడు సహజంగానే ప్రశాంత్ రెడ్డి లాంటి అధికారుల్లో ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అదీ తనను ఓ పొలిటీషియన్‌గా ప్రజలు చూడాలనుకోవడం పట్ల ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో పింగళి ప్రశాంత్ రెడ్డి అనే డీఎస్పీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి అవుతారా..? లేక ఆ మూడో కృష్ణుడు పెద్దిరెడ్డా.. సతీష్ అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. ఇది కూడా చదవండి: బీజేపీ ‘పరివార’ చర్చలు -
అక్కడ వందల కోట్ల స్కాం జరిగింది: ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. బాల్కొండలో వందల కోట్ల స్కామ్ జరిగిందని అరవింద్ ఆరోపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండలో వందల కోట్ల స్కాం జరిగింది. బట్టాపూర్లో శ్రీకాంత్, వంశీరెడ్డి అక్రమంగా క్వారీక్రషర్లు నడుపుతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఐదేళ్లు నడిపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రూ.51లక్షల కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు. సామాన్యుడు రూ.2వేలు విద్యుత్ ఛార్జీ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారు. దీనికి మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలి అని సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన -
బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసినా కృతజ్ఞత చూపించడంలేదని బాధను వెల్లబోసుకున్నారు. తనకు బాధగా అనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మెండోరా ప్రాంత రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం నీళ్లు తెచ్చినా కనికరం చూపించరా? అని ప్రశ్నించారు. గతంలో కాకతీయ లీకేజీ నీళ్లు విడుదల చేయకపోతే ఆందోళనలు చేశారు. రైతులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. నాపై చెప్పులు వేసినా పట్టించుకోలేదు. ఎందుకంటే రైతులది బతుకుపోరాటం. శ్రీరామ్‌సాగర్ నీళ్లు మొట్టమొదటగా అందేది మెండోరాకే. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చినా కెనాల్ కమిటీ వారు కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకు మెండోరాకు రాలేదు. నాకు బాధగా ఉంది. మెండోరాకు ఎంత మంచి చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జడ్జి భర్తపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ‘ఆస్పత్రికి వెళ్లాలి, దారి ఇవ్వండి’ అని అడిగినందుకు.. -
రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్
-
మంత్రికి పనిలో 30 శాతం వాటా
ఖలీల్‌వాడి : మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసే ప్రతి పనిలో 30 శాతం వాటా తీసుకుంటున్నారని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఆండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్మించిన సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపంలో మంత్రికి వాటాలు ఉన్నాయన్నారు. 2 నెలల క్రితం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను చేసిన అవినీతిని నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరాడని నిజానికి మంత్రి సహజ వనరులు దోచుకున్నాడని మానాల ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్, మొరంను ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని,మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా తక్కవ కాదన్నారు. బట్టాపూర్ మైనింగ్ పేరుతో రూ. వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రశాంత్ రెడ్డి స వాలును స్వీకరిస్తూనే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మీకు ఒక సవాల్ విసిరుతున్నానని మానాల పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో మొదటి నాలుగేళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా మీరు చేసిన అవినీతి రాష్ట్ర ప్రజలకు తెలుసునని మానాల అన్నారు. ఇప్పుడు రోడ్లు భవనల శాఖ మంత్రిగా చేసిన పనులలో అవినీతి జరిగిందన్నారు. మంత్రిగా ఉండి జిల్లాను అభివృద్ధి చేయాల్సింది పోయి నియోజకవర్గానికి పరిమితమైనారని విమర్శించారు. అవసరం లేని చోట రోడ్లు నిర్మించి ప్రతి దాంట్లో కమిషన్ తీసుకున్నాడని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బట్టాపూర్లో ఉన్న క్వారీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీనామీదని ఆరోపించిందని, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి దానిని తన బంధువులదని ఒప్పుకున్నాడని అన్నారు. క్వారీలో వనరులను దోచుకున్నావని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే పొంత న లేకుండా మంత్రి సమాధానం చెప్పడం సరైనది కాదన్నారు. మంత్రి క్వారీ విలువ రూ.10 కోట్లు ఉంటుందని, దీనికి 10 ఎకరాల భూమి ఉంటుందని, క్వారీని రూ.10 కోట్లకే ప్రతిపక్షాలకు ఇస్తానని పొంతన లేని మాటలు చెప్పడం సరైనది కాదన్నారు. 2014లో ప్రశాంత్ రెడ్డి చూపించిన ఆస్తుల విలువ ఎంత? 2023లో ఆస్తుల విలువ ఎంతో స్పష్టం చేస్తే మంత్రి అవినీతి బండారం బయట పడుతుందన్నారు. మంత్రి తమ్ముడు గంజాయి స్మగ్లర్ అని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించిన తర్వాత నియోజకవర్గంలో ఎందుకు కేసులు నమోదు అ య్యాయన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అవినీతిపై చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమన్నారు. చెక్‌డ్యామ్‌లో వాటాతోనే ఇటీవల వర్షాలతో వేల్పూర్ మండలంలో కట్టలు తెగిపోయినట్లు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఆన్వేష్‌రెడ్డి ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు తాహెర్ బిన్ హందాన్, సంతోష్, శ్రీని వాస్, గంగారెడ్డి, వినయ్, విక్కీ యాదవ్, రత్నాకర్, కార్పొరేటర్ రోహిత్, ప్రమోద్, సాగర్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ పాల్గొన్నారు. -
త్యాగధనులకు నిత్య నీరాజనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కలను సాకా రం చేసిన అమరులకు ఇక నుంచి నిత్య నివాళి ప్రతిధ్వనించబోతోంది. వెలకట్టలేని త్యాగధనులకు ఆరని రీతిలో నీరాజనాల దివ్వె జ్వలించబోతోంది. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి తెలంగాణ కలను సాకారం చేసిన త్యాగ దనులకు ఘనమైన నివాళిగా ప్రభుత్వం గొప్ప స్మారకాన్ని నిర్మించింది. చారిత్రక హుస్సేన్‌సాగర్ చెంత లుంబిని పార్కును ఆనుకొని మరో అద్భుత దృశ్యంగా.. అ మరుల జ్ఞాపకాలు అరుణకాంతులై ఆకాశాన్ని ఎరుపెక్కించే ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’గురువారం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ దశాబ్ది ఆరంభ ఉత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. రూ.180కోట్లతో.. ఇటీవలే ఘనంగా ప్రారంభించుకున్న సచివా లయానికి ఎదురుగా రూ.180 కోట్ల వ్యయంతో వెలుగుతున్న ప్రమిద ఆకృతిలో ఆరు అంతస్తులుగా దీన్ని రూపొందించారు. అతుకులు లేని జర్మనీ నుంచి తెప్పించిన స్టెయిన్లెస్ స్టీల్‌తో వెలుపలి భాగాన్ని డిజైన్ చేశారు. ఈ తరహాలో ప్రపంచంలో ఇప్పటి వరకు చికా గో, చైనా, దుబాయ్ లోనే నిర్మాణాలు రూ పొందాయి. లుంబినీ పార్కులోని 3.29 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం దీనికి కేటాయించింది. ఇందులో 26800చ.మీ. విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. రెండో అంతస్తు సెల్లార్‌తో కలుపుకొని 6అంతస్తులుగా ఈ భవనం రూపుదిద్దుకుంది. ప్రమిద ఆకృతి లో భవనం ఉండగా, దానికి జ్వలిస్తున్న దీపం ఆకృతిని 26 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేశారు. అద్దంతో రూపొందించిన తరహాలో ఆ భవనంలో వెలుపలి వాటి ప్రతిబింబాలు దర్శనమిస్తుండటం ప్రత్యేకంగా కనిపిస్తోంది. బేస్మెంట్2లో పార్కింగ్ వసతి బేస్మెంట్2లో 175 కార్లు, 200 ద్విచక్రవాహనాలకు, బేస్మెంట్1లో 160 కార్లు, 200 ద్విచక్రవాహనాల పార్కింగ్, లాంజ్, ప్యానెల్ రూమ్, పంప్ రూమ్ నిర్మించారు. మొదటి అంతస్తులో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, 70 మంది సామర్థ్యంతో ఆడియో విజువల్ రూమ్స్, ఎస్కలేటర్ ఏర్పాటు చేశా రు. రెండో అంతస్తులో 500 మంది సామర్థ్యంతో సమావేశమందిరం, లాబీ ఏరియా ఏర్పాటు చేశారు. మూడో అంతస్తులో రెస్టారెంట్, వ్యూ పాయింట్, ఓపెన్ టెర్రస్ సీటింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. నాలుగో అంతస్తులో గ్లాస్ రూఫ్‌తో ఉన్న రెస్టారెంట్, ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉన్నాయి. పైన ఉక్కుతో రూపొందించిన దీపం ఆకృతి ఏర్పాటు చేశా రు. దీనిపై బయటి నుంచి బంగారు రంగు లో లైటింగ్ ప్రసరిస్తుంది. 15 మంది సామర్థ్యం ఉన్న 3 లిఫ్టులు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో మెగా లేజర్ షో.. స్మారకం ఆవిష్కరణ సందర్భంగా గురువా రం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి సెక్రటేరియట్ వరకు అమరుల త్యాగాలను తెలిపేలా 5000 మంది కళాకారులతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. తెలంగాణలోని వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. స్మారకం ఎదురు గా బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ చా రిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటేవిధంగా సుమారు 800 డ్రోన్లతో లేజర్ షో కూడా ఉంటుంది. సీఎం స్మారకాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి ప్రతి రోజూ సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు వెలుగులు విరజిమ్మేవిధంగా జ్యోతి (దియా)లో లైటింగ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మంత్రి శ్రీనివాసగౌడ్ సమీక్ష అమరవీరుల స్మారక కేంద్రం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం వద్ద గురువారం నిర్వహించనున్న లేజర్ మెగా డ్రోన్ల షోపై మంగళవారం మంత్రి శ్రీనివాసగౌడ్ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. డ్రోన్లషోను టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్‌తో కలిసి పరిశీలించా రు. వివిధ జిల్లాల్లో 400 డ్రోన్లతో లేజర్ షో నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా మహబూబ్‌నగర్‌లో, తర్వాత వరంగల్, సిద్దిపేట, నిజా మాబాద్, ఖమ్మం జిల్లాలో లేజర్ షో ప్రదర్శిస్తామన్నారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ, డీజీపీ పరిశీలన బహిరంగసభను నిర్వహించనున్న ప్రాంతాన్ని మంత్రులు తలసాని, మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సభలో కేసీఆర్ ప్రసంగిస్తా రని తలసాని చెప్పారు. సభ ఏర్పాట్లకు సంబంధించిన మంత్రులు అధికారులకు తగిన సూచనలు చేశారు. దేవాలయాల్లో నిత్య పూజలు ఎలా జరుగుతాయో, తెలంగాణను కలను సాకారం చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన తెలంగాణ అమరవీరులకు నిత్య నీరాజనాలు పలికే తరహాలో ఈ నిర్మాణానికి ముఖ్యమంత్రి దీనికి డిజైన్ చేశారు. ఆయన ఆలోచనలకు తగ్గ రీతిలో దీన్ని రూపొందించాం. ఆ నిర్మాణంలో కీలక భూమిక పోషించే అవకాశం నాకు రావటం గర్వంగా అనిపిస్తోంది. ఢిల్లీకి వచ్చే ప్రముఖులు బాపూ సమాధి వద్ద ఎలా నివాళులు అరి్పస్తారో, అదే తరహాలో.. నగరానికి వచ్చే ప్రముఖులు తెలంగాణ అమరుల స్మారకం వద్ద నివాళులు అరి్పంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి -
తెలంగాణ ఔన్నత్యం.. పాలన వేగం
సాక్షి, హైదరాబాద్: దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిన తెలంగాణ ఔన్నత్యాన్ని దేశం ముందు సగర్వంగా నిలిపేలా.. ప్రజలకు పాలన అత్యంత వేగంగా అందేలా.. ఆధునిక సచివాలయ భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక్కో కార్యాలయం ఒక్కోచోట ఉండి ఫైళ్లు కదిలేందుకు రోజుల సమయం పట్టే పరిస్థితిని మార్చుతున్నామని చెప్పారు. వాన నీళ్లు కారుతూ, ఎప్పుడు కూలుతాయో తెలియని భవనాల స్థానంలో.. మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులు అంతా ఒకేచోట ఉండేలా సమీకృత సచివాలయం ప్రజల ముంగిటికి వస్తోందన్నారు. కొత్త సచివాలయం నిర్మాణ ఆలోచన మొదలు.. ప్రారంభోత్సవం దాకా కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్‌రెడ్డి గురువారం రాత్రి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే.. ‘‘ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచింది. అన్ని రాష్ట్రాలు మనవైపు చూస్తున్న తరుణంలో తెలంగాణ స్థాయికి తగ్గ సచివాలయ భవనం అవసరమని సీఎం కేసీఆర్ భావించారు. అసౌకర్యాలతో ఉన్న పాత సచివాలయ భవనాలు, మంత్రి ఓచోట, అధికారులు ఓచోట ఉండే అస్తవ్యస్థ పరిస్థితిని సరిదిద్దే ఆలోచన చేశారు. సచివాలయ భవనం ఎలా ఉండాలనే ప్లాన్ అంతా సీఎందే. ఆయన సూచనల మేరకే భవనం ఇంత అద్భుతంగా సిద్ధమైంది. రాత్రింబవళ్లు కష్టపడి కేవలం 26 నెలల్లో దీనిని సిద్ధం చేశాం. పునాది రాయి వేసిన రోజే.. భవనానికి అవసరమైన సామగ్రి అంతటికి వెంటనే ఆర్డర్ ఇచ్చి సమకూర్చుకోవాలని.. అన్ని పనులను ఒకే ఏజెన్సీ ద్వారా చేయాలని కేసీఆర్ సూచించారు. దీనితో నిర్మాణంలో జాప్యం లేకుండా 26 నెలల్లో పూర్తయింది. లేకుంటే ఐదేళ్లకంటే ఎక్కువ కాలం పట్టేది. విమర్శలను పట్టించుకోం ఉన్న భవనాలను కూల్చికట్టారని, అనవసరంగా భారీ వ్యయం చేశారని, గుమ్మటాల నిర్మాణ శైలిని అనుసరించారని.. ఇలాంటి విమర్శలను పట్టించుకోం. ప్రజలకు పాలన ఫలితాలు వెంటనే అందేందుకు, తెలంగాణ ఔన్నత్యం ఇనుమడింపచేసేందుకు కొత్త సచివాలయం నిర్మించాం. దీనికి అయిన ఖర్చుతో పోల్చుకుంటే కొన్ని వందల రెట్లు ప్రజలకు మేలు జరగబోతోంది. అంబేడ్కర్‌కు, అమరవీరులకు మధ్య.. ఇటీవలే ఆకాశమంత అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆవిర్భావం కోసం అమరులైన వీరులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించుకున్నాం. దాన్ని జూన్ 2న ప్రారంభించనున్నాం. ఈ రెండింటికీ మధ్య కొత్త రాష్ట్ర ప్రధాన పాలనా భవనాన్ని నిర్మించుకున్నాం. ఈ నెల 30న ప్రారంభించుకోబోతున్నాం. ఇక ఆస్పత్రులపై దృష్టి.. సచివాలయ భవనం ప్రారంభమయ్యాక.. ఆస్పత్రులపై దృష్టి పెట్టబోతున్నాం. త్వరలో 24 అంతస్తులతో అతి గొప్పగా, దేశం మొత్తం మనవైపు చూసేస్థాయిలో వరంగల్‌లో ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించుకోనున్నాం. దానితోపాటు హైదరాబాద్ నలుదిక్కులా కొత్త మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను సిద్ధం చేసుకుంటాం. కేసీఆర్ మొదటి టర్మ్ పాలనలో సాగు, తాగునీరు, కరెంటు లక్ష్యంగా ప్రణాళికలు అమలయ్యాయి. రెండో విడతలో విద్య, వైద్యం లక్ష్యాలుగా పాలన సాగుతోంది. రీజనల్ రింగురోడ్డు విషయంలో కేంద్రం పేచీ ఆర్ఆర్ఆర్ను పట్టాలెక్కించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ కావాలనే కేంద్రం పేచీ ధోరణితో వ్యవహరిస్తోంది. భూసేకరణ కాకుండానే 50% రాష్ట్ర వాటా డబ్బు కట్టాలని వింత వాదనకు దిగింది. ఏ ప్రాజెక్టులోనూ∙అలా ఉండదు. అయినా మంచి ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పేచీ వద్దని, అవార్డ్ పాస్ చేయకుండానే రూ.100 కోట్లు చెల్లించాలని సీఎం చెప్పడంతో నిధులు విడుదల చేశాం. ఆర్ఆర్ఆర్ను వేగంగా చేపట్టేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నీలేష్ , గోపాల్, డాక్యా, రాజేందర్లు ఈ నెల 4న రాత్రి హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేసినప్పుడు వారిని మరో ఇద్దరు అభ్యర్థులు కలిసి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలతో గుర్తించారు. వారిని నవాబ్‌పేట్, షాద్‌నగర్ ప్రాంతాలకు చెందిన ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్గా నిర్ధారించారు. డాక్యా, రేణుకల విచారణలోనూ ఇదే విషయం రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ అభ్యర్థులిద్దరూ ప్రశ్నపత్రాన్ని రూ.18 లక్షలకు కొనేందుకు డాక్యా, ఇతరులతో ఒప్పందం కుదుర్చుకొని రూ.10 లక్షల వరకు చెల్లించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మహబూబ్‌నగర్‌లోని సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్యతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తిరుపతయ్య... ప్రశాంత్, రాజేంద్రకుమార్లతోపాటు పలువురు ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు ఏఈ ప్రశ్నపత్రం విక్రయంలో దళారిగా వ్యవహరించాడని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి ఆధారాలు లభించాక అతనితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తోంది. మరోవైపు గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల విచారణ కొనసాగుతోంది. ఆదివారం మరో 20 మంది అభ్యర్థులను అధికారులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు విచారించిన వారి సంఖ్య 50 దాటింది. అడ్డదారి తొక్కి.. అడ్డంగా బుక్కయ్యి.. షాద్‌నగర్ రూరల్: సిట్ అధికారులు తాజాగా అరెస్టు చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన రాజేంద్రకుమార్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని నేరేళ్ల చెరువు గ్రామం. నిరుపేదలైన లక్ష్మయ్య, లక్ష్మీదేవమ్మ దంపతుల నలుగురు సంతానంలో అతను పెద్ద కొడుకు. రాజేంద్రకుమార్ కొన్నేళ్లు ఉపాధి హామీ పథకంలో పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కోసం అప్పులు చేసి హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. అయితే కచ్చి తంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడంతోపాటు ఇతరుల వద్ద అప్పు చేసి రూ.5 లక్షలకు డాక్యా నాయక్ ద్వారా ఏఈఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ బండారాన్ని సిట్ నిగ్గుతేల్చడంతో అడ్డంగా బుక్కయ్యాడు. 8 గంటలపాటు నిందితుల విచారణ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో కోర్టు అదనపు కస్టడీకి అనుమతించడంతో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు వారిని ప్రశ్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయం నుంచి సీసీఎస్‌కు తరలించారు. సోమ, మంగళవారాల్లోనూ వారిని విచారించనున్నారు. -
Telangana: బడ్జెట్ రూ. 2.9 లక్షల కోట్లు.!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) గాను రూ.2.9 లక్షల కోట్ల వరకు అంచనాలతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 2022–23కు రూ.2.56 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈసారి ఆ మొత్తానికి 10 శాతం కంటే కొంచెం ఎక్కువగా రూ. 2.9 లక్షల కోట్ల వరకు బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించనుందని సమాచారం. ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమం, అభివృద్ధిని యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని కొత్త పథకాలను జోడిస్తూ ప్రజారంజక బడ్జెట్ పెట్టే కసరత్తు పూర్తయిందని, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ పెట్టే అవకాశాలున్నాయని ఆర్థికశాఖ వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత శాసనమండలిలో రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. సాగునీటికి, సంక్షేమానికి భారీగానే.. గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ మార్కుతో అమలవుతోన్న సంక్షేమ పథకాలన్నీ ఎన్నికల ఏడాదిలో యథాతథంగా కొనసాగేలా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈ పథకాలకు తోడు విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, మన ఊరు–మన బడి లాంటి పథకాలకు ప్రత్యేక కేటాయింపులు ఈ బడ్జెట్లో ఉండనున్నాయని ఆర్థికశాఖ వర్గాలంటున్నాయి. వీటి తో పాటు సాగునీటి రంగానికి కూడా ఈసారి భారీ బడ్జెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులు ఈ ఏడాది నుంచే తిరిగి చెల్లించాల్సి ఉండడంతో దాని కోసం, పాలమూరు–రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు, ఆగిపోయిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసి ఎన్నికల నాటికి ప్రజలకు అందించేలా.. రూ.35 వేల కోట్లకు పైగా సాగునీటి రంగానికి ప్రతి పాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుబంధు లాంటి ప్రతిష్టాత్మక పథకం కొనసాగింపుతో పాటు కొత్తగా పంటల బీమా పథకం అమలు చేసేందుకు గాను ఈసారి వ్యవసాయానికి రూ.25 వేల కోట్ల వరకు కేటాయింపులుంటాయని తెలుస్తోంది. పంటల బీమా పథకం కోసం రూ.1,200 కోట్లు, రైతు బంధు పథకం కింద రూ. 8 వేల కోట్ల వరకు ప్రతి పాదించనున్నట్టు సమాచారం. ఇక దళిత బంధుకు గత ఏడాది పెట్టిన బడ్జెట్లో ఖర్చు కాకుండా మిగి లిన మొత్తాన్ని ఈ ఏడాదికి బదలాయిస్తూ రూ.20 వేల కోట్ల వరకు కేటాయింపుల్ని ఈ పథకానికి చూపెట్టనున్నట్టు తెలుస్తోంది. దళిత బంధు తరహా లోనే గిరిజన బంధును రూ. 5 వేల కోట్లు (అంచనా) కూడా ప్రకటించే అవకాశముందని, అయితే గిరిజన బంధుకు మార్గదర్శకాలు కూడా సిద్ధం కాని నేపథ్యంలో ఎన్నికల నాటికి బడ్జెట్‌ను ఖర్చు పెట్టగలిగేందుకు ఉన్న అవకాశాలను బట్టి ఈ పథకాన్ని బడ్జెట్లో పొందుపరిచే అవకాశాలున్నాయని గిరిజన సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సొంత రాబడులపైనే ఆశలు.. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంపైనే ఆధారపడి బడ్జెట్ కేటాయింపులు ప్రతిపాదించనున్నట్టు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.08 లక్షల కోట్ల వరకు పన్ను రాబడులు అంచనా వేయగా, అంచనాలకు తగ్గట్టునే ఈ ఏడాది పన్ను ఆదాయం రూ.లక్ష కోట్లు దాటనుంది. ఈ నేపథ్యంలో సొంత పన్నులు.. ముఖ్యంగా ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని గత బడ్జెట్ కంటే 10%నికి పైగా ఎక్కువ అంచనాలను రూపొందించినట్టు సమాచారం. అప్పుల విషయానికొస్తే ఎఫ్ఆర్బీఎం చట్ట నిబంధనల మేరకు జీఎస్డీపీలో 3.5% వరకు ప్రతిపాదించనున్నారు. ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం అమలు కోసం ఉద్యోగుల భాగస్వామ్యంతో కొత్త పథకాన్ని అమలు చేసే యోచనలో భాగంగా రూ.750 కోట్ల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో తన వాటాగా రూ.350 కోట్లు ప్రతిపాదించనున్నట్లు సమాచారం. గత బడ్జెట్ తరహాలోనే సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల పథకం కింద రూ.12 వేల కోట్లు, ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల అభివృద్ధి నిధుల కోసం రాష్ట్రంలోని 12 వేల గ్రామ పంచాయతీలకు రూ.1200 కోట్లు కేటాయింనున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలను కొనసాగించనున్నారు. ఆసరా పింఛన్లకు రూ.15 వేల కోట్ల వరకు ప్రతిపాదించనున్నారు. ఇక ఎన్నికల హామీలో నెరవేర్చడంలో భాగంగా రూ.లక్షలోపు రైతు రుణమాఫీకి ఈసారి నిధులు కేటాయిస్తారని, ఈ పద్దు కింద రూ.20 వేల కోట్లు అవసరమవుతాయనే చర్చ జరుగుతోంది. విద్యుత్ సబ్సిడీలు, ఆర్టీసీకి ఆసరా కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు చూపెట్టనున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల పద్దుకు రూ.30 వేల కోట్లు, అప్పులు, వడ్డీల చెల్లింపునకు రూ.25 వేల కోట్ల వరకు కేటాయించనున్నట్టు సమాచారం. కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాలపై ఆసక్తి కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద భారీగా అంచనాలు ప్రతిపాదించడం, కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు రాక డీలా పడిపోవడం ఆనవాయితీగా మారిపోయింది. గత ఏడాది రూ.38 వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వస్తాయని ఆశించినా రూ.10 వేల కోట్లు కూడా రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ అంచనాలు రూ.40 వేల కోట్లు దాటినా, ఈసారి కూడా గత ఏడాదిలాగానే మంజూరయ్యాయి. దీంతో ఈసారి గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా పద్దుల కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంత అంచనా వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి కేసీఆర్ మార్కు బడ్జెట్ అంకెలు ఉంటాయని, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.3 లక్షలు దాటిన నేపథ్యంలో బడ్జెట్ అంచనాలు కూడా రూ.3 లక్షల కోట్లు ఉంటాయనే ప్రచారం జరిగినా, వాస్తవికతకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకెళ్లనుందని సమాచారం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ అంచనా వేసినా.. అప్పులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకాల్లో కేంద్రం నిధుల కోత పెట్టిన కారణంగా సవరించిన అంచనాలు రూ.2.25 లక్షల కోట్లకు పరిమితమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
టీఎస్ అసెంబ్లీ: అక్బరుద్దీన్ Vs కేసీఆర్ సర్కార్.. హీటెక్కిన సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసనసభ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించిందా? అని ప్రశ్నించారు. కాగా, అక్బరుద్దీన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటూ ఎందుకు నిలదీయలేదు?. గవర్నర్ ఏమైనా మార్పులు, చేర్పులు సూచించారా?. గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించిందా?. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా ఉంది అని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఆరోపణలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. కేబినెట్లో జరిగిన ప్రతీ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇస్తారు.. అమలు చేయరు. చర్చ సమయంలో సభా నాయకుడు కనిపించడం లేదు. సీఎం కేసీఆర్, మంత్రులు ఎవరినీ కలవరు. పాతబస్తీకి మెట్రో రైలు ఏమైంది?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితేంటి?. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టీవీ డిబెట్లకు వెళ్లే టైముంది.. కానీ, సభకు వచ్చే సమయం లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదు?. అక్బరుద్దీన్ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు. సభా నాయకుడితో ఒవైసీకి ఏం సంబంధం?. ఏవైనా సమస్యలు ఉంటే బడ్జెట్ సెషన్లో చెప్పుకోవాలి. ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు అంటూ కౌంటర్ ఇచ్చారు. -
అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ రావు. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు సోమవారం రాజ్ భవన్‌కు చేరుకొని గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసైతో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్‌రావు భేటీ అయ్యారు. కాగా గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. గవర్నర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరఫు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. -
తెలంగాణ సచివాలయానికి ముహుర్తం ఖరారు
-
కేసీఆర్ జన్మదినం రోజున సచివాలయం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్ట ర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవన ప్రారంభబోత్సవం ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభ తేదీని ఖరారు చేయ డంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి సీఎం జన్మదినం నాటికి భవ నాన్ని సిద్ధం చేయడంపై అధికారులు దృష్టి సారించారు. రూ.617 కోట్ల వ్య యంతో నిర్మిస్తున్న ఈ సచివాలయ పనులకు 2019 జూన్‌లో సీఎం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. పనులను పరిశీలించిన మంత్రి: ఉమ్మడి రాష్ట్రంలో పలు భవనాలతో కూడిన సచివాలయ సముదాయం సేవలందించగా, అవి విడివిడిగా ఉండటం అంత అనుకూలంగా లేదన్న కారణంతో వాటిని కూల్చేసి 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ ప్లస్ 6 అంతస్తులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని తరహాలో అత్యంత విశాలంగా, పూర్తి ఆధునిక వసతులతో చేపట్టారు. గతేడాది దసరాకు ప్రారంభించాలనుకున్నా పనులు పూర్తి కాలేదు. తాజాగా సంక్రాంతికి అనుకున్నా సిద్ధం కాలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 17ను ముహూర్తంగా ఖరారు చేయడం విశేషం. అప్పటివరకు పనులు పూర్తి కావడం కొంత ఇబ్బందిగానే ఉన్నా పది రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. ఇండో–పర్షియన్ నమూనాలో...: గతంలో భాగ్యనగరంలో ఇండో–పర్షియన్ నమూనాలో గుమ్మటాలతో హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి సహా ఎన్నో భవనాలు నిజాం కాలంలో రూపుదిద్దుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అదే నమూనాలో కొత్త సచివాలయ భవనం సిద్ధమవుతోంది. ఈ నిర్మాణంలో కాకతీయ శైలి కూడా ఉందని నిర్మాణ సంస్థ చెబుతోంది. ఈ భవనంలో 34 గుమ్మటాలను తీర్చిదిద్దారు. ఇందులో రెండు గుమ్మటాలు 82 అడుగుల ఎత్తుండటం విశేషం. మధ్యలో కోర్ట్‌యార్డు.. దానికి ముందు వెనక రెండు బ్లాకులపై ఉండే ఈ భారీ గుమ్మటాలపై నాలుగు సింహాలుండే అశోక చిహ్నం ఏర్పాటు చేశారు. ►ఈ ప్రాంగణం 28 ఎకరాల్లో విస్తరించి ఉంది. కోర్టు యార్డు లాన్ రెండు ఎకరాల్లో ఉండగా, భవనం ముందువైపు ఐదెకరాల్లో పచ్చిక బయళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ముందు పచ్చికలో రెండు వైపులా పార్లమెంటు ముందున్న ఫౌంటెయిన్ నమూనాలో రెండు ఫౌంటెయిన్లు ఏర్పాటు చేశారు. ►ప్రధాన భవనం 265 అడుగుల ఎత్తుంటుంది. ప్రధా న గుమ్మటాలుండే సెంట్రల్ టవర్ 8 అంతస్తులుగా ఉంటుంది. ముఖ్య మంత్రి కార్యాలయం, కేబినెట్ సమా వేశ మందిరం ఆరో అంతస్తులో ఉంటాయి. ►రెండు నుంచి ఐదో అంతస్తు వరకు ప్రతి ఫ్లోర్లో నాలుగు చొప్పున మంత్రులు, కేబినెట్ ర్యాంకులో ఉండే ముఖ్యుల కార్యాలయా లుంటాయి. ఒకటి, రెండు అంతస్తు ల్లో జీఏడీ, ఆర్థిక శాఖ కార్యాలయా లుంటాయి. ►ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శు లకు 59 కార్యాలయాలు సిద్ధం చేశా రు. అదనపు, ఉప, సహ కార్యదర్శు లకు 90 గదులు, సహాయ కార్యదర్శి స్థాయి వారి కోసం 121 కార్యాల యాలు ఏర్పాటు చేశారు. ఇతర సిబ్బందికి 1,550 గదులు ఏర్పాటు చేశారు. ►ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన ద్వారాన్ని, 2 లిఫ్టులను ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రులకు విడిగా పార్కింగ్ వసతి కల్పించారు. ∙బిర్లామందిర్ రోడ్డు వైపు దేవాలయాన్ని, వెనకవైపు చర్చి, మసీదులను నిర్మిస్తున్నారు. -
రాజకీయాలకు కళంకం అరవింద్ జీవితం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
-
మంత్రి నివాసంలో హౌస్ కీపర్ ఆత్మహత్య
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో హౌస్ కీపర్‌గా పనిచేసే ఇంటెనుక దేవేందర్ (18) అనే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే అతని బలవన్మరణానికి కారణమని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వేల్పూర్‌లోని మంత్రి ప్రశాంత్‌రెడ్డి నివాసంలో ఇద్దరు హౌస్ కీపర్లు పనిచేస్తున్నారు. మరో హౌజ్ కీపర్ గంగారాం.. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి శనివారం వేరే గ్రామానికి వెళ్లగా.. దేవేందర్ మంత్రి ఇంట్లోనే ఉన్నాడు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చిన గంగారాం ఎంత పిలిచినా దేవేందర్ స్పందించకపోవడంతో చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూడగా కింది అంతస్తులోని మంత్రి కార్యాలయంలో ఫ్యాన్‌కు వేలాడుతూ దేవేందర్ మృతదేహం కనిపించింది. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్‌రావు, ఎస్సై వినయ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు దేవేందర్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. ఓ స్త్రీతో ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఏసీపీ ప్రభాకర్‌రావు తెలిపారు. కొంతకాలంగా ఓ మహిళతో ప్రేమలో ఉన్న దేవేందర్.. వారం రోజులుగా తన వాట్సాప్ స్టేటస్‌లో ‘రిప్’అని పెట్టుకుంటున్నట్లు తెలిసిందన్నారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమెతో వాట్సాప్‌లో చాటింగ్ చేశాడని, నేను వెళ్తున్నా.. ప్రశాంతంగా ఉండు అని మెస్సేజ్ చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
గడ్కరీ కార్యక్రమంలో జైశ్రీరామ్ నినాదాలు
హైదరాబాద్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తాయి. ఓ కార్యక్రమం కోసం గడ్కరీ హైదరాబాద్‌కు వచ్చారు. మైకులో తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా.. ‘జై శ్రీరామ్, భారత్‌మాతాకి జై’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని వారించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేశారు. శుక్రవారం జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కేంద్రమే కొనాలి: మంత్రి వేముల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పంజాబ్ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో రైతులు పెద్దఎత్తున వరి పండిస్తున్నారన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 2014లో 4.29లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇప్పుడు రెట్టింపు స్థాయిలో 7.14లక్షల ఎకరాల్లో పండిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరిత వైఖరి మానుకోవాలని హితవు పలికారు. జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. యాసంగిలో తెలంగాణ రైతులు సాగు చేసిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరుతూ చైర్మన్ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.