
స్టేషన్‌ఘన్‌పూర్: పేదల సొంతింటి కలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్‌లో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇళ్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.18 వేల కోట్లతో 2 లక్షల 83 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారని, లక్షా 30 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా రూ.7,700 కోట్లు ఖర్చు చేశారన్నారు. సీఎం ఇచ్చిన మాట తప్పరని, ఏది చెప్పారో అదే చేస్తారని అన్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు అవుతాయని, ఎవ్వరూ నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment