
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ట్రీపుల్‌ఆర్‌పై కాంగ్రెస్‌ది అసత్య ప్రచారమంటూ ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ కోసం కష్టపడింది బీఆర్‌ఎస్సే. 15 నెల్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. 2017లో అనుమతి వస్తే అప్పుడే ఆగిపోయిందని ప్రచారమా? అంటూ ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడుతూ.. ట్రిపుల్ ఆర్‌పై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. ‘‘మేం ఓఆర్‌ఆర్ కడితే మీరు అమ్ముకున్నారు. ఎన్నికల ముందు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి తెచ్చారు. 2014 నుంచి మీరు వేసిన రోడ్లకు డబ్బుకు మేం కడుతున్నామని కోమటిరెడ్డి అన్నారు.
మన ఊరు-మన బడి పథకంలో భారీ స్కాం: అక్బరుద్దీన్ ఓవైసీ
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగిందన్నారు. ‘మన ఊరు మన బడిలో ఏ పని జరగలేదు. జరిగిన దానికి నిధులు విడుదల కాలేదు. మన ఊరు-మన బడి పథకంలో బెంచీల కొనుగోళ్లలో స్కాం జరిగింది. ఈ స్కాం పై ప్రశ్న వేద్దాం అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. 14, 18, 20 వేల ఒక్కో బెంచ్ కొన్నారు. బెంచీల కొనుగోళ్ల పై ఈ ప్రభుత్వం విచారణ చేయించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
నేను పేర్లు చెప్పలేని...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం. నిధులను లూటీ చేశారు.. 32లక్షల బెంచీలను కొనుగోలు చేశారు. ఐదు వేలకు ఒక బెంచ్ వస్తది. 20 వేల పెట్టీ కొన్నారు. పెద్ద స్కాం చేశారు...అప్పుడు బీఆర్‌ఎస్‌తో ఉన్నారు.. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు.’’ అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment