ాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి, హరీష్‌రావు మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. హరీష్‌రావు ఏ హోదాలో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ హీట్ నెలకొంది.
తెలంగాణలో ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. అనంతరం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందిస్తూ.. ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీదే మూసీ పాపం. కాళేశ్వరం జలాలను నల్లగొండకు అందించామన్నారు. దీంతో, కోమటిరెడ్డి.. హరీష్ వ్యాఖ్యలు మండిపడ్డారు.
Are You a Deputy Leader or an MLA?
-- Harish Rao Questioned by Minister Komatireddy
మీకు LP లీడర్ లేడు
హరీష్ రావు..
నువ్వు డిప్యూటీ లీడర్ వా..?
లేక శాసనసభ్యుడిగా...??
అసలు ఏ హోదాలో నువ్వు మైక్ అడుగుతున్నావ్
-- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి#TelanganaAssembly
•… pic.twitter.com/zjt3SUAHEG— Congress for Telangana (@Congress4TS) December 19, 2024
అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అసలు హరీష్‌రావు ఎవరు?. డిప్యూటీ లీడర్‌నా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారు?. ఆయనకు అడిగే హక్కు లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారు? తెలంగాణ ప్రజలను ఆయన అవమానపరచడమే అవుతుంది. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్లు హైదరాబాద్ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ మూసీని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా సభలో వీరద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. అంతకుముందు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. రైతు సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment