గత ప్రభుత్వంలో స్కాములు తప్ప అభివృద్ధి లేదు | Mother Dairy Ghee for Yadadri Lakshmi Narasimha Swamy: Komatireddy Venkat Reddy | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వంలో స్కాములు తప్ప అభివృద్ధి లేదు

Published Sun, Sep 15 2024 6:19 AM | Last Updated on Sun, Sep 15 2024 6:19 AM

Mother Dairy Ghee for Yadadri Lakshmi Narasimha Swamy: Komatireddy Venkat Reddy

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

లింగోజిగూడ: గత ప్రభుత్వ పాలనలో స్కాము లు తప్ప అభివృద్ధి జరగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం మదర్‌ డెయిరీ ఎన్నికల్లో ఆరు డైరెక్టర్‌ పోస్టులను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో శనివారం నూతన చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమాన్ని హయత్‌నగర్‌ మదర్‌ డెయిరీలో నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నూతన చైర్మన్‌గా ఎన్నికైన గుడిపాటి మధుసూదన్‌రెడ్డితో పాటు గెలుపొందిన డైరెక్టర్లకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు బినామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాలలో లడ్డూల తయారీకి హరీశ్‌రావు తన బినామీ కంపెనీల ద్వారా నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ఇక నుంచి దేవాలయాలకు అవసరమైన నెయ్యి, పాలను మదర్‌ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని మంత్రి కొండా సురేఖను కోరతానని ఆయన తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement