yadadri
-
యాదాద్రి పేరు మార్పు..రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
-
కృష్ణాతీరంలో జెన్కో టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కృష్ణానది వెంట కొత్త పట్టణం నిర్మాణం కానున్నది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలో రూ.928.52 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు. టెక్నికల్ బిడ్లను వచ్చే నెల 3న, ప్రైస్ బిడ్లను 7న తెరిచి టెండర్లను ఖరారు చేయనున్నారు. సంగమ క్షేత్రంలో కొత్త పట్టణం కృష్ణా నదిలో తుంగపాడు వాగు కలిసే చోట ఈ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించారు. డిజై న్లు, డ్రాయింగ్స్ ప్రకారం మొత్తం 3,52,771.02 చ.మీ.ల విస్తీర్ణంలో టౌన్íÙప్ నిర్మాణం జరుగుతుంది. 2,21,903.67 చ.మీ.ల విస్తీర్ణంలో నివా స గృహసముదాయాలతో లేఅవుట్‌ను తయా రు చేశారు. 75,185 చ.మీ.ల విస్తీర్ణంలో పార్కు లు, మొక్కల పెంపకం, పచ్చిక బయళ్లు, మరో 55,682.35 చ.మీ.ల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటుచేస్తారు.2025 మార్చి నాటికి 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మి కులు ఇక్కడ రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. వీరంతా తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో టౌన్‌షిప్‌ను జెన్కో నిర్మిస్తోంది. ఉన్నతాధికారుల కోసం ‘ఏ’–టైప్‌లో రెండు ఇండిపెండెంట్ క్వార్టర్లను, ‘బీ’–టైప్‌లో 6 ఇండిపెండెంట్ క్వార్టర్లను నిర్మిస్తున్నారు. అధికారులకు ‘డీ’, ‘ఈ’టైప్ క్వా ర్టర్లను, కార్మి కులకు ‘ఎఫ్’టైప్ క్వార్టర్లను కేటాయిస్తారు. ఈ భవనాలు 11 అంతస్తుల ఎత్తు ఉంటాయి. డీ, ఈ–టైప్ క్వార్టర్ల కోసం రెండు భవనాలు ఉంటాయి. వీటిల్లో 360 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఎఫ్–టైప్ క్వార్టర్లలో 1,350 ఫ్లాట్లు కలిపి మొత్తం 2,970 ఫ్లాట్లను నిర్మించనున్నారు. సకల సదుపాయాలు టౌన్షిప్లో ఉద్యోగులకు సకల సదుపాయాలు కల్పిస్తారు. అగ్నిమాపక కేంద్రం, ఆస్పత్రి, పాఠశాల భవనాలు, క్లబ్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ రూమ్స్, మెయింటెనెన్స్ ఆఫీస్, రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్స్, సెప్టిక్ ట్యాంక్స్, పార్కింగ్ షెడ్స్, పచ్చదనం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, తుంగపాడు వాగుపై బ్రిడ్జీ, కాంపౌండ్ వాల్, టౌన్‌షిప్‌కు అప్రోచ్ రోడ్డును ఈ ప్రాజెక్టులో భాగంగా జెన్కో నిర్మిస్తోంది. టౌన్షిప్ నుంచి విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేయడానికి రోజుకు 1,000 కిలో లీటర్ల శుద్ధి సామర్థ్యంతో సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను సైతం నిర్మిస్తోంది. కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించిన తర్వాత 30 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ నోటిఫికేషన్లో జెన్కో తెలిపింది. -
యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు.. ప్రతిరోజూ సత్యనారాయణస్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ సన్నిధిలోని తన చాంబర్లో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఈమేరకు కొండ కింద వ్రత మండపంలో డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్యాచ్‌లుగా వ్రతాల నిర్వహణ ఉంటుందన్నారు.వచ్చే నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నెల రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 బ్యాచ్‌లు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 6 బ్యాచ్‌లుగా వ్రతాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 15వ తేదీన ప్రధానాలయం, శివాలయంలో రాత్రి 6.30 గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని తెలిపారు. చదవండి: పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనంఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఆలయ నిత్య కైంకర్య వేళల్లో మార్పులు చేశామని చెప్పారు. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుందన్నారు. 4.15 గంటల నుంచి 4.45 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు మంగళహారతుల పూజ జరుగుతుందని, ఉదయం 8.15 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
గత ప్రభుత్వంలో స్కాములు తప్ప అభివృద్ధి లేదు
లింగోజిగూడ: గత ప్రభుత్వ పాలనలో స్కాము లు తప్ప అభివృద్ధి జరగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం మదర్ డెయిరీ ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ పోస్టులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో శనివారం నూతన చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని హయత్‌నగర్ మదర్ డెయిరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నూతన చైర్మన్‌గా ఎన్నికైన గుడిపాటి మధుసూదన్‌రెడ్డితో పాటు గెలుపొందిన డైరెక్టర్లకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు బినామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాలలో లడ్డూల తయారీకి హరీశ్‌రావు తన బినామీ కంపెనీల ద్వారా నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ఇక నుంచి దేవాలయాలకు అవసరమైన నెయ్యి, పాలను మదర్ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని మంత్రి కొండా సురేఖను కోరతానని ఆయన తెలిపారు. -
రెండు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
శంషాబాద్/ఆత్మకూర్: రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ సమేతంగా దైవదర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమైన వారిని కారు రూపంలో మృత్యువు వెంటాడింది. హైదరాబాద్‌లోని చిన్నగోల్కొండ ఫ్లైఓవర్‌పై గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌సహా ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన తెలుగు రాజేష్ కుటుంబసభ్యులు ప్రతి ఏడాది శ్రావణమాసం రెండవ గురువారం యాదాద్రి దర్శనానికి వెళతారు. ఈ ఏడాది కూడా యాదాద్రి దర్శనానికి బుధవారం రాజేష్ కుటుంబసభ్యులతో పాటు కర్నూల్‌కు చెందిన అత్తమామలతో కలిపి మొత్తం 19 మంది రెండు వాహనాల్లో బయలుదేరారు. గురువారం ఉదయం 11 గంటలకు దైవదర్శనం చేసుకొని..మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఓ కారు ముందుగా ఓ కారును ఢీకొట్టి..ఆపై పక్కనే ఉన్న తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో పల్టీ లు కొట్టింది. తుఫాన్ వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ తాజుద్దీన్ (40)తో పాటు రాజేష్ భార్య సోదరి వరలక్ష్మి (44), ఆమె మనవడు 2 నెలల బాబు అక్కడికక్కడే మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరో బాలిక సాయిదీక్షిత (13) కోమాలోకి వెళ్లింది. చంద్రశేఖర్, మణెమ్మ, అర్చనలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతితో ఆత్మకూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్ నుంచి వచ్చిన ఆ కారుతోనే.. ప్రమాదానికి కారణమైన కారులో ఆరుగురు ఉన్నారు. విదేశాలకు వెళుతున్న వారికి సెండాఫ్ ఇవ్వడానికి ఆరుగురు ఆ కారులో కరీంనగర్‌కు వచ్చి వస్తున్నారు. వారిలో ముగ్గురు మద్యం సేవించినట్టు పోలీసుల పరీక్షలో తేలింది. కారులో ఉన్న వారిలో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కారులో ఉన్న వారిని విచారిస్తున్నట్టు తెలిపారు. కళ్ల ముందే.. మా జీపును కారు ఒక్కసారిగా ఢీకొట్టడంతో బోల్తా పడింది. లోపల అందరం చిందరవందర అయ్యాం. కొందరు బయటపడ్డారు. నా కూతురు దీక్షిత తలకు పెద్దదెబ్బ తగిలింది. ఆరు నెలల క్రితమే నా భర్త చనిపోయాడు. ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఏమవుతోందో. – నవనీత ఒక్కసారి భయమేసింది ప్రమాదంతో జీపులోపల అందరం ఒకరినొకరం గుద్దుకున్నాం. నాకు తలకు దెబ్బ తగిలింది. చిన్నోడు చనిపోయాడు. మా చెల్లికి దీక్షిత తలకు గాయమైంది. దీంతో నాకు ఒక్కసారిగా భయమేసింది. – సాయిహర్షిత -
సాక్షి టీవీ ఎఫెక్ట్.. ఉరుకొచ్చిన అధికారులు
-
ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని!
సాక్షి, యాదాద్రి జిల్లా: ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుంచి 500 మించి రాదు. మహా అయితే వెయ్యి రూపాయలు వస్తుందేమో. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. మండుటెండలో ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి చెమటలు పట్టడమే కాకుండా.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన డీ పరశురాములు ఇంటికి విద్యుత్తు బిల్లు రీడింగ్ తీసేందుకు సోమవారం ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్ నంబర్.. సోమవారం మీటర్ రీడింగ్‌ను స్కాన్ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్‌కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్‌ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఆయన పేర్కొన్నారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లెకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా(25) గుర్తించారు.గుంటిపల్లి సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. చదువుతోపాటు పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తోంది. ఈ క్రంమలో ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సౌమ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో యాదగిరిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
-
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
-
రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
యాదాద్రి భువనగిరి, సాక్షి: పది వేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి అది. నెలలు కూడా నిండని తమ బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోట్లలో ఖరీదు చేసే ఇంజెక్షన్ కోసం సగానికి పైగా సాయం సమకూరగా.. మిగిలిన సాయం అందేలోపే పరిస్థితి విషమించింది. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన ఆరు నెలల చిన్నారి భవిక్‌రెడ్డి అరుదైన జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) బాధపడ్డాడు. ఆ పసికందు బతకాలంటే రూ.16 కోట్లు ఇంజెక్షన్ అవసరం. తండ్రి దిలీప్ ఎలక్ట్రిషీయిన్. దీంతో ఖరీదైన చికిత్స ఆ కుటుంబానికి కష్టం తెచ్చి పెట్టింది. అయితే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. దాని ద్వారా విదేశాల నుంచి రూ.10 కోట్లు సమకూరగా.. మరో ఆరు కోట్ల సాయం కోసం దాతల్ని ఆశ్రయించారు ఆ తల్లిదండ్రులు. సాక్షి సైతం నిన్న(మే 16 గురువారం) ఆ వార్తను ప్రచురించి.. దాతల కోసం పిలుపు ఇచ్చింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవిక్ కన్నుమూశాడు. ఖరీదైన ఇంజెక్షన్ కోసం సగం కంటే ఎక్కువ సాయం సమకూరినా.. మిగిలిన సాయం కోసం సమకూరేలోపే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి.ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ. ఈ జన్యులోపం అందరిలో కనిపించదు. తల్లిదండ్రులు క్యారియర్లుగా ఉండి.. పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లోని 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిల్లో క్రోమోజోమ్ -5లో సర్వైవల్ మోటార్ న్యూరాన్-1(ఎస్ఎంఎన్1) వంటి జన్యువు లోపం ఏర్పడుతుంది. కండరాల స్పందనకు ఈ జన్యువు చాలా కీలకం. ఇది శరీరంలో అవసరమైన ఎస్ఎంఎన్ ప్రొటీన్ తయారు చేయడానికి చాలా అవసరం. మోటార్ న్యూరాన్ కణాలకు ఇది చాలా కీలకం. వాస్తవానికి ఎస్ఎంఎన్-2 రూపంలో శరీరం దీనిని బ్యాకప్ జన్యువు ఉంచుకొన్నా అది ఉత్పత్తి చేసే ఎస్ఎంఎన్ ప్రొటీన్ సరిపోదు. కేవలం 10శాతం మాత్రమే తయారు చేస్తుంది. ఫలితంగా మోటార్ న్యూరాన్ కణాలు బలహీనమైపోతాయి. అమెరికాలో ఏటా ఈ లోపంతో సుమారు 400 మంది పిల్లలు జన్మిస్తారని అంచనా. ఎస్ఎంఏ 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి. వీటిల్లో టైప్-1 ప్రమాదకరమైంది.లక్షణాలు..కండరాలు బలహీనంగా ఉండటం మెడపై ఎటువంటి పట్టు లేకపోవడంకూర్చోవడం, నిలబడటం, నడవటం చేయలేరుపాలుతాగడం వంటివి వాటికి కూడా ఇబ్బంది పడతారుఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు.చికిత్స ఇలా..ఎస్ఎంఏ-1 చిన్నారులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు వీరికి చికిత్స చేయడానికి అవకాశం ఉండేది కాదు. దీంతో వీరి ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు నొవార్టిస్ కంపెనీ ప్రయోగాత్మకంగా ‘జోల్జెన్స్మా’ అనే జన్యు చికిత్స ఇంజెక్షన్‌ను తయారు చేసింది. ఇది పూర్తిగా తగ్గించకపోయినా.. టైప్ 1 నుంచి వచ్చే ఎన్నో సమస్యల నుంచి బిడ్డ కోలుకొనేట్లు చేస్తుంది. దీని ధర రూ.16 కోట్లు ఉంది. ఇక దీనిని దిగుమతి చేసుకొనేందుకు చెల్లించాల్సిన సుంకాలను కలుపుకొంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఔషధాన్ని అమెరికా నుంచి తరలించడం మొదలైన రోజు నుంచి 14 రోజుల్లోపే వాడుకోవాలి. దీని షెల్ఫ్లైప్ 14 రోజులు మాత్రమే. -
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘తాజా పర్యావరణ అనుమతులు’ జారీ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ నిర్ణయం తీసుకుంది. 50 శాతం విదేశీ బొగ్గు, మరో 50శాతం స్వదేశీ బొగ్గుతో కలిపి(బ్లెండ్ చేసి) విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీ ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని గతంలో జెన్కో ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనల ఆధారంగా 2017 జూలై 25న కేంద్రం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసింది. అయితే అనుమతులకు విరుద్ధంగా పూర్తిగా స్వదేశీ బొగ్గు ఆధారంగా విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్‌ను జెన్కో నిర్మిస్తోందని కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. టెక్నాలజీ మారడంతో నీటి వినియోగం, బూడిద ఉత్పత్తి పెరుగుతుందని ఆరోపించారు.మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యా వరణ అనుమతులు పొందాల్సిందేనని 2022 సెపె్టంబర్లో ఎన్జీటీ తీర్పు ఇవ్వగా, జెన్కోకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో యాదాద్రి ప్లాంట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మళ్లీ పర్యావరణ అనుమతులు పొందేందుకు జెన్కో విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ నెల 8న సమావేశమైన కేంద్ర పర్యావరణశాఖ నిపుణుల మదింపు కమిటీ ఎట్టకేలకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. కృష్ణానదిని కలుషితం చేయమని హామీ కృష్ణానదిలో కలిసే తుంగపాడు వాగు యాదా ద్రి ప్లాంట్ మధ్య నుంచి వెళుతుందని, దీని ప్ర వాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, వాగులో కనీస ప్రవాహం ఉండేలా చర్యలు తీసు కోవాలని నిపుణుల కమిటీ జెన్కోకు సూచించింది. వాగు పరిరక్షణకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, వాగుకు ఇరువైపులా 100 మీటర్ల వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది.తుంగపాడు వాగులో కనీస ప్రవాహం ఉండేలా ఎగువన ఉన్న పెద్దచెరువుల నుంచి నీటిని విడుదల చేస్తామని గతంలో నీటిపారుదల శాఖ సైతం హామీ ఇచ్చింది. తుంగపాడు వాగు, కృష్ణానది కలుషితం కాకుండా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జి సిస్టమ్ ఆధారంగా డిజైన్ చేశామని, ఇందుకు యాష్ వాటర్ రికవరీ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు జెన్కో సైతం ఈ నెల 12న లేఖ ద్వారా హామీ ఇచ్చింది.పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధికి ఆర్వో ఆధారిత ప్లాంట్‌తో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇలా శుద్ధి చేసిన జలాలను బూడిద, చెట్ల పెంపకం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తామని జెన్కో తెలిసింది. తుంగపాడు వాగులో ఎలాంటి వ్యర్థాలు వదలని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ షరతుల్లో కొన్ని.... ♦ విద్యుత్ కేంద్రం ప్రహరీ లోపలిభాగంలో స్థానిక అటవీ జాతుల మొక్కలను మూడు వరుసల్లో నాటే కార్యక్రమాన్ని జూన్ 2024లోగా పూర్తి చేయాలి. తుంగపాడు వాగుకు రెండువైపులా 100 మీటర్ల వరకు వచ్చే రెండేళ్లలోగా చెట్ట పెంపకం పూర్తి చేయాలి. విద్యుత్ ప్లాంట్ ప్రహరీ చుట్టూ 2 కి.మీల వరకు దట్టంగా చెట్లు పెంచాలి. స్థానికంగా ఉన్న పాఠశాలల చుట్టూ 10 కి.మీల వరకు చెట్లు పెంచాలి. ♦భూ నిర్వాసితులకు 2025 మార్చిలోగా పరిహార పంపిణీ పూర్తి చేయాలి. ప్రాజెక్టుతో నిర్వాసితులైన కుటుంబాలు, ప్రభావితమైన కుటుంబాల్లోని వ్యక్తులకు ఇచ్చిన హామీ మేర కు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦బూడిద కోసం భవిష్యత్‌లో అదనపు భూమి కేటాయింపు ఉండదు. సిమెంట్, ఇటుకల తయారీకి 100శాతం బూడిదను వినియోగించుకోవాలి. రవాణాలో బూడిద పరిసర ప్రాంతాల్లో పడి కలుషితం చేయకుండా క్లోజ్డ్ బల్కర్స్లోనే తరలించాలి. ♦పర్యావరణ నిర్వహణ పణ్రాళిక (ఈఎంపీ)లో హామీ ఇచ్చిన మేరకు గడువులోగా రూ.5681.44 కోట్ల మూలధనం, రూ.430 కోట్ల రికరింగ్ నిధులతో పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలి. ♦ప్రాజెక్టుకు చుట్టూ 5 కి.మీల పరిధిలో నివసించే జనాభాకు కనీసం రెండేళ్లకోసారి ఎపిడెమియోలాజికల్(అంటురోగాలు) స్టడీ నిర్వహించాలి. స్టడీలో తేలిన అంశాల ఆధారంగా వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. యూనిట్ల నిర్మాణ గడువూ పొడిగింపుతెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆధ్వర్యంలో 4000(5్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం– వీరప్పగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల నిర్మాణం విషయంలో గడువు పొడిగించినట్టు జెన్కో కేంద్ర పర్యావరణ శాఖకు తెలిపింది.. యూనిట్ గడువు యూనిట్– 1 15.10.2024 యూనిట్–2 15.10.2024 యూనిట్ –3 31.03.2025 యూనిట్–4 31.12.2024 యూనిట్–5 28.02.2025 -
నృసింహస్వామి పెళ్లికొడుకాయెనే..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా జరిపించారు. ఉదయం ప్రధానాలయ మాడ వీధుల్లో శ్రీస్వామి వారు జగన్మోని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక సాయంత్రం శ్రీస్వామి వారు అశ్వవాహనంపై పెండ్లి కొడుకుగా, ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై అమ్మవారిని సేవోత్సవంగా ఆలయ మాడవీధిలో ఊరేగించారు. అనంతరం ఆచార్యులు, అధికారులు స్వామి వారి పక్షాన, అమ్మవారి పక్షాన చేరి గుణగణాలను చర్చించుకున్నారు. శ్రీనృసింహస్వామికి లక్ష్మీ దేవితో వివాహం జరిపేందుకు ముహూర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు. గజవాహనంపై కల్యాణోత్సవానికి.. తిరుకల్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి 8.45 గంటలకు గజవాహనంపై శ్రీస్వామి, ప్రత్యేక పల్లకిపై అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ 9.15 గంటలకు ఉత్తర దిశలోని రథశాల ముందు ఏర్పాటు చేసిన కల్యాణ మండపానికి చేరుకుంటారు. ఆ తరువాత శ్రీస్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను ఆచార్యులు, వేద పండితులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రారంభిస్తారు. తుల లగ్న ముహూర్తంలో రాత్రి 9.37 గంటలకు శ్రీస్వామి వారు అమ్మవారికి మాంగళ్యధారణ చేయనున్నారు. ఇక ఉదయం శ్రీస్వామి వారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై ఊరేగనున్నారు. యాదాద్రీశుడి కల్యాణానికి టీటీడీ పట్టువ్రస్తాలు శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవాలకు టీటీడీ తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను అందజేశారు. ఉదయం టీటీడీకి చెందిన ఉప కార్యనిర్వహణాధికారి లోకనాథం మేల్చాట్ పట్టు వ్రస్తాలను తీసుకొని, ఆలయ మాడ వీధిలో ఊరేగింపుగా వచ్చారు.జగన్మోహిని అలంకార సేవ ముందు పట్టు వస్త్రాలను ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులకు అందజేశారు. -
యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని తెలిపారు. దేవుడిపై భక్తి భావంతోనే అలా చేశానని పేర్కొన్నారు. ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన్నట్లు ట్రోల్ చేస్తున్నారని అన్నారు. తనను ఎవరూ అవమానించలేదని, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంత మంది భావించారని.. తనను ఎవరూ అవమానించలేదన్నారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదని తెలిపారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక వంటి మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. అయితే యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్‌పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి స్టూల్‌పై కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సహా ఇతర పార్టీల నేతలంగా భట్టిని అవమానించారని కాంగ్రెస్ పార్టీపై మండిపడిన విషయం తెలిసిందే. చదవండి: కాంగ్రెస్, బీఆర్ఎస్ అజెండా ఒక్కటే: కేంద్ర మంత్రి అమిత్ షా -
సీఎం గారూ.. నిధులివ్వండి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఆయన రానున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో భక్తులు ఉన్నారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆల య పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.150 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. వైటీడీఏ ద్వారా యాదాద్రి అభివృద్ధి పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గత సంవత్సరం మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిగింది. రెండు సంవత్సరాలు కావ స్తున్నా భక్తులకు సరైన వసతులు లేవు. కొండపైన విశిష్టత కాపాడాలని.. భక్తులకు ఆధ్యాత్మిక విశిష్టత లేకుండా పోయింది. కొండపైన దీక్షాపరుల మండపం, డార్మిటరీహాల్, విష్ణుపుష్కరిణి, కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు నిలువ నీడ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు నష్టం.. అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మించి యాదగిరిగుట్ట పట్టణాన్ని రెండుగా విడగొట్టి రూపురేఖలు లేకుండా చేశారని విమర్శలున్నాయి. దీని వల్ల వ్యాపారులు వీధిన పడ్డారు. స్థానికులు నష్టపోయారు. వీరి కోసం దేవస్థానం నిర్మించి ఇచ్చే షాపింగ్ కాంప్లెక్స్ పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభం కాని గెస్ట్ హౌస్‌లు.. టెంపుల్ సిటీలో దాతల సహాయంతో చేపట్టాల్సిన గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. రూ.250 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన లేఆవుట్ నిరుపయోగంగా ఉంది. స్థానికులకు ఉపాధి దూరం.. ఆలయ అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. సైదాపురంలో కేటాయించిన స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వడంలో, పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతోంది. సగంలో నిలిచిన పనులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం చేసిన పనులకు పాత బిల్లులు రూ.70 కోట్ల వరకు, కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి రూ.70 కోట్ల మేరకు అవసరం అవుతాయి. ఇందులో రూ. 60 కోట్ల మేరకు పనులకు చెక్‌లు ఇవ్వగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దేవస్థానం బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి.గిరి ప్రదర్శన మార్గం పనులు సగభాగంలోనే నిలిచిపోయాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.1.60లక్షల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ 1500 మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ 15వేలకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం రోజుల్లో 30వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. 70 మందికి పైగా ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు రానున్నారని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కొరత రాకుండా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్సుల ఏర్పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఉత్సవాలు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. శ్రీస్వామిని ఇష్టమైన అలంకార, వాహన సేవలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ముందు, కల్యాణం ఉత్తర మాఢ వీధిలో నిర్వహిస్తాం. రథోత్సవం రోజు శ్రీస్వామి వారు ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి. – కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు ఇవి చదవండి: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2 -
11నుంచి యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. 21న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ♦ 11వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ ♦ 12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవనం ♦ 13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం, వేద పారాయణం, సాయంత్రం శేష వాహనం సేవ ♦ 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ ♦ 15న ఉదయం శ్రీకృష్ణ (మురళీ కృష్ణుడు) అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ ♦ 16న ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ ♦ 17న ఉదయం జగన్మోహిన అలంకారం, రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ♦ 18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామివారి ఊరేగింపు.రాత్రి గజవాహన, శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణం నిర్వహిస్తారు. ♦ 19న ఉదయం శ్రీమహావిష్ణు అలంకార సేవ, గరుఢ వాహనంసేవలో శ్రీస్వామి వారి ఊరేగింపు, రాత్రి దివ్య విమాన రథోత్సవం. ♦ 20న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, రాత్రి శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు ♦ 21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రద్దుకానున్న సేవలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11నుంచి 21వ తేదీ వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను రద్దు చేయనున్నారు. 17, 18, 19 తేదీల్లో అర్చనలు, భోగములు, 20, 21 తేదీల్లో అభిషేకాలు, అర్చనలు రద్దు చేయనున్నారు. 18వ తేదీన శ్రీస్వామి, అమ్మవారి తిరు కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3వేల టికెట్ కొనుగోలు చేసి సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు. -
యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్టగా పిలువబుడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ విడుదల చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆయన శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడాడు. ‘ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. మేం జీరో బిల్ ఇచ్చినట్టు.. కేటీఆర్‌కి జీరో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృథా. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు?. ... కాళేశ్వరం పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజలే కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేశారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోంది. భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీని కోరాను. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో.. దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుంది. మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. -
ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న యాదాద్రి
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని వచ్చే నెల 5వ తేదీ నుంచి కొండపైనే అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి (శివాలయం) ఉత్సవాలను నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 7వ తేదీన రాత్రి 7గంటలకు శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని అభిషేకములు, రాత్రి లింగోద్భోవ కాలములో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపిస్తారు. 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచనారసింహుడిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తీ వాచనంతో ఉత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుడతారు. 12వ తేదీన ధ్వజారోహణము, దేవతాహ్వానం, వేద పారాయణం, హవన జరిపిస్తారు. అదే రోజు అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం 17వ తేదీన, తిరు కల్యాణ మహోత్సవం 18వ తేదీన, రథోత్సవం 19న, చక్రతీర్థ స్నానం 20న నిర్వహిస్తారు. 21వ తేదీన శతఘటాభిషేకం ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ముగింపు చేస్తారు. 8న అఖండ జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరి భవన్ నుంచి మహా శివరాత్రి రోజు 8వ తేదీన ఉదయం 9.30గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే యాత్ర నిర్వాహకులు అఖండ జ్యోతి యాత్రను దివ్య పుష్ప రథంపై ఊరేగింపుగా యాదాద్రికి తీసుకురానున్నారు. 8వ తేదీన బర్కత్‌పురలో ప్రారంభమయ్యే అఖండ జ్యోతి యాత్ర 11వ తేదీన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల తొలిరోజు యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. -
యాదాద్రిలోని విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్
-
యాదాద్రి పైకి ఆటోలు
యాదగిరిగుట్ట : రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోల రాకపోకలు షురూ అయ్యాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన 2022 మార్చి 28వ తేదీ నుంచి కొండపైకి ఆటోలు నడపడం నిషేధించారు. దీంతో ఆటోడ్రైవర్లు నిరసనకు దిగారు. మొదటి ఘాట్ రోడ్డులోని యాదరుషి ఆలయం వద్ద వివిధ రూపాల్లో వారు దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు నవంబర్ 2023లో దీక్షలు విరమించారు. అధికారంలోకి వస్తే గుట్టపైకి ఆటోలు నడిచేలా చూస్తామని కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క రెండు, మూడుసార్లు ఆటో డ్రైవర్లు, దేవాలయ, పోలీసు అధికారులతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖలతో మాట్లాడి ఆదివారం నుంచి కొండపైకి ఆటోలు నడిచే విధంగా చూశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఆటోడ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హనుమంతు కె.జెండగే, డీసీపీ రాజేష్ చంద్ర, ఈఓ రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలతో కలిసి జెండా ఊపి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు మంచి రోజులు వచ్చాయన్నారు. అనంతరం కలెక్టర్ జెండగే, డీసీసీ రాజేష్ చంద్రా, ఈఓ రామకృష్ణారావులను బీర్ల ఐలయ్య ఆటోలో గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ రమే‹Ù, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ తదితరులు పాల్గొన్నారు. ఆటోలకు స్టిక్కర్లు.. యాదాద్రి కొండపైకి నడిచే ఆటోలకు ట్రాఫిక్ పోలీసులు, ఆటో కారి్మక యూనియన్ నేతలు సీరియల్ నంబర్, శ్రీస్వామి వారి చిత్రపటంతో కూడిన స్టిక్కర్లు అతింకించారు. ఆటో డ్రైవర్ల డ్రైవింగ్ లైస్సెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించారు. తొలి రోజు అధికారులు చెప్పిన ప్రకారం 100 ఆటోలను కొండపైకి నడిపించారు. -
యాదాద్రిలో విద్యార్థినుల ఆత్మహత్య కేసులో ట్విస్ట్
-
విశ్వవిరాట్ వైభవం
సాక్షి, తిరుమల/భద్రాచలం/యాదగిరిగుట్ట: తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కనులపండువగా జరుగుతోంది. ఉత్తరద్వారం నుంచి దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రం శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూలోక వైకుంఠంగా మారింది. శ్రీసీతాలక్ష్మణసమేతుడైన రామచంద్రస్వామి ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో భద్రగిరి పులకించింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ధూపదీపాల మధ్య వైకుంఠ రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదభి రాముడు గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తరద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట (çపూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే ప్రధానాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆచార్యులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు ఏర్పాట్లు చేశారు. ఉదయం శ్రీస్వామి వారు గరుడ వాహనంపై లక్ష్మీనృసింహస్వామి అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం వద్ద వైకుంఠనాథుడిగా భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం శ్రీస్వామిని విష్ణుమూర్తిగా అలంకరణ చేసి మత్సా్వతారంలో మాడవీధిలో సేవను ఊరేగించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డి, అదనపు జిల్లా జడ్జి మారుతీదేవి, సబ్ జడ్జి దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో.. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైకుంఠం నుంచి వచ్చిన వేంకటేశుడి దర్శనానికి ఉత్తర ద్వారం స్వా గతం పలికింది. అలాగే.. శ్రీవారి ఆలయంలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగారు. రథోత్సవాన్ని గ్యాలరీల్లోంచి భక్తులు దర్శించి తరించారు. -
వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక.. వీఐపీల తాకిడి వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్‌లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో.. మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. -
యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి గురువారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించిన అధికారులు, ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావును నియమించారు. 2014 డిసెంబర్ 2న గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు ఆమె ఈవోగా బాధ్యతల్లో ఉన్నారు. గీతారెడ్డి 2020 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. యాదాద్రి ఆలయ అభివృద్ధి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు అంటే 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు గీతారెడ్డి సర్వీసును పొడిగించింది. అనంతరం ప్రధాన ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. మరో అధికారిని ఈవోగా నియమించే వరకు గీతారెడ్డినే ఆలయ ఈవోగా కొనసాగుతారని జీవో ఇచి్చంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులంతా తమ రాజీనామాలు సమరి్పస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గీతారెడ్డి రాజీనామా చేశారు. రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ.. యాదాద్రి ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్టా అలంకార మూర్తులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకృష్ణారావుకు ప్రధాన కార్యాలయంలో గీతారెడ్డి బాధ్యతలను అప్పగించారు.