సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ దగ్ధం ఘటనలో కేసు నమోదు చేశారు. ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై.. రైల్వే యాక్ట్ సెక్షన్ 80/2023 కింద కేసు నమోదు చేశారు.
హౌరా(కోల్‌కతా) నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma express)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు వస్తున్నట్లు గమనించిన సిబ్బంది అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఆ రెండు బోగీల్లోని ప్రయాణికులను కిందికి దించేశారు.
దీంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య జరిగింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రయాణికుల మండిపాటు
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఒడిశా బాలాసోర్‌లో దాదాపు 300 మందిని పొట్టనబెట్టుకున్న ఘోర ప్రమాదం తర్వాత కూడా ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగులు కాలిపోయాయని కొందరు.. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు నగదు, సామగ్రి కోల్పోయామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫలక్‌నుమా అంటే అర్థం తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment