అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం | Three Children Died Due To Fire Accident | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం

Published Sat, Nov 2 2024 7:27 AM | Last Updated on Sat, Nov 2 2024 9:48 AM

Three Children Died Due To Fire Accident

హౌరా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో దీపావళి వేళ పెను ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారి కూడా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హౌరాలోని ఉల్బీరియా ప్రాంతంలో శుక్రవారం బాణాసంచా  కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న దుకాణానికి కూడా అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ముగ్గురు చిన్నారులు తీవ్రంగా కాలిపోయి మృతి చెందారు. ఉలుబేరియా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 27లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ ప్రాంతానికి చెందిన చిన్నారులు బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు పక్కనే ఉన్న బాణసంచా సామగ్రిపై పడటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను  తానియా మిస్త్రీ, ఇషాన్ ధార, ముంతాజ్ ఖాతూన్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement