టర్కీలోని ఒక రిసార్ట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య టర్కీలోని ఒక స్కీ రిసార్ట్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. 32 మంది గాయాలపాలయ్యారు. అతికష్టం మీద అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
బోలు ప్రావిన్స్‌లోని కర్తల్కాయ రిసార్ట్‌లోని ఒక రెస్టారెంట్‌లో రాత్రిపూట మంటలు చెలరేగాయని టర్కీ మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. భయంతో భవనం నుంచి దూకి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గవర్నర్ అబ్దుల్ అజీజ్ అయిదిన్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ హోటల్‌లో 234 మంది అతిథులు బస చేస్తున్నారని, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు చెలరేగినప్పుడు తాను నిద్రలో ఉన్నానని, అయితే ప్రమాదాన్ని గుర్తించి, భవనం నుండి తప్పించుకోగలిగానని హోటల్ సిబ్బంది నెక్మీ కెప్సెట్టుటన్ తెలిపారు. తాను బయటపడ్డాక 20 మంది అతిథులు హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు సహాయం అందించానని తెలిపారు.
హోటల్ బయట ఉన్న కలప కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. కర్తాల్కాయ అనేది ఇస్తాంబుల్‌కు తూర్పున 300 కిలోమీటర్లు (186 మైళ్ళు) దూరంలో ఉన్న కొరోగ్లు పర్వతాలలోని స్కీ రిసార్ట్. 30 అగ్నిమాపక యంత్రాలు, 28 అంబులెన్స్‌లతో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ నిర్ణయాలు.. అంతర్జాతీయంగా అమెరికాకు దెబ్బ?
Comments
Please login to add a commentAdd a comment