hotel
-
కోడిపుంజులాంటి హోటల్..!
రాజసంగా నిలుచున్న కోడిపుంజును చూశారు కదూ! ఇది కోడి గౌరవార్థం నిలిపిన విగ్రహమేమీ కాదు. ఇది హోటల్ భవంతి. కోడిపుంజు ఆకారంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన భవంతిగా ఇది గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ భవంతి ఎత్తు 114.7 అడుగులు. ఫిలిప్పీన్స్‌లోని నెగ్రోస్ నగరంలో ఉందిది.నిలువెత్తు కోడిపుంజులాంటి ఈ హోటల్ భవనంలో సమస్త సౌకర్యాలతో కూడిన 15 ఎయిర్ కండిషన్డ్ గదులు ఉన్నాయి. ఫిలిప్పీన్స్ స్థానిక సంస్కృతిలో కోడిపుంజుకు విశేష ప్రాధాన్యముందని, ఆ ఒక్క కారణమే కాకుండా, జనాల దృష్టిని ఆకట్టుకునేందుకు కోడిపుంజు ఆకారంలో ఈ భవంతిని నిర్మించామని ఈ హోటల్ యజమాని రికార్డో కానో గ్వాపో తెలిపారు. ఈ హోటల్ పేరు ‘కాంప్యూస్టోహాన్ హైలాండ్ రిసార్ట్’. (చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!) -
రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు!
ఒడిశాలో చిల్కా సరస్సు. ఆసియా ఖండంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఆ సరస్సు తీరాన ఉంది రంభా ప్యాలెస్. ఆ ప్యాలెస్ గురించి చెప్పాలంటే రెండు వందల ఏళ్ల వెనక్కి వెళ్లాలి. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.అది 1791. మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హవా నడుస్తున్న రోజులవి. ఇంగ్లిష్ ఇంజనీర్ థామస్ స్నోద్గ్రాస్, మన స్థానిక సహాయకులతో కలిసి నిర్మించిన ప్యాలెస్ అది. ఈప్యాలెస్ చక్కటి వెకేషన్ ప్లేస్. కోణార్క్ సూర్యదేవాలయానికి పూరీలోని జగన్నాథ ఆలయానికి కూడా 150 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ ΄్యాలెస్ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా 2018లో న్యూఢిల్లీకి చెందిన హాచ్ వెంచర్ కొన్నది. నిర్మాణాన్ని పునరుద్ధరించే బాధ్యతను శ్రీలంకకు చెందిన ఆర్కిటెక్ట్ చన్నా దాసవాతేకి అప్పగించింది. ఈ ఆర్కిటెక్ట్ ఆరేళ్ల పాటు శ్రమించి ప్యాలెస్ చారిత్రక వైభవానికి విఘాతం కలగకుండా పునరుద్ధరించాడు. జాతీయోద్యమంలో భాగంగా సాగిన ఉత్కళ్ మూవ్మెంట్ జ్ఞాపకాలను పదిలపరుచుకుని ఉందీ ప్యాలెస్. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఉన్నతాధికారులతో సమావేశమైన గుర్తులున్నాయందులో. ప్యాలెస్‌లో నివసించిన అనుభూతి కోసం పర్యాటకులు రాజస్థాన్ వెళ్తుంటారు. ఒకసారి ఒడిశా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఆస్వాదించండి’ అంటూ ఈ ప్యాలెస్ సహ యజమాని ఒడిశా రాజవంశానికి చెందిన వారసుడు హిమాన్గిని సింగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నారు. క్రిస్టమస్ వెకేషన్‌కి లేదా సంక్రాంతి వెకేషన్‌కి ప్లాన్ చేసుకోండి. -
HYD: హోటల్లో భారీ పేలుడు.. బస్తీలో ఎగిరిపడ్డ బండ రాళ్లు
సాక్షి,హైదరాబాద్:జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ వన్‌లోని ఓ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం(నవంబర్ 10) తెల్లవారుజామున 4 గంటలకు పేలుడు జరిగింది. హోటల్ కిచెన్‌లో ఉన్న రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పేలడంతో భారీ శబ్దం వచ్చింది. పేలుడు ధాటికి హోటల్ ప్రహరీ గోడ ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు రాళ్ళు ఎగిరి పడి పక్కనే ఉన్న దుర్గాభవానీ నగర్ బస్తీలో పడ్డాయి. రాళ్లు పడడంతో బస్తీలో ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.పేలుడు ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం -
‘బిర్యానీలో ఈగ’ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
సాక్షి, నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో విలేజ్ ఆర్గానిక్ హోటల్ బిర్యానీలో ఈగ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫుల్లుగా తిని బిల్లు ఎగ్గొట్టేందుకు బిర్యానీలో ఈగ అంటూ నలుగురు బ్యాచ్ నాటకం ఆడారు. తినడం పూర్తయ్యాక పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన నూనెలో ఫ్రై చేసిన ఈగను బిర్యానీలో పెట్టారు. ఆ తర్వాత బిర్యానీలో ఈగ అంటూ నాటకానికి తెరలేపారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించారు. వాట్సాప్ గ్రూపులో వీడియోను ఆ బ్యాచ్ షేర్ చేసింది.హోటల్ పై విమర్శలు రావడంతో సిబ్బంది... సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈగను బయటకు తీసి బిర్యానీ వేసి కలుపుతున్నట్లు ఫుటేజీలో స్పష్టమైంది. గతంలోనూ పలు హోటల్స్ లో ఇదే రకంగా నాటకాలు ఆడినట్లు బ్యాచ్‌పై ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట సమీపంలో ఓ ప్రముఖ హోటల్లోనూ ఇదేవిధంగా బిల్లు ఎగ్గొట్టినట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘వారి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నాం’ -
వామ్మో..! రాను రాను హోటల్లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..!
బెంగళూరులోని ఒక హోటల్లోకి అడుగు పెట్టిన అనన్య నారంగ్‌కు రిసెప్షనిస్ట్ స్వాగతం పలికింది. అనన్యలో షాక్‌లాంటి ఆశ్చర్యం. ‘ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది!’ అనే కదా మీ డౌటు. అయితే సదరు ఈ రిసెప్షనిస్ట్ సాధారణ రిసెప్షనిస్ట్ కాదు... వర్చువల్ రిసెప్షనిస్ట్!‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో వర్చువల్ రిసెప్షనిస్ట్’ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన దేశంలో నవీన సాంకేతికత గురించి వివరంగా మాట్లాడుకునేలా చేస్తోంది. ‘సాంకేతికత సహాయంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులను ఏకకాలంలో సమన్వయం చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీలో తప్ప మన దేశంలో ఎక్కడా ఇలాంటి దృశ్యం కనిపించదు’ అంటూ ఈ ‘వర్చువల్ రిసెప్షనిస్ట్’ ఫొటోని షేర్ చేసింది అనన్య. ‘ఎంత సాంకేతిక ప్రగతి’ అనే ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘అబ్బబ్బే! ఇదేం ప్రగతి. అందమైన మానవ రిసెప్షనిస్ట్ స్వాగతం పలకడానికి, వర్చువల్ రిసెప్షనిస్ట్ స్వాగతం పలకడానికి చా...లా తేడా ఉంటుంది’ అనే వాళ్లే ఎక్కువ! (చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!) -
ఫుడ్ ఇవ్వలేదని.. ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లిన డ్రైవర్
ముంబై: మహారాష్ట్రలో ఓ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. అతడికి ఆహారం ఇవ్వలేదనే కోపంతో ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పుణెలోని ఇంద్రాపూర్ హింగాన్గావ్లో చోటుచేసుకుంది.కంటైనర్‌తో ట్రక్కు తో ఓ వ్యక్తి షోలాపూర్ నుంచి పుణె వెళ్తు మధ్యలో హోటల్ గోకుల్ వద్ద ఆగాడు. తర్వాత లోపలికి వెళ్లి ఆహారం అడిగాడు.కారణం తెలీదు కానీ హోటల్ యజమాని అతనికి ఫుడ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కోపోద్రిక్తుడై తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనంపైకి పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా హోటల్ బయట ఆగి ఉన్న కారును కూడా ఢీకొట్టాడు.ఇంతలో డ్రైవర్‌ను ఆపేందుకు కొందరు వ్యక్తులు ట్రక్కుపై రాళ్లు రువ్వడం చేశారు. చివరికి ట్రక్కు చక్రాలుకింద రాళ్లు పడటంతో అవి ముందుకు కదల్లేక ఆగిపోయాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ హోటల్ తీవ్రంగా దెబ్బతింది సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తమ ఫోన్లలో రికార్డు చేయడంతో..సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.VIDEO | Maharashtra: A truck driver rammed his vehicle into a hotel building in #Pune after he was reportedly denied food. The truck driver was allegedly drunk. The incident took place on Friday night.#PuneNews #maharashtranews (Source: Third Party)(Full video available on… pic.twitter.com/TrPEF1ZxrA— Press Trust of India (@PTI_News) September 7, 2024 -
ఫుడ్ లవర్స్ అడ్డా.. హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హోటల్ తాజ్ డక్కన్ వేదికగా జరిగిన 3వ ఎడిషన్ హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమంలో టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఫుడ్ గ్రాఫ్‌లో నగరాన్ని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర బ్రాండ్లకు 50 పురస్కారాలను ప్రదానం చేసింది.కంట్రీ ఓవెన్ ఫౌండర్ డాక్టర్ సుధాకర్ రావు, వివేరా హోటల్స్ చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డిలకు లెజెండ్ అవార్డులను అందజేసింది. ‘హైదరాబాద్ అంటేనే ఒక ఎమోషన్. నగరవాసులు ఫుడ్‌ను ప్రేమిస్తారు, ఆస్వాదిస్తారు’అని ఆమె అన్నారు. తనకు కట్టీ దాల్ చావల్ ఫేవరేట్ ఫుడ్ అని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా మిస్ యూనివర్స్ తెలంగాణ నిహారిక సూద్, మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ్‌పాల్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సుచిరిండియా సీఈవో లయన్ డాక్టర్ వై.కిరణ్, జెమిని ఎడిబుల్స్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్‌రెడ్డి, విమల ఫీడ్స్ మధుసూదన్‌రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
HYD: ‘ప్యారడైజ్’ హోటల్లో మంటలు
సాక్షి,హైదరాబాద్: బిర్యానీకి పాపులర్ అయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ హోటల్లో శుక్రవారం(ఆగస్టు23) మంటలు కలకలకం రేపాయి. హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్ది సేపటికే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటన అనంతరం హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారులు హోటల్‌కు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందనేదానిని పరిశీలించారు. -
హోటల్‌పై కుప్పకూలిన హెలికాప్టర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని పర్యాటక పట్టణం కెయిన్స్లోని ఓ హోటల్‌పై హెలికాప్టర్ కుప్పకూలింది. సోమవారం(ఆగస్టు12) తెల్లవారుజామున ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతిచెందాడు. హెలికాప్టర్ కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లోని వందల మందిని అక్కడినుంచి తరలించినట్లు క్వీన్స్లాండ్ పోలీసులు తెలిపారు. హెలికాప్టర్ కూలడం కారణంగా హోటల్లో ఉన్న వారెవరూ గాయపడలేదని చెప్పారు. హోటల్‌పై రెండు హెలికాప్టర్లు ల్యాండవుతుండగా వాటిలో ఒకటి క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలిపారు. హెలికాప్టర్ ఎలా కూలిందనే విషయమై ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ రెగ్యులేటర్ విచారణ ప్రారంభించింది. -
భలే మంచి దొంగ
-
ఇడ్లీ తిన్నాడు.. బిల్లు అడిగితే తన్నాడు!
మార్కాపురం: హోటల్‌కు వెళ్లి సర్వర్‌తో ఇడ్లీ తెప్పించుకుని పుష్టిగా ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ హోటల్లో కె.మహేష్‌రెడ్డి ఇడ్లీ తిన్నాడు. హోటల్ బాయ్ అంజి బిల్లు కట్టాలని కోరగా మహేష్ దాడికి దిగాడు. అడ్డుకోబోయిన హోటల్ సిబ్బంది పరమేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డిపైనా మహేష్ దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్ రెహమాన్ తెలిపారు. -
`ఆ ఇంట్లో బసచేసిన వారికి రాత్రి వేళ' ఆమె..
అదో చిన్న హిల్ స్టేషన్ . పశ్చిమ బెంగాల్, కాలింపోంగ్లోని దర్పిన్ దారా పర్వతం మీద పదహారు ఎకరాల ఎస్టేట్. 1930లో ఇద్దరు బ్రిటిష్ ధనవంతులు.. తమ పిల్లలకు వివాహం చేసి.. బంధుత్వం కలుపుకున్నారట. ఆ సందర్భంగానే అక్కడ ఇల్లు కట్టించి దాన్ని.. ఆ నూతన దంపతులకు బహుమతిగా ఇచ్చారట. అయితే ఆ దంపతులకు వారసులు లేకపోవడంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ ఆస్తిని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.1962లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనారోగ్యం పాలైన తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వ విశ్రాంతి గృహంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే, నెహ్రూ ఆకస్మిక మరణం కారణంగా ఆ ప్రయత్నం ఆగిపోయింది. 1975లో ‘పశ్చిమ బెంగాల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ’ ఆ ఇంటి నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఇదంతా చరిత్ర. ప్రస్తుతం ఈ ఇల్లు.. ఒక హోటల్‌గా.. పర్యాటకులకు వింత అనుభూతుల్ని పంచుతోంది.ఆ ఇంటి యజమాని పేరు ‘జూట్ బేరన్ జార్జ్ మోర్గాన్’ అని.. అతడు తన భార్య లేడీ మోర్గాన్‌ను ఎంతగానో ప్రేమించేవాడని.. ఆమె మరణం తర్వాత.. ఆమె ఆత్మ అదే ఇంట్లో ఉండిపోయిందని చెబుతుంటారు. మిసెస్ మోర్గాన్ ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ ఇంట్లో బసచేసిన వారికి రాత్రి వేళ.. ఆమె హైహీల్స్ వేసుకుని మెట్లు దిగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుందట. పైగా ఆ పరిసరాల్లో ఏవో గుసగుసలు వణికిస్తాయట.బయట నుంచి చూడటానికి ఆ ఇల్లు.. పచ్చటి తీగలు అల్లుకుని.. ప్రకృతి అందాల్లో కలగలిసిపోయినట్టు ఉంటుంది. అటుగా వెళ్లిన పర్యాటకులకు హడలెత్తించే కథలను కలబోసి చెబుతుంది. టూరిస్ట్ ప్లేస్‌గా మారినప్పటి నుంచి ఈ భవనం చుట్టూ అనేక చెట్లు, మరిన్ని కట్టడాలు పుట్టుకొచ్చాయి. చిన్నచిన్న కాటేజ్‌లను నిర్మించారు.బాలీవుడ్ నటులు సైతం ఇక్కడ బసచేశారట. థ్రిల్ కోరుకునేవారు, సాహసికులు.. ఇక్కడి అందాలతో పాటు లేడీ మోర్గాన్ అడుగుల సవ్వడిని వినడానికి ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటున్నారట. మరి నిజంగానే అక్కడ అంతుచిక్కని శక్తి ఉందా? ఉన్నపళంగా వినిపిస్తున్న గుబులురేపే ఆ అలికిడి.. లేడీ మోర్గాన్ ఉనికికి నిదర్శనమా? అనేది నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
హోటల్ బిజినెస్ డల్
సాక్షి, హైదరాబాద్: హోటల్ ఫుడ్‌పై వినియోగదారుల్లో నమ్మకం పోయింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పేరున్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నాసిరకం ఆహారం అందిస్తున్నాయని తేలడంతో బయటి ఆహారం తినడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ఫుడ్‌సేఫ్టీ అధికారుల అంచనా ప్రకారం ఈ దాడుల అనంతరం ఏకంగా 30 శాతం హోటల్ బిజినెస్ తగ్గింది. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ సంస్థల ద్వారా ఫుడ్ డెలివరీ కూడా భారీగా తగ్గిందని తెలుస్తోంది. ఆన్లైన్ డెలివరీల ద్వారా మరింత నాసిరకం ఫుడ్ సరఫరా ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో చాలా వరకు పరిశుభ్రతలోపం, ఆహార పదార్థాల్లో నాణ్యత లేమి స్పష్టంగా కనిపించినట్టు సమాచారం. పాడైపోయి, కాలంచెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. దాడుల్లో పేరుమోసిన హోటళ్లు, బేకరీలు, ఐస్‌క్రీం సెంటర్లున్నాయి. ప్రముఖ హోటళ్లలో పాడైపోయిన ఆహారపదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదు. ఫుడ్‌సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలోని టాస్‌్కఫోర్స్ బృందాలు విడుదల చేసిన జాబితా ప్రకారం క్రీమ్‌స్టోన్, న్యాచురల్స్ ఐస్‌క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీహౌస్, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌన్‌టౌన్ బ్రూపబ్, మాకౌ కిచెన్ అండ్ బార్, ఎయిర్‌లైవ్, టాకోబెల్, అహా దక్షిణ్, సిజ్జిలింగ్ జో, ఖాన్‌సాబ్, హోటల్ సుఖ్‌సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, రెస్ట్ ఓ బార్ వంటి అనేక హోటళ్లు, బేకరీలు ఉన్నాయి. వాటిల్లో ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పదార్థాలతో వండటం వంటి వాటిని గుర్తించారు. రోజుల తరబడిగా నిల్వ ఉంచిన మాంసంతో వండటం వంటివీ గుర్తించారు. హైదరాబాద్‌లో సగం హోటళ్లలో నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని, అపరిశుభ్రమైన కిచెన్ వంటివి ఉన్నాయని నిర్థారించారు. కేసులు పెట్టి జరిమానాలు విధించడంతోపాటు శుభ్రత, నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు నేరుగా హాటల్‌కు లేదా రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారుల కంటే, ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ విషయంలో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేలింది. ఆన్లైన్ డెలివరీ సంస్థల ద్వారా అత్యంత నాసిరకమైన ఫుడ్ వినియోగదారులకు సరఫరా చేశారని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.దాడులేనా.. సీజ్ చేయరా...? ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేసి ప్రజల్లో ఒకరకమైన భయం సృష్టించారు. అయితే కుటుంబసభ్యులతో సరదాగానో లేదా అవసరంరీత్యానో హాటళ్లకు వెళ్లే వినియోగదారులకు భరోసా కలి్పంచడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడుల సమయంలో కుళ్లిపోయిన మాంసం, పాడైపోయిన ఆహారం వంటివి గుర్తించినా, తక్షణమే ఆయా హోటళ్లను ఎందుకు సీజ్ చేయడం లేదని వినియోగదారులు ప్రశి్నస్తున్నారు. కేవలం కేసులు పెట్టి వదిలేయడం, పద్ధతి మార్చుకోవాలని సమయం ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనమని వాపోతున్నారు. భరోసా కలి్పంచకపోతే ఎలా? హోటళ్లపై దాడులు చేశాక, వాటిపై తక్షణ చర్యలు తీసుకోకపోతే మార్పు రాదు. హోటళ్లలో ధైర్యంగా తినేలా వినియోగదారులకు భరోసా కలి్పంచాల్సిన బాధ్యత అధికారులతోపాటు హోటల్ యజమానులపైనా ఉంది. వేలాది రూపాయలు వసూలు చేసే పెద్ద హోటళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టాలని డిమాండ్ చేసే అధికారం ఉంటుంది. అవసరమైతే కిచెన్‌లోకి వెళ్లి చూసేలా వెసులుబాటు ఉండాలి. లేదంటే ఓపెన్ కిచెన్ కానీ, సీసీ టీవీ కెమెరాల ద్వారా కిచెన్‌లో ఉండే పదార్థాలు, వండే విధానం వంటి వాటిని తినేవారు నేరుగా స్క్రీన్‌పై చూసే వెసులుబాటు కలి్పంచాలి. శ్రీనివాస్ శెట్టి, హైదరాబాద్సీజ్ చేసే అధికారం మాకు లేదు హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేశాక. వాటిని సీజ్ చేసే అధికారం మాకు లేదు. కేసులు పెట్టడం, జరిమానాలు విధించడం వరకే మాపని. అయితే తక్షణమే సీజ్ చేసే అధికారం పురపాలకశాఖకు ఉంటుంది. వినియోగదారుల్లో అవగాహన కలి్పస్తున్నాం. హోటల్, రెస్టారెంట్ల యజమానులను పిలిపించి నిబంధనలు పాటించాలని ఆదేశిస్తున్నాం. – ఆర్వీ కర్ణన్, కమిషనర్, ఫుడ్ సేఫ్టీపెద్ద హోటళ్లే ఇలా చేయడం విస్మయం కలిగిస్తుంది పెద్ద హోటళ్లే నాసిరకం ఫుడ్ పెట్టడంతో డాక్టర్లతో సహా వినియోగదారులంతా విస్మయానికి గురయ్యారు. వీకెండ్లో కుటుంబాలతో వెళాదామనుకునే వారికి షాక్ ఇచ్చారు. నాసిరకం, కలర్స్ వాడిన ఆహారం, కుళ్లిపోయిన మాంసం, అపరిశుభ్రత వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఆహార ప్రియులకు భరోసా కలి్పంచాలి. – డాక్టర్ అనిల్‌కుమార్ మన్నవ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి -
బిర్యానీ తిని ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో
-
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పూర్తిగా గడ్డకట్టిన మంచుతో నిర్మితమైన ఈ హోటల్ ఫిన్లండ్‌లోని కెమీ నగరంలో ఉంది. దీనిని తొలిసారిగా 1996లో ప్రారంభించారు. తొలి సంవత్సరంలోనే ఈ హోటల్‌కు మూడు లక్షల మంది అతిథులు వచ్చారు. ఫిన్లండ్‌లో ఏటా ఏప్రిల్ వరకు శీతకాలం ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు గడ్డకట్టే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఏటా శీతకాలంలో ఈ హోటల్‌ను నిర్మించి, అతిథులకు అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి మొదలయ్యాక ఈ మంచు అంతా కరిగిపోతుంది. దాదాపు ఇరవైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్లో ఒక ప్రార్థనా మందిరం, రెస్టారెంట్ సహా పర్యాటకులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని టేబుళ్లు, కుర్చీలు, మంచాలు కూడా మంచుతో తయారు చేసినవే! వీటిపైన ధ్రువపు జింకల చర్మంతో సీట్లు, పరుపులు ఏర్పాటు చేస్తారు. ఇందులోని రెస్టారెంట్లో విందు భోజనాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. (చదవండి: వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..) -
ట్రాన్స్‌జెండర్‌కు ఘోర అవమానం!
మహారాష్ట్రకు చెందిన తొలి మరాఠీ లింగమార్పిడి (ట్రాన్స్ జెండర్) నటి ప్రణీత్ హట్టే ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఒక హోటల్లో రూమ్ బుక్ చేశారని, అయితే తాను ట్రాన్స్‌ను అయినందున సదరు హోటల్ తన బుకింగ్‌ను రద్దు చేసిందని వాపోయారు. ఈ ఘటనపై తన ఆవేదనను ఆమె ఒక వీడియోలో పంచుకున్నారు.దానిలో ప్రణీత్ హట్టే మాట్లాడుతూ ‘నేను నాసిక్‌కు ఒక షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఇక్కడ ఉండేందుకు ఓ హోటల్లో రూమ్ బుక్ చేశాను. అయితే నేను ట్రాన్స్‌జండర్‌ను అయినందున హోటల్ యజమానులు నా రూమ్ బుకింగ్‌ను రద్దు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన ప్రణీత్ హట్టే అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక యూజర్ ‘నేను ఇప్పుడే ఫోన్ చేసి హోటల్వారితో మాట్లాడాను. వారు ఇప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడివుంటారు’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని రాశారు.ప్రణీత్ హట్టే మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రం ‘కరభారి లయభరి’లో గంగ పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం ‘హడ్డీ’లో కూడా ప్రణీత్ కనిపించారు. -
బెంగళూరు హోటల్లో ఉజ్బెక్ మహిళ హత్య
బనశంకరి: బెంగళూరులోని ఓ హోటల్లో విదేశీ మహిళ హత్యకు గురయ్యారు. శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా (37) వ్యాపార వీసాపై నాలుగు రోజుల క్రితం బెంగళూరుకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం శేషాద్రిపురంలో ఓ హోటల్ రెండో అంతస్తు గదిలో బస చేశారు. బుధవారం రాత్రి 10:30 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచి్చన హోటల్ సిబ్బంది మాస్టర్ కీ ద్వారా తెలుపు తెరిచారు. లోపల చూడగా జరీనా విగతజీవిగా కనిపించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆధారాలు సేకరించి, సీసీ ఫుటేజీ, సెల్ కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎవరో గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
హిల్థ్రిల్ హోటల్! పర్వతారోహణ అనుభవం లేనివారు ఇక్కడికి చేరుకోలేరు..
అప్పుడప్పుడు కొన్ని వింతలను, అద్భుతాలను, విచిత్రాలను, సౌందర్యాలను చూస్తూంటాం. కానీ అవన్నీ ఒకేదగ్గర కనిపించాలంటే ఇక్కడికి వెళ్లాలేమో..! ఈ ఫొటోలో కనిపిస్తున్న పర్వతం కేవలం పర్వతం కాదు, ఇదొక అధునాతన హోటల్. చిలీలోని హుయిలో హుయిలో అభయారణ్యంలో పటగోనీయా పర్వతశ్రేణుల్లోని ఒక పర్వతాన్ని ఇలా హోటల్‌గా మార్చారు. సాహసయాత్రికులకు, పర్వతారోహకులకు విడిది కేంద్రంలా దీనిని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ‘మౌంటెయిన్ మేజికా’ అనే ఈ హోటల్‌కు చేరుకోవాలంటే, వేలాడే వంతెన తప్ప వేరే మార్గమేదీ లేదు. తగిన శారీరక దారుఢ్యం, పర్వతారోహణ అనుభవం లేనివారు ఇందులోకి అడుగుపెట్టలేరు. దట్టమైన అడవి మధ్యనున్న ఈ హోటల్లో బసచేసే వారికి కిటికీల్లోంచి చూస్తే ఎటుచూసినా ప్రకృతి పచ్చదనం, చుట్టుపక్కల పర్వతాల నుంచి కిందకు దూకే జలపాతాలు కనువిందు చేస్తాయి. ఈ హోటల్లో 108 గదులు, రెస్టారెంట్, స్పా, స్విమింగ్ పూల్ వంటి వసతులు ఉన్నాయి. ఇందులో బస చేయడానికి రోజుకు 215 డాలర్లు (రూ.17,882) ఖర్చవుతుంది. ఇవి చదవండి: Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు.. -
రామేశ్వరం కేఫ్‌లో జరిగింది బాంబు పేలుళ్లే
-
అడుగడుగునా అవమానించే హోటల్‌కు జనం క్యూ!
అది ఒక ఖరీదైన హోటల్. ఒక రోజు రాత్రి బస చేయాలంటే రూ 20 వేలు చెల్లించాలి. ఈ హోటల్లో బస చేసేందుకు ఓ మహిళ వెళ్లింది. ఆమెకు టీ తాగాలనిపించింది. అయితే ఆ గదిలో టీ కెటిల్ లేదు. దాని హ్యాండిల్ మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్‌కి ఫోన్ చేసి, సమస్య చెప్పింది. అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది.. ‘వెళ్లి సింక్‌లోని నీళ్లు తాగండంటూ’ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది. ఆగండాగండి.. రిసెప్షనిస్ట్ ఆ మహిళ విషయంలో అవమానించేలా మాట్లాడిందని అనుకునేముందు ఒక విషయం తెలుసుకోండి. నిజానికి ఆ రిసెప్షనిస్ట్‌కు తాను ఏమి చేయాలో తనకు బాగా తెలుసు. అందుకే ఆమెను రిసెప్షనిస్ట్‌గా నియమించారు. ఆమె డ్యూటీ హోటల్‌కి వచ్చే వారిని అవమానించడం. అయితే ఆ మహిళ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్‌కు వెళ్లింది. చాలామంది ఈ హోటల్‌కు అవమానాలను ఎదుర్కొనేందుకే వస్తుంటారు. ‘డైలీ మెయిల్’లోని ఒక కథనం ప్రకారం రోజుకు రూ.20 వేలు ఛార్జ్ చేసే ఈ హోటల్లో కనీస సదుపాయాలు సరిగా ఉండవు. టవల్స్, టాయిలెట్ రోల్స్ కూడా ఉండవు. హోటల్లో బస చేసేందుకు వచ్చేవారెవరైనా కనీస అవసరాల గురించి అడిగితే, హోటల్ సిబ్బంది వారిని తీవ్రంగా అవమానిస్తుంటారు. చాలా సందర్భాల్లో అసభ్యకరంగా తిడుతుంటారు కూడా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్ అయ్యింది. తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే ఇక్కడికి జనం వస్తుంటారు. ప్రపంచంలోనే ఇలాంటి వింత ఎక్కడా ఉండదేమో. లండన్‌లోని ఈ హోటల్ పేరు కరెన్ హోటల్. దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది. దాని పేరు కరెన్ డైనర్. ఈ కరెన్ డైనర్ చైన్‌లో కరెన్ హోటల్ ఒక భాగం. 2021లో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ ‘అవమానకర’ సేవలను మొదలుపెట్టింది. తరువాత బ్రిటన్ అంతటా తమ శాఖలను నెలకొల్పింది. -
ఒక రోజు అద్దెతో ఐదేళ్లు తిష్ట.. న్యూయార్క్ హోటల్లో వింతవైనం!
సాధారణంగా ఎవరైనా ఏదైనా హోటల్లో బస చేయానుకుంటే ఒక రోజో, రెండు రోజులో ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా హోటల్లో ఐదు సంవత్సరాలు గడిపాడు.. అది కూడా అద్దె లేకుండా.. నమ్మశక్యం కాని ఈ నిజం వెనుకనున్న కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం మిక్కీ బారెటో(48) న్యూయార్క్‌లోని మాన్హాటన్లో ఉన్న ఒక హోటల్‌కు తానే యజమానినని చెప్పుకుంటూ ఐదేళ్లుగా అద్దె చెల్లించకుండా అందులోనే ఉంటున్నాడు. ఈ వ్యవహారంలో తప్పుడు ఆస్తుల రికార్డులు సృష్టించినందుకు తాజాగా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 1930లో నిర్మితమైన ఈ వెయ్యి గదుల ఆర్ట్ డెకో న్యూయార్కర్ హోటల్లో ఐదేళ్ల క్రితం మిక్కీ బారెట్‌తో పాటు అతని ప్రియురాలు 200 డాలర్లకు (రూ. 16,500) ఒక గదిని బుక్ చేసుకున్నారు. మిక్కీ లాస్ ఏంజిల్స్ నుండి న్యూయార్క్‌కు వచ్చినప్పుడు తన ప్రియురాలిలో కలిసి ఈ గదిలో దిగాడు. తరువాత హోటల్ గదుల బుకింగ్ చట్టానికి సంబంధించిన అక్రమాల గురించి మిక్కీ తన ప్రియురాలికి చెప్పాడు. ఎవరైనా 1969 కి ముందు నిర్మించిన భవనంలో ఒకే గదిలో నివసిస్తున్నట్లయితే, వారు ఆరు నెలల లీజు కింద గదిని తీసుకోవచ్చు. హోటల్లో ఒక రాత్రి బస చేసేందుకు డబ్బులు చెల్లించిన తరువాత గదిని లీజుకు అడిగాడు. అయితే దీనికి హోటల్ యాజమాన్యం నిరాకరించింది. మిక్కీ ఈ విషయమై కోర్టును ఆశ్రయించాడు. ప్రాథమిక విచారణలో న్యాయమూర్తి ఇందుకు అనుమతించకపోవడంతో, మిక్కీ సుప్రీంకోర్టుకు ఆశ్రయించాడు. ఈ కేసులో విజయం సాధించిన మిక్కీకి బస చేసేందుకు హోటల్ గదిని ఇవ్వాలని, తాళం చెవిని కూడా అందించాలని కోర్టు ఆదేశించింది. దీంతో 2019 నుంచి 2023, జూలై వరకు అద్దె చెల్లించకుండా అదే హోటల్లో నివసిస్తున్నాడు. అయితే 2019లో ఒక నకిలీ అగ్రిమెంట్ లెటర్‌ను సృష్టించి, తానే హోటల్ యజమానినని ప్రకటించుకున్నాడు. తరువాత హోటల్ గదుల అద్దెను వసూలు చేయడం మొదలుపెట్టాడు. అనంతరం హోటల్ పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి, నగదు తనకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నించాడు. తాజాగా అతనిపై చీటింగ్ కేసు నమోదయ్యింది. అయితే తాను హోటల్ నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని మిక్కీ ఒక ప్రకటనలో తెలిపాడు. -
Kruger National Park: ట్రైన్ రిసార్ట్
చుట్టూ పచ్చని పచ్చికబయళ్లు, వన్యప్రాణులు. నాలుగు అడుగులేస్తే మన కోసమే ప్రత్యేకంగా ఈతకొలను. ఇంకాస్త పక్కకెళితే ప్రకృతి రమణీయతను చూసేందుకు విడిగా వ్యూ డెక్కులు, మనం ఉన్నచోటు కిందే ఉరకలెత్తుతూ సాగే నది, సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న విలాసవంతమైన గది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర జీవనానికి చిరునామాగా నిలిచే ఇలాంటి చోట కొంతకాలమైనా గడపాలని ఎంతో మంది ఆశ పడతారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రైలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ఒక పాత వంతెనపై హోటల్‌గా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ వనంలో ఈ ‘ది ట్రైన్ ఆన్ ది బ్రిడ్జ్’ హోటల్ ఉంది. ఈ కదలని రైలు అరుదైన అనుభూతిని పంచుతుంది. ఇందులో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలతో 31 సూట్లు సిద్ధంచేశారు. అన్ని రకాల వంటకాలతోపాటు స్థానిక రుచులనూ ఆస్వాదించవచ్చు. గైడ్ల సాయంతో అడవిలోకెళ్లి స్వేచ్ఛగా సింహం, చిరుతపులి, ఏనుగు, నీటిగుర్రం, అడవి బర్రెలను దగ్గర్నుంచి చూసిరావచ్చు. ఒక ట్విన్(జంట)రూమ్‌లో పర్యాటకులు ఒక రాత్రి గడపాలంటే ఒక మనిషికి దాదాపు రూ.44,000 రుసుము వసూలుచేస్తారు. 100 ఏళ్లకు పైబడిన ఈ వంతెనపై గతంలో స్టీమ్ రైళ్లు నడిచేవి. వారసత్వంగా నిలిచిన ఈ వన వంతెనను విభిన్నంగా వినియోగిద్దామని ఈ హోటల్‌కు రూపకల్పన చేశామని మోట్సామయీ టూరిజం గ్రూప్ సీఈవో జెరీ మబేనా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుమారి ఆంటీ హోటల్ రీ ఓపెన్
హైదరాబాద్: ఎట్టకేలకు కుమారి ఆంటీ హోటల్ తెరుచుకుంది. ఐటీ కారిడార్‌లో కోహినూర్ హోటల్ ఎదురుగా ట్రాఫిక్‌జాం నెలకొనడంతో కుమారి ఆంటీ హోటల్‌ను ఇటీవల రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ హోటల్ తొలగింపు వైరల్ కావడంతో సీఎం కార్యాలయం స్పందించింది. ఈ హోటల్‌ను అదే స్థలంలో నడుపుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించడంతో వివాదానికి తెరపడింది. -
రైల్విలాస్: అప్పట్లో రైల్వేస్టేషన్.. ఇప్పుడు హోటల్
ప్రపంచంలోని పురాతనమైన రైల్వేస్టేషన్లలో ఇదొకటి. ఒకప్పుడు రైళ్ల రాకపోకలతో కళకళలాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వేస్టేషన్నే హోటల్‌గా మార్చేశారు. ఇది ఇంగ్లండ్‌లోని పెట్వర్త్లో ఉంది. మిడ్ ససెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వేస్టేషన్‌ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది, ప్రయాణికుల వసతి కోసం స్టేషన్‌కు ఆనుకునే ‘రైల్వే ఇన్’ అనే హోటల్ కూడా వెలిసింది. దాదాపు శతాబ్దానికి పైగా సేవలందించిన పెట్వర్త్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపి వేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతీ గతీ లేకుండా పడి ఉంది. తర్వాత రైల్వేస్టేషన్‌కు మరమ్మతులు జరిపి, 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో రెండు గదులను హోటల్ గదుల్లా మార్చి, అతిథులకు బస కల్పించడం ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్ గదులుగా మార్చి, స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ‘ద ఓల్డ్ రైల్వేస్టేషన్’ పేరుతో పూర్తిస్థాయి హోటల్‌గా మార్చారు. -
దారుణం: భార్యను సముద్రంలో ముంచి చంపి.. ఆపై..!
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించినందుకు నిందితుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని కాబో డి రామా బీచ్‌లో ఈ ఘటన జరిగింది. గౌరవ్ కటియార్(29) సౌత్ గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. దీక్షా గంగ్వార్(27) అనే యువతిని గతేడాదే వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ లక్నోకు చెందినవారు. గోవాలోనే నివసిస్తున్నారు. అయితే.. కటియార్ వివాహేతర సంబంధంపై గంగ్వార్ ఇటీవల ప్రశ్నించింది. దీంతో భార్యను హత్య చేయాలనే కుట్ర పన్నిన కటియార్.. ఆమెను బీచ్‌కు షికారుకు తీసుకువెళ్లాడు. ఎవరూ లేని రాళ్ల ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత యథావిధిగా కార్యాలయానికి తీరిగివచ్చాడు. తన భార్య చనిపోయిందో? లేదో నిర్దారించుకోవడానికి మళ్లీ ఓ సారి వెళ్లి చూశాడు. ఆ తర్వాత తన భార్య నీళ్లలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆందోళన పడుతున్నట్లు హంగామా సృష్టించాడు. అయితే.. ఓ యాత్రికుడు తీసిన వీడియో ఆధారంగా కటియార్ కుట్ర బయటపడింది. కటియార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: డబ్బుల కోసం బామ్మను చంపేశాడు