తిరుపతి: హోటల్‌లో కుప్పకూలిన పైకప్పు | Two Devotees Were Injured After Hotel Ceiling Collapses In Tirupati, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుపతి: హోటల్‌లో కుప్పకూలిన పైకప్పు

Published Tue, Mar 11 2025 7:34 AM | Last Updated on Tue, Mar 11 2025 8:54 AM

Tirupati Hotel Ceiling Collapse Details

సాక్షి, తిరుపతి: నగరంలోని బస్టాండ్‌ సమీపంలోని మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో పైకప్పు కూలింది. రూమ్‌ నంబర్‌ 314లో ఒక్కసారిగా  సీలింగ్‌ కుప్పకూలింది. దీంతో ఆ హోటల్‌లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. 

ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటల్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement