Salt Hotel In Bolivia: Things To Know About This - Sakshi
Sakshi News home page

Salt Hotel: ఉప్పుతో కట్టించిన వింతైన హోటల్‌.. ఈ విషయాలు తెలుసా?

Jun 30 2023 3:09 PM | Updated on Jul 14 2023 3:58 PM

Salt Hotel In Bolivia Things To Know About This - Sakshi

ప్రపంచంలో ఎన్నో వింతలు దాగున్నాయి. కొన్ని సహజసిద్ధంగా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏర్పడితే, మరికొన్ని మానవ నిర్మితాలు అని చెప్పొచ్చు. అలాంటి వాటిలో ఈ హోటల్‌ కూడా ఒకటి. సాధారణంగా మట్టితో, సిమెంట్‌తో భవానలు నిర్మిస్తారు. కానీ ఈ హోటల్‌ నిర్మాణం మాత్రం పూర్తిగా ఉప్పుతో బిల్డ్‌ చేశారు.

హోటల్‌లోని గోడలు, పైకప్పు, మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఉప్పుతోనే కట్టించారు. ఉప్పు అంటే నీళ్లలో కరిగిపోతుంది కదా అని మీకు డౌట్‌ రావొచ్చు. కానీ అలా జరగకుండా పకడ్భందీగా ఈ హోటల్‌ను నిర్మించారు. మరి ఈ వింతైన హోటల్‌ ఎక్కడుంది? దీని  ప్రత్యేకతలు ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం. 


   

హోటల్‌ అంటే కాస్ట్‌లీగా ఉంటే సరిపోదు, ఇలా డిఫరెంట్‌గా కూడా ఉండాలి అనుకున్నారేమో ఏకంగా నిర్మాణం మొత్తం ఉప్పుతో కట్టించి చూపరులను ఆకర్షిస్తున్నారు. ఇది బొలీవియాలో ఉంది. అక్కడ ఉన్న ఎన్నో పర్యాటక ఆకర్షణ ప్రదేశాల్లో ఈ హోటల్‌ కూడా ఒకటి. ‘పాలాసియో డి సాల్‌’ పేరుతో ఉన్న ఈ హోటల్‌ను పూర్తిగా ఉప్పుతో కట్టించారు.

ఈ భవనంలో 12 గదులు, డైనింగ్‌ హాల్స్, గోల్ఫ్‌కోర్స్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉప్పు తోనే తయారు చేశారు.దీంతో హోటల్‌ మొత్తం తెల్లగా మెరుస్తూ చూపరులను భలే కనువిందు చేస్తుంది. ఉప్పు కరిగిపోకుండా ఉప్పు ఇటుకలను ఫైబర్‌గ్లాస్‌తో ప్యాక్‌ చేశారు. దీనివల్ల లోపలికి గాలి, నీరు చొరబడదు. డిఫరెంట్‌ థీమ్‌తో ఉన్న ఈ హోటల్‌ను చూసేందుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement