Bolivia
-
Bolivia: నాటకీయ పరిణామాల మధ్య సైనిక తిరుగుబాటు విఫలం!
సూక్రె: బొలీవియాలో బుధవారం నాటకీయ పరిణామాల నడుమ సైనిక తిరుగుబాటు విఫలమైంది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్ధతుగా అక్కడి ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా అధ్యక్ష భవనాన్ని ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోగా.. సాధారణ పౌరులు సైన్యానికి ఎదురు తిరిగారు. దీంతో.. సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు.బుధవారం బొలీవియాలో హైడ్రామా నడిచింది. లా పాజ్‌లో ఉన్న ప్లాజా మురిల్లో స్క్వేర్ అధ్యక్ష భవనం(ఇదే పార్లమెంట్ భవనం కూడా) వైపు ఆర్మీ వాహనాలు పరేడ్‌గా వెళ్లాయి. తాజా మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా నేతృత్వంలో ఈ తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. సాయుధులైన సైనికులు భవనం ముందు భారీగా మోహరించగా.. మరికొందరు లోపలికి తలుపులు బద్ధలు కొట్టి మరీ ప్రవేశించారు. ఆ సమయంలో అధ్యక్షుడు లూయిస్ ఆసే కుటుంబం లోపలే ఉంది. ఈలోపు ఈ తిరుగుబాటు ప్రయత్నం గురించి దేశమంతా తెలిసింది. అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాలతో జనాలు నిత్యావసరాలు ఎగబడ్డారు. మరోవైపు భారీగా జనం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ ఛార్జితో సైన్యం వాళ్లను చెదరగొట్టే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈలోపు.. ఏం జరిగిందో తెలియదుగానీ సాయంత్రంకల్లా సైన్యం అధ్యక్ష భవనం నుంచి వెనుదిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ భవనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే తిరుగుబాటు కారకుడైన జూనిగాను అరెస్ట్ చేశారు. సాయంత్రం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన వేల మంది పౌరులను ఉద్దేశించి అధ్యక్షుడు లూయిస్ ఆసే అభివాదం చేశారు. బొలీవియా ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సైన్యానికి త్రివిధ దళాధిపతులుగా కొత్త వాళ్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. బొలీవియా జెండా ప్రదర్శిస్తూ జాతీయ గీతం ఆలపించారు ప్రజలు.అయితే.. అరెస్ట్ కంటే ముందు మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా సంచలన ఆరోపణకు దిగారు. ప్రజల్లో తన పరపతిని పెంచుకునేందుకు అధ్యక్షుడు లూయిస్ ఆసే, తనతో కలిసి ఆడించిన డ్రామాగా పేర్కొన్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం జుని ఆరోపణలను కొట్టిపారేసింది. మరోవైపు జునిపై ఎలాంటి అభియోగాలు మోపిందనేదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.కోటి 20 లక్షల జనాభా ఉన్న బొలీవియాలో.. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 2019లో రాజకీయ సంక్షోభం తలెత్తి అప్పటి అధ్యక్షుడు ఎవో మోరేల్స్ అధ్యక్ష పీఠం నుంచి అర్ధాంతంగా దిగిపోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ లూయిస్ ఆసేతో ఎవో మోరేల్స్ పోటీ పడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్థికంగా దిగజారిన పరిస్థితులు ఎన్నికలలోపే బొలీవియాలో ఆర్థిక సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్‌మిన్ - ఎందుకో తెలుసా?
దక్షిణ అమెరికాలో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి యాక్టివ్ మెటీరియల్స్ కోసం పైలట్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి బొలీవియన్ స్టేట్ కంపెనీ 'యాసిమియంటోస్ డి లిటియో బొలీవియానోస్' (YLB)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ బేస్డ్ బ్యాటరీ యాక్టివ్ మెటీరియల్స్ తయారీ కంపెనీ ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ముడి పదార్థాల సరఫరాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా.. లిథియం అయాన్ బ్యాటరీల కోసం కాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ (CAMs) ఉత్పత్తి కోసం ఈ ఒప్పదం జరిగినట్లు తెలుస్తోంది. స్వదేశీ లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో పురోగతి కోసం ఏర్పడిన ఈ సహకారం మొదటిది. ఇది మొత్తం సరఫరా గొలుసును సానుకూలంగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ భాగస్వామ్యం లిథియం కోసం పరిశోధన, అభివృద్ధి, పైలటింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడం.. ద్వైపాక్షిక ముడి పదార్థాల సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలో YLB నుంచి కొంత మంది నిపుణుల బృందం హైదరాబాద్‌లోని ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ సందర్శించింది. ఆ తరువాత బొలీవియన్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ఈ ఒప్పందాన్ని ఆమోదించుకోవడానికి, 'ఆల్ట్‌మిన్'ను బొలీవియాకు ఆహ్వానించింది. ఈ ఒప్పందం ఏర్పర్చుకున్న సందర్భంగా YLB ప్రెసిడెంట్ 'కార్లా కాల్డెరాన్' మాట్లాడుతూ.. ఈ సమావేశం లిథియం అయాన్ బ్యాటరీల క్రియాశీల పదార్థాల సాంకేతిక అభివృద్ధికి సహకారాన్ని అందిస్తుంది, పోటోసిలో పైలట్ ప్లాంట్‌ను అమలు చేయడం ద్వారా, పైలట్ ప్లాంట్ ఈ సంవత్సరం 3 గిగావాట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఆల్ట్‌మిన్ వ్యవస్థాపకుడు,ఎండీ 'మౌర్య సుంకవల్లి' మాట్లాడుతూ.. YLBతో చేతులు కలపడంతో ప్రపంచ బ్యాటరీ మార్కెట్లో కంపెనీ గొప్ప స్థానం పొందుతుందని భవిస్తున్నాము. 2030 నాటికి ఆల్ట్‌మిన్ 10 GWh LFPని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందని వెల్లడిస్తూ.. ఖనిజ విభాగంలో రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ ఒప్పందం ఓ ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. -
ఉప్పుతో హోటల్ని కట్టించారు.. వర్షం వచ్చినా కరిగిపోదు
ప్రపంచంలో ఎన్నో వింతలు దాగున్నాయి. కొన్ని సహజసిద్ధంగా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏర్పడితే, మరికొన్ని మానవ నిర్మితాలు అని చెప్పొచ్చు. అలాంటి వాటిలో ఈ హోటల్ కూడా ఒకటి. సాధారణంగా మట్టితో, సిమెంట్‌తో భవానలు నిర్మిస్తారు. కానీ ఈ హోటల్ నిర్మాణం మాత్రం పూర్తిగా ఉప్పుతో బిల్డ్ చేశారు. హోటల్లోని గోడలు, పైకప్పు, మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఉప్పుతోనే కట్టించారు. ఉప్పు అంటే నీళ్లలో కరిగిపోతుంది కదా అని మీకు డౌట్ రావొచ్చు. కానీ అలా జరగకుండా పకడ్భందీగా ఈ హోటల్‌ను నిర్మించారు. మరి ఈ వింతైన హోటల్ ఎక్కడుంది? దీని ప్రత్యేకతలు ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం. హోటల్ అంటే కాస్ట్లీగా ఉంటే సరిపోదు, ఇలా డిఫరెంట్‌గా కూడా ఉండాలి అనుకున్నారేమో ఏకంగా నిర్మాణం మొత్తం ఉప్పుతో కట్టించి చూపరులను ఆకర్షిస్తున్నారు. ఇది బొలీవియాలో ఉంది. అక్కడ ఉన్న ఎన్నో పర్యాటక ఆకర్షణ ప్రదేశాల్లో ఈ హోటల్ కూడా ఒకటి. ‘పాలాసియో డి సాల్’ పేరుతో ఉన్న ఈ హోటల్‌ను పూర్తిగా ఉప్పుతో కట్టించారు. ఈ భవనంలో 12 గదులు, డైనింగ్ హాల్స్, గోల్ఫ్‌కోర్స్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉప్పు తోనే తయారు చేశారు.దీంతో హోటల్ మొత్తం తెల్లగా మెరుస్తూ చూపరులను భలే కనువిందు చేస్తుంది. ఉప్పు కరిగిపోకుండా ఉప్పు ఇటుకలను ఫైబర్గ్లాస్తో ప్యాక్ చేశారు. దీనివల్ల లోపలికి గాలి, నీరు చొరబడదు. డిఫరెంట్ థీమ్‌తో ఉన్న ఈ హోటల్‌ను చూసేందుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. -
45 ఏళ్ల తర్వాత నానమ్మను కలిసిన వ్యక్తి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!
ఇతరులను సంతోషంగా ఉండాలంటే డబ్బులు, నగలు, ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనస్పూర్తిగా చేసే చిన్న చిన్న పనులు సైతం ఎదుటి వారిలో కొండంత ఆనందాన్ని తీసుకొస్తాయి. వారితో గడిపే కాస్త సమయం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి ఓ అందమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన నానమ్మను కలిసేందుకు ఓ వ్యక్తి స్పెయిన్ నుంచి సౌత్ అమెరికాలోని బొలివియాకు ప్రయాణించాడు. నానమ్మను కలవడంలో ఆశ్యర్యపోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆ వ్యక్తి ఆమెను చూసి 45 ఏళ్లు అవుతోంది. చిన్నతనంలో అన అనే మహిళ అతన్ని తన సొంత కొడుకులా చూసుకుంది. అయితే కొన్నాళ్లకు అతను దూరంగా వెళ్లిపోయాడు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత మహిళను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెపై ఉన్న ప్రేమ అతన్ని స్పెయిన్ నుంచి బొలివియాకు తీసుకువచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నానమ్మను చూసేందుకు ఏకంగా 8 వేల కిలోమీటర్లకు పైగా ట్రావెల్ చేశాడు. బామ్మ దగ్గరకు వెళ్లి తనెవరో చెప్పిన వెంటనే ఆమె పట్టరాణి సంతోషంతో ఉద్వేగానికి లోనైంది. వెంటనే అతన్ని ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకుంది. తన జర్నీని వ్యక్తి మెత్తం రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిని చూసిన ఎవరైనా భావోద్వేగానికి గురవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. వీడియో ఎంతో అందంగా ఉందని, దీనిని చూస్తుంటే తమ కంట్లో నీళ్లు వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. These heartwarming nanny reunions get me every time, @GoodNewsCorres1 ❤️, you got me again. pic.twitter.com/xK35MGL6oy — ☮️💙 Lena L Chen 💙☮️ (@LenaLChen) September 28, 2022 -
పుర్రెల పండుగ
-
లోయలో పడిన బస్సు.. 24 మంది మృతి
లాపాజ్(బొలివియా): దక్షిణ అమెరికాలోని బొలివియాలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 24 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు దాదాపు 100 మీటర్ల లోతు ఉన్న లోయలో పడడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కరోనా బారిన బొలీవియా అధ్యక్షురాలు
లాపాజ్: బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్ అనెజ్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆమె తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని గురువారం ప్రకటించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఐసోలేషన్‌లో ఉండి పని చేయనున్నట్లు తెలిపారు. ఆమె మంత్రివర్గంలోని నలుగురికి కూడా ఈ మధ్యే పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె పరీక్షలు చేసుకోగా తనకు కూడా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అమెరికాలో కరోనా బారిన పడ్డ దేశాధ్యక్షుల సంఖ్య రెండుకు చేరింది. (జుట్టు కత్తిరించి.. ఈడ్చుకెళ్తూ..) ఇంతకుముందు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో తనకు కరోనా సోకిందని మంగళవారం వెల్లడించారు. మరోవైపు లాటిన్ అమెరికాలోని వెనిజులా రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు డియోస్డాడో కాబెల్లో సైతం కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో తర్వాత అత్యంత శక్తివంమైన వ్యక్తిగా కాబెల్లో గుర్తింపు పొందారు. కాగా 11 మిలియన్ల జనాభా ఉన్న బొలీవియాలో సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 43 వేల కరోనా కేసులు వెలుగు చూడగా 1500 మంది మరణించారు. (దేశాధ్యక్షుడైనా మాస్కు ధరించాల్సిందే: కోర్టు) -
జుట్టు కత్తిరించి.. ఈడ్చుకెళ్తూ..
లా పాజ్ : అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణ అమెరికా దేశం బొలీవియా రక్తసిక్తమవుతోంది. అధికార మూమెంట్ ఫర్ సోషలిజం పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు ఉధృతం చేశాయి. ఈ క్రమంలో ఇరు పక్షాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా.. ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్ల విద్యార్థి మృతికి కొచాబాంబ పట్టణ మేయర్ పేట్రిసియా ఆర్సే కారణమంటూ నిరసనకారులు గురువారం ఆందోళన చేపట్టారు. మేయర్ కార్యాలయానికి నిప్పంటించి ఆమెను వీధిలోకి ఈడ్చుకువచ్చి... హంతకురాలు అని అరుస్తూ మోకాళ్లపై కూర్చోబెట్టారు. అనంతరం ఆమెపై ఎరుపు రంగు కుమ్మరించి... ఆపై జుట్టు కత్తిరించి.. చెప్పుల్లేకుండా రోడ్డుపై నడిపిస్తూ అమానుషంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని... పేట్రిసియాను ఆస్పత్రికి తరలించారు. కాగా బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరాల్స్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళా మేయర్‌పై దాడి ప్రతిపక్షాల దురహంకారానికి నిదర్శమని మండిపడ్డారు. ‘ తన అనుచరులను కాపాడేందుకు ప్రయత్నించినందుకు ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించారు. పేదల పక్షాన నిలబడినందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక దేశ ఉపాధ్యక్షుడు అల్వారో గ్రేసియా ఘటనపై స్పందిస్తూ.. ‘ మహిళగా పుట్టడమే ఆమె చేసిన నేరం. నిజాయితీగా ఉండటమే ఆమె తప్పు. మహిళ అయినందుకే ఈ ఘోరం అని వ్యాఖ్యానించారు. ఇక అధికార పార్టీ మహిళా విభాగం కూడా ఘటనపై తీవ్రంగా స్పందించింది. మేయర్‌పై దాడిని.. జాత్యహంకార, వివక్షాపూరిత, హింసాత్మక ఘటనగా అభివర్ణించింది. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని.. ఫాసిస్టు నాయకుల అహంకారానికి నిదర్శనమని పేర్కొంది. కాగా 2006లో బొలీవియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఎవో మారెల్స్.... ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి మరోసారి అధికారం చేజిక్కించుకున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
‘మమ్మీ’ రాకుమారి తన దేశానికి వెళ్లిపోయింది
సూకర్ : 500 ఏళ్లనాటి బొలీవియన్ ‘మమ్మీ’ రాకుమారి సొంత దేశానికి తిరిగి వెళ్లిపోయింది. 129 సంవత్సరాల క్రితం అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ మ్యూజియానికి ఇచ్చిన మమ్మీని బొలీవియా వెనక్కు తెప్పించుకుంది. ఇతర దేశాలకు ఇచ్చిన పురాతన వస్తువులను తిరిగి తెచ్చే చర్యల్లో భాగంగా బొలీవియా ఈ నిర్ణయం తీసుకుంది. లా పజ్‌లోని యూఎస్ ఎంబసీ అధికారుల సహకారంతో మమ్మీ సొంత దేశానికి తరలివెళ్లింది. నవంబర్‌నుంచి బొలీవియన్ విద్యావేత్తలు, ఇతర పరిశోధకుల నేతృత్వంలో రాకుమారిపై పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. ఈ మమ్మీ 15వ శతాబ్దానికి చెందినదని రేడియో కార్బన్ పరిశోధనల్లో తేలింది. రాకుమారి ఆండియన్ హైలాండ్స్కు దగ్గరలోని లా పజ్ ‘‘ఇంకా నాగరిత’’కు చెందినదిగా పురావస్తు పరిశోధకులు గుర్తించారు. ఈమె ఏనిమిదేళ్ల వయస్సులో సమాధి చేయబడినట్లు భావిస్తున్నారు. సమాధి నుంచి వెలికి తీసినపుడు రాకుమారి చెప్పులు ధరించి ఉంది. మట్టి పాత్రలతో పాటు ఇతర వస్తువులు, ఈకలు, మొక్కలు సమాధిలో ఉన్నాయి. ఇప్పటికీ మమ్మీ రాకుమారి చేతి వేళ్ల మధ్య ఈకలు ఉండటం మనం గమనించవచ్చు. -
పని చేయలేదని పనిపట్టారు..!
ప్రజాప్రతినిధి అంటే మన కోసం మనం ఎన్నుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మన కోసం పనిచేయకపోతే.. తన పనితీరు మనకు నచ్చకపోతే.. ఏం చేస్తారు.. ఆ.. ఏముంది చేసేందుకు.. మన ఖర్మ అని నోరు మూసుకుని కూర్చోవడం తప్ప.. అనుకుంటాం కదా..! కానీ బొలీవియాలోని బ్యూనవెంచురా అనే మున్సిపాలిటీలో ప్రజలు మాత్రం అలా చేతులు ముడుచుకుని కూర్చోరు. ప్రజా సేవలో కాస్త అలసత్వం ప్రదర్శించినా నిలదీ యడమే కాదు.. వారికి తెలిసొచ్చేలా బుద్ధి చెబుతారు. అక్కడి మేయర్ జావియర్ డెల్గడో తన విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు తగిన శాస్తి చేశారు అక్కడి ప్రజలు. ఆ మేయర్ కాలును ఓ స్తంభానికి గంటపాటు కట్టేశారు. దీనివల్ల వారి అసంతృప్తి సదరు ప్రజాప్రతినిధికి తెలిసి మరుసటి రోజు నుంచి ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడని వారి ఆశ. అక్కడ ప్రభుత్వం నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్లిన జావియర్‌కు అక్కడి జనం షాక్ ఇచ్చారు. అయితే తన రాజకీయ ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని, ప్రజలకు సేవ చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని జావియర్ చెబుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తమ ప్రజాప్రతినిధులు అందిస్తున్న సేవలతో అసంతృప్తి కనుక ఉంటే ప్రజలు ఇలా శిక్ష విధించవచ్చని అక్కడి రాజ్యాంగం కూడా హక్కును ప్రసాదించింది. -
కార్నివాల్ సంబరాల్లో 40 మంది మృతి
లా పాజ్ : బొలీవియాలో కార్నివాల్ వీకెండ్ సంబరాల్లో 40 మంది చనిపోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారని బొలివియా అంతర్గత మంత్రి కార్లోస్ రోమెరో తెలిపారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం..16 మంది రోడ్డు ప్రమాదాల్లో, 8 మంది ఫుడ్ స్టాల్ వద్ద గ్యాస్ ట్యాంక్ పేలడం వల్ల, మరో ఆరుగురు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారని వెల్లడించారు. నలుగురు నరహత్యకు గురయ్యారని, ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరో వ్యక్తి హైపోధెర్మియాతో చనిపోయారని తెలిపారు. గత సంవత్సరం 2017 కార్నివాల్ సంబరాల్లో 67 మంది చనిపోయారని పోలీసులు చెప్పారు. -
మనషుల పుర్రెలతో పండుగ చేస్తారంట..!
బొలివీయా: కుటుంబంలో చనిపోయిన వారి ప్రతిరూపంగా వారిపేరు మీద ధాన ధర్మాలు చేయటం మనం చూసింటాం. కానీ బొలివియా ప్రజలు మాత్రం తమదైన రీతిలో ప్రేమను చాటుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో బొలివీయా ప్రజలు నటిటాస్ పండుగ జరుపుకుంటారు. కుంటుంబంలో చనిపోయిన వారి పుర్రెలను పూలతో చాలా అందంగా డెకరేట్ చేస్తారు. వాటిని ఈ సందర్భంగా ఎంతగానో ఆరాదిస్తారు. చనిపోయిన వాళ్లు మళ్లీ పుడుతారనే నమ్మకంతో ఈ విధంగా చేస్తారు. అంతేకాక తమ జీవితం చాలా అందంగా ఉండేలా చూడాలని ఆ పుర్రెలను కోరుతారు. అంతేకాక వారి ప్రతిరూపంగా పుర్రెలను తమతో కుటుంబాలు ఉంచుకుంటాయంట. మరికొందరు ఆ పుర్రెలను ప్రార్థన ఆలయాలకు తీసుకెళ్లి ప్రార్థనలు చేస్తారని తెలిసింది. ఆ పుర్రెలను వారు పూలతో, కళ్లజోడు పెట్టి రకరకాలుగా ఆలంకరించి వారి ప్రేమను ఈ విధంగా చూపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈ పండుగను డ్యాన్స్‌లతో చాలా సంతోషంగా జరుపుకుంటారని తెలుస్తోంది. మరికొన్ని పుర్రెలకు కుటుంబంలోని సభ్యులు సిగరేట్స్ నోట్లో పెట్టి, వాటి ముందు కొవ్వొత్తి పెట్టి అంటించుకున్నట్లుగా పెట్టి అభిమానాన్ని ఇలా చూపించారు. -
‘సాహసాన్ని’ చంపేశారు..
ప్రాణం అంటే అతనికి లెక్కలేదు. పోరాటం అంటే వెనక్కి తిరిగే అలవాటూ లేదు. సామ్రాజ్య వాదానికి వెన్ను చూపించే తత్వం అంత కన్నా కాదు. విప్లవానికే ఓ కొత్త పాఠంగా నిలిచాడు. యుద్ధానికి భయం నేర్పాడు. అతడే ప్రపంచ విప్లవకారుడు చే గువేరా. కాని సామ్రాజ్యావాదాన్ని గడగడలాడించిన ‘చే’ ఎక్కువ రోజులు బతకలేకపోయాడు. అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మారిన చే గువేరా మరణం వెనుక అనేక కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయి. ప్రజానేతగా ఎదిగి ప్రభుత్వాలకు ముచ్చెటములు పట్టించిన చే గువేరా మరణం గురించి నేటి ‘బిలీవ్’ లో తెలుసుకుందాం! అది 1967 అక్టోబర్ 9.. వల్లెగ్రాండె, బొలీవియా. సామ్రాజ్య వాద వికృత రూపం విరుచుకుపడింది. పోరాటానికే పాఠాలు నేర్పిన వీరుడి చరిత్ర కాల గర్భంలో కలిసిపోయింది. ప్రపంచమంతా స్వేచ్చా వాయువులు పీల్చాలని కోరుకున్న గొంతు మూగబోయింది. ఆర్మీ జరిపిన కాల్పుల్లో విప్లవ వీరుడు చే గువేరా చనిపోయినట్లు బొలీవియా ప్రభుత్వం ప్రకటించింది. కాని నిర్జీవంగా పడి ఉన్న చే గువేరా దగ్గరకు రావడానికి కూడా ఏ ఒక్క సైనికుడు ధైర్యం చేయలేదు. ఎవరీ ‘ చే ’.. చే గువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలోని ఓ ఉన్నత కుటుంబంలో జన్మించాడు. చిన్న నాటి నుంచే విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. అందులోనూ సాహసగాధలంటే ఎంతో ఇష్టపడేవాడు. ఇంజిన్ అమర్చిన సైకిల్ మీద అర్జెంటీనా అంతా ప్రయాణం చేసి ప్రజల జీవన విధానాలను మనసుతో చూశాడు. ప్రజలు పడుతున్న బాధలను శాశ్వతంగా రూపుమాపాలని వైద్య విద్యను చదివాడు. అనారోగ్యంతో బాధపడేవారి జీవితాల్లో వెలుగునింపాలని ఆలోచించేవాడు. చివరగా డాక్టర్ డిగ్రీ చేతికి రాగానే ప్రజలకు సేవ చేస్తూ మళ్లీ దేశమంతటా యాత్ర చేశాడు. అక్కడి నుంచి లాటిన్ అమెరికా వెళ్లాడు. గెరిల్లా నాయకుడిగా..! లాటిన్ అమెరికాలోనూ ప్రజల దుర్భర జీవితాలను గమనించిన చే వారి బతుకులు మార్చడంకోసం ఏ వైద్యం చేయగలం, ఏ మెడిసిన్ ఇవ్వగలం అంటూ మదనపడుతున్న సమయంలోనే 1955 మెక్సికోలో క్యూబా ప్రవాస విప్లవకారుడు ఫీడల్ కాస్ట్రోతో పరిచయం ఏర్పడింది. క్యూబా విప్లవంలో డాక్టర్‌గా చేరాడు. అనంతరం దోపిడీకి గురవుతున్న ప్రజలకు విప్లవాత్మక మెడిసిన్ అవసరమని భావించి విప్లవకారుడిగా పరిణితి చెంది విప్లవ గెరిల్లా దళానికి నాయకుడయ్యాడు. క్యూబా స్వాతంత్య్రం కోసం అస్తమా వ్యాధిని సైతం లెక్కచేయకుండా చే నిజమైన గెరిల్లా నాయకుడయ్యాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా..! 1959లో క్యూబా స్వాతంత్య్రం రావడంతో అక్కడి ప్రభుత్వంలో చే గువేరా పరిశ్రమల మంత్రిగా, జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా, ప్రణాళిక సంఘం అధ్యక్షుడి వంటి ఎన్నో బాధ్యతలను నిర్వహించాడు. క్యూబా ఒక్క దేశాన్ని విముక్తి చేసినంత మాత్రానా సామ్రాజ్యవాదం అంతరించిపోయిందనుకోవడం సరైంది కాదని అన్ని దేశాలను దీని నుంచి విముక్తి కలిగించాలనుకున్నాడు. వెంటనే అక్కడ తనకున్న అన్ని పదువులను వదిలేసి తను అత్యంత ఇష్టపడే స్నేహితుడు కాస్ట్రో, క్యూబా ప్రజలకూ వీడ్కోలు పలికి ప్రపంచ దేశాలను తిరగడం మొదటుపెట్టాడు. అనంతరం కమ్యూనిస్టు గెరిల్లా్ల దళాన్ని స్వయంగా తయారు చేసుకుని విప్లవోద్యమాన్ని నిర్మించి నాయకత్వం వహించాడు. కాంగో ప్రజలకు బాసటగా..! ఆఫ్రికా చీకటి ఖండంగా మారడానకి కారణం..సామ్రాజ్యవాద శక్తులే కారణమని భావించిన చే కాంగో వెళ్లి పోరాటం మొదలుపెట్టాడు. కాని ఇక్కడ చే వేసే ప్రతి అడుగును అమెరికా పసిగట్టింది. ఎలాగైనా చే ను ఆపకుంటే ప్రపంచాన్నంత విప్లవబాటలోకి తీసుకెళ్తాడని భావించింది. ఈ సమయంలోనే కాంగో తిరుగుబాటుదారుల నుంచి చే కు అనుకున్నంత మద్దతు లభించలేదు. కాంగో నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. క్యూబా వెళ్లాలనుకున్నా అక్కడ క్యాస్ట్రో అప్పటికే చే పై చెడు ప్రచారం ప్రారంభించాడు. దీంతో అక్కడి నుంచి బొలీవియా చేరుకుని అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. రహస్య ఆర్మీతో..! తన విప్లవ మేధస్సుతో 50 మంది గెరిల్లాలతో 1800 మంది కలిగిన బొలీవియా నియంత సైన్యాలను గడగడలాడించాడు. అమెరికా ప్రభుత్వ సామ్రాజ్యవాద శక్తులతో ప్రజలను ఎలా హింసిస్తుందో వివరించే ప్రయత్నం చేశాడు. కాని ముందుగానే పసిగట్టిన అమెరికా బొలీవియన్ ఆర్మీలో రహస్యంగా.. చే ను చంపేందుకు ఓ వింగ్‌ను ఏర్పాటు చేసింది. చే బతికి ఉంటే తమ ప్రయోజనాలను దెబ్బ తీస్తాడని ఎలాగైనా చే ను అంతమొందించాలని ఆర్మీకీ సంకేతాలు పంపింది. 1967 అక్టోబర్ 7న తిరుగుబాటు దారులతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలని ఓ రహస్య సమావేశాన్ని చే నిర్వహించాడు. ఈ సమావేశాన్ని ముందుగానే గమనించిన ఆర్మీ అక్కడికి చేరుకుంది. చే ను టార్గెట్ చేస్తూ కాల్పులు ప్రారంభించింది. మోకాళ్లకు తగిలిన బుల్లెట్లతో చే ముందుకు నడవలేకపోయాడు. విల్లీ అనే గెరిల్లా చే ను భుజాలపై ఎత్తుకొని పరిగెత్తుతుండగా ఆర్మీ చుట్టుముట్టి వారిని ప్రాణాలతో పట్టుకుని రహస్య ప్రదేశానికి పంపింది. కాని అమెరికా ప్రభుత్వం చే ను చంపకుంటే విప్లవం పెరిగిపోతుందని బొలీవియా సహా పలు దేశాలను సంకేతాలు పంపింది. దీంతో బొలీవియన్ ప్రెసిడెంట్ రెయిన్ బారియంట్.. చే ను చంపాలని ఆర్మీనీ ఆదేశించాడు. దీంతో రహస్య ప్రదేశంలో ఉన్న చే, విల్లీల దగ్గరకు ఓ సైనికుడు కాల్పులు జరిపేందుకు వచ్చాడు. కాని చే ను చూడగానే గడగడ వణికిపోయాడు. నన్ను చంపు అంటూ చే గర్జిండంతో భయపడిన..సైనికుడు వెంటనే తన వద్ద ఉన్న రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. అంతే ఒక్కసారిగా చే విప్లవం విజయం సాధిస్తుందని నినాదం చేస్తూ ప్రాణాలు విడిచాడు. అంతే ఇక ఆ విప్లవ యోధుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
విషపూరిత చీమలతో చిత్రహింసలు!
కరనావి: చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి చిత్రహింస చేయగా ఓ మహిళ మృతిచెందింది. ఓవైపు న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా మరోవైపు ఈ విషాదఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ దుర్ఘటన బొలివియాలోని కరనావి మునిసిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసు అధికారి గంటర్ అగుడో కథనం ప్రకారం.. స్థానిక కరనావి పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తి కారును చోరీ చేశారు. చుట్టుపక్కల ఇంట్లో ఉండే ఓ యువకుడి పనేనంటూ అతడిని చెట్టుకు కట్టేశారు. యువకుడికి మద్ధతు తెలిపినందుకు సోదరితో సహా తల్లి(52)ని అదే చెట్టుకు కట్టేశారు. కొన్ని గంటలపాటు చెట్టుకు కట్టేసి ఉంచారన్న సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లి ఆ ముగ్గురిని విడిపించారు. స్థానికులు విషపూరిత చీమలను వారిపై వదిలి చిత్రహింసలకు గురిచేసినట్లు అనుమానిస్తున్నారు. విషపూరిత చీమలు వారిని సజీవంగా కొరికి తినడం మొదలుపెట్టాయి. కొన్ని చీమలు వారి శరీరంపై స్వల్ప గాయాలు చేయగా, మరికొన్ని చీమలు వారి గొంతు, నోటి నుంచి శరీరంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అన్నాచెల్లెళ్ల పరిస్థితి ఒకే కానీ వీరి తల్లి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే అస్పత్రికి తరలించాం. ఆ చీమలు, కీటకాలు అప్పటికే చేయాల్సిన నష్టాన్ని చేసేశాయి. మహిళ తీవ్ర శ్వాససమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వివరించారు. నిజానికి కారు చోరీకి, ఈ ఫ్యామిలీకి సంబంధం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే బాధితుల పేర్లను వెల్లడించేందుకు వారు నిరాకరించారు. -
నా చివరి ఆలోచనలన్నీ ఈ విప్లవ వీరులతోనే..
‘‘క్యూబాకు సంబంధించి అన్ని బాధ్యతల నుంచి విముక్తం అవుతున్నానని మరోసారి చెబుతున్నా... ఇంకో దేశంలో... మరో ఆకాశం నీడన అంతిమఘడియలు సమీపిస్తే... నా చివరి ఆలోచనలన్నీ ఈ దేశ విప్లవ వీరులతోనే ముఖ్యంగా నీ ఆలోచనలతో ముప్పిరిగొంటాయి. నీవు నేర్పిన పాఠాలు.. అందరికీ ఆదర్శంగా నిలిచిన నీ వ్యక్తిత్వాన్ని చివరి వరకూ గుర్తుంచుకుంటా. అంతే బాధ్యతతో మెలుగుతా. నా జీవితం ఎక్కడ అంతమైనప్పటికీ క్యూబా విప్లవకారుల్లో ఒకడిగానే బాధ్యతగా వ్యవహరిస్తా.. నడుచుకుంటా కూడా. భార్య, పిల్లల కోసం ఏమీ వదిలివెళ్లడం లేదు. ఇందుకు బాధ ఏమీ లేదు సరికదా... ఆనందంగా ఉంది. రాజ్యం (క్యూబన్ ప్రభుత్వం) ఎలాగూ వాళ్ల జీవనానికి, విద్యాబుద్ధులు నేర్పించడానికి తగినంత చేస్తుంది కాబట్టి.. వాళ్లకు అది చేయమని, ఇది చేయమని కూడా నేను కోరదలచుకోలేదు.’’ - ఫిడెల్ క్యాస్ట్రోకు క్యూబా విప్లవ వీరుడు చే గువేరా రాసిన ఉత్తరంలో ఒక భాగం (క్యూబాను వదిలి లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవ మార్గాన్ని వేసేందుకు బొలివియా వెళ్లిపోతున్న సందర్భంగా చే గువేరా రాసిన ఉత్తరంలో ఓ భాగం) -
మంత్రిని అపహరించి హతమార్చారు
బొలీవియా: కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చలేదని డిప్యూటీ మినిస్టర్ ను కిడ్నాప్ చేసి కిరాతకంగా హతమార్చిన ఘటన బొలీవియాలో చోటు చేసుకుంది. ప్రైవేటు కంపేనీలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా గని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులున్న ఆ దారి గుండా వెళుతున్న డిప్యూటీ మంత్రి రొడాల్ఫో ఇల్లాన్న్ ను చుట్టు ముట్టిన కార్మికులు ఆయనను అపహరించి, హతమార్చారని బొలీవియా ప్రభుత్వం తెలిపింది. బొలీవియా ప్రభుత్వ మంత్రి కార్లోస్ రొమేరో ఇది కిరాతక చర్యగా అభివర్ణించారు. డిప్యూటీ మినిస్టర్ మృతదేహాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా ఆయన ఆందోళన కారులను హెచ్చరించారు. గత కొంత కాలంగా బొలీవియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గని కార్మికులు ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. దీంతో ఇద్దరు ఆందోళనకారులను పోలీసులు హతమార్చారు. -
పుర్రెల పండుగ
-
మెక్సికోను నిలువరించిన బొలివియా
వినా డెల్ మార్ (చిలీ): స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్నప్పటికీ... పట్టుదలతో పోరాడిన బొలివియా జట్టు కోపా అమెరికా కప్ తొలి మ్యాచ్‌తోనే పాయింట్ల ఖాతా తెరిచింది. ప్రపంచ 23వ ర్యాంకర్ మెక్సికో జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌ను 89వ ర్యాంకర్ బొలివియా ‘డ్రా’గా ముగించింది. పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లున్న మెక్సికోను మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా చేయనీయకుండా బొలివియా ఆటగాళ్లు అడ్డుకోవడం విశేషం. ‘డ్రా’ ఫలితంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. -
బొలీవియా
ప్రపంచవీక్షణం నైసర్గిక స్వరూపం ఖండం - దక్షిణ అమెరికా వైశాల్యం - 10,98,581 చ.కి.మీ. జనాభా - 1,05,56,102 (తాజా జనాభా లెక్కల ప్రకారం), రాజధాని- లా పాజ్, కరెన్సీ - పెసో, ప్రభుత్వం - యునిటరీ ప్రెసిడెన్షియల్ కాన్‌స్టిట్యూష నల్ రిపబ్లిక్, భాషలు- స్పానిష్, క్వెచువా, అయిమారా, మతం - క్రైస్తవులు వాతావరణం - జనవరి-జులై మధ్య 1 నుండి 17 డిగ్రీలు, ఆగష్టు -డిసెంబర్ మధ్య 6 నుండి 19 డిగ్రీలు ఉంటుంది. పంటలు - బంగాళదుంప, మొక్కజొన్న, చెరకు, వరి, కసావా, కాఫీ, లామాస్. ఖనిజాలు - తగరం, రాగి, సీసం, జింకు, సల్ఫర్, ఇనుము, సహజవాయువులు, టంగ్స్టన్, వెండి, బంగారం, బిస్మత్, ఆంటిమొనీ మొదలైనవి. పరిశ్రమలు - గనులు, సహజవాయువులు, చమురుశుద్ధి, దుస్తులు, హండీక్రాప్ట్, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమ, ఎగుమతులు - తగరం, ఆంటిమోనీ, టంగ్స్టన్, జింకు, వెండి, సీసం, సహజవాయువులు. స్వాతంత్య్రం వచ్చింది - 1825 ఆగష్టు 6న, సరిహద్దులు - పరాగ్వే, చిలీ, అర్జెంటీనా, పెరూ, బ్రెజిల్ పరిపాలన దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 9 డిపార్ట్మెంట్లుగా విభజించారు. వీటిని తిరిగి ప్రావిన్స్‌లుగా, మున్సిపాలిటీలుగా, కాంటన్‌లుగా విభజించారు. అన్ని ప్రాంతాల్లో స్వతంత్రపాలన ఉంటుంది. అన్నింటినీ దేశాధ్యక్షుడు పర్యవేక్షిస్తాడు. మనదేశంలో రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపాలిటీలుగా విభజించినట్లన్నమాట. ప్రజలు-సంస్కృతి: ఇక్కడ లాటిన్ అమెరికా సంస్కృతి దర్శనమిస్తుంది. దేశప్రజలు తమ గతకాలపు సంస్కృతిని కాపాడుకోవడానికి వివిధ దేశవాళీ పండుగలను నిర్వహించుకుంటారు. వీటిలో ముఖ్యమైనది-‘కాపోరేల్స్’ దీనిని దేశమంతటా జరుపుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రీతులలో వస్త్రధారణ చేస్తారు. మొత్తంగా చూస్తే దేశంలో 30 రకాల వస్త్రరీతులు కనబడతాయి. మహిళలు భుజాల నుండి మోకాళ్ల కింది వరకు వచ్చే స్కర్టు ధరిస్తారు. ఆహారం: ఇక్కడి ప్రజలు తినే మధ్యాహ్న భోజనాన్ని అల్‌మూర్జో అంటారు. ఈ భోజనంలో సూప్, మాంసం, అన్నం, బంగాళదుంపలు ఉంటాయి. ఉదయంపూట మనం తినే కజ్జికాయలు లాంటివి తయారుచేస్తారు. వీటిని వెన్న, ఉల్లిపాయలు, ఆలివ్‌లు, లోకోటోలతో కలిపి తయారుచేస్తారు. పందిమాంసం, సూప్, బీన్స్‌వేపుడు వంటివాటిని భోజనంలో తీసుకుంటారు. బొలీవియా టీ(చాయ్)ని ఆపి అంటారు. ఇది నిమ్మరసం, మొక్కజొన్నపిండి, యాలకులు, లవంగాలు, కోకో ఆకులు మిశ్రమం చేసి పొడిని తయారుచేసి ఆ పొడిని వేడినీటిలో వేసి కాచి వడబోసి తాగుతారు. వరి అన్నం, వెన్న కలిపి తయారు చేసే వంటకాన్ని ఆర్రోజ్ కాన్ క్వెసో అంటారు. బొలీవియాలో వరి అన్నం పుష్కలంగా దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ వరిధాన్యం బాగా పండుతుంది. 1. లాపాజ్: బొలీవియా దేశానికి పరిపాలన రాజధాని నగరం. ఈ నగరం మొత్తం కొండలపైనే ఉంటుంది. ప్రపంచంలో అతి ఎత్తై రాజధాని నగరం లాపాజ్. ఇది భూమి నుండి దాదాపు 3650 మీటర్ల ఎత్తులో ఉంది. అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదే. ఈ నగరం 15వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. చుట్టూ ఆండీస్ పర్వత శ్రేణులు నగరాన్ని ఎంతో అందాన్ని ఇస్తుంటాయి. నగరంలో సగర్‌నాగ వీధి ఎప్పుడూ యాత్రీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. నగరంలో దయ్యాల మార్కెట్ కూడా ఉంది. ఈ మార్కెట్లో ఎండబెట్టిన కప్పలు, కొన్ని సముద్ర జంతువులను అమ్ముతారు. బ్లాక్ మార్కెట్ అని పిలుచుకునే మెర్కాడో నెగ్రో అనే ప్రాంతంలో ఎక్కువగా దుస్తులు, సంగీత పరికరాలు అమ్ముతారు. నగరంలో ఇంకా కల్లెజాన్, ప్లాజా మురిల్లో, వల్లెడిలా లూనా ప్రాంతాలతో బాటు సాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియం, టివనాకు మ్యూజియం, కోకా మ్యూజియం, మ్యూజియం ఆఫ్ మెటల్స్లను చూడాల్సిందే! 2. వెండి గనులు: బొలీవియాలో వెండిగనులు పోటోసిలో ఉన్నాయి. ఇక్కడ క్రీస్తుశకం 1545 నుండి కొండలను తవ్వి వెండిని తీస్తున్నారు. ఈ నగరాన్ని సెర్రోరికో అంటారు. ఒకప్పుడు ఈ నగరం మొత్తం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరంగా పేరుగాంచింది. ఈ గనులలోకి పర్యాటకులు వెళ్ళి అక్కడి గనుల తవ్వకాన్ని, ముడి ఖనిజాలను స్వయంగా చూడవచ్చు. ఈ గనులు భూమికి 240 మీటర్ల లోతులో ఉంటాయి. గనిలోపలి భాగాన్ని పైలావిరి అంటారు. ఇందులోకి పర్యాటకులు నేరుగా వెళ్ళే అవకాశం ఉంది. గని ముందుభాగంలో గనులరాజు బొమ్మ విచిత్రంగా కనబడుతుంది. ఇక్కడ వెండిని గత 455 సంవత్సరాలుగా నిరంతరం వెలికితీస్తూనే ఉన్నారు. ఈ గనులలో దాదాపు 10 వేలమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. 3. ఉయుని ఉప్పు మైదానం: ఇది పోటోసి నగరానికి సమీపంలో ఉంది. దేశానికి దక్షిణ భాగంలో ఉంది. ఇది 11 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఉప్పు మైదానంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ఉప్పు ఎడారిగా పిలవవచ్చు. ఈ ఉప్పు మైదానం సముద్రమట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఇలా ఉప్పు ఎడారి ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం ఒక సముద్ర ద్వీపం. దాదాపు 13వేల సంవత్సరాల క్రితం ఇందులోని నీరంతా ఆవిరైపోయి ఉప్పు మాత్రమే మిగిలింది. మధ్యభాగంలో ఉప్పు 10 మీటర్ల మందంలో ఉంటుంది. ఈ ఉప్పు ఎడారి మీద నిలబడితే మేఘాలు మనల్ని తగులుతూ కదులుతుంటాయి. పర్యాటకులకు ఇదో విచిత్రమైన అనుభవం. ఎప్పుడు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఎడారిమీద గాలివీయడం వల్ల మైదానంలో పాలిహైడ్రల్ గుర్తులు ఏర్పడతాయి. వాటిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఫ్లెమింగోలు, ఆండియన్‌జాతి నక్కలు అధికంగా అగుపిస్తాయి. రాజధాని లాపాజ్ నుండి దాదాపు 12 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. 4. జెసూట్ మిషన్స్: ఇది ఒకప్పుడు అడవి. ఇక్కడికి క్రైస్తవ మిషనరీలు వచ్చి ఆటవికులనందరినీ క్రైస్తవులుగా మార్చారు. ఆ తర్వాత స్పెయిన్ దేశం బొలీవియాను తమ అధీనంలోకి తీసుకున్నాక ఈ ప్రాంతంలో చర్చిల నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతాన్ని చికిటో అంటారు. ఈ ప్రాంతం 16వ శతాబ్దంలో కనుగొనబడి నేటికీ ఆనాటి వాతావరణంలోనే ఉండడం ఒక గొప్ప విశేషం. ఇక్కడి నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే విషయం. చర్చిల లోపల ఎంతో అందమైన నిర్మాణశైలి కనబడుతుంది. బంగారంతో చేసిన అలంకరణలు నేటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రదేశం సాంటాక్రజ్‌కు సమీపంలో ఉంది. మొదట జెసూట్లు ఇక్కడికి వచ్చి భూమి మీద దేవుడి నగరాన్ని నిర్మించాలని పూనుకున్నారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు వెళితే 17వ శతాబ్దపు కాలంలోకి వెళ్లినట్లుగా అనుభూతి కలుగుతుంది. 1991లో ఈ మొత్తం ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేసింది. చరిత్ర: దక్షిణ అమెరికా ఖండంలో బొలీవియా ఒక నిత్యదరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న దేశం. ఇక్కడ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. ప్రభుత్వ అస్థిరత చాలా తీవ్రంగా ఉంది.16వ శతాబ్దంలో ఈ దేశం స్పెయిన్ దేశపు రాజుల అధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ పనులు చేయడానికి భారతదేశం నుండి ప్రజలను తీసుకువచ్చి బానిసలుగా మార్చి, వ్యవసాయ పనులు చేయించారు. అలా భారతీయులు శతాబ్దాలుగా అక్కడ బానిసలుగా బ్రతికి, ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అక్కడ ప్రజలుగా మారిపోయారు. ఇతర దేశాలు వీలైనంతగా ఈ దేశ భూభాగాన్ని లాక్కున్నాయి. 1952 తర్వాత మాత్రమే భారతసంతతి వారికి కొంత లాభం చేకూరింది. దేశంలో దాదాపు 50 శాతం భూమి వ్యవసాయానికి గానీ, నివాసానికి గానీ వీలుగా లేదు. జనాభా అంతా కేవలం 50 శాతం భూభాగంలోనే కేంద్రీకృతమైంది. -
వాహనాన్ని రక్షించబోయి కొట్టుకుపోయిన సైనికులు
-
అన్వేషణం: బొలీవియాలో బోలెడంత ఉప్పు!
సముద్రం ఉన్న ప్రతిచోటా ఒప్పు మడులు ఉండటం సహజం. కానీ బొలీవియాలో ఉన్న ఉప్పుమడి అన్నిటిలాంటిదీ కాదు. దాన్ని చూస్తే ఉప్పు మడిని చూసినట్టు ఉండదు. అసలు అక్కడి నేలే ఆ రంగులో ఉందేమో అన్నట్టుగా ఉంటుంది. బొలివియాలోని పొటోసీ రీజియన్‌లో ఉంటుంది సలార్ డి ఉయునీ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పుమడి. 10,582 చదరపు కిలోమీటర్ల మేర ఉండే ఈ మడిలో పది మీటర్ల మందాన ఉప్పు మేట వేసి ఉంటుంది. అందుకే దీని మీద భారీ వాహనాలను అతి వేగంగా నడిపినా ఏమీ కాదు. ఒకప్పుడు ఇక్క చాలా ఉప్పునీటి సరస్సులు ఉండేవట. వాతావరణంలో వచ్చిన పలు భారీ మార్పుల కారణంగా ఇవన్నీ ఉప్పుమేటలుగా మారిపోయాయి. తద్వారా ఇంత పెద్ద విస్తీర్ణం గల ఉప్పుమడి ప్రత్యక్షమయ్యింది. ఇదంతా నలభై రెండేళ్ల క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది. ఈ ఉప్పుమడిలో సోడియం, పొటాషియం, లిథియం, మెగ్నీషియం పాళ్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లిథియం. ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారు చేయడానికి లిథియం చాలా కీలకం. ప్రపంచంలో వాడే మొత్తం లిథియంలో నలభై మూడు శాతం బొలీవియా నుండే వెళుతోంది. ఇందులో అధిక భాగం సలార్ డి ఉయునీ నుంచే లభిస్తోంది. అది మాత్రమే కాక టూరిజం ద్వారా బోలెడంత ఆదాయం సమకూరుతోంది. ఉప్పుమేటనేం చూస్తాం అనుకోవడానికి లేదు. కొన్ని కిలోమీటర్ల మేర, ఎక్కడా మట్టి అన్నదే కనిపించకుండా, నేలమీద తెల్ల పెయింటు ఒలకబోసినట్టుగా, స్వచ్ఛంగా ఉండే ఆ మేటలు చూడటానికి బోలెడంతమంది సందర్శకులు వస్తుంటారు. సూర్యుని కిరణాలు పడి ఉప్పుమేట రకరకాల రంగుల్లో మెరుస్తూ ఉంటే, చూసి ఎంజాయ్ చేస్తారు. వాహనాల్లో మడి అంతా తిరుగుతూ సంబరపడతారు. అందుకే... అవడానికి ఉప్పుమడే అయినా, సలార్ డి ఉయునీ ఓ ప్రముఖ సందర్శనీయ స్థలమైంది! ఆ రెస్టారెంటుకెళ్తే పేషెంటవ్వాల్సిందే! లాత్వియాలో హాస్పిటాలిస్ అనే రెస్టారెంటు ఉంది. పేరుకే ఇది రెస్టారెంట్. లోపల హాస్పిటల్. టేబుళ్లకు బదులు స్ట్రెచర్లు ఉంటాయి. కుర్చీల స్థానంలో ఆసుపత్రుల్లో వాడే స్టూళ్లు ఉంటాయి. చివరకు లైట్లు కూడా ఆపరేషన్ థియేటర్లో ఉండేలాంటివే. అసలు రెస్టారెంటుకు వచ్చామా, ఆసుపత్రికి వచ్చామా అని కన్ఫ్యూజవడం ఖాయం. ఇక స్టాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేనేజర్, క్యాషియర్ లాంటి వాళ్లంతా డాక్టర్ డ్రెస్సుల్లో ఉంటారు. సర్వ్ చేసేవాళ్లంతా నర్సుల మాదిరిగా తయారవుతారు. మెడలో స్టెతస్కోపులు, చేతులకు గ్లవుజులు వేసుకుని చకచకా అన్నీ చక్కబెట్టేస్తుంటారు. మనంతట మనం తినడానికి ఉండదు. వెళ్లగానే మనకు పేషెంట్ల దుస్తులు తొడిగి, ఓ చోట కూర్చోబెట్టేస్తారు. నర్సు దుస్తుల్లో ఉన్న వెయిట్రస్‌లు చక్కగా తినిపించేస్తారు. వామ్మో... ఇదేం రెస్టారెంట్ అనిపిస్తోంది కదూ! కానీ లాత్వియా వాళ్లు అలా అనడం లేదు. రెస్టారెంటు ముందు క్యూ కడుతున్నారు. అక్కడ భోంచేయడానికి పోటీపడుతున్నారు. కొత్తొక వింత కదా! అందుకే ఆ హోటల్ కిటకిటలాడుతోంది మరి!