కార్నివాల్ సంబరాల్లో ఆటపాటలతో నృత్యం చేస్తున్న కళాకారులు
లా పాజ్ : బొలీవియాలో కార్నివాల్ వీకెండ్ సంబరాల్లో 40 మంది చనిపోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారని బొలివియా అంతర్గత మంత్రి కార్లోస్ రోమెరో తెలిపారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం..16 మంది రోడ్డు ప్రమాదాల్లో, 8 మంది ఫుడ్ స్టాల్ వద్ద గ్యాస్ ట్యాంక్ పేలడం వల్ల, మరో ఆరుగురు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారని వెల్లడించారు.
నలుగురు నరహత్యకు గురయ్యారని, ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరో వ్యక్తి హైపోధెర్మియాతో చనిపోయారని తెలిపారు. గత సంవత్సరం 2017 కార్నివాల్ సంబరాల్లో 67 మంది చనిపోయారని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment