carnival
-
తెలంగాణ గుజరాతీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ర్యాలీ (ఫొటోలు)
-
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బబుల్గమ్ చిత్ర యూనిట్ సందడి
-
మందుబాబులకు వీఐపీ ట్రీట్మెంట్.. హిమాచల్ సీఎం ఆదేశాలు!
హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతరాణిగా పేరొందిన సిమ్లాలో తొలిసారిగా సిమ్లా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఏడు రోజుల పాటు కొనసాగే ఈ శీతాకాలపు కార్నివాల్.. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్‌తో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సాంస్కృతిక కవాతును వీక్షించారు. కార్నివాల్ సందర్భంగా రిడ్జ్ గ్రౌండ్, మాల్ రోడ్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్నివాల్లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా కనిపించారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్‌లో కాకుండా హోటల్‌కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైనా టూరిస్ట్ మద్యం తాగి రచ్చ చేస్తే పోలీసులు వారికి వీఐపీ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. సిమ్లా వింటర్ కార్నివాల్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక వ్యాపారం భారీగా నష్టపోయిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో జనం హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్‌ను 24 గంటలూ తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా పర్యాటకులను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు నానా హంగామా చేయకూడదని, చట్టాన్ని గుర్తుంచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సిమ్లా, మనాలిలకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలో బస చేస్తున్నారు. కాగా మనాలిలో పర్యాటకులు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఉదంతాలు వెలుగు చూశాయి. కొందరు పర్యాటకులు మద్యం సేవించి లోయల్లో హల్చల్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
Pet's Show : వింతవింత జంతువులతో కొలువుదీరిన ఈ కార్నివాల్ (ఫొటోలు)
-
గచ్చిబౌలిలో ది సాగా బిగ్గెస్ట్ కార్నివాల్ పోస్టర్ లాంచ్(ఫొటోలు)
-
Kia Carnival facelift: కియా మోటార్స్ నుంచి కొత్త కారు.. భారత్‌కి వస్తుందా?
భారతదేశంలో 7 సీటర్ విభాగంలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 'కియా కార్నివాల్' త్వరలోనే మరిన్ని కొత్త హంగులతో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నాల్గవ తరం కియా కార్నివాల్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. నాల్గవ తరం కియా కార్నివాల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభం కాలేదు, అయితే ప్రస్తుతం సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉంది. ఈ లేటెస్ట్ కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కొత్త డిజైన్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వంటి వాటిని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్ & ఫీచర్స్: కొత్త కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త కియా ఈవి9 మాదిరిగా ఉంటుంది. కావున వర్టికల్ హెడ్‌ల్యాంప్ డిజైన్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కలిగి రీడిజైన్ బోనెట్ పొందుతుంది. అల్లాయ్ వీల్స్ దాదాపు మారే అవకాశం లేదు. రియర్ ఫ్రొఫైల్లో టెయిల్ లాంప్ కొత్తగా ఉంది. కారు పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల మొత్తం డిజైన్ వెల్లడి కాలేదు. నాల్గవ తరం కియా కార్నివాల్ డిజైన్ కొంత వరకు వెల్లడైంది, కానీ ఫీచర్స్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు, రానున్న రోజుల్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ వెల్లడవవుతాయి. (ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!) పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్: కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ గురించి అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే లేటెస్ట్ కార్నివాల్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందనుంది. ప్రస్తుతం ఈ ఎంపివి 2.2 లీటర్ డీజిల్, 3.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ కలిగి ఉంది. (ఇదీ చదవండి: Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..) లాంచ్ టైమ్: కియా కార్నివాల్‌ను కంపెనీ ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో KA4 ఎంపివిగా ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది, అదే సమయంలో కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి నాటికి గ్లోబల్ మార్కెట్లో విడుదలవుతుందని భావిస్తున్నారు. అంచనా ధర: కియా మోటార్స్ భారతీయ మార్కెట్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది విడుదలకానున్న కియా కేఏ4 ధర రూ. 50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవవుతాయి. -
మార్చి 12న యూత్ కార్నివాల్ ‘ప్రోస్ట్’
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, స్టూమాగ్జ్ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 12న ఎల్బీ స్టేడియం వేదికగా అతిపెద్ద యూత్ కార్నివాల్ ‘ప్రోస్ట్’ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు. తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ కార్నివాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న 15 వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు. ఈ కార్నివాల్లో అధునాతన సాంకేతికత, స్వదేశీ ఆవిష్కరణలను ప్రభావితం చేసే వినూత్న ఆలోచనా విధానాలను, టెక్నాలజీ సంబంధిత అంశాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా స్టూమాగ్జ్ వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు మాట్లాడుతూ..ఎమర్జింగ్ టెక్నాలజీలో భవిష్యత్ అవకాశాలను అన్వేషించే వారికి స్టూమాగ్జ్ ‘స్టూడెంట్ ట్రైబ్ ఇనిషియేటివ్’ సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రోస్ట్ కార్నివాల్ రూపొందించినట్లు తెలిపారు. యువతలో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్ కృషి చేస్తుందని చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తోటం అన్నారు. -
బ్యాట్ పట్టిన చిరంజీవి..పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
చిరంజీవి బర్త్ డే గిఫ్ట్
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఈ నెల 22న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నారు చిరంజీవి. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ టీజర్‌ని 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, చిరంజీవి పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది. సల్మాన్ ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: నీరవ్ షా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వాకాడ అప్పారావు. కార్నివాల్ ఫెస్టివల్‌కి రండి: ‘‘అన్నయ్య (చిరంజీవి) బర్త్‌డే సందర్భంగా ఈ నెల 22న హైదరాబాద్ హైటెక్స్‌లో ‘కార్నివాల్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాం’’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్‌డేని శిల్పకళా వేదికలో చేసేవాళ్లం. అయితే ఈ ఏడాది ఫ్యాన్స్ కోసం హైటెక్స్‌లో ‘కార్నివాల్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలో చిరంజీవిగారి గురించి ఎవరికీ తెలియని విషయాలు పంచుకుంటాను. ఈ ఫెస్టివల్‌కి మా ఫ్యామిలీ నుంచి అందరు హీరోలు హాజరవుతారు. అలాగే ఇతర హీరోలు, ఆయన్ను అభిమానించేవారు కూడా పాల్గొంటారు. ఈ ఫెస్టివల్‌కి అన్ని ప్రాంతాల మెగా అభిమానులు తప్పకుండా రావాలి’’ అన్నారు. -
మంత్రి రోజా అరుదైన రికార్డ్.. 3వేల మంది ఫోటోగ్రాఫర్లు.. సింగిల్ క్లిక్..
-
ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఒక్క ఫొటో తన జీవితాన్నే మార్చేసిందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. ఓ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో వల్లే తనకు సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పారు. వెయ్యి అక్షరాలతో చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటోతో చెప్పవచ్చన్నారు. విజయవాడలో శనివారం విజయవాడ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ, ఫొటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నివాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లిళ్లు, వేడుకలే కాదు.. పేదల ఆకలిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేది, వరదల్లో చిక్కుకున్న వారి స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించేది, యుద్ధాల్లో భయానక పరిస్థితి ప్రపంచానికి తెలియచేసేది ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లేనని అన్నారు. ఫొటో కార్నివాల్లో మంత్రి రోజా వేదికపై జాతీయ పతాకాన్ని పట్టుకోగా.. ఒకేసారి 3 వేల మందికిపైగా ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో ఏకకాలంలో ఫొటోలు తీశారు. ఇంతమంది ఒకేసారి ఫొటో తీయడం ‘ఇండియాస్ యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’లో నమోదైంది. దీనిని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం కూడా పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ మాదల రమేష్, అధ్యక్షుడు మెట్ట నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి మోహన్‌రాజ్, కోశాధికారి చిలంకుర్తి శేషు, గెల్లా రాజు, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
శతమానం: సెంచరీలోనూ సేవాగుణం తగ్గలే!
ఎంత అరగదీసినా, గంధం చెక్కకు సుగంధం తగ్గనట్టుగా... వందేళ్ల వయసు మీద పడి శరీరంలో సత్తువ తగ్గినా తమలో ఉన్న సాయం చేసే గుణంతో ఎలాగో ఒకలాగా చెయ్యందించాలని తాపత్రయ పడుతుంటారు. ఈ కోవకు చెందిన కేట్ ఆర్చర్డ్ వందేళ్ల వయసులో ఆకాశంలో ఎగురుతూ నిధులు సేకరించి సాయం చేయడానికి పూనుకుంది.‘సెంచరీలోనూ స్పీడు తగ్గలే’ అంటూ ఏకంగా యుద్ధవిమానం నడిపేసింది. ఇంగ్లాండ్‌లోని కార్నవాల్లో నివాసముంటోన్న కేట్ ఆర్చర్డ్ ఆంగ్లో ఇండియన్. పదముగ్గురు సంతానంలో కేట్ ఒకరు. కేట్ చిన్నవయసులో ఆమె కుటుంబం ఇండియాలోనే ఉండేది. కేట్ తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో చీఫ్ టెలిగ్రాఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. 1941లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్‌లో తన ఇద్దరు తోబుట్టువులతో కలసి 20 ఏళ్ల వయసులో వాలంటీర్‌గా చేరింది. వాలంటీర్‌గా పనిచేస్తూనే ఫస్ట్‌క్లాస్ వారెంట్ ఆఫీసర్‌గా, సర్వీస్ అండ్ ఇండియా సర్వీస్ మెడల్స్‌ను అందుకుంది. తరువాత ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన చెన్నైలోని ఐదోనంబర్ ఫిల్టర్ రూమ్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసింది. ఇలా పనిచేస్తూనే రెండో ప్రపంచ యుద్ధసమయంలో యుద్ధ విమానాలకు సిగ్నల్స్‌ను అందించేది. శత్రు యుద్ధవిమానాలను కూల్చడంలో ఈ సిగ్నల్స్ ప్రముఖ పాత్ర పోషించేవి. 24 గంటలపాటు వార్నింగ్ సిస్టమ్స్‌ను గమనిస్తూ ఎప్పటికప్పుడు పైలట్లకు సూచనలు ఇస్తుండేది. పనిప్రదేశంలో సహోద్యోగి నచ్చడంతో పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం కేట్కు 99 ఏళ్లు. మాతృభూమికి ఏదైనా చేయాలన్న కోరిక కలిగింది కేట్కు. దీంతో చారిటీ కోసం నిధులు సేకరించాలనుకుంది. ఇందుకోసం తను చేసిన ఉద్యోగానుభవాన్ని ఎంచుకుంది. సీహాక్ గ్లైడింగ్ క్లబ్‌ను కలిసి, గ్లైడర్ సాయంతో యుద్ధవిమానంలో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఎంతో జాగ్రత్తగా టేకాఫ్ చేయడమేగాక, సురక్షితంగా ల్యాండ్ చేసింది. తన వందో పుట్టినరోజుకి కేవలం వారం రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందామె. ఇలా చక్కర్లు కొట్టడం ద్వారా వచ్చిన నిధులను ఆర్మీ హీరోలకు సహాయ నిధిగా అందించనుంది కేట్. ‘‘ఆర్మీలో పనిచేసి, రిటైర్ అయిన వారంతా శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. వీరికి సాయం చాలా అవసరం. అందుకే ఈ ట్రిప్‌ను చేపట్టాను. ట్రిప్ చాలా బావుంది. కొన్నిసార్లు నేను కూడా విమానాన్ని నియంత్రించ గలిగాను’’ అని చిరునవ్వుతో చెబుతున్న కేట్ సేవకు ఆకాశమే హద్దన్నట్లుగా ఎంతోమందిలో స్ఫూర్తినింపుతోంది. -
దీపావళికి గృహ శోభ.. బాంటియాలో ఫర్నివాల్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గత 65 ఏళ్లుగా ఫర్నిచర్ విభాగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగిన బాంటియా... దీపావళి పండుగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్లతో కొనుగోలుదారుల ముందుకొచ్చింది. ‘బాంటియా ఫర్నిచర్’ పేరిట ఫర్నిచర్ కార్నివాల్‌ను ప్రారంభించింది. గృహ, ఆఫీస్ ఫర్నిచర్ల కొనుగోళ్ల మీద ఆఫర్లను, డిస్కౌంట్ సేల్‌ను అందిస్తుంది. ఈనెల 20వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణలోని అన్ని బాంటియా స్టోర్లతో పాటు ఆన్లైన్ (బాంటియా.ఇన్)లో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబ్, బుక్‌షెల్ఫ్, బెడ్రూమ్ సెట్స్, ఆఫీస్ కురీ్చలు, టేబుల్స్ వంటి అన్ని రకాల ఫర్నిచర్లు, అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. నెలవారి వాయిదా (ఈఎంఐ) రూపంలో బాంటియా ఫర్నిచర్‌ను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు మరింత సులువుగా, ఆర్థిక భారం లేకుండా ఫర్నిచర్‌ను కొనుగోలు చేసేందుకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయి చెల్లించి మిగిలిన మొత్తానికి 36 నెలల ఈఐఎం ఆప్షన్ ఉంది. ఈఎంఐ కోసం పలు ఫైనాన్షియల్ కంపెనీలతో భాగస్వామ్యమైంది. 60 సెకన్లలోపు ఈఎంఐ తక్షణ అనుమతి వస్తుంది. ఎక్స్ఛేంజ్పై 20–30 శాతం రాయితీ.. బాంటియాలో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 20–30 శాతం రాయితీపై సరికొత్త ఫరి్నచర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫరి్నచర్ల ధరలు రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకున్నాయి. సోఫాల ధరలు రూ.15 వేల నుంచి రూ.4 లక్షల వరకు, డైనింగ్ టేబుల్స్ రూ.7 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు, బెడ్ల ధరలు రూ. 8 వేల నుంచి రూ.4.5 లక్షల వరకు, ఔట్‌డోర్ ఫర్నిచర్ల ధరలు రూ.12 వేల నుంచి రూ. లక్ష వరకున్నాయి. విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగాం బహుమతులు అందిస్తూ కస్టమర్ల పండుగ ఆనందాలను రెట్టింపుమయం చేస్తున్నాం. అందు కే బాంటియా విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగింది. పండుగ షాపింగ్‌లో మేము కూడా భాగస్వామ్యమయ్యాం. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వినియోగదారుల కోసం ఫరి్నచర్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. – సురేందర్ బాంటియా, ఎండీ, బాంటియా బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ నాణ్యమైన ఫర్నిచర్‌కు బాంటియా పెట్టింది పేరు. ఫర్నిచర్‌ను బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ చేస్తాం. ఫెస్టివల్ షాపింగ్ సీజన్ ఆనందాన్ని రెండితలు చేసుకునేలా ఆఫర్లను అందిస్తున్నాం. మధ్యాహ్నం 1 గంట లోపు ఫర్నిచర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్‌లను కూడా అందిస్తాం. – అమిత్ బాంటియా, డైరెక్టర్, బాంటియా -
సరికొత్తగా కియా కార్నివాల్ మార్కెట్లలోకి లాంచ్...!
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా భారత మార్కెట్లలోకి సరికొత్త కియా కార్నివాల్‌ను ఎమ్‌పీవీను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అప్డేట్ చేసిన కార్నివాల్ ఇప్పుడు కియా న్యూలోగోతో రానుంది. కియా భారత మార్కెట్లలోకి సెల్టోస్, సొనెట్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. కార్నివాల్ మల్టీపర్పస్ వెహికిల్(ఎమ్‌పీవీ) లిమోసిన్, లిమోసిన్+ వేరియంట్లను కూడా కియా మార్పులను చేసింది. చదవండి: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెడాన్ రిఫ్రెష్ చేయబడిన కియా కార్నివాల్ శ్రేణి వాహనాలు సుమారు రూ. 24,95,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభకానున్నాయి. దేశవ్యాప్తంగా కియా డీలర్షిప్ నుంచి, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించి కార్నివాల్‌ను బుక్ చేసుకోవచ్చు. కియా కార్నివాల్ నాలుగు వేరియంట్లో రానుంది. లిమోసిన్+, లిమోసిన్, ప్రెస్టీజ్, ప్రీమియం. అప్డేట్ చేసిన కార్నివాల్లో కియా ఇండియా అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. కారు రెండో వరుసలో లెగ్ సపోర్ట్, 20.32 సెంటీమీటర్లఇన్ఫోన్మెంట్తో ఓటీఐ మ్యాప్ అప్డేట్లతో, వీఐపీ ప్రీమియం లేథర్ సీట్లను అందించనుంది. లిమోసిన్ వేరియంట్లో వెరియల్లో వెనుకసీట్లో కూర్చున్న వారి కోసం కొత్తగా 10.1 "రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ యూనిట్, స్మార్ట్ ఎయిర్ప్యూరిఫైయర్ను అమర్చారు. హర్మన్ కార్డాన్ ప్రీమియం స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 10 వే పవర్ డ్రైవర్ సీట్, డ్రైవర్ సీట్ వెంటిలేషన్, లెదర్ఢ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, ప్రీమియం వుడ్ గార్నిష్ వంటి ఫీచర్లతో టాప్-స్పెక్స్‌తో లిమోసిన్ ప్లస్ వేరియంట్లో అమర్చారు. చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్! -
సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరు కదా!
ప్రేమ-పెళ్లి హామీతో యువతుల మీద అఘాయిత్యాలు జరుగుతున్న తీరుపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికానీ యువతులు కేవలం సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని, ఈ విషయంలో మగవాళ్లే పర్యవసనాలనెరిగి ప్రవర్తించారని ఇండోర్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘సంప్రదాయాలకు విలువ ఇచ్చే సమాజం మనది. అలాంటిది పెళ్లి కానీ యువతులు దిగజారి ప్రవర్తించేంతకు స్థితికి ఇంకా చేరుకోలేదు. పెళ్లి చేసుకుంటారని, ఏదో ఒక హమీ మీద తప్పించి.. సరదా కోసం ఇలా శారీరక సంబంధం పెట్టుకోరు. అలాగే నిజాన్ని నిరూపించడానికి ప్రతీసారి బాధితులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా తదుపరి పర్యవసానాలను కూడా గమనించాలి’ అని వ్యాఖ్యానించింది జస్టిస్ సుబోధ్ అభయంకర్ నేతృత్వంలోని బెంచ్. కేస్ వివరాలు ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ యువతితో శారీరకంగా కలిశాడు. అయితే పెద్దలు ఒప్పుకోవట్లేదని, తాను వేరేవారిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. జూన్ 2న ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న ఆమె నుంచి మహకల్ స్టేషన్ పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ ఆమె బతికింది. ఇక ఆ యువకునిపై అత్యాచారం కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ సుబోధ్ అభయంకర్ విచారణ జరిపారు. ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్టప్రకారమే సంబంధం పెట్టుకున్నామంటూ నిందితుడు చేసిన వాదనను అంగీకరించలేదు. వేర్వేరు మతాలే వాళ్ల పెళ్లికి ఆటంకంగా మారిందన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. దీంతో నిందితుడికి కోర్టు బెయిల్ నిరాకరించింది. అంతేకాదు పలు కేసుల ప్రస్తావన తీసుకొచ్చిన బెంచ్.. ఇలాంటి వ్యవహారాల్లో కక్కుర్తిపడే మగవాళ్లే, అనుమానితులుగా బయటపడ్డ సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, బాధితులకు అన్యాయం జరిగిన సందర్భాలే ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం విశేషం. -
కార్నివాల్ ప్రారంభించిన హంసా నందిని
-
ఐఎస్ఎస్కు ఎలుకలు, పురుగులు
కేప్ కార్నివాల్ (అమెరికా): ఆదివారం తెల్లవారుజామునే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కొత్త మిత్రులు సందడి చేశాయి. స్టేషన్ కమాండర్, ఇటలీకి చెందిన ల్యూకా పార్మిటానో ఓ పెద్ద రోబో చెయ్యిని వినియోగించి వాటిని కేంద్రంలోకి తీసుకొచ్చి సాదరస్వాగతం పలికారు. ఇంతకీ ఈ మిత్రులు ఎవరో చెప్పలేదు కదా..! ఓ స్మార్ట్ రోబో, కండలుదిరిగిన పెద్దపెద్ద ఎలుకలు, క్రిమిసంహారక పురుగులే..!‘స్పేస్ ఎక్స్’అనే అమెరికా సంస్థే వీటిని ఐఎస్ఎస్కి చేర్చింది. దీనికోసం కేప్ కార్నివాల్‌లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రెండు అంతరిక్ష నౌకల సాయంతో 3 రోజుల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఎలుకలు, పురుగులే కదా.. వీటి బరువు కేవలం ఓ రెండు, మూడు కిలోలు ఉంటాయని అనుకుంటే పొరపాటే. వీటి బరువు దాదాపు 3 టన్నులు.. అంటే 2,720 కిలోగ్రాములు అన్నమాట. కొత్త మిత్రుల్లో ఓ 40 ఎలుకలు ఉన్నాయి. వీటిని కండలు, ఎముకల పరీక్షల కోసం అక్కడకు పంపించారు. వీటిలో జన్యుపరంగా తయారు చేయబడిన బాహుబలి లాంటి ఎలుకలు 8 ఉన్నాయి. వీటి బరువు సాధారణ ఎలుకల కంటే రెట్టింపు ఉంటుంది. అలాగే లక్షా 20 వేల నులి పురుగులు ఉన్నాయి. వీటిని వ్యవసాయంలో క్రిమిసంహారకం కోసం అక్కడకు పంపించారు. కృత్రిమ మేథస్సు సాంకేతికతతో పనిచేసే రోబో అయితే ఎదుటివారి భావాలను అర్థం చేసుకోగలదు. దీని పేరు సిమన్. దీనిని వ్యోమగాముల భావాలను అర్థం చేసుకోవడానికి పంపించారు. ఇక ఐఎస్ఎస్లో ఉన్న ఆరుగురు వ్యోమగాముల కోసం నాసా క్రిస్మస్ పండుగ సందర్భంగా బహుమతులు పంపింది. -
వైరల్ : ఒక్కొక్కరు పైనుంచి ఊడిపడ్డారు..
బ్యాంకాక్: ఎగ్జిబిషన్‌కు వెళితే వినోదాన్ని, థ్రిల్‌ను సమంగా పంచే రంగులరాట్నం వంటి వినోదాత్మక రైడ్లు పూర్తి చేయకుండా ఎవరూ తిరుగుముఖం పట్టరు. పైగా ఇంకా కొత్తగా ఎలాంటి రైడ్లు వచ్చాయో తెలుసుకుని మరీ వాటిని ఓసారి ప్రయత్నిస్తారు. ఆ తర్వాతే వెనుదిరుగుతారు. అదేవిధంగా థాయిలాండ్‌లోని లోప్‌బురిలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు విచ్చేసిన జనాలు పైరేట్స్ ఆఫ్ కరేబియన్ రైడ్ ఎంజాయ్ చేద్దామనుకున్నారు. అనుకున్నదే తడవుగా మెషీన్ ఎక్కి కూర్చున్నారు. చిన్నపిల్లలతోపాటు యువకులు కూడా రైడ్ ప్రారంభమవుతోందని కేరింతలు కొట్టారు. అయితే అది తిరుగుతున్న సమయంలోనే పిల్లలు ఒక్కొక్కరిగా సీట్లలోనుంచి కిందపడిపోతూ చెల్లాచెదురు కాసాగారు. కొద్ది సమయంలోనే కేరింతలు కాస్తా అరుపులు కేకలుగా మారాయి. దీంతో అక్కడి జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన నిర్వాహకుడు వెంటనే మెషీన్‌ను నిలిపివేశాడు. ఇక కిందపడినవారిలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ ఓ బాలుడికి మాత్రం నుదుటిపై దెబ్బ బలంగా తగలడంతో విలపిస్తూ కనిపించాడు. దీంతో చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్నుట్టుగా తయారైంది అక్కడి పరిస్థితి. అతను టాయిలెట్‌కు వెళ్లాడు, అందుకే.. ‘నా మిత్రుడు దీన్ని నడిపిస్తాడని, అయితే అతను టాయిలెట్‌కు వెళ్లడంతో నేనే నడిపానని, అందువల్లే ప్రమాదం జరిగింది. ఈ మెషీన్ గురించి నాకు ఏమీ తెలియదు. అందుకే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే నడిపాను. నా పొరపాటు వల్ల ఇబ్బంది పడినందుకు క్షమాపణలు’ అని ఆ సమయంలో మెషీన్ ఆపరేట్ చేసిన వ్యక్తి చెప్పుకొచ్చాడు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు. తాత్కాలికంగా రైడ్‌ను నిలిపివేశారు. -
భీమిలి ఉత్సవ్‌లో అపశృతి!
సాక్షి, విశాఖపట్నం : భీమిలి బీచ్‌లో జరుగుతున్న ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. కార్నివాల్లో వదిలిన గ్యాస్ బెలూన్లు చెట్టుకున్న తేనెపట్టును ఢీకొట్టాయి. దీంతో ఒక్కసారిగా తేనేటీగలు అక్కడున్న విద్యార్థులపై దాడిచేశాయి. స్వల్పగాయాలు కావడంతో చికిత్స అందించారు.సుమారు పదిహేను మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరంతా ఏఎంజీ పాఠశాలకు చెందిన వారుగా గుర్తించారు. -
‘టీచింగ్ ట్రీ కార్నివాల్’లో సందడి చేసిన సంజన
-
కార్నివాల్ సంబరాల్లో 40 మంది మృతి
లా పాజ్ : బొలీవియాలో కార్నివాల్ వీకెండ్ సంబరాల్లో 40 మంది చనిపోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారని బొలివియా అంతర్గత మంత్రి కార్లోస్ రోమెరో తెలిపారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం..16 మంది రోడ్డు ప్రమాదాల్లో, 8 మంది ఫుడ్ స్టాల్ వద్ద గ్యాస్ ట్యాంక్ పేలడం వల్ల, మరో ఆరుగురు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారని వెల్లడించారు. నలుగురు నరహత్యకు గురయ్యారని, ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరో వ్యక్తి హైపోధెర్మియాతో చనిపోయారని తెలిపారు. గత సంవత్సరం 2017 కార్నివాల్ సంబరాల్లో 67 మంది చనిపోయారని పోలీసులు చెప్పారు. -
రియో డీజెనిరియోలో కార్నివాల్
-
దేవుడే ఆగ్రహిస్తే...?
కంటికిరెప్పలా కాపాడాల్సినవాడే భక్తులపై అలక పూనాడా.., సమాధానం అవునో కాదో గానీ, రథోత్సవంలో రక్తం చిందింది. సుమారు ఆరంతస్తుల ఎత్తున్న తేరు భక్తుల మీదికి విరిగిపడింది. వేడుకల నడుమ ఇలా జరిగిందేమిటా అని అందరూ ఖిన్నులయ్యారు. బళ్లారి: శ్రీ గురు కొట్టూరేశ్వర మహా రథోత్సవంలో అపశ్రుతి దొర్లింది. మంగళవారం సాయంత్రం బళ్లారి జిల్లా కూడ్లిగి నియోజకవర్గ పరిధిలోని కొట్టూరు పట్టణంలో కొట్టూరేశ్వర మహా రథోత్సవంలోనే విషాదం ఒలికింది. రథోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్త జనం పెద్దసంఖ్యలో వస్తారు. 16వ శతాబ్దంలో శ్రీ కొట్టూరేశ్వర మహాస్వామీజీ వెలసిన ఈ ప్రాంగణంలో అప్పటినుంచి ప్రతి ఏటా మహారథోత్సవం మాఘమాసంలో జరగడం ఆనవాయితీ. తేరు నిర్వహణకు కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రథం లాగి తిరిగి అదే ప్రదేశంలో పెడుతున్న సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది. వేలాది మంది భక్తులు రథం చుట్టూ గుమిగూడి ఉండగా తేరు చక్రాలపై నుంచి విరిగిపడింది. రథం లోపల ఉన్న పూజారితో సహా 15 మంది గాయాలపాలైయ్యారు. భక్తులు రథం శిథిలాల కింద ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీయడానికి జనం ఇబ్బందులు పడ్డారు. బాధితుల తల, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రథం లాగే సమయంలో మామూలుగా విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. బాధితులు, వారి బంధువుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం ఏర్పడింది. జిల్లాధికారి రామ్ ప్రశాత్ మనోహర్‌తో సహా సంబంధిత అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్రేన్ సాయంతో శిధిలాల తొలగింపు తదితర సహాయక చర్యలు చేపట్టారు. పలువురు బాధితుల్ని హెలికాప్టర్లో బళ్లారి ఆస్పత్రులకు తరలించారు. -
నిర్వాసితులకు ఊరట
విపక్షాలకు సంతోషం సర్కారుకు సంకటం హైకోర్టు తీర్పుతో సర్కారుకు మొదలైన భూసేకరణ తలనొప్పి భూసేకరణ చట్టాన్ని అమలు చేయాల్సిందేన ంటున్న గౌరవెల్లి, గండిపెల్లి భూ నిర్వాసితులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123 జీవోను హైకోర్టు కొట్టివేయడంతో సాగునీటి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే నిర్వాసితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఇరకాటంలో పడగా నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న విపక్షాలు మరింత ఉత్సాహంతో బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో చేపడుతున్న కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం, గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులతోపాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు 14 వేల ఎకరాలు, ఇతర పరిశ్రమల కోసం సుమారు 20 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. దీనిని దష్టిలో ఉంచుకుని 123 జీవోకు అనుగుణంగా వేలాది ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు శరాఘాతంగా మారింది. 2013లో పార్లమెంటులో చేసిన భూసేకరణ చట్టం ప్రకారం భూములను సేకరించాల్సిన ఆగత్యం ఏర్పడింది. దీంతో భూముల సేకరణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ప్రస్తుతం జిల్లాలో గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల కోసం భూసేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది. ఈ రిజర్వాయర్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రెండు వేలకుపైగా ఎకరాల భూమిని సేకరించింది. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుతో మరో మూడు వేల ఎకరాలను సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. 123 జీవో ప్రకారం ఎకరాకు రూ.5.5 లక్షల నుంచి 6.5 లక్షల చొప్పున చెల్లించి భూములు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జాయింట్ కలెక్టర్‌సహా స్థానిక అధికారులు పలుమార్లు గ్రామాలకు వెళ్లి భూనిర్వాసితులతో మంతనాలు జరుపుతున్నారు. అదే సమయంలో సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూమిని సేకరించాలనికి కోరుతూ భూ నిర్వాసితుల సంఘం నిరవధిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గౌరవెల్లి, గండిపెల్లి ముంపు గ్రామాల్లో రెండు రోజులపాటు పాదయాత్ర చేసి నిర్వాసితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. బీజేపీ లీగల్‌సెల్ నాయకులు గ్రామాల్లో పర్యటించి భూములు కోల్పోయే రైతులకు మద్దతు ప్రకటించారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తోపాటు ఆ పార్టీ నాయకులు భూనిర్వాసితుల పక్షాన పోరాటాలు చేపట్టారు. టీడీపై సైతం 2013 జీవో ప్రకారమే భూములు సేకరించాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములను సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూసేకరణ చట్టం ఏం చెబుతోందంటే... 2013 భూసేకరణ చట్టం ప్రకారం మరీ ప్రత్యామ్నాయం లేకుంటే తప్ప ఏటా రెండు పంటలు పండే భూములను ప్రాజెక్టుల కోసం సేకరించరాదు. ఒకవేళ తప్పనిసరైతే పరిమితికి మించి భూమిని సేకరించడం లేదని నిరూపించాలి. భూ సేకరణ చేపట్టాలంటే ముందుగా ప్రభుత్వం దినపత్రికల్లో ప్రకటన జారీ చేయాలి. అరవై రోజుల సమయమిచ్చి గ్రామసభ నిర్వహించాలి. ఆ లోపే నిర్వాసితులకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించాలి. సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించి గ్రామసభ ముందుంచాలి. గ్రామసభ ఆమోదిస్తేనే భూములను సేకరించాలి. అట్లాగే సవరించిన మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ ధర)కు కనీసం మూడురెట్లు ధర చెల్లించాలి. అసైన్డు, పట్టా లేకున్నా సాగులో ఉన్న భూ యజమానులకు పట్టాభూమితో సమానంగా నష్టపరిహారం చెల్లించాలి. పునరావాసం కింద రూ.5లక్షలు లేదా ప్రతినెలా రూ.2వేల చొప్పున ఇరవై ఏళ్లపాటు పింఛన్ చెల్లించాలి. ప్రాజెక్టు కారణంగా ఇల్లు కోల్పోతే అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. నివాస బదిలీ ఖర్చు కింద ఆర్థికసాయం అందించాలి. ఎస్సీ, ఎస్టీలకైతే నివాస బదిలీ ఖర్చు కింద అదనంగా రూ.50 వేలు చెల్లించాలి. పశువుల పాకకు ధర చెల్లించాలి. భూమి, ఇంటి రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ చేయాలి. వీటికితోడు ఒకవేళ భూమికి భూమి కోరుకుంటే ఆయకట్టు కింద ఒక ఎకరం భూమి ఇవ్వాలి. ఒకవేళ ప్రాజెక్టు కింద ఊరు ముంపుకు గురైతే సకల సౌకర్యాలతో మళ్లీ ఊరును నిర్మించాలి. ఈ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలంటే ప్రభుత్వానికి తలకుమించిన భారం కానుంది. అప్పీల్‌కు వెళ్లే యోచనలో సర్కార్ 123 జీవో ప్రకారం భూములను సేకరించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం హైకోర్టు తీర్పుతో పునరాలోచనలో పడింది. భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించాలంటే పెద్ద తతంగమే ఉంటుందని, దీనిద్వారా ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యం ఏర్పడే అవకాశముందని అధికార పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీనిని దష్టిలో ఉంచుకుని కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లడమే మేలని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఒకటి రెండ్రోజుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. సర్కారుకు చెంపదెబ్బ 123, 124 భూసేకరణ జీవోలను హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీసెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్, డీసీసీ చైర్మన్ కటుకం మత్యుంజయం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. 123 జీవో ప్రకారం తీసుకున్న భూములను వెంటనే వెనక్కు ఇచ్చేయాలని శ్రీధర్‌బాబు సూచించారు. మరోవైపు కోర్పు తీర్పును స్వాగతిస్తూ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నాయి. -
కోటి వెలుగుల ఉగాది
సిటీ జీవి ఫన్చాంగమ్ కొత్త ఆశలు.. కొంగొత్త ఆశయాలు... వసంత కోకిల సాక్షిగా మారాకు తొడుగుతున్న సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టే పర్వదినం..ఉగాది. షడ్రుచులకు ప్రతిరూపం ఈ పండగ. కానీ పండగ రోజున హైదరాబాదీకి సంతోషం ఆవిరవుతోంది. ధరాఘాతంతో ఉగాది ఉషస్సులు మాయమవుతున్నాయి. ఉప్పు, పప్పు, ఇంధనం, నిత్యవసరాల ధరలు కొండెక్కి... సామాన్యునికి సంబరాన్ని దూరం చేస్తున్నాయి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కితే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామా? అన్న ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సవాలక్ష సమస్యలు.. సవాళ్ల మధ్య సగటుజీవి ఉగాది సంబరాలు ఎలా జరుపుకుంటున్నాడో.. చూద్దాం... -సాక్షి, సిటీబ్యూరో ధరల ‘కారం’ ‘దిగిరాము దిగిరాము దివి నుంచి భువికి’ అన్న రీతిలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశంలో ఉంటున్నాయి. బియ్యం, పప్పుల ధరలు పెరుగుతున్నాయి.ఇవి నగరజీవి నోటికి ‘కారం’ ఘాటులా మారాయి. వ్యాపారులు, వారిని నియంత్రించాల్సిన పాలకులు మాత్రం ‘నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు?’ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. బెండకాయ మొదలుకొని బీన్స్ వరకు ఏ కూరగాయల ధరలు చూసినా సగటు జీవి బెంబేలెత్తిపోవాల్సిందే. మామిడి కాయ మొదలు నూనెలు, ఉప్పు, పప్పులు, చింతపండు, మసాలా దినుసులు, కూరల ధరలు ‘గాయాలు’ చేస్తున్నాయి. గ్యాస్‌బండ గుదిబండగా మారుతోంది. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో వేతనజీవులు కుదేలవుతున్నారు. వెరసి నగరవాసి జీవనం నానాటికి భారమవుతోంది. ఉపాధి ‘తీపి’ ఐటీ ఎగుమతుల్లో గ్రేటర్ నగరం జాతీయ స్థాయి సగటు కంటే మూడు శాతం అధిక వృద్ధిని సాధించడం.. నయా ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు నగరానికి వెల్లువెత్తడం సిటీజనులకు తీపికబురు. గత ఏడాదిగా ఈ రంగంలో సుమారు 80 వేల కొత్త కొలువులు రావడం ఊరటనిస్తోంది. ప్రస్తుతం నగరం కేంద్రంగా 538 ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలు పని చేస్తున్నాయి. అమేజాన్, ఊబర్, గూగుల్ వంటి సంస్థలు నగరానికి క్యూ కడుతుండడం కుర్రకారును హుషారెత్తిస్తోంది. వసతుల ‘ఉప్పు’ మండుటెండలకు గ్రేటర్ శివార్ల గొంతెండుతోంది. పెరుగుతున్న జనాభా దాహార్తి తీర్చడంలో జలమండలి విఫలమవుతోంది. మంచినీటి సరఫరా వ్యవస్థ లేకపోవడంతో శివార్లలో నిత్యం 35 లక్షల మందికి అవస్థలు తప్పడం లేదు.రహదారులపైపొంగి పొర్లుతున్న డ్రైనేజీ లైన్లు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. చాలీచాలని రహదారులు, మురికివాడల సమస్యలు, అస్తవ్యస్థమైన ప్రజా రవాణా, సర్కారు వైద్యం దైన్యంగా మారుతున్న దుస్థితి.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్న ప్రభుత్వం.. వెరసి గ్రేటర్ వాసికి కష్టాల సహవాసం తప్పడం లేదు. ట్రాఫిక్.. ‘పులుపు’ మహా నగరంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య 45 లక్షలు. వీటికి తోడు నిత్యం సుమారు 600 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయి సగటు వేగం గంటకు 12 కి.మీ.కు పడిపోతోంది. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ నరకాన్ని చవిచూడాల్సి వస్తోంది. నగరానికి ‘మణిహారం’లా చుట్టూ విస్తరిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డుపై వరుస ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ఫీజుల..‘వగరు’ ఏటా పెరుగుతున్న పిల్లల స్కూలు ఫీజులు తల్లిదండ్రులకు మింగుడు పడడం లేదు. వీధుల్లోని ప్రైవేటు బడులుమొదలు కార్పొరేట్ పాఠశాలల వరకు ఈ ఏడాది ఫీజుల్లో సుమారు 10 నుంచి 20 శాతం పెరగడంతో వేతన జీవులు కుదేలవుతున్నారు. వీటికి తోడు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు, షూస్, ట్రాన్స్పోర్ట్ వంటి అదనపు ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో మధ్య తరగతి వర్గం ఆందోళన చెందుతోంది. ఎండలు..‘చేదు’ ఆరేళ్ల తరువాత గ్రేటర్లో ఏప్రిల్ తొలి వారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హరితం హరించుకుపోవడంతో సేదదీరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఒకప్పుడు తోటల (భాగ్) నగరంగా ప్రసిద్ధి చెందిన మహానగరం ఇప్పుడు కాంక్రీట్ మహారణ్యంలా మారడంతో వేసవితాపం పెరుగుతోంది. -
కోలి కార్నివాల్లో లైంగిక దాడులు
కోలి: జర్మనీలోని కోలి నగరంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వందలాది మంది మహిళలపై లైంగిక దాడులు జరిగిన భయానక సంఘటలను మరచిపోకముందే మళ్లీ అదే నగరంలో గురువారం ‘విమెన్స్ కార్నివాల్’ సందర్భంగా మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకున్నాయి. నూతన సంవత్సరం వేడుకల్లో వలసవచ్చిన ఉత్తర ఆఫ్రికా, అరబిక్ జాతికి చెందిన యువుకులు లైంగిక దాడులకు పాల్పడగా, ఈసారి యూరోపియన్లే లైంగిక దాడులకు దిగడం గమనార్హం. విమెన్స్ కార్నివాల్లో దాదాపు 250 నేరపూరిత సంఘటనలు జరగ్గా, 220 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిలో 22 లైంగికపరమైన సంఘటనలు ఉన్నాయి. తప్పతాగిన కొంత మంది యువకులు మహిళల దుస్తుల్లోకి చేతులు దూర్చి అసభ్యంగా ప్రవర్తించగా, మరికొంత మంది యువకులు రేప్‌లకు పాల్పడ్డట్టు ఫిర్యాదులు అందాయని పోలీసు అధికారులు తెలిపారు. సీఎన్ఎన్కు అనుబంధంగా పనిచేస్తున్న ఆర్టీటీబీఎఫ్ రేడియో టెలివిజన్ జర్నలిస్టు పట్ల కూడా యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వారిస్తున్నా వినకుండా ఆమెను ముద్దు పెట్టుకునేందుకు తెగబడ్డారు. కార్నివాల్ వేడుకలకు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుండగానే ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు. వాటిని ప్రసారం చేయకూడదని భావించిన ఛానెల్ నిర్వాహకులు రెండు ఫొటోలను మాత్రం విడుదల చేశారు. నూతర వేడుకల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి భారీ ఎత్తున భద్రతా దళాలకు మోహరించిన లైంగిక దాడులు జరగడం శోచనీయమని పోలీసు అధికారులు అన్నారు. ఇప్పటి వరకు కేసులకు సంబంధించి 190 మందిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. కార్నివాల్ సందర్భంగా ఇలాంటి లైంగిక దాడులు ప్రతి ఏటా జరుగుతున్నాయని, అయితే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా ఉందని వారు వివరించారు. -
అట్టహాసంగా సిమ్లా వింటర్ కార్నివాల్
-
పుష్కర సొమ్ములతో రియల్ ఎస్టేట్ దందా!
సాక్షి, కొవ్వూరు : ప్రభుత్వ సొమ్ములను ఉపయోగించుకొని తమ రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో తెలుగుదేశం నేతల్లో అపారమైన ప్రతిభ కనిపిస్తోంది. ఇప్పటికే రియల్ఎస్టేట్ వ్యాపారిగా పేరు పొందిన గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎంపీ, కొంతమంది తెలుగుదేశం నేతలు కొవ్వూరు ప్రాంతంలో తమ రియల్ ఎస్టేట్ వెంచర్‌ను అభివృద్ధి చేసుకోవడానికి పుష్కర నిధులను విజయవంతంగా ఉపయోగించుకొన్నారు. కార్నివాల్ పేరుతో తమ భూములున్న చోటికి పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం వెచ్చించిన డబ్బుతో రోడ్లు వేయించుకొని, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొన్నారు ఈ నేతలు. లక్షల మంది పుష్కరయాత్రికులు వస్తున్న కొవ్వూరుకు సమీపంలో మినీ బైపాస్ రోడ్డు దగ్గర ఏర్పాటు అయిన కార్నివాల్ వెనుక పెద్ద కథే ఉంది. పుష్కర యాత్రికులకు తాత్కాలిక వసతి సౌకర్యం కల్పిస్తామని, పడక మొదలుకుని వినోదం వరకు ఎన్నెన్నో హంగులు.. నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో విదేశాల్లో ఉన్నట్టుగా భ్రమింపచేసే వాతావరణంతో కార్నివాల్‌ను ఏర్పాటు చేస్తామని ఒక ప్రైవేట్ సంస్థ కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసింది. మొదటగా దీన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఆ కార్నివాల్‌ను వ్యూహాత్మకంగా కొవ్వూరుకు మళ్లించారు రాజమండ్రికి చెందిన ఒక ప్రజాప్రతినిధి. కొవ్వూరు ప్రాంతంలో తమకు చెందిన వంద ఎకరాల పరిధిలో ఆ కార్నివాల్‌ను ఏర్పాటు చేయించారు. దీని వల్ల ఆ రియల్ ఎస్టేట్వ్యాపారీ కమ్ ప్రజాప్రతినిధికి రెండు లాభాలున్నాయి. ఒకటి కార్నివాల్ ఏర్పాటు చేస్తున్నారన్న పేరుతో తమ భూములకు పుష్కర నిధులతో రోడ్లు వేయించుకోవచ్చు. రెండు కార్నివాల్ నిర్వాహకుల చేత తమ భూములను చదును చేయించవచ్చు. ఈ రెండు విషయాల్లోనూ ఆయన విజయవంతం అయ్యారు. రూపాయి ఖర్చు లేకుండా భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి రోడ్డు వేయించుకొన్నారు. పుష్కరాల రోజుల్లోనే కార్నివాల్ అక్కడ ఉంటుంది. ఆ తర్వాత సర్వసౌకర్యాలతో ఉండే రియల్ఎస్టేట్ వెంచర్ టీడీపీ నేతలసొంతం అవుతుంది. సుమారు రూ.50 లక్షల ప్రభుత్వ నిధులతో పొలాల్లో 60 అడుగుల రోడ్లు నిర్మించారు. కాటేజీలు ఖరీదుగురూ... కార్నివాల్లో స్విస్ కాటేజ్‌ల పేరుతో 300 కాటేజీలు నిర్మాణం, 200 రెయిన్ ప్రూఫ్ టెంట్ల కింద బెడ్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఉండాలంటే 12 గంటలకు రూ. 16 వేలు అద్దెగా నిర్ణయించారు. నాన్ ఏసీ కాటేజీ రూ. 12వేలు, డార్మెటరీ అద్దె రూ.1,500 గా నిర్ణయించారు. -
పుణ్యకాల పర్వదినం
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు చేసుకునే పండగల్లో అతి ప్రధానమైనది సంక్రాంతి. ఈ రోజున తప్పనిసరిగా ఆడపడుచులని, అల్లుళ్లని పిలిచి ఆదరించి ఆత్మీయతని పంచుతారు. కొత్త అల్లుళ్లయితే విధిగా అత్తవారింటికి వచ్చి తీరాలి. ఏడాదంతా ఎక్కడెక్కడున్నా సంక్రాంతికి మాత్రం అంతా స్వగ్రామాలకి చేరుకుంటారు. ఎందుకింతటి ప్రాధాన్యం? సంక్రాంతి పండుగ సమయానికి దరిదాపుల్లో అన్ని పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. రైతులు మాత్రమే కాక వ్యవసాయ కూలీలు, ఇంకా సరిగా చెప్పాలంటే గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పొలం పనులు పూర్తి అయి ఉంటాయి. కొంత కాలం విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. దానితో సందడి, సంబరాలు. అందుకే తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమికి, రైతులకి, కూలీలకి, పాలేర్లకి, పశువులకి, పక్షులకి, మొత్తం ప్రకృతికి కృతజ్ఞతను తెలియ చేసుకోవడం, తమ సంపదను సాటివారితో, బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. ఈ రోజుకే ప్రత్యేకత ఎందుకు? భారతీయులు సాధారణంగా పాటించేది చాంద్రమానాన్ని. కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. ఈ రెండు మానాల సమన్వయం సంక్రాంతి పండుగ చేసుకోవటంలో కనపడుతుంది. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని సంక్రమణం అంటారు. మకరరాశిని సంక్రమించినప్పుడు అది మకరసంక్రమణం అవుతుంది. సంవత్సరంలో ఉండే పన్నెండు సంక్రమణాలలో మకరసంక్రమణం ప్రధానమైనది. దీనికి కారణం మకర సంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణ దిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్లుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరు నెలలు ఉత్తరాయణం అంటారు. అంతకు ముందు ఆర్నెల్లు దక్షిణాయనం. దక్షిణాయణాన్ని పితృయానం (పితృ దేవతలు భూలోక వాసులపై అనుగ్రహం కురిపించే కాలం) అని, ఉత్తరాయణాన్ని దేవయానం (దేవతలు అనుగ్రహాన్ని వర్షించే కాలం) అని చెపుతారు. అందుకనే ఈ రోజుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించడం జరిగింది. ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి -
24 నుంచి హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్
హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్-2014 మళ్లీ మన ముందుకు వస్తోంది. ఫేవరేట్ కార్టూన్ బడ్డీలు, సంగీత పోటీలు, ఎంటర్టైన్మెంట్, మొబైల్ ప్లానెటోరియమ్, రొబోటిక్స్ పాఠాలకు వేదిక కానుంది. ఈ వింటర్ కార్నివాల్‌కు 40 వేల మందికిపైగా సందర్శకులు హజరవుతారని మాదాపూర్‌లోని హైటెక్స్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ నెల 24 నుంచి 28 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫెయిర్ ఉంటుంది. పిల్లల్లో ప్రాక్టికల్ నైపుణ్యం పెంపొందించేందుకు ఎడ్యురోబో సంస్థ సుమారు 30 రకాల రోబోలను ఈ కార్నివాల్లో అందుబాటులో ఉంచనుంది. -
రూపీ పతనంతో ఎన్నారైల సంబరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు ఏ ఇద్దరు ఎన్నారై స్నేహితులు కలిసినా ఒక్క విషయంపైనే చర్చించుకుంటున్నారు.‘‘ఏరా ఇంటికి ఎంత పంపావనే?’’. అది అమెరికాలోనైనా, బ్రిటన్, ఒమన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశమైనా వారి దృష్టంతా స్వదేశానికి సాధ్యమైనంత అధికంగా డబ్బు పంపుదామనే. దీనికంతటికీ కారణం రూపాయి విలువ అనూహ్యంగా క్షీణించడమే. ఎన్నడూ లేని విధంగా స్వల్ప కాలంలోనే డాలరుతో రూపాయి మారకం విలువ 15 శాతం క్షీణించడంతో ప్రవాస భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. కేవలం డాలరుతోనే కాకుండా ఇతర దేశాల కరెన్సీలతో కూడా రూపాయి విలువ గణనీయంగా క్షీణించడంతో విదేశాల్లో నివసిస్తున్న 4 కోట్లమంది భారతీయులు స్వదేశానికి నగదు పంపేపనిలో ఉన్నారు. ముఖ్యంగా గత రెండు వారాల నుంచి ఎన్నారైలు పెద్ద మొత్తంలో ఇండియాకి నగదు పంపుతున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నెల రోజుల క్రితం రోజుకు రూ.125 కోట్లు పంపితే ఇప్పుడా మొత్తం రూ.250 కోట్లు దాటిందని ఫెడరల్ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వారం రోజులతో పోలిస్తే రెమిటెన్స్‌లు 20 శాతం పెరిగినట్లు హైదరాబాద్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అప్పు అయినా సరే... రూపాయి విలువ భారీగా క్షీణించడంతో ఇంతకాలం దాచుకున్న మొత్తాలను పంపడమే కాకుండా కొంతమంది మరో అడుగు ముందుకేసి అప్పులు తీసుకొని మరీ స్వదేశానికి పంపుతున్నారు. ఇప్పటికే రూపీ విలువ 15 శాతం క్షీణించడం, అలాగే డిపాజిట్లపై 9 శాతం వడ్డీ రావడంతో ఖర్చులు పోను 22 శాతం వరకు స్థిరమైన రాబడి వస్తోందని, దీంతో అప్పులు తీసుకోవడానికి వెనుకాడటం లేదని ఎన్నారైలు చెపుతున్నారు. నెల క్రితం 1,000 బెహ్రెయిన్ దినార్లు పంపితే రూ.1.30 లక్షలు వచ్చేవని, ఇప్పుడా మొత్తం రూ.1.62 లక్షలు దాటడంతో అప్పు తీసుకొని మరీ రెండు వేల దినార్లు పంపినట్లు ఒక ప్రవాస భారతీయుడు పేర్కొన్నారు. 2007లో డాలరు విలువ రూ.39గా ఉన్నప్పటి నుంచి రిటైర్మెంట్ కోసం దాచుకున్న మొత్తాన్ని మొన్న రూ.58కి వచ్చినప్పుడు స్వదేశానికి పంపేశానని, కాని ఇప్పుడు ఆ విలువ రూ.65 దాటడంతో ఇంకొంత కాలం ఆగి ఉండాల్సిందని బాధపడుతున్నట్లు అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేర్కొన్నాడు. రియల్టీలో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రవాస భారతీయుల విచారణల్లో 35 శాతం వృద్ధి కనిపిస్తున్నట్లు అసోచామ్ తాజా సర్వేలో వెల్లడయ్యింది. అలాగే ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరికొంతమంది స్వదేశంలో తీసుకున్న గృహరుణాలు వంటివాటిని ముందుగానే చెల్లించే యోచనలో ఉన్నారు. గల్ఫ్ దేశాల నుంచి... ప్రవాస భారతీయులు అత్యధికంగా ఉండే గల్ఫ్ దేశాల నుంచి ఈ మొత్తం మరింత అధికంగా ఉంది. గడచిన సంవత్సరం మొత్తం మీద యునెటైడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) నుంచి 8 బిలియన్ డాలర్లు ఇండియాకి వస్తే ఈ ఆరు నెలల్లో ఈ మొత్తం దాటినట్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్‌లు అందుకునే భారత్‌కు గత సంవత్సరం 70 బిలియన్ డాలర్లు వచ్చినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో ఎన్నారైలు 549 కోట్ల డాలర్లు పంపినట్లు తెలుస్తోంది. దీంతో జూన్ నాటికి ఎన్నారై డిపాజిట్ల మొత్తం విలువ 7,107 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. చాలా సంవత్సరాలుగా నేను ఒమన్‌లో పనిచేస్తున్నా.. ఎప్పుడూ లేని విధంగా నెల క్రితం రియాల్ మారకం ధర రూ.155 చేరినప్పుడు అప్పు చేసి మరీ స్వదేశానికి పంపాను. కాని ఇప్పుడు దీని విలువ రూ.165 దాటింది.. మళ్ళీ అప్పు చేసి పంపాలని ఉన్నా ధైర్యం సరిపోవడం లేదు.. మరికొంత కాలం వేచి చూస్తాను. - జి.రామకృష్ణ, మెకానికల్ ఇంజనీర్, ఒమన్. నేను ఇండియాలో హౌసింగ్ లోన్ తీసుకున్నా. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నా.. దీనికి సంబంధించిన ఈఎంఐని ప్రతి నెలా నేను డాలర్ల రూపంలో పంపుతున్నా. ఎప్పుడూ పంపే విధంగానే పంపుతున్నా.. రూపీ పతనం వలన ప్రతి నెలా నా రుణ భారం రూ.10,000 అదనంగాా తగ్గుతోంది. రూపీ మరింత క్షీణిస్తే మరిన్ని డాలర్లు పంపడం ద్వారా రుణాన్ని తొందరగా తీర్చే ఆలోచనలో ఉన్నా. -సీహెచ్.లక్ష్మీ నారాయణ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాలిఫోర్నియా. పౌండ్ రూ.85 వద్ద ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి దాచుకున్న మొత్తాన్ని ఇండియాకు పంపాను. కాని ఇప్పుడు పౌండ్ రూ.100 దాటింది.. ఈ ప్రయోజనం పొందుదామంటే... చేతిలో చిల్లి గవ్వలేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. - డాక్టర్ పి.శ్రీనివాస్, లండన్.