
24 నుంచి హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్
హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్-2014 మళ్లీ మన ముందుకు వస్తోంది. ఫేవరేట్ కార్టూన్ బడ్డీలు, సంగీత పోటీలు, ఎంటర్‌టైన్‌మెంట్, మొబైల్ ప్లానెటోరియమ్, రొబోటిక్స్ పాఠాలకు వేదిక కానుంది. ఈ వింటర్ కార్నివాల్‌కు 40 వేల మందికిపైగా సందర్శకులు హజరవుతారని మాదాపూర్‌లోని హైటెక్స్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ నెల 24 నుంచి 28 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫెయిర్ ఉంటుంది. పిల్లల్లో ప్రాక్టికల్ నైపుణ్యం పెంపొందించేందుకు ఎడ్యురోబో సంస్థ సుమారు 30 రకాల రోబోలను ఈ కార్నివాల్‌లో అందుబాటులో ఉంచనుంది.