మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఈ నెల 22న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నారు చిరంజీవి. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ టీజర్‌ని 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, చిరంజీవి పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది. సల్మాన్ ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ తదితరులు నటిస్తున్న ఈ
చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: నీరవ్ షా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వాకాడ అప్పారావు.
కార్నివాల్ ఫెస్టివల్‌కి రండి: ‘‘అన్నయ్య (చిరంజీవి) బర్త్‌డే సందర్భంగా ఈ నెల 22న హైదరాబాద్ హైటెక్స్‌లో ‘కార్నివాల్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాం’’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్‌డేని శిల్పకళా వేదికలో చేసేవాళ్లం. అయితే ఈ ఏడాది ఫ్యాన్స్ కోసం హైటెక్స్‌లో ‘కార్నివాల్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలో చిరంజీవిగారి గురించి ఎవరికీ తెలియని విషయాలు పంచుకుంటాను. ఈ ఫెస్టివల్‌కి మా ఫ్యామిలీ నుంచి అందరు హీరోలు హాజరవుతారు. అలాగే ఇతర హీరోలు, ఆయన్ను అభిమానించేవారు కూడా పాల్గొంటారు. ఈ ఫెస్టివల్‌కి అన్ని ప్రాంతాల మెగా అభిమానులు తప్పకుండా రావాలి’’ అన్నారు.
చిరంజీవి బర్త్ డే గిఫ్ట్
Published Fri, Aug 19 2022 12:56 AM | Last Updated on Fri, Aug 19 2022 8:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment