
మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. తన సతీమణి సురేఖతో పాటు గురువారం తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు మెగాస్టార్‌కు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం చిరు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. చిరు దంపతులతో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజనా దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు.

Comments
Please login to add a commentAdd a comment