birthday gift
-
ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అరాచకాలు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్రరావు అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఓ రైతును బెదిరించడమేకాకుండా, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు కూడా గళ్లా రామచంద్రరావుకే మద్దతు పలుకుతుండటంతో బాధితుడు జిల్లా కోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడు గ్రామానికి చెందిన కమ్మ వెంకటరావు గుంటూరు విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి పిడుగురాళ్లలో సుమారు 8 ఎకరాల పొలం ఉంది. గళ్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర రియల్ ఎస్టేట్‌కు గతంలో వెంకటరావు ఎకరం రూ. 48 లక్షలు చొప్పున 4.90 ఎకరాలు అమ్మాడు. దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ నాలుగున అగ్రిమెంట్ చేసుకుని మూడు చెక్కులు రామచంద్రరావు ఇచ్చాడు. ఆ చెక్కుల్లో రెండు బౌన్స్ అయ్యాయి. ఇది కాకుండా తాను అమ్మకుండా ఉన్న మిగిలిన భూమిలో భ్రమర వారు మట్టి తోలుతున్నారని తెలిసి వెంకటరావు వెళ్లి అడిగితే.. కాళ్లు విరగ్గొడతానని రామచంద్రరావు బెదిరించాడు. దీంతో వెంకటరావు గురజాల కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తాము అగ్రిమెంట్ చేయించుకున్న 4.90 ఎకరాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజి్రస్టేషన్ కోసం భమ్రర వారు ప్రయతి్నంచగా.. 1బీ అడంగల్‌లో 3.90 ఎకరాలు మాత్రమే కనపడుతుండటంతో అంతవరకే రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి వెంకటరావుకు డబ్బులు చెల్లించి బౌన్స్ అయిన చెక్కులు వెనక్కి తీసేసుకున్నారు. ఎన్నికలు అవ్వగానే వేధింపులు ఎన్నికలు ముగిసి రామచంద్రరావు భార్య మాధవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వెంకటరావుకు వేధింపులు మొదలయ్యాయి. రిజి్రస్టేషన్ చేయకుండా మిగిలిన ఎకరాతో పాటు వెంకటరావు అమ్మకుండా ఉన్న 3 ఎకరాల 7 సెంట్ల భూమి రూ. 30 లక్షలు ఇస్తామని, రామచంద్రరావుకు పుట్టిన రోజు గిఫ్టుగా ఆ భూమి అంతా రిజి్రస్టేషన్ చేయాలంటూ రామచంద్రరావు అనుచరులు ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపుతాం అంటూ బెదిరించారు. ఈ క్రమంలో గడిచిన శనివారం వెంకటరావు, అతని కుమారుడు హరికృష్ణ బయటకు వచ్చి తిరిగి వెళ్తుంటే వారి బండిని ఢీకొట్టి దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత పట్టాభిపురం పోలీసులు వెంకటరావు, అతని కుమారుడికి వేరేవారితో ఫోన్ చేయించి మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యిందని, ఎమ్మెల్యే కాళ్ల మీద పడి మాట్లాడుకోండి అని చెప్పించారు. దీంతో పోలీసుల వద్దకు వెళ్తే తమకు న్యాయం దక్కదని భావించిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. గుంటూరుకు రామచంద్రరావే సీఎం లాంటివాడని, అతనిని కాదంటే బతకలేరంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఇటీవలే ఇంటికి వచి్చన తనపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారని, తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే రామచంద్రరావే బాధ్యత వహించాలని హరికృష్ణ ఆవేదన వెలిబుచ్చాడు. -
పుట్టినరోజున రూ.5 కోట్లతో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
కొడుకు పుట్టిన రోజున డ్రెస్, మొబైల్.. మరీకాదంటే బైక్లాంటివి గిఫ్ట్ ఇస్తుంటారు. ఇదంతా మధ్య తరగతివారికి తీపి జ్ఞాపకాలను మిగుల్చుతాయి. మరి ధనవంతుల ఇళ్లలో పుట్టినరోజుకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రముఖ వ్యాపారవేత్త వివేక్‌కుమార్ రుంగ్తా తన కుమారుడి బర్త్‌డే రోజున ఏకంగా రూ.5 కోట్లు విలువచేసే ‘లాంబోర్గినీ హురకాన్ ఎస్టీఓ’ మోడల్కారును బహుమానంగా ఇచ్చారు. ఈమేరకు తనకు గిఫ్ట్ ఇస్తుంటే తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న వీకేఆర్ గ్రూప్ అధినేత వివేక్‌కుమార్ రుంగ్తా తన కుమారుడు తరుష్ రుంగ్తా 18వ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతో దుబాయ్‌లోని లాంబోర్గినీ సంస్థను సంప్రదించారు. కంపెనీ తయారుచేసిన హురకాన్ ఎస్టీఓ కారును కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త ఆ సూపర్ స్పోర్ట్స్ కారును చూసిన తరుష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా స్పందిస్తూ.. ‘నా 18వ పుట్టినరోజును డ్రీమ్కారు గిఫ్ట్‌గా ఇచ్చి మరింత అద్భుతంగా మార్చినందుకు నాన్నకు కృతజ్ఞతలు! తన ప్రేమాభిమానాలు ఎప్పటికే నాతోనే ఉంటాయి’ అని తెలిపారు. Indian businessman Vivek Kumar Rungta gifted a Lamborghini Huracan STO worth ₹5 Crore to his son Tarush on his 18th birthday pic.twitter.com/nNe4GMIGqI — Rosy (@rose_k01) April 11, 2024 -
'ఆయన కోసమే అలా చేయించుకున్నా'.. మెగాస్టార్‌పై వైష్ణవ్ తేజ్ కామెంట్స్!
చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన మూవీతో అభిమానులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం ఆదికేశవతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రం పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ మెగాస్టార్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిరు అని పేరు వచ్చేలా క్రాఫ్ చేయించుకున్న ఫోటోపై స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. 'మామయ్య పుట్టినరోజుకు అందరూ గిఫ్ట్స్ తెచ్చారు. సాయి ధరమ్ తేజ్ పెద్ద కత్తిని బహుమతిని తీసుకొచ్చాడు. నేను మాత్రం ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలనని అనుకున్నా. అందుకే చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. చిరు అని వచ్చేలా హెయిర్ కట్ చేయించుకున్నా. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా రామ్ చరణ్ అన్న అందరినీ ఆకట్టుకుంటాడు. సాయిధరమ్ తేజ్ బాగా అల్లరి చేస్తాడు. తన యాక్సిడెంట్ మా అందరికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఆ విషయాన్ని మేము ఎప్పుడో మర్చిపోయాం.' అని అన్నారు. -
త్రివిక్రమ్‌కు రూ.6 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో!
టాలీవుడ్లో కొందిమంది డైరెక్టర్లకి మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనను సామాన్యులే కాదు స్టార్ హీరోలు సైతం అభిమానిస్తారు. ఆయనలోని దర్శకత్వ ప్రతిభ కంటే ఆయన కలం నుంచి జారువాలే పదునైన సంభాషణలకు ఫ్యాన్స్ ఎక్కువ. తనదైన మాటలతో ప్రేక్షకులను నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు.. ఆలోచింపజేస్తారు. అందుకే ఆయనను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ‘మాటల మాంత్రికుడు’అని పిలుచుకుంటారు. ఆయన బర్త్‌డే(నవంబర్ 7)ను ప్రతి యేటా పండుగలా జరుపుకుంటారు. ఈ సారి కూడా త్రివిక్రమ్ బర్త్‌డే గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. పలువురు సినీ తారలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ హీరో మాత్రం బర్త్‌డే విషెస్‌తో పాటు ఖరీదైన బహుమతిని అందజేశాడట. ఏంటా బహుమతి? త్రివిక్రమ్ బర్త్‌డే సందర్భంగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’నుంచి ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడా పాట మహేశ్ ఫ్యాన్స్ ఫెవరేట్ ట్రాక్‌గా మారింది. ఈ సంగతి పక్కకి పెడితే.. బర్త్‌డే రోజు త్రివిక్రమ్‌కి ఖరీదైన బహుమతి అందిందనే రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్‌కి చెందిన ఓ ఆగ్రహీరో రూ.6 కోట్ల విలువ చేసే ప్రాపర్టీనీ బహుమతిగా అందించాడట. ఇప్పుడీ గిప్ట్ రూమర్ టాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. ఎవరా హీరో? త్రివిక్రమ్ కొంతకాలంగా టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోకి సపోర్ట్‌గా ఉంటున్నాడు. ఆ హీరో చేయాల్సిన సినిమాలకు స్టోరీస్, డైరెక్టర్స్‌ను సెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే పుట్టిన రోజు కానుకగా ఆ హీరో త్రివిక్రమ్‌కు రూ. 6 కోట్ల విలువ చేసే బహుమతిని అందించారట. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది. -
Kalki 2898 AD: కల్కిలో ఇలా..
బిగ్ బి అమితాబ్ బచ్చన్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది ‘కల్కి 2898 ఏడీ’ టీమ్. బుధవారం (అక్టోబర్ 11) అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి..’లో ఆయన గెటప్ ఇలా ఉంటుందంటూ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘‘కొన్ని తరాలకు స్ఫూర్తిగా నిలిచిన లెజెండ్‌తో సినిమా చేయడం ఓ ఆశీర్వాదం. ఒక పెద్ద కల నెరవేరినట్లు అనిపిస్తోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ స్పందించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ‘‘మైథాలజీ స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
పుట్టినరోజున ప్రత్యేక కానుక.. షాక్ అయిన యువతి
ముంబై: పుట్టినరోజు అంటే సంబరం. అందులోనూ జన్మదిన వేడుకలో అందుకునే చిన్న చిన్న కానుకలు అంటే అపురూపంగా చూసుకుని మురిసిపోతారు. అలాంటిది ఒక మహిళ అనూహ్యంగా టమాటాలను గిఫ్ట్‌గా అందుకుని ఆశ్చర్యంలో మునిగింది. మహారాష్ట్రలోని థానే పట్టణంలో ఈ కొత్తరకం బహుమతి ఘటన జరిగింది. సంబంధిత వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. థానె జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలోని కొచాడీలో ఉండే సోనల్ బోర్సే పుట్టినరోజు వేడుక ఆదివారం జరిగింది. ఆ ప్రాంతంలో కేజీ టమాటా ఏకంగా రూ.140 ధర పలుకుతోంది. అదే రోజు ఆమె నాలుగు కేజీలకుపైగా టమాటాలు ఉన్న బుట్టలను బహుమతిగా అందుకున్నారు. ఈసారి అకాల వర్షాలు, బిపర్జోయ్ తుపాను మిగిల్చిన విషాదం కారణంగా పంట నాశనమై దిగుబడి భారీగా తగ్గిపోయి టమాటా ధర రిటైల్ మార్కెట్లో చుక్కలనంటుతోంది. కొద్దిరోజులు గడిస్తే కొత్త పంట వచ్చి ధరలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. -
ఎస్సీజీ గేట్‌కు సచిన్ పేరు
సిడ్నీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం (ఏప్రిల్ 24) 50వ పుట్టినరోజు జరుపుకున్నాడు. క్రికెట్ ప్రేక్షకులకు, ప్రత్యేకించి ‘మాస్టర్’ బ్యాట్స్‌మన్ అభిమానులకు ఇది పండగ రోజు. ఈ ‘ఫిఫ్టీ’ని మరింత చిరస్మరణీయం చేసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వైపు నుంచి అపురూప కానుక లభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోని ఓ గేట్‌కు సచిన్ పేరు పెట్టింది. ఈ మైదానం అతనికెంతో ప్రత్యేకమైంది. ఈ వేదికపై ‘లిటిల్ మాస్టర్’ మూడు శతకాలు సహా 785 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 241 (2004లో). ఇక్కడ సచిన్ 157 సగటు నమోదు చేయడం మరో విశేషం. సోమవారం సచిన్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీజీ, న్యూసౌత్‌వేల్స్ వేదికల చైర్మన్ రాడ్ మెక్ గియోచ్, సీఈఓ కెర్రీ మాథెర్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ ‘సచిన్ గేట్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచిన్ అనుభవాన్ని ప్రస్తావించారు. ‘భారత్ వెలుపల సిడ్నీ నా ప్రియమైన మైదానం.1991–92లో నా తొలి ఆసీస్ పర్యటన మొదలు కెరీర్ ముగిసేదాకా ఎస్సీజీలో నాకు మరిచిపోలేని స్మృతులెన్నో వున్నాయి’ అని సచిన్ పేర్కొన్నారు. సచిన్ సమకాలికుడు బ్రియాన్ లారా (విండీస్) కూడా అక్కడ గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌ల ఆడటంతో మరో గేట్‌కు లారా పేరు పెట్టారు. తనకు కలిసొచ్చిన ఈ మైదానం పేరును లారా తన కుమార్తెకు ‘సిడ్నీ’ అని పెట్టుకున్నాడు. -
21 న పిల్లలకు సీఎం జగన్ బర్త్ డే గిఫ్ట్
-
అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి
అషురెడ్డి.. సోషల్ మీడియా యాజర్లకు, బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ షోతో రాత్రి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న ఆమె తరచూ తన హాట్‌హాట్ ఫొటోలతో ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. ఇలా నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ క్రమంలో ఆమె ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన కూడా పడింది. ఇదిలా ఉంటే గురువారం ఆమె పుట్టిన రోజు. సెప్టెంబర్ 15 ఆమె బర్త్‌డే సందర్భంగా తన తండ్రి నుంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందుకుంది అషు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. అషు బర్త్‌డే సందర్భంగా ఆమె తండ్రి మెర్సిడీజ్ బెంజ్ కంపెనికి చెందిన C200D అనే మోడల్ కారును బహుమతిగా ఇచ్చాడు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. ఇక తండ్రితో కలిసి కారు ముందు ఫోజులు ఇచ్చిన ఫొటోలు ఆమె తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇక దీనికి ‘సారీ మమ్మీ.. నువ్వు షాకవ్వకు. ఇది డాడీ సర్ప్రైజ్’ అంటై బ్లూ హాట్ ఎమోజీని జత చేసింది. కాగా బర్త్‌డే సందర్భంగా అషు అందుకున్న ఈ బహుమతి కారు ఖరీదు దాదాపు రూ. 70 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ఖరీదైన కారును కానుకగా అందుకున్న అషు ఫుల్ సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నానంది. ‘ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ ఫ్రైజ్ బహుమతి ఇది’ అంటూ మురిసిపోతుంది. ఇక ఆమె పోస్ట్‌పై తన ఫాలోవర్స్ అషు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రానా View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
చిరంజీవి బర్త్ డే గిఫ్ట్
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఈ నెల 22న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నారు చిరంజీవి. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ టీజర్‌ని 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, చిరంజీవి పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది. సల్మాన్ ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: నీరవ్ షా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వాకాడ అప్పారావు. కార్నివాల్ ఫెస్టివల్‌కి రండి: ‘‘అన్నయ్య (చిరంజీవి) బర్త్‌డే సందర్భంగా ఈ నెల 22న హైదరాబాద్ హైటెక్స్‌లో ‘కార్నివాల్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాం’’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్‌డేని శిల్పకళా వేదికలో చేసేవాళ్లం. అయితే ఈ ఏడాది ఫ్యాన్స్ కోసం హైటెక్స్‌లో ‘కార్నివాల్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలో చిరంజీవిగారి గురించి ఎవరికీ తెలియని విషయాలు పంచుకుంటాను. ఈ ఫెస్టివల్‌కి మా ఫ్యామిలీ నుంచి అందరు హీరోలు హాజరవుతారు. అలాగే ఇతర హీరోలు, ఆయన్ను అభిమానించేవారు కూడా పాల్గొంటారు. ఈ ఫెస్టివల్‌కి అన్ని ప్రాంతాల మెగా అభిమానులు తప్పకుండా రావాలి’’ అన్నారు. -
Viral Video: ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’
మనుషుల భావోద్వేగాలతో ఆటాడుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందంటూ ట్విట్టర్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన 12 గంటల్లోనే ఏకంగా రెండు మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఏకంగా 65 వేల మంది స్పందించారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే .. తమ కూతురి పుట్టినరోజు సందర్భంగా ఓ వ్యక్తి గిఫ్ట్ తీసుకొచ్చి కిచెన్‌లో ఉన్న తన భార్యకిస్తాడు. గిఫ్ట్ ప్యాక్‌లో ఓ కవర్ తెరిస్తే.. అందులో మరొకటి.. అది తెరిస్తే.. ఇంకొకటి.. అలా చివరికి ఓ రెండు కాగితాలు మిగులుతాయి. ఏదో గొప్ప బహుమతి ఇస్తావనుకుంటే ఇవేంటీ అని ఆమె భర్తను ప్రశ్నిస్తుంది. సరే ఈ కాగితాల్లో ఏముంది? ఆమె ప్రశ్నకు ఆ వ్యక్తి సమాధానం వింటే షాకవడం ఖాయం. ‘అవి DNA పరీక్షా ఫలితాలు.. వాటి ప్రకారం మన బిడ్డకు తండ్రి నేను కాదు’ అని అతను చెప్పగానే ఆమె నిశ్చేష్టురాలవుతుంది. చదవండి👉పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి .. అబార్షన్‌కు హైకోర్టు నో.. ఓకే చెప్పిన సుప్రీంకోర్టు ఈ వీడియోలో నిజమెంత? అబద్దమెంత? వ్యూస్ కోసం చేశారా? లేక నిజంగానే జరిగిందా? అన్నదానిపై పరిశీలన చేశాం. ఇది రెండేళ్ల కిందటిదిగా తేలింది. వీడియో పాతదా? కొత్తదా? అన్నది పక్కనపెడితే ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. కోపతాపాలు పెరగడంతో విచ్చలవిడిగా విడాకులు తీసుకుంటున్నారు. అప్పటికే పుట్టిన బిడ్డల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. ఇక కృత్రిమ గర్భధారణతో పుట్టిన బిడ్డల విషయంలోనూ గందరగోళం నెలకొంటోందని ఎన్నో కేసులు చెబుతున్నాయి. వీటికి తోడు అనైతిక సంబంధాలు.. వెరసి ఎంతో మానసిక వ్యధను పిల్లలు ఎదుర్కొంటున్నారు. చదవండి👉జో బైడెన్‌కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ He gifted her the DNA test resuIts on their “daughter's” birthday😬… pic.twitter.com/CKMqPZiKRr — d🦕n (@javroar) July 20, 2022 -
మాజీ భార్య నుంచి బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్: ఆమీర్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఆమిర్ ఖాన్ 57వ బర్త్‌డే. ఈ సందర్భంగా ప్రమఖులు సహా నెటిజన్ల నుంచి ఆయనకు బర్త్‌డే విషెస్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మాజీ భార్య కిరణ్ రావు నుంచి ఇటీవలె ఓ బహుమతి అందిందని, అది తన జీవితంలోనే ఉత్తమమైన గిఫ్ట్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసెంట్గా కిరణ్‌తో మాట్లాడాను. ఈ క్రమంలో నా లోపాలు, బలహీనతల గురించి ఓ లిస్ట్ తయారు చేయమని చెప్పాను. ఆమె నాకు ఓ 10-12 పాయింట్స్‌తో ఓ జాబితా తయారు చేసి ఇచ్చింది. అది నా లైఫ్‌లోనే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. కాగా 2021లో అమిర్ ఖాన్- కిరణ్ రావు విడిపోయిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇకపై తాము భార్యాభర్తలం కాదని సోసల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'ఇకపై మేం భార్యాభర్తలం కాదు. కానీ ఒకరికొకరం ఫ్యామిలీగా, పేరెంటింగ్ బాధ్యతలను కలసి పంచుకుంటాం’ అని ఆమిర్, కిరణ్ రావులు ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అమ్మ బాబోయ్.. సల్మాన్ ఖాన్‌కి అన్ని కోట్ల బహుమతులా!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న తన 56వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. పాన్వేల్‌లోని తన ఫాంహౌస్‌లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకకి కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా సల్మాన్ ఖాన్‌కి ఖరీదైన బహుహతులు ఇచ్చారు. సల్మాన్ మాజీ ప్రేయసీ కత్రినా కైఫ్ సుమారు రూ.3 లక్షలు పెట్టి బంగారపు బ్రాస్లెట్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. సంజయ్ దత్ సూమారు రూ.8 లక్షలు విలువ చేసే డైమాండ్ బ్రాస్లెట్ను బహుమతిగా అందించారు. అనిల్‌కపూర్.. లెదర్ జాకెట్ (దాదాపు రూ.29లక్షలు), జాక్వెలిన్ రూ.12 లక్షలు విలువ చేసే స్పెషల్ వాచ్‌ని గిఫ్ట్‌గా అందించిదట. (చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. నెటిజన్ల ట్రోలింగ్..) అలాగే సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చారు. అతని సోదరి అర్పిత రూ. 15-17 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చింది. అతని సోదరులు, సోహైల్ ఖాన్ , అర్బాజ్ ఖాన్ అతనికి బీఎండబ్ల్యూ కారు (రూ.25 లక్షలు), ఆడీ కారు( రూ.3కోట్లు) ఇచ్చారట. అర్పితా ఖాన్ భర్త మరియు సల్మాన్ బావ మరియు యాంటిమ్ సహనటుడు ఆయుష్ అతనికి రూ. 75,000 విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడు. వీటితో పాటు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ జుహులో రూ.12 కోట్లు విలువ చేసే అపార్ట్‌మెంట్‌ని బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బర్త్‌డేకి ఇన్ని కోట్ల బహుమతులు రావడం పట్ల సల్లూ భాయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, నెటిజన్స్ మాత్రం ‘అమ్మ బాబోయ్.. సల్మాన్ ఖాన్ బర్త్‌డేకి అన్ని కోట్ల బహుమతులా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఓవైపు కేసులు.. మరోవైపు మనవడికి 40 కోట్ల కానుక
బిందు రాణా కపూర్.. యస్ బ్యాంక్ ఫౌండర్, మాజీ ఎండీ రానా కపూర్ భార్య. అక్రమ ధనార్జన కేసు విచారణలో భర్తతోపాటు బిందూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని పలు సంస్థలకు యస్‌బ్యాంక్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేయగా, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఆమె తన తొమ్మిదేళ్ల మనవడికి పుట్టినరోజు కానుకగా 40 కోట్ల విలువైన ఆస్తుల్ని అందించడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని పోష్ ఏరియా జోర్‌బాగ్‌లో తన పేరిట ఉన్న ఆస్తిని.. మనవడు ఆశివ్ ఖన్నా పేరిట రాసింది బిందు రాణా కపూర్. ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ విలువ 40 నుంచి 44 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఆస్తి.. ఆమె తన తండ్రి నుంచి 2004 లో పొందినట్లు డాక్యుమెంట్లలో ఉంది. జప్కీ డాట్‌కామ్ ద్వారా డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చాయి. జులై 31న ఆస్తి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన 36 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు జరిగిందని.. ఆ ఆస్తికి బిందూ కూతురు, ఆశివ్ ఖన్నా తల్లి రాధా కపూర్ గార్డియన్‌గా నియమించినట్లు ఆ చెల్లింపుల్లో ఉంది. ఇది చదవండి: యస్ బ్యాంక్ నష్టం, ఎన్ని కోట్లంటే.. గతేడాది జులైలో యస్ బ్యాంక్ మోసాలు.. మనీలాండరింగ్ కేసులో రెండు వేల కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ ఎటాచ్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో లండన్‌లోని రాణా కపూర్‌కు చెందిన 127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కూడా ఈ మధ్యే ఎటాచ్ చేసింది. ఇక పోయినవారం రానా కపూర్‌ను వారం కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టును కోరిన విషయం తెలిసిందే. కపూర్, ఆయన భార్య బిందు, అవంత రియాలిటీ లిమిటెడ్ గౌతమ్ థారప్లు.. 685 కోట్ల ఆస్తుల్ని కేవలం 375 కోట్ల ఆస్తుల ట్రాన్జాక్షన్ చూపించడాన్ని ఇల్లీగల్‌గా పేర్కొంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. రాణా కపూర్‌తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై ప్రస్తుతం మనీలాండరింగ్ కేసు నడుస్తోంది. -
ఛార్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ
-
ఛార్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ
15ఏళ్లకే నీ తోడు కావాలి సినిమాతో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చిన ఛార్మీ తెలుగునాట స్టార్డంను సొంతం చేసుకుంది. అగ్రహీరోలతో నటిస్తూనే నటనా ప్రాధాన్యమున్న సినిమాలను చేసి సత్తా చాటింది. ప్రస్తుతం హీరోయిన్గా వెండితెరకు దూరమైనా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాతగా మారింది. సోమవారం ఛార్మీ34వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సహా అభిమానులు ఆమెకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. ఇక హీరో విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ గిఫ్ట్‌తో ఛార్మీని సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఆనందంలో మునిగిపోయిన ఛార్మీ ఈ గిఫ్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ మురిసిపోయింది. దీంతో ఆ గిఫ్ట్ ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్‌లో క్వశ్చన్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరీ జగన్నాద్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక మొదటిసారి విజయ్ సరసన అనన్య పాండే కలిసి నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి : విజయ్‌పై ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్ట్ వైరల్ అందాల ఛార్మి పెళ్లి చేసుకోబోతోందా? -
సోహైల్‌కు ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన ఫ్యాన్
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ తీసుకొచ్చింది. బిగ్‌బాస్ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఎంతో ఫేమస్ అయిపోయారు. వీరిలో సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహైల్ ఒకడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది. హౌజ్‌లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. 100 రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన సోహైల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. దీంతో సోహైల్‌కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ వీపరితంగా పెరిగిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్ షో నుంచి బయటకు రాగానే అతడి కోసం వందల సంఖ్యలో ఫ్యాన్స్ బారులు తీరిన దృశ్యమే ఇందుకు ఉదహరణ. తాజాగా ఓ అభిమాని సోహైల్ బర్త్‌డే సందర్భంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. ఏప్రీల్ 18న సోహైల్ పుట్టిన రోజు సందర్భంగా లక్కీ అనే అభిమాని సోహైల్‌కు ఖరిదైన స్పోర్ట్స్ బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోహైల్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేగాక సదరు అభిమానికి ఈ సందర్భంగా సోహైల్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన కోరికను బయట పెట్టాడో లేదో అలా సోహైల్‌కు దర్శక నిర్మాతల నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
రష్మిక కోరిక త్వరలోనే నెరవేరుస్తానన్న బన్నీ
రష్మిక మందన్నా..ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈమె. చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ అమ్మడి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఏప్రిల్5న రష్మిక మందన్నాపుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. ఈ సంవత్సరం మరెన్నో విజయాలు పొందాలని, నువ్వు కోరుకున్నవన్నీ నెరవాలని కోరుతూ బర్త్‌డే విషెస్ తెలిపారు. దీనిపై స్పందించిన రష్మిక..తనకు బర్త్‌డే గిఫ్ట్ కావాలని, సెట్లో కేక్ కట్ చేయించే వరకు ఊరుకోనని, ఫన్నీగా కామెంట్ చేసింది. దీంతో తప్పకుండా.. త్వరలోనే సెట్లో కలుద్దాం అంటూ అల్లు అర్జున్ బదులిచ్చారు. దీనికి సంబంధించిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అల్లు అర్జున్- రష్మిక 'పుష్ప' సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు13న విడుదల కానుంది. Thankyou so so much @alluarjun saaaaaarrrr! ❤️ I want my gifttttt.. I am going to bother you to cut the cake with me when I am back on the set.. 🎉💃🏻🥳 https://t.co/VIwnycWf2L — Rashmika Mandanna (@iamRashmika) April 5, 2021 చదవండి: రష్మిక ఫస్ట్‌లుక్ ఎక్కడంటూ ఫ్యాన్స్ ఫైర్ రష్మిక ఫస్ట్ ఆడిషన్: వీడియో రిలీజ్ చేసిన మాజీ ప్రియుడు -
కార్యకర్త కూతురుకు కేటీఆర్ సర్‘ప్రైజ్’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పట్ల ఓ కార్యకర్త చూపిన నిబద్ధతకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు చలించిపోయారు. కార్యకర్త కూతురు పుట్టినరోజు సందర్భంగా అనూహ్యకానుకను పంపి ఆశ్చర్యానికి గురిచేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్ పార్టీ ఆదేశం మేరకు సుమారు 20 రోజులపాటు హైదరాబాద్‌లో ఉండి పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం జరుగుతున్న సమయంలోనే నవాజ్ హుస్సేన్ మామ మరణించాడు. మామ అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా ఆయన హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. మరోవైపు తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన తన భార్యకు ఫోన్లో దైర్యం చెప్తూ హైదరాబాద్‌లో పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై పార్టీ నేతలు, కార్యకర్తలతో శుక్రవారం కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది. యోగక్షేమాలు విచారిస్తున్న సమయంలో శనివారం తన కూతురు నబీలా మహమ్మద్ పుట్టినరోజు ఉందని నవాజ్ హుస్సేన్ చెప్పాడు. పార్టీపట్ల కార్యకర్త చూపిస్తున్న అభిమానానికి చలించిపోయిన కేటీఆర్ శనివారం స్థానిక నాయకుల ద్వారా నబీలాకు ట్యాబ్‌తోపాటు కేక్, కొన్ని బొమ్మలు పంపించారు. అంతటితో సరిపెట్టకుండా పాపకు స్వయంగా ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఏమైనా కావాలా.. అని చిన్నారిని అడగ్గా ‘ఏమీ వద్దు.. తెలంగాణ గెలిస్తే చాలు’అని సమాధానం ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ పట్ల కార్యకర్తలకు ఉన్న నిబద్ధత, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఈ ఘటన నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్కు కార్యకర్తల అంకితభావమే బలమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, ఏ ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, కంటికి రెప్పలా చూసుకుంటామని అన్నారు. -
ఒక గంటలో కోటి మొక్కలు
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశమంతటా హరిత భావజాల స్ఫూర్తిని వ్యాపింపజేస్తామని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణను పర్యావరణపరంగా, అత్యంత నివాసయోగ్యంగా మార్చుకునేందుకు ఈ చాలెంజ్‌లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు (ఫిబ్రవరి 17)న కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఒక్కరోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి, హరిత ప్రేమికుడైన కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనేది గ్రీన్ ఇండియా చాలెంజ్ సంకల్పమన్నారు. ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులన్నీ సిద్ధమవుతున్నాయని తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, గ్రామ స్థాయి వరకు పార్టీ పదవుల్లో ఉన్న అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సంతోష్ పిలుపునిచ్చారు. ఇక కేసీఆర్‌ను అభిమానించే వారితో పాటు వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడా రంగ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేం దుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ నెల 16, 17 రోజుల్లో రెండ్రోజుల పాటు శంషాబాద్ విమానాశ్రమంలో హైదరాబాద్ చేరుకునే ప్రయాణికులందరికీ ఔషధ మొక్కలను గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున పంపిణీ చేస్తామన్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రతీ గ్రామం.. తద్వారా రాష్ట్రం ఆకుపచ్చగా తయారు కావాలని, అందుకోసం అందరి కృషి అవసరమని సంతోష్ ఆకాంక్షించారు. ఎండలు సమీపిస్తున్నందున మొక్కలు నాటడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు, నీటి సౌకర్యం, తగిన రక్షణ కల్పించేలా ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. -
జగనన్నకు పుట్టినరోజు బహుమతి ఇదే: ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన వైఎస్ జగన్‌కు పుట్టినరోజు బహుమతి అందజేశారు. ఈ మేరకు బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయిన పి. పుష్పకుమారి అనే చిన్నారిని ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో చదువుకుంటోంది. పుష్ప కుమారికి మెడిసిన్ చేయాలనే లక్ష్యం ఉందని గర్ల్స్ హోమ్ నిర్వాహకులు రోజా దృష్టికి తీసుకొచ్చారు. మెడిసిన్ చదవాలని ఎమ్మెల్యే రోజాతో తెలిపిన విద్యార్థిని పుష్పకుమారి. పుష్ప కుమారి మెడిసిన్ చదువులకయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్తు చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎమ్మెల్యే రోజా తెలిపారు. పుష్పను దత్తత తీసుకుంటున్నాని మాటిచ్చారు. చదవండి: సీఎం జగన్‌కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకున్నాను. మనకు నచ్చిన వారి పుట్టిన రోజున కేవలం బొకేలు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన మన జగనన్నకు ఇదే నా పుట్టినరోజు బహుమతి.. హ్యాపీ బర్త్ డే జగనన్న. అని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు @ysjagan అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది.#HBDYSJagan#HBDBestCMYSJagan pic.twitter.com/dQUu8rWZer — Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2020 -
డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నితిన్
హీరో నితిన్‌కు నాలుగేళ్ల తర్వాత మంచి బ్రేక్ ఇచ్చిన భీష్మ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుములకు నితిన్ మంచి గిఫ్ట్ ఇచ్చాడు. బుధవారం దర్శకుడు వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన రేంజ్ రోవర్ కారును ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. నాలుగేళ్ల తర్వాత నాకు హిచ్ వచ్చిందంటూ హీరో నితిన్ స్వయంగా చెప్పాడు. ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇవ్వడం పట్ల డైరెక్టర్ వెంకీ ఆనందం వ్యక్తం చేశాడు. (జిమ్ ట్రైనర్‌కు ప్రభాస్ గిఫ్ట్) ‘ఉత్తమ వ్యక్తులతో మంచి సినిమాలు చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇంత మంచి బహుమతి ఇచ్చినందుకు థ్యాంక్యూ’ అంటూ తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వెంకి కుడుములతో కలిసి తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే చరణ్‌కు వెంకీ స్క్రిప్ట్ కూడా వినిపించాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలతో కామెడీ, యాక్షన్, లవ్ ట్రాక్ లను బాగా ప్రొజెక్ట్ చేయగల వెంకీ కుడుముల స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. (తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య) When u make a best film with the best person, best things happen ! Thank you so much for this best birthday gift @actor_nithiin anna.. Love u loads.. 😍😘🤗🤩 pic.twitter.com/JX5cw38e6f — Venky Kudumula (@VenkyKudumula) September 8, 2020 -
బర్త్ డే గిఫ్ట్
చిరంజీవి పుట్టినరోజు వస్తోందంటే మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ ఉంటుంది. ఆగస్టు 22న ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజున అభిమానులందరూ రక్తదాన శిబిరాలతో పాటు పలు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో అందుకు అనుగుణంగా వేడుకలు ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. కాగా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ గిఫ్ట్ ఇవ్వనున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 22న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: తిరు, సంగీతం: మణిశర్మ. -
బాలయ్య బర్త్‌డే గిఫ్ట్: సాంగ్ విన్నారా?
నటసింహం నందమూరి బాలకృష్ణ బుధవారం 60వ జన్మదిన వేడుకలు జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా నందమూరి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. దివంగత ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరును కథ’ సినిమాలోని ‘శివ శంకరీ శివానంద లహరీ’ పాటను ఆలపించారు. ఈ పాటకు సంబంధించి ఆ చిత్రంలోని సన్నివేశాలను చూపిస్తూనే బ్యాక్‌గ్రౌండ్‌లో బాలయ్య పాటను యాడ్ చేశారు. ఈ పాటను ఎన్బీకే ఫిలింస్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక బర్త్‌డే గిఫ్ట్‌గా తమ హీరో పాడిన పాటకు నందమూరీ అభిమానులతో పాటు సంగీత ప్రియులు సైతం ఫిదా అవుతున్నారు. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం: బాలయ్య ఇక తన 60వ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ తన అభిమానులకు ఫేస్బుక్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ.. ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమాన సోదరులందరికీ నా ఆత్మీయ విజ్ఞప్తి. నా 60వ పుట్టినరోజుని మీ ఇంటి పండగలా కనీ, వినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నా హితులు, శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులైన మీ అందరితో కలిసి వేడుక చేసుకొనే ఆదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉంది. ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా భాధ్యత. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం. ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు, భౌతికదూరం పాటించడం మనందరి కర్తవ్యం. అందుకే అందర్నీ కలవాలన్న నా ఆకాంక్షకి అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మీ ఆరోగ్యాల్ని నిర్లక్ష్యం చేసి ఎవరూ నన్ను కలవడానికి రావద్దని కోరుతున్నాను. ఈ రోజు ద్వారక క్రియేషన్స్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రం టీజర్ మరియు నేను పాడిన పాట విడుదలౌవుతున్నాయి. ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ప్రభుత్వ నిబంధనలు పాటించండి. నిండు మనసుతో నా విన్నపాన్ని మన్నించండి. మీ బ్రతుకు ముఖ్యం... మీ భవిత ముఖ్యం. మీ అందరి క్షేమమే మీరు నాకు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ... మీ బాలకృష్ణ’ అంటూ హీరో బాలకృష్ణ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. -
అట్టపెట్టెలో ఏముందంటే..
-
మురిపాల సముద్రం
సుస్మితా సేన్ తన పదేళ్ల చిన్న కూతురు అలీసాకు ఎప్పటికీ మర్చిపోలేని బర్త్ డే గిఫ్టును అందించారు. ఇటీవల అలీసా పుట్టిన సందర్భంగా ఆ చిన్నారిని మాల్దీవులకు తీసుకెళ్లి హిందూ మహాసముద్రంలో స్కూబా డైవింగ్ చేయించారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, ‘‘నా కూతురు తన ఐదవ ఏట నుంచీ స్కూబా డైవింగ్ చేస్తానని అడుగుతోంది. నేనే తనకు మరింత వయసు రావడం కోసం ఆగాను’’ అని కామెంట్ పెట్టారు. డైవింగ్‌కి ముందు సుస్మిత అలీసాపై ఎన్ని ముద్దు మురిపాలు కురిపించారో చూడ్డం కోసమైనా ఈ వీడియోను చూడాల్సిందే. సుస్మితకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రీనీ వయసు పందొమ్మిదేళ్లు. సుస్మిత వివాహం చేసుకోలేదు. ఇద్దరూ దత్త పుత్రికలు. -
నా పుట్టినరోజు కానుకగా కంటి ఆస్పత్రి
సిద్దిపేట జోన్: తన పుట్టినరోజు జూన్ 3 నాటికి సిద్దిపేట జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని కానుకగా ఇస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగులబండ సమీపంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి భవన నిర్మాణ పనులు, త్రీ స్టార్ టూరిజం హోటల్ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రెండు ఎకరాల్లో చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టూరిజం శాఖ ఏఈ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -
జియో యూజర్లకు ‘బర్త్‌డే’ గిఫ్ట్
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో పుట్టిన రోజు కానుకను ప్రకటించింది. రెండో వార్షికోత్సవ సెలబ్రేషన్స్‌లో భాగంగా నెలకు 100 రూపాయలకే 42 జీబీ హైస్పీడ్ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు, జియో యాప్స్‌ను సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 21 వరకు వాలిడ్‌లో ఉండనున్నట్టు తెలిపింది. మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ 84 రోజులకు అందిస్తున్న రూ.399 ప్లాన్ ద్వారా పొందాల్సి ఉంది. రూ.399 ప్లాన్‌ను రూ.100 డిస్కౌంట్‌తో కేవలం రూ.299కే అందిస్తుంది. దీంతో నెలకు ఈ రీఛార్జ్ ప్లాన్ ధర 100 రూపాయలే పడుతుంది. రూ.299తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 126 జీబీ డేటా, ఎస్ఎంఎస్ వినియోగించుకోవచ్చు. అంటే నెలకు సగటున 42 జీబీ డేటాను వస్తోంది. రూ.50ను జియో ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుండగా.. మరో రూ.50 క్యాష్‌బ్యాక్‌ను మైజియోపై ఫోన్‌పే ద్వారా అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం తన ప్రైమ్ సబ్స్క్రైబర్లకు, ఫోన్‌పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటేనే లభిస్తుంది. ఎలా ఈ ఆఫర్ పొందాలి? మొదట మైజియో యాప్‌లోకి లాగిన్ కావాలి. ‘బయ్’ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి, రూ.399 రీఛార్జ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. పేమెంట్ మోడ్ పేజీలో, అందుబాటులో ఉన్న వాలెట్ ఆప్షన్ల జాబితా నుంచి ఫోన్‌పేను ఎంపిక చేసుకోవాలి. మీ ఫోన్‌పే అకౌంట్లోకి సైన్-ఇన్ అయి, వన్-టైమ్ పాస్‌వర్డ్‌తో ఫోన్‌పే అకౌంట్‌ను వెరిఫై చేసుకోవాలి. ‘పే బై ఫోన్‌పే’ను క్లిక్చేయాలి. -
బాబాయ్‌కి రామ్‌చరణ్ బర్త్‌డే గిఫ్ట్ !
-
ఐటీబీపీ జవాన్లకు పుట్టిన రోజు కానుక
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులను కాపాడే జవాన్లు తమ పుట్టినరోజు వేడుకలను పనిచేస్తున్న చోటే జరుపుకునే అవకాశాన్ని ఇండో–టిబెటన్ సరిహద్దు రక్షక దళం(ఐటీబీపీ) కల్పించింది. పుట్టిన రోజు జరుపుకునే జవానుకు సగం రోజు సెలవు ఇవ్వడంతోపాటు యూనిట్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేయించి, ఉన్నతాధికారులు బొకే అందజేయనున్నారు. సెలవు, ప్రత్యేక విధుల సమయంలో తప్ప యూనిట్లో ఉన్న ప్రతి జవాను కూడా బర్త్‌డే వేడుక జరుపుకోవాలని కోరారు. సిబ్బందిలో ఐకమత్యం, ఆత్మవిశ్వాసం పెంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఐటీబీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీబీపీ విభాగాలను కోరింది. దీని ప్రకారం ఇకపై స్త్రీ లేదా పురుష జవానుకు బర్త్‌డే నాడు సగం రోజు ఇవ్వనున్నారు. ఆ రోజు ఉన్నతాధికారులు బొకే అందించి శుభాకాంక్షలు తెలుపుతారు. యూనిఫాం బదులు తమకు ఇష్టమైన దుస్తులు ధరించి తోటి సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసే అవకాశం ఇస్తారు. అంతేకాకుండా, తమ సంతానాన్ని దేశ రక్షణ విధులకు పంపినందుకు గాను తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు కూడా పంపనున్నారు. దీంతో పటియాలాలోని 51వ బెటాలియన్ కమాండింగ్ అధికారితోపాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోహిత్ జిల్లాలో ఉన్న ఐటీబీపీ ‘ఎనిమల్ ట్రాన్స్పోర్ట్’విభాగం డీఐజీ సుధాకర్ నటరాజన్ జవాన్ల పుట్టిన రోజు వేడుకలు జరిపారు. -
వాచ్ వచ్చె
అందరికీ బర్త్‌డేకి అడ్వాన్స్ విషెస్ లభిస్తాయి. కానీ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కి అడ్వాన్స్ బర్త్‌డే గిఫ్ట్స్ లభిస్తున్నాయి. రణ్వీర్ బర్త్ డే ఈనెల 6న. వారం ముందే ఓ మంచి వాచ్ గిఫ్ట్‌గా బçహూకరించారట దర్శకుడు రోహిత్ శెట్టి. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లో రణ్వీర్ సింగ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్లో రణ్‌వీర్‌కు రోహిత్ శెట్టి వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారట. ‘‘బాస్ (రోహిత్ శెట్టి) ఓ వారం ముందే బర్త్‌డే ప్రజెంట్ ఇచ్చేశారు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే సూపర్ వాచ్. థ్యాంక్యూ సార్’’ అంటూ ఈ విషయాన్ని ట్వీటర్లో తెలిపారు రణ్వీర్ సింగ్. ‘సింబా’ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 28న రిలీజ్ కానుంది. -
బర్త్‌డే కానుక : పెట్రోల్‌పై రూ.5 తగ్గింపు
ముంబై : ఇటీవలి కాలంలో పెట్రో ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) వినియోగదారులకు కాసింత ఊరట కల్పించాలని భావించింది. గురువారం ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని.. వాహనదారులకు 4 నుంచి 5 రూపాయల మేర తగ్గింపుపై పెట్రోలు అందించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల్లో ద్విచక్ర వాహనదారులకు ఈ సదుపాయం కల్పించింది. మరికొన్ని చోట్ల 9 రూపాయల వరకు కూడా తగ్గింపు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల ముందు వందల మీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. ఈ రోజు మహారాష్ట్రలో పెట్రోల్ ధర 84.26 రూపాయలుగా ఉంది. ఈ తగ్గింపు వల్ల పెట్రోల్ బంక్ యాజమానులపై పడే భారాన్ని ఎంఎన్ఎస్ చెల్లించనుంది. దీనిపై ద్విచక్ర వాహనదారులు హర్షం చేస్తున్నారు. ఓ వాహనదారుడు మాట్లాడుతూ.. రాజ్ ఠాక్రేలాగే మోదీ కూడా పెట్రోలు ధరలు తగ్గిస్తారని ఆశిస్తున్నామన్నారు. తాను ట్యాంక్ ఫూల్ చేయించడం ఇదే తొలిసారి అని తెలిపారు. -
అనుష్క అందుకో నా బర్త్ డే కానుక : కోహ్లి
సాక్షి, హైదరాబాద్ : క్రికెటర్ విరాట్ కోహ్లి తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు బర్త్‌డే రోజున(సోమవారం) విలువైన బహుమతిని అందజేశారు. పెళ్లి తర్వాత ఇది అనుష్క తొలి బర్త్‌డే కావడంతో కోహ్లి ప్రత్యేక కానుక ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశారు. ఐపీఎల్ టైటిల్‌పై ఆశలు నిలుపుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) విజయాన్ని అందుకొంది. ఆర్సీబీ సారధి కోహ్లి ఈ ప్రత్యేక విజయాన్ని తన భార్యకు బర్త్‌డే గిఫ్ట్ అని తెలిపారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 5వ స్థానానికి చేరింది. నిన్న(మంగళవారం) ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉదయం భార్య అనుష్కకు ట్విటర్ ద్వారా విషెస్ తెలిపిన కోహ్లి, మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘నా భార్య అనుష్క ఇక్కడే ఉంది. ఈ రోజు తన బర్త్‌డే.. ఈ విజయం తనకో చిన్న కానుక. తను ఈ మ్యాచ్ విజయాన్ని ఆస్వాదించడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఈ విజయం చాలా ప్రత్యేకమైంది’ అని తెలిపారు. దీనిపై అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘ఈ ప్రత్యేకమైన బర్త్‌డేను అత్యంత దయ కలిగిన, తెలివైన, ప్రియమైన, ధైర్యవంతుడైన వ్యక్తితో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. Best birthday with the bestest, kindest, bravest man in the world . Love you for making it so special my love ❤ ! A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on May 1, 2018 at 12:09pm PDT -
బర్త్‌డే గిఫ్ట్‌గా ఫారెస్ట్
సాక్షి, ముంబయి: పిల్లల బర్త్‌డే అంటే తల్లితండ్రులెవరైనా వారికి ఆట వస్తువులో, బొమ్మలో గిఫ్ట్‌గా ఇస్తారు. బాలీవుడ్ స్టార్ కపుల్స్ కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ మాత్రం తమ చిన్నారి తైమూర్‌కు ఏకంగా పుట్టిన రోజు కానుకగా అడవిని గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఈనెల 20న తొలి బర్త్‌డే జరుపుకున్న చోటా నవాబ్ తైమూర్ ఇప్పుడు ఆ అడవికి యజమాని.కరీనాకు డైటీషియన్‌గా వ్యవహరిస్తున్న రిజుత దివేకర్ ఈ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పటౌటీ ప్యాలెస్‌లో తైమూర్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. తైమూర్ బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతూ హల్చల్ చేశాయి. -
ప్రభాస్‌కు అనుష్క సర్ప్రైజ్ గిఫ్ట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అతడికి హీరోయిన్ అనుష్క ప్రత్యేక బహుమతి ఇచ్చిందట. ఈరోజు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన స్నేహితుడిని సర్ప్రైజ్ చేసేందుకు స్పెషల్‌గా ప్లాన్ చేసిందట. ఒక డిజైనర్ వాచీని గిఫ్ట్‌గా పంపి అతడిని ఆశ్చర్యానికి గురిచేసిందని ‘బాలీవుడ్‌లైఫ్’ వెల్లడించింది. ప్రభాస్‌కు వాచీలంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్ చేతిగడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని తెలిపింది. పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇంతకుముందు వదంతులు వచ్చాయి. వీటిని ప్రభాస్ ఖండించారు. బహుబలి 2 తర్వాత ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ప్రభాస్.. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. మరోవైపు అనుష్క.. ‘భాగమతి’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. -
బర్త్ డే గిఫ్ట్.. బంగ్లా సొంతం చేసుకున్న హీరోయిన్!
బాలీవుడ్లో విలక్షణ నటిగా, ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె ఇటీవల 30వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తనకు తాను ఒక రాయల్ కానుక ఇచ్చుకుంది. ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలో ఒక విస్తారమైన మూడంతస్తుల భవంతిని ఆమె సొంతం చేసుకుంది. ఈ భవనంలో తన కార్యాలయం ఏర్పరుచుకోవాలని, ఇందులోనే తాను మొదటిసారిగా దర్శకత్వం వహించబోతున్న సినిమాను ప్రారంభించాలని కంగన భావిస్తున్నట్టు సమాచారం. 'ఇది చాలా విశాలమైన మూడంతస్తుల భవనం. తనకు విశాలమైన కార్యాలయం ఉండాలని, అందులోనే తన దర్శకత్వ సినిమాను ప్రారంభించాలని కంగన కలలు కనేది. ఈ ఏడాదే ఆమె తన దర్శకత్వంలో సినిమాను తెరకెక్కించబోతున్నది. త్వరలో నిర్మాతగా కూడా మారబోతున్నది' అని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ 'మిడ్ డే' పత్రిక పేర్కొన్నది. తాజాగా 'రంగూన్' సినిమాతో అలరించిన కంగన త్వరలో హన్సల్ మెహతా 'సిమ్రన్' చిత్రంతో పలుకరించబోతున్నది. ప్రముఖ తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రాణీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న 'మణికర్ణిక' చిత్రంలోనూ ఆమె నటించబోతున్నది. -
ఫ్యాన్స్‌కు సల్మాన్ బర్త్‌డే గిఫ్ట్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ శాంతాక్లాజ్‌గా మారిపోయారు. ఎవరైనా బర్త్‌డేకి బహుమతులు పుచ్చుకుంటారు. కానీ ఈ కండలవీరుడు తన 51వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. అయితే ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసా? సల్మాన్‌ఖాన్ సొంత దుస్తుల బ్రాండు 'బీయింగ్ హ్యుమన్' పై స్పెషల్ డిస్కౌంట్లు. బీయింగ్ హ్యుమన్ ఫ్లాట్‌పై 51 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా అభిమానులకు తన సర్ఫ్రైజ్ గిఫ్ట్‌ను రివీల్ చేశాడు. ప్రత్యేకంగా ఆన్లైన్ మింత్రాలో కూడా ఈ డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపాడు. 'గెట్ రెడీ ఫర్ బిగ్ బర్త్ డే సర్ఫ్రైజ్' అంటూ అభిమానులకు అంతకముందే సల్లూభాయ్ ట్వీట్ చేశాడు. ఈ సర్‌ఫ్రైజ్‌ను ట్విట్టర్ ద్వారా తెలిపేశాడు. సామాజిక సేవలో భాగంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన సల్లూభాయ్, దీన్ని సేవలను మరింత విస్తరించడానికి ఈ బ్రాండు పేరుతోనే జువెల్లరీ రంగంలోకి సల్మాన్ అడుగుపెడుతున్న్డు. బర్త్‌డే సందర్భంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్, స్టైయిల్ క్వాటియంట్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో బీయింగ్ హ్యుమన్ ఫ్యాషన్ జువెల్లరీని లాంచ్ చేస్తున్నాడు. Celebrate my birthday with Flat 51% Off at @bebeinghuman stores and exclusively online @Myntra https://t.co/3Uc5Wgncbf #2712 pic.twitter.com/mQsk7kU4Sr — Salman Khan (@BeingSalmanKhan) December 26, 2016 -
పుట్టిన రోజున అభిమానులకు త్రివిక్రమ్ కానుక
ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో ప్రముఖం వినిపించే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన మాటలతోనే సినిమాలకు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను అందించే త్రివిక్రమ్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సోమవారం (నవంబర్ 7) తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. త్రివిక్రమ్ అఫీషియల్‌గా నిర్వహిస్తున్న www.trivikramcelluloid.in తో పాటు ఫేస్బుక్ లోనూ ఆయన పంచ్ డైలాగ్‌లకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తన సినిమా విశేషాల కోసం ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులకు మరింత చేరువయ్యేందుకు నిర్ణయించుకున్నాడు త్రివిక్రమ్. అందుకోసం ఓ మొబైల్ యాప్‌ను తన పుట్టిన రోజు సందర్భంగా అందుబాటులోకి తేనున్నాడు. ఈ యాప్ ద్వారా తన సినిమాకు సంబందించిన విశేషాలను అభిమానులతో పంచుకోవాలని భావిస్తున్నాడు. ఈ యాప్ నవంబర్ 7వ తారీఖు నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి రానుంది. -
బర్త్‌డే గిఫ్ట్
అక్షరాల్లో అగ్నికణాలు నింపి తెలుగు రచనా ప్రపంచంలో చైతన్య శిఖరారోహణ చేసిన మహాకవి శ్రీశ్రీ. అలాంటి చైతన్యాన్ని రగిలించే పాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ కనిపిస్తారు. ఆయన ప్రధానపాత్రలో ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ నిర్మించిన ఈ చిత్రం కృష్ణ పుట్టినరోజు (మే 31) కానుకగా జూన్ 3న రిలీజవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం. మహాకవి శ్రీశ్రీగారు తన ఆవేశాన్ని రచనల్లో చూపిస్తే, మా చిత్రంలో శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. కృష్ణగారు సినిమా ఇండస్ట్రీకొచ్చి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దాం, వారి ఆశీస్సులు కావాలి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కృష్ణ తనయుడు, హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. విజయనిర్మల, సీనియర్ నరేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇ.ఎస్.మూర్తి, కెమెరా: సతీష్ ముత్యాల. -
ప్రధానికి సైనా ‘రాకెట్’
బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. గురువారం ప్రధాని నరేంద్ర మోదిని కలిసింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిపెట్టిన రాకెట్‌ను ఈ సందర్భంగా ఆమె ప్రధానికి బహుకరించింది. అలాగే నేడు 65వ పడిలోకి అడుగుపెడుతున్న మోదికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ‘ప్రధానిని కలిసినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఓ రోజు ముందుగానే బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపా. జన్మదిన కానుకగా రాకెట్‌ను బహుకరించా. మోది ప్రతి ఆటను క్రమం తప్పకుండా ఫాలో అవుతారని తెలిసి చాలా సంతోషపడ్డా. అలాగే నా మ్యాచ్‌ల గురించి చాలా చర్చించారు. చాలా ఆశ్చర్యమనిపించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు’ అని సమావేశం అనంతరం సైనా వ్యాఖ్యానించింది. ప్రధానిని కలిసిన వారిలో సైనా తండ్రి హర్వీర్ నెహ్వాల్, ఐఓఎస్ సీఈఓ నీరవ్ తోమర్లు ఉన్నారు. -
పవన్ బర్త్ డేకు ప్రత్యేక కానుక
చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 44వ బర్త్ డే సందర్భంగా ఆయనకు, అభిమానులకు ఓ కానుక అందించనున్నారు. పవన్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్‌ను ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు. 'పవన్ బర్త్ డే కానుకగా ఓ ప్రత్యేక టీజర్‌ను రూపొందించారు. ఆయన పుట్టిన రోజున విడుదల చేస్తారు' అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపినట్టు ఓ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయిందని, సెప్టెంబర్ 4 నుంచి జరిగే మరో షెడ్యూల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాల్గొంటారని తెలిపారు. పవన్ కల్యాణ్‌తో నటించేందుకు కాజల్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశముంది. -
అభయ్ రామ్ ఫోటోలు విడుదల చేసిన ఎన్టీఆర్
-
అందుకే ఆ బహుమతి!
శ్రుతీహాసన్‌కి ఇటీవల మంచి పుట్టినరోజు బహుమతి లభించింది. అది ఇచ్చింది వాళ్ల నాన్న కమలహాసనే. శ్రుతీ మంచి రచయిత్రి. నటనలో బిజీ అయిపోవడంతో ఆమెలోని రచయిత్రి మరుగునపడిపోయింది. దాంతో కమల్ మళ్లీ కూతురితో కలం పట్టించాలనుకున్నారు. అందుకే శ్రుతీకి ఊహించని బహుమతి ఇచ్చారాయన. దాని గురించి శ్రుతీహసన్ మాట్లాడుతూ -‘‘మా నాన్నగారు నాకిచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఓ స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్వేర్, రైటింగ్ కోర్స్. నా ప్రతిభ మీద ఆయనకు చాలా నమ్మకం. నా చిన్నప్పుడు నేను చిన్న చిన్న కథలు, కవితలు రాసేదాన్ని. ఇప్పుడు తీరిక చిక్కడంలేదు. నన్ను ఇన్స్పైర్ చేసి, మళ్లీ నాతో రచనలు చేయించడానికే నాన్నగారు ఆ బహుమతి ఇచ్చారు. నాక్కూడా రాయడం ఇష్టం. అందుకే వీలు చేసుకుని తొలుత లఘుచిత్రాలకు కథలు రాయాలనుకుంటున్నా’’ అన్నారు. -
ఆశ్చర్యపరిచిన బర్త్‌డే కానుక
ముంబై: బాలీవుడ్ అగ్రనటుడు షారుక్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఓ అద్భుతమైన కానుక వచ్చింది. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్లోని వీఎఫ్ఎక్స్ బృందం షారుక్ కోసం నిలువెత్తు త్రీడీ ప్రింటెడ్ మోడల్ తీసి ఇచ్చారు. 'కానుక చూసి ఉద్వేగానికి లోనయ్యాను. నా నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ బృందం త్రీడీ ప్రింట్‌ని నాకు బర్త్‌డే కానుక ఇచ్చింది. 49వ పడిలోకి అడుగుపెట్టాను. ఈ కానుకకు వాడిన టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశంలో ఇంతవరకు ఎక్కడా వాడలేదు. ఇప్పటివరకు చేసుకున్న పుట్టిన రోజు వేడుకల కంటే ఇది ప్రత్యేకమైనది. ప్రస్తుతం నేను యశ్ రాజ్ సంస్థ బ్యానర్లో 'ఫ్యాన్', 'రేస్' సినిమాల్లో నటిస్తున్నాను' అని షారుక్ చెప్పుకొచ్చారు. -
చెరకు రైతుకు తీపి కబురు...
* టన్ను చెరకుకు రూ.2,600 ఇచ్చేందుకు సీఎం సముఖత * సర్కార్ తరఫున రూ.340 రైతు ఖాతాల్లో జమ * డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడి * ఆనందంలో రైతన్నలు మెదక్: ధరాఘాతంతో విలవిల్లాడుతున్న చెరకు రైతుకు తీపి కబురు అందింది. చెరకుకు గిట్టుబాటు కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ను కలిసిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి బర్త్‌డే గిఫ్ట్ దొరికింది. టన్ను చెరకుకు రూ.2,600 చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ఈ మేరకు రెండు రోజుల్లో జీఓ వెలువడుతుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులకు ఈ సంవత్సరం ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.2,260 లు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే గత ఏడాది రూ.2600 చెల్లించిన యాజమాన్యం ఈసారి రూ.360లు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, చెరకు రైతు నాయకులతో సీఎంను కలిసి రైతుల బాధలు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రాష్ట్ర ప్రభుత్వం తరఫున టన్ను చెరకుకు రూ.340 రైతుల ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చినట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో జీఓ వెలువడుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఎన్డీఎస్ఎల్ పరిధిలోని చెరకు రైతులను చెరకు సాగు అవగాహన నిమిత్తం మహారాష్ట్ర పంపేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. మహారాష్ట్రలో చెరకు రైతులు ఎకరాకు 80 నుంచి 100 టన్నుల చెరకును పండిస్తున్నందున వారి వ్యవసాయ విధానాన్ని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్డీఎస్ఎల్ మంభోజిపల్లి పరిధిలో ఈ సంవత్సరం 1.20 లక్షల టన్నుల చెరుకు గానుగ ఆడనుంది. సీఎం తాజా హామీతో సుమారు 2,590 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. నాకిది బర్త్‌డే గిఫ్ట్ చెరకు రైతు కష్టాలు తీర్చాలని సీఎం కలిశాను. మంగళవారం నా జన్మదినం. చెరకు రైతుకు మేలు జరిగేలా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగానే నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ రైతుల కోసం ఎంతటి వ్యయ ప్రయాసలైనా భరిస్తుందని ఆ సంఘటనతో మరోసారి తేలిపోయింది. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని ఎన్డీఎస్ఎల్ పరిధిలో గల మూడు ఫ్యాక్టరీల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. -పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ -
సూపర్‌స్టార్‌కు సెంటినరీ అవార్డు
స్టయిల్ కింగ్ రజనీకాంత్‌కు మరో అరుదైన అవార్డు వరించనుంది. భారత ప్రభుత్వం ఈ దక్షిణాది సూపర్‌స్టార్‌కు సెంటినరీ (ఈఏడాది ప్రముఖ సినీ కళాకారుడు) అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా శత వసంతాల వేడుక జరుపుకున్న సందర్భంగా రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక అవార్డు వరించడం విశేషం. రజనీకి బర్త్‌డే గిఫ్ట్ దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఈ సెంటినరీ అవార్డు ఆయన పుట్టిన రోజు కానుకగా పేర్కొనవచ్చు. అయితే ఇలాంటి అవార్డులు రజనీకాంత్‌కు కొత్తే మీ కాదు. డిసెంబర్ 12న 64వ వసంతంలోకి అడిగిడుతున్న రజనీ నటుడిగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ 40 ఏళ్లలో ఆయనకు ఎన్నో అవార్డులు, బిరుదులు అలంకారమయ్యూయి. తమిళ ప్రభుత్వం అవార్డులతో పాటు ఫిలింఫేర్, కలైమామణి, ఇతర మీడియా అవార్డులెన్నో రజనీకాంత్‌కు వరించాయి. 2000 లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్‌కపూర్ అవార్డుతో సత్కరించింది. తన పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ అభిమానులకు లింగా చిత్రాన్ని కానుకగా అందించడానికి సిద్ధం అవుతుంటే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈసెంటినరీ అవార్డును అందించనుండడం విశేషం. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఈ నెల 20 నుంచి 30 వరకు గోవా లో జరగనున్నాయి. 75 దేశాలు పాల్గొనే ఈ చిత్రోత్సవాల్లో 68 దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. వాటిలో ఏడు చిత్రాలు ఆసియాకు చెందినవి కావడం విశేషం. ప్రఖ్యా త బాలీవుడ్ నటుడు అమితాబ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ వేడుకలో ప్రత్యేక అతిథిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ వేదికపై అలంకారం కానున్నారు. ఈ చిత్రోత్సవాల్లో తొలి రోజున రజనీకాంత్‌కు సెంటినరీ అవార్డుతో గౌరవించనున్నట్లు కేంద్ర సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రతిభకు మా త్రమే బీజేపీ ప్రభుత్వం పట్టం కడుతుందని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. నివాళులు: కేంద్రమంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది దివంగతులైన ప్రఖ్యాత కళాకారులు హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటన్ బరో, రాబి విలియమ్స్, భారతీయ ప్రముఖులు జోరో సేకల్, సుచిత్రా సేన్, అక్కినేని నాగేశ్వరరావు, సదాశివ్ అమ్రి పుర్కర్, ఫరూక్ షేక్ తదితరులకు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. అభినందనల వెల్లువ రజనీకాంత్‌ను సెంటినరీ అవార్డు వరించడంతో చిత్ర పరిశ్రమ నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు భారతీయ జనతాపార్టీనేత తమిళిసై సౌందర్ రాజన్ ఆయనకు అభినందనలు తెలుపుతూ, ఒక ప్రకటన విడుదల చేశారు. రజనీకాంత్ మరిన్ని అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తూ అందులో పేర్కొన్నారు. -
పవన్ పుట్టినరోజు కానుకగా...!
‘బద్రి’, ‘జానీ’ చిత్రాలతో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రేణుదేశాయ్ ఆ మధ్య నిర్మాతగా మారారు. మరాఠీలో ‘మంగలాష్టక్ వన్స్‌మోర్’ అనే సినిమా తీసి విజయం సాధించారు. ఆ ఆనందంతో మెగాఫోన్ చేతబట్టారు. మురాఠీలోనే ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆమె తెలుగులో అనువదించి విడుదల చేయాలనుకుంటున్నారు. తన మాజీ భర్త పవన్ కల్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న మరాఠీ వెర్షన్ ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నారు. ఇది తన జీవితానికి కీలకమైన వేడుక కాబట్టి, పవన్ పుట్టినరోజున విడుదల చేస్తున్నానని పేర్కొన్నారు. తన కుమార్తె ఆద్య పేరుతో ‘శ్రీ ఆద్య ఫిలింస్’ పతాకంపై తన కుమారుడు అఖీరానందన్ నిర్మాతగా రేణు ఈ చిత్రం చేస్తున్నారు. -
పెదనాన్నకు ఫస్ట్ లుక్ గిప్ట్ ఇచ్చిన వరుణ్
-
బర్త్ డే గిఫ్ట్‌గా హెలికాప్టర్
లండన్: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 తన మనువడు ప్రిన్స్ విలియమ్ పుట్టిన రోజు కానుకగా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారు. ఎలిజబెత్ దాదాపు 80 కోట్ల రూపాయిల విలువైన హెలికెప్టర్ను విలియమ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నారు. విలియమ్ ఆదివారం 33వ ఏట అడుగుపెట్టనున్నారు. అన్నట్టు విలియమ్ ఆర్ఏఎఫ్ హెలికెప్టర్ ఫైలట్. ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ మిడిల్టన్ దంపతులకు ఆగస్టా ఎ 109 ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. అధికారిక కార్యక్రమాలకు దీన్ని ఉపయోగిస్తుంటారు. కాగా విలియమ్ ఆగస్టాను నడపగలరా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. -
అద్భుతం... అమోఘం...
కొన్ని పాత్రలకు ఫలానా తారలే బాగుంటారని ఫిక్స్ అయిపోతాం. అలా ‘అరుంధతి’లో జేజమ్మ పాత్ర చూసినప్పుడు అనుష్క తప్ప ఎవరూ సూట్ కారని చాలామంది అన్నారు. అలాగే ‘వేదం’లో అమలాపురం సరోజ పాత్రకు అనుష్కే యాప్ట్ అన్నారు. తాజాగా ‘రుద్రమదేవి’ లుక్ చూసిన తర్వాత, ఈ ధీరవనిత పాత్రకు వంద శాతం అనుష్కే కరెక్ట్ అనే మాట చాలామంది నోట వినిపిస్తోంది. గుణా టీమ్ వర్క్స్ పతాకంపై కాకతీయ వీరనారి రాణీ రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. గుణశేఖర్ దర్శకత్వంలో శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో రూపొందుతున్న తొలి భారతీయ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రం ఇది.నేడు అనుష్క పుట్టినరోజుని పురస్కరించుకుని, ‘రుద్రమదేవి’గా ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘గత ఏడాది అనుష్క పుట్టినరోజు నాడు ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాం. అయితే, అంతకుముందు ఏప్రిల్ నుంచి ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కసాములో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారామె. అద్భుతంగా... అమోఘంగా ఇందులో అనుష్క కనిపిస్తారు. పోరాట సన్నివేశాలను ఆమె అద్భుతంగా చేస్తున్నారు. హీరోలకే సవాల్ అనిపించే కఠినతరమైన ఫీట్స్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నారు అనుష్క. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్‌తో 50 శాతం సినిమా పూర్తయ్యింది. ఆరు పాటల్లో ఐదు పాటల చిత్రీకరణ పూర్తి చేశాం. వచ్చే మార్చికి షూటింగ్ పూర్తవుతుంది. ఈ 16న తాజా షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. రానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను నిత్యామీనన్, మరో పాత్రను కేథరిన్ చేస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, సుమన్ తదితరులు పోషిస్తు న్నారు.