పుట్టిన రోజు గిఫ్ట్‌గా పొలం రాసివ్వాలని రైతుపై ఒత్తిడి
ఇవ్వనని అన్నందుకు ఆ రైతుపైనే దాడి
తిరిగి బాధితుడిపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
కోర్టును ఆశ్రయించిన బాధితుడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్రరావు అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఓ రైతును బెదిరించడమేకాకుండా, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు కూడా గళ్లా రామచంద్రరావుకే మద్దతు పలుకుతుండటంతో బాధితుడు జిల్లా కోర్టును ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడు గ్రామానికి చెందిన కమ్మ వెంకటరావు గుంటూరు విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి పిడుగురాళ్లలో సుమారు 8 ఎకరాల పొలం ఉంది. గళ్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర రియల్ ఎస్టేట్‌కు గతంలో వెంకటరావు ఎకరం రూ. 48 లక్షలు చొప్పున 4.90 ఎకరాలు అమ్మాడు. దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ నాలుగున అగ్రిమెంట్ చేసుకుని మూడు చెక్కులు రామచంద్రరావు ఇచ్చాడు.
ఆ చెక్కుల్లో రెండు బౌన్స్ అయ్యాయి. ఇది కాకుండా తాను అమ్మకుండా ఉన్న మిగిలిన భూమిలో భ్రమర వారు మట్టి తోలుతున్నారని తెలిసి వెంకటరావు వెళ్లి అడిగితే.. కాళ్లు విరగ్గొడతానని రామచంద్రరావు బెదిరించాడు. దీంతో వెంకటరావు గురజాల కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తాము అగ్రిమెంట్ చేయించుకున్న 4.90 ఎకరాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజి్రస్టేషన్ కోసం భమ్రర వారు ప్రయతి్నంచగా.. 1బీ అడంగల్‌లో 3.90 ఎకరాలు మాత్రమే కనపడుతుండటంతో అంతవరకే రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి వెంకటరావుకు డబ్బులు చెల్లించి బౌన్స్ అయిన చెక్కులు వెనక్కి తీసేసుకున్నారు.
ఎన్నికలు అవ్వగానే వేధింపులు
ఎన్నికలు ముగిసి రామచంద్రరావు భార్య మాధవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వెంకటరావుకు వేధింపులు మొదలయ్యాయి. రిజి్రస్టేషన్ చేయకుండా మిగిలిన ఎకరాతో పాటు వెంకటరావు అమ్మకుండా ఉన్న 3 ఎకరాల 7 సెంట్ల భూమి రూ. 30 లక్షలు ఇస్తామని, రామచంద్రరావుకు పుట్టిన రోజు గిఫ్టుగా ఆ భూమి అంతా రిజి్రస్టేషన్ చేయాలంటూ రామచంద్రరావు అనుచరులు ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపుతాం అంటూ బెదిరించారు. ఈ క్రమంలో గడిచిన శనివారం వెంకటరావు, అతని కుమారుడు హరికృష్ణ బయటకు వచ్చి తిరిగి వెళ్తుంటే వారి బండిని ఢీకొట్టి దాడి చేశారు.
కొద్దిసేపటి తర్వాత పట్టాభిపురం పోలీసులు వెంకటరావు, అతని కుమారుడికి వేరేవారితో ఫోన్ చేయించి మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యిందని, ఎమ్మెల్యే కాళ్ల మీద పడి మాట్లాడుకోండి అని చెప్పించారు. దీంతో పోలీసుల వద్దకు వెళ్తే తమకు న్యాయం దక్కదని భావించిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. గుంటూరుకు రామచంద్రరావే సీఎం లాంటివాడని, అతనిని కాదంటే బతకలేరంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఇటీవలే ఇంటికి వచి్చన తనపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారని, తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే రామచంద్రరావే బాధ్యత వహించాలని హరికృష్ణ ఆవేదన వెలిబుచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment