land mafia
-
హైదరాబాద్‌లో భూదందా.. 100 గజాల స్థలం రూ. 40 వేలే
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్‌లో ఘరనా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.10వేలకే వంద గజాలంటూ ఇద్దరు వ్యక్తులు వందల మందిని నమ్మించారు. వందల కోట్లు సంపాదించారు. అపై నట్టేటా ముంచేశారు. వనస్థలీపురం పీఎస్ పరిధిలోని హరిణి వనస్థలీ నేషనల్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అటవీ,పోలీస్ శాఖ ఆధీనంలో ఆటోనగర్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. అయితే, మన్సూరాబాద్ సర్వే నెంబర్ ఏడులో ఉన్న 682 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తన తల్లిపేరు మీద ఉందని చెప్పి 50వేల మందికి నోటరీ చేశారు యూసఫ్ ఖాన్ అనే వ్యక్తి. అతని భార్య తులసమ్మలు. ఈ రోజు నోటరీ చేసిన బాధితులకు ప్లాట్లు ఇస్తానని చెప్పడంతో భారీ సంఖ్యలో బాధితులు చేరుకున్నారు. బాధితుల రాకతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 500 మందికి పైగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే బాధితుల్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు ముఠాగా ఏర్పడి 587 ఎకరాల ఫారెస్ట్ భూమిని ప్లాట్లుగా చేసి అమ్మారు. 100 గజాలు రూ. 40-50వేల రూపాయలకే ముఠా అమ్మగా.. ఆ భూమిని సుమారు 50 వేల మంది కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. భూదందాను అడ్వకేట్ షేక్ జిలానీ ద్వారా యూసఫ్ ఖాన్ ,తులసమ్మలు తతంగం నడిపించారు. అయితే, ఇవాళ కొన్నవాళ్లకు ఫ్లాట్స్ ఇస్తానని చెప్పి సర్వే నెంబర్ 7 దగ్గరకు రావాలని అడ్వకేట్ జిలానీ కొనుగోలు దారుల్ని నమ్మించారు. ల్యాండ్ మాఫియా మోసంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఫారెస్ట్ భూమి చుట్టూ మోహరించారు.ప్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు సర్వే నెంబర్ ఏడు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించడంతో అనుమానం వ్యక్తం చేసిన కొనుగోలు దారులు అసలు విషయం తెలిసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఇసుక.. మందు.. బాబు బ్యాచ్ విందు!
వైఎస్సార్సీపీ అధినేత జగన్ 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో ఇసుక, మద్యం వంటి వాటిల్లో జరుగుతున్న విచ్చలవిడి దోపిడీని గుర్తించడమే కాకుండా.. దాన్ని సరిదిద్దేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఆయా సందర్భాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ దిద్దుబాటు యత్నాలను తీవ్రంగా వ్యతిరేకించడం అందరూ గమనించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అంశాలపై విధానపరమైన సంస్కరణలు తేవడానికి కేవలం రెండు మూడు నెలలే పట్టినా.. పచ్చపార్టీలు మాత్రం ఈలోపే నానా రచ్చా చేసేందుకు ప్రయత్నించాయి. ఇసుక కొరత ఏర్పడిందని, రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటూ చంద్రబాబు, పవన్‌లు వీధికెక్కారు. తప్పుడు ప్రచారం చేశారు.అంతకుముందు 014-2019 మధ్యకాలంలో మాత్రం అధికారంలో ఉన్న టీడీపీ ఇసుక ఉచితం అంటూనే అయినకాడికి దోచుకున్నారు. సొంతజేబులు నింపుకున్నారు. ఈ దోపిడీలన్నింటికీ జగన్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. పక్కా ప్రణాళికతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇసుక నిల్వకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా నిర్దిష్ట రేట్లు నిర్ణయించారు. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకూ చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో ఈ అంశంపై అక్కసంతా వెళ్లబోసుకున్నారు.విశాఖలో ఒక ప్రదర్శన జరిపి ఇసుక కొరతవల్ల భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారని దుష్ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన ఆరోపణలకు అండగా ఎల్లో మీడియా పలు దొంగ కథనాలను కూడా వండి వార్చింది. ఉదాహరణకు పొన్నూరు వద్ద ఒక వ్యక్తి ఇతర కారణాలతో చనిపోతే ఇసుక కొరత వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటూ అసత్య కథనం రాసింది. ఆ తర్వాత 2024 ఎన్నికల వరకూ టీడీపీ, జనసేన పార్టీలు అదే తరహా ప్రచారం చేయడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే మొత్తం ఇసుకంతా ఫ్రీ, ఫ్రీ అని ప్రచారం చేశారు.ఎలాగైతేనేం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నుంచి ఒకరు మంత్రి అయ్యారు. అప్పటి నుంచీ జనానికి అసలు సినిమా చూపించడం ఆరంభించారు. చంద్రబాబు ఉచిత ఇసుక ఇస్తున్నామని పైకి చెబుతుంటారు కానీ రాష్ట్రంలో ఎక్కడా ఉచితంగా దొరకదు. జగన్ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఇష్టారీతిన ధరలు కట్టి 40 లక్షల టన్నుల అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. పోనీ మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకైనా జనానికి ఉచితంగా అందిందా అంటే అదీ లేదు. దీంతో ప్రజలు అధిక ధరలు చెల్లించక తప్పలేదు.ప్రస్తుతమైతే అసలు ఇసుక దొరకడమే గగనమైంది. జగన్ పాలనలో ఆ ప్రాంతాన్ని బట్టి ఇసుక టన్నుకు రూ.300 నుంచి రూ.500లకు దొరికేది. ట్రాక్టర్ ఇసుక రూ.నాలుగు నుంచి రూ.ఐదు వేలకు లభించేది. ఇప్పుడు అదే ఇసుక రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. నదులు, వాగుల దగ్గర నుంచి కొంతమంది అక్రమంగా తవ్వి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత రావడంతో ఒడిషా నుంచి విశాఖ ప్రాంతానికి అక్రమ రవాణా చేసి దండుకున్నారు.ఇసుక లారీ (18 టన్నులు)కి రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు ధర పలుకుతోంది. దీంతో కొన్నాళ్లుగా భవన నిర్మాణాలు తగ్గిపోయాయి. ఈ రంగంపై దాదాపు 45 లక్షల మంది ఆధారపడి ఉండటం గమనార్హం. తాపీ పని, రాడ్ బెండింగ్, ప్లంబింగ్..ఇలా 36 రకాల వృత్తుల వారు భవన నిర్మాణ రంగంలో ఉంటారు. ఇసుక లేకపోవడంతో మొత్తానికే ఎసరు వచ్చినట్టయింది. పనుల కోసం అడ్డాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇసుకను ఆన్ లైన్లో నేరుగా బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా అది ఎప్పుడు ఓపన్ అవుతుందో, ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియడం లేదని అంటున్నారు. పోనీ బుక్ చేసుకోగలిగిన వారికైనా ఇసుక ఉచితంగా వస్తుందా అంటే అదీ జరగడం లేదు.విజయవాడలో బ్లాక్‌లో 18 టన్నుల ఇసుక రూ.30 వేలు పలుకుతోందట. భీమవరంలో రూ.35 వేలు, తాడేపల్లి గూడెంలో రూ.35 వేలు, నరసాపురంలో రూ.26 వేల చొప్పున లారీ ఇసుకకు చెల్లించాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు లారీకి రూ.10 వేలకు పైగా అదనపు భారం పడుతోందని అంచనా. గతంలో భవన నిర్మాణ కార్మికులకోసం అంటూ గొంతు చించుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు విప్పడం లేదు. సాక్షి మీడియాలో 18 టన్నుల ఇసుక ధర అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏ రకంగా ఉందీ తెలిపారు. అందులో అరకులోయ, పాడేరు వంటి చోట్ల అత్యధికంగా రూ. 54 వేలు ఉంటే, గుంటూరు రూ. 30 వేలు పలుకుతోందట.ఈ పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం చక్కదిద్దలేకపోతున్నదంటూ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు సైతం వాపోతున్నారు. ఇక టీడీపీ పత్రిక ఆంధ్రజ్యోతి ఉచిత ఇసుక, ధరల మరక అంటూ కథనాన్ని ఇచ్చింది. ఇందులో కూడా పూర్తిగా నిజాలు రాయకుండా చంద్రబాబు భజన చేస్తూనే కొన్ని సమస్యలను ప్రస్తావించింది. ఉచిత ఇసుక ఉద్దేశం ఉత్తమమట. ఆచరణలో బాలారిష్టాలు ఎదురవుతున్నాయని ఆంధ్రజ్యోతి సన్నాయినొక్కులు నొక్కింది.ఐతే జిల్లా ఎడిషన్లలో మాత్రం కొద్దిపాటి వాస్తవాలు రాస్తున్నారు. ఉదాహరణకు భీమవరంలో లారీ ఇసుక రూ.30 వేల ధర పలుకుతోందని తెలిపారు. జగన్ టైమ్ లో రూ.18 వేలకే ఇసుక దొరికిందని అంగీకరించారు. సచివాలయాల్లో చలాన్లు తీసుకొని ఇసుక రవాణా చేసుకోవాలనే ప్రభుత్వం షరతు పెట్టినా దళారులు చలానాలు ముందే కట్టేసుకొని అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఇసుక లారీల డ్రైవర్ల బాధలైతే ఇన్నీ అన్నీ కావు. రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతూ వారు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.ఐతే ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ లో మాత్రం జగన్ పాలనలో జనం చుక్కలు చూశారంటూ అబద్ధాలు రాయడానికి ఆంధ్రజ్యోతి సిగ్గుపడలేదు. విశేషమేమిటంటే అప్పట్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చిన గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని స్కామ్ చేశారంటూ టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగు వేల కోట్లకుపైగా ఆదాయం తెస్తే అది దోపిడీ అట. ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు అడ్డంగా దోచేస్తే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక హామీ నిలబెట్టుకున్నారట. ఇలాంటి తప్పుడు రాతలతో జనాన్ని మోసం చేసే యత్నం చేస్తూనే ఆశించిన స్థాయిలో ప్రజలకు ఊరట కలగలేదని కొన్ని చోట్ల గతంకంటే ఇప్పుడే భారంగా మారిందని ఒప్పుకోక తప్పలేదు. ఉచితానికి నిర్వహణ చార్జీల గండం అని రాశారేగానీ, కూటమి నేతల దోపిడీని మాత్రం కప్పిపుచ్చారు. జీఎస్టీ వేయడంపైన జనం ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇసుక కోసమే ఇన్నిపాట్లు పడాల్సి వస్తుంటే ఇక మిగిలిన రంగాల సంగతి చెప్పనక్కరలేదు. మొత్తంమీద చంద్రబాబు ప్రభుత్వం ప్రజలమీద ఇసుకాసురులను ఫ్రీగా వదిలేసింది.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అరాచకాలు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్రరావు అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఓ రైతును బెదిరించడమేకాకుండా, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు కూడా గళ్లా రామచంద్రరావుకే మద్దతు పలుకుతుండటంతో బాధితుడు జిల్లా కోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడు గ్రామానికి చెందిన కమ్మ వెంకటరావు గుంటూరు విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి పిడుగురాళ్లలో సుమారు 8 ఎకరాల పొలం ఉంది. గళ్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర రియల్ ఎస్టేట్‌కు గతంలో వెంకటరావు ఎకరం రూ. 48 లక్షలు చొప్పున 4.90 ఎకరాలు అమ్మాడు. దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ నాలుగున అగ్రిమెంట్ చేసుకుని మూడు చెక్కులు రామచంద్రరావు ఇచ్చాడు. ఆ చెక్కుల్లో రెండు బౌన్స్ అయ్యాయి. ఇది కాకుండా తాను అమ్మకుండా ఉన్న మిగిలిన భూమిలో భ్రమర వారు మట్టి తోలుతున్నారని తెలిసి వెంకటరావు వెళ్లి అడిగితే.. కాళ్లు విరగ్గొడతానని రామచంద్రరావు బెదిరించాడు. దీంతో వెంకటరావు గురజాల కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తాము అగ్రిమెంట్ చేయించుకున్న 4.90 ఎకరాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజి్రస్టేషన్ కోసం భమ్రర వారు ప్రయతి్నంచగా.. 1బీ అడంగల్‌లో 3.90 ఎకరాలు మాత్రమే కనపడుతుండటంతో అంతవరకే రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి వెంకటరావుకు డబ్బులు చెల్లించి బౌన్స్ అయిన చెక్కులు వెనక్కి తీసేసుకున్నారు. ఎన్నికలు అవ్వగానే వేధింపులు ఎన్నికలు ముగిసి రామచంద్రరావు భార్య మాధవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వెంకటరావుకు వేధింపులు మొదలయ్యాయి. రిజి్రస్టేషన్ చేయకుండా మిగిలిన ఎకరాతో పాటు వెంకటరావు అమ్మకుండా ఉన్న 3 ఎకరాల 7 సెంట్ల భూమి రూ. 30 లక్షలు ఇస్తామని, రామచంద్రరావుకు పుట్టిన రోజు గిఫ్టుగా ఆ భూమి అంతా రిజి్రస్టేషన్ చేయాలంటూ రామచంద్రరావు అనుచరులు ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపుతాం అంటూ బెదిరించారు. ఈ క్రమంలో గడిచిన శనివారం వెంకటరావు, అతని కుమారుడు హరికృష్ణ బయటకు వచ్చి తిరిగి వెళ్తుంటే వారి బండిని ఢీకొట్టి దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత పట్టాభిపురం పోలీసులు వెంకటరావు, అతని కుమారుడికి వేరేవారితో ఫోన్ చేయించి మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యిందని, ఎమ్మెల్యే కాళ్ల మీద పడి మాట్లాడుకోండి అని చెప్పించారు. దీంతో పోలీసుల వద్దకు వెళ్తే తమకు న్యాయం దక్కదని భావించిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. గుంటూరుకు రామచంద్రరావే సీఎం లాంటివాడని, అతనిని కాదంటే బతకలేరంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఇటీవలే ఇంటికి వచి్చన తనపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారని, తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే రామచంద్రరావే బాధ్యత వహించాలని హరికృష్ణ ఆవేదన వెలిబుచ్చాడు. -
రూ.250 కోట్ల మఠం భూమి హాంఫట్.. కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గ్యాంగ్ అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోంది. అధికారమే అండగా రూ.250 కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని అమాంతం మింగేసింది. నాని అనుచరులు.. అభ్యంతరం చెప్పిన దేవదాయశాఖ సిబ్బంది బట్టలు విప్పి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు.. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నానాబూతులు తిట్టి నిర్బంధించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నా ‘డోంట్ కేర్’ అంటూ వారి ఎదుటే.. దేవుడి మాన్యానికి దర్జాగా ప్రహరీ నిర్మించారు. నానీస్ గ్యాంగ్ అక్రమాలపై ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనం తిరుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనూ, దేవదాయ, రెవెన్యూ శాఖ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. అప్పనంగా కొట్టేసి.. సొమ్ము చేసుకోవడమే లక్ష్యం.. తిరుపతి రూరల్ మండలం అవిలాల లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 145, 147/1లో సుమారు 10 ఎకరాల విలువైన దేవుడి మాన్యం భూమిని నాని గ్యాంగ్ ఆక్రమించుకుంది. ఇక్కడ అంకణం కనీసం రూ.4 లక్షల వరకూ ఉంది. మొత్తం10 ఎకరాలు బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లు పలుకుతోంది. నాని గ్యాంగ్ దీన్ని అప్పనంగా కొట్టేసి, అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.250 కోట్లకు స్కెచ్ వేశారంటే అధికార పారీ్టలోని ఎవరో ‘ముఖ్య’నేత ప్రమేయం ఉండకుండా ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాకు మూడు.. మీకు ఏడు హథీరాంజీ మఠానికి చెందిన భూమిని స్వాదీనం చేసుకోవడానికి చూస్తున్న ముగ్గురు వ్యక్తులతో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి మఠం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. తనకు మూడెకరాలు కేటాయించాలని.. మీరు ఏడెకరాలు తీసుకోవాలని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. అంతటితో ఆగని నాని ఆ తర్వాత ఆ ఏడెకరాలను కూడా తానే కొనుగోలు చేసుకుంటానని చెప్పడంతో ఆ ముగ్గురు షాక్ అయ్యారు. ‘ఆ ఏడెకరాలకు రూ.25 కోట్లు ఇస్తా.. ఆ నగదును ముగ్గురు పంచుకోండి. దీంట్లో అమరావతి పెద్దలకు కూడా వాటా ఉంది’ అని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక ఆ ముగ్గురూ తెల్లముఖం వేశారని సమాచారం. పనులు ప్రారంభం ఆ పదెకరాలు చుట్టూ జూన్ 9న ఉదయం 7 గంటలకు ప్రహరీ గోడ వేయడానికి నానీస్ గ్యాంగ్ పనులు ప్రారంభించింది. ఈ సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అధికారులు, మఠం సిబ్బంది అందరూ కలిసి జూన్ 10న ఆ స్థలం వద్దకెళ్లి ప్రహరీ నిర్మించడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ 100 మందికిపైగా నాని గూండాలు కాపుకాస్తున్నారు. ‘మేమెవరో తెలియదా?, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? మూసుకుని వెళ్లండి’ అంటూ బెదిరింపులకు దిగారు. అయితే మఠం అధికారులు పనులు ఆపాల్సిందేనంటూ గట్టిగా వాదించారు. దీంతో కోపోద్రిక్తులయిన టీడీపీ గూండాలు మఠం సిబ్బందిని తాత్కాలికంగా నిర్మించుకున్న గదిలోకి తీసుకెళ్లి బట్టలు ఊడదీయించారు. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ప్రాణ భయంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు కాళ్లా వేళ్లా పడి బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి మఠం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మఠం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చంద్రగిరి డీఎస్పీ జూన్ 11న నాని గ్యాంగ్‌ను, దేవదాయ శాఖ అధికారులను అక్కడకు పిలిపించుకున్నారు. పోలీస్ స్టేషన్లో సైతం గ్యాంగ్ ఓ దశలో అధికారులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో దేవదాయ అధికారులకు ‘నాని గ్యాంగ్’ వారి్నంగ్ ఇచి్చనట్లు తెలుస్తోంది. ఎక్కడా ఈ అంశంపై నోరు మెదపవద్దని మండిపడినట్లు సమాచారం. తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి లేదని హుకుం జారీచేసినట్లు తెలుస్తోంది. ఆందోళనకు ప్రజా సంఘాలు సిద్ధం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఒక ఆర్యవైశ్య వ్యాపారి రూ.రెండు కోట్లు ఇవ్వనందుకు ఇటీవల రైస్‌మిల్లు మూయించారు. అదే క్రమంలో టీటీడీ కాంట్రాక్టర్ నుంచి రెండెకరాలు రాయించుకున్నారు. ఇప్పుడు రూ.250 కోట్ల విలువైన పదెకరాల మఠం భూమిని ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.ఆ భూమి హథీరాంజీ మఠందే.. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన భూమి హథీరాంజీ మఠానిదే. మఠానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకునేందుకు వెళ్లిన మఠం సిబ్బందిని వంద మంది గూండాలతో రూమ్‌లో బంధించి, బట్టలూడదీసి.. నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరించారు. ఈ మేరకు తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఈ భూకబ్జాలో ల్యాండ్ మాఫియా పాత్ర ఉంది. – రమేష్ నాయుడు, హథీరాంజీ మఠం పరిపాలనాధికారి భూములను సంరక్షించాలి.. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న హథీరాంజీ మఠం, పరకాల మఠం, దేవదాయ భూములను ప్రభుత్వం సంరక్షించాలి. తిరుపతి నగర నడిబొడ్డున 10 ఎకరాల భూమిని గత నెల నుంచి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి అడ్డుకున్న మఠం అధికారులను బట్టలూడదీయించి.. నానా బూతులు తిడుతూ భయకంపితులను చేశారు. ఈ భూముల కబ్జాను తక్షణం ఆపాలని సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నా. – కందారపు మురళి, సీపీఎం నేత -
రాజధానిని మింగేసిన బాబు భూదందా
సినిమా క్లైమాక్స్‌లో విలన్ తన ఆచూకీని హీరోకు చెప్పే ముందు ముప్పుతిప్పలు పెడుతుంటాడు.. ఇక్కడున్నాను.. అబ్బే.. మరోచోట ఉన్నానంటూ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు.. చంద్రబాబు తీరు కూడా అచ్చం ఇలానే ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు ఈ పెద్దమనిషి కూడా రాష్ట్ర ప్రజానీకంతో ఓ ఆట ఆడుకున్నాడు. ఈ ఆటలో ఎక్కువగా నష్టపోయింది బాబు మాయాజాలం తెలియని సామాన్య రియల్టర్లు, ప్రజలే. అదిగో అక్కడే రాజధాని.. అరెరె కాదు కాదు.. దొనకొండ.. అబ్బే అక్కడా కాదు.. నూజివీడు..తూచ్.. అక్కడొద్దన్నారు.. ఏలూరు సమీపంలో పెడుతున్నాం..లేదు నాగార్జున యూనివర్సిటీ వద్ద అయితే మేలు.. అక్కడే ఫిక్స్.. ఇలా తన ఎల్లో మీడియాకు రోజుకో లీకు ఇచ్చి కథనాలు రాయించారు.. చివరికి లోపాయికారీగా తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బ్రోచర్ సిద్ధం చేసుకుని.. మన రాజధాని ‘అమరావతి’ అంటూ బాంబు పేల్చారు.. బాబు అండ్ గ్యాంగ్, ఆయన వంది మాగధులంతా సూపర్.. డూపర్.. అంటూ కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేయసాగారు.. ఇదంతా బాబు అండ్ కోకు మాత్రమే వినోదం. రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందో వారికి ముందే తెలుసు కనుక, వారు ముందస్తుగా అమరావతి చుట్టుపక్కల భూములను కొనేశారు. అదీ రూ.2 లక్షల కోట్ల విలువైన భూములపై పచ్చదండు భూ దండయాత్ర చేసింది. చంద్రబాబు కుట్రలు గ్రహించలేని రియల్టర్లు దారుణంగా మోసపోయి, కోట్లకు కోట్లు నష్టపోయారు. కొందరి జీవితాలు విషాదాంతంగా మిగిలాయి. బాబు అండ్ కో మాత్రం తమ పాచిక పారినందుకు.. రూ.లక్షల కోట్ల భూములను చౌకగా కొట్టేయగలిగినందుకు పగలబడి నవ్వుకుంటూ డబ్బులు లెక్కబెట్టుకునే పనిలో బిజీ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని రకాలుగా భూ దోపిడీకి పాల్పడవచ్చో ప్రపంచానికి చాటారు. శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీ సూచనలను బుట్టదాఖలు చేశారు. స్విస్ చాలెంజింగ్ విధానం అంటూ ఊడ్చేశారు. సినిమా సెట్టింగుల్లో పేరుగాంచిన దర్శకుడు రాజమౌళిని రప్పించి ఇదిగిదిగో రాజధాని అంటూ గ్రాఫిక్స్‌తో మాయ చేశారు. మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివ ప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. రాజధాని విషయంలో నాడు బాబు అండ్ గ్యాంగ్ ఎంత అరాచకంగా, దుర్మార్గంగా, అశాస్త్రీయంగా వ్యవహరించిందో గుర్తు చేస్తూ ఆ బాగోతాలను రేపటి నుంచి ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
సోరెన్‌కు ఈడీ మళ్లీ సమన్లు
రాంచీ: భూ మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. వచ్చే వారంలో 29 లేదా 31వ తేదీల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు విచారణకు రావాలంటూ అందులో కోరింది. తేదీని ఖరారు చేయాలని అందులో స్పష్టం చేసింది. అంతకుముందు, ఈడీ అధికారులు ఈ నెల 27 లేదా 31వ తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు రావాల్సి ఉందంటూ సీఎం సోరెన్‌ను కోరగా ఆయన స్పదించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆయనకు సమన్లు ఇచ్చారు. -
చట్టమై వచ్చిన స్వప్నం
అడుగడుగునా భూ వివాదాలు.. పేట్రేగిపోతున్న భూ మాఫియా.. అస్తవ్యస్తమైన భూ రికార్డుల వ్యవస్థ.. సివిల్ కోర్టుల్లో పేరుకుపోయిన లక్షలాది భూ వివాద కేసులు.. దశాబ్దాలుగా వ్యవస్థను స్తంభింపజేస్తున్న ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం? ..లాండ్ టైట్లింగ్ చట్టం మాత్రమే భూ చట్టాల నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్న వాస్తవమిది. రాష్ట్రాలు ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చెబుతూనే ఉన్నాయి. కానీ, ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలో తెలియక అనేక రాష్ట్రాలు ప్రయత్నించి విఫలమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సాహసోపేతంగా లాండ్ టైట్లింగ్ చట్టాన్ని సమర్ధవంతంగా అమల్లోకి తెచ్చింది. మన రాష్ట్రంలో మాత్రమే ఇది సఫలీకృతమైంది. ఈ చట్టం గురించి అవగాహన లేక, ప్రజల విశాల ప్రయోజనాలు పట్టక కొందరు విమర్శలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: భూ యజమానుల హక్కులకు భరోసా ఇచ్చే ఈ చట్టం కోసం ఏపీ ప్రభుత్వం చాలా శ్రమించింది. అనేక ప్రయత్నాల తర్వాతే చట్టాన్ని అమల్లోకి తీసుకురాగలిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ఎక్కువగా భూ సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. వాటన్నింటికీ పరిష్కారం చూపాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే భూముల సమస్యల పరిష్కారానికి దేశంలో ఎక్కడా లేని విధంగా లాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భూముల రీ సర్వేను కూడా చేపట్టారు. రీ సర్వే విజయవంతంగా జరుగుతున్నా లాండ్ టైట్లింగ్ బిల్లు విషయంలో ఆటంకాలు ఎదురయ్యాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం ఆమోదం కోసం పంపినప్పుడు రకరకాల సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నింటినీ ఓపిగ్గా పరిష్కరించుకుని ఇటీవలే మార్గం సుగమం చేసుకుంది. కేంద్రం ఆమోదం తర్వాత అక్టోబర్ 31వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్డీఏ వచ్చాక డీఐఎల్ఆర్ఎంపీ పథకం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్‌ఐఎల్‌ఆర్‌ఎంపీ పథకం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ)గా మారింది. ఎన్‌ఐఎల్‌ఆర్‌ఎంపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండగా, డీఐఎల్ఆర్ఎంపీలో వంద శాతం నిధులు తామే భరిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం తెలిపింది. 2024 నాటికి దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడమే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించింది. అదే క్రమంలో 2015లో ఒకసారి, 2019లో మరోసారి ముసాయిదా చట్టాల్ని తయారు చేశారు. దీని ప్రకారమే 2019లో నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చి దేశంలో టైటిల్ గ్యారంటీ చట్టం ఎలా తీసుకురావాలో సూచించింది. నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారమే ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా లాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. భూ హక్కులకు భరోసా ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యాన్ని మొదట సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాజస్థాన్‌లో విఫలం 2015లో కేంద్ర ముసాయిదా చట్టం తయారైనప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లాండ్ టైట్లింగ్ చట్టం తేవడానికి ప్రయత్నం చేసింది. దాన్ని పట్టణ ప్రాంత భూములకు మాత్రమే పరిమితం చేస్తూ టైటిల్ సరి్టఫికేషన్ చట్టం తెచ్చారు. అయినా సరిగా అమలు చేయలేకపోయారు. 30 ఏళ్ల క్రితమే బీజం వాస్తవానికి దేశంలో భూ హక్కులకు భరోసా ఇవ్వాలనే ప్రయత్నం 1989లో మొట్టమొదటిగా చట్టబద్ధంగా మొదలైంది. అప్పటి ప్లానింగ్ కమిషన్ ప్రొఫెసర్ డీసీ వాద్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను కేంద్రం నియమించింది. అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. దేశంలో భూమి రికార్డులను అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక ఇవ్వాలని వాద్వా కమిటీని కేంద్రం కోరింది. ఆ కమిషన్ దేశమంతా తిరిగి అధ్యయనం చేసి 1990లో ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దేశంలో ఇప్పుడున్న రికార్డుల వ్యవస్థ స్థానంలో భూమి హక్కులకి ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. భూమి రికార్డుల వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ ఆయన తన నివేదికలో వివరించారు. రికార్డుకి గ్యారంటీ లేకపోవడంవల్లే దేశంలో భూ వివాదాలు పెరుగుతున్నాయని, గ్యారంటీ ఇస్తే వివాదాలు తగ్గుతాయని స్పష్టం చేసింది. తద్వారా పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే ఇలాంటి వ్యవస్థ రావాలని వాద్వా ఆ నివేదికలో పేర్కొన్నారు. బ్రిటిష్ హయాం నుంచి ఆలోచనలు భూ హక్కులకు గ్యారంటీ ఇచ్చేందుకు బ్రిటిష్ హయాం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1900 సంవత్సరంలో తొలిసారి ఈ ఆలోచన పుట్టింది. ఆ తర్వాత 1908లో రిజి్రస్టేషన్ చట్టం వచ్చినప్పుడే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలని చూశారు. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. పేదరికం, నిరక్షరాస్యత వల్ల అప్పట్లో ఆ ఆలోచలను విరమించుకున్నారు. 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్టం వచ్చినప్పుడు కూడా దీనిపై ఒక చర్చ జరిగింది. అప్పుడూ సాధ్యం కాలేదు. ఆ తర్వాత 1989లో ఆ చట్టం తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఏ రాష్ట్రంలోనూ ఆచరణాత్మకంగా ఒక చట్టం రాలేదు. ఏపీ మాత్రమే ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. భూముల వ్యవస్థలో ఇది ఒక కొత్త అధ్యాయంగానే చెప్పాలి. – సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణులు, నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ 2004లో నేషనల్ లాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం వాద్వా కమిటీ సిఫారసుల ఆధారంగానే 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం భూమి రికార్డులపై నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) తెచ్చింది. భూమి రికార్డులన్నింటినీ కంప్యూటరీకరించడం, రికార్డుల స్వచ్చికరణ, అన్ని శాఖలతో వాటిని అనుసంధానం చేయడం.. అంతిమంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనేది ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఆధారంగానే 2005–06లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో భూ భారతి పేరుతో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. జిల్లా మొత్తం కొత్త టెక్నాలజీతో రీ సర్వే చేసి టైటిల్ గ్యారంటీ ఇవ్వాలనే ప్రయత్నం అప్పట్లోనే జరిగింది. కానీ, ఆయన హఠాన్మరణంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. సర్వే జరిగింది కానీ ఆ రికార్డును నోటిఫై చేయలేదు. చట్టం కూడా రాలేదు. 2009లో యూపీఏ–2 ప్రభుత్వం టైట్లింగ్ వ్యవస్థ కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
మరో వివాదంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-
ఆదిలాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన భూమాఫియా
-
స్వామిపేరు చెప్పి రూ.కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టే స్కెచ్
పేరు దేవుడిది.. దందా రియల్ ఎస్టేట్ వ్యాపారులది. స్వామిపేరు చెప్పి రూ.కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టే స్కెచ్ గీశారు. పచ్చని కొండను జేసీబీలతో ఇష్టారాజ్యంగా చదును చేసేస్తున్నారు. ప్లాట్లుగా మలిచే పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. అధికారులు అడ్డుచెప్పినా ఫిరంగి కొండను కైంకర్యం చేసేపనులు సాగిస్తున్నారు. కొత్తవలసలో రెవెన్యూ పరిధిలో దేవుడి ముసుగులో సాగుతున్న భూదందాకు ‘సాక్షి’ అక్షరరూపం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కుక్కను చంపాలంటే దానికి పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. అదే ప్రభుత్వ భూమిని కొట్టేయాలంటే ఆ పక్కనే కొంత స్థలంలో దేవుడికో గుడి కట్టాలి. అక్కడ విలువ పెరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థలాలను హాట్‌కేక్‌ల్లా అమ్మేసుకోవాలి. సరిగ్గా ఇదే ఫార్ములాను కొత్తవలసలో అక్రమార్కులు పక్కాగా ఫాలో అవుతున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఫిరంగి కొండనే జేసీబీలతో దొలిచేస్తున్నారు. అక్కడ రేకుల షెడ్లో తాత్కాలికంగా దేవుడిని పెట్టారు. అక్కడికి కాస్త ఎగువన కొండపై గుడి నిర్మాణం ప్రారంభించారు. అదే సమయంలో పరిసరాలతో పాటు రోడ్డు వేసే పేరుతో రూ.20 కోట్ల విలువైన దాదాపు ఐదు ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని చదును చేసేశారు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్వయంగా హెచ్చరించినా అక్రమార్కులు తగ్గలేదు. తహసీల్దార్ దేవుపల్లి ప్రసాదరావు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు ఆ మార్గంలోని కల్వర్టును ధ్వంసం చేయించారు. వారి ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అక్రమార్కులు ఆ పక్కనుంచే రోడ్డు నిర్మాణ పనులు చేసుకుపోతున్నారు. స్వామిపేరు చెప్పి భూ కైంకర్యం... కొత్తవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 168లో దాదాపు 415.38 ఎకరాల విస్తీర్ణంలో ఫిరంగికొండ విస్తరించి ఉంది. గతంలో గిరిజన రైతులకు అక్కడ 150 ఎకరాల్లో డీ పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా రూ.5 కోట్ల వరకూ ధర పలుకుతోంది. దీంతో కొండపై వేంకటేశ్వర స్వామి గుడికడతాం అంటూ కబ్జాదారులు స్కెచ్ వేశారు. దీనికి కొత్తవలస రెవెన్యూ కార్యాయలంలోనే కొంతమంది సిబ్బంది యథాశక్తిగా సాయం అందించారు. దీంతో అర ఎకరంలో గుడి నిర్మాణ పనులు ప్రారంభించారు. దేవుడికి భారీ ప్రాంగణం ఉండాలని చెబుతూ పరిసరాల్లో దాదాపు 4.5 ఎకరాల వరకూ చదును చేసేశారు. ఆ తర్వాత ఆ భూమిని ప్లాట్లుగా వేసి సొమ్ము చేసుకోవాలనేది అసలు పన్నాగంగా తెలుస్తోంది. అనుమతుల్లేకుండా నిర్మాణాలు... వాస్తవానికి ఫిరంగికొండ పచ్చదనం పరచుకొని ఉంటుంది. ప్రకృతికి విఘాతం కలిగిస్తూ రోడ్లు, భవనాల వంటి నిర్మాణాలు చేపడితే పర్యావరణ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. గుడి నిర్మాణమే అయినా సరే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పనులు చేయకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా గుడి నిర్మాణం పనులు చేపట్టారు. రోడ్డు వేసేశారు. భారీ ఖర్చుతో కల్వర్టు కూడా నిర్మించారు. స్వాగతద్వారం ఏర్పాటు చేశారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు... కలెక్టర్ ఎ.సూర్యకుమారి గత డిసెంబర్ 17వ తేదీన కొత్తవలస పర్యటనకు వచ్చినపుడు ఫిరంగికొండపై తవ్వకాలను చూశారు. వాటిపై ఆరా తీశారు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా? పట్టాలు ఉన్నాయా? గుడి నిర్మాణం చేయడానికి టీటీడీగానీ, దేవాదాయ శాఖ గానీ అనుమతులు ఏమైనా ఇచ్చిందా? రెవెన్యూ అనుమతులు ఏమైనా ఉన్నాయా? అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అలాంటివేమీ లేకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ ఆశ్చర్యపోయారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ భవానీశంకర్‌ను ఆదేశించారు. దర్జాగా నిర్మాణ పనులు... ఫిరంగి కొండపై చేస్తున్న పనులు నిలిపేసేందుకు తహసీల్దార్ ప్రసాదరావు, రెవెన్యూ సిబ్బంది జనవరి 18న కొండపైకి వెళ్లారు. కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గంలోనున్న కల్వర్టును జేసేబీతో ధ్వంసం చేయించారు. అక్కడ నిర్మాణ పనులు తక్షణం నిలిపేయాలని ఆదేశించారు. వీటిని అక్రమార్కులు బేఖాతరు చేశారు. కూలిన కల్వర్టు పక్కనే మళ్లీ రోడ్డువేసి పనులు చేస్తున్నారు. నీరుగారిన క్రిమినల్ కేసు... ఫిరంగి కొండను ఆక్రమించి తవ్వకాలు చేసినవారిపై, నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గత తహసీల్దార్ రమణారావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో ముగ్గురిపై భూ ఆక్రమణ (ల్యాండ్ గ్రాబింగ్) కేసు నమోదైంది. వాస్తవానికి అసలు సూత్రధారులను వదిలేసి ఏదో తూతూమంత్రంగానే ఆ ఫిర్యాదు ఉందని ఇటు రెవెన్యూ వర్గాల్లోను, అటు స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. రకరకాల పైరవీలతో ఈ కేసు కాస్తా నీరుగారిపోయింది. ఫిరంగి కొండ కాస్త కరిగిపోతోంది. ప్రభుత్వ స్థలాలకు ఎసరు... కొత్తవలస నుంచి గతంలో గిరిజన యూనివర్సిటీకి భూసేకరణ జరిగిన రెల్లి–గిరిజాల రోడ్డులో ఫిరంగి కొండ ఉంది. దీనికి దిగువన టీచర్స్ కాలనీ, ఎన్జీఓ కాలనీ ఉన్నాయి. అక్కడ ఎవరెవరికీ పట్టాలు ఇచ్చారో, ఇంకా మిగిలిపోయిన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపే రెవెన్యూ రికార్డు కాస్త అక్రమార్కుల చేతికి వచ్చింది. దాని ఆధారంగా వంద గజాలకు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ధరకు ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు. ఇలా రికార్డు లీకేజీ వెనుక స్థానికంగా ఉన్న కొంతమంది రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సహకారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కల్వర్టును ధ్వంసం చేయించాం.. ఫిరంగి కొండ అంతా ప్రభుత్వ స్థలమే. అక్కడ అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకే ట్రాక్టర్లు, జేసీబీలు కొండపైకి వెళ్లకుండా ఆ మార్గంలో కల్వర్టును ధ్వంసం చేయించాం. ఆ కల్వర్టును నిర్మించినదీ ఆక్రమణదారులే. దీనిపై పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం. – దేవుపల్లి ప్రసాదరావు, తహసీల్దార్, కొత్తవలస -
భూ..చోళ్ల ‘డబుల్’ దందా! ఎన్ఆర్ఐల భూములే టార్గెట్
చిత్తూరు జిల్లా కలకడ మండలం కోపూరివాండ్ల పల్లెకు చెందిన ఈమె పేరు ఎ.సరోజ. కూలి పనులు చేసుకుని జీవిస్తోంది. విదేశాల్లో స్థిరపడ్డ ఓ ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన భూమికి ఈమె హక్కుదారు అని నమ్మించి.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ఓ ముఠా హైదరాబాద్‌కి చెందిన ఓ విద్యావంతురాలైన మహిళనే మోసం చేసింది. తీరా మోసం బయటపడిన తర్వాత నిలదీస్తే.. అబ్బే ఎక్కడో పొరపాటు జరిగిందని, ఆ డబ్బుతో ఈ సారి డబుల్బెడ్రూం ఫ్లాట్ ఇప్పిస్తామని చెప్పుకొచ్చింది. ఇరుక్కున్న డబ్బులకు ఏదో ఒకటి వస్తుందిలే అనుకుంటే.. ఈ దఫా అమెరికాలో ఉన్న ఆ అపార్ట్మెంట్ స్థల యజమాని వచ్చి.. ఆ ఫ్లాట్ ఎలా అమ్ముతారని కేసు వేశారు. ఇదీ భూ..చోళ్ల నయా మోసం. స్మార్ట్ సిటీ తిరుపతి చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జారాయుళ్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. విదేశాల్లో ఉంటున్న ఎన్నారైల భూములు ఎంచుకుని డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. రూ.కోట్ల విలువైన భూములను తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ ఒరిజినల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తీరా కొనుగోలు చేసినవాళ్లకు అసలు యజమానుల నుంచి లీగల్ నోటీసులు వస్తుండటంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ల్యాండ్ మాఫియాలో ఓ కానిస్టేబుల్ కీలకపాత్ర పోషించడంతో ఎస్పీ ప్రత్యేకంగా విచారణకు ఆదేశించారు. తిరుపతి సమీపంలో చెలరేగిపోతున్న డబుల్ రిజిస్ట్రేషన్ ముఠా అక్రమాల ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని 1964 లో ఏర్పాటు చేశారు. మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలోని ఈ లే అవుట్‌కు 1969లో అప్రూవల్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ ఒక్కొక్కరుగా వారికి కేటాయించిన ప్లాట్ల వారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఉద్యోగ విరమణ తర్వాత విదేశాల్లో స్థిరపడిన గెజిటెడ్ ఆఫీసర్స్ ఎక్కువమందే ఉన్నారు. ల్యాండ్ మాఫియాకి ఇదే అదనుగా మారింది. ముందుగా వారి స్థలాలనే కబ్జాకు ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే సర్వే నెంబర్ 557లోని ప్లాట్ నెంబర్ 225లో 104 అంకణాల భూమిపై కన్ను వేశారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగశేఖరరెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చెప్పుకునే శ్రీరాములు నాయుడు, బాలకృష్ణలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఆ 104 అంకణాల భూ యజమాని ఎన్నారై కుటుంబానికి చెందిన సరోజ అని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి బి.పద్మజకు రూ.60లక్షలకు విక్రయించారు. చాలా తక్కువ ధరకే మీకు అమ్మించామంటూ ఎక్కువ కమీషనే తీసుకున్నారు. కొనుగోలు చేసిన పద్మజ ఆ భూమిలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తుండగా.. ఎన్ఆర్ఐ మధురిమ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ స్థలం మాదేనని, మీరు మోసపోయారని చెప్పింది. బిత్తరపోయిన పద్మజ.. విషయాన్ని సదరు ముఠాకి చెప్పి నిలదీయగా.. ఇలా కొంతమంది ఫేక్ వ్యక్తులు ఫోన్ చేస్తుంటారని మీరేమీ పట్టించుకోవద్దని బుకాయించారు. అయితే మధురిమ తన వద్దనున్న ఒరిజినల్ డాక్యుమెంట్లతో పోలీసులను ఆశ్రయించడంతో ముఠా మోసం బట్టబయలైంది. కానీ అప్పటికే ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించుకుంటున్న పద్మజ.. మరో రూ.60లక్షలను అసలు భూమి యజమాని మధురిమకు ఇచ్చి కొనుగోలు చేసి మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్లీ మళ్లీ మోసం తాను మోసపోయానని, తాను ఇచ్చిన రూ.60లక్షలను తిరిగి ఇచ్చేయాలని పద్మజ సదరు ముఠాని డిమాండ్ చేసింది. అయితే ఇక్కడే ఆ మాఫియా మరో మోసానికి తెర లేపింది. డబ్బులివ్వలేమని, అదే సొసైటీలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇప్పిస్తామని నమ్మబలికింది. దక్కిందే దక్కనీ అనుకున్న పద్మజ అందుకు అంగీకరించారు. దీంతో గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సర్వే నెంబర్ 585 ప్లాట్ నెంబర్ 47లో నూతనంగా నిర్మాణం చేసిన హిల్ వ్యూ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూం 502 ఫ్లాట్‌ను రూ.30లక్షలకు కేటాయించారు. ఎంతోకొంత వచ్చిందని పద్మజ ఆనంద పడే టైంలోనే మళ్లీ మోసపోయామన్న సంగతి వెలుగుచూసింది. అసలు ఆ అపార్ట్మెంట్ ఉన్న స్థలం నాదంటూ ఎన్ఆర్ఐ నిరంజన్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. తన స్థలంలో ఫేక్ డాక్యుమెంట్లతో అపార్ట్మెంట్ నిర్మించేసి ఫ్లాట్లు విక్రయించారంటూ ఆ మాఫియాతో పాటు కొనుగోలు చేసిన వారందరికీ నిరంజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. దీంతో మళ్లీ మోసపోయామని గ్రహించి పద్మజ సదరు కానిస్టేబుల్ సహా ముఠా సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పి వెంకట అప్పలనాయుడుని కలిసి ఈ నయా దందాను వివరించారు. నాలా చాలామంది మోసపోయారు అక్కడ భూములు కొన్న వాళ్లు చాలామంది మోసపోయారు.. ఆ కానిస్టేబుల్ అండ్ కో చేసే దందాలకు అంతులేదు. పోలీసులు లోతుగా విచారిస్తే చాలా అక్రమాలు బయటపడతాయి. – ఫిర్యాదుదారు పద్మజ నేను ఏ పాపం ఎరుగను.. నిజంగా నాకు ఏ పాపం తెలియదు. అప్పుడప్పుడు మా ఊరికి వచ్చే రామకృష్ణ అనే వ్యక్తి తిరుపతిలో నాకొక స్థలం ఉంది.. సొంత ప్లాట్ ఉంది.. నేను అమ్ముకుంటున్నాను.. నువ్వు సాక్షి సంతకం పెడితే నీకు ఎంతో కొంత ఇస్తానని నమ్మించారు. కానీ పది రూపాయలు కూడా ఇవ్వలేదు.. పైగా ఇప్పుడు అదంతా మోసం అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నిద్ర కూడా పట్టడం లేదు. ఏౖమైనా కేసులు పెడితే నా పరువేం కానూ.. మట్టి పనులు చేసుకునే నేను.. భూముల మాయ ఎలా చేయగలను – కలకడ మండలం కోపూరివాండ్ల పల్లెకు చెందిన ఎ.సరోజ గతంలోనే హెచ్చరించినా.. కానిస్టేబుల్ ముఠాని నేను గతంలోనే హెచ్చరించాను. 1964లో ఏర్పాటైన సొసైటీ మాది. అప్పట్లో కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు తొంభై ఏళ్ళ వయస్సుకి వచ్చేశారు. కొందరు చనిపోయారు. మరికొందరు విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ ముఠానే కాదు.. భూమల పేరిట మాయ చేసే బ్యాచ్‌లు తిరుగుతూ మోసం చేస్తున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలకు సంబంధించి ఇప్పటికి ఐదు కేసులు నా వద్దకు వచ్చాయి. అప్రమత్తంగా ఉండటమే పరిష్కారం – ప్రభాకర్, గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ ఖాకీ పాత్రపై విచారణ కానిస్టేబుల్ నాగశేఖరరెడ్డి పాత్ర ఉందంటూ ఫిర్యాదు వచ్చిన మాట నిజమే. నేను పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాను. అక్కడ చాలా మోసాలు జరిగాయని అంటున్నారు. మొత్తంగా విచారణ చేయాలని చెప్పాను. కానిస్టేబుల్‌ది తప్పని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకట అప్పల నాయుడు, అర్బన్ ఎస్పీ -
హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న భూ మంత్రగాళ్లు
‘శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో సర్వే నంబర్ 2,5,6లలోని ఫిరంగి నాలాలో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. చారిత్రక ఫిరంగి నాలాను అపర్ణ, సుమధుర కన్స్ట్రక్షన్ సంస్థలు ధ్వంసం చేసి భారీ నిర్మాణాలు చేపడుతున్నాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వీటిని ఆపాలని కోరుతూ ఎంపీటీసీ మాజీ సభ్యుడు నరేందర్ రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సహా సీఎల్పీ నేత భట్టివిక్రమార్కలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు’ ‘కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 19, 20లలో నివాస గృహాల మధ్య ఎలాంటి అనుమతుల్లేకుండా గోదాములు, ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తున్నారు. పాటు కాల్వను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండటంతో వర్షపు నీరు నిలిచిపోయి మహిళా సమాఖ్య భవనం దెబ్బతిందని, ఈ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్థానికుడు శివకుమార్ ఇటీవల మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం’ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ యంత్రాంగం ఒకవైపు అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తుంటే.. మరో వైపు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం, నాలాలపై నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. పాత పంచాయతీల నుంచి అనుమతులు తీసుకుని, కొత్తగా నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. వీటిని గుర్తించి అడ్డుకుంటున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. వాటి జోలికి వెళ్లొద్ధంటూ హుకుం జారీ చేస్తున్నా.. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే శివారు జిల్లాల్లో వందకుపైగా నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు తెలిసింది. అయినా అక్రమ వెంచర్లు, భవన నిర్మాణాలు ఆగకపోగా.. మరిన్ని వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వీటి వెనుక బడా కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు ఉండటమే కా రణమని టాస్క్‌ఫోర్స్ బృందాలు అభిప్రాయపడుతున్నాయి. 16 మున్సిపాలిటీల పరిధిలో.. ► రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాలుగు వేలకుపైగా వెంచర్లు ఉన్నట్లు సమాచారం. 16 మున్సిపాలిటీల పరిధిలో 1397 లే అవుట్లు ఉండగా, వీటిలో 380 లేఅవుట్లకు మాత్రమే హెచ్ఎండీ అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి ఎలాంటి అనుమతులు లేవు. వీటిలో రెండు వేలకుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ► వీటిలో ఎక్కువగా మణికొండ, నార్సింగి, తుర్కయాంజాల్, హయత్‌నగర్, మీర్పేట్, బడంగ్ పేట్ మున్సిపాలిటీల పరిధిలోనే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఏటా 12 వేల నిర్మాణాలకు, హెచ్ఎండీఏ ఏటా నాలుగు వేల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాయి. జీ+పోర్కు అనుమతులు తీసుకుని, అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ► ఇలా వీటి పరిధిలో అయిదు వేలకుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కొనుగోలుదారులంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను డిసెంబర్ 31లోగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ పనుల్లో వేగం పెంచారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులకు అండగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు కూల్చివేతలను ఆపాల్సిందిగా కోరుతూ క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. మచ్చుకు కొన్ని కూల్చివేతలు.. ► మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్ నంబర్– 2లో అనుమతించిన దానికన్నా అదనంగా నిర్మించిన అంతస్తులను కూల్చివేశారు. పైపులైన్ రోడ్డులో అయిదు అంతస్తులకు అనుమతి పొంది ఆరు అంతస్తులు నిర్మిస్తుండగా, అధికారులు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. ► నార్సింగ్ పరిధిలోని పంచవటి లక్ష్మీసాయి లేఅవుట్లో రహదారిని ఆక్రమించి నిర్మించిన ప్రహరీ సహా బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్‌లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ► శంషాబాద్ మున్సిపాలిటీ సహా ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ 111 జీఓ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ► తొండుపల్లి, ఊట్పల్లి, రాళ్లగూడ, గొల్లపల్లిల్లో భారీ నిర్మాణాలు, గోదాములు నిర్మించారు. కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే 146 అక్రమ నిర్మాణాలు గుర్తించి, ఆ మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు నివేదించారు. ► ఇబ్రహీంపట్నం శేరిగూడలోని వార్డు నంబర్ 14, 16లలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను అధికారులు కూల్చివేశారు. ► శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మిస్తున్న ఓ నిర్మాణంతో పాటు అదే కాలనీలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న మరికొన్ని భవనాలకు నాలుగు రోజుల క్రితం అధికారులు నోటీసులు జారీ చేశారు. ► కొందుర్గు గ్రామ పంచాయతీ పరిధిలో 23 అక్రమ నిర్మాణాలతో పాటు మరో 11 అక్రమ వెంచర్లను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పంచాయతీ కార్యదర్శిపై జిల్లా అధికారులు వేటువేశారు. ► ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ వెంచర్లో ప్రజావసరాలకోసం వదిలిన పార్కు స్థలాల స్థిరాస్తి వ్యాపారులు ఆ తర్వాత ఆ çస్థలాన్ని 44 ప్లాట్లు చేసి 12 మందికి విక్రయించినట్లు అధికారులు గుర్తించి, ఆయా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాల్సిందిగా కలెక్టర్ అమయ్‌కుమార్ సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ► పెద్ద అంబర్పేట్ సర్వే నంబర్ 47, 48లలో ప్రహరీ సహా పసుమాములలోని సర్వే నంబర్ 91(పి), 96(పి)లలో అనుమతి లేని వెంచర్లో నిర్మిస్తున్న ప్రహరీలను కూల్చివేశారు. -
ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు.. మైసూరులో పెద్ద ఎత్తున భూముల కబ్జా..
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున భూముల అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి చెందిన అనేక భూములు కబ్జా అయ్యాయని, అలాంటి వాటిపై దర్యాప్తు చేయించాలని రాచనగరి జిల్లా అధికారిగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి మైసూరు ప్రాదేశిక కమిషనర్ ప్రకాశ్‌కు లేఖ రాశారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని జిల్లాధికారి నివాసంలో ఈత కొలను నిర్మాణంపై దర్యాప్తు నేపథ్యంలో రోహిణి ఈ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది. చదవండి: Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర.. -
కబ్జా కోరల్లో చింతల చెరువు?
హైదరాబాద్: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచర్లలో ఉన్న చింతల చెరువు ఎఫ్టీఎల్ భూమి, బఫర్ జోన్ అన్యాక్రాంతమవుతుంది. ఇప్పటికే బఫర్ జోన్లో కొంత భాగం కాలనీగా ఏర్పడి కొన్ని ఇళ్లు నిర్మించుకోగా, మిగిలిన స్థలంలో మట్టినింపి చదును చేస్తున్నారు. అదే బఫర్ జోన్ పరిధిలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిపై మాజీ ప్రజాప్రతినిధులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చెంగిచర్లలోని చింతల చెరువు సర్వే నంబరు 57లో 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఒకప్పుడు తాగు, సాగునీరు అందించిన ఈ చెరువు నేడు మురికి కూపంగా మారింది. చెంగిచర్ల ఎగువ ప్రాంతంలో ఉన్న కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టగా మురుగునీరు దిగువ ప్రాంతానికి వెళ్లడానికి అవుట్ లెట్ లేకపోవడంతో కాలనీల నుంచి వచ్చే మురుగంతా చెరువులోకి వెళ్తుంది. దీంతో చెరువు అంతా మురుగునీటితో కూపంగా మారి విపరీతమైన దుర్వాసన వస్తుంది. గతంలో చెరువు ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేయక ముందు కొంత మంది సాయినగర్ కాలనీని ఏర్పాటు చేయగా, మరికొంత మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం అధికారులు, పాలకవర్గం ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇటీవల కొంత మంది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న తమ ప్లాట్లకు ఎన్ఓసీలు తెచ్చుకుని మట్టి పోసి చదును చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజలు అధికారులు, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చెంగిచర్ల చింతల చెరువు కట్ట ఆనుకుని ఉన్న బఫర్ జోన్లో ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరుపై ఉన్న స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని మాజీ వార్డు సభ్యులు కుర్రి శివశంకర్, కొత్త ప్రభాకర్‌గౌడ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఇరిగేషన్, రెవెన్యూ, కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువు కట్ట ఆనుకుని బఫర్ జోన్ ఉందని, సదరు స్థలానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇవ్వగా మున్సిపల్ అధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. నిబంధలనకు అనుగుణంగానే.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ ప్రకారమే అనుమతులిచ్చాం. ఎన్ఓసీలో కట్ట అనుకుని మొత్తం 50 గజాలు బఫర్ జోన్ ఉన్నట్లు చూపారు. దాని ప్రకారం అనుమతులు మంజూరు చేశాం. మా నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి అవకతవకలు జరగలేదు. –బోనగిరి శ్రీనివాస్, కమిషనర్ -
ఇదో పెద‘రాయుడి’ అక్రమ మార్గం
సాక్షి, రాజమహేంద్రవరం: సేవ ముసుగులో కోట్లు కొల్లగొట్టే ఎత్తుగడ వేశాడు ఓ గ్రామంలో పెద‘రాయుడు’. టీడీపీలో చక్రం తిప్పే ఆయన రియల్టర్ కూడా. సంపదను పెంచుకునే ముసుగులో ప్రజల కోసం ఉదారంగా భూమి రాసి ఇచ్చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. రాయవరం మండలంలో తెలుగుదేశం పార్టీకి అన్నీ తానై నడిపించే నాయకుడికి హఠాత్తుగా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన వచ్చిందట. అనుకున్నదే తడవుగా తనకున్న విలువైన భూమిలో మూడు కుంచాల భూమి రాసిచ్చేస్తానని ముందుకు వచ్చాడు. ఇందుకోసం మండల స్థాయిలో అధికారులకు వల వేసి తన ‘లే అవుట్’కు మార్గం సుగమం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. టీడీపీ నేతకు ఇంత ఔదార్యం ఎందుకు వచ్చిందా అని జనం ఆరా తీయగా దీని వెనుక దాగి ఉన్న పచ్చ నేత స్వార్థం బహిర్గతమై జనం విస్మయానికి గురవుతున్నారు. ఆ కథా కమామీషు ఏమిటో ఒకసారి చూద్దాం. దానం ఇచ్చిన భూమిలో... రాయవరంలో ప్రభుత్వ భవనాలకు దివంగత రాయవరం మునసబు సుమారు మూడు ఎకరాలు ఏనాడో దానం చేశారు. ఆ భూమిలో పోలీస్‌స్టేషన్, తహసీల్దారు, ఎంపీడీవో, వ్యవసాయశాఖ, వెలుగు, ఉపాధి హామీ, మండల విద్యాశాఖ, హౌసింగ్, సబ్ ట్రెజరీ...ఇలా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఆ ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాల నుంచి 40 అడుగుల రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఆ నాయకుడు ముందుకు వచ్చాడు. ఆ రోడ్డును ఆమోదిస్తే ఆ నాయకుడు వేస్తున్న వెంచర్ ధర అమాంతం పెరిగిపోతుంది. రాయవరం మెయిన్ రోడ్డు నుంచి కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు ఏర్పాటుకు నిర్దేశించిన స్థలం సోమేశ్వరం–రాజానగరం రోడ్డును ఆనుకుని దివంగత రాయవరం మునసుబు దానం చేసిన స్థలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల వెనుక టీడీపీ నేతకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది. సుమారు 16 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంతా ప్లాన్ చేసిన ఆ వెంచర్‌కు సరైన మార్గం లేకుండా పోయింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలు పలుకుతోంది. అదే రోడ్డు ఏర్పాటైతే ఒక్కసారిగా ఎకరం రూ.3 కోట్లు అయిపోతుంది. ఆ నాయకుడు వేయతలపెట్టిన వెంచర్ కోసం పంట పొలాల్లోకి సుమారు 100 మీటర్ల పొడవున, 40 అడుగుల వెడల్పుతో ప్రభుత్వ భూముల్లో నుంచి రోడ్డును వేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలున్న జాగాలో రహదారి ఇచ్చినందుకు ప్రతిగా ఆ నాయకుడు 20 సెంట్ల భూమి ఇవ్వడానికి అధికారులు, అనధికారులతో రహస్య ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇదేమిటంటూ స్థానికుల ఆగ్రహం ఆ నాయకుడు చెప్పినట్టుగా తలాడిస్తున్న కొందరు అధికారులు, అనధికారులు ఆ స్థలంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రాయవరం సచివాలయం–2ను మార్చేసే ఆలోచన చేయడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఈ సచివాలయ నిర్మాణం కోసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లి సుభా‹Ùచంద్రబోస్ ఈ ఏడాది జనవరి 12న భూమిపూజ కూడా చేయడం గమనార్హం. ఒక్క గ్రామ సచివాలయమే కాదు రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో నుంచి ప్రధాన రహదారికి 40 అడుగుల రోడ్డును వేస్తే ఆ నేతకు చెందిన పొలం విలువ ప్రస్తుతం ఉన్న విలువకు మూడు, నాలుగు రెట్లు అమాంతం పెరిగిపోతుంది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుంది. తన భూమిని రియల్ ఎస్టేట్‌గా మార్చేందుకు ప్రభుత్వానికి 20 సెంట్ల ఇవ్వజూపి, ప్రభుత్వ స్థలంతో 40 అడుగుల రోడ్డు వేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే ఎకరం రూ.3 కోట్లు పైనే పలుకుతుంది. అంటే ప్రతి ఎకరాకు రూ.2 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూమి నుంచి రోడ్డు వేస్తే గనక ఆ పెదరాయుడికి అదనంగా వచ్చి పడే మొత్తం సొమ్ము రూ.32 కోట్లుగా లెక్క లేస్తున్నారు. ఇంత అదనపు రాబడి వస్తుండటంతోనే తెర వెనుక జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ అధికారులకు 5 శాతం (కోటిన్నర) ముట్టజెప్పే ఒప్పందం కుదిరిందని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడో ఏళ్ల కిందట దాత ఎంతో ఔదార్యంతో ఇచ్చిన భూమిని ఎలా కేటాయిస్తారని పలువురు ప్రశి్నస్తున్నారు. ఈ ప్రతిపాదన చర్చకు రావడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు ఈ ప్రతిపాదన ఎలా వచ్చింది? ప్రతిపాదనకు ఎవరు మద్దతిస్తున్నారు? తెరవెనుక రాజకీయం ఎవరు చేస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. టీడీపీ నేత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధికారులు, నాయకులు ఎలా సహకరిస్తారంటున్నారు. లక్షలు చేతులు మారాకనే ఇందుకు అధికారులు తలాడించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 40 అడుగుల రోడ్డే ఎందుకు? టీడీపీ నేతకు చెందిన పొలాల్లోకి వెళ్లేందుకు చిన్న చిన్న రహదారులున్నాయి. 40 అడుగుల రహదారి అందుబాటులో లేదు. మండల పరిషత్ స్థలం నుంచి 40 అడుగుల రోడ్డు కోసం ఇస్తే.. భవిష్యత్తులో రియల్ బూమ్‌తో కోట్లు కొల్లగొట్టాలనేది ఆలోచనగా కనిపిస్తోంది. ఆ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చుకుంటే టౌన్ ప్లానింగ్ అనుమతులకు ఎటువంటి ఆటంకాలు ఉండవనేది వారి ఎత్తుడగ. ప్రస్తుతం సచివాలయం–2, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ ఇక్కడే నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణ పనుల్లో బల్క్‌మిల్క్ సెంటర్ షెడ్డును కూడా ఇటీవలే కూల్చేశారు. ఇక్కడ సచివాలయం–2 భవన నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఈ కొత్త ప్రతిపాదన ఎందుకు..ఎవరు తీసుకు వచ్చారని గ్రామస్తులు ప్రశి్నస్తున్నారు. దాత ఇచ్చిన భూమిని ఇలా ఇతరుల ప్రయోజనాలకు ధారాదత్తం చేయడం పట్ల గ్రామంలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మా దృష్టికీ వచ్చింది రాయవరంలో లే అవుట్ రోడ్డు కోసం ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నారనే సమాచారం మా దృష్టికి వచ్చింది. అటువంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ఎవరున్నా చర్యలు తప్పవు. అన్ని అంశాలూ సమగ్రంగా విచారిస్తున్నాం. ఇందుకోసం రెవెన్యూ డివిజన్ స్థాయిలో విచారణ జరిపిస్తా. – జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి -
భూ మాయగాళ్లు.. బెడిసికొట్టిన వ్యూహం
కర్నూలు(సెంట్రల్): భూమాయగాళ్ల వ్యూహం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో అధికారుల అప్రమత్తతతో విలువైన భూమి అక్రమార్కుల పాలుగాకుండా నిలబడింది. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మునగాలపాడు గ్రామ రెవెన్యూలో 154, 155 సర్వే నంబర్లలో బుధవారపేటకు చెందిన గిరిజనులు చిన్న పుల్లన్నకు 8 ఎకరాలు, పెద్ద వీరన్నకు 4 ఎకరాలు, గిడ్డయ్యకు 4 ఎకరాలు, చిన్న పాపన్నకు 3 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ దాదాపు ఎకరా రూ.కోటికి పైగా విలువ ఉంది. చిన్న పుల్లయ్యకు చెందిన 5 ఎకరాల భూమిపై వడ్డెగేరి సూర శ్రీనివాస్ గౌడ్, అబ్దుల్లాఖాన్ ఎస్టేట్ ఏరియాకు చెందిన పి.బాలచంద్రారెడ్డి, మునగాలపాడు మణిబాబు, కింగ్‌మార్కెట్ మేకల దాసరి ప్రకాష్, ప్రకాష్‌నగర్ ఎన్నం రాజశేఖరరెడ్డి కన్ను పడింది. ఎలాగైనా భూమి దక్కించుకోవాలని షేక్ హైదర్అలీ, షేక్ అబ్బాస్‌అలీ, షేక్ ఉమ్రాన్ అలీ, షేక్ షరీఫ్బాషా, షేక్ జాఫర్, షేక్ ఖాదీర్, షేక్ హుస్సేన్, షేక్ అçఫ్సర్ హుస్సేన్, షేక్ ఖాజా బాషా, షేక్ ఖాజా బాషాల పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. వారి నుంచి తాము కొనుగోలు చేస్తున్నట్లు డాక్యుమెంట్ సృష్టించి కర్నూలు సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్నంగా పరిశీలించగా తప్పుడు డాక్యుమెంట్ అని తేలడంతో రిజిస్ట్రేషన్‌కు నిరాకరించారు. నిరంతరం ఇదే పనిలో భూబకాసురులు కర్నూలు మునిసిపల్‌కార్పొరేషన్ పరిధిలో భూమి విలువ కోట్లకు పెరగడంతో కొందరు భూబకాసురులు ముఠాలుగా ఏర్పడ్డారు. మొదట ఖాళీ స్థలాలను గుర్తించి దొంగ డ్యాకుమెంట్లు సృష్టించి వాటి ద్వారా అధికారులను మభ్యపెట్టి తప్పుడు రిజి్రస్టేషన్లతో స్వాధీనం చేసుకుంటున్నారు.ఆతర్వాత నిజమైన లబ్ధిదారులకు విషయం చేరేలా చూస్తారు. తమకు రిజి్రస్టే షన్ ఉందని దౌర్జన్యం చేస్తారు. చివరకు పంచాయితీ పేరుతో సగం–సగం అంటూ పంచుకోవడానికి సిద్ధ పడతారు. అలా పంచుకోవడానికి నిజమైన యజమానులు ముందుకు రాకపోతే కోర్టు లో కేసు వేసి ఏళ్లకు ఏళ్లు తిప్పుతారు. ఇలాంటి ముఠా ఎత్తుగడ ను ఇటీవల రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు చిత్తు చేశారు. కలిసొస్తున్న పోలీసుల ఉదాసీనత... భూమాఫియాగాళ్లకు పోలీసుల ఉదాసీన వైఖరి కలిసొస్తోంది. భూకబ్జాలకు పాల్పడే వారిపై నిజమైన యజమానులు ప్రారంభంలోనే ఒక్కోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఇది సివిల్ పంచాయితీ అంటూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో యజమానులు అంతా తెలుసుకునేలోపే కబ్జాదారులు తప్పు డు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటూ కోర్టుకు వెళ్తున్నారు. ఇక కొందరు రిజి్రస్టేషన్ అధికారులు కూడా కాసులకు కక్కుర్తిపడి కబ్జాదారుల పక్షమే వహిస్తూ రిజిస్ట్రేషన్ చేసి యజమానులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమని అడిగితే డాక్యుమెంట్లు చూసి చేశామని,మరీ కొంచెం ఒత్తిడి చేస్తే పనిలో పడి సరిగా చూసుకోలేదని చెబుతున్నారు. మా భూములకు రక్షణ లేకుండా పోయింది మాకు మునగాలపాడు సమీపంలో సర్వే నంబర్లు 154, 155లలో మొత్తం 20 ఎకరాల భూమి ఉంది. ఇందులో మాన్నాన్న చిన్న పుల్లన్నకు 8 ఎకరాలు భూమి ఉంది. అందులో 5 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. మిగతా 15 ఎకరాలకు కూడా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారేమోనని భయంగా ఉంది. భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – మనీష్, భూ యజమాని, కర్నూలు తప్పుడు డాక్యుమెంట్‌గా గుర్తించి తిరస్కరించాం మునగాలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని 154, 155 సర్వే నంబర్లలోని 20 ఎకరాల్లో 5 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. అయితే చివరి క్షణంలో మాకు అనుమానం వచ్చి తీక్షణంగా పరిశీలించాం. తప్పుడు డాక్యుమెంట్లుగా గుర్తించి తిరస్కరించాం. విషయాన్ని నిజమైన వారసులకు తెలిపాం. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. – నాగభూషణం, జిల్లా రిజిస్ట్రార్, కర్నూలు -
మహిళపై ల్యాండ్ మాఫియా ఆగడం..
గువహటి : భూవివాదంలో 50 సంవత్సరాల మహిళను ల్యాండ్ మాఫియా సజీవ దహనం చేసిన ఘటన అసోంలోని హజోయి జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాఫియా దౌర్జన్యం నుంచి మహిళను కాపాడిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని షీలా బేగంగా పోలీసులు గుర్తించారు. తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకోగా వారు తనను సజీవంగా దహనం చేసి చంపేందుకు ప్రయత్నించారని, తాను గాయాలతో వారి బారి నుంచి బయటపడ్డానని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. చదవండి : దారుణం: మరో మాట లేకుండా ప్రాణాలు తీశారు మధ్య అసోం దక్షిణ్ సమరాలి ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటుచేసకుంది. భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన మాఫియా ముఠాను మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అడ్డుకోగా దుండగులు ఆమెపై దాడికి తెగబడి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
చేయి తడిపితే చాలు.. ఏ భూమైనా..
జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి హద్దే లేకుండా పోయింది. చేయి తడిపితే చాలు నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినందుకు సబ్రిజిస్ట్రార్లు భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నారు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతల సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఒక టీడీపీ ఎమ్మెల్సీ ప్రోద్బలంతో రూ.10 కోట్ల విలువజేసే భూమిపై న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వెనుక రూ.కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కోవూరు మేజర్ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 295లో 3.30 ఎకరాలు భూమి ఉంది. ఆ గ్రామంలో అగర్వాల్ నారాయణదాసుకు సంబంధించిన ఆస్తి ఉంది. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వారసులుగా ఉన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ భూమి ప్రస్తుతం మార్కెట్‌ధర రూ.10 కోట్లుగా ఉంది. ఈ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. ఎలాగైనా ఆ భూమిని కారుచౌకగా కొట్టేయాలని పథకం వేసిన టీడీపీ నేత అగర్వాల్ నారాయణ దాసుకు చెందిన ఓ కుమార్తె పద్మాబాయ్ ఆరుగురు పిల్లలను వారసులుగా చూపించి ఆ భూమిని 2010లో జీపీ (జనరల్ పవరాఫ్ పట్టా) కమ్ సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. కానీ ఆ భూమికి ఇంకా వారసులు చాలా మంది ఉన్పప్పటికీ ఒక కుమార్తె పిల్లల చేత అక్రమంగా జీపీ చేయించుకుని భూమిని సొంతం చేసుకునేలా పథకం వేశారు. ఆ భూమిని ఇతరులు కొనుగోలు చేయకుండా అప్పటి జిల్లా తెలుగు యువత నేతతో కుమ్మక్కై న స్థానిక టీడీపీ నేత మాస్టర్‌ప్లాన్ వేసి సేల్ అగ్రిమెంట్ చేశారు. ఆ ఇద్దరు మధ్య వివాదం ఉన్నట్లు సృష్టించి జిల్లా జడ్జి కోర్టులో ఇంజక్షన్ అర్డర్ తెచ్చారు. అయితే వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆర్.శేఖర్‌బాబు అలియాస్ యల్లారెడ్డి కూడా పద్మాబాయ్ అక్క సుందరాబాయ్ పిల్లల చేత ఆ భూమిలో సగభాగం 1.67 సెంట్లు భూమిని సేల్ డీడ్‌ను 2013లో చేయించుకున్నాడు. దీంతో వారి మధ్య భూ వివాదం తలెత్తింది. న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న ఆ భూమిని నిషేధిత జాబితాలో ఉంచాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టారు. న్యాయస్థానం ఉత్తర్వులున్నా.. కోవూరుకు చెందిన 295 సర్వే నంబర్‌పై జిల్లా ఐదో జిల్లా జడ్జి కోర్టులో ఆ భూమిని ఎవరూ క్రయ, విక్రయాలు చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కానీ 2012 డిసెంబర్ 26వ తేదీన అప్పటి కోవూరు సబ్‌రిజిస్ట్రార్ కె.శోభమ్మ 30 అంకణాలను డాక్యుమెంట్ నంబరు 2327–2012 రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటికే ఆ భూమిపై న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లినా ఆ సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో నమోదు చేయకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసింది. మరో ఏడాది పాటు 2013 డిసెంబర్ వరకు కోర్టు ఉత్తర్వులు ఉన్న ఆ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చకుండా కావాలనే జాప్యం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. ఆపై అదే భూమిని నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాగేశ్వరరావు సబ్‌రిజిస్ట్రార్ కూడా 4159–2013, 4409–2013, 4410–2013 డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే జీïïపీఏ కమ్ సేల్ చేసిన వ్యక్తి అగర్వాల్ రామ్ ప్యారీ అనే వ్యక్తి మరణించాడు. జీపీఏ చేసిన వ్యక్తి చనిపోతే జీపీ కమ్ సేల్ అగ్రిమెంట్ ఆటోమేటిక్‌గా రద్దు అయిపోయింది. కానీ ఇవేమీ పట్టించుకోని సబ్ రిజిస్ట్రార్ మాత్రం భారీగా ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేశాడు. అలాగే అదే సర్వే నంబరును అల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ సింహాద్రినాయుడు డాక్యుమెంట్ నంబర్లు 823–2013, 824–2013, 825–2013, అలాగే నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్లు 822–2014, 823–2014, 1540–2014, 3306–2014, 3854–2014, 3855–2014గా రిజిస్ట్రేషన్ చేశారు. 2013లో నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న నాగేశ్వరరావు 2015లో కోవూరు సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో కూడా డాక్యుమెంట్ నంబర్లు 361–2015, 362–2015, 458–2015,1661–2015, 1686–2015గా మరోసారి రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 2014లో స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న నందకిశోర్ కూడా అదే సర్వే నంబర్‌ను డాక్యుమెంట్ నంబర్లు 4202–2014, 4203–2014గా రిజిస్ట్రేషన్ చేశారు. టీడీపీ హయాంలో నివేదకలు తొక్కిపెట్టి.. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి భారీగా లబ్ధిపొందిన ఆ ఐదుగురు సబ్రిజిస్ట్రార్లపై శేఖర్‌బాబు అలియాస్ ఎల్లారెడ్ది ఫిర్యాదు మేరకు టీడీపీ హయాంలో పలుమార్లు విచారణ చేపట్టి నివేదిక తొక్కిపెట్టారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ అండతో నివేదికలను తొక్కి పెట్టి చర్యలు తీసుకోలేకపోయారు. ఈ అవినీతి బాగోతం వెనుక గతంలో రిజిస్ట్రేషన్‌శాఖ జిల్లా డీఐజీగా పనిచేసిన అధికారితోపాటు అప్పటి నెల్లూరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో గత ఐదేళ్ల పాటు కేవలం విచారణ పేరుతో కాలయాపన చేశారు. న్యాయం కోసం లోకాయుక్తకు ఫిర్యాదు టీడీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ఎల్లారెడ్డి న్యాయం కోసం లోకాయుక్తను ఆశ్రయించాడు. గతంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మునిశంకరయ్య అక్రమ రిజిస్ట్రేషన్లపై వాస్తవ నివేదిక ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని, గత ఐదేళ్లగా విచారణ పేరుతో కాలయాపన చేస్తూ అవినీతికి ఉన్నతాధికారులు కొమ్ముకాస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో లోకాయుక్త వాస్తవ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో మరోసారి విచారణ అవినీతి రహిత పాలనలో ముందుకెళ్తున్నా ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి అధికారులపై మరోసారి విచారణకు ఆదేశించారు. రెండు నెలలుగా విచారణ చేపట్టిన అధికారులు ఐదుగురు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది వాస్తవమే అన్నట్లు నిర్ధారించి నివేదిక తయారు చేశారు. -
నారాయణపేటలో భూ మాయ!
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బాపూర్ శివారులోని సర్వే నం. 30/ఏఅ, ఖాతా నం. 635లో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆనంద (భర్త పేరు వెంకట్‌రెడ్డి) అక్రమంగా పొందారు. ఆమె పేరుతో పట్టాపాసు పుస్తకాలు మంజూరయ్యాయి. హద్దులు తెలియకపోవడంతో అక్రమంగా పట్టా పొందిన ఈ భూమిని సాగు చేయడం లేదు. అయినా ‘రైతుబంధు’ ద్వారా పెట్టుబడి సాయం మాత్రం క్రమం తప్పకుండా పొందుతున్నారు. ఇలా 2018–19లో రూ.18వేలు, 2019–20లో రూ.22,500 తీసుకున్నారు. అలాగే సర్వే నం.30/ఆ ఖాతా నం.372లో లక్ష్మి (భర్త పేరు నాగరాజు) రెండెకరాలకు పట్టాపాసు పుస్తకాలు తీసుకున్నా సాగు చేయడంలేదు. 2018–19లో రూ.ఎనిమిది వేలు, 2019–20లో రూ.పది వేల పెట్టుబడి సాయం మాత్రం తీసుకున్నారు. ఇలాంటి రైతులు పదుల సంఖ్యలో ఉన్నారు. రెవెన్యూ అధికారుల అవినీతితో అక్రమ పట్టాలు పొందిన వీరు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం తీసుకుంటూనే ఉన్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ ఊట్కూరు: తవ్విన కొద్దీ అక్రమాలు.. ఒకదాని తర్వాత మరొకటి.. ఎవరికీ అంతుబట్టకుండా ప్రభుత్వ భూములను కాజేసే కొందరు రెవెన్యూ ఉద్యోగులు.. వారికి సహకరించే మరికొందరు అధికారులు.. ఆలస్యంగా వెలుగుచూస్తున్న అక్రమాలతో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం వార్తల్లోకెక్కింది. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని గుట్టుచప్పుడు కాకుండా వాటిని తమ కుటుంబ సభ్యుల పేతో పట్టాలు చేయడం.. ఇతరులకు అమ్ముకోవడం ఆ మండల రెవెన్యూ అధికారులు కొందరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇదే మండలంలోని దంతన్‌పల్లి, ఊట్కూర్, బాపూర్ శివారులో ఎనిమిది సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న 21.81ఎకరాలను తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో పట్టా చేసిన స్థానిక వీఆర్వో, ముగ్గురు వీఆర్ఏల ఉదంతం వెలుగుచూడక ముందే బాపూర్ శివారులో మరో 75 ఎకరాల ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట పట్టా చేసినట్టు ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఆ మండలంలో ప్రభుత్వ భూ బదలాయింపు 96.81 ఎకరాలకు చేరింది. బాపూర్ శివారులోని సర్వే నం.157, 158, 164, 30లో ఉన్న 150 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో 75 ఎకరాల అన్యాక్రాంతమైందని 2018లోనే ఆ గ్రామస్తులు గుర్తించారు. ఏడాది క్రితం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల జాబితాను గ్రామసభలో చదవి వినిపించడంతో 75 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదే క్రమంలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతర రైతులకు పట్టాలు చేశారని అప్పట్లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ అప్పటి తహసీల్దార్ తిరుపతయ్యను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అయితే నామమాత్రంగా రికార్డులను పరిశీలించిన అధికారులు అక్రమార్కులను కాపాడారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విచారణ అనంతరం గ్రామస్తులు మళ్లీ ఆందోళన చేపడతారనే ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు అక్రమ పట్టాలు పొందిన రైతులకు హద్దులు కేటాయించలేదు. దీంతో పట్టా పాసు పుస్తకాలు తీసుకున్న రైతులు ఆ భూముల్లో సాగు చేయడం లేదు. అయితే పెట్టుబడిసాయం పొందడం గమనార్హం. సర్వే నం.30లోనే అత్యధికంగా సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే.. అందులో 30 నుంచి 40 ఎకరాల వరకు ఇతరుల పేరిట పట్టా అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక సర్వే నం.157, 158 164 లలో మిగిలిన మరో 30 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఆది నుంచి అదే తీరు..! ఊట్కూరు మండలంలో భూ అక్రమాలు కొత్తేమీ కాదు. అధికారుల పర్యవేక్షణ లోపమో.. అవినీతి కారణమో తెలియదు కానీ అక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2009లో నకిలీ పట్టా పాసు పుస్తకాలు తయారు చేసిన ఐదుగురు వీఆర్వోలు వాటిని రైతులకు అమ్మిన విషయం సంచలనం రేపింది. ఈ సంఘటనలో వీఆర్వోలను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు అక్రమ పట్టాలు పొందిన 36 మంది రైతులపై కేసు నమోదు చేశారు. ఈ తతంగంలో సదరు వీఆర్వోలు కొందరు దళారులను నియమించుకుని వ్యవహారమంతా నడిపించారు. అప్పట్లో కలెక్టరేట్ నుంచి కొత్త పాసు పుస్తకాలను తెచ్చి రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి, స్టాంపులు వేసి దళారుల చేతుల మీదుగా బినామీ రైతులకు అందించారు. ఒక పాసు పుస్తకానికి రూ.పది వేల నుంచి రూ.20 వేల వరకు డబ్బులు దండుకుని మండలంలోని పగిడిమారి, మొగ్దూంపూర్, అమీన్పూర్ తదితర గ్రామాల బినామీ రైతులకు అందించారు. నకిలీ పాస్ పుస్తకాలు పొందిన రైతులు మక్తల్ కో–ఆపరేటివ్ బ్యాంకు ద్వారా లక్షలాది రూపాయల రుణాలు పొందారు. అదే సమయంలో విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది మక్తల్ కో–ఆపరేటివ్ సొసైటీకి Ðవెళ్లి బ్యాంకులో బోగస్ పుస్తకాలను పట్టుకుని ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు 2009 ఆగస్టు 26న 36 మంది రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో అప్పటి డిప్యూటీ తహసీల్దార్ ఉండటం గమనార్హం. తాజాగా.. అదే స్థాయిలో ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట పట్టా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండదండలున్నాయనీ.. అందుకే ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట పట్టా చేస్తున్నా.. తమ పై స్థాయి అధికారులకు తప్పుడు నివేదికలు పంపుతూ అక్రమార్కులను కాపాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుత నారాయణపేట కలెక్టర్ హరిచందన దాసరి ఎలా స్పందిస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంటారా? లేదా? అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అనేది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వ భూమిపై సర్వే చేట్టాలి మండలంలోని ఊట్కూర్, దంతన్‌పల్లి, బాపూర్ శివారులో ప్రభుత్వ భూమిని అక్రమంగా కుటుంబ సభ్యులపై పట్టాలు చేసుకున్న రెవెన్యూ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మండలంలోని ప్రభుత్వ భూములపై మళ్లీ సర్వే చేపట్టి అక్రమంగా పట్టాలు చేసుకున్న వారి నుంచి భూమిని స్వా«దీనం చేసుకోవాలి. మిగులు భూమిని నిరుపేద దళితులు, జోగినీలకు పంపిణీ చేయాలి. – హాజమ్మ, ఊట్కూరు బాధ్యులపై చర్య తీసుకోవాలి ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమం అవినీతి అధికారులకు వరంలా మారింది. మండలంలో అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ సిబ్బంది, వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఊట్కూర్, దంతన్‌పల్లి, బాపూర్, పెద్దపొర్ల, చిన్నపొర్ల, మల్లెపల్లి, ఏర్గాట్పల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూమిపై అధికారులు రిటైర్డ్ తహసీల్దార్‌తో దర్యాప్తు చేయించి.. భూమిని స్వా«దీనం చేసుకోవాలి. – సలీం, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట విచారణ చేపడతాం మండలంలో పలు చోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్టు ఫిర్యాదులు అందాయి. వీటన్నింటిపై విచారణ చేపట్టి అక్రమంగా ఇతరుల పేరిట పట్టాలు చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా భూములు పొందిన వారిపైనా చర్యలు తప్పవు. ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట పట్టాలు చేయడం నేరం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులను నివేదిస్తాం. – దానయ్య, తహసీల్దార్, ఊట్కూర్ -
లచ్చలకు లచ్చలు ఇచ్చుడే!
సాక్షి, కరీంనగర్: ‘ఖర్చులకు ఇబ్బందవుతుంది శ్రీధర్.. 200 మంది దాక డబ్బులు ఇయ్యాలె. ప్రాపర్టీ ఉంది. కానీ ఇప్పటికీ లచ్చలకు లచ్చలు ఇచ్చుడైతంది. ఎక్కడి కెళ్లి తేవాలె. డీఎస్పీకి రూ.2 లక్షలు ఇచ్చిన. కరీంనగర్ డీఎస్పీకి రూ.4 లక్షలు ఇచ్చిన. రూరల్ సీఐకి రూ.2 లక్షలిచ్చిన, సీఐడీ డీఎస్పీకి లక్ష... ఈ సీఐకి లక్షన్నర. ఇన్కంటాక్సాయనకు రూ.8 లక్షలిచ్చిన. ఇంక రూ.12 లక్షలు ఇవ్వాలె. రూ.20 లక్షలకు మాట్లాడిన. మన అందరి పేర్లు ఇచ్చిన. నా ఒక్కని కోసమా చేస్తున్నది. అందరి కోసమే కద’ ఫైనాన్సర్‌గా అవతారమెత్తి భూ కబ్జాలు, దౌర్జన్యాలతో కోట్లకు పడగలెత్తి తరువాత పరిణామాల్లో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చి సస్పెండ్ అయిన ఏఎస్సై మోహన్‌రెడ్డి తన సన్నిహితులైన శ్రీధర్‌రెడ్డి, బావమరిది శ్రీపాల్‌రెడ్డితో మాట్లాడిన సంభాషణ ఇది. రికార్డ్ ద్వారా కాకుండా ఒకేదగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు గుట్టుగా రికార్డు చేసినట్లుగా ఉన్న ఈ సంభాషణ ఇటీవల జరిగినదా? పాతదా అనే దాంట్లో స్పష్టత లేదు. సన్నిహితులైన శ్రీధర్‌రెడ్డితోపాటు ‘బావ’ అన్న సంబోధన ఆధారంగా మోహన్‌రెడ్డి బావమరిది శ్రీపాల్‌రెడ్డి కూడా ఈ మీట్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సంభాషణను సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేయడంతో సస్పెండ్ అయిన ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధించిన చర్చ మళ్లీ మొదలైంది. కేసుల్లో శిక్షలు పడకుండా ఏం చేయాలంటే... పోలీసులకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో స్వయంగా తన సన్నిహితులకు చెపుతుండగా రికార్డ్ చేసిన సంభాషణలో మోహన్‌రెడ్డి అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. కేసుల్లో శిక్షలు పడకుండా లాయర్లను పెట్టుకుని ఏం చేయాలి..? ఎవరెవరిని మేనేజ్ చేయాలి? అనే విషయాలను చర్చించినట్లు రికార్డు వింటే అర్థమవుతోంది. 20 కేసుల దాకా ఉన్నప్పుడు 2 లేదా 3 కేసుల్లో శిక్షలు పడడం సహజమని, ఒకసారి శిక్ష పడితే బతికుండుడే వేస్ట్ అని కూడా శ్రీధర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి మాట్లాడుకోవడం వినిపిస్తోంది. కాగా, 20 మంది వరకున్న మోహన్‌రెడ్డి గ్యాంగ్ కేసుల నుంచి బయట పడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవనికి ఎంతిచ్చిన.. ఎక్కడిచ్చిన అనేది తనకే తెలుసని చెప్పిన మోహన్‌రెడ్డి తానెక్కడా సంతకం చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే కేసుల నుంచి బయటపడాలంటే చాలా చేయాల్సి ఉంటదని చెప్పడం గమనార్హం. న్యాయపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ, ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎక్కడో ‘సిట్టింగ్’ లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్ ఆడియో రికార్డు ఆప్షన్ ద్వారా ఎవరో ఈ సంభాషణను రికార్డు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఒకేసారి కాకుండా, రెండు మూడు వేర్వేరు సంభాషణలను మిక్స్ చేసి బయటకు విడుదల చేసినట్లు అనుమానిస్తున్నారు. సన్నిహితులుగా కూర్చొన్నప్పుడు జరిగిన సంభాషణ ఎలా రికార్డ్ అయిందనే విషయంలో స్పష్టత లేదు. సీఐలు, ఎస్సైలు ఎవడూ చెయ్యడు... పెద్దోళ్లతోనే... ఆడియో రికార్డు చివరలో మోహన్‌రెడ్డితో ఆయన బావమరిది, శ్రీధర్‌రెడ్డి కొంత గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దాంతో ‘మనం ఎవలకు భయపడే అవసరం లేదు. గీ సీఐలు, ఎస్సైలు ఎవ్వడు చెయ్యడు. పెద్దాయనకు చెప్పిచ్చిన. పొలిటికల్ పెద్దాయనకు గూడ తెలుసు. అందరూ మనకు సపోట్ జేస్తరు. పెద్ద పెద్ద పనులు చేపిచ్చుకుందాం. మినిమం రూ.పది లక్షలు. అసొంటి పనైతె తే...’ అలా సంభాషణ సాగింది. కాగా ఇప్పటికీ తన కేసుల నుంచి బయట పడడానికి పోలీస్ అధికారులు, రాజకీయ ప్రముఖులతో మోహన్‌రెడ్డి టచ్‌లోనే ఉన్నాడనే అనుమానాలు ఈ సంభాషణలు వింటే కలుగక మానవు. కాగా సంభాషణ ఆఖరులో ‘ఎన్ని ప్రాబ్లంలు ఎదురైన మనం చేసింది న్యాయం ... ధర్మం’ అనడమే కొసమెరుపు. -
‘కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలనే పోటీ చేస్తున్న’
సాక్షి, సూర్యాపేట: భూమాఫియా దురాగతాల నుంచి తమను కాపాడలంటూ లక్ష్మీ నర్సమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మీ నరసమ్మ సోమవారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. దానిలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆ వివరాలు.. 85 ఏళ్ల వయసులో గెలుస్తాననో.. గెలవాలనో ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ప్రచారం చేసే ఉద్దేశం కూడా లేదని తెలిపారు లక్ష్మీ నర్సమ్మ. పోటీ చేయడానికి దారి తీసిన పరిస్థితులను, తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వానికి, ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఎంతో విలువైన భూమి ఉందని.. కానీ తాను, తన పిల్లలు పేదరికంలోనే మగ్గుతున్నామని తెలిపారు లక్ష్మీ నర్సమ్మ. మొత్తం 179 ఎకరాల భూమి.. తమది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం గ్రామం అని తెలిపారు. 1940-50 మధ్య కాలంలో తన భర్త అచ్యుత రామశ్యాస్త్రి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారని.. జైలుకు కూడా వెళ్లారని తెలిపారు. ఆ కాలంలో గ్రామంలో తమకు సర్వే నంబర్ 488లో 179 ఎకరాల భూమి ఉండేదన్నారు. అంతేకాక సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు తన భర్త స్వయంగా 79 ఏకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. తమకు 13 మంది సంతానం అని.. ఉన్న వంద ఎకరాల భూమిని కుమారులకు సమంగా పంచి.. 30 ఏళ్ల క్రితం తన భర్త మరణించాడని పేర్కొన్నారు. ఈ భూమికి పట్టాలు ఉన్నాయని తెలిపారు. తమ భూమి పరిసర ప్రాంతంలో పులిచింతల ప్రాజెక్ట్ రావడంతో భూమికి డిమాండ్ పెరిగిందని దాంతో భూమాఫియా కన్ను తమ భూమి మీద పడిందన్నారు లక్ష్మీ నర్సమ్మ. భూమాఫియా బెదిరింపులు.. భూమాఫియాకు జడిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితులు, గిరిజనులకు భూమి పథకంలో భాగంగా తమ భూమిని విక్రయించేందుకు నిర్ణయించామన్నారు. ఇందుకు అప్పటి జిల్లా కలెక్టర్ కూడా అంగీకరించారన్నారు. కానీ భూమాఫియా దళితులకు భూమి అమ్మడానికి వీలు లేదని.. తమకే అమ్మాలని.. అది కూడా అతి తక్కువ ధరకే అమ్మాలని తమను బెదిరిస్తున్నారని లక్ష్మీ నర్సమ్మ వాపోయారు. ఈ క్రమంలో తమ కుమారులపై దాడి కూడా చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు కూడా దాడి చేయండి అని సలహా ఇచ్చారన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కలెక్టర్, డీజీపీ, ఎస్పీ స్థాయి అధికారులతో పాటు తహశీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేశామని.. ఫలితం లేదని వాపోయారు. తనకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేశారని లక్ష్మీనర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలనే.. దాంతో ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు లక్ష్మీనర్సమ్మ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పైగా తమ కుటుంబంలోని 10 మంది ప్రభుత్వం ప్రవేశ పట్టిన రైతుబంధు పథకం లబ్ధిదారులే అన్నారు. ఇందుకు కేసీఆర్‌కు సర్వదా రుణపడి ఉంటామని తెలిపారు. ఇప్పుడు తాను చేసే ఈ చిరు ప్రయత్నం ద్వారా సమస్య పరిష్కారం అయ్యి.. తన కుమారులైన బాగా బతకాలని ఓ తల్లిగా ఆరాట పడుతున్నానని.. ఇందులో స్వార్థం లేదని అర్థం చేసుకోవాలని లక్ష్మీ నర్సమ్మ విజ్ఞప్తి చేశారు. -
కబ్జాలకు ‘ఖద్దరు’ నీడ
సాక్షి, ఆసిఫాబాద్: రాజకీయ అండతో సర్‌సిల్క్ భూముల్లో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సర్‌సిల్క్ మిల్లులో పనిచేయని కార్మికేతరులు దర్జాగా కబ్జాలు చేస్తున్నారు. చట్టబద్దంగా భూములు కొనుగోలు చేసిన వారిని బెదిరించడం పరి పాటిగా మారింది. కాగజ్‌నగర్ పట్టణానికి ఆనుకుని కోసిని గ్రామ పరిధి సర్‌సిల్క్ మిల్లు భూ ములను చట్టబద్దంగా కొనుగోలు చేసిన చోట్ల ఆక్రమణలు చేయడమే కాక ఖాళీ చేయడానికి స సేమిరా అంటున్నారు. స్థానికంగా ఉన్న నాయకులను కబ్జాదారులు వాడుకోవడం గమనా ర్హం. ఇప్పటికే ఓ ప్రజాప్రతినిధి కబ్జాదారులకు అండగా ఉండగా, ఆయన సన్నిహితులు, అనుచరులు, సమీప బంధువులు యథేచ్ఛగా మిల్లు భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించారు. అలాగే కబ్జాల్లో ఉన్న భూములు తమ సొంత భూములగా పేర్కొం టూ ఇతరులకు విక్రయించడం విశేషం. ఇటీవల దాడా నగర్లో అధికారులు అక్రమ నిర్మాణంగా పరిగణిస్తూ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. తనకు వాటా ఇవ్వలేదని.. కాగజ్‌నగర్ పట్టణంలో నాలుగు దశాబ్దాల క్రితం సర్‌సిల్క్ మిల్లు ఓ వెలుగు వెలిగింది. మిల్లు మూత పడిన తర్వాత భూములు రానురానూ కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుపోయాయి. ఇందులో కొందరు బలహీనవర్గాలు ఉండగా అధికంగా ఓ ప్రజాప్రతినిధి సన్నిహితులు, అనుచరులు ఉండడం గమనార్హం. తాను అడిగిన రోడ్డు పక్కన ఉన్న పదెకరాల భూమి దక్కకపోవడంతో తెర వెనక ఉండి తతాంగం నడిపిస్తున్నారు. మొత్తం భూములను చట్టబద్దంగా కొనుగోలు చేసిన వ్యక్తులకు చెందకుండా అడ్డు తగులుతున్నారు. ఈ మేరకు భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తం 808 ఎకరాలు.. సర్‌సిల్క్ భూములు మొత్తం 808 ఎకరాల వరకూ ఉంది. ఇందులో 1985లో మిల్లు మూత పడే నాటికే కొంత ఆక్రమణకు గురైంది. ఆ తర్వాత 1991లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అధికారికంగా లిక్విడేటర్‌ను నియమించి మిల్లు ఆస్తులను, అప్పులను లెక్కగట్టి యాక్షన్‌కు పిలిచింది. ఈ యాక్షన్‌లో మొత్తం 14 బిడ్డింగ్ వేయగా ఇందులో మూడో బిడ్ వేసిన బి. వెంకట నారాయణరావు రూ.3 కోట్లతో అధిక భాగం 182 ఎకరాలు యాక్షన్ చేశారు. ఇందులో 156 ఎకరాలు అధికారికంగా ఇచ్చారు. అయితే అప్పటికే యాక్షన్‌లో కొనుగోలు చేసిన భూమి కొంత ఆక్రమణ గురవడం, నిర్మాణాలు చేపట్టడంతో వీటన్నింటిని ఖాళీ చేయించి కొనుగోలు చేసిన భూమి మొత్తం ఇప్పిస్తామని యాక్షన్ సమయంలో చెప్పారు. అప్పటి నుంచి రానురానూ స్థానిక నాయకుల అండతో కొంత మంది ఏకంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం, కబ్జాలు పెరిగిపోయాయి. దీంతో 2011లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమికి హద్దులు చూపించాల్సి ఉంది. అయినా ఇప్పటికీ హద్దులు నిర్ణయించేలా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదు. దీనిపై జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ అందరి అధికారులను కలసి వినతిపత్రాలు అందించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఇక చేసేదేమీ లేక మళ్లీ కోర్టునే ఆశ్రయించడంతో ఇటీవల కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు అడుగు ముందుకేశారు. అయితే అధికారులు అక్రమ కట్టడాలను తొలగించేందుకు పూనుకుంటున్న సందర్భంలో అక్కడి నాయకులు అడ్డుతగలడంతో భూమి హద్దులు తేల్చడంలో జాప్యం చేస్తున్నారు. 2014లో సర్వే చేసేందుకు రూ.14లక్షలు చెల్లించినప్పటకీ అక్కడి స్థానిక నాయకుడికి భయపడి సర్వే అధికారులు సైతం వెనకడుగు వేస్తున్నట్లు వెంకట నారాయణరావు వాపోతున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని వదలనని పేర్కొంటు న్నారు. రాజకీయ అండతో అన్యాక్రాంతం చేయాలని ఓ ప్రజాప్రతినిధి కక్షగట్టారని వివరిస్తున్నారు. ఇటీవల హైకోర్టు నుంచి కూడా యాక్షన్‌లో కొనుగోలు చేసిన వారికి భూమి సరిహద్దులు చూపి ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. -
మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!
సాక్షి, ఒంగోలు : మేం చెప్పినట్లు చేయాల్సిందే.. మాట వినకపోతే శాల్తీ గల్లంతే.. రెవెన్యూ రికార్డులు మా పేర్ల మీద మార్చండి.. లేదంటే మీ అంతు చూస్తాం.. అంటూ మండల మెజిస్ట్రేట్‌పై కబ్జాదారులు బెదిరింపులకు దిగారు.. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడింది అధికార పార్టీ నేతలో, వారి అనుయాయులో కాదు.. గత ఐదేళ్లలో ప్రభుత్వ భూములను ఆక్రమించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల లోన్లు తీసుకుని అధికారిక దందా నడిపిన టీడీపీ నేతలు. అధికారం కోల్పోయినా వీరి తీరు మాత్రం మారలేదనడానికి లింగసముద్రం మండలంలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు అధికంగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని 40 రెవెన్యూ బృందాలతో సర్వే మొదలు పెట్టారు. సర్వేలో టీడీపీ నేతల కబ్జా పర్వం బయటపడుతుండటంతో రికార్డులు మార్చాలంటూ తహసీల్దార్‌పై బెదిరింపులకు దిగారు. వారి హెచ్చరికలతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనను బదిలీ చేయాలంటూ ఆర్డీఓ, కలెక్టర్‌కు విన్నవించారు. కబ్జాదారులు తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ బహిరంగ సమావేశంలోనే తహసీల్దార్ వాపోయారంటే టీడీపీ నేతలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ నేతలు ప్రకాశం జిల్లా, లింగసముద్రం మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారుల ద్వారా ఆన్లైన్ చేయించేశారు. అంతటితో ఆగకుండా ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు లోన్లు పొందారు. పెదపవని గ్రామంలో టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న ఓ మాజీ వీఆర్ఓ ఒక్కడే 17 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారనేది బహిరంగ రహస్యమే. ఐదేళ్లలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టారంటే టీడీపీ నేతలు ఏస్థాయి దందాకు పాల్పడ్డారో అర్థమౌతుంది. ముఖ్యంగా మండలంలోని పెదపవని, తిమ్మారెడ్డిపాలెం, మొగిలిచర్ల, లింగసముద్రం, మాలకొండరాయునిపాలెం గ్రామాల్లో వాగు, కుంట, కాలువ, గయాలు, ఏడబ్ల్యూ, పశువుల మేత పోరంబోకులు, శ్మశానాలను సైతం వదలకుండా కబ్జా చేసేశారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటపడినప్పటికీ కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుని వదిలేశారు. ప్రభుత్వ భూములను భారీగా ఆక్రమించిన టీడీపీ నేతల జోలికి మాత్రం వెళ్లని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోనే ఉండిపోయాయి. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ సర్వేలో భాగంగా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కువగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని సర్వే మొదలు పెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 40 రెవెన్యూ బృందాలను మండలంలో మోహరింపజేయడంతోపాటు కలెక్టర్ స్వయంగా అక్కడకు వెళ్లి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. కబ్జా భాగోతాలు బయటకు రావడంతో తహసీల్దార్‌పై బెదిరింపుల పర్వం: రెవెన్యూ బృందాల పరిశీలనలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. జిల్లా కలెక్టర పర్యవేక్షణలో సర్వే జరుగుతుండటంతో ఇక తమను కాపాడేవారు లేరని భావించిన టీడీపీ నేతలు కొందరు రెవెన్యూ రికార్డులు మార్చి తమ పేర్లు చేర్చాలంటూ తహసీల్దార్ రాఘవస్వామిపై బెదిరింపులకు దిగారు. చెప్పినట్లు వినకపోతే శాల్తీ గల్లంతేనంటూ హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనకు కబ్జా దారుల నుంచి ప్రాణహాని ఉందని, తనను బదిలీ చేయాలంటూ కందుకూరు ఆర్డీవో ఓబులేసు, కలెక్టర్ పోల భాస్కర్ల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను బెదిరించిన వారి పేర్లు చెప్పేందుకు కూడా ఆయన బయపడుతున్న పరిస్థితి. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదంటే టీడీపీ నేతలు తహసీల్దార్‌ను ఏస్థాయిలో బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని జిల్లాలో మరో ఘటన జరగకుండా అక్రమార్కులకు హెచ్చరిక పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రభుత్వ భూములపై కన్నేసిన ల్యాండ్ మాఫియా
-
హథీరాంజీ మఠంలో మాఫియా
సాక్షి, తిరుపతి: వందల కోట్ల విలువైన హథీరాంజీమఠం భూముల్లో భూమాఫియా తిష్టవేసింది. దొంగ పత్రాలు సృష్టించింది. కాసులతో రిజిస్ట్రేషన్ అధికారుల కళ్లకు గంతలు కట్టి దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి మఠం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. గత ప్రభుత్వంలో ఈ పచ్చ భూమాఫియా స్వాహా చేసిన మఠం భూముల విలువ రూ.100 కోట్లకు పైమాటే. కలెక్టర్ కన్నెర్ర..తహసీల్దార్ చిత్తశుద్ధి మఠం భూముల్లో భూమాఫియా ప్రవేశంతో అవిలా ల, ఉప్పరపల్లి, మల్లంగుంట ప్రాంతాల్లో రోజు ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గతంలో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఇటీవల ఈ ఘర్షణలు పెరిగిపోవడంతో ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు సైతం నమోదయ్యాయి. మఠం భూముల్లో జరుగుతున్న భూమాఫి యాపై కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త దృష్టి సారించారు. రి కార్డులు, కోర్టు కేసులను పరిశీలించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించా రు. మఠం భూముల్లో ఆక్రమణలను తొలగించాలని తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, రూరల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో అవిలాల లెక్కదాఖల సర్వే నెంబర్ 13లోని 107 ఎకరాల మఠం భూముల ప్రక్షాళనకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. తహసీల్దార్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు రెండు రోజులుగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. 254 ప్లాట్లలో ఆక్రమణల తొలగింపు తహసీల్దార్ కిరణ్‌కుమార్, వెస్ట్ డీఎస్పీ నరసప్ప ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు 10 జేసీబీలతో సర్వే నెంబర్ 13లో ఆక్రమణలను ఆదివారం ఉదయం నుంచే తొలగించటం ప్రారంభించారు. వందల అంకణాలను ఆక్రమించి, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి అందులో చిన్న షెడ్డు వేయడం, దానికి కరెంటు కనెక్షన్ తీసుకోవడం, ఎన్నో ఏళ్లుగా ఇళ్లు ఉన్నట్లు మస్కా కొట్టి కబ్జారాయుళ్లు మఠం భూములను మింగేస్తూ వచ్చారు. వారి ఆటలు ప్రస్తుత రెవెన్యూ, పోలీస్ అధికారుల ముందు పారలేదు. జేసీబీలతో సాయంత్రం వరకు 254 ప్లాట్లలోని ఆక్రమణలను తొలగించారు. అధికారుల ముక్కుసూటితనంలో కబ్జారాయుళ్లు, వారికి సహకరించిన రిజిస్ట్రేషన్, పంచాయతీ, విద్యుత్ శాఖాధికారులు వణికిపోతున్నారు. మఠం భూముల్లో భూ క్రయవిక్రయాలు చేసిన వారిపై పీడీ యాక్టుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. నీటి కనెక్షన్లు ఇచ్చి, ఇంటి పన్నులు వేసిన పంచాయతీ అధికారులు, కరెంటు కనెక్షన్లు ఇచ్చిన విద్యుత్ అధికారులు, నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ల మెడకు ఉచ్చు బిగుస్తోంది. మఠం పేదలకు తప్పక న్యాయం చేస్తాం: చెవిరెడ్డి మఠం భూముల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపులో పేదలకు అన్యా యం జరిగి ఉంటే తప్పక న్యాయం చేస్తామని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. భూ ఆక్రమణదారుల నుంచి తెలియక మఠం స్థలాలను కొని, నష్టపోయిన పేదల కోసం 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ అధికారులతో కలిసి తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము కొన్న స్థలాలకు సంబంధించిన ఏదైనా అగ్రిమెంట్/రిజిస్ట్రేషన్/పత్రాలు ఉంటే తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. స్థలాలు కొల్పోయిన నిరుపేదలను గుర్తించి వారందరికి ఇంటి స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. పేదలను మోసగించి మఠం భూములను అంటకట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని, కాపురం ఉంటున్న పేదల ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావని, వాటి రక్షణ తన బాధ్యత అని భరోసా కల్పించారు. ఇళ్లు కూలుస్తారని పేదలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. -
కబ్జా కోరల్లో క్వార్టర్స్ భూములు
సాక్షి, మాడుగులపల్లి (నల్లగొండ) : అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ క్వార్టర్స్ కబ్జాకు గురవుతున్నాయి. దాదాపు పాతికేళ్ల కిత్రం ప్రభుత్వం కట్టించిన క్వార్టర్స్ భూములు, భవనాలను భూకబ్జదారులు ఆక్రమించుకుంటున్నారు. నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్‌ను పూర్తి స్థాయిలో కబ్జా చేసేందుకు కొంత మంది పావులు కదుపుతున్నారు. ఇది మాడ్గులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ఎస్ఎల్బీసీ క్వార్టర్స్‌కు రక్షణ కరువైంది. వివరాల్లోకి వెళితే 1984 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నక్కలగండి రిజర్వార్ ద్వారా చెరువులు, కుంటలు, నల్లగొండలోని ఉదయ సముద్రం నింపెందుకు ప్రణాళికలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా వెనుకబడటంతో కుక్కడం,తిప్పర్తి గ్రామాల్లో చెరువులను,కాలవలను అధికారులు పర్యవేక్షించేందుకు కూలీల కోసం అయా గ్రామాల్లో ప్రభుత్వం కొంత భూమిని తీసుకుని ఎస్ఎల్బీసీ క్వార్టర్స్ పేరుతో భవనాలను నిర్మించింది. కుక్కడం గ్రామంలో సర్వే నంబర్ 145,146 సుమారు 6 ఎకరాల భూమిని తీసుకొని క్వార్టర్స్ నిర్మాణం చేసింది. కొన్నేళ్ల వరకు పనులు జరిగిన తర్వాత క్వార్టర్స్‌ను అధికారులు వదిలి వెళ్లారు. కాలక్రమంలో ఈ క్వార్టర్స్‌ను గ్రామ పంచాయతీ సిబ్బంది వాడుకున్నారు.ఇటీవల కాలంలో గ్రామానికి చెందిన కొంత మంది అ క్వార్టర్స్ భూముల్లో గడ్డివాములు, ముగజీవాలకు నిలపడం, వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లును సైతం నిలుపుతూ హద్దులను పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. గత సంవత్సరం అధికారులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ప్రస్తుతం అక్కడ అవి కనిపించడం లేదు. అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఇస్తే ప్రయోజనం కుక్కడంలో ఎస్ఎల్బీసీ క్వార్టర్స్ భూములు ప్రస్తుతం నిరుపయోంగా ఉన్నాయి. అవి ఆక్రమణకు గురికాకముందే ప్రభుత్వం ఆదీనంలోకి తీసుకొని పేదలు ఎక్కువగా ఉన్నటువంటి కుక్కడం గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల స్థలాలకు కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇళ్లు ఇవ్వకపోయిన స్థలం ఇచ్చిన అందులో ఇల్లు కట్టుకునేందుకు ఇవ్వాలనీ కోరుతున్నారు. క్వార్టర్స్ ఆస్తులు రక్షించాలి కుక్కడం గ్రామంలో సుమారు 6ఎకరాల ప్రభుత్వ క్వార్టర్స్ భుములు ఉన్నాయి.ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారాయి. కొంత ఇప్పటికే అందులో గడ్డివాములు,తదితర సామగ్రిని నిలిపారు.కొంత మంది హద్దులు పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ క్వార్టర్స్ భూములు రక్షించాలి. – ఊరిబిండి శ్రీనివాస్, కుక్కడం మా దృష్టికి రాలేదు కుక్కడం గ్రామంలో ఎస్ఎల్బీఈ క్వార్టర్స్ భూములు కబ్జాకు గురవుతున్నాయనన్న విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. కుక్కడంలో గ్రామంలో క్వార్టర్స్‌ను భూములు పరిశీలించి అధికారులతో సర్వే చేయించి ,ఎవరైన ఆక్రమించుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్ , తహసీల్దార్ మాడ్గులపల్లి -
‘పోడు’ బినామీలు
సాక్షి, ఆసిఫాబాద్: గిరిజనుల మాటున బడా బాబులు ‘పోడు’దందా సాగిస్తున్నారు. అనాది నుంచి ఆదివాసీలు అడవిని ఆధారం చేసుకుని సంప్రదాయ పోడు సాగు చేస్తున్నంత కాలం అటవీ ఆక్రమణలు పెరగలేదు. ఎప్పుడైతే అటవీ అధికారులపై గిరిజనేతర, స్థానిక లీడర్ల పెత్తనం మొదలైందో అప్పటి నుంచి అక్రమ కలప రవాణా, భూకబ్జాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో పెద్ద ఎత్తున పచ్చని అడవిని నరికి సుదూర ప్రాంతాలకు అక్రమంగా కలప రవాణా సాగించి కోట్లు గడించిన వారున్నారు. గత కొంత కాలంగా కలప రవాణా కాస్త తగ్గుముఖం పట్టడంతో అక్రమార్కుల కన్ను అటవీ భూములపై పడింది. కబ్జాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున అటవీ భూములు సాగు చేస్తూ గిరిజనుల ముసుగులో అటవీ హక్కు పత్రాలకు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి మండలానికో నేత.. జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలంలో ఒక్కో నేత స్థానికంగా ఉన్న పలుకుడిని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున అటవీ భూములను చెరపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అటవీ అధికారులు ఈ కబ్జాల వివరాలు సేకరిస్తున్నారు. కాగజ్‌నగర్ మండలం సార్సాల ఘటనలో ఇదే తీరుగా పెద్ద మొత్తంలో భూ కబ్జాలకు పాల్పడడంతోనే చినికి చినికి గాలివానలా మారి దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఇందులో చిన్న చిన్న రైతుల కంటే పెద్ద తలల చేతిలోనే ఎక్కువ భూమి కబ్జాలో ఉన్నట్లు తేలింది. ఇక ఇదే మండలంలో పట్టణంలో ఉండే అనేక మంది పెద్ద ఎత్తున అటవీ భూములను సాగు చేస్తున్నవారు. తమ అవసరాల కోసం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఏటా పోడు సాగు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. రేగులగూడ, ఊట్పల్లి లాంటి గిరిజన గూడెల్లో ఎకరాకు అతి తక్కువగా ముట్టుజెప్పి గిరిజన భూములను సాగు చేస్తూ కొంత మంది వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. ఇక ఆసిఫాబాద్ మండలం మోవాడ్, సిరియన్ మోవాడ్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు కౌలు పేరిట తీసుకుని లబ్ధి పొందుతున్నారు. కెరమెరి మండలంలో ఓ నేత వందల ఎకరాల్లో అనేక గ్రామాల్లో ఏజెన్సీ భూములను చెరపట్టి రెవెన్యూ భూములుగా మార్చేపనిలో ఉన్నారు. కుమురం భీం ప్రాజెక్టు ముంపు ప్రాంతంతో పాటు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూములను తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇప్పటికే బదాలింపు చేయించారు. ఇందుకోసం స్థానిక రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతో పెద్ద మొత్తంలో అటవీ భూమి పట్టాలుగా మారింది. జైనూర్ మండల కేంద్రానికి చెందిన కొంత మంది వడ్డీ వ్యాపారులు తమ అప్పుల కింద భూములను తాకట్టు పెడుతున్నారు. వాంకిడిలో కొంత మంది వ్యాపారులు పెద్ద ఎత్తున వివాదాస్పద భూములు కొనుగోలు చేస్తున్నారు. వీటిపై పంట రుణాలు పొందడంతో పాటు పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందించడం మొదలైనప్పటి నుంచి పోడుకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ మరింత పెరిగిపోయింది. బెజ్జూరు లాంటి ప్రాంతంలోనూ గిరిజనేతరులు కొద్ది మంది పది ఎకరాల కంటే అధికంగా సాగు చేస్తున్నవారు ఉన్నారు. ఇలా అమాయక గిరిజనుల జీవనోపాధి కోసం మొదలైన పోడు రానురానూ ఓ వ్యాపారంగా మారుతోంది. మరోవైపు రెవెన్యూ, అటవీ సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేందుకు సైతం కొంతమంది సమగ్ర భూ సర్వేలో పట్టాపాస్ పుస్తకాలు పొందేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి మరీ తమ పేరున దరఖాస్తులు చేసుకుంటున్నారు. అమాయక గిరిజన రైతుల బలి.. బడా బాబులు అమాయక రైతుల ముసుగులో వందల ఎకరాలు కబ్జాలు చేస్తుండడంతో స్థానికంగా పోడు భూములపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి అన్యాయం జరిగిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ముందుగా గిరిజనేతరుల కబ్జాలో ఉన్న అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేస్తోంది. ఎవరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయో వివరాలు సేకరిస్తోంది. అయితే కేవలం పోడు భూములపైనే పొట్టపోసుకునే అనేక మందికి తమ భూములు కూడా ఎక్కడ పోతాయోనని జిల్లాలో జరుగుతున్న వరస ఘటనలతో భయాందోళన మొదలవుతుంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీ పెంపకంలో భాగంగా కాగజ్‌నగర్, పెంచికల్పేట్, బెజ్జూరు, చింతలమానెపల్లిలో మొక్కలు నాటే పనిలో అటవీ అధికారులు ఉన్నారు. దీంతో చిన్న చిన్న రైతులు ఎకరం నుంచి మొదలై ఐదేకరాల లోపు ఉన్న వారు పోడు జీవనంగా బతికే వారికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోడుపై స్పష్టమైన విధానం ప్రకటించి అర్హులను గుర్తించి న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. -
శిఖం చుట్టు కుట్ర
సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మోతె చెరువు శిఖం, ఎఫ్టీఎల్ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. పదేళ్ల క్రితం వరకు నిండుకుండలా, వెడల్పాటి కాలువలతో చూడముచ్చటగా ఉన్న ఈ చెరువు క్రమంగా ఆనవాళ్లు కోల్పోతోంది. పెద్దకాలువలు పిల్లకాలువల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. కబ్జాలతో చెరువులో నీటి నిలువసామర్థ్యం తగ్గుతోంది. ఒకప్పుడు 8వేల ఎకరాలకు సాగునీరందించిన చెరువు ప్రస్తుతం 3వేల ఎకరాలకు నీరందించలేదని దైన్యస్థితికి చేరింది. అంతేకాదు.. జగిత్యాల మండ ల పరిధిలోని ముప్పాల, తిమ్మాపూర్, జాబితాపూర్, పొలాస తాళ్ల చెరువులకు ఏకైక నీటి వనరు ఈ చెరువే. చెరువు భూముల్లో కొనసాగుతున్న కబ్జాలతో భవిష్యత్‌లో నీరందించడం అనుమానమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటికే మూడు వందలకు పైగా ఇండ్ల నిర్మాణాలు చెరువును కప్పేశాయి. వాగుతో పాటు ముంపు ప్రాంతాలూ కబ్జా మోతె చెరువుకు ప్రవాహం వచ్చే వాగు అంతర్గాం శివారు నుంచి ధరూర్, నర్సింగాపూర్ మీదుగా మోతెచెరువులో కలుస్తుంది. ఈ ప్రాంతాలను కూడా ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి వాగుతో పాటు ముంపు ప్రాంతాలను చదునుచేశారు. దీంతో వర్షాకాలంలో నీరు వాగునుంచి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో పాటు చెరువు నీటిమట్టం తగ్గడంతో ముంపు ప్రాంతాల్లో ఉన్న భూముల్లో రియల్ఎస్టేట్ వ్యాపారులు చదునుచేసి ప్లాట్లు సిద్ధంచేశారు. కబ్జా వంద ఎకరాలపైనే... మోతె గ్రామంతో పాటు మున్సిపల్ పరిధిలోని 10, 16 వార్డులకు ఆనుకుని చెరువు ఉంది. సర్వే నంబరు 406లో ఉన్న చెరువు మొత్తం విస్తీర్ణం 90.23 ఎకరాలు. గత పదేళ్లకాలంలో 40ఎకరాలు కబ్జాకు గురైంది. ప్రస్తుతం 50ఎకరాలకు మించి చెరువు విస్తీర్ణంలేదు. 269 నుంచి 319 సర్వే నంబర్లకు వరకు 790 ఎకరాల శిఖం భూమి, మరో 50ఎకరాల్లో ఎఫ్టీఎల్ (ఫుల్ బ్యాంక్ లెవల్) భూములున్నాయి. ఇందులో 50 ఎకరాల శిఖం, 20 ఎకరాల ఎఫ్టీఎల్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఆక్రమిత భూముల్లో 300లకు పైగా నివాస గృహాల నిర్మాణాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా జిల్లా ఏర్పాటుకు ముందు అప్పటి సబ్‌కలెక్టర్ శశాంక ఈ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. శిఖం భూముల్లోని అక్రమాణాలను తొలగించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఆయన బదిలీ అయ్యారు. దీంతో అప్పటి వరకు వేచి ఉన్న ఆక్రమణాదారులు శశాంక బదిలీ అయిన వెంటనే మళ్లీ ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలు ప్రారంభించారు. కనీసం ఇప్పటికైనా అధికారులు సంప్రదించి చెరువు భూములను స్వాదీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతోనే... జిల్లా ఏర్పాటు ప్రకటనతోనే జగిత్యాల, పరిసర ప్రాంతాల్లో భూములకు భలే డిమాండ్ పెరిగింది. భూముల ధరలు ఒకేసారి 10 రేట్లు పెరిగాయి. దీంతో సామాన్యులు భూములు కొనలేని స్థితిలో చేరుకున్నారు. ఇదే క్రమంలో చెరువులు, కుంటలపై కన్నేసిన పలువురు వాటిని కబ్జా చేయడం మొదలుపెట్టారు. కబ్జాల పరంపర గత ఐదేళ్లలో నుంచే ఎక్కువైంది. ఇదే క్రమంలో పలువురు చెరువు భూములు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. సీఎం ఆదేశాలు బేఖాతరు చెరువులు, వాటి భూముల ఆక్రమణల అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యల విషయంలో రాజీపడొద్దని, ఆక్రమిత చెరువు భూములను స్వాధీనం చేసుకుని పునరుద్ధరించాలని గతంలో కలెక్టర్ల సదస్సులో సూచించారు. అయినా జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న పెద్ద చెరువే కబ్జా కోరల్లో చిక్కుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపడుతుంటే మరో పక్క క్షేత్రస్థాయిలో చెరువుల కబ్జా పరంపర కొనసాగుతుండటం గమనార్హం. చెరువును కాపాడాలి మోతె గ్రామ జగిత్యాల పట్టణానికి ఆనుకునే ఉంది. అయినా మోతె చెరువు భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. కాలువలు సైతం కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుంట్నురు. దీంతో నీరుపారని పరిస్థితి ఉంది. చెరువు భూములు కబ్జాపై అప్పటి సబ్‌కలెక్టర్ శశాంక స్పందించి ఆక్రమణలను తొలగించారు. ఆయన బదిలీ తర్వాత మళ్లీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోతె చెరువు, దాని పరిధిలోన భూములను కాపాడాలి. – మునీందర్‌రెడ్డి, రైతు, తిమ్మాపూర్ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తాం మోతె చెరువు పరిధి భూములను ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో జాయింట్‌గా సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటుచేస్తాం. ఎవరైనా ఆక్రమించినట్లుగా గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో, జగిత్యాల అర్బన్ -
కాలు వలవల
అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తుండడంతో నీళ్లు పారడానికి నిర్మించిన కాలువలు కన్నీరు పెడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు భూములను ఆక్రమించారు. చెరువులనూ ఆక్రమించారు. నాలాలనూ వదలలేదు. ఇప్పుడు అక్రమార్కుల కన్ను కాలువలపై పడింది. మట్టి తెచ్చి కాలువలను ‘మటుమాయం’ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు ఇప్పుడు మట్టిగుట్టలతో దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాలు వచ్చి వరదలు వస్తే నీళ్లు పారేందుకు కాలువ లేక తీవ్రమైన ఇబ్బందులు రానున్నాయి. అయినా అధికారులకు చీమ కుట్టినట్టుగా లేదు. పటాన్చెరు: పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్ మండలాల పరిధిలో చెరువుల కాలువలు, వాగులను వదిలిపెట్టకుండా జోరుగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. కాలువలను పూడ్చివేస్తే భవిష్యత్‌లో తలెత్తే ప్రమాదాన్ని ఎవరూ గుర్తించడం లేదు. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు కాలువల ఆవశ్యకత ఏంఓట స్పష్టమవుతుంది. కాలువలు పూడ్చి కాలనీలు ఏర్పడుతున్నాయి. ఆ కాలువల ప్రాముఖ్యతను గుర్తించి కాలనీల ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయ లోపం కారణంగా కాలువలు కబ్జారాయుళ్ల పరమవుతున్నాయి. అమీన్పూర్ పెద్ద చెరువు నుంచి బందంకొమ్ము చెరువుకు నీళ్లు వదలాలని జిల్లా అధికారులు ఇటీవల సూచించారు. అయితే మధ్యలో ఉన్న వెంచర్ నిర్వాహకులు, కాలనీల్లో కాల్వలను పూడ్చివేశారు. స్థానిక అధికారులు ఆ కాల్వలను పునరుద్ధరించి నీళ్లను వదలాల్సిన పరిస్థితి ఎదురైంది. అమీన్పూర్ మండలంలోని సుల్తాన్‌పూర్‌లో ఓ వెంచర్ నిర్వాహకుడు దర్జాగా కాలువలపై చిన్న సైజులో పైపులు వేసి కాలువ రూపురేఖలను మార్చివేశారు. అలాగే అమీన్‌పూర్‌లోనే శివసాయినగర్ కాలనీలో మరో వెంచర్ యజమాని కాల్వను పూడ్చివేసి రోడ్లు వేశారు. అలాగే బీరంగూడ రామచంద్రాపురం శివారు ప్రాంతంలో చిన్న వాగును పూడ్చివేసి ప్లాట్లుగా మార్చారు. అక్కడ అతి వేగంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదేమంటే తమ పంట పొలాలు ఉండేవని వాటిని అమ్ముకుంటున్నామని స్థానిక రైతులు వాదిస్తున్నారు. గతంలోనే చిన్నవాగు పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ వంటి నిబంధనలేవి పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారు. కానుకుంట నుంచి బీరంగూడ వరకు కాల్వ సైజు బాగా తగ్గిపోయింది. దాంతో వరద వచ్చినప్పుడల్లా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం ప్రతి వానాకాలంలో జరుగుతోంది. తాజాగా జరుగుతున్న కబ్జాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. ముత్తంగి, చిట్కుల్ శివారులో నక్కవాగును దర్జాగా పూడ్చేస్తున్నారు. అక్కడ ఓ వెంచర్ నిర్వాహకులు కాలువ దిశనే మార్చి రాత్రింబవళ్లు యంత్రాలతో దాన్ని పూడ్చే పనిలో పడ్డారు. అక్కడ ఓ వంతెనను నిర్మిస్తున్నారు. కాలువ దిశను మారుస్తూ వంతెన నిర్మాణం చేపడుతున్నారు. కాలువలకు ఇరువైపులా తొమ్మిది మీటర్ల దూరం బఫర్ జోన్ వదిలి నిర్మాణాలు చేసుకోవాలనే నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. బఫర్ జోన్‌ను యథేచ్చగా తమ ఇష్టానుసారం వాడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో గజం జాగా విలువ వేలల్లో ఉండడంతో కాలువ ప్రాంతాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఆ తంతంగాన్ని ఆపాలని స్థానికులు కోరుతున్నారు. కాలువల పరిరక్షణపై అధికారులు సరైన విధంగా స్పందించడం లేదు. కాలువల రక్షణ బాధ్యత తమది కాదనే ధోరణితో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయమై ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ బి.రమణారెడ్డిని వివరణ కోరగా కాలువల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ శాఖ ఏఈలను పంపి వివరాలు తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
దగాకోడ్ రాజ్యం..!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎన్నికల కోడ్ రావడంతో గత మార్చి నుంచి జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలు ఎన్నికల అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించడం, వాటికి పటిష్ట భద్రత కల్పించడం వంటి పనుల్లో బిజీగా ఉంది. ఎన్నికలు ముగిసినా ఇప్పటికీ కోడ్ అమలులో ఉండడం ఒక పక్క ఓట్ల లెక్కింపు, సిబ్బందికి శిక్షణ తదితర పనులలో నిమగ్నమైంది. ఈ సమయాన్ని ఆక్రమణదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సందట్లో సడేమియాలా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని అనుకున్నారో ఏమో.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలు చేసి అక్రమ కట్టడాలను నిర్మించేస్తున్నారు. వీటిపై స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా వాటిని పట్టించుకునేంత తీరుబడి అధికారులకు లేకపోవడంతో అక్రమార్కుల ఆటలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. తాపీ మేస్త్రి కాలనీలో.. స్థానిక 29వ డివిజన్ తాపీమేస్త్రీ కాలనీలో గతంలో పాలకేంద్రం ఉద్యోగులు సొసైటీగా ఏర్పడి వారు ఇళ్ళ స్థలాల కోసం ప్లాట్లు వేసుకున్నారు. దానికి సంబంధించి నిబంధనల ప్రకారం పార్కు, వాటర్ ట్యాంకులకు కొంత స్థలాన్ని కేటాయించారు. కాలక్రమంలో పార్కు, వాటర్ ట్యాంక్‌ల కోసం విడిచిపెట్టిన స్థలాన్ని కొంతమంది స్వార్థపరులు అమ్మేసుకున్నారు. దీనిపై అక్కడి స్థానికులు కోర్టులో వ్యాజ్యం కూడా వేశారు. ప్రస్తుతం ఆ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టు పరిధిలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా దీనిలో ఇటీవల ఒక వ్యక్తి నిర్మాణం ప్రారంభించాడు. ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాడు. దీంతో తాపీమేస్త్రి కాలనీలో ఉన్న 300 గృహాలకు దారులు మూసుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం వల్ల రోడ్డు కుచించుకుపోయి అటువైపు వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుందని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా కనీసం ఫైర్ ఇంజిన్ కూడా వచ్చే అవకాశం ఉండదని పేర్కొంటూ 29వ డివిజన్ కార్పొరేటర్ ఆడారి అరుణ, స్థానిక నాయకుడు వేగి చిన్న ప్రసాద్ ఇటీవలనగర కమిషనర్‌కు వినతిపత్రం అందచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ అధికారులు ఇప్పటి వరకూ ఈ విషయంపై స్పందించలేదు. డగ్లస్ స్కూల్ రోడ్డులో.. స్థానిక మంచినీళ్లతోట డగ్లస్ స్కూల్ రోడ్డులో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన ఇద్దరు అన్నదమ్ములు తమ్మిలేరు ఏటిగట్టును ఆనుకుని ఒకేసారి నాలుగు ఇళ్ళు నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా రెండు ఇళ్ళు ఏకంగా తమ్మిలేరు గట్టు దాటి లోపలకు ఆక్రమించి నిర్మించేస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమ్మిలేరును ఆక్రమించి నిర్మాణం చేయడంవల్ల రానున్న వర్షాకాలంలో తమ్మిలేరు పొంగితే నీటిప్రవాహానికి ఆటంకం ఏర్పడి వరద నీరు నగరంలోకి చేరే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు తాపీమేస్త్రీ కాలనీలో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 300 గృహాలకు వెళ్ళడానికి ప్రధాన రహదారికి ఆనుకునే అక్రమ నిర్మాణం జరుగుతోంది. దీనిని నిలువరించాలని గతంలోనే నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం అందచేశాం. ఇప్పటి వరకూ అధికారులు చర్యలు తీసుకోలేదు. పైగా ఈ అక్రమ నిర్మాణం జరిగిన స్థలం కోర్టు పరిధిలో ఉండగా సదరు వ్యక్తి కోర్టు ధిక్కారాన్కి పాల్పడినట్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం.– వేగి చిన్న ప్రసాద్, స్థానికుడు నగరానికే ప్రమాదం.. తమ్మిలేరు ఏటిగట్టు నానాటికీ ఆక్రమణదారుల చేతుల్లో చిక్కిపోతోంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఏరును ఆక్రమించి గట్టుదాటి లోపలకు గృహాలు నిర్మించేసుకుంటున్నారు. ప్రతి వర్షాకాలంలో తమ్మిలేరు పొంగుతుందేమోనని నగర ప్రజలు భయపడుతూనే కాలం గడుపుతుంటారు. పైన భారీ వర్షాలు కురిస్తే ఆ నీరు తమ్మిలేరులోకే వచ్చి నీరు ప్రవహించే దారిలేక నగరంలోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. – చింతా చంద్ర శేఖర్, మంచినీళ్ళ తోట -
ప్రభుత్వ భూమేగా లాగించేయ్
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీలో తోడే కొద్దీ అక్రమాల పుట్ట కదులుతోంది..రూ.కోట్లకు కోట్లు కొల్లగొట్టిన తెలుగుదేశంకు చెందిన డెయిరీ పాత పాలకమండలి పాలు, పాల పదార్థాల రూపంలో తాగేసిన, తినేసిన దాదాపు రూ.100 కోట్ల లెక్కలు మాయం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అందుకే పాత అధికారులను పక్కన పెట్టి డెయిరీకి నూతనంగా ముగ్గురు అధికారులను నియమించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో డెయిరీ లెక్కలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్స్ నివేదికలో చూపించిన రిపోర్టులు మాయం చేసే పనిలో కొత్త అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో అక్రమాలు చేసి కాజేసిన డెయిరీ సొమ్మును తిరిగి చెల్లించాలని రూపొందించిన రికవరీ ఫైళ్లు కనుమరుగు చేసినట్లు సమాచారం. బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు చూపించిన డెయిరీలోని నిల్వలు మాయంచేసి చివరకు బ్యాంకులకే కుచ్చుటోపీ పెట్టిన ఘనత పాత కమిటీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావుది. చివరకు రూ.కోట్ల కొద్దీ బొక్కి ఒట్టిపోయిన గేదెను చేసి అధికారులతో ఏర్పాటైన నూతన కమిటీకి డెయిరీని అప్పగించిన చల్లా ఇప్పటికీ అధికార పార్టీని అడ్డంపెట్టుకొని మరీ డెయిరీలో తన పెత్తనమే చెలాయిస్తున్నారు. అందుకే ఆయన చేసిన పా‘‘పాలు’’బయటకు రానీయకుండా ప్రస్తుతం ఉన్న అధికారులపై అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో బెదిరింపులకు దిగిమరీ తన తప్పులు బయట పెట్టకుండా తన జులుం ప్రదర్శిస్తున్నారు. అందుకే నూతనంగా డెయిరీలోని అక్రమాలు బయటకు కంప్యూటర్ ఆపరేటర్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వారు అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ఆన్లైన్లో జరిగిన అక్రమాలను తొలగించారు. అటు తరువాత 2018లో మళ్లీ అదే సర్వే నంబర్లో భూములు ఆన్లైన్ చేయడం గమనార్హం. తీరప్రాంతంలో భూముల పట్టాలిచ్చేందుకు అనుమతుల్లేవ్.. రొంపేరు కాలువ సముద్రంలో కలిసే ప్రాంతంలో 1160, 1161 సర్వే నంబర్లో భూములు ఉన్నాయి. సుమారు 1455.49 ఎకరాలను ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదయ్యాయి. సుమారు 20 కి.మీ పైనుంచి రొంపేరు కాలువ ద్వారా సముద్రానికి నీరు వచ్చి చేరే ముఖ ద్వారంగా ఈ ప్రాంతం కొనసాగుతుంది. దూరప్రాంతం నుంచి పంట కాలువల మురుగు నీరు వచ్చి సముద్రంలో కలిసే ప్రాంతం కూడా ఇదే. ఈ ప్రాంతంలో జీవవైవిధ్యంలో ప్రముఖ పాత్ర వహించే మడ చెట్లు విపరీతంగా పెరిగి సముద్రం నుంచి వచ్చే ఆటుపోట్లను తట్టుకునేందుకు, సముద్రపు కోత నుంచి తట్టుకునేందుకు, ప్రకృతి వైపరీత్యాలను కాపాడుకునేందుకు ఉపయోగకరమైన ప్రాంతం. జీవవైవిధ్యానికి అనుకూలం గా ఉండి పక్షులు, సముద్రపు జీవులు ఈ ప్రాంతంలో గుడ్లను పొదిగి సంతా నోత్పత్తి చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతం వ్యవసాయానికి, నివాసాలకు అమోదయోగ్యం కాదు. ఆక్రమణలకు గురి కావడం వలన భవిష్యత్ రోజుల్లో సంభవించి విపత్తుల వలన గ్రామాలు తుడిచి పెట్టుకొని పోయి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. ఇష్టారీతిగా భూముల ఆన్లైన్: 1160 సర్వే నంబర్లో భూములను సబ్ డివిజన్ చేసినట్లుగా చూపుతూ సబ్‌డివిజన్ 31 నుంచి 38 వరకు సుమారు 29 ఎకరాల భూమిని ఆన్లైన్ చేసి ఉన్నతాధికారుల దృష్టికి సైతం విషయాన్ని తీసుకెళ్లకుండా ఆక్రమణదారులకు పట్టాదారు ఖాతాను కేటాయించి పుస్తకాలు ఇచ్చేశారు. భూములను రెవెన్యూ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించి అనధికారికంగా ఉప్పు కొఠారులు, చెరువులు తవ్వేందుకు ప్రోత్సహిస్తూ, భారీ మొత్తంలో అక్రమార్జన చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి పై అధికారుల దృష్టికి తీసుకొని పోకుండా అసలైనవిగా చలామణి చేస్తున్నారు. కొత్తగా ఖాతాలను తెరచి సంబంధిత వ్యక్తులకు పట్టాదారు పాస్ పుస్తకాలను, డీకే పట్టాలను సైతం తయారు చేసి అసలైనవిగా అమలు పరిచి ఆక్రమణదారులకు కట్టబెట్టారు. 2014లో మాన్యువల్ పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసిన ప్రభుత్వం ఈ పాస్ పుస్తకాలను పట్టాదారులకు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయినా చినగంజాం తహసీల్దార్ కార్యాలయంలో 1–07–2018 నుంచి 19–07–2018 పిరియడ్‌లో ఇన్చార్జ్ తహసీల్దార్‌గా పనిచేసిన అధికారి మాన్యువల్ పాసు పుస్తకాలను అందజేయడంతో పాటు ఖాతా నంబర్లను సైతం మార్పు చేసి ఇచ్చారు. వారు గతంలో అందుకున్న పట్టాలు ఫోర్జరీ అయిన విషయాన్ని కూడా గుర్తించకుండా పాస్ పుస్తకాలు జారీ చేయడం ఇక్కడ విశేషం. అప్పటి తహసీల్దార్‌గా పనిచేసిన అబ్రహం 2002లో తహసీల్దార్‌గా జాయిన్ కాగా ఆయన సంతకంతో 2001లోనే పట్టాలు మంజూరయ్యాయి. ఇదే విధంగా సుమారు 29 ఎకరాల భూమికి ఫోర్జరీ సంతకాలతో పట్టాలు మంజూరు రెవెన్యూ అధికారులు అక్రమంగా ఆన్లైన్ చేసి భారీ మొత్తంలో రాత్రికి రాత్రే ఆక్రమణదారుల నుంచి నగదు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలంటే నిబంధనలు ఇవీ.. ప్రభుత్వ భూమిని అందుకునేందుకు లబ్ధిదారులు భూమిలేని నిరుపేదలు అయి ఉండాలి. ఎసైన్మెంట్ వేస్ట్(ఏడబ్ల్యూ లాండ్‌గా) బంజరు భూమిగా మార్చి డీకే పట్టాలు అందజేయాలి. లబ్ధిదారులకు షరతులతో కూడిన పట్టా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందు కోసం మొదటగా గ్రామంలో భూమిలేని పేదలను గుర్తించి వారందించే దరఖాస్తులను పరిశీలించిన తహసీల్దార్ ఆ భూమికి సంబంధించి మార్పులు చేసి దానిని మొదటగా పంచాయతీ కార్యాలయంలో గ్రామ కూడలిలో చాటింపు, దండోరాల ద్వారా తెలియజేయాలి. చేసిన తరువాత అందిన దరఖాస్తులను పరిశీలించి గ్రామ అసైన్మెంట్ కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి సదరు భూమిని ప్రభుత్వ భూమి నుంచి మార్పు చేసి సదరు భూమికి సబ్ డివిజన్ కేటాయిస్తూ డీకే పట్టాలు మంజూరు చేయాలి. మంజూరు చేసేం దుకు రెండు కాపీలను తయారు చేయా లి. ఒక కాపీని లబ్ధిదారుడికిచ్చి రెండో కాపీని కార్యాలయంలో భద్ర పరచాలి. ఇందు కోసం ప్రత్యేకంగా డీకే రిజిస్టర్‌ను సైతం నిర్వహించాల్సి ఉండగా, తహసీల్దార్ కార్యాలయంలో అటువంటి రిజిష్టర్లు లేకపోవడం హాస్యాస్పదం. సమస్యను మరుగును పెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కట్టా శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త పెదగంజాం పరిధిలోని ప్రభుత్వ భూమికి సంబంధించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా విషయాన్ని కాలయాపన చేస్తూ కాల దోషం పట్టిస్తున్నారు. గతంలో జిల్లా ఉన్నతాధికారులు తిరస్కరించిన భూములకు పట్టాలు ఇచ్చారు. ఆన్లైన్ అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోగా వారు విచారణను కాలయాపన చేస్తున్నారు. -
నిజాలన్నీ గోదాంలో ఆహుతి
రూ.4లక్షలు ఇవ్వలేదని రూ.12.5కోట్లు విలువైన ఆస్థిని తగలబెట్టారట’’...ఇది నమ్మదగినదేనా.. పులివెందుల పోలీసులు అక్షరాల ఇదే నిజమంటున్నారు. లింగాల మండలంలో డీఎస్ఆర్ రూరల్ ఫార్మర్స్ వేర్ హౌస్‌లో గతనెలలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఇదే కారణమట. మూడు వారాలు పాటు శోధించి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా పోలీసులు తేల్చిన దర్యాప్తు సారాంశమిది. సాక్షి ప్రతినిధి కడప: డీఎస్ఆర్ గోదాం యజమాని.. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దేవిరెడ్డి సంజీవరెడ్డి చేతికి మంటి అంటకుండా విచారణ ముగించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. పులివెందుల సీఐ రామకృష్ణుడు కథనం ప్రకారం సంజీవరెడ్డిపై కోపంతో గోదాంలో చింతకాయల నాగరాజు(అంబకపల్లె) నిప్పు పెట్టాడట. తాడిపత్రిలో మూడు క్యాన్లు కొని కొండాపురం, సింహాద్రిపురం గ్రామాల్లో 34లీటర్ల వంతున అందులో పెట్రోల్ నింపి బొలెరో వాహనంలో తీసుకువచ్చాడట. వాటిని కంపచెట్లలో దాచిపెట్టి తర్వాత ప్లాస్టిక్ కవర్లలో పెట్రోల్ నింపి బావమరిది సహకారంతో గోదాంలో సరుకు తగలబెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రైతులు నమ్మినా నమ్మకపోయినా విచారణలోరూ.4లక్షలు ఇవ్వలేదని రూ.12.5కోట్లు విలువైన ఆస్థిని తగలబెట్టారట’’...ఇది నమ్మదగినదేనా.. పులివెందుల పోలీసులు అక్షరాల ఇదే నిజమంటున్నారు. లింగాల మండలంలో డీఎస్ఆర్ రూరల్ ఫార్మర్స్ వేర్ హౌస్‌లో గతనెలలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఇదే కారణమట. మూడు వారాలు పాటు శోధించి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా పోలీసులు తేల్చిన దర్యాప్తు సారాంశమిది. సాక్షి ప్రతినిధి కడప: డీఎస్ఆర్ గోదాం యజమాని.. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దేవిరెడ్డి సంజీవరెడ్డి చేతికి మంటి అంటకుండా విచారణ ముగించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. పులివెందుల సీఐ రామకృష్ణుడు కథనం ప్రకారం సంజీవరెడ్డిపై కోపంతో గోదాంలో చింతకాయల నాగరాజు(అంబకపల్లె) నిప్పు పెట్టాడట. తాడిపత్రిలో మూడు క్యాన్లు కొని కొండాపురం, సింహాద్రిపురం గ్రామాల్లో 34లీటర్ల వంతున అందులో పెట్రోల్ నింపి బొలెరో వాహనంలో తీసుకువచ్చాడట. వాటిని కంపచెట్లలో దాచిపెట్టి తర్వాత ప్లాస్టిక్ కవర్లలో పెట్రోల్ నింపి బావమరిది సహకారంతో గోదాంలో సరుకు తగలబెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రైతులు నమ్మినా నమ్మకపోయినా విచారణలో అదే విషయాన్ని సీఐ స్పష్టంచేశారు. టీడీపీ నేతలు అనుకున్న రీతిలోనే ఈ కేసును ముగింపు పలికారు. పోలీసులుసంపూర్ణ సహకారాలు అందించి అధికార పార్టీకి అండగా నిలిచారని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. అసలు నిందితులను తప్పించి.... అసలు నిందితులను కేసు నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి ముందుగానే తమ సరుకును పక్కదారి పట్టించి నిర్వాహకులు సొమ్ము చేసుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పూర్తి స్టాకు లేని విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు. గోదాంలోని సరుకుపై ఆంధ్రాబ్యాంక్‌లో రూ.9కోట్లు, కెనరాబ్యాంక్‌లో రూ.8కోట్లు బంధువుల పేరిట నిర్వాహకులు అక్రమంగా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. బ్యాంక్‌లకు ఎగనామం పెట్టి, లేనిస్టాకు కాలిపోయినట్లుగా చూపెట్టి బీమా కోసం ఎత్తుగడ వేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందువల్లే రూ.20కోట్లకు నిర్వాహకులు బీమా చేశారు. ఇలాంటి విషయాలపై పోలీసులు దృష్టి సారించలేదు. టీడీపీ దర్శకత్వంలో కేసు విచారించి నిందితులకు అండగా నిలిచారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. 16షెట్టర్లు బయట నుంచి తొలగించి ఆనవాలే కనిపించలేదు. విద్యుత్ షార్ట్‌కు సంబంధించిన ఆధారాలూ లేవు. అయినా నిర్వాహకులతో కలిసి పోలీసు యంత్రాంగం హైడ్రామా నడిపింది. నిర్వాహకులనుగానీ, సిబ్బందిని గానీ స్టేషన్‌కు పిలిపించిన దాఖలాలు లేవు. గట్టిగా విచారించిన సందర్భమూ లేదు. దీన్ని బట్టే గోదాం నిర్వాహకునితో పోలీసులు కుమ్మక్కయ్యారని రూఢీ అవుతోంది. నిందితుడిగా చూపిన నాగరాజు గోదాం నిర్వాహకుడు సంజీవరెడ్డికి అత్యంత సన్నిహితుడు. గడిచిన ఎన్నికల్లో సంజీవరెడ్డి అనుచరుడుగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నాడు. టీడీపీ తరపున ఫ్యాక్షన్ గ్రామమైనా పోలింగ్ ఏజెంటుగా కూర్చున్నారు. ఏజెంటుగా కూర్చుంటే రూ.4లక్షలు సంజీవరెడ్డి ఇస్తానని చెప్పి, తర్వాత ఇవ్వకపోగా ఇష్టానుసారం మాట్లాడారనే కోపంతో గోదాం తగలబెట్టామని నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులంటున్నారు. స్వల్ప మొత్తం కోసం కోట్ల రూపాయల విలువైన ఆస్థిని తలగబెట్టడంపై పోలీసులకు కనీస అనుమానం రాకపోవడం విశేషం. సమస్యల్లో ఉన్నందున ఇలా చేశాడని విచారణను సమర్ధించుకుంటున్నారు. పెద్ద ఎత్తున మొత్తం చేతులు మారడంతో నాగరాజు కేసులో అడ్మిట్ అయినట్లుగా పులివెందులలో జోరుగా ప్రచారం అవుతోంది. తమపై తప్పు లేకుండా విచారణకు రావాలంటూ పోలీసులు 41సీఆర్పీసీ జారీ చేసినట్లు, ఆమేరకు విచారణకు హాజరుకాకపోవడం, ఆపై తామే తగలబెట్టామని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు కథ అల్లారని భోగట్టా. ఘటనపై టీడీపీ నేతలు సఫలం.... సంఘటన జరిగిన వెంటనే తమ పార్టీకి చెందిన సంజీవరెడ్డిని కేసు నుంచి కాపాడేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జిల్లా మంత్రితోపాటు ఎమ్మెల్సీ, ఇతర టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఈ కేసును చాకచక్యంగా పక్కకు మళ్లించారు. ఈ క్రమంలో భారీ నగదు చేతులు మారినట్లు సమాచారం. నిష్పక్షపాతంగా విచారణ ఉంటుందని ఆశించిన రైతులకు భంగపాటు మిగిలింది. ఇదే విషయమై ఎస్పీఅభిషేక్ మహంతితో మాట్లాడగా తన విచారణలో కేసును తప్పుదారి పట్టించారని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. కాగా శనివారం నాగరాజుతోపాటు అతని బామర్ది గంగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు లింగాల ఎస్ఐ అమరన్నాథరెడ్డి మీడియాకు తెలిపారు. -
జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం
ఒంగోలు సిటీ: సొంత స్థలమైతే కంచె వేస్తాం.. కట్టడి చేసుకుంటాం. అన్యుల పాలు కాకుండా కాపాడుకుంటాం. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు జాగ్రత్తగా దాచుకుంటాం. పశువులు రాకుండా, వర్షం, మురుగు నీళ్లు నిలవకుండా మెరకలు పోస్తాం. ప్రతి ఒక్క యజమాని తన ఆస్తిని సంరక్షించుకొనే పద్దతి ఇదే. జిల్లా పరిషత్ విషయానికొస్తే అందుబాటులో ఉన్న ఆస్తులను నిర్వహించుకోవడంలో నిర్లక్ష్యం. విలువైన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు లేవు. కనీసం గుర్తించే పనిలోనూ లేరు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు భద్రపరిచిన దాఖలాలు లేవు. జెడ్పీకి ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయి.. వాటి విలువ ఇతర వివరాలను అడిగి చూడండి.. మాకు తెలియదనే జవాబు వస్తుంది. ఇది జెడ్పీలో ఆవరించిన నిర్లక్ష్యానికి నిదర్శనం. జిల్లాలో స్థానిక సంస్థలకు విలువైన ఆస్తులు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కొన్నింటికే వివరాలు ఉన్నాయి. మూడొంతుల స్థలాలు ఎవరి కబ్జాలో ఉన్నాయో తెలియవు. భూమి స్వరూపం ఏ విధంగా మారిపోతుందో తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు భూమి విలువ బాగా పెరిగింది. ఒకప్పుడు ఎకరా రూ.లక్షలోపు విలువ ఉంటే ఇప్పుడు అదే ఎకరా రూ.2 కోట్లు పలుకుతోంది. జిల్లా పరిషత్తుకు సంబంధించి 17 ఎకరాల భూమి ఒంగోలు శివారు మంగమూరు సర్వే నంబర్లో ఉంది. దీనిలో ఇప్పుడు సుబాబుల్, జామాయిల్ తోట వేసి ఉంది. ఇప్పుడు జెడ్పీ నిర్వహణలో ఉందని చెబుతున్నా.. వాస్తవానికి ఓ పలుకుబడి ఉన్న వ్యక్తి దీనిని ఆ«ధీనంలో ఉంచుకున్నారు. ఒకప్పుడు అంతగా కన్ను లేకపోవడంతో సదరు వ్యక్తి తోట పెంచుకుంటూ ఈ భూమి తనదే అన్పించుకున్నారు. ఎకరా విలువ రూ.2 కోట్లకు చేరడంతో ఎన్జీవోలు తమకు ఇంటి నివేశన స్థలానికి పట్టా ఇవ్వమని, కొందరు మార్కెట్ విలువ ప్రకారం అమ్మమని, మరి కొందరు నిరు పేదలకు ఇంటి నివేశన స్థలాలను ఇవ్వమని, తాజాగా జెడ్పీ ఉద్యోగులు తమదే ఈ స్థలం కావడంతో తమకు ఇళ్ల కోసం కేటాయించమని రకరకాలుగా ఒత్తిళ్లు నెలకున్నాయి. ఇందరి కన్ను ఉండటంతో దీని జోలికి వెళ్లాలంటే తేనె తుట్టెను కదిలించినట్లేనని మిన్నకుండి పోయారు. కొందరు క్రయ విక్రయాలు జరిగాయని ఒప్పంద పత్రాలతో లిటిగేషన్లకు పూనుకున్నారు. తాగునీటి కోసమే.. ఇంత విలువైన ఆస్తిని ఎవ్వరికీ ఇవ్వబోమని అప్పటి జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీనసింహం దీనిపై ప్రత్యేకంగా నివేదిక తయారు చేశారు. ఒంగోలు ప్రజలకు తాగు నీటికి ఇప్పుడున్న వేసవి చెరువులు రెండిటిలోనూ నీటి నిల్వ సామర్థ్యం సరిపోవడం లేదని తన నివేదికలో పేర్కొని తాగునీటి కోసమే ఈ 17 ఎకరాలను ఉపయోగిస్తామని స్వాధీనంలోకి తీసుకోమని రెవెన్యూ అధికారులకు సూచన చేస్తూ ఆర్డీవోను భూమిని స్వాధీనంలోకి తీసుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. ఆయన ఇన్‌ఛార్జి జెడ్పీ సీఈవోగా బాధ్యతలను నిర్వహించినప్పుడు స్వాధీనం కోసం తయారు చేసిన నివేదికను గల్లంతు చేశారు. ఇప్పుడు సంబంధిత రికార్డు ఏమైందో కూడా తెలియని పరిస్థితి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ భూమి పరి స్థితి ఇలా ఉంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆస్తుల పరిస్థితి.. వాటి అన్యాక్రాంతం వివరాలు ఎక్కడున్నాయన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. కబ్జా వెయ్యి ఎకరాల పై మాటే.. పొన్నలూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల భూమిని కొందరు ఆక్రమించారు. ఇదేమి చోద్యం హైస్కూలు.. అందులోనూ నిరుపేద పిల్లలకు చదువు చెప్పే కోవెల. అలాంటి స్థలాన్ని ఎలా కబ్జా చేస్తారని అడిగిన వారు లేరు. కొందరు ప్రజా ప్రతినిధులు కబ్జా చేసిన వారికే వత్తాసు పలికారు. ఇంకేం వారికే భూమిని బదలాయించి ఇంటి నివేశన స్థలాలు ఇచ్చారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. జెడ్పీ పరిధిలో సుమారు మూడు వేల ఎకరాలు ఉన్నాయి. ఇందులో జెడ్పీ కార్యాలయాలు ఉన్నాయి. దుకాణాల సముదాయాలు ఉన్నాయి. అతిథి గహాలు నిర్మించారు. విడిది కేంద్రాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలాలు ఉన్నాయి. వీటి విలువ ఇప్పుడు లెక్క గడితే రూ.30 వేల కోట్లే అంటున్నారు. ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డు కూడలిలో జిల్లా పరిషత్తు స్థలం ఉంది. ఇక్కడ కార్యాలయాన్ని నిర్మించాలని శంకుస్థాపన చేశారు. ఇందు కోసం రూ.2 కోట్లు ఎంఎన్‌పి గ్రాంటు నుంచి నిధులు కేటాయించారు. ఖాళీగానే ఉంచేశారు. నిధులు వెనక్కి పోయాయి. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని కొందరు కన్నెశారు. కల్యాణ మండపానికి లీజు కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతల వద్ద కల్యాణ మండపానికి మంతనాలు కూడా జరిగాయి. మండల పరిషత్‌లు పరిధిలో సుమారు 1300 ఎకరాలు భూములు ఉన్నాయి. జెడ్పీ హైస్కూలు స్థలాలు సుమారు 1200 ఎకరాలు ఉన్నాయి. వీటి విలువ లెక్క కట్టలేనిది. జెడ్పీ హైసూళ్ల స్థలాల చుట్టూ జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు సూళ్లకు ప్రహరీలను నిర్మించారు. స్కూళ్ల స్థలాలను కట్టడి చేశారు. ఇక అన్యాక్రాంతం కావడానికి వీల్లేకుండా ఫెన్సింగ్ వేశారు. పొన్నలూరు తరహాలోనే 250 ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్లుగా లెక్కలున్నాయి. అయి తే స్థానిక రాజకీయ నాయకులను కాదని ఎవ్వరు పట్టించుకోగలరంటున్నారు. విలువైన మండల పరిషత్తు, హైస్కూలు స్థలాలు అన్యులపరమై ఉన్నాయి. నిర్వహణ అంతం మాత్రమే.. జిల్లాలోని కొత్తపట్నం, ఒంగోలు, మార్కాపురం, సీఎస్‌పురం, కందుకూరు ఇలా పలు చోట్ల అతిథి గృహాలు, దుకాణ సముదాయాలు ఉన్నాయి. గిద్దలూరు, మార్టూరు, ఒంగోలులో దుకాణాలు ఉన్నాయి. వీటిని నిర్వహించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన స్థలాలు, ఆస్తులు దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదు. నిధులు లేవంటూనే నెట్టుకొస్తున్నారు. నిర్వహణలేక, ఆలనా పాలన లేక విలువైన ఆస్తులు దెబ్బతినిపోతున్నాయి. రికార్డులు గల్లంతు.. విలువైన జెడ్పీ ఆస్తులకు సంబంధించిన కాగితం ముక్క కార్యాలయంలో అందుబాటులో లేదు. ఏ వివరాలు అడిగినా దిక్కు దివాణా లేదు. అసలు రికార్డు నిర్వహించుకోవడానికి ప్రత్యేకించి విభాగం లేకపోవడం గమనార్హం. మండలాల్లోనూ అదే పరిస్ధితి నెలకుంది. జేసీ లక్ష్మీ నసింహం ఉన్నప్పుడు కొంత సమాచారాన్ని సేకరించారు. దానిని కూడా ఎక్కడుంచారన్నది వివరాలు లేవు. రెవెన్యూ శాఖకు కాంతిలాల్ దండే జెడ్పీ ప్రత్యేకాధికారిగా ఉన్నప్పుడు ఆస్తుల వివరాలు తేల్చమని ఆదేశించారు. ఆయన ఆదేశాలు భేఖాతరయ్యాయి. రెవెన్యూలో లెక్క చేసిన వారు లేరు. కొంత రికార్డు ఉన్నా దానిని బయట పెడితేనే రూ.వందల కోట్లు విలువైన ఆస్తులు బయటకొస్తాయి. అందుకే వీటిపై విచారణలు లేవు. సుమారు వెయ్యి ఎకరాలు స్థలాలు అన్యులపాలయినట్లుగా గుర్తించారు. ఇంకా లెక్కలేనన్ని ఆస్తులు ఉంటాయన్నది అంచనా. వీటి విలువ సుమారు ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.700 కోట్లకుపైమాటే. రికార్డులను తయారు చేద్దామన్న ధ్యాసలేదు. చేతులు దులుపుకుంటున్న పాలకులు.. ఇటీవల వెబ్ పోర్టింగ్ చేసినప్పుడు కొన్ని వివరాలు ఆర్ఎస్ఆర్ దాఖలా బయట పడ్డాయి. దాతలు జెడ్పీకి కొన్ని ఆస్తులను భూరి విరాళాలుగా ఇచ్చారు. అలాంటివి బయటకు రాలేదు. దాతలు ఇచ్చిన ఆస్తులు పరుల పాలయ్యాయి. వీటిలో మూడొంతులు ఆస్తులకు సరైన రికార్డులు లేవు. ఉన్న రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రికార్డులను గల్లంతు చేశారు. వీటిపై పాలకులు శ్రద్ద వహిస్తే విలువైన ఆస్తుల వివరాలు బయటకు వస్తాయి. పాలకులు వస్తున్నారు.. పోతున్నారు.. చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ పాలక వర్గానికి గడువు ఇక నెలన్నర మాత్రమే ఉండడం గమనార్హం. జెడ్పీ విలువైన ఆస్తులపై దృష్టి సారిస్తారన్న విశ్వాసం ప్రజల్లో నెలకోవడం గమనార్హం. -
టీడీపీ తోడు నిఘా జోడు
నిఘా వ్యవస్థలో కీలక భూమిక పోషించే ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల్లో కొందరు అధికార పార్టీ నాయకుల్లా పనిచేస్తున్నారు. భద్రతను పక్కనపెట్టారు. కేవలం టీడీపీ కోసమే తాము ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, వారి అనుచరుల కదలికలపై నిత్యం నిఘా పెట్టారు. వారు ఎక్కడికెళ్లినా.. ఎవరిని కలిసి మాట్లాడినా ఆ వివరాలను ఆఘమేఘాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా కుప్పం, చంద్రగిరి, చిత్తూరు, తిరుపతి, పలమనేరుతో పాటు పలు నియోజక వర్గాల్లో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు సీఎం పీఏ మనోహర్ కనుసన్నల్లో నడుచుకుంటున్నారు. మనోహర్, స్పెషల్ బ్రాంచ్ ముఖ్య అధికారి రాంకుమార్ ఆదేశించిన రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఐదేళ్ల పాలనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీవైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. దిక్కుతోచని టీడీపీ అధినేత ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులను ఆశ్రయించారు. సొంత పార్టీ నేతలు, వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రధానంగా నిఘా పెట్టమని ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అధి కారులు వారి వాహనాలు, ముఖ్య అనుచరుల కదలికలపై దృష్టి సారించారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఇటీవల ఎనిమిది మంది టీడీపీ, స్వతంత్ర కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వాస్తవానికి 20 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో చేరాల్సి ఉంది. ఎవరెవరు పార్టీలో చేరుతున్నారనే వివరాలను ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలుసుకుని సీఎం పీఏ, టీడీపీ ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు కార్పొరేటర్లను నయాన, భయాన ఒప్పించే ప్రయత్నం చేశారు. పార్టీ మారితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిం చారు. దీంతో వారు వెనుకడుగు వేశారు. గతవారం మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీలోకి వస్తున్నారని తెలుసుకున్న మేయర్ హేమలత, ఆమె భర్త కఠారి ప్రవీణ్ పార్టీ వీడడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లిన నిఘా విభాగానికి చెందిన అధికారులు ‘పార్టీ వీడొద్దు.. వీడితే మీరు రోడ్లపై కూడా తిరగలేరు. పాత కేసులు తిరగదోడుతాం’ అంటూ భయపెట్టారు. మేయర్ దంపతులు పార్టీ మారేందుకు సాహసించలేదు. టీడీపీ బీసీ నేత రావూరి ఈశ్వరరావు ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ‘మళ్లీ మాట్లాడొద్దంటూ’ ఈశ్వరరావుకు హుకుం జారీ చేశారు. అంతటితో విడిచిపెట్టలేదు. ఆయనను చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ వద్దకు తీసుకెళ్లారు. సీఎంతో చెప్పి చుడా (చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ ఇప్పిస్తామని ఈశ్వరరావును శాంతపరిచారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన మరికొందరు టీడీపీ కార్యకర్తలను ఇంటెలిజెన్స్ అధికారులు బెదిరించి పార్టీ మారకుండా ఆపించారు. కుప్పం.. చంద్రగిరిలో బహిరంగం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం, సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికా రులు బహిరంగంగానే టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. రామకుప్పం మండలం విజిలాపురంలో ఇటీవల మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో టీడీపీ నాయకులు అడ్డుపడి రచ్చరచ్చ చేశారు. ఇంటెలిజెన్స్, పోలీసులు అక్కడే ఉన్నా వారించకపోగా వీడియో చిత్రీకరించారు. ఆపై వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసే విషయంలో కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంలో విలువైన గ్రానైట్ అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నా, క్వారీలో పేలుళ్లు జరుగుతున్నా పట్టించుకోలేదు. శాంతిపురం మండ ల పరిధిలో ఓ గ్రామంలో రెండు కుటుం బాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంలో టీడీపీ నేతలు కల్పిం చుకుని ఓ మహిళను వివస్త్రను చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంత దారుణం జరిగినా టీడీపీ నేతలకు మద్దతుగా నిలబడి బాధితులపైనే కేసులు బనాయించారు. కుప్పంలో వెంకటేష్‌బాబుపై టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యు డు రాజ్‌కుమార్ దాడిచేశారు. తిరుపతి గంగ మ్మ ఆలయం వద్ద కాంగ్రెస్ నాయకుడు సురేష్‌బాబుపై దాడిచేశారు. అయితే ఇంటెలిజెన్స్ అధికారులు అవేమీ పట్టించుకోలేదు. కార్యకర్తలకు ప్రత్యేక విధులు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులకు తోడుగా ప్రతి గ్రామం, పట్టణాల్లో టీడీపీ కార్యకర్తలకు నెలనెలా కొంత మొత్తం ఇచ్చి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. వారు ఇచ్చే సమాచారంతో పాటు ఈ రెండు విభాగాల్లో పనిచేసే అధికారుల వద్ద నుంచి తీసుకున్న వివరాలను ప్రతిరోజూ టీడీపీ అధినేత చంద్రబాబుకు చేరవేస్తుండడం గమనార్హం. -
కాల్వను మింగేసిన కబ్జాదారులు
సాక్షి, రాజేంద్రనగర్: నదిపై వంతెన, రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే లక్షలాది రూపాయలు, సంవత్సరం పాటు సమయం పడుతుంది. అదే కబ్జాదారులకు ఆ పని అప్పగిస్తే రాత్రికి రాత్రే రోడ్డును పూర్తి చేస్తారు. ఇది మాటల్లో కాదూ చేతల్లో చేసి చూపించారు కబ్జారాయుళ్లు... వివరాల్లోకి వెళితే.. హిమాయత్‌సాగర్ జలాశయం నుంచి వచ్చే వరద నీటిని కిస్మత్ఫూర్, బండ్లగూడ మీదుగా సంఘం వద్ద మూసీ నదిలోకి కలిసేలా గతంలో 220 అడుగుల కాల్వను ఏర్పాటు చేశారు. దీనికి ఈసీ నదిగా పేరు పెట్టారు. మూసీ పేరుతోనే ఈ కాల్వ ప్రస్తుతం కొనసాగుతుంది. బండ్లగూడ పీఅండ్‌టీ కాలనీ నుంచి జనచైతన్య వెంచర్‌కు మధ్యన మూసీ నది అడ్డుగా ఉంది. ఈ రెండు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో స్థానికంగా స్థలాలకు విపరీతమైన ధర పలుకుతోంది. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కొందరు మట్టిపోసి రోడ్డును ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా మరికొందరు భారీ వాహనాలు వెళ్లేలా మట్టిని పోసి రోడ్డును తయారు చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు గుండా లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు సులువుగా వెళ్తున్నాయి. ఇదే అదునుగా కొందరు కబ్జాదారులు మూసిలో సైతం మట్టిపోసి ప్లాట్లుగా విభజించి విక్రయించారు. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలు సైతం సాగుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
పట్టపగలే గ్రావెల్ దోపిడీ
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ రూరల్ పరిధిలో మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గతంలో అర్ధరాత్రి సమయంలో చడీచప్పుడు లేకుండా సాగిపోయే ఈ దందా.. ఇప్పుడు పట్టపగలే యథేచ్ఛగా సాగిపోతోంది. ప్రభుత్వ పనుల పేరిట ఏదో ఒక అనుమతి తెచ్చుకుని నిత్యం వేలాది టన్నుల గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీ అండదండలతో ఆయన అనుచరుడు చేస్తున్న ఈ మట్టి దందాపై పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ దోపిడీ వివరాలు ఇలా ఉన్నాయి.. పోలవరం కాలువ మట్టి.. జక్కంపూడి ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతాన్ని తొలిచి పోలవరం కుడి కాలువను ప్రభుత్వం నిర్మించింది. ఈ పనుల్లో భాగంగా తవ్విన ఎర్రమట్టి, తెల్లమట్టిని జక్కంపూడి కురవ ప్రాంతంలోనే పెద్ద పెద్ద గుట్టలుగా కాంట్రాక్టర్ డంప్ చేసి వదిలేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు అది ఆదాయవనరైంది. అప్పట్లో సర్పంచ్‌గా పనిచేసే రామారావు, ఎమ్మెల్మే వంశీ అనుచరుడు గండికోట సీతయ్య కలిసి ఈ గ్రావెల్‌ను తొలుత స్థానిక అవసరాల పేరిట తరలించడం ప్రారంభించి.. ఆ తర్వాత క్రమేణా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇతరత్రా అవసరాలకు అనధికారికంగా విక్రయించి రూ. కోట్లు ఆర్జించారు. రూ. కోట్లలో దోపిడీ అధికారబలం అండతో ఎమ్మెల్యే అనుచరుడైన గండికోట సీతయ్య చెలరేగిపోతున్నారు. తమను అడ్డుకునేవారెవరూ లేరనే ధీమాతో రకరకాల అనుమతుల పేరిట మట్టిని అక్రమంగా విక్రయించేస్తున్నాడు. తొలుత స్థానిక అవసరాలకు తరలించిన మట్టిని తర్వాత గొల్లపూడి, సింగ్‌నగర్, అంబాపురం, నయనవరం, జక్కంపూడి, వెలగలేరు, జి.కొండూరు తదితర ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తూ రూ. కోట్లు పోగేశాడు. స్థానికంగా తెల్లమట్టి అయితే టిప్పర్‌కు రూ. 3,500, ఎర్రమట్టి అయితే రూ. 5వేలు చొప్పున ధర నిర్ణయించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దూరం పెరిగే కొద్దీ ధర కూడా పెరుగుతుంటుంది. గుట్టలుగా ఉన్న గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా సమీపంలోని ఖాళీ స్థలంలో డంప్ చేస్తున్నాడు. అక్కడి నుంచి వెంచర్లకు, బిల్డర్ల అవసరాలకు మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ స్పందించకపోవడం గమనార్హం. -
అనుమతి లేకుండా వెంచర్లు..
సాక్షి, జనగామ : ప్రజల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని చోటామోటా రియల్టర్లు రియల్ దందాకు తెర లేపుతున్నారు. వ్యవసాయ భూములను నివాస ప్రాంతాలుగా మార్చడం కోసం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అనధికార వెంచర్లపై కఠిన చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడంతో మూడు వెంచర్లు..ఆరు ప్లాట్లుగా జిల్లా కేంద్రం సరిహద్దులో రియల్ దందా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అనుమతి లేని ప్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు ఇబ్బందుల్లో పడుతున్నారు. జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న నాలుగు వైపులా రోజుకు రోజు వెంచర్లు వెలుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్..ఉమ్మడి వరంగల్ జిల్లాకు సెంటర్ పాయింట్ కావడమే కాకుండా నాలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రవాణా మార్గాలున్నాయి. అంతేకాకుండా జాతీయ రహదారులతోపాటు రైల్వే రవాణా అభివృద్ధి చెందడంతో మెజార్టీ ప్రజలు ఇక్కడే నివాసం ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. వీటితోపాటు దేవాదుల కాల్వల నిర్మాణంతో వ్యవసాయ భూములు కోల్పోవడంతో రూ.లక్షల్లో పరిహారం రైతులకు అందింది. పిల్లల చదువుల కోసం జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో భూముల క్రయవిక్రయాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. భూముల కొనుగోలు కోసం పోటీ ఏర్పడడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లను ఏర్పాటు చేసి అమ్మకానికి పెడుతున్నారు. గతంలో హైదరాబాద్ రోడ్డుకు పరిమితమైన రియల్ వ్యాపారం ఇప్పుడు సూర్యాపేట రోడ్డు, సిద్దిపేట రోడ్డు, వరంగల్ రోడ్డు వైపు విస్తరిస్తోంది. గ్రామ పంచాయతీలే టార్గెట్.. జనగామ మునిసిపాలిటీలో వెంచర్లు చేస్తే ప్రభుత్వానికి భారీగా పన్ను కట్టాల్సి వస్తుందనే భావనతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామ పంచాయతీలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. పెంబర్తి, శామీర్‌పేట, నెల్లుట్ల, యశ్వంతాపూర్, నిడిగొండ గ్రామాల సరిహద్దులను ఎంచుకుని వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా రెవెన్యూ అధికారుల వద్ద మార్చాలి. ఆర్డీఓ పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించి ఎన్ఓసీ తీసుకుకోవాలి. కానీ, అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్చకుండానే ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతోనే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం మూలంగా ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర గండిపడుతోంది. దళారులకు ఆఫర్లు.. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మధ్య దళారులను ఏర్పాటు చేసుకుని ప్లాట్లను విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1000 నుంచి 1500 మంది వరకు బ్రోకర్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఒక్కో ప్లాట్ విక్రయానికి ఒక్కో రేటు చొప్పున చెల్లిస్తున్నారు. ఎక్కువ ప్లాట్లు అమ్మకం చేసిన దళారులకు విదేశీ పర్యటనలను సైతం ఆఫర్ చూపెడుతున్నారు. అరచేతిలోనే రియల్ వ్యాపారం జోష్‌ను చూపించి పెద్ద మొత్తంలో దందా కొనసాగిస్తున్నారు. శాఖల మధ్య లోపించిన సమన్వయం.. మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ శాఖల మధ్య సమన్వయం లోపించినట్లుగా తెలుస్తోంది. జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వెంచర్ల వివరాలను తెలుపాలని మునిసిపాలిటీ అధికారులు రెండు నెలల క్రితమే పంచాయతీ అధికారులకు లేఖను పంపించారు. ఇప్పటి వరకు పంచాయతీ శాఖ నుంచి మునిసిపాలిటీ అధికారులకు ఎలాంటి నివేదిక అందలేదు. దీంతో కొంతమంది దళారులు ఇష్టారాజ్యంగా వెంచర్లను ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, భువనగిరి ప్రాంతాలకు చెందిన బడా రియల్టర్లు స్థానికంగా ఉండే కొంతమందిని బినామీలుగా మలుచుకుని ప్లాట్ల బిజినెస్‌కు శ్రీకారం చుడుతున్నారు. అనుమతులు లేని వెంచర్లపై అధికారులు కొరడ ఝళిపిస్తేనే అమాయకులు వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. లేఔట్ లేని ప్లాట్లను కొనుగోలు చేయవద్దు.. అనుమతి లేని లేఔట్ ప్లాట్లను కొనుగోలు చేయవద్దు. లేఔట్ లేని ప్లాట్లను కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. బ్యాంకు నుంచి రుణం లభించదు. డబుల్ టాక్స్ పడుతుంది. భూ వివాదాలు వస్తాయి. నెల్లుట్ల, నిడికొండ, యశ్వంతాపూర్‌లో ఉన్న వెంచర్లకు మాత్రమే అనుమతి ఉంది. మరో ఐదు వెంచర్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నాం. - రంగు వీరస్వామి, టీపీఓ -
అంబాపురంలో మరో భూదందా
స్థలం వారిదే.. కానీ, వారి ఆధీనంలో లేదుకోర్టు తీర్పు వారికి అనుకూలంగానే వచ్చింది.. కానీ, పోలీసులు అమలు చేయరుఎందుకంటే.. అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంఅక్కడ వివాదాస్పద ప్రజాప్రతినిధి చెప్పిందే వేదంఆ వర్గం అడుగుపెట్టిన భూమి వారిదే..రాజధానిని దందాలతో హడలెత్తిస్తున్న ఆ ప్రజాప్రతినిధి మరోభూబాగోతం వెలుగులోకి వచ్చింది. విజయవాడ అంబాపురం సుందరయ్యనగర్‌లో దాదాపు రూ.2కోట్ల విలువైన స్థలాన్ని వారు గుప్పెటపట్టారు. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థ స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్నేశారు. దాదాపు 20 సెంట్లు ఉన్న ఆ స్థలం మార్కెట్ ధర దాదాపు రూ.2 కోట్లు. ఖాళీగా ఉన్న ఆ భూమిలోకి ఆ ప్రజాప్రతినిధి వర్గీయులు కొన్ని నెలల క్రితం ప్రవేశించి తాత్కాలిక ప్రహరీ నిర్మించారు. ఆ విషయం తెలిసి స్థల యజమానులు ప్రశ్నిస్తే బెదిరించి పంపేశారు. తప్పుడు పత్రాలు చూపిస్తూ ఆ భూమిని మరొకరి నుంచి తాము కొన్నామన్నారు. స్థల యజమానులు తమ వద్ద ఉన్న అసలైన పత్రాలను చూపించినా ససేమిరా అన్నారు. కోర్టు ఆదేశించినా.. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. 2017, నవంబరులో యజమానులకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ కాపీ పట్టుకుని భూమి వద్దకు వెళ్తే మళ్లీ ప్రజాప్రతినిధి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో స్థల యజమానులు పోలీసుల వద్దకు వెళ్లారు. తమ స్థలాన్ని తమకు అప్పగించేలా చూడాలని కోరారు. స్టేషన్ ఆఫీసర్ స్థాయి పోలీసు అధికారి కోర్టు తీర్పు పట్ల సానుకూలంగా స్పందించారు. కానీ, ఆయన కంటే ఓ మెట్టుపై ఉన్న ఓ మధ్యస్థాయి అధికారి మాత్రం ససేమిరా అన్నారు. ప్రజాప్రతినిధి వర్గీయులకు అండగా నిలుస్తూ స్థల యజమానులను బెదిరించారు. ఏదో సెటిల్మెంట్ చేసుకుని ఆ స్థలాన్ని వదులుకోవాలని సూచించారు. అందుకు వారు సమ్మతించలేదు. సివిల్ కేసులో కోర్టు తీర్పును అమలుచేయాలి కదా.. అని పోలీసులను కోరారు. దీంతో ఆ పోలీస్ అధికారి తీవ్రంగా స్పందిస్తూ.. ‘నా మాట విని ఆ స్థలం మీద ఆశ వదులుకో. లేకపోతే ఈ సివిల్ కేసు కాస్తా క్రిమినల్ కేసుగా మారుతుంది జాగ్రత్త..’ అని హెచ్చరించడంతో బాధితులు బిత్తరపోయారు. ఆ పోలీసు అధికారి.. అధికార పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. విగ్రహాల మాటున దందా స్థల యజమానులు తమ భూమిలోకి వెళ్లేందుకు పోలీస్ రక్షణ కావాలని కోర్టును ఆశ్రయించారు. ఇంతలో ప్రజాప్రతినిధి వర్గం ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో స్థల యజమానులు ‘ఆ స్థలం న్యాయస్థానం పరిధిలో ఉంది’ అనే బోర్డును ఏర్పాటుచేశారు. కానీ, ప్రజాప్రతినిధి వర్గం ఆ బోర్డును తొలగించేసింది. కోర్టు తీర్పు బాధితులకు అనుకూలంగా వస్తుందని ప్రజాప్రతినిధి వర్గం భావించింది. దీంతో అక్కడ వినాయక విగ్రహాలను పెట్టింది. ఆ స్థలాన్ని అసలు యజమానులకు అప్పగించేలా పోలీస్ రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశిస్తే.. అక్కడ విగ్రహాలను తొలగించాలి. అలా జరిగితే విగ్రహాలను తొలగిస్తున్నారంటూ కొత్త వివాదం సృష్టించాలన్నది పన్నాగం. రాజధానిలో ఆ టీడీపీ ప్రజాప్రతినిధి దందాల్లో ఇదో సరికొత్త కోణం. అందుకు పోలీస్ అధికారి అండగా నిలుస్తుండటంతో బాధితుల గోడు వినే నాథుడే లేకుండాపోయాడు. -
‘బొండా’గిరిలో కొత్తకోణం
విజయవాడ : బొండాగిరిలో కొత్త కోణం తెరపైకి తెచ్చారు. తాము అక్రమంగా చేజిక్కించుకున్న ఆస్తిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఎదురు కావటంతో బొండా అనుచరులు దాయాదుల మధ్య వైరం ఆసరాగా చేసుకొని పావులు కదుపుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబ కలహాలను సాకుగా తీసుకొని ఆ భూమిని ఖాళీ చేయకుండా పాగా వేసేందుకు బొండా అనుచరులు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యానారాయణ పెద్ద కుమారుడు కేశిరెడ్డి వెంకటేశ్వరరావు భార్య అప్పల నర్సమ్మను బొండా అనుచరుడు, రియల్టర్ మాగంటి బాబు విజయవాడ సబ్–కలెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చి మీడియాను పిలిచారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి గాకుండా స్వాతంత్య్ర సమరయో«ధుని పూర్వార్జిత ఆస్తుల ద్వారా వచ్చిన భూమి 1.69 సెంట్లను గత ఏడాది ఏప్రిల్‌లో అప్పల నర్సమ్మ, మాగంటి బాబుకు విక్రయించింది. స్వాతంత్ర సమరయోధుడి కోటాలో వచ్చిన భూమిని బొండా అనుచరులు రకరకాలుగా నకిలీ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ వ్యవహారాలు సీఐడీ విచారణతో బహిర్గతమైంది. బొండా అనుచరులు తాము కొనుగోలు చేసినట్లు చెబుతున్న రామిరెడ్డి కోటేశ్వరరావు ఆ భూమికి తనకు సంబంధం లేదని, నకిలీ డాక్యుమెంట్లతో మాగంటి బాబు మోసగించాడని ప్రకటించారు. దీంతో బొండాగిరి బట్టబయలైంది. ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబంలో దాయాదుల వైరాన్ని బొండా అనుచరలు తెరపైకి తెచ్చారు. ఎవరి భూమీ కబ్జా చేయలేదు : మాగంటి బబు తాను ఎవరి భూమి కబ్జా చేయలేదని రియల్టర్, బిల్డర్ మాగంటి బాబు స్పష్టం చేశారు. సబ్–కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణలో పూర్తి విషయాలు బయటకు వస్తాయన్నారు. తనది తప్పుని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. సురేష్‌బాబు దొంగ కాగితాలతో రకరకాల ఫిర్యాదులు చేస్తున్నాడని ఆరోపించారు. నా మరిది కొడుకులు మోసం చేశారు: అప్పల నర్సమ్మ తన మరిది కుమారుడు కేశిరెడ్డి రామకృష్ణ కుమారులు కేశిరెడ్డి సురేష్‌బాబు, శ్రీనివాసరావు తనను మోసం చేశారని కేశిరెడ్డి సూర్యనారాయణ భార్య అప్పలనర్సమ్మ మీడియాకు చెప్పారు. సబ్–కలెక్టర్ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ కేశిరెడ్డి సురేష్‌బాబు తన ఆస్తిని కాజేసేందుకు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. తన భర్త ద్వారా వచ్చిన పూర్వార్జిత ఆస్తిని కూడా తనను విక్రయించకుండా దొంగ డాక్యుమెంట్లతో అడ్డుపడ్డారని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుడి కోటాలో వచ్చిన భూమిని కూడా తనకు దక్కకుండా సురేష్‌బాబు అతని కుటుంబసభ్యులు తప్పుడు డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మాగంటి బాబు ఎటువంటి మోసానికి పాల్పడలేదని వెల్లడించారు. -
ఇదేం ‘భూ’బాగోతం?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : అధికార యంత్రాంగం అండతో ప్రజాప్రతినిధులు, కబ్జాదారులు నెన్నెల మండలంలో సాగించిన భూదందాలపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్పందించింది. మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాకుండా, ఆ భూములకు నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి, బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందిన ఆధారాలను పరిశీలించింది. నాలుగు వారాల్లోగా నెన్నెల భూదందాకు సంబంధించిన అంశాలన్నింటిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్‌ను ఆదేశించింది. నెన్నెల భూబాగోతాలపై 2017 సెప్టెంబర్ నెలలో ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వార్త కథనాల ఆధారంగా గొల్లపల్లికి చెందిన ఇందూరి రామ్మోహన్ అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాక్షి కథనాలకు తోడు మండలంలోని పలు గ్రామాల్లో ఆక్రమణలకు గురైన భూములకు సంబంధించిన ఆధారాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వారి బంధువుల పేర్లతో ఆన్లైన్ పహాణీల్లోకి ఎక్కిన భూముల వివరాలను హైకోర్టు ముందుంచారు. ప్రభుత్వ భూములకు పాస్ పుస్తకాలు తయారు చేసి, మూడు బ్యాంకుల నుంచి రుణాలు పొందిన ఆధారాలు కూడా సమర్పించారు. ఈ పిల్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం కేసు తీవ్రతను గుర్తించి, నాలుగు వారాల్లోగా నివేదిక అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు వ్యాఖ్యానించింది. రెండు వేల ఎకరాలు కబ్జా! మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోనే అత్యధికంగా 16,679 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నట్లు రికార్డులు చెపుతున్నాయి. వీటిలో 1977.63 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు అధికారికంగా తహసీల్ధార్ కార్యాలయం దగ్గరున్న భూ రికార్డులు చెపుతున్నాయి. ఇవి కాకుండా గత నాలుగేళ్ల కాలంలో మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. నెన్నెలలో జరిగిన, జరుగుతున్న భూ దందాలపై ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలను ప్రచురించింది. నెన్నెల ఎంపీపీ, గ్రామ సర్పంచ్, మండల కో ఆప్షన్ సభ్యుడితో పాటు పలువురు అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు సాగించిన భూ ఆక్రమణలను సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లోకి వెళ్లేందుకు ఏకంగా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.13 లక్షలు వెచ్చించి రోడ్డు నిర్మాణం చేయడాన్ని కూడా సాక్షి ఆధారాలతో సహా బహిర్గతం చేసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ నెన్నెల భూదందా కథనాలపై కలెక్టర్ ఆర్వీ. కర్ణన్ కూడా స్పందించారు. నకిలీ పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రభాకర్‌ను విచారణాధికారిగా నియమించారు. ఆయన తన నివేదికను కలెక్టర్‌కు సమర్పించినట్లు సమాచారం. ఈలోగా ఇందూరి రామ్మోహన్ హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం విచారణకు వచ్చింది. కలెక్టర్ ఇచ్చే నివేదికపైనే పురోగతి ఆధారపడి ఉంది. -
వేసేయ్ పాగా.. కాజేయ్ జాగా!
ప్రభుత్వ పాలన మనదే కదాని తెలుగు తమ్ముళ్లు ఆక్రమణలకు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలే కదా అని పాగా వేసి.. జాగా కాజేస్తున్నారు. అధికారం ముసుగులో ప్రభుత్వ స్థలాల భక్షకులుగా మారుతున్నారు. వారే కాదు వారి బంధువులు సైతం దర్జాగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నెల్లూరు–ముంబాయి జాతీయ రహదారి ఎన్‌హెచ్–67పై రోడ్డు పక్క స్థలాలు ఆక్రమించుకుంటూ వ్యాపార గదులు నిర్మించి అడ్వాన్సులు, అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఆత్మకూరు: గత స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మేజర్ పంచాయతీగా ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీగా, ఆ తర్వాత రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అభివృద్ధి చెందడంతో అంతే వేగంగా పట్టణంలో ఆక్రమణలు జోరందుకున్నాయి. రాష్ట్ర రహదారిగా ఉన్న నెల్లూరు–ముంబయి రోడ్డు సైతం జాతీయ రహదారిగా మారడంతో ఇటీవల కోట్లాది రూపాయలతో నాలుగు లైన్ల రహదారిగా విస్తరించారు. వాహనాల రద్దీ పెరిగి వ్యాపారాల నిర్వహణకు అనువుగా తయారైంది. ఇదే అదనుగా స్థానిక టీడీపీ నేతలు మున్సిపల్ పాలకవర్గానికి చెందిన కొందరు నాయకులు దర్జాగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి గదులు నిర్మిస్తున్నారు. గత ఏడాది ఓ నాయకుడు నెల్లూరుపాళెం సెంటర్లో ఐదు గదులతో కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకు ఇచ్చేశాడు. ఓ పేదవాడు బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన దుకాణం నిర్ధాక్షిణ్యంగా తొలగించిన అధికారులు టీడీపీ నేతల ఆక్రమణల వైపు కన్నెత్తి చూడటం లేదు. అది నీకు.. ఇది నాకు ఆక్రమణల్లోనూ తెలుగు తమ్ముళ్లు సమన్యాయం పాటిస్తున్నారు. పాలకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత అండదండలతో స్థానిక టీడీపీ నాయకులు ఓ కౌన్సిలర్ సమీప బంధువు ఈ ఆక్రమణల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాన్ని ప్రధాన రోడ్డుకు అనుసంధానం చేస్తూ చదును చేసేందుకు మట్టి కూడా తొలి సిద్ధంగా ఉంచారు. మరో రెండు రోజుల్లో ఈ స్థలాన్ని చదును చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా ఇలా మట్టి తొలి..ఆ తర్వాత ఆక్రమించడం పరిపాటిగా మారింది. మరెవరూ ఈ స్థలాల జోలికి రాకుండా అడ్డుగా కంపకర్ర సైతం వేశారు. దీనికి తోడు సెంటర్లో కొంత స్థలాన్ని స్థానిక టీడీపీ నేత సొంతంగా ఆక్రమించి గదులు కట్టేందుకు మెటిరియల్ చేర్చేశాడు. ఇలా తెలుగు తమ్ముళ్ల ఆ స్థలం నీకు ఈ స్థలం నాకు మరో స్థలం మన మరో నాయకుడికి అంటూ కేటాయింపులు చేసుకోవడంతో స్థానికులు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆక్రమణల విషయం మున్సిపల్, రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకునే పరిస్థితి లేదు. మట్టి సైతం ఈ ఆక్రమిత స్థలాల్లో చదును చేసేందుకు తోలిన మట్టి సైతం పట్టణంలోని పాత పంచాయతీ కార్యాలయం లగించిన అనంతరం చదును చేసే క్రమంలో వచ్చిన మట్టిని ఇక్కడకు తరలించారు. ఈ మట్టి తొలగించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. అయితే ఆ మట్టిని సైతం తెలుగు తమ్ముళ్లు తాము ఆక్రమించిన స్థలాలకు కొంత తోలుకోగా మరికొంత మట్టిని ట్రాక్టర్ రూ.300 చొప్పున అమ్ముకున్నారు. ఇలా బరి తెగించి తెలుగు నేతలు ప్రవరిస్తున్న తీరును చూసి పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పరిశీలించి ఆక్రమణలను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమిత స్థలాల్లో బోర్డులు పెడతాం మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఆక్రమిత స్థలాల్లో ప్రభుత్వ స్థలాలనే బోర్డులను ఏర్పాటు చేస్తాం. గతంలో జాతీయ రహదారికి విస్తరించక ముందు అనాదిగా దుకాణాలను పెట్టుకున్న వారికి మాత్రమే అవకాశమిస్తాం. మరెవరైనా కొత్తగా ఏర్పాటు చేస్తా ఉపేక్షించాం. ఆక్రమణలను తొలగిస్తాం. – వీ శ్రీనివాసరావు, కమిషనర్ -
చిప్పాడ భూదందాలో మరో వికెట్
సాక్షి, విశాఖపట్నం: రికార్డులు టాంపర్ చేసి..వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జారాయుళ్ల పరం చేసిన భీమిలి మాజీ డిప్యూటీ తహసీల్దార్, ప్రస్తుత ఏపీఐఐసీ డీటీ జి.రాజాశ్రీధర్ను భీమిలి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. క్రైం నెం.151/17 కింద అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. భీమిలి మండలం చిప్పాడ గ్రామంలోని సర్వే నెం.184/6, 184/8, 163/1సీ, 159/3, 94లలో సుమారు 156.95 ఎకరాల మన్సాస్ ట్రస్ట్, ప్రభుత్వ భూములకు అప్పటి తహసీల్దార్ బీటీవీ రామారావుతో కలిసి నంబూరి నారాయణరాజు కుటుంబ సభ్యుల పేరిట పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీలో డీటీ రాజా శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. దాంతోపాటే రామారావు తన మామ పేరిట 1.58 ఎకరాలకు, రాజా శ్రీధర్ తన అత్త ఎన్.కళావతి పేరిట 1.39 ఎకరాల ప్రభుత్వ భూమికి స్వయంగా పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కూడా జారీ చేసేశారు. నంబూరితో కలిసి పాత రికార్డుల్లో కొన్నింటిని ధ్వంసం చేయడం. మరికొన్నింటిని టాంపరింగ్ చేయడంలో కూడా రామారావు, రాజా శ్రీధర్లే కీలక సూత్రదారులుగా పోలీసులు గుర్తించారు. స్టాంప్ డ్యూటీని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం కల్గించారు. ఇప్పటికే ఈ కేసులో బీటీవీ రామారావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు సిట్ కస్టడీలో తీసుకొని రామారావును విచారించింది. అప్పట్లో రామారావుతో పాటు ఇదే మండలంలో పనిచేసి పలు అక్రమాలకు పాల్పడిన రాజా శ్రీధర్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. 250 అర్జీలు పరిష్కారం కాగా ఇప్పటి వరకు తమ పరిధిలోకి వచ్చిన 337 అర్జీల్లో 250 అర్జీలను పరిష్కరించినట్టు సిట్ వర్గాలు ప్రకటించాయి. సిట్ పరిధిలోకి రాని వాటిలో 1700 అర్జీలను పరిగణనలోకి తీసుకుని ఆయా శాఖలు, మండలాలకు రిఫర్ చేయగా.. ఇప్పటి వరకు 1230 అర్జీలకు సంబంధించి సిట్‌కు రిపోర్టులు వచ్చాయి. వీటిలో 645 అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్టు సిట్ ప్రకటించింది. 66 ఎన్‌వోసీల్లో ఇప్పటివరకు 12 ఎన్వోసీలపైనే దర్యాప్తు పూర్తిచేశారు. మిగిలిన వాటిలో సగానికిపైగా దర్యాప్తు కొలిక్కి వచ్చినప్పటికీ నేరతీవ్రతపై ప్రాధమికంగా సిట్ నిర్ధారణకు రాలేకపోతోంది. నాలుగైదు దశాబ్దాల నాటి రికార్డులను లోతుగా అధ్యయనం చేయాల్సి రావడంతో ఆశించినంత వేగంగా దర్యాప్తు జరగడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే కనీసం మరో నెల రోజులపాటు గడువు పొడిగించాలని ప్రభుత్వానికి సిట్ చీఫ్ లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పొడిగించిన గడువు అధికారికంగా ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. దర్యాప్తు ప్రారంభమైన తేదీని పరిగణనలోకి తీసుకుంటే 28వ తేదీ వరకు ఉంది. ఈలోగా ఎన్వోసీలపై దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశాలు లేనందున మరికొంత గడువు కావాలని కోరినట్టు చెబుతున్నారు. ఇంకా దొరకని నంబూరి ఆచూకీ కాగా ఈ కేసులో చిప్పాడ గ్రామంలోని సర్వే నెం. 184/8లో 58 ఎకరాలు, సర్వే నెం.163/1సీలో ఎకరా మన్సాస్ భూములను నంబూరి నారాయణరాజు తన కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. అలాగే అన్నవరం గ్రామ సర్వే నెం.78లో 30 ఎకరాలు, సర్వే నెం.159/3లో 7.95 ఎకరాలు, సర్వే నెం.94లో 26 ఎకరాలను తమ పేరిట రాయించుకున్న నారాయణరాజు కుటుంబం మొత్తం పరారీలోనే ఉంది. వీరి ఆచూకీ తెలపాలంటూ ఈ నెల మూడో తేదీన పోలీసులు ప్రకటన కూడా జారీ చేశారు. కాగా అదే రోజు నారాయణరాజు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందడంతో కావాలనే పోలీసులు ఆచూకీ నాటకం ఆడారన్న విమర్శలు విన్పించాయి. -
వాస్తవాలపై ఉక్రోషం
⇔ ట్యాంపరింగ్ కింగ్‌తో సంబంధాలున్నా... కాదంటూ బుకాయింపు ⇔ వార్తను ప్రచురించిన సాక్షి ప్రతులను తగలబెట్టించిన ఎమ్మెల్యే ⇔ నిజాలు బయటికొస్తే ఉలుకెందుకని విపక్షాల విమర్శలు ⇔ కొన్ని ప్రతులను దహనపరిస్తే...సాక్ష్యాలు పోతాయా అంటూ ఎద్దేవా... సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘పదివేలు నేనిస్తే మర్డర్ చేశారని మీరే రాసేస్తారు... సుధాకర్‌రాజు నాకు తెలుసు. మేం మొదటి నుంచీ ఫ్యామిలీ ఫ్రెండ్స్... డీలింగ్స్, ఫోన్ కాంటాక్టస్ మాత్రం లేవు.. రేపేమైనా కథనం ప్లాన్ చేస్తున్నారా... రేపేమీ రాదుకదా... నాతో మీకు కంఫర్ట్ ఉంటుంది.’.. ఇవీ గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడు ఆదివారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి అన్న మాటలు. సరిగ్గా రాత్రి 10.17 నిమిషాలకు ఫోన్ చేసి 3.57 నిమిషాలపాటు మాట్లాడిన ఎమ్మెల్యే అంతిమ సారాంశం తనపై ఎలాంటి కథనం రాయవద్దని. అయినా ఆయన మాటలకు భయపడి వెనకడుగు వేయకుండా సాక్షి సోమవారం ‘ఓ రాజు..ఓ నాయుడు’ కథనం ప్రచురించింది. ఆ కథనంతో ఉక్రోషంతో ఊగిపోయిన ఎమ్మెల్యే గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడ మండలంలో తన అనుచరగణం చేత ‘సాక్షి’ ప్రతులను తగులబెట్టించారు. సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని, తప్పుడు వార్తలు రాయవద్దని గజపతినగరంలో స్థానిక నేతల చేత మాట్లాడించారు. అయితే సాక్ష్యం లేకుండా ‘సాక్షి’ కథనం రాయలేదని పత్రిక చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమైంది. భూముల రికార్డులను ట్యాంపర్ చేసి విశాఖ పోలీసులకు చిక్కిన సుధాకర్‌రాజుతో ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు సన్నిహితంగా ఉన్న ఫొ టోను ‘సాక్షి’ ప్రాధమిక ఆధారంగా బయటపెట్టింది. అంతేగాదు... ఎమ్మెల్యే వివరణను సైతం కథనానికి జతచేసింది. అయినప్పటికీ ఎమ్మెల్యే అడ్డంగా బుకాయించడంపై అతని నియోజకవర్గంలోనే కాదు... జిల్లా వ్యాప్తంగా జనం నవ్వుకుంటున్నారు. కుటుంబ స్నేహం..కానీ మాట్లాడుకోరంట: సుధాకర్ రాజు తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెబుతున్న ఎమ్మెల్యే మరోవైపు అతనితో ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని చెప్ప డం, కనీసం ఫోన్లో కూడా మాట్లాడింది లేదనడం నమ్మలేని నిజాల ని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి సమాజంలో నాలుగో స్తంభంగా నిలిచే పత్రిక ప్రతులను దహనం చేయడంపై జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలూ మండి పడుతున్నాయి. అలా చేయడం ద్వారా సాక్షాత్తూ ఎమ్మెల్యేనే రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారని ఖండిస్తున్నారు. మరోవైపు విపక్షాలు సైతం ఎమ్మెల్యే దుశ్చర్యపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గతం నుంచీ ఎన్నో ఆరోపణలు ఎ దుర్కొంటున్న ఎమ్మెల్యే దీనిపై అనుసరించిన వైఖరిని తప్పు పడుతున్నాయి. సుధాకర్‌రాజు కుటుం బంతో ఎమ్మెల్యేకున్న సంబంధాలు ప్రజలందరికీ తెలిసినవేనని, ఇప్పుడు అడ్డంగా దొరికి బుకాయిస్తే ఎవరూ నమ్మరని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదిలా ఉండగా సుధాకర్‌రాజును అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. దానిలో జిల్లాకు చెందిన టీడీపీ నేతల పేర్లు ఉన్నాయని తాజా సమాచారం. ఆ వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. భుజాలు తడుముకోవడం ఎందుకు వార్త వస్తే భుజాలెందుకు తడుముకుంటున్నారు. పత్రికలు తగలబెడితే నిజాలు మాసిపోతాయా... విశాఖ భూకుంభకోణంలో నిజంగా తనకు ప్రమేయం లేదని రుజువు చేసుకోవాలి. – గదల సన్యాసినాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు, నెల్లిమర్ల రుజువు చేసుకోవాలి విశాఖపట్నం భూకుంభకోణంలో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని రుజువు చేసుకోవాలి. సాక్షి పత్రికపై కక్షసాధింపు చర్యకు దిగడం సమంజసం కాదు. – కె.ఎన్.ఎం.కృష్ణారావు, బీజేపీ నెల్లిమర్ల ఇన్చార్జ్ -
ఓ రాజు.. ఓ నాయుడు
♦ భూ కుంభకోణంలో గజపతినగరం ఎమ్మెల్యే హస్తం! ♦ ట్యాంపరింగ్ కింగ్ సుధాకర్ రాజుతో కె.ఎ.నాయుడుకి సంబంధాలు ♦ విశాఖవ్యాలీ స్కూల్ వెనుక భూములతో పాటు మరిన్ని భూముల ఆక్రమణ ♦ ఎమ్మెల్యే, మంత్రుల అండదండలతో చక్రం తిప్పిన సుధాకర్ రాజు సాక్షి ప్రతినిధి, విజయనగరం: మద్యం మాఫియా.. భూ మాఫియా.. కాల్ మనీ.. ఇసుక దందా.. మైనింగ్ దందా ఇలా రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా, ఏ అక్రమం వెలుగు చూసినా దానిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉంటోందన్నది ప్రజల మాట. తాజాగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విశాఖ భూ కుంభకోణంలో ట్యాంపరింగ్ కింగ్ సుధాకర్‌రాజుతో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడుకు ఉన్న సంబంధాలు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. ఎ.ఆర్.కానిస్టేబుల్‌గా పనిచేస్తూ డీఎస్పీనంటూ దందాలు చేసి ఉద్యోగం పోగొట్టుకొని రియల్టర్ అవతారమెత్తి భూ దందాలకు పాల్పడిన చేకూరి సుధాకర్‌రాజు అలియాస్ చింతాడ సుధాకర్ రాజును భూ రికార్డుల ట్యాంపరింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆయన వెనుక టీడీపీకి చెందిన కొందరి పెద్దల హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు పేరు బయటకొచ్చింది. దందాయే ఎజెండాగా.. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు నకిలీ పత్రాలను సృష్టించి అధిక ధరలకు విక్రయించి కోట్ల రూపాయలు గడించిన సుధాకర్ రాజు ఆ తరువాత రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకున్నాడు. వారి అండతో మరిన్ని ప్రభుత్వ, ప్రైయివేటు భూములను ఆక్రమించడం, రికార్డులను ట్యాంపర్ చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు సృష్టించడం నిత్యకృత్యంగా మార్చుకున్నాడు. అక్కడితో ఆగక కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో కుటుంబ పరమైన సంబంధాలను ఏర్పర్చుకున్నాడు. అలా ఆయన కుటుంబానికి దగ్గరైన వారిలో గజపతినగరం ఎమ్మె ల్యే కె.ఎ.నాయుడు ప్రథముడన్నది సమాచారం. విశాఖవ్యాలీ స్కూల్ వెనుక సర్వే నంబర్ 124లో 24.05 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి అమ్మేస్తానంటూ బేరాలు పెట్టిన సుధాకర్‌రాజు ఆ భూమి తనకు విజయనగర రాజుల ద్వారా సంక్రమించిందని చెప్పుకునే వాడు. అయితే, వాస్తవానికి ఆ భూమితో పాటు రుషికొండ, మధురవాడ, విశాఖనగరంలో పలు భూములను ఆక్రమించుకొని విక్రయించడం వెనుక టీడీపీ ఎమ్మె ల్యే హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సుధాకర్‌రాజు కుటుంబంతో కె.ఎ. నాయుడుకు ఉన్న సంబంధాలు జిల్లా వ్యాప్తంగా గతంలోనే చర్చనీయాంశమయ్యాయి. అవి భారీ కుంభకోణంలో భాగస్వామ్యం అయ్యేంత వరకు సాగాయనేది తాజా గా వెలుగులోకి వస్తోంది. కె.ఎ.నాయుడు ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని, ఇప్పటికే అధిష్టానానికి పలువురు టీడీపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. ఆయన తండ్రి పైడితల్లినాయుడు పేరును చెడగొడుతున్నాడని జనం దుమ్మెత్తి పోస్తున్నారు. అంగన్వడీ పోస్టులు అమ్ముకోవడం దగ్గర నుంచి రైస్ పుల్లింగ్ కాయిన్స్ నిందితులతో సంబం« దాల వరకు ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నాయి. సంక్షేమ నిధులను సొంతానికి వాడుకోవడం, ఉద్యోగాల పేరుతో సొమ్ములు దండుకోవడం, కోట్ల రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టడం ఆయనకు నిత్య కృత్యమని జనం కోడైకూస్తున్నారు. వీటన్నింటినీ మించి ట్యాంపరింగ్ కింగ్ సుధాకర్ రాజుతో సంబంధాలు బయటపడటం సంచలనమౌతోంది. టీడీపీకి చెందిన విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రధాన అనుచరుడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోకాడ జగన్నాథంనాయుడు పేరు భూము ల ట్యాంపరింగ్ భాగోతంలో ఇటీవల బయటపడటం, ఆ జాబితాలో ఉన్న పేరు తనది కాదని ఆయన చెప్పుకోవడం తెలిసిందే. అయితే, విశాఖలోని కొమ్మా ది గ్రామ పరిధిలో 30/2 సర్వే నంబర్లో 12 ఎకరా లు, 140/పి సర్వే నంబర్లో 10 ఎకరాలకు సంబం ధించిన భూ రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయి. ఈ భూములు జగన్నాథంనాయుడు పేరు మీద రికార్డుల్లోకి చేరాయి. ఆయన సోదరి భర్త భూమిరెడ్డి జగన్నాథకుమార్ పేరు మీద కూడా సర్వే నంబర్ 29/2 లో 7.24 ఎకరాలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో తమకు సంబంధం లేదని వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగానే గజపతినగరం ఎమ్మెల్యే భాగోతం బయటకొచ్చింది. దీనిపై జిల్లా టీడీపీతో పాటు అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి. -
పూర్తి విచారణ జరిగితే మరిన్ని విషయాలు
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దొంగపత్రాలు సృష్టించి హైదరాబాద్‌లో భూ కబ్జాలకు పాల్పడ్డారని సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య వెల్లడించారు. కోర్టుకు దొంగపత్రాలు సమర్పించారని, పూర్తి విచారణ జరిగితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన వెల్లడించారు. దీపక్‌రెడ్డి అండ్ కో వందల ఎకరాలు కబ్జా చేసినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని జోగయ్య వెల్లడించారు. భోజగుట్టలో పేదల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇక్కడ 78.33 ఎకరాలను కబ్జా చేసిన కేసులో పోలీసులు అయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో 8 ఎకరాలు, షేక్‌పేటలో 12 ఎకరాల భూమితో పాటు.. నానక్‌రామ్‌గూడ, జూబ్లీ హిల్స్లలో దీపక్‌రెడ్డి అండ్ కో కబ్జాలకు పాల్పడింది. -
భూంఫట్
-
విశాఖలో భూదందాపై 15న విచారణ
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెల్లడి - రికార్డులు లేకపోవడం వల్లే వివాదమన్న కలెక్టర్ సాక్షి, అమరావతి / విశాఖ సిటీ: విశాఖపట్నం జిల్లాలో సాగిన భూ అక్రమాలపై బహిరంగ విచారణ జరిపిస్తామని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. జూన్ 15వ తేదీ ఉదయం పది గంటలకు అక్కడి కలెక్టరేట్లో జరిగే విచారణలో తనతోపాటు సీనియర్ రెవెన్యూ అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. విశాఖ జిల్లాలో భూ రికార్డులు మార్చివేసి అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూములను కొట్టేశారని, 6,000 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు మాయమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ మేరకు కేఈ కృష్ణమూర్తి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నంలో జరిగిన భూదందా అతిపెద్దదని స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ నిమిత్తం రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ (సీసీఎల్ఏ) నుంచి సీనియర్ అధికారుల బృందాన్ని రికార్డుల పరిశీలనకు విశాఖకు పంపుతామని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితులు వచ్చి ఫిర్యా దు చేస్తే విచారించి సమస్య పరిష్కరిస్తామన్నారు. రికార్డులు లేకపోవడం వల్లే.. కోర్టు వివాదాల్లో ఉన్న దసపల్లా హిల్స్ భూము ల పరిరక్షణకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల ‘సాక్షి’లో దసపల్లా భూములపై వస్తున్న కథనాలపై మంగళవారం ఆయన వివరణ ఇచ్చారు. రాణి కమలాదేవి, ప్రభు త్వానికి మధ్య 1998 నుంచి వివాదాలు నడుస్తున్నా యని, ఇప్పటి వరకు దిగువ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వచ్చిన తీర్పులన్నీ రాణి కమలాదేవికే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇందులో 20 ఎకరాల ప్రభుత్వ భూముల్ని గుర్తించినా.. అవి ఎక్కడ ఉన్నాయో రికార్డులు లేకపోవడం ఈ వివాదానికి కారణమన్నారు. ఇందులో తమ నిర్లక్ష్యం, ఉదాసీనత ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోర్టులో దాఖలైన పలు రిట్ పిటిషన్లను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. -
విశాఖ జిల్లాలో భారీ భూ కుంభకోణం
విశాఖ : విశాఖ జిల్లాలో జరిగిన భారీ భూ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. హుద్ హుద్ తుఫాన్ జిల్లాలో చాలామంది జీవితాలను అతలాకుతలం చేస్తే.. కొందరు బడా బాబులు మాత్రం దీనిని ఆసరాగా చేసుకుని సుమారు రూ.20వేల కోట్ల భూ అక్రమణలకు తెరలేపారు. తుఫాన్లో రికార్డులు కొట్టుకుపోయిన భూములను గుర్తించి భూ అక్రమణలకు పాల్పడ్డారు. ఈ భూ మాఫియాలో మంత్రి, ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి తోడల్లుడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయిదు వేల ఎకరాలకు పైగా ఆక్రమణ జరిగినట్లు తెలుస్తోంది. అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలోనే ఈ భూదందా జరిగింది. బడాబాబులు భూ ఆక్రమణతో వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం నామా మాత్రపు విచారణకు సిద్దమైంది. వచ్చే నెల 15న బహిరంగ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే బహిరంగ విచారణ చేసి టీడీపీ నేతలు తప్పించుకునేందుకు చూస్తున్నారని .. ఈ ఆక్రమణలపై సీబీఐ విచారణ జరపాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. భూ కుంభకోణంపై విచారణ జరుగుతోందని, రికార్డులన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వేలకోట్లతో భూకుంభకోణం జరిగినట్లు గుర్తించామని అన్నారు. అక్రమాలకు పాల్పడిన ఇద్దరు తాహసీల్దార్లపై ఇప్పటికే క్రిమినల్ చర్యలు ప్రారంభించామని తెలిపారు. కాగా జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో ఎఫ్‌ఎంబీలు (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్) సైతం మాయం అయినట్లు గుర్తించారు. మరోవైపు జిల్లాలో భూ ఆక్రమణలు, దందాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులే భూములను ఆక్రమిస్తున్నారని, ఇప్పటికే ఐదారు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని అన్నారు. భూ వివాదాలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు. మధురవాడలో పోలీసులే భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అలాగే విశాఖ భూదందాపై బహిరంగ విచారణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. -
విశాఖ జిల్లాలో భారీ భూ కుంభకోణం
-
విశాఖ భూదందాపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలు, దందాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులే భూములను ఆక్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే ఐదారు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. భూ వివాదాలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు. మధురవాడలో పోలీసులే భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కాగా విశాఖ భూదందాపై బహిరంగ విచారణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి తెలిపారు. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఆయన రెవెన్యూ ఉన్నతాధికారులతో కలిసి విశాఖలో పర్యటించారు. సి.సి.ఎల్.ఎ. కార్యాలయం నుంచి సీనియర్ అధికారులను రికార్డుల పరిశీలనకు పురమాయించామన్నారు. బాధితుల నుంచి వివరాలు తీసుకొనేందుకు పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని నిర్ణయించామన్నారు. జూన్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు విశాఖ కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపడతామని వెల్లడించారు. బాధిత ప్రజలు ఎవరైనా తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లయితే సమస్య తప్పక పరిష్కరిస్తామన్నారు. బాధితులు రాజకీయ వత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ భూదందా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తుందని చెప్పారు. -
ఆరడుగుల బుల్లెట్
మున్నార్... కేరళలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉన్న హిల్‌స్టేషన్. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ వేసవి తాపాన్ని తప్పించుకోవడానికి లక్షలాది పర్యాటకులు ఏటా మున్నార్‌కు వస్తుంటారు. ఇదే అక్కడో మాఫియా పుట్టడానికి కారణం. అది ల్యాండ్ మాఫియా. మున్నార్ ల్యాండ్ మాఫియా. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించి రిసార్టో, హోటలో కట్టేయడం. వాణిజ్య సముదాయాలు లేపేయడం. పార్టీలతో సంబంధం లేకుండా నేతలందరీ బినామీల పేరిట ఇదే దందా. అది 2016 జూలై. దేవికుళం సబ్ కలెక్టర్‌గా ఒక్కడొచ్చాడు... పేరు శ్రీరామ్ వెంకిటరమణన్. 2013లో సివిల్ సర్వీసెస్‌లో దేశంలోనే రెండో ర్యాంకు సాధించిన కేరళవాసి. సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడుతూనే శ్రీరామ్ ఈ ప్రభుత్వ స్థలాల దురాక్రమణలపై దృష్టి పెట్టాడు. రెవెన్యూ యంత్రాగాన్ని పరుగులు పెట్టించి ఆక్రమణలను తొలగించాడు. పార్టీ యంత్రాంగాలు, ట్రేడ్ యూనియన్లు బలంగా ఉండే కేరళలో శ్రీరామ్ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. నిరసనలకు దిగినా, భౌతికంగా అడ్డుగా నిలిచినా, దూషణలకు దిగినా... లెక్కచేయలేదాయన. హైకోర్టులో ఈ కూల్చివేతలు నిలిపివేయాలని పిటిషన్లు పడితే... ప్రతికేసులో పక్కా ఆధారాలు సమర్పించి ప్రభుత్వ భూమిగా నిరూపిస్తూ పోయారు. పోలీసులు సహకరించకున్నా... ఆక్రమణలను కూల్చడంలో వెనుకడుగు వేయలేదు. బెదిరించారు... రాజకీయంగా ఒత్తిడి తెచ్చారు. ప్రజలకేదో సేవచేయాలనే ఉద్దేశంతో డాక్టర్ వృత్తిని వదులుకొని సివిల్స్‌ను ఎంచుకొన్న ఈ యువ అధికారి తగ్గలేదు. అక్రమాలను సహించని స్థానిక యువతలోనూ అతనికి క్రేజ్ ఏర్పడింది. రెండు వారాల కిందట మన్నూర్ సమీపంలోని చిన్నక్కనల్ గ్రామంలో ఆక్రమిత భూమిలో నుంచి ఓ చర్చికి సంబంధించిన శిలువను తొలగించింది శ్రీరామ్ బృందం. అంతే కాచుకొని ఉన్న పార్టీలు రాజకీయం చేశాయి. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే ఫిర్యాదు కేరళ సీఎం పినరయి విజయన్‌కు వెళ్లింది. అఖిలపక్షం నిర్వహించే దాకా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని విజయన్ ఇడుక్కి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేశారు. అయితే అఖిలపక్షం పెట్టేదిశగా సీఎం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సీపీఎంలో బలమైన నాయకుడిగా పేరున్న విద్యుత్‌శాఖ మంత్రి కె.కె.మణిది ఇడుక్కి జిల్లానే. శ్రీరామ్ ధోరణితో రగిలిపోతున్న ఆయన ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ‘చర్చిలు, దేవాలయాలు, మసీదులు ఎన్నో పట్టాలేని భూముల్లో ఉన్నాయి. వీటిని తొలగించొచ్చని ఓ మూర్ఖపు సబ్ కలెక్టర్ అనుకుంటే... అతన్ని పిచ్చాసుపత్రికి పంపాల్సిందే’ అని తన అక్కసును వెళ్లగక్కారు. శ్రీరామ్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోరు. చట్టానికి లోబడి పనిచేస్తున్నపుడు... తానెవరికీ భయపడాల్సిన పనిలేదని అంటారాయన. బదిలీలు అనేవి ఉద్యోగికి మామూలేనని తేలికగా తీసుకునే.. శ్రీరామ్ విషయంలో కేరళలోని సీపీఎం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. నిజాయితీ పరుడైన అధికారిని అకారణంగా బదిలీ చేశారనే అపవాదు తెచ్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుందా? గుబురుగా పెరిగిన గడ్డం, జీన్స్ ప్యాంటు, పైన జాకెట్ లేదా టీషర్ట్. ఇదీ శ్రీరామ్ ఆహర్యం. సామాన్యుడిలా బుల్లెట్‌పై మున్నార్ చుట్టుపక్కల గ్రామాలన్నీ కలియదిరుగుతూ ప్రజలతో మమేకమవుతుంటారు. అన్యాయంపై ఎక్కుపెట్టిన ఆరడుగుల బుల్లెట్‌గా జనం మన్ననలు అందుకుంటున్నాడీ 31 ఏళ్ల యువ ఐఏఎస్. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బయటపడ్డ టీడీపీ నేతల భూబాగోతం
-
దర్జాగా కబ్జా
రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై టీడీపీ నాయకుల కన్ను ప్రభుత్వ స్థలమే అని కోర్టు చెప్పినా నిర్మాణాలు చేపడుతున్న వైనం ధర్మవరం : అదో ప్రభుత్వ స్థలం. కొందరు నాయకులు ఆక్రమిస్తున్నారని ప్రజాప్రతినిధులు చెప్పినా..అధికారులు పట్టించుకోలేదు. కబ్జాదారులు లెక్కచేయలేదు. కోర్టు సైతం ఆ స్థలం ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పినా.. అధికారం మాది అంటూ హస్తలాఘవం చూపుతున్నారు..ముదిగుబ్బ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు. వివరాలిలా ఉన్నాయి. ముదిగుబ్బ మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములు, స్థలాలు చాలా విలువ చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సెంటు భూమి దాదాపు రూ.20లక్షల మేర పలుకుతోంది. స్థానిక ముదిగుబ్బ పోలీస్‌స్టేçÙ¯ŒS ఎదురుగా రోడ్డు పక్కనే (సర్వే నెంబర్ 905 బీ9. బీ10. బీ11. బీ12లో) 12సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. 11ఏళ్ల క్రితం ఈ స్థలంలో ఇద్దరు రెవెన్యూ ఆర్ఐలు, ఒక విశ్రాంత వీఆర్ఓ, మరికొందరు నాయకులు కలిసి ఈ స్థలానికి ప్రభుత్వం నుంచి పట్టా తెచ్చుకున్నట్లు దొంగ పట్టాలు వారి పేర్లమీద సృష్టించుకుని అందులో భవన నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారంటూ 2005లో కొందరు టీడీపీ నాయకులు తెర వెనక ఉండి స్థానికులతో హైకోర్టులో పిల్ వేయించారు. ఈ వివాదాన్ని పూర్తిగా విచారించిన కోర్టు పట్టాలు నకిలీవని, ఆ స్థలం ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో సదరు వ్యక్తులు సుప్రీం కోర్టులో సైతం మళ్లీ కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో సదరు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను ఆపి వేసి మిన్నకుండిపోయారు. నాటి నుంచి ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే ఈ స్థలంపై కన్నేసిన అధికార పార్టీ మండల నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మండలంలో కీలకంగా వ్యవహరించే ముగ్గురు టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రాత్రికి రాత్రే ఆ స్థలంలో రాళ్లు, ఇసుకు తోలి గతంలో అర్ధంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలపై కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఈ కబ్జాల పర్వాన్ని మండల ప్రజలు ముదిగుబ్బ ఎంపీపీ వేలూరి మాలతి దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఎంపీపీ కబ్జా విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోయింది. దీంతో ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, అక్కడ నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అయినా సరే.. ఆక్రమణదారులు పట్టపగలే ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడతున్నారు. ఇది తెలిసినా అధికార పార్టీ నేతలతో కుమ్మక్కైన స్థానిక రెవెన్యూ అధికారులు కన్నెత్తికూడా చూడలేదు. ఇప్పటిౖకెనా ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
సీఎం సాక్షిగా....ఇసుక దోపిడీ !
-
మానుకోటలో భూ మాఫియా
జిల్లా కేంద్రం ఏర్పాటుతో పెరుగుతున్న సమస్యలు రెచ్చిపోతున్న కబ్జాదారులు సామాన్యులకు ఇబ్బందులు కలెక్టర్‌కు, ఎస్పీకి వినతుల వెల్లువ సాక్షి, హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడుతోంది. ఈ విషయంలో మహబూబాబాద్‌లోని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు, సిబ్బంది, వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు సామాన్యులు సంతోషపడుతున్నారు. పరిపాలన తమకు దగ్గరగా ఉండబోతుందని అనుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో భూములు ఉన్న వారు తమ ఆస్తుల విలువ పెరిగిందని భావిస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పడుతున్న విషయంలో ఇది ఓ వైపు అంశం. దీనికి విరుద్ధంగా మరొకటి జరుగుతోంది. భూముల విలువ పెరుగుతుండడంతో భూమాఫియా విజృంభిస్తోంది. పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల భూములను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఏళ్లుగా ఆధీనంలో ఉన్న, సాగు చేసుకుంటున్న భూముల్లో పట్టపగలే రాళ్లు నాటి కబ్జా చేస్తున్నారు. ఈ భూములు తమవే... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. బాధితులు భయంతో మిన్నకుండిపోతున్నారు. కొందరు ధైర్యం చేసి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. విషయం తమది కాదంటే... తమది కాదని చెబుతూ ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు న్యాయం కోసం జిల్లా కలెక్టరును, పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. కష్టపడి కొనుకున్న తమ భూములను కాపాడాలంటూ విన్నవించుకుంటున్నారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన వారు ప్రతీరోజు జిల్లా కేంద్రానికి వచ్చి ఉన్నతాధికారులకు వినతులు ఇస్తున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు ఏమోగానీ.. కష్టపడి కొనుకున్న తమ భూములు పరాధీనమవుతున్న తీరుపై ఆందోళనకు గురువుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన 50 మంది బుధవారం వరంగల్‌కు వచ్చారు. జిల్లా కలెక్టరు, వరంగల్ రూరల్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ‘పదేళ్ల క్రితం 300 మంది కలిసి భూములు కొనుకున్నాము. భూక్యా శ్రీను, కాలేరు మురళీ, వీరమల్ల మురళి, జానీ మరికొందరు కలిసి మా భూములు ఆక్రమించుకున్నారు. మేం మా ప్లాట్ల వద్దకు వెళితే అనుచరులతో దాడిచేయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. మా భూముల విషయంలో గతంలో మహబూబాబాద్ ఎంఆర్ఓగా పనిచేసిన భాగ్యమ్మ విచారణ జరిపారు. భూములు కొన్న వారు రెవెన్యూ రికార్డులలో పేర్లు నమోదు చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ధ్రువీకరించారు. మీరు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయండి’ అని వినతి పత్రంలో కోరారు. మహబూబాబాద్ ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రతి రోజు ఇలాంటి వినతులు వందల సంఖ్యలో ఉంటున్నాయి. ఉన్నతాధికారులు పట్టించుకుని న్యాయం చేస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు. -
భూదందా ఆపండి
రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా మచిలీపట్నం (చిలకలపూడి) : విదేశీ కంపెనీల కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న భూదందా ప్రయత్నాలను ఆపాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి యద్దనపూడి సోనీ డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లడుతూ విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని పెంచేందుకు ఎంఏడీఏను ఏర్పాటు చేశారన్నారు. మచిలీపట్నం అభివృద్ధి పేరుతో ఎంఏడీఏ ద్వారా 1.05 లక్షల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని విమర్శించారు. రైతుకూలీ సంఘం నాయకులు ఎం. రాంబాబు, యు. వీరబాబు, సిటీ బస్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు డి. కామేశ్వరరావు పాల్గొన్నారు. -
కబ్జాదారుల జాబితా విడుదల చేస్తాం
బెంగళూరు (బనశంకరి): నగరంలో రాజ కాలువలు, బఫర్‌జోన్ ఆక్రమణకు పాల్పడిన వారి పేర్లను విడుదల చేస్తామని నగర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ఆర్.రమేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిజమైన అక్రమణదారులను రక్షిస్తూ మధ్యతరగతి, పేద వర్గానికి చెందిన వారిని బలి చేస్తోందని, దీంతో తాము రాజకాలువలు ఆక్రమించిన నేతలు, అధికారుల పేర్లను త్వరలో విడుదల చేయాలని తీర్మానించామన్నారు. ఇప్పటికే 2300 మందికి పైగా బిల్డర్ల జాబితాను సిద్ధం చేశామని, ఇలాంటి బిల్డర్లకు కొందరు రాజకీయ నేతల అండ ఉందన్నారు. మరికొందరు బీబీఎంపీ అధికారులు బిల్డర్లతో చేతులు కలిపి అక్రమాలు బయటకు రాకుండా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమణ దారుల పేర్లను వెబ్సైట్లో ప్రకటిస్తామని సీఎం. సిద్దరామయ్య తెలిపారని, అయితే వెబ్సైట్లో ప్రకటించిన వ్యక్తులు అమాయకులైతే ప్రయోజనంలేదన్నారు. తాము ఇక మూడు రోజులు వేచి చూస్తామని నిజమైన కబ్జాదారుల జాబితాను ప్రభుత్వం ప్రకటించకపోతే బుధవారం తామే అక్రమణదారుల బండారం బయట పెడతామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
‘పచ్చ’మార్కు అక్రమం
సాగు భూమిని దౌర్జన్యంగా తవ్వేసిన తెలుగు తమ్ముళ్లు ‘మా భూమి’ అంటూ బాధితులు గగ్గోలు పెట్టినా ఎవ్వరికీ పట్టని వైనం కోర్టు జోక్యంతో ఆగిన అక్రమం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కష్టార్జితంతో కొన్న భూమిని సాగు చేసుకుంటూ సాఫీగా సాగుతున్న జీవితాలపై అక్రమార్కుల కన్ను పడింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లొసుగును ఆసరాగా చేసుకుని ఆ భూమిలో మట్టి తవ్వకాలు చేసేశారు. పట్టెడన్నం పెట్టే నేల తల్లిని గుల్ల చేస్తుంటే చూడలేని రైతు కనిపించిన అధికారినల్లా.. ‘మా భూమి’ సారూ.. అంటూ కాళ్లావేళ్లా పడ్డారు. అయితే ఆ రైతు గుండెఘోష ఎవ్వరికీ పట్టలేదు. న్యాయదేవతకే చెప్పుకుంటానని కోర్టు మెట్లెక్కాడు. హైకోర్టు మొట్టికాయలతో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టపడింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేల తల్లిని నిలువునా తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. రైతుకు వేదన మిగిల్చారు. చిలకలూరిపేట టౌన్ : మట్టి, ఇసుక, అసైన్డ్ భూములు కావేవీ దోపిడీకి అనర్హం అంటున్నారు అధికార పార్టీ నాయకులు. రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు మాత్రం ఒత్తిళ్లకు తలొగ్గి, ఆమ్యామ్యాలపై ఆశతో మటì ్ట దోపిడీకి సహకరిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ మట్టి దందాకు అంతేలేకుండాపోతోంది. బాధితులు తమ హక్కుల కోసం నాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రెవెన్యూ రికార్డులు వెతికి మరీ.. దశాబ్దాల నాడు పంపిణీ చేసిన చెరువు పోరంబోకు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్గా ఉందన్న సాకుతో సాగు భూమిలో మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం వారికి దక్కే వాటాల కోసం ఈ తతంగానికి తమ వంతు సహాయం అందజేస్తున్నారనటానికి ఇటీవల వెలుగుచూసిన సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. చిలకలూరిపేట మండలంలోని యడవల్లి గ్రామ సర్వే నంబర్ 52లో గోపాళంవారికుంటకు చెందిన 4.08 ఎకరాల భూమిని 1951లో ఆర్మీలో పనిచేసి చనిపోయిన వ్యక్తి భార్య జెల్లుడు దీనమ్మకు పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భూమి సాగులో ఉంది. ఆమె తదనంతరం ఆమె వారసులైన కుమార్తె దేవసహాయమ్మ ఆ భూమిని దశలవారీగా విక్రయించింది. వివిధ విక్రయాల అనంతరం చివరగా ఈ భూమి చుండి తిరుపతయ్య 1.04 ఎకరాలు, ఆయన భార్య చుండి పార్వతివర్ధని పేరున 3.04 ఎకరాలు కొని సాగు చేసుకుంటున్నారు. వారిపేరునే అడంగల్, పాసు పుస్తకాలు, శిస్తులు ఉన్నాయి. ఈ భూమిపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూమిగా ఉందంటూ సుమారు రెండు నెలల కిందట తవ్వకాలు చేపట్టి మట్టి విక్రయాలకు దిగారు. దీంతో బాధితులు అధికారుల చుట్టూ తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో ప్రదక్షిణలు చేశారు. ఫలితం లేకపోవడంతో చివరకు బాధితులు హైకోర్టును ఆశ్రయించి స్టేటస్కో పొందారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిత్యం పచ్చగా ఉండే పంట భూమి తవ్వి గుంట చేశారు. కోర్టు తీర్పుకు విరుద్ధంగా.. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల వివాదం విషయంలో 2015 డిసెంబర్లో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు 1954 జూన్ 18వ తేదీకి ముందు అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సంబంధిత భూమి రెవెన్యూ అధికారులు ప్రకటించిన నిషేధిత జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారి నుంచి రిజిస్ట్రేషన్ అధికారి వివరణ కోరాలి. సకాలంలో సమాధానం రాకుంటే భూమిని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. దీని ప్రకారం 1951లో పంపిణీ చేసిన యడవల్లి గ్రామ సర్వే నంబర్ 52లో గోపాళంవారికుంటకు చెందిన భూమిని అసైన్డ్ భూమి అంటూ తవ్వటం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమే అవుతుంది. మట్టి తవ్వకాలు ఆపాం.. ఈ విషయమై చిలకలూరిపేట తహసీల్దార్ పీసీహెచ్ వెంకయ్యను సాక్షి వివరణ కోరగా నీరు–చెట్టు కార్యక్రమాన్ని నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, రికార్డుల్లో అసైన్డ్ భూమి అని ఉండటంతో తవ్వకాలు చేశారని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తవ్వకాలు నిలిపివేయించామన్నారు. నష్టపరిహారానికి దావా వేస్తాం : చుండి తిరుపతయ్య నా పేరున, నా భార్య పేరున ఉన్న భూమిని మట్టి కోసం తవ్వబోతున్నారని తెలుసుకొని తహసీల్దార్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టా ఇచ్చింది తమ రికార్డుల్లో లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తవ్వకాలను ఆపే ప్రయత్నం చేయకపోవటంతో హైకోర్టును ఆశ్రయించి స్టేటస్కో పొందాను. మా భూములు తవ్వటంతో జరిగిన నష్టానికి పరిహారం కోరుతూ కోర్టులో దావా వేస్తాను. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి. -
‘పచ్చ’మార్కు అక్రమం
సాగు భూమిని దౌర్జన్యంగా తవ్వేసిన తెలుగు తమ్ముళ్లు ‘మా భూమి’ అంటూ బాధితులు గగ్గోలు పెట్టినా ఎవ్వరికీ పట్టని వైనం కోర్టు జోక్యంతో ఆగిన అక్రమం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కష్టార్జితంతో కొన్న భూమిని సాగు చేసుకుంటూ సాఫీగా సాగుతున్న జీవితాలపై అక్రమార్కుల కన్ను పడింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లొసుగును ఆసరాగా చేసుకుని ఆ భూమిలో మట్టి తవ్వకాలు చేసేశారు. పట్టెడన్నం పెట్టే నేల తల్లిని గుల్ల చేస్తుంటే చూడలేని రైతు కనిపించిన అధికారినల్లా.. ‘మా భూమి’ సారూ.. అంటూ కాళ్లావేళ్లా పడ్డారు. అయితే ఆ రైతు గుండెఘోష ఎవ్వరికీ పట్టలేదు. న్యాయదేవతకే చెప్పుకుంటానని కోర్టు మెట్లెక్కాడు. హైకోర్టు మొట్టికాయలతో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టపడింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేల తల్లిని నిలువునా తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. రైతుకు వేదన మిగిల్చారు. చిలకలూరిపేట టౌన్ : మట్టి, ఇసుక, అసైన్డ్ భూములు కావేవీ దోపిడీకి అనర్హం అంటున్నారు అధికార పార్టీ నాయకులు. రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు మాత్రం ఒత్తిళ్లకు తలొగ్గి, ఆమ్యామ్యాలపై ఆశతో మటì ్ట దోపిడీకి సహకరిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ మట్టి దందాకు అంతేలేకుండాపోతోంది. బాధితులు తమ హక్కుల కోసం నాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రెవెన్యూ రికార్డులు వెతికి మరీ.. దశాబ్దాల నాడు పంపిణీ చేసిన చెరువు పోరంబోకు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్గా ఉందన్న సాకుతో సాగు భూమిలో మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం వారికి దక్కే వాటాల కోసం ఈ తతంగానికి తమ వంతు సహాయం అందజేస్తున్నారనటానికి ఇటీవల వెలుగుచూసిన సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. చిలకలూరిపేట మండలంలోని యడవల్లి గ్రామ సర్వే నంబర్ 52లో గోపాళంవారికుంటకు చెందిన 4.08 ఎకరాల భూమిని 1951లో ఆర్మీలో పనిచేసి చనిపోయిన వ్యక్తి భార్య జెల్లుడు దీనమ్మకు పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భూమి సాగులో ఉంది. ఆమె తదనంతరం ఆమె వారసులైన కుమార్తె దేవసహాయమ్మ ఆ భూమిని దశలవారీగా విక్రయించింది. వివిధ విక్రయాల అనంతరం చివరగా ఈ భూమి చుండి తిరుపతయ్య 1.04 ఎకరాలు, ఆయన భార్య చుండి పార్వతివర్ధని పేరున 3.04 ఎకరాలు కొని సాగు చేసుకుంటున్నారు. వారిపేరునే అడంగల్, పాసు పుస్తకాలు, శిస్తులు ఉన్నాయి. ఈ భూమిపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూమిగా ఉందంటూ సుమారు రెండు నెలల కిందట తవ్వకాలు చేపట్టి మట్టి విక్రయాలకు దిగారు. దీంతో బాధితులు అధికారుల చుట్టూ తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో ప్రదక్షిణలు చేశారు. ఫలితం లేకపోవడంతో చివరకు బాధితులు హైకోర్టును ఆశ్రయించి స్టేటస్కో పొందారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిత్యం పచ్చగా ఉండే పంట భూమి తవ్వి గుంట చేశారు. కోర్టు తీర్పుకు విరుద్ధంగా.. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల వివాదం విషయంలో 2015 డిసెంబర్లో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు 1954 జూన్ 18వ తేదీకి ముందు అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సంబంధిత భూమి రెవెన్యూ అధికారులు ప్రకటించిన నిషేధిత జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారి నుంచి రిజిస్ట్రేషన్ అధికారి వివరణ కోరాలి. సకాలంలో సమాధానం రాకుంటే భూమిని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. దీని ప్రకారం 1951లో పంపిణీ చేసిన యడవల్లి గ్రామ సర్వే నంబర్ 52లో గోపాళంవారికుంటకు చెందిన భూమిని అసైన్డ్ భూమి అంటూ తవ్వటం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమే అవుతుంది. మట్టి తవ్వకాలు ఆపాం.. ఈ విషయమై చిలకలూరిపేట తహసీల్దార్ పీసీహెచ్ వెంకయ్యను సాక్షి వివరణ కోరగా నీరు–చెట్టు కార్యక్రమాన్ని నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, రికార్డుల్లో అసైన్డ్ భూమి అని ఉండటంతో తవ్వకాలు చేశారని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తవ్వకాలు నిలిపివేయించామన్నారు. నష్టపరిహారానికి దావా వేస్తాం : చుండి తిరుపతయ్య నా పేరున, నా భార్య పేరున ఉన్న భూమిని మట్టి కోసం తవ్వబోతున్నారని తెలుసుకొని తహసీల్దార్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టా ఇచ్చింది తమ రికార్డుల్లో లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తవ్వకాలను ఆపే ప్రయత్నం చేయకపోవటంతో హైకోర్టును ఆశ్రయించి స్టేటస్కో పొందాను. మా భూములు తవ్వటంతో జరిగిన నష్టానికి పరిహారం కోరుతూ కోర్టులో దావా వేస్తాను. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి. -
‘చెర’బట్టిన రియల్టర్లు
పూసపాటిరేగ: అది ప్రభుత్వ భూమా? చెరువా? శ్మశానమా? పదిమందికీ పనికివచ్చే స్థలమా? దేవాలయామా? అన్న వివేచన లేకుండా ఖాళీగా జాగా కనిపిస్తే చాలు కబ్జాకు తెగబడుతున్నారు కొందరు భూ బకాసురులు. ప్రభుత్వములు, పోరంబోకు భూములు, డి.పట్టా భూములను కబ్జా చేస్తున్న కొందరు రియల్టర్లు ఏకంగా చెరువును కూడా కబ్జాచేసేందుకు ప్రయతించారు. ఈ వ్యవహారం పూసపాటిరేగ మండలంలోని పతివాడ పంచాయతీలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. పతివాడ రెవెన్యూ పరిధిలో గల సర్వేనంబరు 37-2లో సుమారు 4 ఎకరాల చెరువు ఉంది. చెరువు పక్కన తమ అధీనంలో భూములను గతంలో గ్రామానికి చెందిన బ్రాహ్మణులు కొందరు రియల్టర్లకు విక్రయించారు. అ తరువాత కూడా రియల్టర్లు రెండుసార్లు క్రయవిక్రయాలు జరిపారు. తాజాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న రియల్టర్ తాను కొనుగోలు చేసిన భూములతో పాటు చెరువును కూడా కబ్జా చేసేందుకు యత్నించడం విశేషం. ఈ ఆక్రమణ పర్వానికి మండలంలోని కొల్లాయివలసకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి ఒకరి అండదండలందించడం గమనార్హం. దీంతో ఆ రియల్టర్ జేసీబీ యంత్రాలు పెట్టి చెరువు గట్టును చదును చేశారు. అయితే రెవెన్యూ రికార్డులలో నేటికీ చెరువుగానే ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే చెరువు గట్టును తొలగిస్తున్నారు. రికార్డులలో అయితే ఇప్పటికీ చెరువుగానే ఉంది. దీనిపై గ్రామరెవెన్యూ అధికారి కామేశ్వరమ్మ వద్ద ప్రస్తావించగా రికార్డులలో చెరువుగానే ఉందని, ఎటువంటి అనుమతులు లేకుండా చెరువును ఆక్రమించడం నేరమని స్పష్టం చేశారు. జేసీబీతో జరుగుతున్న పనులను నిలిపివేయించినట్లు తెలియజేశారు. తహసీల్దార్ జనార్దనరావు వద్ద ప్రస్తావించగా చెరువును కప్పే అధికారం ఎవరికీ లేదని, రెవెన్యూ రికార్డులు తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
భూ కబ్జాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: భూ మాఫియా ద్వారానే అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించాలని ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల్లో జరుగుతున్న అవకతవకలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొరడా ఝలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భూ కబ్జాల విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు పార్టీ మారడం తప్ప ఏమీ జరగలేదని ఎద్దేవా చేశారు. ప్రధానిగా రాజీవ్‌గాంధీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేసేందుకు రాష్ట్రమంతా పర్యటిస్తానని తెలిపారు. -
అంతా బెయిల్ రాజాలే..!
‘ఎర్ర’ స్మగ్లర్లకు టీటీడీ ఉద్యోగుల జామీను ! కాసులు కురిపిస్తున్న బెయిళ్లు యాదమరి, గుడిపాల, ఐరాల, తవణంపల్లె, జీడీ.నెల్లూరు వారే పావులు చిత్తూరులో నకిలీ శాలరీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న వైనం జామీను తీగ లాగితే కదులుతున్న బెయిళ్ల డొంక జిల్లాలో ఎర్రచందనం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా సరసన ఇప్పుడు బెయిల్ మాఫియా కూడా చేరింది. వివిధ కేసులకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలిన, తేలుతున్న వాస్తవాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో న్యాయస్థానాల కళ్లకే గంతలు కడుతూ బురిడీ కొట్టిస్తున్న వైనం చివరకు పోలీసుల శ్రమకు ఫలితం దక్కకుండా పోతోంది. చిత్తూరు (అర్బన్): బెయిల్స్కాం ఉదంతం జిల్లాలో పోలీసు, న్యాయ వ్యవస్థలో సంచలనం సృష్టించింది. పలమనేరు పోలీసులు ఓ జామీను తీగ లాగితే బెయిళ్ల డొంక కదిలింది. జిల్లాలోని పలు న్యాయస్థానాల్లో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి బెయిల్‌పై తప్పించుకున్న వాళ్లు, వారికి సహకారం అందించిన వారిపై పోలీసులు దృష్టి సారించారు. ఎర్రచందనం స్మగ్లర్లు, హత్య కేసుల్లో నిందితులుగా ఉంటూ బెయిల్‌పై వచ్చిన వారి వివరాల గుట్టును రట్టుచేసే పనిలో ఉన్న పోలీసులకు దర్యాప్తులో సరికొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుకుబడ్డ నిందితులకు శాలరీ సర్టిఫికెట్ ఇచ్చి జామీనుపై విడిపించినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే, జామీనుదారులను విచారణ చేస్తే అసలు తాము వారు శాలరీ సర్టిఫికెట్లే ఇవ్వలేదని తేలింది. ఆ ఐదు మండలాల్లోనే ఎక్కువ బెయిల్ స్కాంలో నిందితులైన చిత్తూరుకు చెందిన ఇద్దరు మధ్యవర్తులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి రూ.500 ఇచ్చి జామీను ఇచ్చేందుకు పావులుగా వాడుకుంటున్నట్టు తేలింది. వారి నుంచి పొలం పాసు పుస్తకాలు, ఇంటి ధరావత్తు (వాల్యుయేషన్ సర్టిఫికెట్) ధ్రువీకరణ పత్రాలను తీసుకుని జామీనులు ఇప్పిస్తున్నారు. వివిధ కేసుల్లో నిందితులు తమకేమాత్రం తెలియకున్నాజిల్లాలోని యాదమరి, గుడిపాల, ఐరాల, తవణంపల్లె, జీడీ.నెల్లూరు మండలాల్లో కొందరు జామీన్లు ఇస్తున్నట్టు గుర్తించారు. చివరకు దీనిని వారు జీవనోపాధిగా మార్చుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కొందరు న్యాయవాదులే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తుండటం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇవిగో సాక్ష్యాలు 2014లో ఐరాల పోలీసులు 23 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.. వీళ్లకు యాదమరి మండలంలోని పీసీ.కండ్రిగ హరిజనవాడకు చెందిన ఆరుగురు బెయిల్ కోసం జామీను ఇచ్చారు. ఒక్కో నిందితుడికి రూ.40 వేల విలువ చేసే ఇంటిని ధరావత్తు పత్రాన్ని న్యాయస్థానానికి అందచేశారు. ప్రస్తుతం నిందితులు న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో జామీను వేసిన వాళ్లు రూ.4.6 లక్షలు కోర్టుకు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే ఇంటిని జప్తు చేసే అవకాశం లేకపోలేదు. గత ఏడాది తవణంపల్లె పోలీసులు తమిళనాడులోని తిరువణ్నామలైకు చెందిన ఇద్దరు బడా స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.6 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వీళ్లకు టీడీడీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు తమ శాలరీ సర్టిఫికెట్లు ఇచ్చి జామీను ఇచ్చినట్లు పత్రాలు ఉండటంపై పోలీసులు అనుమానించారు. ధార్మిక సంస్థలో పనిచేసే వారికి స్మగ్లర్లతో ఉన్న లింకులేమిటని లోతుగా దర్యాప్తు చేస్తే ఆ జామీను వారివ్వలేదని, వారి పేరిట ఆ పత్రాలు సృష్టించి బెయిల్ పొందేలా చేశారని గుర్తించారు. చిత్తూరుకు చెందిన ఓ మధ్యవర్తి ఈ వ్యవహారంలో రాటు తేలాడని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో ఓ హత్య కేసుకు సంబంధించి గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు చెందిన ఇద్దరు వ్యక్తులు కర్ణాటకకు చెందిన నిందితుడికి జామీను ఇచ్చారు. ప్రస్తుతం నిందితుడి ఆచూకీ లేకపోవడంతో జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు పొలాలను కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. 2005లో యాదమరిలో జరిగిన యూనియన్ బ్యాంకు దోపిడీలో 25 కిలోల బంగారం దోచుకున్న నిందితులకు గుడిపాలకు చెందిన వ్యక్తులు జామీను ఇవ్వడంతో అదే నిందితులు బెయిల్‌పై బయటకొచ్చారు. అంతేకాకుండా కేరళలోని ఓ బ్యాంకును కొల్లగొట్టి 18 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. బెయిల్ మాఫియాకు చెక్ పెట్టాలంటే..? ఎర్రచందనం స్మగ్లింగ్, మరికొన్ని కేసుల్లో జామీనుదారులను న్యాయమూర్తులు నిశితంగా ప్రశ్నిస్తే చాలావరకు బెయిళ్లు పొందకుండా చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా బెయిళ్ల కోసం న్యాయస్థానాలను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో గంతలు కడుతున్న వారి భరతం కూడా పట్టవచ్చని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి. -
'శ్రీమంతుడు' విలన్ల తరహాలోనే..!
♦ భూపరిహారం నొక్కేసే యత్నం ♦ నెల్లూరు జిల్లాలో ‘భూ’ విలన్లు ♦ కావలిలో అధికార పార్టీ అన్నదమ్ముల బాగోతం ♦ బినామీ పేర్లతో పేదల భూములు కైవసం ♦ పరిహారం కోసం రికార్డులన్నీ తారుమారు ♦ నేతలకు వంతపాడుతున్న అధికారులు సాక్షి టాస్క్‌ఫోర్స్, నెల్లూరు: ఒక పేద మహిళకు ప్రభుత్వం రెండెకరాలు భూమి కేటాయించింది. ఆ భూమిలో వ్యవసాయం కోసం బ్యాంకులో అప్పు కూడా తీసుకుంది. ఇంతలో భూమి కావాల్సి వచ్చి ప్రభుత్వం సేకరణకు సిద్ధమైంది. అంతే.. ఆ రెండెకరాల భూమికి సంబంధించి రైతు పేరు మారిపోయింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం నొక్కేసేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇదంతా శ్రీమంతుడు సినిమాలో విలన్లు చేసిన పనిగా ఉంది కదా! అచ్చం అలాంటిదే నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వందలాది ఎకరాల పేదల భూములను బినామీ పేర్లతో స్వాహా చేసేందుకు వ్యూహం పన్నారు. కావలి నియోజకవర్గంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం దామవరంలో 1,075 ఎకరాలు, కొత్తపల్లి కౌరుగుంటలో 323 ఎకరాలు సేకరిస్తున్నారు. వీటిలో పట్టా భూములతో పాటు అసైన్మెంట్, డీఫారం, ప్రభుత్వ భూములున్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ మరో 716.41 ఎకరాలు సేకరిస్తోంది. ఇందులో ఉలవపాళ్లలో 400 ఎకరాలు, కొత్తపల్లి కౌరుగుంటలో 192, ఊచగుంటపాళెంలో 124.41 ఎకరాలు సేకరిస్తోంది. ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ పరిహారాన్ని మొత్తం నొక్కేసేందుకు కావలి నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు పేదలకు గతంలో మంజూరు చేసిన భూములను బినామీ పేర్లతో సొంతం చేసుకుంటున్నారు. అనుచరులు, స్థానికేతరులను జాబితాలో చేర్చి వందలాది ఎకరాలు పక్కదారి పట్టించారు. రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని రికార్డులన్నీ తారుమారు చేశారు. నైస్‌గా కాజేసే వ్యూహం.. కౌరుగుంటకు చెందిన దేవరకొండ కావమ్మకు సర్వేనంబర్ 290-3లో ప్రభుత్వం గతంలో రెండెకరాల భూమి ఇచ్చింది. ఆ భూమిపైన అల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆమె రూ. 44 వేలు క్రాప్‌లోన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏపీఐఐసీ భూ సేకరణలో ఆ భూమి కావమ్మ పేరున కాకుండా బెల్లంకొండ శీనయ్య పేరు వచ్చి చేరింది. రెవెన్యూ అధికారులు నోటీసుల్లో ఈ విషయం తెలుసుకున్న కావమ్మ భోరుమంటోంది. పరుశురాం జానకిరామయ్య అనే వ్యక్తికి 298-3లో ఎఫ్డిఎస్ నంబర్ 208-1407లోరెండెకరాల భూమిని ఇచ్చినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. అసలు భూమి మంజూరు చేసిన విషయమే జానకిరామయ్యకు తెలియదు. భూసేకరణ అభ్యంతరాలపై నోటీసు రావడంతో జానకిరామయ్య అవాక్కయ్యాడు. ఇక భూమిని తానే ఇంకొకరికి విక్రయించినట్లు అధికారులు నోటీసులో పేర్కొనడంతో నిర్ఘాంతపోయాడు. వాస్తవానికి జానకిరామయ్య పేరుతో రికార్డులు తారుమారు చేసి.. తమకు ఆ భూమి విక్రయించినట్లు భూ విలన్లు డాక్యుమెంట్లు తయారు చేశారు. ప్రభుత్వమిచ్చే పరిహారాన్ని నొక్కేసేందుకే ఇలా చేశారు. -
హిల్.. కిల్
{పాణాలు తీస్తున్న కొండలు పాలకులు, ల్యాండ్ మాఫియాతో అనర్ధాలు కొండవాలు ప్రాంతాల్లో 25 వేల కుటుంబాలు విశాఖపట్నం : విశాఖ నగరంలో కొండ లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అనధికార కట్టడాలతో ప్రకృతి ప్రసాదిత గిరులను ఆక్రమించుకుంటున్నందుకు ఫలితంగా ప్రాణాలనే బలికోరుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా శాశ్వత చర్యలు కానరావడం లేదు. నగరంలో 25వేల కుటుంబాలు కొండవాలు ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు అంచనా. ప్రమాదమని తెలిసినా తుపాను, సునామీ, భూకంపం ఇలా ఏ హెచ్చరికలు జారీ అయినా కొండవాలు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. హూద్‌హూద్ తుఫాను సమయంలో వేలాది ఇళ్లు నేలకూలాయి. అయినా వేరే ఎక్కడా గూడు దొరకకపోవడంతో మళ్లీ అక్కడే గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తామని, రక్షణ గోడలు నిర్మిస్తామని ఎన్నెన్నో హామీలు గుప్పిస్తున్నా అవేవీ అమలులోకి రావడం లేదు. ల్యాండ్ మాఫియా నిర్వాకం ల్యాండ్ మాఫియా రంగంలోకి దిగి కొండలను ఆక్రమిస్తోంది. ప్రజాప్రతినిధుల అండతో కొందరు గ్రూపులుగా ఏర్పడి కొండ ప్రాంతాలలో హద్దులు నిర్ణయిస్తున్నారు. 30 నుంచి వంద గజాల స్థలాలు చదును చేసి బహిరంగంగా అమ్మేస్తున్నారు. ముందుగా అక్కడి చెట్లకు నిప్పు పెట్టి స్థలాలను చదును చేస్తున్నారు. తర్వాత చిన్నపాక వేసి దానిని రేకుల షెడ్డుగా, భవనంగా మారుస్తున్నారు. అనంతరం ఇళ్లు లేని వారికి వాటిని విక్రయిస్తున్నారు. ప్రమాదంలో జీవనం విశాఖ నగరానికి ఉపాధి, కూలీ పనులు కోసం చాలా మంది వలస వస్తుంటారు. కొమ్మాది, ఆరిలోవ, మధురవాడ, తాడిచెట్లపాలెం, మాధవధార, సీతమ్మధార, వెంకోజిపాలెం, హనుమంతవాక, కప్పరాడ, మురళీనగర్, సింహిద్రిపురం, వరాహగిరి కాలనీ, గాజువాక, మల్కాపురం, కస్తూరినగర్, రాంజీఎస్టేట్, సంజీవయ్యాకాలనీ, తిక్కవానిపాలెంకాలనీ, బాపూజీనగర్, శివలింగపురం, అరుంధతినగర్, అంబేద్కర్ ఎస్టేట్, జైభారత్‌నగర్, బర్మానగర్, శ్రీనివాసనగర్, మధుసూధన నగర్, సురేష్‌రాంనగర్, సూరిబాబునగర్, శాంతినగర్ కొండలపై ఇలా వేలాది నివాసాలు వెలిశాయి. కనీస వసతులు కరువు కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి కనీస వసతులు కూడా ఉండవు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు వంటివి అందుబాటులో లేవు. ఇళ్లకు చేరే దారులు కూడా శిథిలమైపోయి ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ తాగునీటిని సరఫరా చేస్తున్నా, అవి పైపులైన్లు ద్వారా కొండపైకి చేరడం లేదు. -
తమ్ముళ్ల భూదందా
మచిలీపట్నం : మచిలీపట్నంలో తెలుగు తమ్ముళ్ల బరితేగిస్తున్నారు. భూదందాకు తెరతీశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాజేసేందుకు పన్నాగం వేశారు. బెదిరింపులకు దిగుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ సారథ్యంలో నారాయణపురంలోని బైపాస్‌రోడ్డు పక్కనే ఉన్న స్థలంలో పాగా వేశారు. 1.04 ఎకరాల భూమి ఆక్రమణకు ప్రయత్నం నారాయణపురం బైపాస్‌రోడ్డు వెంబడి గోకరాజు సుభద్రాదేవి మరో ముగ్గురు 1985లో 1.04 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమిలో చికెన్షాపు, హోటల్, ఆర్ఎంపీ వైద్యశాల నడుపుకునేందుకు అద్దెకు ఇచ్చారు. టీడీపీ నాయకులు.. వాటపల్లి మాధవీకుమారి తాతయ్య కుమారస్వామి పేరున కాగితాలు పుట్టించారు. భూమి తమ బంధువలదేనని ఇక్కడున్న కట్టడాలన్నీ తీసివేయాలంటూ హుకుం జారీ చేశారు. శుక్రవారం పొక్లెయిన్, ట్రాక్టర్లు, 200 మందిని తీసుకువెళ్లి బెదిరింపులకు దిగారు. దీంతో అసలు భూమి యజమానులు భూమికి సంబంధించిన కాగితాలు తమ వద్ద ఉన్నాయని ఈ భూమి మీది ఎలా అవుతుందని ప్రశ్నిస్తే అధికార పార్టీకి చెందిన తాము చెబితే భూమి తమదే అవుతుందని, అవసరమైతే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని లేకుంటే కోర్టును ఆశ్రయించాలని వాదనకు దిగారు. అంతటితో ఆగకుండా భూమిలో చిన్నపాటి రేకులషెడ్డు ఏర్పాటు చేసి ఈ భూమిని ఎవరూ కొనుగోలు చేయవద్దని బోర్డు ఏర్పాటు చేశారు. రూ. 50 లక్షలు ఇస్తామంటూ.. ఈ భూమి మాకు కావాల్సిందే. మర్యాదగా వింటే రూ.50 లక్షలు ఇస్తాం. అంతే తప్ప భూమిని వదిలేది లేదని టీడీపీ నాయకులు, రాయబారాలు పంపుతున్నారని భూ యజమానులు గోపరాజు జయరామ్, వేమూరి లక్ష్మీనారాయణ చెబుతున్నారు. టీడీపీ నాయకుల భూదందాపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇటీవలనే నారాయణపురంలో 40 సెంట్ల పురపాలక సంఘానికి చెందిన స్థలాన్ని ఆక్రమించి ఓ ప్రజాప్రతినిధి గృహాలు నిర్మించిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు ఈ అక్రమ కట్టడాలను నిలువరించారు. మళ్లీ కొద్ది రోజుల వ్యవధిలోనే బైపాస్ రోడ్డు వెంబడి ఉన్న స్థలాన్ని ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీనేత భూ దందా
గ్యాస్ గోదాం పేరిట స్థలం కొట్టేసిన ఘనుడు ఇప్పుడు ఫంక్షన్‌హాల్ నిర్మాణం రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు ప్రణాళిక కళ్లెదుటే జరుగుతున్నా స్పందించని అధికారులు ఒక అక్రమం.. ఒక మోసం కలిసికట్టుగా అమీన్పూర్లో ఓ అధునాతన ఫంక్షన్ భవనం రూపుదిద్దుకుంటోంది. గ్యాస్ గోదాం కోసం కారు చౌకగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి పొందిన ఓ టీడీపీ నాయకుడు.. ఇప్పుడు రూట్ మార్చారు. కొట్టేసిన భూమికి మరికొంత స్థలం కబ్జాచేసి మొత్తం రూ. 3 కోట్ల విలువైన భూమిలో శరవేగంగా ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నారు. భవన నిర్మాణం పూర్తి చేసుకుని రెగ్యులైజేషన్ పథకం కింద స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. సంగారెడ్డి : ‘బక్క’చిక్కిన సామాన్యునికి ఇంటి స్థలం కోసం 60 గజాలు ఇవ్వమని అడిగితే 120 ఆంక్షలు పెట్టే అధికారులు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు మాత్రం ప్రత్యేక జీఓలు తెచ్చి అప్పనంగా 20 గుంటల స్థలాన్ని కట్టబెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలుగుదేశం పార్టీ నాయకునికి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. ఈ ఏజెన్సీకి జోగిపేట పట్ణణంలో గ్యాస్ గోదాం ఉంది. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. అయితే తాను పటాన్చెరు మండలం అమీన్పూర్లో గ్యాస్ గోదాం నిర్మాణం చేసుకుంటానని, ఇందుకు స్థలం కేటాయించాలని టీడీపీ నాయకుడు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రస్తుత ఏపీ సీఎం హవా నడవడంతో ఆయన సిఫార్సు మేరకు పటాన్చెరు మండలం అమీన్‌పుర్‌లోని సర్వే నంబర్ 993లో 20 గుంటల స్థలాన్ని నామమాత్రపు రుసుంతో కేటాయిస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై అప్పట్లోనే నిరసనలు వ్యక్తం అయ్యాయి. రెవెన్యూ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీ సంస్థ నుంచి గోదాం బదిలీకి ఎలాంటి అనుమతి లేకుండానే భూమి కేటాయించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గోదాంను జోగిపేట నుంచి అమీన్‌పూర్‌కు తరలించేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. పైగా ఒక ప్రైవేటు ఏజెన్సీకి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం నిబంధనలు అంగీకరించవు. అయినా అప్పటి ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా భూమిని ఆయనకు దారాదత్తం చేసింది. శరవేగంగా నిర్మాణం తాజాగా ఇదే భూమిలో సదరు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆధునిక సౌకర్యాలు, అదనపు హంగులతో ఓ పంక్షన్‌హాల్ నిర్మాణం చేస్తున్నారు. గ్యాస్ గోదాం నిర్మాణం పేరుతో గ్రామ పంచాయతీ అనుమతి పొందిన ఆయన, ఏకంగా ఫంక్షన్ హాల్ కడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 20 గుంటల స్థలానికే ఆనుకొని ఉన్న మరికొంత ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి శరవేగంగా భవన నిర్మాణం చేస్తున్నారు. ప్రజల ఫిర్యాదుల మేరకు భవన నిర్మాణాన్ని తనిఖీ చేసిన రెవిన్యూ అధికారులు కూడా ఫంక్షన్ హాల్ కడుతున్నట్లు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పటాన్చెరు తహశీల్దారు జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. మండల స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారికి, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదికలు అంది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలోపే భవన నిర్మాణం పూర్తి చేసుకుని రెగ్యులైజేషన్ స్కీం కింద దరఖాస్తు చేసుకోవడానికి సదరు నాయకుడు పథకం వేసినట్లు సమాచారం. అదే జరిగితే దాదాపు రూ 2.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి టీడీపీ నాయకుని చేతిలోకి వెళ్లిపోయినట్లేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పటాన్చెరు తహశీల్దారు మహిపాల్‌రెడ్డిని వివరణ కోరగా, సదరు టీడీపీ నేత కడుతున్న భవన నిర్మాణంపై ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణ జరిపించామని, తమ విచారణలో అతను ఫంక్షన్ హాల్ కడుతున్నట్లు తేలిందన్నారు. ఈమేరకు నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన వివరించారు. -
కోర్టుల్లో కొండలా పేరుకుపోయిన ‘రెవెన్యూ’ కేసులు
కోర్టు కేసులు రెవెన్యూ యంత్రాంగం ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయి. భూ వివాదాలపై ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదవుతుండడంతో అధికారగణానికి కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోతోంది. జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడం, భూముల విలువలు ఆకాశన్నంటడంతో రెవెన్యూ తగాదాలు పెరిగాయి. దీనికితోడు ల్యాండ్ మాఫియా కూడా చెలరేగిపోవడం.. భూములను ఆక్రమించడమేకాకుండా యాజమాన్య హక్కులను సవాల్ చేస్తుండడం యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. జిల్లాకు సంబంధించి వివిధ కోర్టుల్లో 1,409 కేసులు నడుస్తున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కోర్టు కేసులతో రెవెన్యూ యంత్రాం గం సతమతమవుతోంది. జిల్లా పరిధిలో నమోదవుతున్న ‘రెవెన్యూ’ కేసుల పర్యవేక్షణకే జిల్లా అధికారులు అధిక సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. నగర శివార్లలో అక్రమార్కులు విలువైన స్థలాలను కబ్జా చేయడం.. వాటిని సొంతం చేసుకునేందుకు సుప్రీంకోర్టు వరకూ వెళ్తుండడంతో కేసులను ఎదుర్కోవడం అధికారులకు చిరాకు కలిగిస్తోంది. బలంగా వాదనలు వినిపించడం ద్వారా సర్కారీ స్థలాలను కాపాడుకునే దిశగా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 1,409 కేసులు నడుస్తున్నాయి. దీంట్లో అధికశాతం కక్షిదారు.. ప్రభుత్వానికి మధ్యే ఉన్నాయి. ఇవేకాకుండా వివిధ న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించిన కేసులు, దాఖలు చేసిన వ్యాజ్యాలు కూడా భారీగానే ఉన్నాయి. కలెక్టరేట్లో ప్రత్యేకంగా ‘న్యాయ విభాగం’ ఉంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ, అడ్డగోలుగా దాఖలవుతున్న కేసులను సమర్థవంతంగా వాదించేందుకు రికార్డులు తయారు చేయడంలో పనిఒత్తిడిని ఎదుర్కొంటోంది. చట్టాలపై అధికారులకు పట్టులేకపోవడం.. కేసుల సంఖ్య చాంతాడులా పెరిగిపోతుండడం యంత్రాంగాన్ని కుంగదీస్తోంది. సుప్రీంలో 28 కేసులు! సర్వోన్నత న్యాయస్థానంలో జిల్లాకు సంబంధించి 28 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని క్రమంతప్పకుండా పర్యవేక్షించడం రెవెన్యూ అధికారులకు కత్తిమీద సాములా పరిణమించింది. కేసు విచారణకు వచ్చినప్పుడల్లా ఢిల్లీకి వెళ్లాల్సిరావడం, అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ లేదా ప్రభుత్వ తరుఫున వాదించే న్యాయవాదికి కేసు పూర్వపరాలు వివరించేందుకు తహసీల్దార్లు వెళ్లాల్సివస్తోంది. సుప్రీంకోర్టు విచారణ ఉన్న కేసుల్లో అధికశాతం నగర శివారు ప్రాం తానికి చెందినవే ఉన్నాయి. వీటి విలువ రూ.కోట్లలో ఉండడంతో హస్తినకు విధి గా వెళ్లి వస్తున్నారు. శంషీగూడ, రాయదుర్గ నవ్‌ఖల్సా, కోకాపేట, మియాపూర్ తదితర ప్రాంతాలకు సంబంధించిన కేసులు సుప్రీంలో ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న జిల్లా యంత్రాంగం.. కోర్టులో నెగ్గేందుకు అవసరమైన రికార్డుల తయారీలో నిమగ్నమవుతోంది. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరత న్యాయవిభాగాన్ని పట్టిపీడిస్తోంది. ఇదిలావుండగా, హైకోర్టులో కూడా రికార్డు స్థాయిలో కేసులు నడుస్తున్నాయి. మొత్తం 864 కేసులుండగా, ఇందులో అధికశాతం రెవెన్యూ విభాగానికి చెందినవే. భూ వివాదాల్లో ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన కక్షిదారులు సహా.. విలువైన భూములను రక్షించుకునేందుకు ప్రభుత్వం కూడా కోర్టులో దాఖలు చేసిన కేసులు ఉన్నాయి. సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాల్లోనేకాకుండా జిల్లా కోర్టులు, లోకాయుక్త, ల్యాండ్ గ్రాబింగ్, సివిల్/మున్సిఫ్ కోర్టులు, ఎల్‌ఆర్‌టీ, ఎల్‌ఆర్‌ఏటీ, ఎండోమెంట్ ట్రిబ్యునల్, రెవెన్యూ కోర్టులో కేసుల జాబితా కొండలా పెరిగిపోతోంది. -
గరీబోళ్ల గూడుపై రాబందులు
గరీబోళ్ల ఇళ్ల స్థలాలపై గద్దలు వాలాయి. ఇందిరమ్మ ఇళ్ల మాటున భూ బకాసురులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కాసులు కురిపించే పారిశ్రామిక వాడను అడ్డగా చేసుకొని భూ దందాకు పక్కా ప్లాన్ వేశారు. గూడులేని నిరుపేదలకు ఇవ్వాల్సిన స్థలాలను నాయకులు అక్రమంగా అమ్ముకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కళ్లు తిరిగే మోసానికి పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం మండలంలోని బొల్లారం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం జిన్నారం మండలం హెచ్ఎండీఏ పరిధిలోకి ఉంది. అందువల్లే ఇక్కడి భూముల ధరలు చుక్కల్లో ఉంటాయి. అయినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు బొల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీఓను తీసుకువచ్చింది. 2008లో మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా బొల్లారంలోని 284 సర్వేనంబర్‌లో గల 25 ఎకరాల స్థలాన్ని ఇళ్లకు కేటాయిస్తూ అనుమతి ఇచ్చింది. అప్పటి మంత్రి సునీతారెడ్డి చేతుల మీదుగా ఒక్కో లబ్ధిదారునికి 80 గజాల చొప్పున 1,075 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను అందించారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు కొన్ని పట్టాలను తమ అనుకూలమైన వారికిచ్చి, మరికొన్ని పట్టాలను అమ్ముకొని రూ.కోట్లలో ఆర్జించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రతిపక్షాల వేదన అరణ్యరోదనగానే మారిపోయింది. సర్కార్ మార్పుతో మారిన సీన్ తాజాగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ నాయకుల అక్రమాలపై అసలైన లబ్ధిదారులు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆర్డీఓతో విచారణ చేయించారు. నెల రోజులపాటు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 1,075 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే, అందులో కేవలం 308 మంది మాత్రమే అర్హులని అధికారులు నిర్ధారించారు. మిగతా 767 పట్టాలను అక్రమార్కులు కొట్టేసినట్లు అనుమానిస్తున్నారు. అక్రమార్కులు ఒక్కో పట్టాను డిమాండ్‌ను బట్టి రూ. లక్ష నుండి రూ.2 లక్షల ఆపైగా విక్రయించినట్లు తెలిసింది. 1,075 మంది లబ్ధిదారులకు ఇచ్చిన సర్టిఫికెట్లలో 1,053 సర్టిఫికెట్లకు సంబంధించిన ప్లాట్లను మాత్రమే అధికారులు గుర్తించారు. మిగతా 22 ప్లాట్లకు సంబంధించిన స్థలాన్ని అధికారులు కూడా గుర్తించలేకపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలను రెవెన్యూ అధికారులు జిల్లా అధికారులకు పంపారు. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో బొల్లారం కాంగ్రెస్ నేతలు ఇళ ్ల స్థలాల కేటాయింపుల్లో అక్రమాలు జరిపారనే అరోపణలు ఉన్నాయి. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇంతవరకూ చర్యలు తీసుకోలేకపోయారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల క్రయ, విక్రయాలు జరపకూడదనేనిబంధనలు ఉన్నా, ఇక్కడి నేతలు మాత్రం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను యథేచ్ఛగా విక్రయించేసుకుంటున్నారు. బొల్లారం హెచ్ఎండీఏ పరిధిలో ఉండడంతో ఇతర ప్రాంతాలు, పట్ట ణాల వారు ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూమాయగాళ్లు వారికి మాయ మాటలు చెప్పి ప్రభుత్వం కేటయించిన ఇళ్ల స్థలాలను విక్రయిస్తున్నారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని బొల్లారం ప్రాంత వాసులు కోరుతున్నారు. -
బెజవాడను మాఫియా సిటీగా చేస్తారా... బాబూ
-
బెజవాడను మాఫియా సిటీగా చేస్తారా... బాబూ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. రాజధాని భూ మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్, సాండ్, శాండిల్, పొలిటికల్, కార్పొరేట్ మాఫియాలు ఉన్నాయని విమర్శించారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు, చంద్రబాబు అనుచరులు గబ్బిలాల మాదిరిగా విజయవాడ పరిసర ప్రాంతాలలో కబ్జాలు చేస్తున్నారని ద్వజమేత్తారు. ఈ రోజు విజయవాడ సమీపంలో జరిగిన హత్యలు కూడా ఈ నేపథ్యంలోనే జరిగాయన్నారు. చంద్రబాబు మాఫీయా సిటీ తయారు చేయబోతున్నారా అంటూ తమ్మినేన్ని సీతారాం సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. -
శివునికే శఠగోపం!
హిందూపురం : జిల్లాలో ఆలయ భూములకు రక్షణ లేకుండా పోతోంది. యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూ మాఫియా ఎంతకైనా తెగబడుతోంది. ఎవరి భూములనైనా ఆక్రమించడానికి వెనకాడడం లేదు. ఈ క్రమంలో దేవాలయాల భూములు కూడా కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఆక్రమణలను పెద్దగా పట్టించుకోని ఆలయ కమిటీలు కూడా ప్రస్తుతం భూముల విలువ పెరిగిన నేపథ్యంలో పాత రికార్డులకు దుమ్ము దులుపుతున్నాయి. ఆలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటున్నాయి. వాటిని గుర్తించి తీరా అక్కడికి వెళ్లేటప్పటికి ఆక్రమణలకు గురై ఉంటుండడంతో ఏమి చేయాలో కమిటీలకు దిక్కుతోచడం లేదు. హిందూపురంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని శ్రీకంఠాపురం ఈశ్వరస్వామి మాన్యం భూమి 7.76 ఎకరాలు ఎస్డీజీఎస్ కాలేజీ ఆక్రమణలో ఉన్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వాపోతున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. 1923 రెవెన్యూ డైక్లాట్ రికార్డు ప్రకారం సర్వే నంబర్ 309లోని 7.76 ఎకరాల భూమి ఆలయ మాన్యంగా నమోదై ఉంది. సబ్ రిజిస్ట్రారు కార్యాలయం రికార్డుల్లో సైతం ఈ రోజుకూ ‘శ్రీకంఠాపురం ఈశ్వరస్వామి వారి పూజా నిమిత్తంగా’ అని ఉంది. ఈ భూమి విషయాన్ని ఆలయ కమిటీ గతంలో పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. ఇటీవల ఎస్డీజీఎస్ కాలేజీ నిర్వాహకులు దీన్ని కూడా కలుపుకుంటూ ప్రహరీ నిర్మాణానికి పూనుకున్నారు. దీనిపై ఆలయ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను విచారణకు ఆదేశించారు. విచారణ సమయంలో ఆలయ కమిటీ సభ్యులు హాజరై భూమికి సంబంధించిన విషయాలు తెలియజేశారు. కళాశాల యాజమాన్యం తరఫున మాత్రం ఎవరూ హాజరు కాలేదని ఆలయ కమిటీ సభ్యుడు ఈశ్వరప్ప తెలిపారు. రెనిన్యూ అధికారుల విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయి కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేశాం. సర్వే నంబరు 309లోని 7.76 ఎకరాల భూమిని ఆలయ తాత్కాలిక ట్రస్టు సభ్యులలో ఒకరైన శివరామయ్య 1966లో కళాశాల పేరుపై విక్రయించినట్లు ఒక డాక్యుమెంట్ ఉంది. దాని ప్రకారం రూ.3,880 వైశ్యా బ్యాంకు ట్రస్టు పేరుపై శివునికే శఠగోపం! జమ చేసినట్లు చూపించినప్పటికీ ఆ వివరాలు లభ్యం కావడం లేదు. శివరామయ్యకు ఈ భూమిని విక్రయించే అధికారం ఉందా? అసలు 1966లో లావాదేవీలు జరిపి జారీ చేసిన చెక్కు అసలైందేనా?.. తదితర విషయాలు రెవెన్యూ అధికారుల పరిశీలనలో వెల్లడి కావాల్సి ఉంది. - దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ఆలయ భూములను సంరక్షిస్తాం శివాలయ మాన్యం భూమి ఆక్రమణపై విచారణ చేసి.. తగు చర్యలు తీసుకుంటాం. ఆలయాలకు సంబంధించిన ఆస్తులను ఎవరూ అమ్మడానికి గానీ, కొనడానికి గానీ లేదు. అలాగేమైనా జరిగివుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని..వాటిని సంరక్షిస్తాం. -విశ్వనాథ్, తహశీల్దార్ అధికారులు స్పందించపోతే మేమే స్వాధీనం చేసుకుంటాం శివాలయానికి సంబంధించిన దాదాపు రూ.20 కోట్ల విలువైన భూమిని ఎస్డీజీఎస్ కళాశాల యాజమాన్యం మూడు నెలలుగా తన ఆధీనంలో ఉంచుకుంది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అధికారులు స్పందించకపోతే ఆలయ కమిటీ సభ్యులు, శ్రీకంఠాపురం ప్రజలతో కలిసి భూమిని స్వాధీనం చేసుకుంటాం. ఈ విషయంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేసి తగిన కార్యాచరణ రూపొందిస్తాం. - అశ్వర్ధప్ప, ఆలయ కమిటీ సభ్యుడు 1965లోనే కాలేజీకిచ్చారు ఆలయ భూమిని మేం ఆక్రమించలేదు. 1965లోనే అప్పటి జిల్లా కలెక్టర్ ఆ భూమిని కాలేజీకి మార్కెట్ విలువ ప్రకారం కేటాయించారు. అప్పటి నుంచి మా స్వాధీనానుభవంలోనే ఉంది. - రాంప్రసాద్, ఎస్డీజీఎస్ కళాశాల కమిటీ సెక్రటరీ -
యూపీ సీఎం ఆఫీస్ ఎదుట ఓవ్యక్తి ఆత్మహత్యాయత్నం!
లక్నో: తన భూమిని కబ్జా చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కార్యాలయం ముందు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అడ్డుకుని.. ఆతర్వాత అరెస్ట్ చేశారు. తన భూమిని కొందరు కబ్జాదారులు అక్రమించారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని అలీఘడ్ కు చెందిన కపిల్ మిట్లల్ ఆత్మాహత్యకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రిని కలిసి తన బాధల్ని చెప్పుకోవాలని చూశాను. అయితే తన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని బాధితుడు తెలిపారు. ఈ ఘటనలో కపిల్ పై పోలీసులు కేసు నమోదు చేసి... హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ తరలించారు. -
భూ మాఫియాపై ఉక్కుపాదం
అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ మంగళగిరి : గుంటూరు, మంగళగిరిలతో పాటు అర్బన్ జిల్లా పరిధిలో భూ మాఫియా ఎక్కువైందని, వీటికి పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి, పీడీ యాక్ట్ అమలు చేస్తామని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణ పోలీసుస్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ భూ మాఫియాను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూముల ఆక్రమణ, దౌర్జన్యాల్లో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో సిబ్బంది కొరత వుందని, రోజు రోజుకి క్రైమ్‌రేటు పెరుగుతోందన్నారు. సిబ్బంది రిక్రూట్మెంట్ తోపాటు రూరల్ నుంచి కొంతమంది సిబ్బందిని తీసుకుని నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ మధ్య కాలంలో ప్రకాశం బ్యారేజి వద్ద చోటుచేసుకుంటున్న పలువురి ఆత్మహత్యల నేపథ్యంలో అక్కడ 24 గంటల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. బ్యారేజ్‌పైన, దిగువన ప్రత్యేక లైటింగ్ , ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణతోపాటు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం బ్యారేజి నుంచి కనకదుర్గవారధి వరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. చైన్‌స్నాచింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. గతంలో చైన్‌స్నాచింగ్‌లు పాతనేరస్తులు చేసేవారని.. ఇప్పుడు జల్సాలకు అలవాటుపడి ఉన్నత చదువులు చదివిన యువకులు ఈ తరహా నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చైన్‌స్నాచింగ్‌లు, బ్యాంకుల వద్ద నగదు కాజేసే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట పట్టణ సీఐ రావూరి సురేష్‌బాబు, ఎస్ఐలు జిలానిబాషా, కృష్ణయ్య, సిబ్బంది ఉన్నారు. -
కబ్జా ‘రాజు’!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పరిషత్ టీడీపీ అభ్యర్థిగా ముళ్లపూడి బాపిరాజును ఎంపిక చేయటంపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గొడవలు, గందరగోళాలతోపాటు భూకబ్జా ఆరోపణలున్న వ్యక్తిని జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఎలా ప్రకటించారని ఆ పార్టీ నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. నల్లజర్లకు చెందిన ముళ్లపూడి బాపిరాజు టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలని చూసినా ఆయనకు సీటు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మె ల్యే సీటు ఇవ్వలేదు కాబట్టి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వం ఇవ్వాలని పార్టీలోని మాగంటి బాబు వర్గం అధిష్టానానికి ప్రతిపాదించి ఆమోదించేలా చేసింది. దీంతో తాడేపల్లిగూడెం మండలం నుంచి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన పోటీకి దిగారు. జిల్లాలోని నాయకుల ఏకాభిప్రాయం మేరకు బాపిరాజును ైచైర్మన్ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టాల్సి ఉన్నా.. ఎవరితో చర్చించకుండానే నాలుగు రోజుల క్రితం ఆయనే అభ్యర్థి అని నాలుగురోజుల క్రితం ప్రకటించారు. దీనిపై పార్టీలో పెద్ద దుమారమే రేగింది. బాపిరాజు అరాచకాలతోపాటు ఆయనపై గల ఆరోపణల గురించి అధిష్టానానికి ఆయన వ్యతిరేకులు ఫిర్యాదులు కూడా పంపారు. భూకబ్జా ఆరోపణలు ప్రధానంగా బాపిరాజుపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్లజర్లలో ఆర్ఎస్ నంబర్-554లో 99 సెంట్లలో ఉన్న మోతేవారి ధర్మసత్రాన్ని ఆయన ఆక్రమించుకుని అమ్మినట్లు తెలిసింది. దేవాదాయ శాఖకు చెందిన ఆ భూమిని వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలు సృష్టించారు. ఇటీవలే దానిని రూ.4 కోట్లకు ఓ వ్యాపారికి అమ్మినట్లు సమాచారం. కోర్టులో కేసు ఉన్న భూ మిని అమ్మి ఎన్నికల ఖర్చుల కోసం వినియోగించినట్లు గుప్పుమంటోంది. నల్లజర్లలో మైనారిటీలకు చెందిన మూడు ఎకరాల భూమిని బకాయి ఉన్నారనే నెపంతో తమ పేర రిజిస్ట్రే షన్ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. నల్లజర్లలో ఇందిరమ్మ కాలనీ కోసం ప్రభుత్వం తీసుకుంటుందని మభ్యపెట్టి తక్కువ రేటుకు చిన్నరైతుల నుంచి భూములు సేకరించి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసినట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పోలీస్ రికార్డుల్లోనూ.. మరోవైపు బాపిరాజుపై నల్లజర్ల, తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో 18 కేసులున్నాయి. ఒక దశలో ఆయనపై నల్లజర్ల స్టేషన్లో రౌడీషీట్ తెరిచేందుకు అధికారులు సిద్ధపడ్డారు. బాపిరాజు ఎవరితోనే ఒత్తిడి చేయించటంతో వెనక్కుతగ్గారు. భూకబ్జాలు, సెటిల్మెం ట్లు, గొడవల్లో నిత్యం తలమునకలై ఉండే బాపిరాజు తనకు నచ్చకపోతే సొంత పార్టీవారినైనా ఇబ్బంది పెడతారనే విమర్శలున్నాయి. ఇందుకు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఉదాహరణ. ప్రస్తుతం వైఎస్సా ర్ సీపీలో ఉన్న ఆమె టీడీపీలో ఉన్నప్పుడు ప్రతిదానికి అవమానించి ఇబ్బంది పెట్టటమే లక్ష్యంగా బాపిరాజు పనిచేసేవారు. దళిత వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆమెను ముప్పతిప్పలు పెట్టారనే విమర్శలున్నాయి. ఆమె టీడీపీని వీడటానికి బాపిరాజు కూడా ఓ కారణమనే అభియోగం ఉంది. టీడీపీ నేత ఇమ్మణ్ణి రాజేశ్వరిని కూడా ఇటీవల జరిగిన ఓ సమావేశంలోనే కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడారు. అయిన దానికి కాని దానికి అడ్డగోలుగా మాట్లాడే ఆయన నైజాన్ని పార్టీలోని చాలామం ది జీర్ణించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ పదవీ లేని సమయంలోనే ఇన్ని అరాచకాలు చేసిన బాపిరాజు జెడ్పీ చైర్మన్ అయితే తమ పరిస్థితి ఏమిటని ఆయన వల్ల బాధించబడిన వారు ఆందోళన చెందుతున్నారు. పార్టీలోని ఓ ప్రధాన వర్గం కూడా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. బాపిరాజును జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినా, తాము ఒప్పుకునేది లేదని ఆ పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ విషయాలన్నింటినీ అధిష్టానానికి నివేదించి ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్టు సమాచారం. -
మాయగాళ్లు!
కల్వల మల్లికార్జున్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నర్సాపూర్, తూప్రాన్ దారిలో దట్టమైన అటవీ ప్రాంతం. ఉన్నట్టుండి ఏడాది క్రితం చెట్టూ పుట్టా మాయమై మైదానంగా మారింది. కోట్లాది రూపాయల విలువ చేసే 45.33 ఎకరాల భూమి ‘ఇనాం’ పేరిట పట్టా భూమిగా మారిపోయింది. దీని కోసం అక్రమార్కులు ‘బైబిల్ ఫర్ రెవెన్యూ రికార్డు’గా పేర్కొనే ఖాస్రా పహణీని సైతం చెదలు పట్టించారు. నమ్మశక్యం కాని రీతిలో రికార్డుల్లో ఎక్కడా లేని ఓ సర్వే నంబరును కొత్తగా సృష్టించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నత స్థానంలో ఉన్న ఓ రెవెన్యూ అధికారి సాయంతో ఈ తతంగం జరిగినట్లు సమాచారం. రెవెన్యూ పరిభాషలో సేత్వార్, ఖాస్రా పహణీ, గ్రామ నక్షా అత్యంత విలువైన పత్రాలు. ఈ రికార్డుల ప్రకారం నర్సాపూర్ మండలం హన్మంతాపూర్‌లో మొత్తం 154 సర్వే నంబర్లలో 851.27 గుంటల భూమి ఉంది. సేత్వార్, నక్షా, ఖాస్రా పహణీ ప్రకారం నర్సాపూర్ మండలం హన్మంతాపూర్‌లో చిట్ట చివరి సర్వే నంబరు 154. ఆ తర్వాతి కాలంలో సర్వే నంబరు 155 పేరిట 45.33 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు పహణీల్లో నమోదు చేయించారు. 2006లో సదరు భూమిని ‘ఇనాం భూమి’గా గుర్తిస్తూ రెవెన్యూ అధికారులు ఓఆర్సీ (ఆక్యుపెంట్స్ రైట్స్ సర్టిఫికేట్) జారీ చేశారు. 1955 నాటి ఇనాం భూముల రద్దు చట్టం ప్రకారం ఓఆర్సీ ఇవ్వకూడదు. అయితే 1975లో జారీ చేసిన జీఓ 870 ప్రకారం ఖాస్రా పహణీలో మొదటి నుంచి ఇనాం భూమిగా నమోదై ఉంటే ఓఆర్సీ జారీ చేయొచ్చు. హన్మంతాపూర్ 155 సర్వే నంబరులోని 45.33 ఎకరాల భూమి విషయంలో మాత్రం అధికారులు ఈ నిబంధనలేవీ పాటించకుండానే ఓఆర్సీ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి గతంలో మెదక్ ఆర్డీఓగా పనిచేసిన కాలంలో ఓఆర్సీ జారీ అయినట్లు సమాచారం. 2006లో ఓఆర్సీ పట్టా పొందిన కొందరు 2009లో ఇతరులకు విక్రయించగా ఇప్పటికే పలువురి చేతులు మారింది. సర్వే లేకుండానే కొత్త నంబరు నిజానికి ఖాస్రా పహణీలో కొత్తగా సర్వే నంబరును నమోదు చేయాలంటే గ్రామంలోని భూమినంతటినీ సర్వే సెటిల్మెంట్ విభాగం సర్వే చేసి కొత్త సర్వే నంబరు కేటాయిస్తుంది. సాధారణంగా రీ సర్వే సమయంలో గ్రామంలో భూ విస్తీర్ణం తగ్గడమో, పెరగడమో జరిగిన సందర్భంలో మాత్రమే సర్వే నంబర్లలో మార్పు చేస్తారు. గతంలో సర్వే చేసేందుకు వీలుకాని భూములను ‘బిలా దాఖలా’ (ఏ గ్రామ రికార్డుల్లోనూ లేని భూములు)గా గుర్తించారు. బిలా దాఖలా భూములున్న పక్షంలో వాటిని సర్వే సెటిల్మెంట్ విభాగం ద్వారా గుర్తించి కొత్త సర్వే నంబరు కేటాయిస్తారు. ఇటీవల జిన్నారం మండలంలో 110 ఎకరాల బిలా దాఖలా భూములను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ కొత్త సర్వే నంబరు కేటాయించారు. అయితే హన్మంతాపూర్ 155 సర్వే నంబరు విషయం లో మాత్రం ఏ రకమైన సర్వే, రీ సర్వే లేకుం డానే రికార్డుల్లో కొత్త నంబరు చేర్చడంపై రెవె న్యూ వర్గాలే అశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఖాస్రా పహణీ, ప్రస్తుతమున్న గ్రామ నక్షాను పరిశీలిస్తే ఇప్పటికీ హన్మంతాపూర్‌లో కేవలం 154 సర్వే నంబర్లు మాత్రమే ఉన్నాయి. త్వరలో ప్రాథమిక నివేదిక గ్రామ నక్షాలో కొత్త నంబరు చేర్చడంపై అనుమానం వచ్చిన ఓ రెవెన్యూ అధికారి తీగలాగడంతో 155 సర్వే నంబరు గుట్టు బయట పడింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హన్మంతాపూర్‌లో కొత్త సర్వే నంబరు గుట్టుగా పుట్టుకొచ్చిన వైనంపై విచారణ జరుపుతున్నారు. త్వరలో పూర్తి వివరాలతో జిల్లా ఉన్నతాధికారికి నివేదిక సమర్పించేందుకు నర్సాపూర్ రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
మరో భూ మాయ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలోని మరో మండలంలో బోగస్ పట్టాల బాగోతం బయటపడింది. ఒకే భూమిపై పలువురికి పట్టాలు జారీ చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. మంచాల మండలం లోయపల్లిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై జిల్లా యంత్రాంగం జరిపిన విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. రెండు దశాబ్ధాల క్రితం ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ పేరిట పాత తేదీలతో ఇప్పటికీ పాస్‌పుస్తకాలు, ప్రొసీడింగ్స్ జారీ అవుతున్నట్లు గుర్తించిన యంత్రాంగం.. అక్రమాల వెలికితీతకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని విచారణకు నియమించింది. 1993లో మంచాల తహసీల్దార్‌గా జయరాజ్ ఉన్న కాలంలో ఈ నకిలీ పట్టాలు, ప్రొసీడింగ్స్ జారీకి తెర లేచినట్లు ప్రాథమికంగా తేలింది. లోయపల్లిలోని సర్వేనంబర్లు 334, 335, 370లో దాదాపు 710 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు జారీచేసిన తహసీల్దార్.. అక్రమార్కులకు కూడా పాస్‌బుక్కులు ఇచ్చినట్లు బయటపడింది. ఇలా సుమారు కొన్ని వేల మందికి బోగస్ పాస్‌పుస్తకాలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఆఖరికి 1993లో జన్మించనివారి పేరిట కూడా పట్టాదారు పాస్‌బుక్కులు సృష్టించినట్లు తేలడంతో జిల్లా యంత్రాంగం అవాక్కయింది. దీంతో జయరాజ్ పనిచేసిన కాలంలో పురుడు పోసుకోనివారి పేర పాస్‌పుస్తకాలు బయటపడిన వైనంపై జాయింట్ కలెక్టర్-1 చంపాలాల్ కూపీ లాగారు. ఈ నేపథ్యంలోనే గురువారం మంచాల మండలంలో పర్యటించిన జేసీ.. ఈ ఘటనపై విచారణ జరిపారు. యాచారం మండలం నల్లవె ల్లిలోనూ ఇదే తరహా అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బోగస్ పాస్ పుస్తకాల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలని యంత్రాంగం నిర్ణయించింది. బ్యాంకులకు టోపీ! రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై పాసు పుస్తకాలను సృష్టించిన అక్రమార్కులు బ్యాంకులనూ బురిడీ కొట్టించారు. పాస్‌బుక్కులు అసలా? కాదా అనే అంశాన్ని నిర్ధారించుకోకుండానే ఎడాపెడా రుణాలిచ్చేసిన బ్యాంకర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరుట్ల శాఖ, బోడకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈ భూములను తనఖా పెట్టి.. అడ్డగోలుగా అప్పులు చేసినట్లు స్పష్టమైంది. ఒకే భూమిని పలువురు తాకట్లు పెట్టి రుణాలు తీసుకున్నా గుర్తించని బ్యాంకర్లు.. తాజాగా అక్రమాలు బయటకురావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదిలావుండగా.. నకిలీ పాస్‌పుస్తకాల జారీ వైనంపై సమగ్ర దర్యాప్తు జరుపనున్నట్లు జేసీ చంపాలాల్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉందా.. ఇవి ఫోర్జరీ సర్టిఫికెట్లా ? నకిలీలలు కేవలం లోయపల్లి గ్రామానికే పరిమితమయ్యాయా? ఇతర గ్రామాల్లో కూడా చోటుచేసుకున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీనికోసం డిప్యూటీ కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. -
విశాఖ జిల్లాలో భూకబ్జారాయుళ్ల ఆగడాలు
విశాఖపట్నం: జిల్లాలోని తిమ్మాపురంలో భూకబ్జారాయుళ్ల ఆగడాలు శృతిమించాయి. మహిళలంతా తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు భూకబ్జారాయుళ్లు మహిళలనే కనీస గౌరవభావం లేకుండా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. దీంతో మహిళలు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఓ మహిళ భూకబ్జారాయుళ్లు తనను వివస్త్రను చేశారని పోలీసులను ఆశ్రయించింది. భూకబ్జారాయుళ్ల ఆగడాలను అడ్డుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. -
శ్రీధర్‌బాబుపై భూదందాల ఆరోపణలు
-
కబ్జాదారులపై కన్ను!
ల్యాండ్ మాఫియా పీచమణచడానికి సైబరాబాద్ పోలీసులు పావులు కదుపుతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ భూములను లాక్కుంటున్న వారిని ఓ పట్టుపట్టడానికి సిద్ధమవుతున్నారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల భూముల ధరలు ఆకాశాన్నం టిన తరుణంలో, జంట నగరాల్లో ల్యాండ్‌మాఫియా విపరీతంగా పెరి గింది. ‘సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోరు’ అంటూ పోలీస్స్టేషన్ల గోడలపై రాసి ఉన్న వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని మాఫియా రెచ్చిపోతోంది. నగరంలో కొందరు రాజకీయం, రౌడీయిజం, పెద్దమనుషుల ముసుగులో పాల్పడుతున్న ఈ అరాచకాలకు అడ్డుకట్టవేయడానికి సైబరాబాద్ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల గుప్పిట్లో చిట్టా.. భూకబ్జాలకు పాల్పడే వ్యక్తుల ప్రొఫైల్‌ను తయారుచేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వారి చిట్టా పోలీస్ డైరీలో ఉంది. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకునే విషయమై దృష్టి సారించే అవకాశం ఉంది. కబ్జాలకు పాల్పడేవారితోపాటు, వారికి సహకరించే వారిపై కూడా నిఘా పెట్టారు. కబ్జాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదంటున్న పోలీసులు ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమాయక ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్నదంతా ఎగురేసుకుపోతున్న ల్యాండ్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దని, వారిపై రౌడీషీట్లు తెరవాలని పలువురు బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. ప్రాంతాలవారీగా వివరాల సేకరణ నగరం చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో భూమి అమ్మిన భూ యజమానులతో కుమ్మక్కవుతున్న ల్యాండ్ మాఫియా తమకు అమ్మినట్లు వారితో పాత తేదీలతో కాగితాలు రాయించి భూమి కొనుగోలు చేసిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వంద గజాలకు మించి ఖాళీ స్ధలం కనిపిస్తే అక్కడ దస్తీవేసే పనిలో ఉన్నారు. జవహర్‌నగర్‌లో కొంతమంది కబ్జాదారులు, మాజీ సైనికుల దగ్గర భూమిని కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్న వారి వివరాలను ఆరాతీస్తున్నారు. కబ్జాదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే నగరంలో భూఆక్రమణలు చేయడానికి ఎవ రూ సాహసించరని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిశిత పరిశీలన.. మార్పునకు శ్రీకారం ఓ వ్యక్తి భూమిని ఆక్రమించుకునేందుకు దోహదపడుతున్న అంశాలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక ముందు అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా ఉండేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. బాధితులకు న్యాయం జరిగే దిశగా కబ్జాలను వెలికితీసి అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలనే దిశగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఆక్రమణదారుల ఆస్తులపై నిఘా పెట్టారు. ఇక పోలీసుల విచారణలో భూములు కబ్జాలకు గురైనట్లు తేలితే.. వాటి ని బాధితులకు తిరిగి ఇచ్చే అవకాశాలను కల్పిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సదరు భూమిని మరొకరికి అమ్మిన పక్షంలో బాధితులకు ఎలా న్యాయం చేయాలనే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కబ్జాదారుల్లో భయం.. భయం నకిలీ డాక్యుమెంట్లను పోలీసు శాఖ సేకరిస్తోందనే సమాచారం అందుకున్న కబ్జాదారులు భయాందోళనకు గుర వుతున్నారు. చేసిన తప్పులకు మూల్యం చె ల్లించాల్సి వస్తుందని భావిస్తున్న కొందరు కబ్జాదారులు తమ ఇళ్లలోంచి నకిలీ డాక్యుమెంట్లను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. -
కబ్జాలకు కేరాఫ్ పీలేరు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గం భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పీలేరుకు నాలుగువైపులా ఉన్న చిత్తూరు, తిరుపతి, రాయచోటి, మదనపల్లి రహదారులకు ఇరువైపులా రూ.200 కోట్లకు పైగా విలువజేసే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. సీఎం ఆశీస్సులతో ఆయన సోదరుడే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఇటీవల ఆరోపించగా, తాజాగా పలు కబ్జాలపై టీఆర్ఎస్ మంగళవారం ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పీలేరు కబ్జాలు మరోమారు తెరపైకి వచ్చాయి. కబ్జాదారులు కాంగ్రెస్ నేతలు, సీఎం అనుచరులు కావడం వల్లే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు రహదారుల్లో బహిరంగంగా కనిపిస్తున్న కబ్జాలపై బుధవారం పీలేరు పర్యటనకు వస్తున్న సీఎం ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. పీలేరుకు ఆనుకొని ఉన్న ఎర్రగుంటపల్లె, దొడ్డిపల్లె, కాకులారంపల్లె, వేపులబైలు, ముడుపులవేముల, బోడుమల్లివారిపల్లె, గూడరేవుపల్లెలోని ప్రభుత్వ భూమలు, చెరువులు, కొండలు, వాగులు పెద్ద ఎత్తున కబ్జాలకు గురయ్యాయి. ఒక్క బోడుమల్లివారిపల్లెలోనే 70 కోట్ల రూపాయల విలువచేసే భూములు కబ్జా అయ్యాయని, వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్వయంగా సర్పంచ్ రవీంద్రనాథరెడ్డి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కబ్జాల నివారణకు ఆయన నిరాహారదీక్షకు సిద్ధమౌతున్నారు. ఎర్రగుంటపల్లెలో 14.76 ఎకరాల ప్రభుత్వ భూమి, చిత్తూరు రోడ్‌లోని ఆటోనగర్‌లో 15 ఎకరాలకు పైగా కొండ కబ్జా అయ్యాయి. అప్పలనాయు డు చెరువు సప్లై కాల్వ భూమిని కాంగ్రెస్‌కే చెందిన పీలేరు సర్పంచ్ హుమయూన్ కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారనే ఆరోపణలు వచ్చినా దానిపై అధికారులు స్పందించడం లేదు. కబ్జాలకు సహకరించిన మండల స్థాయి అధికారికి మూడు కోట్లకు పైగా ముడుపులు ముట్టాయని, కింది స్థాయి అధికారిణి ఒకరికి తిరుపతిలో కబ్జాదారులు రూ.50 లక్షలతో ఇంటిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారని ప్రచారం జోరుగా సాగుతోంది. మదనపల్లి రోడ్‌లోని బడబళ్లవంక, ఎన్జీవో హోం స్థలం, ఆర్ అండ్ బీ అతిథిగృహం స్థలాలను కూడా కబ్జాదారులు వదల్లేదు. సమైక్యాంధ్ర హీరోగా కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్న కిరణ్‌కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉద్యమం కంటే జోరుగా కబ్జాలే జరిగాయి. వీటిపై ఫిర్యాదులు వెళుతున్నా అధికారులు స్పందించడం లేదు. రచ్చబండకు వచ్చే ముఖ్యమంత్రి కబ్జాలపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.