
బెజవాడను మాఫియా సిటీగా చేస్తారా... బాబూ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. రాజధాని భూ మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్, సాండ్, శాండిల్, పొలిటికల్, కార్పొరేట్ మాఫియాలు ఉన్నాయని విమర్శించారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు, చంద్రబాబు అనుచరులు గబ్బిలాల మాదిరిగా విజయవాడ పరిసర ప్రాంతాలలో కబ్జాలు చేస్తున్నారని ద్వజమేత్తారు. ఈ రోజు విజయవాడ సమీపంలో జరిగిన హత్యలు కూడా ఈ నేపథ్యంలోనే జరిగాయన్నారు. చంద్రబాబు మాఫీయా సిటీ తయారు చేయబోతున్నారా అంటూ తమ్మినేన్ని సీతారాం సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు.