ఎంపీకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితేంటి?: తమ్మినేని | Ysrcp Leader Tammineni Sitaram Fire On Ap Government | Sakshi
Sakshi News home page

ఎంపీకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితేంటి?: తమ్మినేని

Aug 5 2024 12:26 PM | Updated on Aug 5 2024 2:31 PM

Ysrcp Leader Tammineni Sitaram Fire On Ap Government

సాక్షి,అమరావతి : టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సాఆర్‌సీపీ సీనియర్‌ నేత,మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాని ధ్వజమెత్తారు.   

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో టీడీపీ  దాడులు దౌర్జన్యాలు పాల్పడుతోంది... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్  రాజ్యాంగం నడుస్తుంది... రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా పుల్ స్టాప్ పెట్టాలని లేదా చంద్రబాబు ?. చంద్రబాబు అనుకూల మీడియాతో ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఎన్నికల టైం నుంచి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అసత్య ప్రచారం చేస్తుంది. 

55 రోజుల్లో చంద్రబాబు రోజుల్లో టీడీపీ పాలన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఐదేళ్లలో 2 లక్షల 71 వేల కోట్ల నగదు నేరుగా పేదలకు మా ప్రభుత్వం డీబీటీ ద్వారా అందించింది.7.8 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఖజానాలో ఉంది. కానీ చంద్రబాబు ప్రజలను తప్పుడు లెక్కలు చెపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారు. అందుకు ఎల్లోమీడియా వంతపాడడం విడ్డూరంగా ఉందని” మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దుయ్యబట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement