శ్రీకాకుళం : తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శుక్రవారం ఆమదాల వలస పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు...మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోం. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ మంత్రి పదవి రాలేదని ఫస్ట్ రేషన్ తో బెదిరింపులకు పాల్పడుతున్నారు.
టీడీపీ నేతల మీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. సూపర్ సిక్స్ పథకం ఏమో తెలియదు కానీ సూపర్ సిక్స్ బీరు ప్రవేశపెట్టడం చూశాం. తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు భయబ్రాంతులకు గురవుతున్నారు’ అని సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తమ్మినేని సీతారాం మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment