Andhra pradesh chief minister
-
జైలుకు ఈశ్వరన్
సింగపూర్: అవినీతి కేసులో దోషిగా రుజువైన సింగపూర్ మాజీ మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబు ‘అమరావతి పార్ట్నర్’ ఎస్.ఈశ్వరన్ (62) సోమవారం జైలుకు వెళ్లారు. మంత్రిగా ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్ల కాలంలో ఆయన 3.12 లక్షల డాలర్ల విలువైన అక్రమ కానుకలు స్వీకరించడం నిజమేనని కోర్టు తేల్చడం, ఏడాది జైలు శిక్ష విధిస్తూ గత గురువారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ఇప్పటికే నేరాన్ని అంగీకరించిన ఈశ్వరన్ కోర్టు తీర్పుపై అపీలుకు వెళ్లకుండా శిక్ష అనుభవించేందుకే మొగ్గు చూపారు. ‘‘నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. సింగపూర్వాసులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా’’ అంటూ సోమవారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అనంతరం శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లారు. ఏపీలో రాజధాని అమరావతి పేరిట 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీలో ఈశ్వరన్ కూడా కీలక పాత్రధారి అన్నది తెలిసిందే. -
రెండేళ్లలో తీవ్రవాదానికి చరమగీతం: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వెలిబుచ్చారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మరణాలు, హింసాత్మక ఘటనలు 2022లో గత 4 దశాబ్దాల్లోకెల్లా అతి తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. ‘నక్సలిజం మానవత్వం పాలిట శాపం. దాన్ని అన్నివిధాలా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం‘ అని అన్నారు. వామపక్ష తీవ్రవాద రాష్ట్రాల్లో పరిస్థితిపై ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ సీఎంలు కూడా ఇందులో పాల్గొన్నారు. 2015లో ’వామపక్ష తీవ్రవాదంపై జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక’ అమల్లోకి వచ్చాక ఆ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని ఉన్నతాధికారులు తెలిపారు. 2010తో పోలిస్తే నక్సల్స్ హింసలో పోలీసు, పౌర మరణాలు 90 శాతం తగ్గాయని వివరించారు. ‘2004–14 మధ్య 17,679 నక్సల్ సంబంధిత హింసా ఘటనలు, 6,984 మరణాలు సంభవించాయి. 2014–23 మధ్య 7,659 ఘటనలు, 2,020 మరణాలు నమోదయ్యాయి‘ అని పేర్కొన్నారు. -
వ్యవసాయ ఉత్పత్తులకు ముందే మద్ధతు ధరలు : మంత్రి కాకాణి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేల్ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధత్తు ధరలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ హామీకి అనుగుణంగా.. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 2023-24 ఏడాదికి వివిధ వ్యవసాయ ఉత్పత్తుల మద్ధత్తు ధరలకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించదేమోనన్న బెంగ లేని విధంగా ఈ మద్ధత్తు ధరలను ప్రకటించామని తెలిపారు. వరి, పసుపు, మిర్చి, ఉల్లి, చిరు ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశెనగ, కొబ్బరి, పత్తి, బత్తాయి, అరటి, సోయాబీన్స్, ప్రొద్దుతిరుగుడు వంటి 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు క్వింటాల్ ధరను ప్రకటించారు. రైతుల్లో మద్ధత్తు ధరలపై పూర్తి అవగాహన కలిగించేందుకు రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ ధరల గోడపత్రికను ప్రదర్శిస్తారని తెలిపారు. రైతుకు మధ్య దళారుల బెడద, రవాణా ఖర్చు లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే సీయం యాప్(Continuous Monitoring of Agriculture Prices and Procurement)ద్వారా కొనుగోలు చేయవచ్చన్నారు. మద్దత్తు ధరలపై వివరణ ఇలా.. రాష్ట్రంలోని రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలని తొలిసారిగా 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి నిరంతరం మానిటర్ చేస్తూ రైతులకు మద్ధత్తు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. అందుకే ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని కొనుగోలు కేంద్రంగా ప్రకటించామని తెలిపారు. ధాన్యాన్ని కల్లం దగ్గరే కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో చిన్నసన్నకారు రైతులకు ప్రాధాన్యతను ఇస్తున్నామని వివరించారు. మార్కెట్లో ఆన్లైన్ యాప్ ద్వారా అభివృద్ధి చెందడం.. మార్కెట్లో పోటీ తత్వం పెరగాలని తద్వారా రైతన్నకు మెరుగైన ధర రావాలని అందుకోసం అవసరమైతే ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి పోటీని పెంచుతుందని మంత్రి స్పష్టం చేశారు. మద్ధత్తు ధరలకు పంటలు అమ్ముకోవాలంటే రైతులు తప్పని సరిగా ఈ-క్రాపులో వారి పంటల వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విజ్ణప్తి చేశారు. అలా నమోదు చేసుకున్న తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ధ సీఎం యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనీస గిట్టుబాటు ధర దక్కని పరిస్థితిలో వెంటనే కొనుగోలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతులు రైతు భరోసా కేంద్రాలకు తీసుకువచ్చే పంటలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని మంత్రి రైతులకు మనవి చేశారు. రైతులు వారి పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాక గూగల్ ప్లేస్టోర్ నుంచి CM APP-Farmer Payment Status App ను డౌన్ లోడ్ చేసుకుని తమ చెల్లింపు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెల్సుకోగలరని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆశాఖ కమీషనర్, మార్క్ ఫెడ్ ఎండి రాహల్ పాండే, ఆశాఖ ఆర్జెడి శ్రీనివాసరావు తదితర అధికారుల పాల్గొన్నారు. -
వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లినర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రికి చేరుకుంటారు. ఓ కాలేజీ ఆవరణలో జరుగుతోన్న అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి వెళ్లనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్. ఇదీ చదవండి: AP: ఇకపై పింఛన్ రూ.2,750 -
సర్వ సేవాలయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూముల సర్వేలో భాగంగా అక్టోబరు 2న తొలివిడతగా గ్రామాల్లో శాశ్వత భూహక్కు– భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు సత్వరమే అందించాలని సూచించారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. వాణిజ్య పన్నుల శాఖలో సమర్థత పెంచే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, అటవీ శాఖలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 14 వేల మందికి శిక్షణ ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ గ్రామాల సంఖ్య మరింత పెరగనుందని అధికారులు తెలిపారు. 14 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 2న తొలివిడత కింద రిజిస్ట్రేషన్ సేవలు, భూహక్కు–భూరక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచేలా కృషి చేయాలని సీఎం సూచించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు (ఓటీఎస్) పథకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని నిర్దేశించారు. అక్రమ మద్యంపై కఠిన చర్యలు అక్రమ మద్యం తయారీ, రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖకు సూచించారు. 2,700 క్వారీల్లో పనులు మొదలయ్యేలా.. మైనర్ మినరల్స్‌కి సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కిపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో కార్యకలాపాలు మొదలయ్యేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బొగ్గు మన అవసరాలకే ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు తెలిపారు. జెన్కో సహా రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈ బొగ్గును మన అవసరాలకు వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. తదుపరి బొగ్గు గనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టి పెట్టాలని ఏపీఎండీసీకి సూచించారు. వాణిజ్య శాఖలో సమూల మార్పులు వాణిజ్య పన్నుల శాఖలో సమర్ధత పెంపొందించే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టత ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. డేటా అనలిటిక్స్‌తో పాటు లీగల్‌సెల్ విభాగం కూడా ఏర్పాటు చేయనున్నారు. పెండింగ్ బకాయిల వసూలుకు వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. జూన్ చివరికల్లా వాణిజ్య పన్నుల శాఖలో ఈ విభాగాల ఏర్పాటును పూర్తి చేయనున్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్.ప్రతీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చి విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఎలాంటి సేవలు పొందవచ్చు అనే అంశాలపై సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కేవలం ఆస్తుల రిజిస్ట్రేషన్లే కాకుండా రిజిస్ట్రేషన్ పరంగా అందించే ఇతర సేవలపై కూడా పూర్తి సమాచారం, అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు లభిస్తాయి? ఎలాంటి భద్రత సమకూరుతుందో వివరంగా తెలియచేయాలన్నారు. -
తక్కువ వడ్డీకి రెట్టింపు రుణాలు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న అంశాలకు బ్యాంకులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. వార్షిక రుణ ప్రణాళిక రూపకల్పనలో ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వాధికారులకు కూడా భాగస్వామ్యం కల్పించాలన్నారు. అణగారిన వర్గాలకు తక్కువ వడ్డీకే రెట్టింపు రుణాలను మంజూరు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేందుకు దోహదం చేయాలని సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన 219వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రూ.3,19,480 కోట్లతో 2022–23 వార్షిక రుణ ప్రణాళికను సీఎం జగన్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. పేదల ఇళ్ల నిర్మాణాలకు అండగా నిలవాలి రాష్ట్రంలో భారీ ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. విలువైన భూముల పట్టాలను పేదలకు అందించామని, వీటిపై అప్పులు ఇవ్వడం ద్వారా బ్యాంకులిచ్చే రుణాలకు తగిన భద్రత ఉంటుందన్నారు. పేదలకు అండగా నిలవాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో బ్యాంకులు టైఅప్ కావడంపై దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) డ్రోన్లను తేవడం ద్వారా వ్యవసాయ రంగంలో అత్యాధునికతకు పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తున్నామని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, డ్రోన్ టెక్నాలజీకి బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తూ హార్బర్లు, పోర్టులను నిర్మిస్తున్నామని, వీటికి కూడా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్య, గృహ రుణాలకు మరింత ప్రాధాన్యం ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ బ్యాంకులు 2021–22లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19 శాతానికి చేరుకోవడం ప్రశంసనీయమన్నారు. వ్యవసాయ టర్మ్ రుణాలు నిర్దేశిత లక్ష్యం కంటే 167.27% అధికంగా ఇచ్చారన్నారు. ప్రాథమికేతర రంగానికి రెట్టింపు రుణాలు అంటే 208.48%ఇచ్చారని చెప్పారు. మరికొన్ని రంగాల్లో మాత్రం పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎగుమతుల లక్ష్యంలో 31.01%, విద్యా రంగానికి 50.03%, గృహ నిర్మాణానికి 36.11% మాత్రమే రుణాలు ఇచ్చారన్నారు. సామాజిక, ఆర్థిక ప్రగతిలో విద్య, ఇళ్ల నిర్మాణం అత్యంత కీలకమని, ఈ రంగాలకు బ్యాంకులు మరింత సహకారం అందించాలని సూచించారు. ఖరీఫ్‌లో తగ్గటానికి కారణాలను గుర్తించాలి ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాలకు సంబంధించి స్వల్పకాలిక పంట రుణాలు 87.40%, టర్మ్ లోన్స్ 59.88% మాత్రమే ఇచ్చారని, వార్షిక రుణ ప్రణాళికను పరిశీలిస్తే మాత్రం లక్ష్యానికి మించి ఇచ్చారని చెప్పారు. రబీ సీజన్ గణనీయంగా ఉండడం, ఆ సమయంలో పనితీరు బాగుండడం దీనికి కారణంగా కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో రుణ పంపిణీ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోయామనే విషయంపై బ్యాంకులు దృష్టిపెట్టాలని సూచించారు. జూలైలో చిరువ్యాపారులకు రుణాలు చిరు వ్యాపారులు, సంప్రదాయ హస్తకళాకారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వడ్డీ లేకుండా రూ.10 వేల చొప్పున రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తూ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. బ్యాంకులు దాదాపు 14.15 లక్షల మందికి జగనన్న తోడు కింద రుణాలు ఇచ్చాయని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. తదుపరి విడత రుణాలు జూలైలో ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2021–22లో ఎంఎస్ఎంఈలకు 90.55% రుణాలు ఇచ్చారని, లక్ష్యాలను చేరుకునేలా దృష్టి పెట్టాలని కోరారు. ఆ నగదును మినహాయించుకోకూడదు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న నగదును బ్యాంకులు మినహాయించుకోరాదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఒక ప్రత్యేక ఉద్దేశంతో, ఒక లక్ష్యం కోసం ఈ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని బ్యాంకులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని సీఎం జగన్ చెప్పారు. అవినీతి, పక్షపాతం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తోంద న్నారు. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి సాధికార తవైపు నడిపించడంవల్ల గ్రామీణ ఆర్థికవ్యవస్థ నిలదొక్కుకుం టోందని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి సహకరించిన బ్యాంకర్లందరికీ సీఎం ధన్యవాదాలు తెలి పారు. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవ సాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండ య్య, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్థి కశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివే ది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయ క్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ నిధు సక్సేనా, ఆర్బీఐ రీజన ల్ డైరెక్టర్ కె.నిఖిల, నాబార్డు సీజీఎం ఎం.ఆర్.గోపాల్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించాలి మహిళా సాధికారత ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యమని, ఈ దిశగా విశేష కృషి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వడ్డీలేని రుణాలు, ఆసరా, చేయూత.. తదితర కార్యక్రమాల ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు. తీసుకున్న రుణాలను మహిళలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని, వారికిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పస్ ఫండ్ కింద బ్యాంకుల వద్ద ఉన్న తమ డబ్బులపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తూ తీసుకున్న రుణాలపై మాత్రం అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బ్యాంకులు దీన్ని పరిగణలోకి తీసుకుని మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు విరివిగా.. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి నిర్దేశిత లక్ష్యంలో 82.09 శాతం, పౌల్ట్రీకి 60.26 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారని, రుణ పంపిణీలో సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను సీఎం కోరారు. 2021–22లో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని, వారికి మరిన్ని రుణాలు అందించేలా బ్యాంకర్లు చొరవ చూపాలని కోరారు. ఇ–క్రాపింగ్ డేటాను పరిగణలోకి తీసుకుని విరివిగా రుణాలివ్వాలన్నారు. ఆర్బీకేలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఈ విషయంలో కౌలు రైతులకు సహాయకారిగా నిలవాలని సూచించారు. 2022–23 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు రంగాల వారీగా రంగం 2022–23 లక్ష్యం (రూ.కోట్లలో) స్వల్ప కాలిక పంట రుణాలు 1,21,580 వ్యవసాయ టర్మ్ రుణాలు, ఇన్ఫ్రా 43,160 మొత్తం వ్యవసాయ రుణాలు 1,64,740 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 50,100 ఇతర ప్రాధాన్యత రంగాలు 20,840 మొత్తం ప్రాధాన్యత రంగం 2,35,680 ప్రాధాన్యేతర రంగం 83,800 2022–23 మొత్తం వార్షిక రుణ ప్రణాళిక 3,19,480 ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా ఊతమివ్వాలి కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదొడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బ తీశాయని ముఖ్యమంత్రి తెలిపారు. కోవిడ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. 2021–22లో దేశ జీడీపీ రూ.237 లక్షల కోట్లు కాగా ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5 శాతంగా ఉందన్నారు. అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలతో ముడి చమురు, బొగ్గు ధరలు భగ్గుమనడంతో సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిందన్నారు. గత 8 ఏళ్లలో ఇదే అత్యధికమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 8.38% ఉండటం నిరాశ కలిగించే పరిణామమన్నారు. దీంతో రిజర్వ్ బ్యాంకు మే 6న నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిక్ పాయింట్లు పెంచిందని, రెపోరేటును 40 బేసిక్ పాయింట్లు పెంచిందని, జూన్‌లో దీన్ని మరో 50 బేసిక్ పాయింట్లకు పెంచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6 శాతా నికి పైబడి ఉంటుందని ఆర్బీఐ అంచనా వేయడంతో న గదు నిల్వలను బ్యాంకులు క్రమంగా తగ్గిస్తున్నాయన్నా రు. ఈ పరిణామాలన్నీ దిగువ తరగతి వారిపై తీవ్రప్ర భావం చూపుతాయన్నారు. తయారీరంగంపైనా ప్రతి కూల ప్రభావం పడుతుందన్నారు. సరుకులు కొనేవారు లేకపోతే పరిశ్రమలను మూసివేసే పరిస్థితి వస్తుందని, ఈ అంశాలన్నింటినీ బ్యాంకర్లు దృష్టిలో ఉంచుకుంటూ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టి తక్కువ వడ్డీలకు విరివిగా రుణాలివ్వాలని కోరారు. -
ప్రజా ప్రభుత్వానికి మూడేళ్లు
-
థామస్ కప్ గెలిచిన భారత బృందానికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్‌లో ఇదో చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసినందుకు గాను కిదాంబి శ్రీకాంత్ అండ్ టీమ్‌ను అభినందించారు. ఫైనల్లో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్‌ను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తన సందేశాన్నిపంపారు. A historic moment for Indian Badminton as India brings home its first #ThomasCup! Congratulations to Srikanth Kidambi and team India for their spectacular win in the finals and their remarkable journey up to the last shot. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 15, 2022 కాగా, పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..! -
మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట
Mahesh Babu Mass Dialogues In Sarkaru Vari Pata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్లో మహేశ్ బాబు లుక్స్, డైలాగ్‌లు, డైలాగ్ డెలివరీ అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైలర్లో మహేశ్ చెప్పిన డైలాగ్‌లు బాగా పేలాయి. 'నువ్ నా ప్రేమను, స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బును దొంగలించలేవ్', 'నేను విన్నాను.. నేను ఉన్నాను', 'వంద వయగ్రాలు వేసి శోభనానికి ఎదురుచూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చార్రా', 'దిస్ ఈజ్ మహేశ్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలుప్పాడ బీచ్ సర్' వంటి తదితర డైలాగ్‌లు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాటలను.. కూడా ఈ మూవీలో వాడారు. చదవండి: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. -
144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
-
జగన్ దూకుడుకు చేతులెత్తేసిన చంద్రబాబు
-
2021 వైఎస్ఆర్ సీపీ విజయ ప్రస్థానం పై స్పెషల్ ఫోకస్
-
పారాలింపిక్స్ పతకధారులకు ఏపీ సీఎం అభినందనలు
అమరావతి: టోక్యో పారా ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు భవీనాబెన్(మహిళల టేబుల్ టెన్నిస్‌లో రజతం), నిషద్ కూమార్(పురుషుల హై జంప్‌లో రజతం), వినోద్ కూమార్(పురుషుల డిస్కస్ త్రోలో కాంస్యం)లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమన్నారు. ఈ ముగ్గురు భరతమాత ముద్దు బిడ్డల ధైర్య సాహసాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, వీరు సాధించిన పతకాలు దేశం యావత్తుకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. చదవండి: Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్.. -
అంగన్వాడీల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంగన్వాడీల్లో కూడా ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పాఠశాల విద్యాశాఖపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంగ్లీషులోనే బోధించాలని, వారితో ఇంగ్లీషు మాట్లాడించటం అలవాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలతో సహా పీపీ-1లలో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. నాడు-నేడు కింద తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏప్రిల్ 30న ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు. అలాగే, జగనన్న గోరుముద్దపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని.. పిల్లలకు నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. జగనన్న విద్యాకానుకపై సీఎం జగన్ మాట్లాడుతూ.. మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యేనాటికి పిల్లలందరికీ విద్యాకానుక అందాలని ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈపై టీచర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలని.. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశలపై చర్చించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం నిధులు వంటి అంశాలపై మాత్రమే సీఎం జగన్ అమిత్ షాను కలుస్తారని వివరించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయటంపై ఆయన స్పందిస్తూ.. తాము బలహీనులము కాదని, అలాగే తమ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం లేదని ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాజకీయ పార్టీగా తమకంటూ ప్రత్యేక విధి విధానాలు ఉన్నాయని అన్నారు. మరోవైపు కొడాలి నాని, దేవినేని ఉమ ఎపిసోడ్లో పూర్తి బాధ్యత టీడీపీదేనని పునరుద్ఘాటించారు. టీడీపీ నేతలు పదే పదే ఒకే అబద్దాన్ని చెప్పి దానిని నిజం చేయాలని చూస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు తామేమాత్రం వెరవమని హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో, రాష్ట్ర ప్రజలకు ఇదివరకే స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైకోర్టు విభజన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాజధాని భూముల్లో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ కొనసాగుతుందని, త్వరలో నిజాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. ఇందులో కిలారి రాజేష్ కేసు ఓ చిన్న విషయం మాత్రమేనని, త్వరలో పెద్ద తలకాయలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. -
క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం జగన్
-
క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం జగన్
అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లను, డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీపీఆర్టీయూ(ఆంధ్రప్రదేశ్ ప్రొగ్రసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) అధ్యక్షుడు ఎం కృష్ణయ్య, ఇతర సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ప్రతిభను ప్రోత్సహించేందుకే రెడ్డీస్ మల్టీప్లెక్స్
‘‘మహిళలకు అవకాశం ఇస్తే ఎంత ఎత్తుకు అయినా ఎదుగుతారు. జగన్‌గారిని సీఎం చేయడం కోసం మహిళలుగా మేమంతా కష్టపడ్డాం. శైలజ డేరింగ్ స్టెప్ వేస్తోంది. ఈ సంస్థ నుంచి మరింత ఎంటర్టైన్మెంట్ రావాలి.. ఇది సక్సెస్ కావాలి’’ అని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె. రోజా అన్నారు. రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ లోగో, ఈ సంస్థకు చెందిన యూ ట్యూబ్ చానల్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమాలు, యూ ట్యూబ్, రియల్ ఎస్టేట్.. ఇలా అన్నింటినీ ఒక పద్ధతిలో చేస్తున్నారు. యువతరం తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు ఒక మంచి వేదిక అవుతుంది’’ అన్నారు. రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ చైర్మన్ విజయ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్‌ని ప్రారంభించాం. టాలీవుడ్ అనే చేపల చెరువును ఆన్లైన్ అనే మహాసముద్రం మింగేస్తోంది. రీల్‌పై ఎందరు హీరోలున్నా ప్రజల హృదయాల్లో రియల్ హీరో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిగారే.. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిగారు కూడా ఎన్నో మంచి పనులు చేశారు’’ అన్నారు. ‘‘ఇది కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ’’ అని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, రెడ్డీస్ మల్టీప్లెక్స్ చైర్ పర్సన్ శైలజా చరణ్ రెడ్డి అన్నారు. ‘మనస్సాక్షి, వాయిస్ ఆఫ్ ఉమెన్, టుడే పాలిటిక్స్, కామన్ మ్యాన్, వైయస్ఆర్ డ్రీమ్ వరల్డ్, యువతరం’ అనే యూట్యూబ్ చానల్స్‌తో పాటు ఆర్ ప్లెక్స్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించారు. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, నరసింహారెడ్డి, విద్యావతి, అవినాష్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, స్నేహ తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా కింగ్ మోదీ.. రెండో స్థానంలో సీఎం జగన్
న్యూఢిల్లీ: అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా కొనసాగుతోంది. ట్విటర్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్ మోదీ పేరుపైననే ఉన్నాయి. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్‌ను ‘చెక్‌బ్రాండ్స్’ సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో 95 మంది టాప్ పొలటికల్ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్ విశ్లేషించింది. దాదాపు 10 కోట్ల ఆన్లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. ట్విటర్, గూగుల్ సెర్చ్, వికీ, యూట్యూబ్‌ల్లో అత్యధిక ట్రెండ్స్ ప్రధాని మోదీ పేరుపైననే ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలవగా.. మోదీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తదుపరి స్థానాల్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. బ్రాండ్ స్కోర్ విషయంలోనూ 70 స్కోర్‌తో మోదీ తొలి స్థానంలో ఉన్నారు. సోషల్‌మీడియా వేదికలపై ఫాలోవర్స్, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్మెంట్, మెన్షన్స్.. ఆధారంగా బ్రాండ్ స్కోర్‌ను నిర్ధారిస్తారు. ఈ స్కోర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 36.43 స్కోర్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో, సోమవారం మరణించిన అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (31.89), అరుణాచల్ సీఎం పెమా ఖండూ (31.89), యూపీ సీఎం ఆదిత్యనాథ్(27.03) ఉన్నారు. బ్రాండ్ వ్యాల్యూ విషయంలోనూ మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్ వాల్యూ రూ. 336 కోట్లు. ఆ తరువాతి స్థానాల్లో అమిత్ షా(రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(రూ. 328 కోట్లు) ఉన్నారు. బ్రాండ్ వాల్యూని ఫాలోవర్లు, ఎంగేజ్మెంట్స్, ట్రెండ్స్ ఆధారంగా నిర్ధారిస్తారు. అనంతరం ఆ వాల్యూ నుంచి వ్యతిరేక కామెంట్ల, వ్యతిరేక సెంటిమెంట్ల వాల్యూని తగ్గిస్తారు. ‘ప్రధాని మోదీపై 25% వ్యతిరేక సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. ఎంపిక చేసిన 95 మంది రాజకీయ నేతల్లో ఆయన బ్రాండ్ వాల్యూనే అత్యధికంగా ఉంది’ అని ‘చెక్‌బ్రాండ్’ మేనేజింగ్ డైరెక్టర్ అనూజ్ సాయల్ తెలిపారు. -
రైల్వే సహాయమంత్రి సురేశ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి (65) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే. సురేశ్ కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. తిరుగులేని నేత: 1955 జూన్ 1న చెన్న బసప్ప, సోమవ్వ దంపతులకు కర్ణాటకలోని బెళగావి తాలూకా కేకే కొప్ప గ్రామంలో జన్మించారు. బెళగావిలోని ఎస్ఎస్ఎస్ కాలేజీలో కామర్స్‌లో పట్టా పొందారు. అనంతరం న్యాయ విద్య అభ్యసించారు. సురేశ్ అంగడి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. సురేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఏపీ గవర్నర్ సంతాపం: సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి సురేశ్ అంగడి మృతిపట్ల ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం జగన్ సంతాపం: రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి ఆకస్మిక మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల అనంతపురం నుంచి కిసాన్ రైలును జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సురేశ్‌తోపాటు పాల్గొన్న సందర్భాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. -
ఊరూరా విత్తనాల ఏటీఎంలు!
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల వల్ల వ్యవసాయ రంగ ముఖ చిత్రం మారుతోంది. 10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఈ నెల 30న ప్రారంభం కానున్న ‘కియోస్క్’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. మార్కెటింగ్ సేవలు రైతులకు అందుతాయి. ‘ఏటీఎం’ల వంటి ఈ కియోస్క్‌ల ద్వారా ఉత్పాదకాలను రైతులకు అందిస్తున్నారు. ఇది దేశ చరిత్రలోనే తొట్ట తొలి ప్రయోగం. 2020 మే 30.. రెండు ప్రత్యేకతలు.. ఒకటి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది. రెండోది.. వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలు) ఆయనే స్వయంగా ప్రారంభిస్తున్న రోజు. దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్‌కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ సమగ్ర కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు ‘హబ్ (గోదాము) అండ్ స్పోక్స్(రైతు భరోసా కేంద్రాలు)’ నమూనాలో నడుస్తాయి. ప్రతి జిల్లాలో 5 హబ్‌లు, ప్రతి గ్రామ సచివాలయంలో ఒక స్పోక్ (ఆర్బీకే) ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కేంద్రంలో అత్యాధునిక డిజిటల్ టచ్ స్క్రీన్ ‘కియోస్క్’లు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. రైతులకు తమ గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు సమస్త సేవలు సులభంగా అందించే ‘ఏటీఎం’ల వంటివే ఈ ‘కియోస్క్’లు! కియోస్క్‌లు ఎలా పని చేస్తాయంటే.. ఈ డిజిటల్ కియోస్క్ ఓ అత్యాధునిక ఏటీఎం లాంటిది. టచ్ స్క్రీన్, ఫ్రంట్ కెమేరా, ఆధార్‌తో అనుసంధానమైన ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రోఫోన్, స్పీకర్లు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని– ధర్మల్ ప్రింటర్, ఆక్సిలరీ ఆడియో ఇన్పుట్, యూఎస్బీ చార్జింగ్ స్లాట్, ఏ–4 కలర్ ప్రింటర్, ఈ పాస్ మిషన్, ఆర్ఎఫ్ఐడీ కార్డ్ రీడర్ నూ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు ఐదు చొప్పున 65 ఆగ్రోస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో హబ్‌కు– దాని పరిథిలోని గ్రామాల రైతుల వివరాలను అనుసంధానం చేశారు. కియోస్క్‌ను పరిశీలిస్తున్న ఏపీ వ్యవసాయ కమిషనర్ అరుణ్‌కుమార్ టచ్ స్క్రీన్.. రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్ కియోస్క్ ఎదుట రైతు నిలబడి స్క్రీన్‌ను వేలితో తాకి, ఫోన్ నంబరును ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా వంటి వాటి బొమ్మలు, వాటి ధరవరలు కియోస్క్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. రైతు తాను కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిని ఎంపిక చేసుకొని, ఎంత పరిమాణంలో కావాలో, ఎంత ధర అవుతున్నదో ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక క్లిక్ చేస్తే ఆర్డరు తయారవుతుంది. సమీపంలోని ఆగ్రోస్ కేంద్రానికి అంటే ‘హబ్’(గోదాము)కు తక్షణమే ఆ రైతు కొనుగోలు చేయదలచిన సరుకుల ఆర్డర్ వెళుతుంది. కియోస్క్ నుంచి ఆర్డరు వెళ్లిన తర్వాత ఆయా ఉత్పత్తులు గరిష్టంగా 48 నుంచి 72 గంటల్లోగా రైతులకు అందుతాయి. విత్తనాలను ఏపీ సీడ్స్ సంస్థ, మిగతా వాటిని ఆగ్రోస్ సెంటర్లు సరఫరా చేస్తాయి. ఏమిటీ ‘హబ్, స్పోక్ మోడల్’? ఆర్బీకేలోని అగ్రీ ఇన్పుట్ షాపు ఈ మోడల్లో పని చేస్తుంది. నిల్వ, ఇన్వెంటరీ, అమ్మకం, రాబడుల నిర్వహణ, సరకు రవాణా తదితరాలకు హాబ్‌లు గిడ్డంగులుగా ఉంటాయి. వర్చువల్ రిటైల్ స్టోర్లుగా స్పోక్స్ పని చేస్తాయి. రైతులు తమ ఆర్డర్లను ఇచ్చేందుకు ప్రతి ఆర్బీకేలో డిజిటల్ విధానంలో ఏర్పాటు చేసే కియోస్కే ఈ స్పోక్. ఈ కియోస్క్ మెషిన్ ఏటీఎం మాదిరిగా ఉంటుంది. దీని నుంచి రైతులు తమ వ్యవసాయానికి కావాల్సిన ఉత్పాదకాల(ఇన్పుట్స్)ను ఆర్డరు చేస్తే.. 48 నుంచి 72 గంటల (2–3 రోజుల)లోగా బట్వాడా చేస్తారు. కియోస్క్ ద్వారా విత్తనాలు తదితరాలను ఎంపిక చేసుకోవడం, ఆర్డర్ చేయడం వంటి విషయాలలో రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, వీరికి తోడ్పడటానికి ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటారు. గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్థక, మత్స్య శాఖల సహాయకులు రైతులకు సహాయపడతారు. కియోస్క్‌ల ద్వారా సులువుగా సమస్త సమాచారం... ► మారుమూల గ్రామాల్లో కూడా డిజిటల్ కియోస్క్‌లు ఏర్పాటవుతున్నందున అక్కడి రైతులకు ఉత్పాదకాలతోపాటు సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని సులువుగా అందించవచ్చు. ► వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉత్పాదకాలను గ్రామ స్థాయిలోనే రైతులకు అందించవచ్చు. ► ఏయే వ్యవసాయోత్పత్తులకు మార్కెట్లో మున్ముందు మంచి ధర వచ్చే అవకాశం ఉంది (మార్కెట్ ఇంటెలిజెన్స్)?, ప్రస్తుతం వివిధ మార్కెట్లలో ఏయే పంటలకు ఎంతెంత ధర పలుకుతోంది? ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వంటి ముఖ్యమైన తాజా సమాచారాన్ని రైతులకు అందించవచ్చు. ► వాతావరణ సూచనలు, ఆయా ప్రాంతాల్లోని చీడ పీడల సమాచారాన్నీ అందించవచ్చు. ► భూ రికార్డులను అందుబాటులోకి తేవచ్చు. ► వివిధ పంటల సాగు సాంకేతిక మెళకువలను తెలియజెప్పే వీడియోలను ఈ కియోస్క్‌ల ద్వారా రైతులకు చూపవచ్చు. రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటైన కియోస్క్ – ఆకుల అమరయ్య, సాక్షి -
జగన్‌గారికి ధన్యవాదాలు
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ విండో పథకం జీవోను ఇవ్వటం ద్వారా సినిమా పరిశ్రమకు సంబంధించిన అందరికీ మేలు కలుగుతుంది. అందుకు ఏపీ సీయం వైయస్. జగన్మోహన్ రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఏపీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘సినిమా పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందడానికి తీసుకోవలసిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ద్వారా తెలియపరుస్తున్నాం. గతంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమను తరలించినందుకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిల్మ్‌నగర్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీలో సినీ పరిశ్రమకు చెందిన స్టూడియోలతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించారు. తర్వాతి రోజుల్లో వాటిని షూటింగ్‌ల కోసమే కాకుండా సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా స్టూడియోలకు స్థలాన్ని కేటాయిస్తే ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించేవారికే స్థలాలు కేటాయించాలి. అలాగే ఆన్లైన్ టికెటింగ్‌ను ఎంకరేజ్ చెయ్యాలి. చిన్న సినిమాల ప్రయోజనం కోసం బస్టాండ్, మున్సిపల్ కాంప్లెక్స్‌లలో సుమారు 200 థియేటర్స్‌ను ప్రభుత్వం కట్టించాలి’’ అన్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
-
జగన్‌గారికి కృతజ్ఞతలు
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరఫున వారికి ఫోన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘లాక్డౌన్ ముగిసిన తర్వాత సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని జగన్‌గారు చెప్పారు.అన్ని విభాగాల ప్రతినిధులతో త్వరలోనే ఆయన్ను కలుస్తాం’’ అని కూడా ట్వీటర్లో పేర్కొన్నారు చిరంజీవి. లాక్డౌన్ వల్ల షూటింగ్‌లు ఆగిన నేపథ్యంలో ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. జూన్‌లో షూటింగ్స్ కూడా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఇక థియేటర్ల రీ ఓపెన్ గురించి ఆ తర్వాత ఆలోచిస్తారు. -
అధిక కేసులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: కోవిడ్–19 పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా నిబంధనలను మరింత కఠినతరంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలందరికీ మాస్క్‌ల పంపిణీ, క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు, క్వారంటైన్ కేంద్రాల నుంచి ఇంటికి పంపే సమయంలో పేదలకు రెండు వేల రూపాయల ఆర్థిక సాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర అంశాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ► క్వారంటైన్లలో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలి. తొలుత హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్క్‌లను పంపిణీ చేయాలి. ప్రతి ఒక్కరికీ మూడు మాస్క్‌లు ఇవ్వాలి. ► నేటి నుంచి మాస్క్‌ల డెలివరీ ప్రారంభం. రెండు మూడు రోజుల తర్వాత విస్తృతంగా పంపిణీ. మాస్క్‌ల తయారీ పని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలి. రైతు భరోసా కేంద్రంగా మార్కెటింగ్ ► వైఎస్సార్ రైతు భరోసా, మత్య్సకార భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలి. రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్ ఉండేలా చూసుకోవాలి. కియోస్క్‌లు ఏర్పాటు చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రంగా మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించాలి. ► ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. వినూత్న పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో అమ్మడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ► ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తూ పేదలకు రూ.2 వేలు ఇవ్వాలి. లేదంటే.. సమస్య మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. మనం ఇచ్చే డబ్బుతో పాలు, గుడ్లు, కూరగాయలు లాంటి పౌష్టికాహారం తీసుకోవడానికి వీలుంటుంది. – సీఎం వైఎస్ జగన్ -
ఆటో రజినికి ఆశీస్సులు
జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆటో రజిని’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ చిత్రం ప్రారంభమైంది. బి.లింగుస్వామి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘హరికృష్ణ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రమే మంచి మాస్ ఎంటర్టైనర్ కావడం ఆనందంగా ఉంది. సీయంగా ఎంతో బిజీగా ఉండి కూడా మా హీరోకి జగన్‌గారి బ్లెస్సింగ్స్ ఉండటం ఆనందంగా ఉంది. ఎలక్షన్ టైమ్‌లో మేము చేసిన ‘జననేత జగనన్న..’ పాట గురించి ప్రత్యేకంగా ఆయన మమ్మల్ని అభినందించటం జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు. -
100 రోజుల ప్రజాప్రభుత్వం
-
పేదలకు సంతృప్తిగా భోజనం
సాక్షి, శ్రీకాకుళం/అమరావతి: ‘రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న బియ్యం ప్రజలు తినే పరిస్థితి లేదు. ఏ బియ్యం అయితే మనం తినగలుతామో వాటినే పేదలకు పంపిణీ చేస్తాం. పూర్తిగా ఫిల్టరింగ్ చేసి.. 5, 10, 15, 20 కేజీలుగా ప్యాక్ చేసి సెప్టెంబర్ నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే సరఫరా చేస్తాం’ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అందుకు అనుగుణంగానే తొలుత శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద వలంటీర్ల ద్వారా పేదల ఇంటికే పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కాశీబుగ్గలో ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపడతారు. పంపిణీ ఏర్పాట్లు ఇలా.. జిల్లాను 15,344 క్లస్టర్లుగా విభజించారు. జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాలు, 1,141 గ్రామ పంచాయితీల పరిధిలో 1,865 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటికి మొత్తం 11,924 మంది వలంటీర్లను నియమించారు. ఒక్కొక్క క్లస్టర్లో 50 నుంచి 60 వరకు కుటుంబాలను చేర్చారు. వలంటీర్ల ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే 9,48,105 బియ్యం బ్యాగ్‌లను 2,015 రేషన్ డిపోల్లో సిద్ధంగా ఉంచారు. వీటిలో 5 కిలోల బ్యాగ్‌లు 1,24,049, 10 కిలోల బ్యాగ్‌లు 2,42,035, 15 కిలోల బ్యాగ్‌లు 2,73,764, 20 కిలోల బ్యాగులు 3,08,257 ఉన్నాయి. పంపిణీ కార్యక్రమంలో ఏవైనా లోటుపాట్లు తలెత్తితే తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కార్డుదారుల మ్యాపింగ్‌లో సమస్యలు, పోర్టబులిటీ, డీలర్ లేదా వలంటీర్ అందుబాటు, యూనిట్లో తేడాలు రావడం వంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే లబ్ధిదారులు నేరుగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా తెలియజేస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. మరోవైపు నూతన విధానం వల్ల పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాకు, తూకంలో మోసాలకు అడ్డుకట్ట పడనుంది. 20 ఏళ్లుగా పరిశోధనలకే పరిమితం ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలోనే కనిపించాయి. 2000లో సోంపేటకు చెందిన ఐఎంఏ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ బృందం కవిటి ప్రాంతంలో ఈ కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో కేజీహెచ్ వైద్యులు 2005లో పరిశోధన వైద్య శిబిరాలు చేపట్టగా.. 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి పర్యటించారు. అదే ఏడాది రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.కృష్ణమూర్తి , చీఫ్ కెమిస్ట్ ఎ.సతీష్, 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఇక్కడ పర్యటించారు. 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ బృందం, న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ బృందం, హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత, 2012లో జపాన్, అమెరికన్ బృందాలతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం అధ్యయనం జరిపాయి. 2013లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం, బాబా అటామిక్ రీసెర్చ్ బృందాలు పరిశోధనలు చేశాయి. 2017 నుంచి భారతీయ వైద్యపరిశోధనా మండలి పరిశోధన సాగుతోంది. కిడ్నీ బాధితులకు కొండంత అండ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పాదయాత్రలోనూ.. అంతకుముందు ఉద్దాన ప్రాంత పర్యటనలో కిడ్నీ బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే చర్యలకు ఉపక్రమించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనిని 100 రోజుల పాలనలో చేసి చూపించారు. కిడ్నీ రోగులకు నెలకు రూ.10 వేల పింఛను అందజేస్తున్నారు. వైద్య సేవలందించేందుకు వీలుగా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుగుణంగా రీసెర్చ్ సెంటర్, అతి పెద్ద డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. దీంతో సరిపెట్టకుండా వ్యాధికి మూలమైన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇంటింటికీ కుళాయిల ద్వారా శుద్ధ జలాలను సరఫరా చేసేందుకు ఉపక్రమించారు. ఇందుకోసం రూ.600 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. వీటన్నిటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. -
జనరంజక పాలనకు వైఎస్ జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు దగ్గరి నుంచి చూశారు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.. కులం, మతం, రాజకీయం చూడకుండా సాయం చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే వాయు వేగంతో నిర్ణయాలు.. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రీకారం.. విప్లవాత్మక బిల్లులతో పారదర్శక పాలన దిశగా అడుగులు.. సమాజంలో సగం ఉన్న మహిళలకు అన్నింట్లో సగం.. సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వంద రోజుల్లో వందకు పైగా కీలక నిర్ణయాలు.. ఇదో చరిత్ర.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నవ చరిత్ర. ప్రజలకిచ్చిన హామీల అమల్లో నాన్చుడు లేదు.. మీన మేషాలు లెక్కించడం అసలే లేదు.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోంది. కనీసం ఆరు నెలలైనా గడవందే పాలనపై ఓ అంచనాకు రావడం కష్టం. అలాంటిది కేవలం వంద రోజుల్లోనే వందకు పైగా కీలక నిర్ణయాలు తీసుకుని ‘ఇది అందరి ప్రభుత్వం’ అని నిరూపించారు. గత పాలకుల తీరుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ వంద రోజుల పాలన ఐదు కోట్ల ప్రజానీకానికి కళ్లకు కట్టినట్లు కనిపించింది. మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. జూన్ 10వ తేదీన నిర్వహించిన తొలి కేబినెట్ భేటీలోనే నవరత్నాల్లో ప్రజలకిచ్చిన హామీల్లో 80 శాతం మేర అమలుకు నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ గ్రామ స్వరాజ్యానికి గాంధీ జయంతి రోజు నుంచి నాంది పలుకుతున్నారు. ఈ మేరకు తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశారు. సీఎం వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇలా.. పింఛన్ల పెంపుపై తొలి సంతకం ► అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్ ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000 వరకు తీసుకెళ్లాలని నిర్ణయం. ► పింఛను పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు. దీంతో అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. ► కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్. తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు గురైన బాధితులకు పింఛన్లు ఇచ్చే పథకంపై సమాలోచన. మహిళలకు చేయూత ► డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా.. అధికారంలోకి వచ్చేనాటి వరకు ఉన్న రుణాలకు సమానమైన సొమ్మును నాలుగు విడతల్లో అందజేయాలని నిర్ణయం. ► ఉగాది రోజు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. ► అక్రమ మద్యం, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం. ► పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15,000. ఇంటర్ వరకూ పథకం వర్తింపు. జనవరి 26 నుంచి అమలు రైతాంగానికి అన్ని విధాలా భరోసా ► ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా (ఈ ఏడాది అక్టోబర్ నుంచే) రూ.12,500. విడతల వారీగా రూ.50 వేలు చెల్లించేందుకు నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్‌లో మాత్రమే ఇస్తారు. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ లేని రుణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రైతులకు ఉచితంగా 200 రిగ్గు బోర్లు. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా. ► ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కు తగ్గింపు. ► గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు. ► ప్రమాదవశాత్తూ చనిపోయిన లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం. ► ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు. అవసరం మేరకు çఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ► భూ యాజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు 11 నెలలు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా కౌలుదార్ల చట్టం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించే ఏర్పాటు. ► జలయజ్ఞం ద్వారా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయం. గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేలా ప్రణాళిక. ► సీఎం చైర్మన్‌గా వ్యవసాయ మిషన్ ఏర్పాటు. ► రైతు పండించే పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించేలా వైఎస్సార్ ఉచిత బీమా పథకం. ► 2018 ఖరీఫ్‌లో కరువుకు సంబంధించి రైతులకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల. ► ధాన్యం సేకరణకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.960 కోట్లు చెల్లించడానికి చర్యలు. రూ.360 కోట్లు విడుదల. ► కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున రూ.300 కోట్లు బోనస్‌గా విడుదల. ► ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల. ► నాఫెడ్ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కోసం చర్యలు. ► తొలి ఏడాదే సహకార రంగ పునరుద్ధరణకు చర్యలు. ► గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించిన రూ.384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు. ► వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్పుట్ సబ్సిడీ. ► పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం. ► కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం. సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం. నాఫెడ్ సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో 5 కొనుగోలు కేంద్రాలు. మార్కెట్ సెస్ రద్దు. ఫలితంగా క్వింటాల్ రూ.8,500కు పెరిగిన కొబ్బరి ధర. కొబ్బరి పంటల బీమా ప్రీమియంలో 75 శాతం కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. జీతాల పెంపు ► పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.18,000కు పెంపు. ఆశా వర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెంపు. ► అంగన్వాడీ వర్కర్ల జీతాలు రూ.10,500 నుంచి రూ.11,500కు పెంపు. ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు. ► డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపునకు నిర్ణయం. ► గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4,000కు పెంపు ► హోంగార్డుల వేతనాలు పెంచుతూ నిర్ణయం. ఉద్యోగాలు.. ఉపాధి.. విద్య ► గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు.. గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం. 4 లక్షలకుపైగా ఉద్యోగాలు.. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1లక్షా 27 వేల ఉద్యోగాలు. ► గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం. వీరి ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు శ్రీకారం. ► కాపు కార్పొరేషన్‌కు తొలి బడ్జెట్లోనే రూ.2 వేల కోట్ల నిధులు.. 5 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు కేటాయింపునకు రంగం సిద్ధం. ► ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపుల నిర్వహణ. మద్యం దుకాణాల్లో 16 వేల ఉద్యోగాలు. ► జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి పేదవాడి పెద్ద చదువుకు అయ్యే ఖర్చు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్. ► ఇంటర్ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు. ► రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు,,.. మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు. ► సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం. ► దశలవారీగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్, టాయ్లెట్లు, మంచినీటి సదుపాయం, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్, పాఠశాల భవనాలకు మరమ్మతులు, పెయింట్లు వేయించటం వంటి చర్యలతో పాఠశాలలన్నింటి రూపురేఖల్ని మార్చేందుకు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయింపు ► ఉద్యోగాలకు ఉపయోగపడేలా చదువుల ప్రణాళికను మార్చాలని నిర్ణయం. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం. ► పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి శనివారం నో బ్యాగ్ డే ప్రజా సొమ్ము ఆదా ► వివిధ ప్రభుత్వ శాఖల్లో రూ. కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్లైన్లోనే టెండర్లు. కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి, మునుపటి రేట్ల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికే అవకాశం. ► గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నవారికి, కాంట్రాక్టర్లకు ఏటీఎం మిషన్‌గా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రీటెండరింగ్ ► రూ.100 కోట్లు దాటిన కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపేలా చట్టం. కీలక బిల్లులు.. చట్టాల సవరణ ► 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ.75 వేలు ఆర్థిక సాయం. ► కబ్జాలు, దందాలు, అవకతవకలకు విరుగుడుగా భూమి మీద నిజమైన హక్కు ఉన్న వారికి న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ – 2019 బిల్లు ఆమోదం. అత్యాధునిక విధానంలో సమగ్రంగా భూముల సర్వే. ► రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా వ్యవసాయ మార్కెట్లను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం సవరణ బిల్లు ఆమోదం. ► మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం. ఇందులో నలుగురు డిప్యూటీ సీఎంలు. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు. ► శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు. ► ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. ► పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు. ► దశల వారీగా మద్య నిషేధం దిశగా.. మద్య నియంత్రణ చట్ట సవరణ. బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేత. తగ్గిన మద్యం వినియోగం. ► ఆలయ పాలక మండళ్లలో (టీటీడీ మినహా) 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు. ► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం. ► పాఠశాల విద్య, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు బిల్లులు –2019కు ఆమోదం. ► గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేల నియామకం. అందరికీ వైద్యం.. అదే ధ్యేయం ► ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు. రూ.1000 బిల్లు దాటినట్టయితే, వార్షిక ఆదాయం రూ.5 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల వారికి పథకం వర్తింపు. 2031 జబ్బులకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా వర్తింపు. ► అధునాతన సౌకర్యాలతో 108, 104 అంబులెన్స్‌లు.. కొత్త వాహనాలు కొనుగోలు. ► రెండేళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు చర్యలు. ► శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, చుట్టుపక్కల గ్రామాల కిడ్నీ బాధితుల కోసం.. 200 పడకలతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఉత్తర్వులు (రూ. 50 కోట్లు తక్షణ కేటాయింపు) ► డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు (అక్టోబరు 10 నుంచి అమలు) కార్యక్రమం కింద ఉచితంగా కంటి పరీక్షలు. ► రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో (గిరిజన ప్రాంతాలు) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం. ► విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడపలో క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆసుపత్రులు. ► పాడేరు, విజయనగరం, పల్నాడులో మెడికల్ కాలేజీల ఏర్పాటు పారదర్శక పాలన ► అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానం.. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’. చిన్న చిన్న సమస్యలకు 72 గంటల్లోనే పరిష్కారం. ► ‘స్పందన’లో వచ్చిన అర్జీలపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష.. ► ప్రజా సమస్యలపై సోమ, మంగళవారాల్లో కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని అధికారులతో భేటీ ► ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు. ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్. సీపీఎస్ రద్దుకు నిర్ణయం. ► అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు ► వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు ఈ ఏడాది డిసెంబరు 26న శంకుస్థాపన. ► పారిశ్రామిక పెట్టుబడుల కోసం.. అవినీతికి తావులేని, పారదర్శకమైన ఇండస్ట్రీయల్ పాలసీ. రాష్ట్రంలో కొత్తగా మరో 4 పోర్టులు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు. ► అక్రమ నిర్మాణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం. ► అమరావతిలో గత ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్‌పై వాస్తవాల వెలికితీతకు చర్యలు ► గత ప్రభుత్వం దోపిడీకి సంబంధించి 30 అంశాల్లో విచారణకు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు. ► గ్రామాల్లో 11,158 సచివాలయాలు, పట్టణాల్లో 3,768 వార్డు సచివాలయాల ఏర్పాటు. ప్రజాభ్యుదయమే లక్ష్యం ► ఉద్దానం కిడ్నీ వ్యాధుల కోసం రూ.600 కోట్లతో మంచినీటి పథకం. ► విశాఖ ఏజెన్సీలో గిరిజనుల హక్కులకు అగ్ర తాంబూలం.. బాక్సైట్ తవ్వకాలకు నో. ► రేషన్ కార్డుల ద్వారా 5, 10, 15 కిలోల బ్యాగుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ. ► దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఫ్రెండ్లీ పోలీసింగ్. ► షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం. ► ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పరిమితి 100 నుంచి 200 యూనిట్లకు పెంపు ► చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం. డీజిల్‌పై ఇస్తున్న సబ్సిడీ లీటరుకు రూ.6 నుంచి రూ.9కి పెంపు. ► సొంత ఆటో, ట్యాక్సీ నడిపేవారికి మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అవసరాల కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం ► మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం. ► వైఎస్సార్ కళ్యాణ కానుక కింద.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని యువతులు వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సాయం. బీసీ యువతుల వివాహాలకు రూ.50 వేలు. ► ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన గిరిజన కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం. ► క్రీడాకారులకు ప్రోత్సాహకాలు. ► ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు మూడు దశల్లో వాటర్ గ్రిడ్ పథకాలు. ► ముస్లింలు, క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్లే హజ్, జెరూసలెం యాత్రలకు ప్రభుత్వం ఇచ్చే సాయం పెంపు. ఇమామ్, మౌజమ్, పాస్టర్లకు గౌరవ వేతనాల పెంపు. ► ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు. -
‘గురు’తర బాధ్యత మీదే!
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని సంస్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పుల అమలు, లక్ష్యాల సాధనలో చదువులు చెప్పే గురువులదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలన్నా తొలి అడుగులు పడేది వారు చూపించే బాట నుంచేనని గుర్తు చేస్తూ వారిపై ఉంచిన గురుతర బాధ్యతను నెరవేర్చాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతమయ్యేలా టీచర్లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను రూపుమాపి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా పలు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఏపీలో నిరక్షరాస్యత శాతం జాతీయ సగటును మించి ఉందని, ఐదేళ్లలో ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి నిరక్షరాస్యతను సున్నా స్థాయికి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్, వారి వసతి, భోజనాలకు ఏటా రూ.20 వేలు, అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ప్రవేశపెట్టామని చెప్పారు. మూడేళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారో వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘గురువులకు వందనాలు. నాకు చదువు చెప్పిన ప్రతి గురువు పాదాలకు వందనం చేస్తూ నాలుగు మాటలు చెబుతున్నా. మన తెలుగువారైన మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని దేశమంతా టీచర్స్‌డేగా జరుపుకొంటోంది. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేసి అనంతరం భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం తరతరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప పాఠం. తన జీవితాన్ని మార్చిన గురువును ఏ పిల్లవాడైనా ఎంత ఎదిగినా మరిచిపోలేడు. దీనికొక నిదర్శనం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితమే అని చెప్పవచ్చు. తనకు పాఠాలు చెప్పిన ఒక బీసీ కులానికి చెందిన అధ్యాపకుడు వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో దివంగత నేత ఒక స్కూలును స్థాపించారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇవ్వాళ్టికీ ఆ స్కూలును నడుపుతోంది. గురువు విద్యార్ధుల మనసులపై చెరగని ముద్ర వేస్తారనేందుకు ఇదో నిదర్శనం. గురువు చేసే పని బహుశా ఎవరూ చేయలేరేమో. అందుకనే గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః అని అంటారు. ఈ పరిస్థితులు మారాలి.. మన రాష్ట్రం చదువుల పరంగా ఏ స్థాయిలో ఉందో అంతా ఆలోచన చేయాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యత అక్షరాలా 33 శాతం. అదే జాతీయ సగటు 27 శాతం మాత్రమే. అంటే ఏపీలో నిరక్షరాస్యత జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉంది. దీని అర్థమేమిటో మీరంతా ఆలోచన చేయాలి. వీరంతా చదువుకోవాలనే ఆరాటం లేని వారు కాదు. చదివించాలనే తపన ఉన్నా చదివించలేని పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఇది నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చి నిరక్షరాస్యతను ఐదేళ్లలో పూర్తిగా సున్నాకు తీసుకురావాలన్నదే నా తాపత్రయం, తపన. ఇదేకాదు.. 18 – 23 సంవత్సరాల వయసు కలిగి ఇంటర్ తరువాత డిగ్రీ చదవాల్సిన పిల్లలు ఎంతమంది కాలేజీల బాట పడుతున్నారని చూస్తే దానిలోనూ వెనుకబడి ఉన్నాం. బ్రిక్స్ (బ్రెజిల్ రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలైన రష్యాలో 81 శాతం, చైనాలో 48 శాతం, బ్రెజిల్లో 50 శాతం మంది పిల్లలు కాలేజీల్లో చేరుతుండగా మన దేశంలో కేవలం 26 శాతమే చేరుతున్నారు. అంటే 74 శాతం మంది పిల్లలు ఇంటర్ దాటి కాలేజీల్లో చదివే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితులు మార్చాలి. రష్యాలో 81 శాతం మంది పిల్లలు కాలేజీల్లో చేరుతుంటే దానికన్నా ఎక్కువగా మన రాష్ట్రం ఉండాలన్న తాపత్రయంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి శ్రీకారం చుట్టాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కాలేజీల్లో చదువుకునే పిల్లలకు వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేలు ఇచ్చే పథకాల ద్వారా విద్యారంగ పరిస్థితులను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌కు వీణను అందజేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్. చిత్రంలో మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు పార్థసారథి, మల్లాది విష్ణు మానవత్వం లేని పాలనను పాదయాత్రలో చూశా... నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా గ్రామాల్లో నడుస్తున్నప్పుడు చాలా స్కూళ్లు కనిపించాయి. చాలామంది పిల్లలు, ఉపాధ్యాయులు నా దగ్గరకు వచ్చారు. కొందరు ఉపాధ్యాయులు నాడు ప్రతిపక్షనేతగా ఉన్న నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పినందుకు గత ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. కానీ వాస్తవమేమిటనే ఆలోచన చేయలేదు. పాదయాత్రలో స్కూళ్ల పరిస్థితిని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు నా కంటికి కనిపించాయి. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి 8 నెలలకుపైగా బకాయిలు చెల్లించలేదు. సరుకులు కొనే పరిస్థితి లేదు. ఆయాలకు ఇచ్చే గౌరవ భృతి రూ. వెయ్యి ఇచ్చే పరిస్థితి లేదు. 8 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో పెడితే వాళ్లు సరుకులు ఏం తీసుకొస్తారు? పిల్లలకు తిండేం పెడతారు? ఆ పిల్లలు ఆ తిండేం తినగలుగుతారు? పిల్లలు చదువుల బాట ఎలా పడతారు? అన్న కనీస ఆలోచన, మానవత్వం లేని పరిపాలనను ఆనాడు చూశాం. స్కూళ్లలో పరిస్థితులు మరీ అధ్యాన్నం. బాత్రూములో నీళ్లుండవు. అవి వినియోగానికి అసలు పనికిరావు. పాఠ్యపుస్తకాలు స్కూళ్లు తెరిచిన జూన్ మొదటి వారానికే అందుబాటులోకి రావాల్సి ఉన్నా అక్టోబర్, నవంబర్‌లో కూడా అందించలేని దుస్థితి. టీచర్లు తక్కువగా ఉన్నారని తెలిసినా నియామకాలు చేయాలన్న ఆలోచన కూడా వారికి రాలేదు. యూనిఫారాల పరిస్థితీ అంతే. ఇవ్వాల్సిన సమయంలో ఏదీ ఇవ్వని దుస్థితి. ఇలా ప్రతి అడుగులో ప్రభుత్వమే పాఠశాలలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తే స్కూళ్లు ఎలా తయారవుతాయో నా పాదయాత్రలో గమనించా. ఇవన్నీ చూసిన తరువాతనే విప్లవాత్మక మార్పులు తెస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. తొలి అడుగులు మీ నుంచే.. మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే స్కూళ్ల దశదిశ మార్చేలా ప్రతి స్కూలు ఫొటో తీయాలని చెప్పాం. దశలవారీగా మూడేళ్లలో ప్రతి స్కూలును ఎలా మార్చామో ఫొటోల ద్వారా వ్యత్యాసాన్ని చూపించాలని అధికారులను కోరాం. ఇందుకు కట్టుబడి ఉన్నాం. ప్రతి స్కూలులో మార్పులు చేస్తాం. పేరెంట్ బాడీలను తీసుకువస్తాం. తల్లిదండ్రులను ఇందులో భాగస్వాములను చేస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియంగా మార్చాలని ఆరాట పడుతున్నాం. పిల్లలకు మంచి చదువులు అందాలి. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు బాగుండాలి. మన పిల్లలను ఏ మోహమాటం లేకుండా ప్రభుత్వ స్కూళ్లకు చిరునవ్వుతో పంపించేలా ఉండాలన్న ఆరాటంతో అందరం ఉన్నాం. ఇవన్నీ సక్సెస్ కావాలంటే ఆ బృహత్తర బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది. అయితే ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలన్నా తొలి అడుగులు పడేది మీరు చూపించే బాట నుంచే. మీ బాధ్యతలను మరొక్కసారి గుర్తుచేస్తూ దీన్ని గొప్పగా నెరవేరుస్తారని ఆశిస్తూ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు’ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు.. టీచర్స్ డే సందర్భంగా 143 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందచేశారు. ఉత్తమ గురువులకు ట్యాబ్, పతకం, ధ్రువపత్రం, రూ.20 వేల నగదు అవార్డును పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందించింది. విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కార్యక్రమాలను చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్ధులకు ఉన్నత విద్య కలను సాకారం చేశారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, పేర్ని నాని, కొడాలి నాని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తన జీవితాన్ని మార్చిన గురువును ఏ పిల్లవాడైనా ఎంత ఎదిగినా మరిచిపోలేడు. దీనికి నిదర్శనం దివంగత నేత వైఎస్సార్ జీవితమే. తనకు పాఠాలు చెప్పిన వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో స్కూలును స్థాపించారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇవ్వాళ్టికీ ఆ స్కూలును నడుపుతోంది. – సీఎం వైఎస్ జగన్ గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు -
సందడిగా గవర్నర్ ‘ఎట్‌హోం’
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ హరిచందన్ విశ్వ భూషణ్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ‘ఎట్‌హోం’ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో 3.15 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఎట్‌హోం గంట సేపు సాగింది. గవర్నర్ హరిచందన్ లాన్స్‌లో కలియ దిరుగుతూ అందరినీ పరిచయం చేసుకున్నారు. ఆ తరువాత గవర్నర్ దంపతులు, సీఎం వైఎస్ జగన్, ఏసీజే జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒకే టేబుల్‌పై ఆశీనులై అల్పాహార విందును తీసుకున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్, టీడీపీ నేతలు కళా వెంకటరావు, కనకమేడల రవీంద్రబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, ఆర్పీఐ (ఎ) రాష్ట్ర అధ్యక్షుడు కె.బ్రహ్మానందరెడ్డి, పొగాకు బోర్డు చైర్మెన్ రఘునాథబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాయంత్రం సంప్రదాయకంగా జరిగే ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్‌తో న్యాయమూర్తులు -
కిందపడిన పతకాన్ని తీసిచ్చిన సీఎం
సాక్షి, అమరావతి: ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. చుట్టూ ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సైగ చేస్తే చాలు ఆదేశాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా ఏ మాత్రం దర్పం ప్రదర్శించని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పతకాలు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ సందర్బంగా ఓ పోలీస్ అధికారికి పతకాన్ని అలంకరించారు. సీఎంకు శాల్యూట్ చేసే సమయంలో ఆ పతకం పోలీస్ అధికారి నుంచి జారి పడింది. దీనిని గమనించకుండా ఆ అధికారి కవాతు చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జారిపడిన ఆ పతకాన్ని సమీపంలో ఉన్న మరో అధికారి చేతికి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో సీఎం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ రాకకోసం... సిద్ధంగా డల్లాస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని తెలుగు ఎన్నారై కమ్యూనిటీతో 17వ తేదీన సమావేశం కానున్నారు. డల్లాస్‌లోని అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్స్‌లో ఒకటైన కేబిల్లే కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి అమెరికా నలుమూలల నుంచి, కెనడా నుంచి కూడా తెలుగువాళ్ళు పెద్దసంఖ్యలో హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలోని అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాలతోపాటు, ప్రాంతీయ తెలుగు సంఘాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తోంది. తెలుగు ఎన్నారై ప్రముఖులను, ఇతరులను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానిస్తోంది. ఏపీ సీఎంగా బాధ్యతలను స్వీకరించాక వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా అమెరి కాలో వ్యక్తిగత పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎన్నారై నాయకులు, వైఎస్ఆర్ను అభిమానించే ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) నాయకులు ఆయనను కలుసుకుని అమెరికాలోని పార్టీ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరారు. అమెరికాలోని అన్ని సంఘాలను, కుల– ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరినీ ఒకే వేదికపైకి ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే తాను వస్తానని సీఎం చేసిన సూచన మేరకు, ఈ సమావేశంలో జాతీయ తెలుగు సంఘాలను, ఇతర సంఘాలను పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 17న జరగనున్న ఈ ఆత్మీయ సమావేశాన్ని తెలుగువారు ఎక్కువగా ఉండే డల్లాస్‌లో నిర్వహించనున్నారు. అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ అయిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌ను దీనికోసం బుక్ చేశారు. అమెరికాలో ఉంటూ వైఎస్ఆర్సీపీ విజయంకోసం శ్రమిస్తున్న వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి. నేషనల్ కో ఆర్డినేటర్లుగా వారిని నియమించారు. అలాగే జాతీయ తెలుగు సంఘాలను, ఇతర సంఘాలను, డల్లాస్‌లో ఉన్న స్థానిక తెలుగు సంఘాలను కలుపుకుని హోస్ట్ కమిటీని రూపొందించారు. తెలుగు సంఘాల అధ్యక్షులను, స్థానికంగా ఉన్న నేతల్ని కూడా ఈ కమిటీలో తీసుకున్నారు. తానా, ఆటా, నాటా, నాట్స్, ఆటా తెలంగాణ, తెలంగాణ తెలుగు అసోసియేషన్, టాంటెక్స్, ఆప్తా, టీడీఎఫ్, డాటా, టీపాడ్, ఐఎ ఎన్టీ, ఎన్నారై వాసవీ అసోసియేషన్ వంటి ప్రముఖ సంస్థలన్నీ ఈ సమావేశంలో పాల్గొననుండటం విశేషం. వైఎస్ జగన్ డల్లాస్ పర్యట నను విజయవంతం చేసేందుకు అటు ఎన్నారై వైఎస్ఆర్సీపీ నేతలతోపాటు, స్థానికంగా ఉండే తెలుగు సంఘాలు, జాతీయ తెలుగు సంఘాలు కూడా తోడ్పాటునివ్వడం మంచిపరిణామం. అన్ని సంఘాలు, తెలుగు ప్రముఖులు ఒకే వేదికపై వచ్చి ముఖ్యమంత్రి సందేశాన్ని వినడానికి, ఆయనను కలిసేందుకు ముందుకురావడం రాష్ట్ర ప్రయోజనాలకు తోడ్పాటునిస్తుందని ఆశిద్దాం. – చెన్నూరి వెంకట సుబ్బారావు, అమెరికాలోని ‘తెలుగు టైమ్స్’ పత్రిక సంపాదకులు. -
సీఎం జగన్‌కు జపాన్ ఆహ్వానం
సాక్షి, అమరావతి: చెన్నైలో ఉన్న జపాన్ కాన్సులేట్ జనరల్ కొజిరొ ఉచియామ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్‌లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉచియామ ఆహ్వానించారు. అవినీతిలేని, పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వారికి సీఎం జగన్ వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని జపాన్ కాన్సులేట్ జనరల్‌కు తెలిపారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురి భాగస్వామ్యాలు ఉండాలని ఆకాక్షించారు. కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ విధానం ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకు పూర్తిస్థాయిలో సహాయకారిగా ఉంటామని సీఎం వివరించారు. ఏదశలోనూ లంచాలకు, రెడ్‌టేపిజానికి తావులేని విధంగా తోడుగా ఉంటామని చెప్పారు. పరిశ్రమలు వృద్ధి చెందాలంటే శాంతి, సహృద్భావ వాతావరణం కూడా అవసరమని, దీంట్లో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం నైపుణ్యాభివద్ధి ఉన్న మానవవనరుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ ముఖ్యమంత్రి వివరించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామని, ఆదిశగా పెట్టుబడుల పెట్టే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కోరారు. జపాన్ కంపెనీలకు ఏపీ అనుకూలం ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమలకోసం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రభుత్వం తెలిపింది. కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. అత్యాధునిక వసతులున్న పోర్టులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉన్నందున జపాన్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉంటున్న విషయాన్నీ కూడా ప్రభుత్వం వారికి వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, ఆహార సంబంధిత పరిశ్రమలు, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్ వ్యవసాయశాఖ మిజుహొ ఇన్ఫర్మేషన్ మరియు రీసెర్చ్ ఇనిస్ట్యూట్ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోంది. (చదవండి: ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీ: సీఎం జగన్) -
సెప్టెంబర్ 5 నుంచి.. ఇసుక కొత్త పాలసీ
సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న దానికంటే తక్కువ ధరకే ఇసుకను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేలా, సర్కారుకు ఆదాయం వచ్చేలా కొత్త విధానం ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని సూచించారు. ప్రజలపై భారం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ రాబడి పెంపు, పారదర్శకత, అక్రమ రవాణాకు అడ్డుకట్ట లక్ష్యాలుగా ఇసుక కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా కలెక్టర్ల నేతృత్వంలో ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక మాఫియాకు వరంగా మారిన గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కొత్త విధానం ఎలా ఉండాలనే అంశంపై మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణాతోపాటు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇసుక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మన పాలసీ ఉండాలని సీఎం నొక్కి చెప్పారు. పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరుగకుండా చూడాలని సూచించారు. ప్రతి వాహనానికీ జీపీఎస్ ‘ఇసుకను తరలించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా జీపీఎస్ పరికరాలు అమర్చాలి. దీనివల్ల వాహనం ఎక్కడి నుంచి ఎక్కడకు ఇసుకను తరలించిందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడా అక్రమాలకు అవకాశం ఉండదు. ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రజలకు ఎంత ధరతో ఇసుక అందుతుందో కచ్చితంగా అంతకంటే తక్కువ రేటుకే అందించాలి. ప్రభుత్వం సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఏర్పాట్లకు రెండు నెలల సమయం ఎన్ని రోజుల్లో ఇసుక కొత్తవిధానం అమల్లోకి తేగలరని సీఎం అడిగిన ప్రశ్నకు క్వారీల వద్ద సీసీ కెమెరాలు, స్టాక్ యార్డులు, వేయింగ్ బ్రిడ్జిలు, వాహనాల గుర్తింపు, రిజిస్ట్రేషన్, జీపీఎస్.. తదితరాల ఏర్పాటుకు రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. అందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి సెప్టెంబరు 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని, ఆ లోగా అన్నీ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు ఇంటి నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలుగా ఒక యాప్, వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. డిమాండ్‌కు తగిన విధంగా ఇసుకను అందుబాటులో ఉంచి బుక్ చేసుకున్న వారికి సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలని నొక్కి చెప్పారు. ఇసుక సరఫరాకు కొత్త పాలసీ అమల్లోకి తెచ్చే వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా ఇసుకను అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లు యథాతథంగా చూసుకోవాలని ఆదేశించారు. ఇసుక డిమాండు – ఉత్పత్తి మధ్య అంతరం తగ్గించేందుకు రోబో శాండ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. సిలికా అక్రమ తవ్వకాలకు చెక్ నెల్లూరు జిల్లాలో సిలికా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్న అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగానే సీఎం సీరియస్‌గా స్పందించారు. ఇసుకను అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులంతా సమావేశమై అక్రమ తవ్వకాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అక్రమ తవ్వకాల మాట ఇక తనకు వినిపించరాదని ఆదేశించారు. గత అయిదేళ్లలో కోట్ల రూపాయల విలువైన ఇసుక కుంభకోణం సాగిందని సీఎం గుర్తు చేశారు. ఇసుక కొనుగోలు ప్రజలకు భారంగా మారగా, మాఫియా కాసుల మూటలు కొల్లగొట్టిందని, సర్కారుకు మాత్రం ఆదాయం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యవహరాలను ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి ఉభయతారకంగా మార్చడం కోసమే కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం, భూగర్భ గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనరేష్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీఎండీసీకే సరఫరా బాధ్యతలు ఇసుక కొత్త విధానం మేరకు సరఫరా బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగిద్దామని అధికారులు చేసిన సూచనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ప్రకారం ఏపీఎండీసీనే ప్రజలకు ఇసుకను విక్రయించనుంది. కొత్త విధానం అంతిమంగా ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా, పర్యావరణానికి నష్టం కలుగని రీతిలో, పూర్తి పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక కొత్త విధానం ఇలా అమలు కానుంది. ► జిల్లాల్లో ఇసుక రేవులను గనుల శాఖ గుర్తిస్తుంది. వీటికి సమీపంలో ఏపీఎండీసీ నిల్వ కేంద్రాలు (స్టాక్ పాయింట్లు) ఏర్పాటు చేసుకుంటుంది. ► క్వారీల నుంచి ఇసుకను తవ్వించి వాహనాల్లో స్టాక్ పాయింట్లకు ఏపీఎండీసీనే చేరవేస్తుంది. ► క్వారీ వద్దకు రాగానే ఖాళీ వాహనం బరువును వేయింగ్ మిషన్ ద్వారా లెక్కిస్తారు. దాంట్లో ఇసుక నింపిన తర్వాత మళ్లీ బరువు చూస్తారు. దీంతో వాహనంలో ఎన్ని టన్నుల ఇసుక ఉందో తేలిపోతుంది. వాహనంలో ఎంత ఇసుక ఉందో డ్రైవరుకు చీటీ ఇచ్చి పంపుతారు. స్టాక్ యార్డులోని సిబ్బంది ఆ చీటీ తీసుకుని మళ్లీ తూకం వేసి అంతే పరిమాణంలో ఇసుక ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అన్ లోడ్ చేయిస్తారు. ► వినియోగదారులకు ఇసుక పంపేప్పుడు కూడా వాహనాలను తూకం వేసి కచ్చితంగా వారు కోరిన పరిమాణంలో పంపించే ఏర్పాటు చేస్తారు. దీనివల్ల క్వారీలో ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు? స్టాక్ యార్డులకు ఎంత చేరింది? ఎంత విక్రయించారు? అనే లెక్క కచ్చితంగా ఉంటుంది. ఎక్కడా ఇసుక పక్కదారి పట్టడానికి అవకాశం ఉండదు. ► ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తారు. ► ఇసుక కావాల్సిన వారు వెబ్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకుని డబ్బు చెల్లిస్తే ఏపీఎండీసీనే ఇంటికి వాహనాల ద్వారా ఇసుకను చేరవేస్తుంది. ఏపీఎండీసీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని జీపీఎస్ పరికరాలు అమర్చుకున్న వాహనాలను సంస్థ స్టాక్ యార్డుల వద్దకు అనుమతిస్తారు. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి ముందుగా పద్ధతిలో ఇసుకను పంపిస్తారు. ఇసుక వ్యాపార వస్తువు కాకూడదు : మంత్రి పెద్దిరెడ్డి సహజ సిద్ధమైన ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చరాదనేది ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక ద్వారా ఆదాయం మాఫియాకు వెళ్లరాదని, ప్రజలకు సరసమైన ధరలకు అందించడం ద్వారా ఆదాయం ప్రభుత్వానికే రావాలన్నారు. గురువారం సాయంత్రం ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం ఇసుక సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
వివాదాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల యం ప్రగతి భవన్ ఈ సమావేశానికి వేదిక కానుంది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గురువారం సాయంత్రమే వైఎస్ జగన్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రగతి భవన్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాల సంపూర్ణ వినియోగం, విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం చెల్లించుకోవాల్సిన బిల్లుల బకాయిలు, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్డ్–9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన తదితర అపరిష్కృత అంశాలపై ఇద్దరు సీఎంలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేసీఆర్, జగన్‌లు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమై సుహృద్భావ వాతావరణంలో చర్చలు నిర్వహించి ఇచ్చిపుచ్చుకునే విధానంలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ, తెలంగాణ అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని, సాధ్యమైనంత త్వరగా విభజన వివాదాలను పరిష్కరించుకోవాలని సీఎంలిద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీకు కేటాయించిన భవనాలకు సంబంధించిన వివాదం పరిష్కృతమైన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన ఏపీ సచివాలయ, అసెంబ్లీ, ఇతర భవనాలను తెలంగాణ స్వాధీనం చేసుకుంది. పరస్పర చెల్లింపులూ జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 53.89%, ఏపీకు 46.11% విద్యుత్ వాటాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడేళ్ల వరకు రెండు రాష్ట్రాలమధ్య విద్యుత్ వాటాల పంపకాలు జరిగాయి. పరస్పరం జరిగిన విద్యుత్ పంపకాలకు సంబంధించిన బిల్లులను ఇరు రాష్ట్రాలు ఒకరికి ఒకరు చెల్లించుకోవాల్సి ఉంది. ఇతర ఆర్థికపర వివాదాలు కలిపితే తెలంగాణ నుంచి రూ.5,200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గతంలో ఏపీ ప్రభుత్వం వాదించింది. ఈ బకాయిలను చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు దివాళ తీసినట్లు ప్రకటించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం జాతీయ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ)లో కేసు సైతం వేసింది. అయితే, రెండు రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన వ్యవహారాలన్నింటినీ పరిష్కరించుకున్న తర్వాత తమకే ఏపీ నుంచి బకాయిలు రావాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదాల స్థితిగతులపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య తాజాగా జరగనున్న సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ఈ సమావేశంలో కుదిరే అభిప్రాయం మేరకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యంలు వచ్చే నెల 3న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో సమావేశమై తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. నీళ్లు, విద్యుత్ వివాదాలు కీలకం గోదావరి, కృష్ణా జలాల పంపకాలు, మిగులు జలాల సంపూర్ణ వినియోగంపైనే శుక్రవారం జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని అధికావర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపే అవకాశముంది. తెలంగాణలో పనిచేస్తున్న 1,152 మంది ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు ఇక్కడి విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేయడంతో దాదాపు ఐదేళ్ల కింద ప్రారంభమైన వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ డీఎం ధర్మాధికారి పరిశీలనలో ఉంది. రిలీవైన ఉద్యోగుల్లో దాదాపు 583 మంది ఏపీకి వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వగా, మిగిలిన వారు తెలంగాణకు ఇచ్చారు. ఈ కేసులో తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులకే రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో దాదాపు రూ.240 కోట్ల వరకు ఫీజులు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం సైతం దాదాపు ఇదే మొత్తంలో ఖర్చు చేసి ఉండొచ్చని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
సీఎం జగన్ పోలవరం పర్యటన ఎందుకు?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వరప్రదాయినిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం పనులు శ్రీకారం చుట్టినా తర్వాత వచ్చిన టీడీపీ సర్కారు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు పనులు మందగించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర సాయాన్ని కూడా కోరారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రాజెక్టును సందర్శించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రత్యక్షంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చూసిన తర్వాత అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. చదవండి: పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణమేంటి? ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చే పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. 2018 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయింది. 2018 నాటికి గ్రావిటీతో నీరు ఇస్తాం రాసుకోమంటూ అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అసెంబ్లీలో వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్వాసితులను పూర్తిస్తాయిలో తరలించి, ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇవ్వగలిగితేనే ప్రాజెక్టు పూర్తయినట్లు. లక్షా ఐదు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 3 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. అంటే 3 శాతంలోపు మాత్రమే పునరావాస కార్యక్రమాలు జరిగాయి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు రోజువారీ సమీక్షలతో సరిపెట్టారు. చదవండి: పునాదుల్లోనే పోలవరం ఎందుకు ఉంది? ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన పోలవరం ఎంతటి నిర్లక్ష్యానికి గుర్యయిందో అందరికీ తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో పోలవరాన్ని డబ్బులిచ్చే ఏటీఎమ్‌గానే చూసిన టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టలేదు. ఐదేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఐదేళ్ల కాలంలో ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం యుద్ధప్రాతిపదికన పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అది. చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది. 960 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి వచ్చేది. విశాఖపట్నంలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాలు తీరడంతోపాటు 540 గ్రామాల ప్రజల దాహార్తి తీరేది. చదవండి: పోలవరం ప్రాజెక్టును ‘ఏటీఎం’గా మార్చుకున్న చంద్రబాబు -
17న తెలంగాణ, ఏపీ సీఎంల చర్చలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మరో దఫా చర్చలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 21న నిర్వహించనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం దృష్ట్యా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశం మేరకు శాఖలవారీగా విభజన వివాదాల స్థితిగతులపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇరు రాష్ట్రాల మధ్య కీలక విషయాల్లో వివాదాలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. గత ఐదేళ్లలో కొన్ని విషయాల్లో తీవ్ర వైరం కొనసాగింది. ఏపీ సీఎంగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టాక ఉభయ రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఏపీ, తెలంగాణల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు పర్యాయాలు చర్చలు జరిపారు. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో ఇరువురు సీఎంలు ఉండటంతో అత్యంత సుహృద్భావ వాతావరణంలో ఈ చర్చలు సాగాయి. హైదరాబాద్‌లో ఏపీ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఇప్పటివరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సింది. ఈ నెల 17న మళ్లీ రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానుండటంతో మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. 17న నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 17న ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రారంభించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ నివాస గృహాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి ఆర్ అండ్ బీ శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గృహవాస్తు పూజలు నిర్వహిస్తారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ నేరుగా విజయవాడకు బయలుదేరి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్నారు. -
గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ శనివారం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్ తిరిగి విజయవాడ చేరుకున్నారు. కాగా, ఈనెల 7న ఉదయం పదిగంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్ఎల్పీ సమావేశం జరగనుంది. -
రేపటి నుంచి వైఎస్ జగన్ సమీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని.. స్కూల్స్‌లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడద్దు, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలన్నారు. ఇది ప్రాథమిక సమావేశమని, మళ్లీ సమావేశం లోపు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రేపటి నుంచి శాఖల వారీగా ముఖ్యమంత్రి జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరపనున్నారు. జూన్ 3న విద్యా, జలవనరుల శాఖలపై సమీక్ష జరుపుతారు. 4న వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై సమీక్ష ఉంటుంది. 6న సీఆర్డీఏపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 8న సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8.39 గంటలకు ముఖ్యమంత్రి చాంబర్లోకి ప్రవేశించనున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. 42 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కార్యాలయ అధికారులనూ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. -
ఏపీ: పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్ తగ్గింపు
అమరావతి : భగ్గమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటితుడుపుగా స్వల్ప ఉపశమన చర్యలు ప్రకటించారు. పెట్రో ధరలు విపరీతంగా పెరుగుతున్నా.. అదనపు వ్యాట్‌ను పూర్తిగా ఎత్తివేయకుండా స్వల్పంగా తగ్గించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై అదనపు వ్యాట్ రూపంలో లీటరుకు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతూ ఉండటాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై అదనంగా వసూలు చేస్తున్న నాలుగు రూపాయల వ్యాట్‌ను 2 రూపాయలకు తగ్గించారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్ విధిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం గమనార్హం. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నుగా వ్యాట్ విధించడమే కాకుండా.. అదనపు వ్యాట్‌ను కూడా ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీంతో పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌ను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. వ్యాట్ భారం మాత్రమే కాక, అదనపు వ్యాట్ భారం కూడా ఏపీ ప్రభుత్వం ప్రజల నెత్తిన వేస్తుండటంతో ఏపీ పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం వసూలు చేస్తున్న వ్యాట్ నుంచి తమకు విముక్తి కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావడం కోసం వాటిని జీఎస్టీలో చేర్చాలనే ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. చంద్రబాబు మాత్రం దానిని వ్యతిరేకించారు. రాష్ట్రాల ఆదాయం కోల్పోతాయనే నెపంతో వాటిని జీఎస్టీలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సముఖత చూపించలేదు. అయితే పెట్రోమంటకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్, హర్తాళ్లు.. ఆదివారం విశాఖలోని కంచరపాలెంలో జరిగిన వైఎస్ జగన్ సభకు ప్రజలు సునామీలా తరలిరావడం.. ప్రజా వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రో ధరలపై అదనపు వ్యాట్ కొంత తగ్గించి చేతులు దులుపుకుంది. ఇన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. కనీసం ఎలాంటి ప్రకటన చేయని చంద్రబాబు ప్రస్తుతం స్వల్పంగా ఈ అదనపు వ్యాట్‌ను తగ్గించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 2 అదనపు వ్యాట్ తగ్గింపు.. రేపటి నుంచి అమలు చేయనున్నట్టు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు. -
షావోమి సప్లయిర్స్‌తో ఏపీ సీఎం భేటీ
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. షావోమి సప్లయిర్స్‌కు సంబంధించి 36 కంపెనీలతో ఆయన సమావేశమయ్యారు. చైనా నుంచి వచ్చిన మొత్తం 198 మంది ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు. తిరుపతిలోని మానస సరోవరం హోటల్లో ఈ సమావేశం ఏర్పాటుచేశారు. షావోమి సప్లయిర్స్ ఏర్పాటుకు అన్ని రకాల ప్రోత్సహకాలను తాము అందజేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో రాయలసీమకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. షావోమి సప్లయిర్స్, జియో కంపెనీలు ఏర్పాటైతే, రూ.3వేల బిలియన్లు పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్ హబ్స్‌తో పాటు, ఆటో మొబైల్ హబ్‌గా కూడా రూపొందుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పెద్ద ఎత్తున్న ఉద్యోగాల కల్పన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవలే షావోమి తన కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను శ్రీసిటీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
జన్మభూమికి చుక్కెదురు!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమైన రెండో విడత జన్మభూమి కార్యక్రమం రసాభాసలకు దారితీస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి వంటి హామీలను గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన మహిళలు, యువత, రైతులు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొని అధికారులను నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కూడా గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రభుత్వ పథకాలన్నిట్లో టీడీపీ వాళ్లకే పట్టం కడుతున్నారని నిరసిస్తు.. విశాఖపట్నం, కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం, విజయనగరం జిల్లాలలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా బొబ్బిలిలో ముఖ్యమంత్రి సభలో పాల్గొనేందుకు వెళ్తున్న సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆగ్రహించిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలు రోడ్డు పైన ధర్నాకు దిగారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగన్నవలసలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎల్లన్న కొండలో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమాన్ని స్థానికులు బహిష్కరించారు. జన్మభూమి కార్యక్రమాన్ని అధికార పార్టీ కార్యక్రమంగా మర్చేసారని నిరసిస్తూ.. అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో కార్యక్రమాన్ని బహిష్కరించారు. విజయనగరంలోని భోగాపురం ఏయిర్పోర్టు బాధిత గ్రామస్థులు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగి వారిని వెనక్కి పంపించేశారు. -
సీఎం గారూ.. వంకర మాటలు తగ్గించండి
కాపులకు రిజర్వేషన్ల హామీ మీరిచ్చిందే అమలు చేయమంటే ఎదురుదాడి చేయిస్తారా? కమిషన్ రిపోర్టు చూడటానికి మరుజన్మ ఎత్తాలి.. చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ లేఖ సాక్షి ప్రతినిధి, కాకినాడ/కిర్లంపూడి: ‘కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఎన్నికల్లో మీరిచ్చిందే. దాన్ని అమలు చేయాలని అడుగుతుంటే నేరం ఎవరి మీదకో తోసివేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య కాదా? ఎదురుదాడి చేయించడం లోకానికి తెలియదా? మా ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారని మీరు అంటున్నారు.. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను చేసిన ఉద్యమాలన్నీ మీ మద్దతుతో చేసినవా? సీఎం గారూ వంకర మాటలు తగ్గించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు. సీఎం ద్వంద్వవైఖరిని దుయ్యబడుతూ మంగళవారం రెండు పేజీల లేఖను పంపించారు. అన్నీ సిద్ధంగా ఉన్నా కాలయాపన.. అన్ని రకాల గణాంకాలు, సర్వేలు, వెలుగు సర్వేలు, కులాలు, జనాభా గణాంకాలు, ఆస్తిపాస్తుల వివరాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నప్పుడు మళ్లీ కమిషన్ వేయడం కేవలం కాలయాపన చేయడానికేనని ముద్రగడ ఆక్షేపించారు. ఆ కమిషన్ రిపోర్టు చూడాలంటే మరుజన్మ ఎత్తాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే నెల రోజుల్లో ఆ హామీని సీఎం అమలు చేయవచ్చని పేర్కొన్నారు. లేదంటే వచ్చే నెల 31న తునిలో నిర్వహించనున్న కాపుల సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేస్తామని ముద్రగడ తన లేఖలో స్పష్టం చేశారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. కాపు జాతిని మోసం చేసేందుకు బాబు కుట్ర పన్నుతున్నారని, రాజకీయాలు, రాష్ట్రం చంద్రబాబు సొత్తు కాదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో కాపులకు బీసీ రిజర్వేషను కల్పిస్తామని, ఏటా రూ.1000 కోట్లతో అభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. మా వాటా కావాలని అడుగుతున్నాం.. తమ ఉద్యమం రాజ్యాధికారం కోసం కాదని, అత్యంతపేదవారి కోసమేనన్నారు. గిరిజన, హరిజన, వెనుకబడిన వర్గాలు అనుభవించే కోటా కాకుండా మిగిలిన దాంట్లో తమకు వాటా కావాలని అడుగుతున్నామన్నారు. ఆకలి తీరుస్తామని హామీ ఇచ్చారు కనేకనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ‘స్వాతంత్య్రం రాకముందు బలిజ, ఒంటరి, తెలగ, కాపు కులాలు బీసీలుగా ఉన్నారట. అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి ఓసీలుగా మార్పు చేయడం, దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మళ్లీ బీసీలుగా మార్చడం, తర్వాత అప్పటి సీఎం బ్రహ్మానందరెడ్డి ఓసీలుగా మార్పు చేశారని, ఈ కార్యక్రమంతా జీవోల ద్వారానే అమలు చేశారని పెద్దల వల్ల తెలుస్తోంది.’ అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. -
చంద్రబాబు వంకర మాటలు తగ్గించండి
-
బాబు సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది
-
సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం
-
సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం
రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిందని సీఎం వ్యాఖ్యలు * డిప్యూటీ కలెక్టర్ల బదిలీలను రద్దుచేస్తూ జీవో * రెవెన్యూశాఖకు సంబంధం లేకుండా భూసేకరణ * ముఖ్యమంత్రి వైఖరిపై కేఈ అనుమానాలు * యువనేత ఒత్తిడితోనే పక్కనపెట్టారన్న అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరుపై రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శిబిరం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. డిప్యూటీ కలెక్టర్లను బదిలీలు చేస్తూ నిన్న ఇచ్చిన జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి తాజాగా శుక్రవారం విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ శాఖలో అవినీతి డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందని ఒకటికి రెండుసార్లు చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరిపై కేఈ కృష్ణమూర్తి శిబిరం తర్జనభర్జన పడుతోంది. చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి, పరిణామాలు దేనికి సంకేతమని సన్నిహితుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో మంత్రివర్గ సమావేశంలో ఒకసారి, అంతకుముందు కలెక్టర్ల సమావేశంలోనూ రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని విశ్లేషిస్తున్న కేఈ శిబిరం మొత్తంగా ఆ మాటల్లోని ఆంతర్యం వేరై ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. కావాలనే తనపట్ల తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఈ ప్రయత్నం జరుగుతుందా? అన్న అనుమానాలు కేఈ సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలను నిలుపుదల చేయ డం ఇది మూడోసారి కావడం గమనార్హం. భూసేకరణకు రెవెన్యూశాఖ దూరం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అనేక ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరుగుతుండగా, అన్నీ రెవెన్యూ శాఖకు సంబంధం లేకుండా చేస్తున్నారు. అమరావతి రాజధాని భూ సమీకరణ, భోగాపురం ఎయిర్‌పోర్టు భూ సేకరణతోపాటు బందరు పోర్టు వంటి విషయాల్లోనూ కేఈని దూరం పెట్టారు. ఆ ప్రాజెక్టుల భూ సేకరణను మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులకు అప్పగించారు. జరుగుతున్న పరిణామాలపై కేఈ ఇటీవల సన్నిహితులతో నిర్వహించిన సమావేశంలో ప్రస్తావించినట్టు సన్నిహితవర్గాలు చెప్పాయి. కొత్తగా పార్టీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డిని కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతోపాటు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారని, ఆ విషయంలో కనీసం తనను సంప్రదించలేదని కేఈ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీలో సీనియర్‌గా ఉన్న తాను ఇలాంటి విషయాల్లో అడిగిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు తన పట్ల అనుసరిస్తున్న విధానాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ... ఇవన్నీ దేనికి సంకేతమని, వీటన్నింటిపైనా ఆలోచించాల్సి ఉందని అన్నట్టు తెలిసింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినా నానా ఇబ్బందుల పాలు చేశారని, ఎన్నికల తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ యువనేత ఒత్తిడితోనే పక్కనపెట్టారన్న అభిప్రాయం సన్నిహితుల సమావేశంలో వ్యక్తమైంది. -
వారంలో డేటా ఇవ్వండి
* ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్‌డేటా సమర్పణకు సర్వీస్ ప్రొవైడర్లకు సుప్రీంకోర్టు వారం గడువిచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి, సెల్యూలర్ ఆపరేటర్లకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారాన్ని ఈ నెల 24లోపు ఇవ్వాలన్న విజయవాడ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. సీఓఏఐతోపాటు బీఎస్ఎన్ఎల్, ఐడియా తదితర సంస్థలు విడిగా వేసిన పిటిషన్లన్నీ జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ శివ కీర్తిసింగ్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. సర్వీసు ప్రొవైడర్ల తరఫు న్యాయవాది కె.కె.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ ‘ఏపీ, తెలంగాణల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నడుస్తోంది. వారి మధ్య సర్వీసు ప్రొవైడర్లు నలిగిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సర్వీసు ప్రొవైడర్లకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు, ఏయే ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారో ఆయా వివరాలను ఇవ్వాలని ఆ దర్యాప్తు బృందం సర్వీసు ప్రొవైడర్లను కోరింది. ఆ డేటా ఇస్తే అధికార రహస్యాల చట్టం కింద న్యాయవిచారణ ఎదుర్కోవలసి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం సంబంధిత డేటా ఎవరికీ ఇవ్వరాదన్నది. విజయవాడ కోర్టు ఈ డేటా ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. రెండు ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు సర్వీసు ప్రొవైడర్లను వేధిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. అది చట్టబద్ధం కాని ట్యాపింగ్: ఏపీ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బసవ ప్రభుపాటిల్, పి.పి.రావు తమ వాదనలు వినిపిస్తూ ‘అక్కడ చట్టబద్ధం కాని ట్యాపింగ్ జరిగింది. దర్యాప్తులో భాగంగా అవసరమైన డాక్యుమెంట్లు, డేటాను సీల్డ్కవర్లో సమర్పిస్తే వచ్చే నష్టం ఏముంది?’ అని పేర్కొన్నారు. హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం.. రిట్ పిటిషన్లు ఉపసంహరణకు అవకాశం ఇస్తూ.. ‘విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టుకు సీల్డ్కవర్లో డేటాను ఇచ్చేందుకు మరో వారం గడువు ఇ స్తున్నాం. ఆ కోర్టు దానిని స్వీకరించిన త ర్వాత వారాల వరకు తెరవకూడదు. అ లాగే మొత్తం నాలుగు వారాల వరకు కోర్టు తన వి చారణను ఆపాలి’ అని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
ఇదేం పని బాబూ!
‘చంద్రబాబు బూటకపు హామీలతో గద్దెనెక్కాడు. కుతంత్రాలు పూని కుప్పలుతెప్పలుగా దాచుకున్న ధనంతో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇతనికి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హతలేదు. అవినీతి కుంభకోణానికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి’ చంద్రబాబుపై సామాన్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. - ఏలూరు (వన్ టౌన్) తక్షణమే రాజీనామా చేయాలి పదవుల కోసం నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనాలనుకోవడం హేయం. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉంటూ ఇలాంటి అవినీతి రాజకీయూలకు పాల్పడం తగదు. జరిగిన అవినీతి భాగోతానికి బాధ్యత వహిస్తూ తక్షణమే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయూలి. - మున్నుల జాన్‌గురునాథ్, ఏలూరు శిక్ష పడాల్సిందే ఓటును సంక్షేమ పాలనతో సాధించుకోవాలి కాని అడ్డదారిలో ఎమ్మెల్యేలను కొనాలనుకోవడం అవినీతి చర్య. అవినీతిని అంతం చేయాల్సిన ముఖ్యమంత్రే అక్రమాలకు పాల్పడటం మామూలు విషయం కాదు. ఇటువంటి నాయకులకు శిక్ష పడాల్సిందే. - చిట్టి కనకమహాలక్ష్మి, నిరుద్యోగి, ఏలూరు. న్యాయ నిపుణులు స్పందించాలి సీఎం చంద్రబాబు అవినీతి భాగోతంపై న్యాయనిపుణులు స్పందించాలి. ఆధారాలతో ఏసీబీకి అడ్డంగా దొరికిన అతడిని అరెస్ట్ చేయూలి. ముందు సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయూలి. అందరూ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. - వేగి చిన్ని ప్రసాద్ మా ఉసురు తగులుతుంది అబద్దపు హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబుకు మహిళల ఉసురు తగులుతుంది. ఓటుకు నోటును అంతం చేయూల్సిన వారే కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొనాలనుకోవడం దారుణం. అవినీతిపరులు కటకటాలు లెక్కపెట్టాల్సిందే. - వి.లక్ష్మి, గృహిణి, ఏలూరు అవినీతికి కోట్లు వెచ్చిస్తారా..! కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు. సంక్షేమ పాలనతో ప్రజల మన్ననలు పొందాల్సిన నాయకుడు డబ్బుతో ప్రజాప్రతినిధులను కొనాలనుకోవడం ఎంతవరకు సమంజసం. తక్షణమే అతడిని అరెస్ట్ చేసి న్యాయవిచారణ చేయూలి. - కంటిపూడి జ్యోతి, కూలీ, ఏలూరు ఇంత డబ్బు ఎక్కడిది చంద్రబాబు చాపకింద నీరులా అవినీతి సాగిస్తే ఎవరికీ తెలియదనుకోవడం పొరపాటు. అవినీతి ఎప్పటికైనా బయటపడుతుంది. ఇచ్చిన హామీలు అమలుచేయడానికి లేని డబ్బులు ఎమ్మెల్యేలను కొనడానికి ఎలా వచ్చాయి. చంద్రబాబును అరెస్ట్ చేయూలి. - మేడిపల్లి ప్రశాంతి, కూలీ, ఏలూరు. కేసు పెట్టాలి అవినీతి పరులు ప్రజలు, అధికారులు కళ్లుగప్పి తిరగొచ్చేమో.. ఎంతటివారైనా దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేరు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలి. అవినీతిని పారద్రోలాలి. ఇంతటి పనికి పాల్పడిన చంద్రబాబుపై కేసు పెట్టాలి. - వేశిపోడి మేరి, గృహిణి, ఏలూరు. ఇది దారుణం ప్రజలకు ఖర్చుపెట్టేందుకు రూపాయి లేదు అప్పుల్లో ఉన్నాం అంటున్న చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనడానికి ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలి. సీఎం అంతటి వ్యక్తే ఇంతటి దారుణానికి ఒడిగడితే ప్రజలను కాపాడేదెవరు. - షేక్ హసీనా, ఇంటిపని, ఏలూరు బాబును జైలులో పెట్టాలి బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనాలని చూడటం దారుణమైన చర్య. తక్షణమే బాబును అరెస్ట్ చేయూలి. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మాం. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. - కోటా గాంధీ, నిరుద్యోగి, ఏలూరు -
'బాలయ్యను సీఎం చేయాలి'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణం ఆయన కుమారుడు, టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి మొదలు పెట్టింది చంద్రబాబేనన్నారు. ఆనాడు ఆయనకు అండగా నిలబడింది కేసీఆర్ అని షబ్బీర్ అన్నారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయటంలో చంద్రులిద్దరూ గురుశిష్యులేనని చెప్పారు. తాజా ఘటనతో దొరికిన వాళ్లే దొంగలు అయ్యారని షబ్బీర్ అన్నారు. చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ స్థానాన్ని ఎన్టీఆర్ తనయుడు బాలయ్యతోనే పూరించాలని సూచించారు. బాలయ్య సీఎం అయితేనే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని షబ్బీర్ అలీ చెప్పారు. -
బెజవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్
-
అన్నదాతకు అష్టకష్టాలు
రైతుకూ బాబు వెన్నుపోటు అప్పులతో కుదేలు.. మాఫీ కాక దిగాలు 8నెలల పాలనలో అన్నివిధాలా నష్టాలు నిరాశ, నిస్పృహలతో కర్షకులు సంక్షోభం దిశగా వ్యవసాయం సాక్షి ప్రతినిధి, ఏలూరు : భారతదేశ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులు మునుపెన్నడూ లేని విధంగా అష్టకష్టాలు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలో.. ప్రతికూల వాతావరణమో కాదు.. కేవలం రైతన్నపై పగపట్టినట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లనే పశ్చిమ రైతు కాడి కిందపడేసే దుస్థితి నెలకొంది. హుదూద్ తుపానును సైతం తట్టుకుని పంట పండించిన జిల్లా రైతు సర్కారు దెబ్బకు మాత్రం విలవిల్లాడిపోతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో అన్నదాత కష్టాల సాగుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రుణమాఫీపై సర్కారు నయామోసం, సాగుకోసం బ్యాంకులు కొత్త రుణా లు ఇవ్వని నిర్వాకంతో ఎక్కువ వడ్డీకి ప్రైవేటు అప్పులు చేయడం, సాగునీటి అవస్థలు, యూరియా కష్టాలు, విత్తన మోసాలు, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను గిట్టుబాటు ధరకు విక్రయించలేక నష్టపోవడం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ లేక.. అన్నీ కలగలిపి రైతన్నను తీవ్ర అగాధంలోకి నెట్టి వేస్తున్నాయి. అన్నదాతలపై కనీస కనికరం లేని సర్కారు తీరుతో తీవ్ర ఆందోళన, ఆశాభంగం, నిరాశా నిస్పృహలతో జిల్లా రైతులు కుంగిపోతున్నారు. 1. రుణం నిజం.. మాఫీ మోసం చంద్రబాబు రుణమాఫీ మాయాజాలంలో చిక్కుకుని పశ్చిమ రైతు నిండా మునిగిపోయాడు. జిల్లావ్యాప్తంగా 8లక్షల 79 వేలమంది రైతుల అకౌంట్లు, మరో లక్షకి పైగా ఉన్న డ్వాక్రా సంఘాల అకౌంట్లకు గాను దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే లక్షన్నర పరిమితి, ఇంటిలో ఒక్కరికే మాఫీ మెలికతో జిల్లాలో రైతుల రుణమాఫీకి సర్కారు విదిల్చంది కేవలం రూ.369 కోట్లు మాత్రమే. కనీసం కేటాయించిన ఆ రూ.369 కోట్లయినా రైతుల ఖాతాల్లో జమ అయిందా అంటే అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారంటే జిల్లాలో రుణమాఫీ ప్రక్రియ ప్రసహనం ఎలా కొనసాగుతుందో అర్థమవుతుంది. 2. ప్రైవేటు అప్పుల ఊబిలో రైతన్నలు రుణమాఫీ జాప్యం, అమల్లో అస్తవ్యస్త విధానాలు చివరికి రైతులకు బ్యాంకు నుంచి అప్పులు పుట్టకుండా చేశాయి. 2013-14లో పంటరుణాల లక్ష్యం రూ.4,374కోట్లు కాగా, రూ.6,084 కోట్ల రుణాలను బ్యాంకర్లు రైతులకు అందించారు. ఆ ఏడాది లక్ష్యానికి మించి అప్పులు తీసుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యాన్ని రూ.5221 కోట్లకు పెంచారు. కానీ సర్కారు రుణమాఫీ మోసంతో పంటరుణాల పంపిణీని బ్యాంకులు నామమాత్రం చేసేశాయి. గడిచిన ఖరీఫ్ సీజన్లో కేవలం రూ. 900 కోట్ల మేర పంట రుణాలు పంపిణీ చేయగా, ప్రస్తుత రబీ సీజన్లో ఇంతవరకూ రుణాల పంపిణీనే మొదలు కాలేదు. ఇక కౌలు రైతులకు రెండు సీజన్లలోనూ నయా పైసా కూడా బ్యాంకుల నుంచి అప్పు పుట్టలేదు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు గ్రామాల్లోనే తిష్టవేసి అధిక వడ్డీలను రైతుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు. మరో పక్క ధాన్యం లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి కుదించడంతో మిల్లర్లు కమిషన్‌దారుల ద్వారా రైతులకు ఇప్పించే రుణాలను తగ్గించేశారు. దీంతో కొన్నిచోట్ల సాగుదారులు అప్పులు దొరక్క విల్లవిల్లాడే పరిస్థితి కూడా నెలకొంది. 3. యూరియా కష్టాలు ఎరువుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో యూరియా వినియోగం పెరిగిన ప్రస్తుత నేపథ్యంలో రైతులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. అందుబాటులో ఉన్నచోట డీలర్ల మాయాజాలం, ఇష్టారాజ్యంగా అధిక రేట్లకు విక్రయించడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ వద్ద యూరియా బస్తా ధర రూ.280లు ఉండగా ప్రైవేటు డీలర్లు రూ.320 నుంచి రూ.330లు చొప్పున విక్రయిస్తున్నారు. సొసైటీలకు ఎరువు వచ్చినా రైతులకు సకాలంలో సమాచారం తెలియని పరిస్థితి నెలకొంది. రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నప్పటికీ చాలా మండలాల్లో రైతుకి ఒక్క బస్తా చొప్పున మాత్రమే అందిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా వరి పంటతో పాటు మెట్టలో సాగ వుతున్న వర్జీనియా పొగాకు, చెరుకు, మొక్కజొన్న, అరటి, కూరగాయలు పంటలకు సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల తాళ్లపూడి మండలం మలకపల్లిలో యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలే లేవు. 4. ధాన్యం విక్రయాలతో నష్టాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబడి అమ్మిన రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం నెలల తరబడి సొమ్ములు చెల్లించకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి రైతులు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నాడు. జిల్లా మొత్తం మీద 171 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటికే ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు డివిజన్లలో కేంద్రాలను మూసివేశారు. నర్సాపురం డివిజన్లో మాత్రం అక్కడక్కడా తెరిచి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా 37,454 మంది రైతుల నుంచి 4,67 లక్షల క్యూబిక్ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ.650 కోట్లు కాగా వీటిని నిర్వహించినందుకు గాను డ్వాక్రా సంఘాలకు రూ.15 కోట్లు కమీషన్‌గా ఇచ్చారు. ఇందులో ధాన్యం అమ్మిన రైతులకు రూ.32 కోట్లు చెల్లించవలసి ఉండగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 5. చి‘వరి’ భూములకు సాగునీటి అవస్థలు ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి సమస్యతో జిల్లాలోని వేలాది ఎకరాల్లో నాట్లు పడని దుస్థితి తలెత్తినా అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవువుతుండగా, ప్రస్తుత దాళ్వాలో ఒక్క పశ్చిమ డెల్టాలోనే 2.32 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. అయితే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆచంట ప్రాంతాల్లోని శివారు భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. వేసవికాలానికి ఇంకా రెండు నెలల ముందుగానే గోదావరిలో నీటి లభ్యత రోజురోజుకీ తగ్గిపోతుండటంతో సాగునీటికి తీవ్ర కటకట తలెత్తింది. 6. విత్తన మోసాలు విత్తనాల కంపెనీల మోసాలతో పశ్చిమ రైతులు నిలువునా దగా పడుతున్నారు. బహుళ జాతి విత్తన కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీసీడ్స్ సరఫరా చేసిన విత్తనాలతో కూడా పంటలు దెబ్బతింటున్నాయంటే ఇక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఖరీఫ్ సీజన్లో నల్లజర్ల, పోలవరం, తాళ్లపూడి, మండలాల్లో వేలాదిమంది రైతులు ఏపీ సీడ్స్ పంపిణీ చేసిన విత్తనాలు సాగు చేశారు. అయితే వేసిన అన్ని చోట్లా మొత్తం పంట దెబ్బతింది. పరిహారం కోసం రైతులు చెప్పులు కాదు.. కాళ్లరిగేలా తిరిగినా ఇంతవరకు ఏపీ సీడ్స్ పట్టించుకోలేదు. ఇక ప్రైవేటు కంపెనీల మాయాజాలం సరేసరి. కేంద్రమంత్రి సుజనాచౌదరి సమీప బంధువుకు చెందిన విభాసీడ్స్ కంపెనీ విత్తనాలను లింగపాలెం, పెదవేగి, చింతలపూడి మండలాల్లోని సుమారు రెండువేల మంది మొక్కజొన్న రైతులు కొనుగోలు చేశారు. నిర్ణీత సమయానికి పంట కోసి తిరిగి అదే కంపెనీకి విక్రయించారు. 35 రోజుల్లోపు ఆ సొమ్మును చెల్లించాల్సిన కంపెనీ ఆర్నెల్లు దాటినా పైసా కూడా ఇవ్వలేదు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ రైతుల సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. 7. బీమా లేక పంటల బీమా పథకాలున్నా పశ్చిమ రైతులకు కొరగాకుండా పోతున్నాయి. ఏటా వందల రూ.కోట్లు బీమా ప్రీమియం చెల్లిస్తున్నా అక్కరకు మాత్రం రావడం లేదు. హెలెన్, పెలైన్, లెహర్ తుపాను దెబ్బలకు వేల కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. అయితే బాబు సర్కారు వచ్చిన తర్వాత రెండు నెలల కిందట వచ్చిన బీమా పరిహారం కేవలం రై. 200 కోట్లు. ఇది కూడా వాస్తవ సాగుదారులకు కాకుండా భూయజమానులకు మాత్రమే అందుతోందన్న ఆరోపణలున్నాయి. ఇక రుణమాఫీ జాప్యం ఫలితంగా బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయలేదు. దీంతో బీమా ప్రీమియం కూడా రైతులు చెల్లించలేదు. ఫలితంగా బీమాకు రైతులు దూరమయ్యారు. 8. అటకెక్కిన ఇన్పుట్ సబ్సిడీ ప్రకృతి వైపరీత్యాల కంటే సర్కారు కొట్టే చావు దెబ్బే రైతును బాగా కుంగదీస్తోందనడానికి ఇన్పుట్ సబ్సిడీ ప్రసహనమే ఉదాహరణ. ఏడాదిన్నర కితం కురిసిన భారీ వర్షాలకు, హెలెన్, లెహెర్ తుపానులకు జిల్లాలో పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు జిల్లాలో పర్యటించి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే వెంటనే ఆదుకుంటానని హామీనిచ్చారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి ఎనిమిది నెలలు గడుస్తున్నా, బాబు ఎక్కడా దీని గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆహార పంటలకు ఎకరాకు రూ.10 వేలు, వాణిజ్య పంటలకు రూ.20 వేలు ఇవ్వాలన్న భూపేంద్రసింగ్ హుడా కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న బాబు నోట ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ మాటే పెగలడం లేదన్న విమర్శలున్నాయి. -
సీఎం పర్యటన ఇలా
ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉంగుటూరు మండలం కైకరంలో జరిగే రైతు సాధికార సదస్సులో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12.55 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 1.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి కైకరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం 2.15 గంటల నుంచి 5.30 గంటల వరకు రైతు సాధికార సదస్సులో పాల్గొని, రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రుణమాఫీకి అర్హులైన వారికి రుణ ఉపశమన పత్రాలను అందిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కైకరం హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 6.15 గంటలకు గన్నవరం చేరుకుంటారు. -
జపాన్ చేరుకున్న చంద్రబాబు
-
జపాన్ బయలదేరి వెళ్లనున్న చంద్రబాబు!
-
సింగపూర్ బయల్దేరిన చంద్రబాబు
-
కుడి, ఎడమలకే పెద్దపీట
సుజన, నారాయణలకు అన్నిటా అగ్ర తాంబూలం బాబు సర్కారులో సన్నిహితులదే హవా ఏ నిర్ణయమైనా వారితో చర్చించిన తర్వాతే.. అనేక కమిటీల్లో ఆ ఇద్దరికే చోటు ఆ తర్వాత రమేష్, కంభంపాటి, పరకాల, అభీష్ట, కుటుంబరావుల కీలక పాత్ర సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి విషయంలోనూ ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు నేతలపైనే ఆధారపడుతున్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరమైన వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ ఇద్దరు నేతలే కీలకంగా మారారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు వై.సత్యనారాయణచౌదరి (సుజనాచౌదరి), మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణలతో సంప్రదించకుండా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవడం లేదన్న విషయాన్ని జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రభుత్వంలో వీరి ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత కూడా నారాయణకే అప్పగించారు. ఈ ఇద్దరితో పాటు సి.ఎం.రమేష్, సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా నియమితుడైన అభీష్ట, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితుడైన కంభంపాటి రామ్మోహన్‌రావులు బాబుకు అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికలతో నిమిత్తం లేని బడా నేతలు... సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, నారాయణలు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాలంలో చంద్రబాబుకు అండగా ఉన్నారు. సుజనాచౌదరి పలుమార్లు అమెరికా సందర్శించి అక్కడి తెలుగువారి నుంచి ఎన్నికల నిధులు సేకరించారు. సంపన్న వ్యాపారులైన ఈ ముగ్గురూ బాబు కుమారుడు నారా లోకేష్‌తో నిత్య సంబంధాలు పెట్టుకుంటారు. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమావేశాల్లో సీఎంతో పాటు ఈ నలుగురూ తప్పనిసరిగా ఉంటారు. రాజధాని కానీ.. నిధులు కానీ.. సుజనానే కీలకం! ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ అధ్యయనం పూర్తి కాకముందే మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని సలహా కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో సుజనాచౌదరి సభ్యుడు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన బాబు.. వనరుల సమీకరణ కోసం సూచనలు, సలహాలు ఇవ్వడానికి అంటూ మరో కమిటీని నియమించారు. దాని బాధ్యతలను సుజనాచౌదరికి అప్పగించారు. సీఎంతో పారిశ్రామిక వేత్తలను కలిపేదీ వారే..! ఈ కీలక బృందంలోని సభ్యులెవరు హైదరాబాద్‌లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే ప్రతి సమీక్షా సమావేశంలో పాల్గొంటున్నారు. విదేశీ ప్రతినిధులు ఎవరు ముఖ్యమంత్రిని కలిసినా బృందంలోని నేతల్లో ఎవరో ఒకరు లేకుండా కలుసుకోవడం లేదు. ఇటీవలి కాలంలో జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి అనేక దేశాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో భేటీలు ఇలానే జరిగాయి. ప్రభుత్వంలో అంతా పరకాలే..! ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రస్తుతం ప్రభుత్వంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. సీఎం నిర్వహించే సమావేశాల్లో ఆయా శాఖల మంత్రులున్నా లేకున్నా పరకాల మాత్రం భాగస్వాములవుతున్నారు. ఆయన చంద్రబాబుకు తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు. రమేష్‌ను దూరం పెట్టారా? రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ టీడీపీలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు వెన్నంటి ఉంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ను ప్రత్యేకంగా ఏ కమిటీలో నియమించకపోయినప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ పరమైన అంతర్గత పనులను రమేష్‌కు అప్పగిస్తున్నారు. కొద్ది రోజులుగా కొంత దూరం పెట్టారని తెలుస్తోంది. హస్తిన సంబంధాలన్నీ కంభంపాటికే... మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు కూడా ప్రస్తుతం చంద్రబాబు టీంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీలోని అన్ని జాతీయ రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్న క ంభంపాటిని ఏరికోరి చంద్రబాబు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించుకున్నారు. కొద్ది రోజుల్లోనే సన్నిహితమైన కుటుంబరావు... ఆర్ధిక రంగ నిపుణుడు చెరుకూరి కుటుంబరావు కొద్ది కాలంలోనే బాబుకు సన్నిహితుడుగా మారారు. ఆర్ధిక రంగంలో పట్టున్న కుటుంబరావు ఎన్నికలకు ముందు నుంచి బాబుకు పలు అంశాల్లో సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆయన్ను రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్‌గా నియమించారు. నారాయణ లేని మంత్రివర్గ కమిటీ ఉండదు..! పురపాలక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణను ప్రభుత్వం నియమించే ప్రతి మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా చంద్రబాబు నియమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని నిర్మాణ సలహా కమిటీకి నారాయణ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజధాని గుంటూరు - కృష్ణా జిల్లాల మధ్య ఏర్పాటు చేయాలని నిర్ణయించిన బాబు భూ సమీకరణకు కూడా మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటుచేశారు. అందులో సభ్యుడిగా నియమితుడైన పి.నారాయణ చుట్టే వ్యవహారాలు సాగుతున్నాయి. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల తరహాలో ఏపీలో ఏర్పాటు చేయదలచిన అన్న క్యాంటీన్లకు మార్గదర్శకాలకు ఏర్పాటు చేసిన ఉపసంఘంలో కూడా ఆయన సభ్యుడుగా ఉన్నారు.రూ.రెండుకే 20 లీటర్ల మంచినీటిని ఇచ్చే ఎన్టీఆర్ సుజల పథకం మార్గదర్శకాల తయారీ కమిటీలో కూడా నారాయణ సభ్యుడుగా ఉన్నారు. -
బాబుగారి దసరా సరదా.. 20 కోట్ల ఛాంబర్!
దసరా పండుగ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరదా పడ్డారు. సచివాలయంలోని కొత్త ఛాంబర్లోకి పూజలు చేసి మరీ అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉన్న హైదరాబాద్‌లోని సచివాలయం ఎల్ బ్లాకులో ఆయన కోసం ఏర్పాటుచేసిన ఛాంబర్ సొగసులకు అయిన ఖర్చు.. దాదాపు 20 కోట్ల రూపాయలకు పైమాటే!! వాస్తు పేరు చెప్పి ఈ ఛాంబర్లో చేసిన మార్పు చేర్పులు అన్నీ ఇన్నీ కావు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌నే తాత్కాలికంగా తన ఛాంబర్‌గా ఉపయోగించుకుంటూ వస్తున్నారు తప్ప సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. తొలుత హెచ్ బ్లాక్‌లో ఒక ఛాంబర్‌ను బాబుగారి కోసం సిద్ధం చేశారు. కానీ అక్కడ వాస్తు బాగోలేదన్న కారణంతో చంద్రబాబు అసలు అక్కడ అడుగే పెట్టలేదు. తర్వాత మళ్లీ ఎల్ బ్లాకులోని ఎనిమిదో అంతస్థులో ఛాంబర్‌ను ఆయనకోసం ఏరికోరి ఎంపిక చేశారు. దీంట్లో కూడా ఆయన 'అవసరం' అనుకున్న మార్పు చేర్పులు చేయడానికే దాదాపు 20 కోట్ల రూపాయలకుపైగా ఖర్చయింది. ఇది మొత్తం పూర్తి బుల్లెట్ ప్రూఫ్ ఛాంబర్. ఇందులోఉ ఓ కాన్ఫరెన్స్ హాలు, కేబినెట్ సమావేశాలకు ఓ హాలు, విజిటర్ల లాంజి, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల ఛాంబర్లు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కోసం కూడా అదే బ్లాకులోని ఏడో అంతస్థులో మరో ఛాంబర్ నిర్మించారు. కానీ, సచివాలయం విజయవాడకు తరలిపోయిన తర్వాత ఇవన్నీ వృథాయే అవుతాయి. మహా అయితే రెండు మూడేళ్లు మాత్రమే ఇక్కడ ఉంటామని, ఆ తర్వాత విజయవాడ నుంచే కార్యకలాపాలు సాగుతాయని కొంతమంది మంత్రులే చెబుతున్నారు. ఒకవైపు రుణమాఫీ లాంటి పథకాలకు డబ్బు లేదంటూనే తాత్కాలిక సరదాల కోసం ఇన్నేసి కోట్లు ఖర్చుపెట్టడం ఏంటోనని అంతా నోళ్లు నొక్కుకుంటున్నారు. -
'ఇచ్చిన హామీలు నిలబెట్టుకో బాబూ'
-
'ఇచ్చిన హామీలు నిలబెట్టుకో బాబూ'
తిరుపతి: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతిలో చేపట్టిన సత్యాగ్రహం కార్యక్రమంలో రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జన్మభూమి సాక్షిగా టీడీపీ పాలన బట్టబయలవుతుందని అన్నారు. ఈ జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలపై నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. -
బెజవాడను మాఫియా సిటీగా చేస్తారా... బాబూ
-
బెజవాడను మాఫియా సిటీగా చేస్తారా... బాబూ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. రాజధాని భూ మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్, సాండ్, శాండిల్, పొలిటికల్, కార్పొరేట్ మాఫియాలు ఉన్నాయని విమర్శించారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు, చంద్రబాబు అనుచరులు గబ్బిలాల మాదిరిగా విజయవాడ పరిసర ప్రాంతాలలో కబ్జాలు చేస్తున్నారని ద్వజమేత్తారు. ఈ రోజు విజయవాడ సమీపంలో జరిగిన హత్యలు కూడా ఈ నేపథ్యంలోనే జరిగాయన్నారు. చంద్రబాబు మాఫీయా సిటీ తయారు చేయబోతున్నారా అంటూ తమ్మినేన్ని సీతారాం సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. -
కేసీఆర్, చంద్రబాబులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: నిన్న కాక మొన్న కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మొత్తం 12 మంది కేంద్ర మంత్రులు, 44 సహాయ మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైయ్యాయి. అయితే ఏడుగురు కేంద్ర మంత్రులపై అత్యంత భయంకరమైన క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు 'ది అసోసియేషన్ ఆఫ్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్' అనే సంస్థ శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్ల కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదైన వారి జాబితాను ఈ సందర్బంగా ఏడీఆర్ విడుదల చేసింది. అందులోభాగంగా కేసీఆర్, చంద్రబాబులపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.తెలంగాణలో అత్యథికంగా 90 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత స్థానాలు వరుసగా 56 శాతంతో ఆంధ్రప్రదేశ్, 34 శాతంతో కర్ణాటక, 27 శాతంతో ఒడిశాలు ఉన్నాయని తెలిపింది. మిజోరాం, మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు చెందిన చెందిన ఒక్క మంత్రిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. -
'చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి'
విశాఖపట్నం: శ్వేతపత్రం పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, శ్వేతపత్రం పరిశీలన కమిటీ ఛైర్మన్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం విశాఖపట్నంలో చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలపై కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఇప్పటికైనా చంద్రబాబు నిజాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 2004 నుంచి 2014 వరకు రైతులకు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాకుండా తమ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇచ్చిందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలోని రైతులు, మహిళలు మైక్రో ఫైనాన్స్ బారిన పడతారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. -
టీడీపీలోని బడా వ్యాపారుల కోసమే 'తాత్కాలిక రాజధాని'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించడం తగదని రాయలసీమ రాజధాని సాధన సమితి (ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్) అభిప్రాయపడ్డింది. గురువారం హైదరాబాద్‌లో ఆ సంస్థ ప్రతినిధులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... టీడీపీలోని బడా వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రకటన చేసిందని ఆరోపించారు. రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే మరో ఉద్యమం రాష్ట్రంలో ఉద్బవిస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అములు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల రుణమాఫీకి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం... విజయవాడలో భూ సేకరణకు రూ. 40 వేల కోట్లు ఎలా పెడుతున్నారని ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆగస్టు 16న ధర్నా చౌక్‌లో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తామని వారు వెల్లడించారు. -
బాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి
అనంతపురం: ఎన్నికల నేపథ్యంలో రైతులకు రుణ మాఫీ హమీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బ్యాంక్ అధికారులు రైతులు, మహిళల బంగారం, వ్యవసాయ పనిముట్లు వేలం వేస్తున్నా... సీఎం చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీ చేయకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలకు బకాయిదారులుగా మిగిలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని వజ్రకరూర్ బ్యాంక్ అధికారులను వై. విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. -
బాబు చైనా పర్యటనకు వస్తారు!
* బీజింగ్‌లో భారత దౌత్యాధికారికి లేఖ రాసిన సీఎం పేషీ * కేంద్రం ద్వారా కోరాలంటూ తిప్పి పంపిన దౌత్యాధికారి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం తప్పటడుగు వేసింది. సీఎం చైనాలో పర్యటించాలనుకుంటున్నారని, అందుకు అనువైన కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి నేరుగా సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి అజయ్‌సహాని లేఖ రాశారు. అయితే ఆ విధంగా లేఖ రాయడాన్ని బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి తప్పుబట్టారు. నేరుగా భారత దౌత్యాధికారికి లేఖ రాయకూడదని, తొలుత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారానే చైనా పర్యటనకు ప్రయత్నించాలని భారత దౌత్యాధికారి స్పష్టం చేస్తూ తిరిగి సీఎం కార్యాలయానికి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
బాబు బస్సుకు రూ.10 కోట్లు!
బుల్లెట్‌ప్రూఫ్ వోల్వో కొనుగోలుకు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటన కోసం సకల సౌకర్యాలతో కూడిన బుల్లెట్‌ప్రూఫ్ వోల్వో బస్సును కొనుగోలు చేయనున్నారు. సాధారణ వోల్వో బస్సు ఖరీదే సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుంది. ఇక సీఎం సేద తీరేందుకు, అదనపు సౌకర్యాలను కల్పించేందుకు, బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దేందుకు రూ. 10 కోట్లు పైగా వ్యయం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారులతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోనుంది. -
రాజన్నకు రక్షాబంధన్!
సోదరీ సోదరుల అనురాగం, అప్యాయతలు, అనుబంధం, రక్షణకు ప్రతీక... రాఖీ పౌర్ణమి (రాక్షాబంధన్). ఆ పర్వదినం నేడే. ఈ నేపథ్యంలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ స్మరించుకుంటుంది. కుటుంబంలో ఓ మహిళ ఆర్థికాభివృద్ధి సాధిస్తే కుటుంబం మొత్తం ప్రగతి పథంలో పయనిస్తుందని మనసా వాచా కర్మణ నమ్మె వ్యక్తి వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఓ సోదరుడిగా ఆయన తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వులు చిందించాలని ఆకాంక్షించారు. అందుకు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులోభాగంగా అభయహస్తం, పావల వడ్డీకే రుణాలు, వితంతువులకు పెన్షన్లు, విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్తోపాటు పలు పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలు లబ్ది పొందారు. ఆ మహిళల ఇంట ఆనందం తాండవమాడింది. అంతలో ఆ మహానేత ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఆ పథకాలను నిర్లక్ష్యం చేశారు. దాంతో మహిళల ఇళ్లలో చీకట్లు అలముకున్నాయి. వైఎస్ఆర్ ఉండిఉంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు తమకు కొండంత అండగా ఉండేవని మహిళలంతా అనుకుంటున్నారు. ఓ సోదరుడిగా తమ కుటుంబాలలో వెలుగులు నింపినందుకు రాఖీ పౌర్ణమి రోజైన ఈ రోజు (ఆదివారం) తెలుగునేలపై ఉన్న మహిళలంతా ఆ మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి తిలకం పెట్టి, రక్షాబంధన్ ఉంచారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ఆర్ సమాధి వద్దకు ఆదివారం అధిక సంఖ్యలో మహిళలు విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన సమాధి వద్ద రాఖీలని ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రానికి మహానేత చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. -
టీ తమ్ముళ్లకు బాబు 'బిస్కెట్లు'
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు రింగరింగామంటూ దూసుకొస్తున్నాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆ ఎన్నికల్లో 'కారు' బ్రేకులు కత్తిరించి, 'చెయ్యి'ని నేలమట్టం చేసి సైకిల్‌తో దూసుకుపోవాలని వ్యూహా రచన చేస్తున్నారు. అందుకోసం గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేల (టి తమ్ముళ్లకు) తో గత వారంలో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 29 స్థానాలకు గాను15 స్థానాలు బీజేపీ పొత్తుతో కైవసం చేసుకున్నాం... ఇదే ఊపు ఉత్సాహంతో బీజేపీతో పొత్తు లేకుండా ముందుకు వెళ్లితే గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలుపు మనదేనంటూ తమ్ముళ్లను ఉత్సాహపరిచారు. బల్దియా పీఠం కైవసం చేసుకుంటే.... నజరానాలు ఎలా అందనున్నాయో కూడా బాబు గారు ఈ సందర్భంగా విశదీకరించి మరీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక దేవాలయాలు గల జిల్లా చిత్తూరు. ఆ జిల్లాలోని టీటీడీ దేవాలయం, కాణిపాకం వినాయక స్వామి దేవాలయాల మొదలు .... కర్నూలు జిల్లా శ్రీశైలం, విజయవాడలోకి శ్రీకనకదుర్గ దేవాలయ పాలకమండళ్లలో ఛైర్మన్ , సభ్యులుగా నియమిస్తానంటూ భరోసా ఇచ్చేశారు. దాంతో దేవుని సేవలో తరించి పోవచ్చని తెలంగాణలోని పచ్చ తమ్ముళ్లు తెగ సంబరపడిపోతున్నారు. అయితే బాబుగారు ఓ విషయం మాత్రం గమనించినట్లు లేదు.... తెలంగాణ ప్రాంతానికి చెందిన భక్తులు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖలు తీసుకుని తిరుమలకు వెళ్తుంటే ... టీటీడీ అధికారులు 'ఆ సిఫార్సు' లేఖలను చించి బుట్టలో వేస్తున్నారు. అంతేందుకు సాక్షాత్తూ చంద్రబాబు కేబినెట్లోని దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు సిఫార్సు లేఖను తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు నాలుగు రోజుల కిత్రం ఊఫ్ మని గాలికి ఊదేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనతో మంచి కాక మీద సీమాంధ్రులు ఉన్నారు. అదికాక ఆంధ్రప్రదేశ్‌లోని పచ్చపార్టీ నిరుద్యోగులు ఆ దేవాలయాల్లోని పాలక మండలి పదవుల కోసం కళ్లు కాయలు చేసుకుని ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లోని పాలక మండళ్లలో తెలంగాణ పచ్చ తమ్ముళ్లను నియమిస్తే ఉరుకుంటారా అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుతమ్ముళ్లు తెగ చెవులు తెగ కోరికేసుకుంటున్నారు. -
పిల్లల ఫీజు కట్టలేరు కానీ సింగపూర్ కడతారా ?
హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ. జయశంకర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రొ.జయశంకర్ జయంతి సందర్బంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సిన సంస్థలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసీఆర్ ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. మీ బతుకులు మీరు బతకండి... మా బతకులు మేం బతుకుతామంటూ ఆంధ్ర ప్రభుత్వానికి, నాయకులకు సూచించారు. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం, మంత్రులు తెగ గోప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్ కడతామని చెబుతున్న మీరు పిల్లల ఫీజులు కట్టలేరా అంటు కేసీఆర్ ఆంధ్ర సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. -
'రాజధాని ఎంపికలో బాబుది రహస్య ఏజెండా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపికలో చంద్రబాబు సర్కార్‌కు రహస్య ఏజెండా ఉన్నట్లుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. అందుకే తనవారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాజధానిపై బాబు కమిటీ వేశారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో రఘువీరా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై రఘువీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ఎంపిక ఏకాభిప్రాయంతోనే జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని ఎంపికపై ఏర్పాటు అయిన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రజలముందు పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఎంసెట్ అడ్మిషన్లలో రాజకీయ లాభాపేక్ష సరికాదని సుప్రీంకోర్టు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఆక్షేపించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకుని సమస్యలు పరిష్కరించాలని రఘువీరా ఇరు రాష్ట్రాల సీఎంలను కోరారు. ఇరు రాష్ట్రలలో సమస్యల పరిష్కారానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. విభజన చట్టం ప్రకారం అడ్మిషన్లలో స్థానికత అంశం తలెత్తదన్నారు. పీజు రీయింబర్స్మెంట్ పథకం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా అయితే 35 వేల మంది విద్యార్థుల ఫీజు భారాన్ని చంద్రబాబు ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని కాలేజీ విద్యార్థుల ఫీజు కూడా చెల్లించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు రఘువీరా సూచించారు. -
మోనార్క్ చంద్రబాబు.. బీద అరుపులు
తనకన్నీ తెలుసునని, తాను మోనార్క్‌నని చెప్పి, ఎన్నికల్లో పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీద అరుపులు అరుస్తున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. చిన్న సమస్యను జటిలం చేస్తూ రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీల పాలనపై తాము డేగకన్ను పెడతామని రఘువీరారెడ్డి చెప్పారు. సెప్టెంబర్‌లో కాంగ్రెస్ శ్రేణుల శిక్షణ తరగతులకు సోనియా, రాహుల్ హాజరవుతారని ఆయన తెలిపారు. -
ఐదో శ్వేతపత్రం విడుదల చేయనున్న బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై శ్వేతపత్రాల విడుదల పరంపర కొనసాగుతోంది. తాజాగా మానవ వనరుల శాఖపై శ్వేతపత్రాన్ని గురువారం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు ఆ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు వారానికి ఓ శాఖ చొప్పున విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక శాఖ, నీటి పారుదల రంగంపై శ్వేతప్రతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కూడా చంద్రబాబు ఈ రోజు సమావేశమైయ్యారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లతో బాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత అవినీతి నిర్మూలనపై మంత్రి వర్గ ఉపసంఘంతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.00 గంటలకు పలువురు ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. -
విశాఖ రాజధాని కాకుండా బాబు అడ్డుపుల్ల
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం రాజధాని కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైజాగ్ సిటిజన్ ఫోరం ఆరోపించింది. మంగళవారం విశాఖపట్నంలో రాజధాని ఎంపికపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీపై సిటిజన్ ఫోరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేసేందుకు విశాఖపట్నం నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది. రాజధాని ఎంపికపై ఏర్పాటైన ప్రొ. శివరామకృష్ణన్ కమిటీ విశాఖలో గతంలో పర్యటించిందని ఫోరం ఈ సందర్బంగా గుర్తు చేసింది. ఆ సమయంలో రాజధానిగా విశాఖపట్నం నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని కమిటీ చెప్పిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు కాకుండా చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. -
''చంద్రబాబుకు రిజర్వు బ్యాంక్ షాక్''
-
రుణమాఫీ చేయకుండానే సంబరాలా ?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాపీపై మొదటి సంతకం చేస్తానంటూ ప్రకటించిన చంద్రబాబు... ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని సీపీఐ నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. కానీ రుణమాఫీ చేసినట్లు పచ్చ పార్టీ నేతలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం గుంటూరు నగరంలోని కొత్తపేటలో సీపీఐ కార్యాలయంలో రైతు సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు రుణాలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి... వారికి కూడా రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులకు ఆదేశించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. -
బాబు గారు ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి
అధికారాన్ని 'విషం'గా అభివర్ణించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ముఖ్యమంత్రి పీఠం ముళ్లకిరీటం అంటూ సచివాలయ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నిజమే అధికారం ముళ్ల కిరీటమే. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. తెలిసినప్పుడు మళ్లీ ముళ్లకిరీటం అందుకోవాలని ఎందుకు తహతహలాడినట్లు? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా గతంలో లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని ఆయన భావించినట్లు ఉన్నారు. అందుకే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు కైవనం చేసుకోగా బాబు తెగ ఖుషీ ఖుషీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకు మెల్లగా అర్థమవుతున్నాయి. దాంతో బాబులోని వేదాంతి బయటకు తన్నుకొచ్చినట్లు ఉన్నాడు. అందుకే సీఎం పీఠం ముళ్ల కిరీటం అంటూ వేదాంతాలు పలుకుతున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెలన్నర అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాలన ప్రారంభమైంది లేదు. అదికాక ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదు. ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన హమీపై నేటికి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇవాళో రేపో రుణమాఫీపై బాబు ప్రకటన చేస్తారంటూ రైతులు ఎదురు చూస్తున్నారు. ఆ అంశంపై కమిటీ వేశాం... నివేదిక వస్తుంది... అంటూ చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు. దాంతో రైతులకు రుణమాఫీ చేయాలంటూ చంద్రబాబును ప్రతిపక్షాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అదే అంశంపై ప్రతిపక్షాలు చంద్రబాబుపై రోజురోజూకు ఒత్తిడి పెంచుతున్నాయి. మరో పక్క మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు రుణమాఫీపై మీ నాయకుడు ఏం చేశారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. దాంతో సదరు నాయకులు తమతమ నియోజకవర్గాల్లో ప్రజలకు మోహం చూపించలేక పోతున్నామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. రోలు వచ్చి మద్దెలతో దరువు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. రైతులు, సొంత పార్టీ నాయకులు, ప్రతిపక్షాలకు రైతు రుణమాఫీపై ఏం చెప్పాలో అర్థం కాక చంద్రబాబు తలను గోడకు బాదుకుంటున్నారు. సీఎంగా మరోమారు ఎన్నికైనందుకు నవ్వాలో లేక ఏడవాలా తెలియని పరిస్థితి బాబులో నెలకొంది. అందుకే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న ఠీవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆ విషయం చంద్రబాబు తీరులోనే ఇట్టే స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠంపై అధిష్టించిన ఆయనకు ముళ్ల మీద కుర్చునట్లుంది. ఆ విషయాన్ని వెల్లడిస్తే బాగోదని అనుకున్నారో ఏమో పాపం చంద్రబాబు సీఎం పీఠం బంగారమని అందరూ అనుకుంటారు కానీ ... ముళ్ల కిరీటం అంటూ బాబు సెలవిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు శనివారం విజయవాడలో ఏపీఎన్జీవోలు ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు 'సీఎం పీఠం'పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. -
అంత అనుభవం ఉన్న మీరు ఇలా చేస్తారా ?
రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ... రైతు రుణమాఫీ చేస్తామంటూ చంద్రబాబు కాలయాపన చేయడంతో రైతుల్లో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా పని చేశానని... తనకు అపార అనుభవం ఉందని చెప్పుకునే మీకు రుణమాఫీ హామీ ఇచ్చేముందు పరిస్థితి తెలియలేదా అంటూ చంద్రబాబును రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. గతంలో సీఎంగా పని చేసిన మీరు ఇలా చేస్తారా అంటూ చంద్రబాబుని రామకృష్ణ నిలదీశారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కలసి కూర్చొని చర్చించాలని చంద్రబాబు, కేసీఆర్‌లకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు అంశంలో సహకరించాలని తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలదే అని రామకృష్ణ స్సష్టం చేశారు.