
Mahesh Babu Mass Dialogues In Sarkaru Vari Pata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్లో మహేశ్ బాబు లుక్స్, డైలాగ్లు, డైలాగ్ డెలివరీ అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా ట్రైలర్లో మహేశ్ చెప్పిన డైలాగ్లు బాగా పేలాయి. 'నువ్ నా ప్రేమను, స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బును దొంగలించలేవ్', 'నేను విన్నాను.. నేను ఉన్నాను', 'వంద వయగ్రాలు వేసి శోభనానికి ఎదురుచూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చార్రా', 'దిస్ ఈజ్ మహేశ్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలుప్పాడ బీచ్ సర్' వంటి తదితర డైలాగ్లు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాటలను.. కూడా ఈ మూవీలో వాడారు.
చదవండి: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Comments
Please login to add a commentAdd a comment