
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌లోని సీన్లు, డైలాగ్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
SVP Trailer: Hyderabad Police Awareness With Helmet Scene: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇటీవల విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌లోని సీన్లు, డైలాగ్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ ట్రైలర్‌లోని సీన్లు ప్రేక్షకులనే కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులను సైతం బాగా ఆకర్షించాయి. ఈ మూవీ ప్రచార చిత్రంలో ఓ సన్నివేశంలో విలన్‌కు హెల్మెట్ పెడుతూ డైలాగ్ చెప్తాడు మహేశ్ బాబు. ఈ సీన్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ అకౌంట్ నిర్వాహకులు బాగా వాడారు. మూవీలోని ఈ సీన్‌కు క్రెడిట్ ఇస్తూ హెల్మెట్ ధరించండి, భద్రత ముఖ్యం అంటూ ట్వీట్ చేశారు. సాధారణంగానే బాగా వైరల్ అయిన సీన్లు, సాంగ్స్, హుక్ స్టెప్స్లను మార్ఫింగ్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ట్రైలర్లోనే హెల్మెట్ ధరించడం ఉండేసరికి వీడియో పోస్ట్ చేస్తూ కొటేషన్స్‌తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం
మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట
#WearHelmet #SafetyFirst
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 2, 2022
Vc: SarkaruVaariPaataTrailer pic.twitter.com/Npgg05zeXs