
Mahesh Babu Sarkaru Vaari Paata Murari Vaa Song Released: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆడియెన్స్ మళ్లీ మళ్లీ చూసేలా, మరింత చేరువయ్యేలా 'మురారి వా' అనే సాంగ్‌ను యాడ్ చేసింది చిత్రబృందం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ పాటను రిలీజ్ చేసింది.
ఈ పాటలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ కాస్ట్యూమ్స్, డ్యాన్స్, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మహేశ్, కీర్తి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అంతేకాకుండా కీర్తి సురేశ్‌ను చాలా గ్లామరస్‌గా చూపించారు. ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించగా శ్రుతి రంజని, ఎంఎల్ గాయత్రి, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది.
చదవండి: 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
Comments
Please login to add a commentAdd a comment