new song
-
మరికొన్ని గంటల్లో కిస్సిక్ సాంగ్ సెన్సేషన్.. యూట్యూబ్ బ్లాస్ట్ పక్కా
-
'యుద్ధానికి సిద్ధం' జగనన్న కొత్త పాట..
-
జగనన్న కొత్త పాట..!
-
మరో కొత్త పాటను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ
-
వి లవ్ జగన్... కొత్త పాట రిలీజ్
-
వస్తున్నాడు అదిగో...సీఎం జగన్ కొత్త పాట
-
అభిమానుల కోసం కొత్త పాట ‘సిద్ధం’ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్సీపీ కొత్త ఊపు తీసుకొచ్చింది. అభిమానుల కోసం కొత్త పాట ‘సిద్ధం’ను విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన, విపక్షాల కుట్రలకు ‘సిద్ధం’ పాట అద్ధం పడుతోంది. ప్రస్తుతం ‘సిద్ధం’ పాట సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఇక.. ఇప్పటికే విడుదలైన ‘జగనన్న అజెండా’ పేరుతో విడుదలైన వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాట యువత, వైఎస్సార్సీపీ శ్రేణులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాట వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై విపరీతంగా షేర్ చేస్తున్నారు. ‘‘మీబిడ్డ ఒక్కడే ఒక వైపు ఉన్నాడు.. చెప్పుకోవడానికి ఏమీ లేని వాళ్లంతా ఏకం అవుతున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి, మీరే సైనికులుగా కదలండి’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాయిస్‌తో మొదలయ్యే ఈ పాటను నల్లగొండ గద్దర్ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. జగనన్న అజెండా సాంగ్….🎵🎶 Jagananna Agenda Full Song…@ysjagan @JaganannaCNCTS#JaganannaAgenda#YSJagan#YSJaganAgain#YSRCPNewSong#YSJaganNewSong pic.twitter.com/dhD4joKIOZ — YSR Congress Party (@YSRCParty) January 13, 2024 -
సిద్ధం సాంగ్..పూనకాలు లోడింగ్
-
గుంటూరు కారం నుండి రమణ ఎయ్ పాట రిలీజ్
-
దుమ్ములేపుతున్న జగనన్న కొత్త సాంగ్..ఎలక్షన్ 2024
-
'ఫైటర్' నుంచి మరో సాంగ్ రిలీజ్.. వింటుంటే అలా!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. వార్, పఠాన్ చిత్రాలతో అలరించిన సిద్ధార్థ్ ఆనంద్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాట విడుదల చేశారు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!) ఇప్పటికే 'ఫైటర్' మూవీ నుంచి టీజర్, సాంగ్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అలానే అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా 'హీర్ ఆస్మాని' అని మరో పాటని రిలీజ్ చేశారు. ఎయిర్‌ఫోర్స్ పైలెట్ లుక్‌లో హృతిక్ రోషన్ వావ్ అనిపిస్తున్నాడు. పాట కూడా వినసొంపుగా ఉంది. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా దీపికా పదుకొనే కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
నేను చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలంటే?
-
శంకర్- రామ్‌చరణ్ సినిమా; పది కోట్ల పాట?
దర్శకుడు శంకర్ సినిమాల్లో సాంగ్స్ విజువల్స్ పరంగా, లొకేషన్స్ పరంగా చాలా గ్రాండియర్‌గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ మరో గ్రాండియర్ సాంగ్‌ను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే శంకర్ పది కోట్ల బడ్జెట్‌తో పాట ప్లాన్ చేశారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతుందట. హీరో రామ్‌చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలపై గ్రాండ్‌గా డ్యూయట్ సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ పాటకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైనే బడ్జెట్‌ను కేటాయించారట. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చుతారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతదర్శకుడు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'మురారి వా' సాంగ్ వచ్చేసిందిగా..
Mahesh Babu Sarkaru Vaari Paata Murari Vaa Song Released: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆడియెన్స్ మళ్లీ మళ్లీ చూసేలా, మరింత చేరువయ్యేలా 'మురారి వా' అనే సాంగ్‌ను యాడ్ చేసింది చిత్రబృందం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ పాటను రిలీజ్ చేసింది. ఈ పాటలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ కాస్ట్యూమ్స్, డ్యాన్స్, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మహేశ్, కీర్తి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అంతేకాకుండా కీర్తి సురేశ్‌ను చాలా గ్లామరస్‌గా చూపించారు. ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించగా శ్రుతి రంజని, ఎంఎల్ గాయత్రి, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. -
అరబిక్ కుత్తు ఎన్టీఆర్ వర్షన్
-
ప్రేమికుల దినోత్సవం కానుకగా లవ్ సాంగ్ రిలీజ్
-
గంగూబాయి నుంచి న్యూ వీడియో సాంగ్ రిలీజ్
-
స్టాండప్ కమెడియన్ ప్రేమలో పడితే..
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. ‘పద..’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటను హీరోయిన్ రష్మికా మందన్న మంగళవారం విడుదల చేశారు. నలుగురు స్నేహితుల రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. స్వీకర్ అగస్తి ట్యూన్ అందించగా, యాజిన్ నిజర్ పాడారు. రెహమాన్ సాహిత్యం అందించారు. ‘‘జీవితంలో ఏ విషయానికి కూడా స్థిరంగా నిలబడడానికి ఇష్టపడని వ్యక్తి స్టాండప్ కమెడియన్‌గా మారతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురయినప్పుడు ఎలా కష్టపడాల్సి వస్తుంది? అన్నదే చిత్రకథ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సిద్ధు ముద్ద. -
సుమ 'జయమ్మ' లిరికల్ వీడియో సాంగ్.. వచ్చేసిందిగా
Suma Kanakala Jayamma Song Lyrical Video Released By SS Rajamouli: బుల్లితెర యాంకర్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతి గడించింది సుమ కనకాల. స్మాల్ స్క్రీన్‌పై వ్యాఖ్యతగా రాణిస్తూనే తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ఈ సినిమాకు విజయ్ కలివారపు దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి సాంగ్ అయిన తిప్పగలనా.. చూపులు నీ నుంచే పాటను నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. రామాంజనేయులు రాసిన ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్‌ను విడుదల చేశారు. 'జయమ్మ పంచాయితీ' చిత్రంలోని జయమ్మ లిరికల్ సాంగ్ వీడియోను దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 'కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం' అంటూ సాగే ఈ సాంగ్‌లో జయమ్మ పాత్ర జీవనశైలి, స్వభావం ఎలా ఉంటుందో చూపించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ ఆలపించారు. అక్కడక్కడా పాట మధ్యలో సుమ కనకాల కూడా తన గాత్రం అందించింది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బలాగ్ ప్రకాశ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకులముందుకు వచ్చి సందడి చేయనుంది 'జయమ్మ పంచాయితీ'. జయమ్మ, చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ! Happy to Launch #JayammaJayamma song from #JayammaPanchayathi ▶️https://t.co/esGUewjy0R Best wishes to @ItsSumaKanakala & Team @mmkeeravaani @srikrisin @ramjowrites @VijayKalivarapu @Anushkumar04 @PrakashBalaga @vennelacreation @AdityaMusic — rajamouli ss (@ssrajamouli) January 16, 2022 ఇదీ చదవండి: సుమ ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళ -
తొలి ప్రేమే పుట్టిందంటున్న రాజశేఖర్!
రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శేఖర్’. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ‘శేఖర్’ చిత్రంలోని ‘ప్రేమ గంటే మోగిందంట’ పాటను విడుదల చేశారు. ‘‘బొట్టు పెట్టి.. కాటుక ఎట్టి వచ్చిందమ్మా సిన్నది... బుగ్గ మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతున్నది..’’ అంటూ మొదలైన ఈ పాట ‘డండ డండ డండ లవ్గంట మోగిందంట... తొలి ప్రేమే పుట్టిందంట’ అంటూ సాగుతుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ పాడారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరకర్త. ‘‘ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జీవితా రాజశేఖర్. -
నాకోసం మారావా నువ్వూ!
‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది ఉపశీర్షిక. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నాకోసం మారావా నువ్వూ, లేక నన్నే మార్చేశావా నువ్వూ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేశారు. ప్రేయసి కృతీశెట్టి కోసం నాగచైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. బాలాజీ రచించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా, అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించారు. ‘నా కోసం..’ పాటకి మంచి స్పందన వస్తోంది’ అని చిత్రయూనిట్ తెలిపింది. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్. -
యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్న ‘అతిథి దేవోభవ’ మెలోడీ
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం ‘అతిథి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నువేక్ష నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే.. బాగుంటుంది ఊసులాడితే’ అనే పల్లవితో సాగే ఈ మెలోడీ వినసొంపుగా ఉంది. భాస్కరభట్ల అందించిన లిరిక్స్ ఆకట్టుకోగా, సిద్ శ్రీరామ్, నూతన మోహన్ వాయిస్ దానికి అదనపు ఆకర్షణని తెచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా ఈ లిరికల్ వీడియో సైతం యూత్‌ను విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. చదవండి: క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో `కిరాతక’, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే.. -
‘ఏవమ్ జగత్’ సాంగ్ విడుదల చేసిన 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య
కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఏవం జగత్’. దినేష్ నర్రా దర్శకుడు. మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు.ఎన్, రాజేశ్వరి.ఎన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘రాధాస్ లవ్’ సాంగ్ ని 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ల విడుదల చేసింది. శివ కుమార్ మ్యూజిక్ అందించగా సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ పాడారు. పాటను విడుదల చేసిన అనన్య చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ.. ‘వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావాల్సిన ఆహార అవసరాలు తీర్చేంతా సాగు భూమి కానీ, పండించే అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా 'ఏవం జగత్' మూవీలో చూపిస్తున్నాం. వ్యవసాయం, మానవ సంబంధాలతో ముడిపడిన అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఓ 20 ఏళ్ల యువకుడి కథే మా సినిమా’ అని తెలిపారు. కాగా త్వరలోనే సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. -
దుమ్మురేపుతున్న రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చాస్ కా గణేశ్’ పాట
సాక్షి, వెబ్‌డెస్క్: వినాయక చవితి సందర్భంగా పలు సంస్థలు, గాయకులు కొత్త పాటలు విడుదల చేశారు. తాజాగా ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత లక్ష్మణ్ రాసిన పాటకు ప్రముఖ గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్ విడుదలైంది. మధుప్రియ కూడా ఓ పాట రూపొందించి విడుదల చేసింది. ఇక తాజాగా ‘బిగ్ బాస్ 3’ విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఓ జబర్దస్త్ పాటతో వచ్చాడు. వేంగి సుధాకర్ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్ కా గణేశ్’ పాటకు రాహుల్ దుమ్ములేపేలా పాడాడు. నిఖిల్, హరిణ్య రెడ్డి కోటంరెడ్డి సమర్పించిన ఆ పాట గణపతి మండపాల్లో మార్మోగుతోంది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అయితే ఈ పాటలో రాహుల్‌కు బిగ్‌బాస్‌లో దోస్తీ అయిన అలీ రెజా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి ధూమ్‌ధామ్‌గా డ్యాన్స్ చేశారు. శిరీశ్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్ విడుదల చేసిన ‘గల్లీకా గణేశ్’ పాట మాదిరి ఈ పాట కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. -
‘బుల్లెట్టు బండి’ వధువుకు అద్భుత అవకాశం
తెలంగాణ యాసలో ఎంతో మధురంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాటకు ఓ వధువు తన పెళ్లి బరాత్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఒక జానపదం పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ఆ డ్యాన్స్ చేసిన యువతికి ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఏ పాటకైతే డ్యాన్స్ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయ వివాహం రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన జరిగింది. అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. (చదవండి : బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?) అయితే ఆమె డ్యాన్స్ చేసిన పాటను నిర్మించిన సంస్థ బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్. రచయిత లక్ష్మణ్ సాహిత్యానికి ఎస్కే బాజి సంగీతం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఆ పాటను అద్భుతంగా తెరకెక్కించిన బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయిశ్రీయతో నిరూప ఫోన్లో మాట్లాడారు. (చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు) ‘మా సంస్థలో నిర్మించే తదుపరి పాటకు నువ్వే క్యాస్ట్‌గా (నటించడం) చేయాలి’ అని చెప్పగా సాయిశ్రీ ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అంత పెద్ద అవకాశం రావడంతో సాయిశ్రీయ కాదనలేకపోయింది. దీంతో సాయిశ్రీయ త్వరలోనే ఆమె ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది. బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆవిర్భవించి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ సంస్థ గతంలో అనేక పాటలు రూపొందించింది. రాహుల్ సిప్లిగంజ్, నోయల్‌తో పాటలు పాడించింది. ‘బుల్లెట్ బండి’ పాటతో ఆ సంస్థకు మంచి క్రేజ్ ఏర్పడింది. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
న్యూ లవ్‌లో Freshగా పడ్డానంటున్న విశ్వక్సేన్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘‘ఈ సింగిల్ చిన్నోడే.. న్యూ లవ్వులో ఫ్రెష్షుగా పడ్డాడే.. సిగ్నల్ గ్రీనే చూశాడే.. పరుగులు పెట్టాడే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటని రధన్ స్వరపరచగా బెన్నీ దయాల్ పాడారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు. ‘‘మ్యూజికల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. హీరో ప్రతిసారీ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడడం.. ఆ ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సందర్భంలో వచ్చే పాట ఇది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మణికందన్ , సంగీతం: రధన్ . -
ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేలా ఉంది
ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై ప్రొడక్షన్ నెం.1గా అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా `పీనట్ డైమండ్`.. అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటించారు. వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించగా `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ఆ టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఒకేసారి రెండు టైం లైన్స్ లో జరిగే కథగా తెరకెక్కుతుండగా జె. ప్రభాకర రెడ్డి ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. `పీనట్ డైమండ్` సినిమా టైటిల్ చాలా వెరైటీ గా ఉంది.. సినిమా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా..టీజర్ చూశాను.. ఎంతో ఆసక్తికరంగా ఉంది.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేలా ఉంది.. నేను రిలీజ్ చేసిన పాట ఎంతో వినసొంపుగా ఉంది.. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.. ఈ పాట కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. -
మెలోడియస్ ‘ఏ జిందగీ’ లిరికల్ సాంగ్ రిలీజ్..
యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఏ జిందగీ’ అంటూ ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై..ఆలోచనంతా ఆరాటమై..అన్వేషిస్తోందే'.. ఈ రోజుకై అంటూ సాగే ఈ మెలోడియస్ సాంగ్ ఆకట్టుకుంటుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను హనియా నఫీసా, గోపీసుందర్ పాడారు. గోపీ సుందర్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం షరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్19న విడుదల కానుంది. చాన్నాళ్లుగా హిట్ కోసం ఆరాటపడుతున్న అఖిల్‌కు ఈ సినిమాతో అయినా హిట్ ఖాతాలో పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : అఖిల్ మూవీ పై నాగ్ షాకింగ్ కామెంట్స్ ఆ స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ -
ప్రేమని నిలబెట్టుకునేందుకే ఆ జంట ఏం చేస్తుందంటే..
ఎవరు భర్త అవుతారో, ఎవరు భార్యగా వస్తారో తెలియకపోవడమే జీవితంలో మేజిక్. ఆ తరవాత ఒకరికోసం ఒకరు అనే భావన ఏర్పరచుకోవడం మరో మేజిక్. 'స్టార్ మా' సరికొత్తగా ప్రారంభించబోతున్న ధారావాహిక కోసం ముందుగా విడుదల చేసిన పాట సంచలనం సృష్టిస్తుంది. ఇది కేవలం రెండు ముఖ్యమైన పాత్రల పరిచయం. ఏ సిరులూ తన సుగుణాలతో సరితూగవని అమ్మాయి... నా కలలను నీ కనులతో చూడాలని ఆశ పడే అబ్బాయి... ఎంత అందంగా వుంది ఈ ఊహ. పాత్రల పరంగా అది పూర్తిగా నిజం. అలా పాట అంతా జీవితాన్ని అందమైన కోణం లో చూసిన ఇద్దరి ఆలోచనలు వినిపిస్తాయి. కనిపిస్తాయి. ఆ ప్రేమని నిలబెట్టుకునేందుకే ఆ జంట ప్రయత్నించి నిలబడుతుంది. ఈ నెల 22న (సోమవారం) ఈ సీరియల్ ప్రారంభం అవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది. చదవండి : చిరంజీవి పాటకు స్టెప్పులేసిన బిగ్‌బాస్ భామ, ఫ్యాన్స్ ఫిదా -
‘వకీల్ సాబ్’ నుంచి మరో సాంగ్ విడుదల
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వకీల్‌సాబ్’. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి కంటి పాప..కంటి పాప అనే పాట విడుదలయ్యింది.రామ జోగయ్యశాస్ర్తి రచించిన ఈ పాటను బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడారు. సాంగ్ రిలీజ్ అయిన కాసేపట్లోనే వేలసంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అయితే ముందుగా ప్రకటించిన సమయం కాకుండా కొంచెం ఆలస్యంగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. టెక్నికల్ కారణాల వల్ల సాంగ్ రిలీజ్ కొంచెం ఆలస్యమవుతుందని చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. ఇక బాలీవుడ్లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి : (పవన్ కల్యాణ్ న్యూలుక్.. ఫొటో వైరల్) (ఆ టైంలో డిప్రెషన్‌కు లోనయ్యా : హీరోయిన్) -
మార్పు కోసం పాట
సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువ అయిపోతున్నాయి. వీటన్నింటి గురించి ప్రస్తావించాలనుకున్నారు గాయని నేహా బాసిన్. ఓ పాట ద్వారా ఈ విషయాలను ప్రస్తావించారు. ‘జనతా గ్యారేజ్’లో ‘యాపిల్ బ్యూటీ...’, ‘జై లవకుశ’ లో ‘స్వింగ్ జరా స్వింగ్ జరా..’ పాటలతో తెలుగులోనూ పాపులర్ అయ్యారు నేహా. తాజాగా ‘కేందే రేందే’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్‌ను రికార్డ్ చేశారామె. ఆన్లైన్ ట్రోల్స్, లింగ వివక్ష, బంధుప్రీతి, శరీరాకృతిని విమర్శించడం వంటి అంశాలతో ఈ పాట ఉంటుంది. ‘‘ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా ఈ అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా సరే... మగవాళ్లు ఇలా ఉండొచ్చు, ఆడవాళ్లు ఇలానే ఉండాలి అనే మనస్తత్వం మారాలి. ఆ మార్పు కోసం నా పాట ఉపయోగపడాలనుకున్నాను. అందుకే ఈ పాట చేశాను’’ అన్నారు నేహా బాసిన్. -
90 రోజులైంది..ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ!
సాక్షి,ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాలమరణం కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ లోకాన్ని వీడి మూడు నెలలు కావస్తున్నా అతని జ్ఞాపకాలు మాత్రం ప్రతీక్షణం సుశాంత్ తోబుట్టువులను వెన్నాడుతున్నాయి. అనుక్షణం భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ తన సోదరుడు తమను వీడి 90 రోజులైన సందర్భంగా ఒక కొత్త పాటను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుశాంత్ భౌతికంగా దూరమై 90 రోజులు అయింది. మన జీవితాల్లో సుశాంత్ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే. ఉనికిని గౌరవించే సూచికంగా ఈ పాట అంకితం అని శ్వేతా సింగ్ కీర్తి పోస్ట్ చేశారు. జోష్-ఏ-జహాన్ పేరుతో దీన్ని విడుదల చేశారు. సుశాంత్ తమతో గడిపిన మధుర క్షణాలు, ఇతర మరపురాని, ఉద్వేగభరిత క్షణాలు, వ్యాయామం చేస్తున్న వీడియో క్లిప్‌ల మేళవింపుతో ఈ వీడియోను రూపొందించారు. ఈ పాటకు ఆదిత్య చక్రవర్తి సాహిత్యాన్నిఅందించగా, శుభంసుందరం స్వరపర్చారు. నీల్ ఘోష్, అర్పిత చక్రవర్తి ఆలపించారు. అంతకుముందు సుశాంత్ కలలో ఒకటైన చెట్లను నాటడంపై స్పందించిన అభిమానులు మొక్కలు నాటుతున్న వీడియోను శ్వేతా షేర్ చేశారు. ప్లాంట్స్ ఫర్ ఎస్ఎస్ఆర్ పేరుతో మొక్కలు నాటాలని కోరారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా చెట్లను నాటడంతో ఫాన్స్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా జూన్ 14న సుశాంత్ తన ముంబై ఇంటిలో ఉరివేసుకుని చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ మరణానికి స్నేహితురాలు రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఈ కేసులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎంట్రీ మొదలు రోజుకో పరిణామంతో అనేక మలుపులు తిరుగుతూ చివరికి రాజకీయ సెగలు రేపింది. మాదక ద్రవ్యాల కోణం వెలుగు చూడటంతో ఎన్సీబీ రియాను, ఆమె సోదరుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram It has been 90 Days Bhai left his physical body. This song is dedicated to honor and celebrate his ever-felt presence in our lives🙏❤️🙏. #Justice4SSRIsGlobalDemand. https://youtu.be/6w3gQ5ubiqo A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 13, 2020 at 9:35pm PDT -
మీటూ : ప్రకంపనలకు తగినట్లుగా ఈ పాట
-
మగవాళ్లకు నిజంగా ‘స్కేరీ టైమ్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎప్పుడూ వారిదే పైచేయి, ఎప్పుడూ వారికే అవకాశం’ అనే పల్లవితో సాగి ఓ ఆంగ్ల పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘మహిళలు తమ రోజువారి జీవితాల్లో భద్రత కోసం అర్థరహితంగా ఎంతో దూరం వెళ్లాల్సి వస్తోంది. మహిళల్ని భయపెడుతున్న మగవాళ్లు, ఇక వారి వ్యవహారాల్లో భయపడాల్సిన సమయం వచ్చింది’ అన్న భావ స్ఫూర్తి కలిగిన ఈ పాటను టెక్సాస్‌లో నివసించే సింగర్, పాట రచయిత, కొరియోగ్రాఫర్ లింజీ లాబ్ పాడారు. ఆమె ఈ పాటకు ‘ఏ స్కేరీ టైమ్’ అని టైటిల్ పెట్టారు. అమెరికాలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆమె ఈ పాట రాసి పాడినప్పటికీ భారత్‌లో ‘మీ టూ’ ఉద్యమం సృష్టిస్తున్న ప్రకంపనలకు తగినట్లుగా ఈ పాట ఉండడంతో సోషల్ మీడియాలో దీనికి ఎంతో ఆదరణ లభిస్తోంది. ‘మీ టూ’ ఉద్యమంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ మగవాళ్లకు ఇది ‘స్కేరి టైమ్’ అని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. -
జ్యూక్ బాక్స్ వినుడీ మనసారా..
-
జ్యుక్ బాక్స్ 3rd march 2018
-
జ్యుక్ బాక్స్ 17th Feb 2018
-
జ్యుక్ బాక్స్ 3rd Feb 2018
-
జ్యుక్ బాక్స్ 28th Jan 2018
-
జ్యుక్ బాక్స్ 30th December 2017
-
జ్యూక్ బాక్స్ 8th Dec 2017
-
జ్యూక్ బాక్స్ 2nd Dec 2017
-
జ్యూక్ బాక్స్ 18th Nov 2017
-
జ్యూక్ బాక్స్ 7th October 2017
-
జ్యూక్ బాక్స్ 23rd sep 2017
-
జ్యూక్ బాక్స్ 16th sep 2017
-
జ్యూక్ బాక్స్ 9th sep 2017
-
జ్యూక్ బాక్స్ 2nd sep 2017
-
జ్యూక్ బాక్స్ - 3rd june 2017
-
జ్యూక్ బాక్స్ - 27th May 2017
-
జ్యూక్ బాక్స్ - 20th May 2017
-
జ్యూక్ బాక్స్ - 30th April 2017
-
జ్యూక్ బాక్స్ - 22nd April 2017
-
జ్యూక్ బాక్స్ - 15th April 2017
-
జ్యూక్ బాక్స్ - 8th April 2017
-
జ్యూక్ బాక్స్ - 25th March 2017
-
జ్యూక్ బాక్స్ - 18th March 2017
-
జ్యూక్ బాక్స్ - 4th March 2017
-
వైఎస్‌పై పాటను రూపొదించిన అభిమానులు
-
షమితాబ్ సినిమాలో పాట పాడుతున్న అమితాబ్
బాల్కి దర్శకత్వంలో కొత్తగా వస్తున్న 'షమితాబ్' చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ పాట పాడుతున్నారు. అవధేష్ శ్రీవాస్తవతో కలిసి ఆయన మ్యూజిక్ స్టూడియోలో రాత్రి చాలా సేపు కూర్చున్నానని, షమితాబ్ సినిమా కోసం మరోసారి తాను పాట పాడుతున్నానని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చిన అద్భుతమైన బాణీలకు తాను పాడానని ఆయన రాశారు. ఇళయరాజా సంగీత ప్రపంచంలో ప్రవేశించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా, ఇప్పటికీ ఆయన స్వరాలు మాత్రం సరికొత్తగానే ఉంటాయని, ఆయన ప్రాధాన్యం అలాగే కొనసాగుతోందని అమితాబ్ చెప్పారు. చాలామంది సుప్రసిద్ధ సంగీతదర్శకులను ఆయన తయారుచేశారని, దాదాపు 900కు పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారని ప్రశంసల జల్లు కురిపించారు. షమితాబ్ చిత్రంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్ కూతురు అక్షర కూడా నటిస్తున్నారు. అక్షర బాలీవుడ్ రంగప్రవేశం అమితాబ్ చిత్రంతో జరగడం విశేషం.