
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎప్పుడూ వారిదే పైచేయి, ఎప్పుడూ వారికే అవకాశం’ అనే పల్లవితో సాగి ఓ ఆంగ్ల పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘మహిళలు తమ రోజువారి జీవితాల్లో భద్రత కోసం అర్థరహితంగా ఎంతో దూరం వెళ్లాల్సి వస్తోంది. మహిళల్ని భయపెడుతున్న మగవాళ్లు, ఇక వారి వ్యవహారాల్లో భయపడాల్సిన సమయం వచ్చింది’ అన్న భావ స్ఫూర్తి కలిగిన ఈ పాటను టెక్సాస్‌లో నివసించే సింగర్, పాట రచయిత, కొరియోగ్రాఫర్ లింజీ లాబ్ పాడారు. ఆమె ఈ పాటకు ‘ఏ స్కేరీ టైమ్’ అని టైటిల్ పెట్టారు.
అమెరికాలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆమె ఈ పాట రాసి పాడినప్పటికీ భారత్‌లో ‘మీ టూ’ ఉద్యమం సృష్టిస్తున్న ప్రకంపనలకు తగినట్లుగా ఈ పాట ఉండడంతో సోషల్ మీడియాలో దీనికి ఎంతో ఆదరణ లభిస్తోంది. ‘మీ టూ’ ఉద్యమంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ మగవాళ్లకు ఇది ‘స్కేరి టైమ్’ అని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment