సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో? ఏది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఊహించలేము. కొన్నిసార్లు ఎవరైనా నేలమీదున్న వాటిని నింగిలోకి పంపినట్లుగా.. ఒక వ్యక్తి తన తెలివితేటలనుపయోగించి.. ఇటుకలతో ఒక కొత్త కూలర్‌ను తయారుచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోకతప్పదు. ఇక అదేంటో చూసేయండి..
ఇన్‌స్టాగ్రామ్‌లో @sharpfactmind ఖాతా నుండి తరచుగా ఆశ్చర్యకరమైన వీడియోలు వస్తూంటాయి. ఇటీవల ఒక వ్యక్తి ఇటుకలు, సిమెంటు ఉపయోగించి కూలర్ ని తయారుచేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అతను 1000 ఇటుకలు, 5 బస్తాల సిమెంటు, ఇసుకనుపయోగించి దీనిని తయారు చేశాడు. ఆ కూలర్ పెట్టుబడితో కొత్తకూలర్ ని ఖరీదు చేయగలిగినా.. పెద్ద వింతేం ఉండదనో, ఏమో! మరి ఇలా ఆలోచించాడు.
ఈ కూలర్‌ను 1000 ఇటుకలతో చిన్న చిన్న సందులుగా వదిలి, దానిపై నీటి పైపులను అమర్చాడు. కరెంటు లేకపోయినా చల్లగాలిని గదులకు అందించడమే దీని స్పెషల్. కూలర్ లోపలి భాగం మొత్తం సిమెంట్‌తో కూడి ఉంది. దీంతో లోపలి నీరు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. 300 లీటర్ల నీటి సామార్థ్యాన్ని దీని ట్యాంక్ భరించగలిగేలా ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ చేస్తే.. మూడు రోజుల వరకు నీటితో నింపాల్సిన అవసరం లేదు. కూలర్ పై భాగాన ఫ్యాన్‌ను అమర్చి, లోపల ఒక చిన్న పంపును సెట్ చేశాడు. ఈ పైపు కూలర్ అంతటా నీటిని వ్యాప్తి చేస్తుంది. ఇటుక తడిస్తే ఇక రోజంతా దాని నుండి చల్లగాలే వస్తుంది. వింత ఆలోచనతో కూడిన ఈ కూలర్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోకమానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోను 28 లక్షలకు పైగా వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment