Instagram Video
-
మండే ఎండల్లో కదిలి వచ్చిన మామిడిచెట్టు.. వైరల్ వీడియో
ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరూ.. ఒక్కో రకంగా తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. తమ చేష్టలతో తోటి వారికి ప్రేరణగా నిలవాలని భావిస్తారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది. ఇందులో ఒక వ్యక్తి చేసిన పని చూసినవారంతా వాహ్.. అంటున్నారు. మరి అదేంటో మీరూ చూసేయండి...ఇన్‌స్టాలో షేర్ అయిన వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనం వెనుకాల సీట్లో కుండీలో పెరుగుతున్న మామిడి మొక్క (చెట్టు)ను భద్రంగా కట్టి తీసుకెళ్తున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక ఇలా చేశాడా? నిరంతర ప్రయాణంలో కూలర్లను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లలేం గనుక ఇలా తీసుకెళ్లాడా? లేక నర్సరీనుంచి మొక్కను కొనుగోలు చేసి తీసుకెళుతున్నాడా? పెద్దగా పెరిగిన మామిడి చెట్టును ఒకచోటు నుంచి మరో చోటుకి షిఫ్ట్ చేస్తున్నాడా అనేది స్పష్టత లేదు. కానీ కొంతమంది అద్భుతమైన ఐడియా అంటూ కమెంట్ చేశారు. ఇది కావాలనే చేసిన జిమ్మిక్కు అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sethumadhavan Thampi (@sethumadhavan_thampi)ఏది ఏమైనా గ్రోబ్యాగ్‌లో భారీగా పెరిగిన మామిడి చెట్టును బండిపై తీసుకెళ్లడం వింతగా అనిపిస్తోంది. అంతేకాదు దీనికి మామిడి కాయలు కూడా కనబడుతుండటం విశేషం. వేగానికి చెట్టు కొమ్మలు హాయిగా ఊగుతోంటే.. అంతకంటే గమ్మత్తుగా ఆ మామిడికాయలు నాట్యం చేస్తున్నాయి. ఈ విన్యాసం చూడడానికి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ వీడియో లక్షకు పైగా లైక్‌లను పొందింది. ప్రస్తుతం ఈ వీడియో 'సేతుమాధవన్ థంపి' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెగ వైరల్ అవుతోంది. ఇవి చదవండి: మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే.. -
వామ్మో.. ఇది కూడా కూలరేనా?
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో? ఏది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఊహించలేము. కొన్నిసార్లు ఎవరైనా నేలమీదున్న వాటిని నింగిలోకి పంపినట్లుగా.. ఒక వ్యక్తి తన తెలివితేటలనుపయోగించి.. ఇటుకలతో ఒక కొత్త కూలర్‌ను తయారుచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోకతప్పదు. ఇక అదేంటో చూసేయండి..ఇన్‌స్టాగ్రామ్‌లో @sharpfactmind ఖాతా నుండి తరచుగా ఆశ్చర్యకరమైన వీడియోలు వస్తూంటాయి. ఇటీవల ఒక వ్యక్తి ఇటుకలు, సిమెంటు ఉపయోగించి కూలర్ ని తయారుచేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అతను 1000 ఇటుకలు, 5 బస్తాల సిమెంటు, ఇసుకనుపయోగించి దీనిని తయారు చేశాడు. ఆ కూలర్ పెట్టుబడితో కొత్తకూలర్ ని ఖరీదు చేయగలిగినా.. పెద్ద వింతేం ఉండదనో, ఏమో! మరి ఇలా ఆలోచించాడు.ఈ కూలర్‌ను 1000 ఇటుకలతో చిన్న చిన్న సందులుగా వదిలి, దానిపై నీటి పైపులను అమర్చాడు. కరెంటు లేకపోయినా చల్లగాలిని గదులకు అందించడమే దీని స్పెషల్. కూలర్ లోపలి భాగం మొత్తం సిమెంట్‌తో కూడి ఉంది. దీంతో లోపలి నీరు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. 300 లీటర్ల నీటి సామార్థ్యాన్ని దీని ట్యాంక్ భరించగలిగేలా ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ చేస్తే.. మూడు రోజుల వరకు నీటితో నింపాల్సిన అవసరం లేదు. కూలర్ పై భాగాన ఫ్యాన్‌ను అమర్చి, లోపల ఒక చిన్న పంపును సెట్ చేశాడు. ఈ పైపు కూలర్ అంతటా నీటిని వ్యాప్తి చేస్తుంది. ఇటుక తడిస్తే ఇక రోజంతా దాని నుండి చల్లగాలే వస్తుంది. వింత ఆలోచనతో కూడిన ఈ కూలర్ని చూసి అందరూ ఆశ్చర్యపోకమానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోను 28 లక్షలకు పైగా వీక్షించారు. View this post on Instagram A post shared by Sharp Fact Mind (@sharpfactmind) -
రీల్స్ పిచ్చి..టీచర్ పై పోలీస్ కేసు..
-
ఇన్‌స్టా రీల్స్ చేస్తూ సూపర్ కారు కొనేశారు - ధర తెలిస్తే షాకవుతారు!
ధర ఎక్కువైనప్పటికీ సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్ లంబోర్ఘిని. అయితే ఖరీదైన ఈ బ్రాండ్ కారును ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కీర్తి సింగ్ రహేజా ఆమె భర్త రోహిత్ రహేజా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటూ బాగా ఫేమస్ అయ్యారు. వీరు ఇప్పుడు సుమారు రూ.4.22 కోట్ల విలువైన వైలెట్ కలర్‌తో కూడిన వయోలా పాసిఫేలో లంబోర్ఘిని ఉరుస్ పర్ఫార్మంటే కొనుగోలు చేశారు. వీడియోలో వారు డీలర్‌షిప్‌కు చేరుకోవడం, ఆ కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం వంటివి చూడవచ్చు. నిజానికి వయోలా పాసిఫేలో లంబోర్ఘిని ఉరుస్ పర్ఫార్మంటే కొనుగోలు చేసిన మొదటి కస్టమర్లు వీరే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారును మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇప్పటికే భారతదేశంలో కార్తీక్ ఆర్యన్, రోహిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహద్ ఫాసిల్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు చాలామంది లంబోర్ఘిని ఉరస్ SUVలను కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశీయ విఫణిలో లంబోర్ఘిని కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమైపోతుంది. లంబోర్ఘిని ఉరస్ పెర్ఫార్మంటే 4.0 లీటర్ వీ8 ఇంజన్‌తో 666 పీఎస్ పవర్, 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సుమారు 2000 కేజీల బరువున్న ఈ కారు కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవత్తమా అవుతుంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 303 కిమీ కావడం గమనార్హం. ఇదీ చదవండి: టెక్నాలజీ ఉంది కదా అని ఎవరైనా ఇలా చేస్తారా! వీడియో చూడండి View this post on Instagram A post shared by Kirti Singh raheja (@kirtisinghx3) -
అనసూయ బాధని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి!
యాంకర్ అనసూయ ఉన్నట్టుండి ఏడ్చేసింది. తన ఇన్ స్టాలో రీసెంట్గా ఆ వీడియో పోస్ట్ చేసింది. దీంతో అందరూ ఆమెకి ఏమైందా అనుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల బాధపడిందేమో అనుకున్నారు. కానీ కారణం అది కాదని, ఆ నెగిటివిటీకి తాను బాధపడే రకం కాదని చెప్పుకొచ్చింది. అయితే అనసూయ ఏం చెప్పాలనకుందనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆమె మనసు అర్థం చేసుకున్నాడు. ఓ లెటర్ రాశాడు. ఆ వ్యక్తి లెటర్ అనసూయ ఏడుపు వీడియో పోస్ట్ చేయగానే చాలామంది ఆమెపై కౌంటర్స్ వేశారు. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా దీన్ని పోస్ట్ చేయడం ఒకటైతే, ఆ కారణంతో ఏడవలేదు, ట్రోల్స్ రీజన్ కాదని ఏదేదో చెప్పుకొచ్చింది. అయితే ఈమె వీడియో సారాంశాన్ని అర్థం చేసుకున్న ఓ అభిమాని, ఆమెకు ఓ లెటర్ రాశాడు. ఇప్పుడు దాన్ని అనసూయ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తాను చెప్పాలనుకున్నది ఈ మేటరే అని పేర్కొంది. (ఇదీ చదవండి: బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ) లెటర్లో ఏముంది? 'సోషల్ మీడియా మెల్లగా మన జీవితాల్ని ఆక్రమించేసింది, తన గుప్పిట్లోకి మనల్ని లాగేసకుంది. అనసూయ ముఖ్యమైన పాయింట్ లేవనెత్తింది. ఫొటోల్లో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాం. కానీ మనం బాధల్లో బతుకుతున్నాం కదా? హ్యాపీగా ఉన్నామని చూపించుకుంటూ ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాం. సైకియాట్రిస్ట్‌లు ఇదే చెబుతున్నారు. సంతోషంగా ఉండటానికి బదులు అలా చూపించుకునే వరకు వచ్చాం' 'ఆ వీడియోలో మనం ఓ విషయం గమనించొచ్చు. ఫెర్ఫెక్షన్ అనేది బూటకం. ఒత్తిడికి కారణం అదే. అనుభవం అనేది వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, తగిలిన దెబ్బలతో వస్తుంది. అందరి పట్ల దయతో ఉండండి. వారి జీవితాల్లో ఎలాంటి బాధ అనుభవిస్తున్నారో మనకు తెలీదు అని అనసూయ చెప్పింది. ట్రోలింగ్ వల్ల బాధపడతారు. ఓ మాట అనేటప్పుడు ఇవి ఆలోచించాలి. అంటున్నది నిజమేనా? ఎదుటివాళ్లు బాధపడతారా? మనకు జాలి దయ లేవా? అనేవి గుర్తుపెట్టుకోవాలి' అని లెటర్లో రాసుంది. ఇదంతా చూస్తుంటే.. సోషల్ మీడియా ట్రోలింగ్ గురించే అని అనసూయ బాధపడుతుందని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) -
'చిరుత' హీరోయిన్ ఐస్ బాత్.. కారణం అదేనా?
చిరుత హీరోయిన్ గుర్తుందా? కచ్చితంగా గుర్తుండదు. ఎందుకంటే ఈమె తెలుగులో చేసిన ఫస్ట్ సినిమా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో చేసింది. బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏం లాభం. టాలీవుడ్లో మరో మూవీ తప్పితే పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇప్పుడు ఏకంగా ఐస్ బాత్ వీడియో హాట్ టాపిక్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా) ఇప్పుడేం చేస్తోంది? 'చిరుత' తర్వతా వరుణ్ సందేశ్ 'కుర్రాడు' మూవీలో హీరోయిన్ గా చేసిన నేహాశర్మ.. ఆ తర్వాత అన్నీ హిందీ సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అయినాసరే పెద్దగా సక్సెస్ రాలేదు. ఇలా నటిగా పెద్దగా పేరు తెచ్చుకోనప్పటికీ.. అక్క ఐషా శర్మతో కలిసి అందాల ప్రదర్శనలో మాత్రం అస్సలు తగ్గదు. ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటుంది. ఐస్ బాత్ ఛాలెంజ్ జిమ్ కి వెళ్లడం వర్కౌట్స్ చేయడం లాంటివి కాకుండా ఇప్పుడు ఐస్ బాత్ చేసింది. ఈ మధ్య హీరోయిన్లు రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఐస్ బాత్ ఛాలెంజ్ స్వీకరించింది. వాళ్లలానే తనకూడా ఐస్ బాత్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ బికినీలో ఈమె హాట్‌నెస్‌కి టబ్‌లోని మంచు కరిగిపోవడం గ్యారంటీ అని నెటిజన్స్ రొమాంటిక్‌గా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్
సన్నీ లియోన్ పేరు చెప్పగానే మీలో చాలామంది అలెర్ట్ అయిపోతారు. ఆమె గతం ఏంటనేది పక్కనబెడితే నటిగా పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలలో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఓ విషయంలో భర్త తనని మోసం చేశాడని చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!) శృంగార తారగా చాలా క్రేజ్ తెచ్చుకున్న సన్నీ లియోన్.. భారత మూలాలున్న అమెరికన్ నటి. కెనడాలోని ఓ సిక్కు కుటుంబంలో ఈమె పుట్టింది. 2012లో 'జిస్మ్ 2'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్ల తర్వాత 'కరెంట్ తీగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత గరుడవేగ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. చివరగా మంచు విష్ణు 'జిన్నా' సినిమాలో కనిపించింది. ఈ మధ్యే భర్తతో కలిసి మాల్దీవులు టూర్ కి వెళ్లిన సన్నీ లియోన్.. దాని తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లింది. ప్రస్తుతం భర్త డేనియల్ వెబర్ తో కలిసి దుబాయి వెకేషన్లో ఉంది. ఈ క్రమంలోనే రూమ్ లో భర్త దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని సన్నీ చూసేసింది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి, ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీనికే 'నా భర్త నన్ను మోసం చేస్తున్నప్పుడు' అనే క్యాప్షన్ పెట్టుకొచ్చింది. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) (ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
నటి 'వామిక గబ్బి' కారు కొనేసిందోచ్.. ధర ఎన్ని లక్షలంటే?
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగానే పంజాబీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటించిన 'వామిక గబ్బి' (Wamiqa Gabbi) ఇటీవల అమెరికన్ బ్రాండ్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామిక ఎక్కువగా పంజాబీ సినిమాల్లో కనిపించింది. దీంతో బహుశా తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కాగా ఈ భామ ఇటీవల కొనుగోలు చేసిన కారు జీప్ కంపెనీకి చెందిన మెరిడియన్. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. జీప్ మెరిడియన్ డెలివరీ తీసుకునే సమయంలో వామిక ముంబైలోని కంపెనీ డీలర్‌షిప్‌లో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇదే ఆమె మొదటి కారు కావడం ఇక్కడ విశేషం. వీడియో పోస్ట్ చేస్తూ నా తల్లితండ్రులు సహకారంతో.. అభిమానుల ఆదరాభిమానాలతో ఇది సాధ్యమైందని వెల్లడించింది. (ఇదీ చదవండి: ఆ ప్రదేశం చూడగానే ఆకర్షిస్తుంది.. ఒక రాత్రి అక్కడ ఉండగలనా అంటే!) జీప్ మెరిడియన్.. ఇక జీప్ మెరిడియన్ విషయానికి వస్తే.. వామికా కొనుగోలు చేసిన కారు వెల్వెట్ రెడ్ షేడ్‌లో చూడచక్కగా ఉంది. గత ఏడాది భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ SUV అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్ కలిగి.. ఫ్లోటింగ్-టైప్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 170 హార్స్ పవర్ 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 32.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ధరలు మారుతాయి. వామిక ఏ వేరియంట్ కొనుగోలు చేసిందనే విషయం తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) -
డాక్టర్ గారు డ్యాన్స్ చేశారు!
పని ఒత్తిడిలో ఉన్న వారికి హాబీలే రిలాక్సేషన్. కర్నాటకలోని మంగళూరుకు చెందిన దర్శిని రేష్మా ప్రదీప్ డాక్టర్ కావాలనుకొని డ్యాన్సర్ కాలేదు. డాక్టర్ కావాలనుకున్న కలను నిజం చేసుకున్న దర్శిని ఎంత బిజీగా ఉన్నాసరే, తనలోని ‘నృత్యకళ’ను కాపాడుకుంటోంది. పని ఒత్తిడి నుంచి బయటపడడానికి, మనసు తేలిక చేసుకోవడానికి ఆమె అనుసరించే మార్గం.. డ్యాన్స్. షారుక్‌ఖాన్ హీరోగా చేసిన ‘రా.వన్’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘చెమ్మక్ చెల్లో’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ వీడియో క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ‘ఐ లవ్ దిస్ పార్ట్ ఆఫ్ ది సాంగ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోక్లిప్ 2.5 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘చెమ్మకు చెల్లో’ సాంగ్ సంగతి ఎలా ఉన్నా... దర్శిని డ్యాన్స్ స్టెప్పులను చూస్తుంటే మన ‘ఇంద్ర’ సినిమాలోని ‘దాయి దాయి దామ్మా కులికే కుందనాలబొమ్మ’ వీణ స్టెప్పులు గుర్తుకొస్తున్నాయి. ‘గుడ్ డ్యాన్సింగ్’ ‘వాట్ ఏ లవ్లీ డ్యాన్స్’... మొదలైన కామెంట్స్‌తో స్పందించారు నెటిజనులు. -
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి అత్యుత్సాహం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో ఓ భక్తురాలు అత్యుత్సాహం చూపారు. అమ్మవారి మూల విరాట్‌ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వెంటనే దుర్గగుడి ఈవో భ్రమరాంబ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సిబ్బంది సీసీ కెమెరాలు పరిశీలించి శాంతి కుమారి అనే భక్తురాలు వీడియో తీసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ) -
పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో భయ్యా.. మెట్రోలో టవల్‌తో ఫోజులు..
సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు కొంతమంది ఏం చేస్తారో ఇప్పటికే చాలా వీడియోల్లో మనం చూసే ఉంటాం కాదా. ఈ క్రమంలో కొందరు రాత్రికి రాత్రే ఎంతో ఫేమస్ అయిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా, తాజాగా ఢిల్లీకి చెందిన ఓ ఇన్స్‌స్టాగ్రామ్ ఇన్స్‌ప్లూయాన్సర్ కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వినూత్నంగా ఓ వీడియో తీశాడు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన మోహిత్ గౌహర్‌కు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, వినూత్నంగా ట్రయ్ చేస్తూ వీడియోలను తన అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటాడు. అలాగే, తాజాగా ఓ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు. వీడియో సందర్బంగా మోహిత్.. ఢిల్లీ మెట్రో రైలులో హంగామా చేశాడు. కాగా, మోహిత్.. మెట్రో రైలు కోచ్‌లో బనియన్, టవల్‌తో దర్శనమిచ్చాడు. అంతటితో ఆగకుండా ఏదో ఫ్యాషన్ షోలో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ క్యాట్ వాక్ చేశాడు. అంతటితో ఆగకుండా రైలు అద్దాల్లో తన అందం చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు. ఈ సందర్భంగా మెట్రో రైలు ప్రయణిస్తున్న కొందరు యువతులు మోహిత్‌ను చూసి ఫుల్‌గా నవ్వుకున్నారు. అతడి చేష్టలను ఎంజాయ్ చేశారు. కానీ, కొందరు మాత్రం మోహిత్ చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌లో ఇలాంటి పనులేంటని ప్రశ్నించారు. కాగా, వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం వీడియోపై మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by 🇮🇳मोहित गौहर 🇮🇳 (@mohitgauhar) -
ఆ అమ్మాయి కనిపిస్తే దయచేసి నాకు చెప్పండి.. రాజ్ తరుణ్ వీడియో వైరల్
సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అకస్మాత్తుగా సోషల్ మీడియాలో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ‘స్టాండప్ రాహుల్’ ఫ్లాప్ తర్వాత సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్న నటుడు ఓ వీడియోలో అమ్మాయికి వార్నింగ్ ఇస్తూ చాలా ఆగ్రహంతో కనిపించారు. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్న హీరో సడన్ షాక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏముంది? అతను ఎందుకు అంతగా సీరియస్‌గా ఉన్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. రాజ్ తరుణ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఆనందాలు, అమ్మాయిలు నా జీవితానికి హానికరం. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. (చదవండి: వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్) ఆ వీడియోలోరాజ్ తరుణ్ మాట్లాడుతూ..' హాలో అండి. నేను సడన్‌గా ఈ వీడియో పెట్టడానికి ఓ కారణం ఉంది. మీకోక అమ్మాయి గురించి చెప్పాలి. అసలు నా జీవితంలో అమ్మాయి టాపిక్ వస్తుందని ఎప్పుడూ అనుకోలా. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలతో తిరుగుతుంటే.. నేను కొత్తిమీర, కరివేపాకు అంటూ తిరిగేవాణ్ని. మా ఫ్రెండ్స్‌ను చూస్తే అసూయ. అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. దీంతో నా జీవితానికి ప్రేమ సెట్ కాదని అర్థమైపోయింది. సిన్సియర్‌గా నాకు పెళ్లి చేయమని అమ్మానాన్నను అడిగా. మొదట వాళ్లు కంగారు పడ్డారు. దాంతో నాకు మంచి సంబంధం చూశారు. ఇంకేముంది పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి సెట్, మండపం సెట్, బంధువులంతా వచ్చారు. గంగిరెద్దులా మండపంలో కూర్చోబెట్టారు. పంతులు అమ్మాయిని తీసుకురండి అనే సరికి షాక్. ఇంకేముంది తీరా చూస్తే అమ్మాయి జంప్. వాళ్ల చెల్లి ఓ లెటర్ తీసుకొచ్చింది. ఇక అప్పుడు మొదలైంది చుట్టాల సానుభూతి. ఒసేయ్.. నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా? నీ అంతు చూస్తా? రేపే నీ ఫొటో ఆన్లైన్లో పెడతా. ఆమె కనపడితే దయచేసి ఎవరైనా నాకు చెప్పండి' అంటూ వీడియోలో మాట్లాడారు. అయితే ఇదంతా చూస్తుంటే కేవలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చేసినట్లు కనిపిస్తోంది. తన రాబోయే చిత్రాన్ని ప్రకటించడం కోసమే ఆయన ఈ వీడియో షేర్ చేశారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజ్ తరుణ్ ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Raj Tarun (@rajtarunn) -
అమ్మాయి డ్యాన్స్ వీడియో వివాదాస్పదం...హోం మంత్రి సీరియస్
మధ్యప్రదేశ్‌లో ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మద్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ అవ్వడమే కాకుండా కలెక్టర్, ఎస్సీని ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత విశ్వాసాలతో చెలగాటమాడితే సహించేది లేదని మిశ్రా మండిపడ్డారు. ఐతే ఈ వీడియోలో ఆ అమ్మాయి గర్భగుడిలో జలాభిషేకం చేస్తున్నప్పుడూ కాంతులు వెదజిమ్మితున్నట్లు ఎఫెక్ట్స్ వంటివి పెట్టింది. అదీగాక ఆలయ పరిసరాల్లో డ్యాన్సులు చేస్తూ బ్యాగ్రౌండ్లో బాలీవుడ్ పాట వీడియోలో వినిపిస్తుంది. మరో యువతి ఆలయంలో పరిసరాల్లో వీడియో తీస్తున్నట్లు ఉంటుంది. ఐతే ఈ వీడియోపై ఆలయ పూజారి మహేష్గురు ఇది సనాతన సాంప్రదాయానికి విరుద్ధమంటూ సదరు అమ్మాయిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ఆలయ పవిత్రతను మంటగలిపేలా ఉందంటూ మండిపడ్డారు. అలాగే మహకాల్ ఆలయ ఉద్యోగులు కూడా తమ బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదని పూజారి అన్నారు. (చదవండి: బిల్కిస్ బానో కేసు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు) -
హైదరాబాద్ మెట్రోలో డ్యాన్స్.. యువతికి షాకిచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అందరికి ఫేమస్ అయిపోవాలన్న పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలు రికార్డ్ చేసి నెట్టింట్లో అప్లోడ్ చేయడం తెగ కామన్ అయిపోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లోనూ వీడియోలు చీత్రికరిస్తున్నారు. నలుగురిలో పాపులారిటీ తెచ్చుకోవాలన్న భ్రమలో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే సదరు యువతి స్టేషన్లోనే కాకుండా మెట్రో రైల్లో కూడా వీడియో చేసినట్లు బయటపడింది. ట్రైన్లో ప్రయాణికులు ఉండగానే అందరిముందు టాలీవుడ్‌లోని ఓ పాటకు స్టెప్పులేస్తూ రీల్ చేసింది. దీనిని ఇన్‌స్టాలో షేర్ చేయింది. అయితే యువతి మెట్రలో డ్యాన్స్ చేయడంపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను ఏ స్టేషన్లో చిత్రీకరించారో గుర్తించి యువతిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇన్‌స్టా రీల్ చేసిన యువతిపై కేసు నమోదైంది. సదరు యువతిని గుర్తించి, ఆమెపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు వెల్లడించారు. మరోవైపు సోషల్ మీడియాలో యువతి చర్యపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇలాంటి పిచ్చి ప్రవర్తనను ప్రొత్సహించొద్దు. మెట్రో మీ ప్రైవేటు ఆస్తి కాదు. ప్రజా రవాణాలో ఇలాంటి ప్రవర్తనను అస్సలు సహించకూడదు.’ అంటూ మండిపడుతున్నారు 💃 Dance On Hyderabad Metro 🚄 When did this happen??? pic.twitter.com/ZilPdia9fx — Hi Hyderabad (@HiHyderabad) July 20, 2022 కాగా గతంలో రైలు బోగీల్లోనూ పలువురు డ్యాన్స్ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. నగర మెట్రో రైళ్లలో అధికారుల అనుమతితో కొన్ని టాలీవుడ్, బాలీవుడ్ సినిమా సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఓ సినిమాను మాదాపూర్ మెట్రో స్టేషన్ ఆవరణలో చిత్రీకరించడం విశేషం. After many people criticised her on social media, Hyderabad Metro Rail🚇 Limited Authorities said that stringent action will be taken against the woman.👮@MostlyTelugu #Hyderabad #HyderabadMetro #VikrantRоna #RaRaRakkamma pic.twitter.com/CUUJ6S8e6w — Mostly Telugu (@MostlyTelugu) July 21, 2022 -
వాడి అల్లరి తట్టుకోలేకపోతున్నా: ఇర్ఫాన్ పఠాన్
-
ఏంటి? నీకు బ్యాగు బరువైతుందా?: నిర్మాతపై సెటైర్లు
-
వైరల్ వీడియో: ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్ చిందులు
-
యాంకర్ సుమను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
-
నన్ను ఆపడానికి నీకు ఎంత ధైర్యం
-
'ఆ నటుడితో డేటింగ్లో ఉన్నా.. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో'
నియా శర్మ..హిందీ టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఈ బ్యూటీ టీవీ నటుడు రాహుల్ సుధీర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె..తన రిలేషన్ షిప్‌పై స్పందించింది. 'లాంగ్ రిలేషన్లో ఉందామని ఎన్నిసార్లు ప్రయత్నించినా చాలాసార్లు నాకు నిరాశే ఎదురైంది. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. నేను ఇతడే నా లైఫ్ పార్టనర్ అని ఖచ్చితంగా నమ్మినప్పుడే మీడియాతో వెల్లడిస్తా. ఎందుకంటే చాలామంది జంటలు మీడియా, సోషల్ మీడియాలో పాపులర్ అయిన జంటలు విడిపోవడం దగ్గర్నుంచి చూశా. అలా అని వాళ్లని కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ నేను పెళ్లి చేసుకునే వ్యక్తి విషయాలు చాలా ప్రైవసీగా ఉంచాలనుకుంటున్నా. చాలా కాలం నుంచి తనతో డేటింగ్లో ఉన్నా.. చూద్దాం ఇది ఎంత వరకు ఎళ్తుందో'.. అని నియా శర్మ తన లివింగ్ రిలేషన్షిప్ స్టేటస్ గురించి వెల్లడించింది. ఇప్పటివరకు డేట్ చేసిన వాళ్లలో ఇదే లాంగ్ రిలేషన్ అని చెప్పింది. బ్యాక్‌లెస్ టాప్‌తో వయ్యారంగా డ్యాన్స్.. ఇక యాక్టింగ్‌లోనే కాదు, అందాల ఆరబోతలో ఓ మాత్రం వెనకడుగు వేయని నియా శర్మ తాజాగా మరోసారి ఇంటర్నెట్ను షేక్ చేసింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో మతి పోగోట్టే ఈ భామ లేటెస్ట్గా ఓ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి బ్లాక్ లేదా వైట్..మధ్యలో ఏదీ ఉండకూడదు అంటూ ఓ క్యాప్షన్‌ను జత చేసింది. బ్యాక్‌లెస్ టాప్‌తో నడుమును వయ్యారంగా కదిలిస్తూ హాట్ పెర్ఫార్మన్స్తో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ భామ. ఇప్పటికే నియా చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నియా సహనటుడు అడా ఖాన్ సైతం ఈ అమ్మడి డ్యాన్స్‌కు హాట్ అంటూ కామెంట్ చేశాడు. వీడియో షేర్ చేసిన కొద్ది సేపట్లోనే నెటిజన్లు లక్షల కొద్దీ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక టీవీ నటుడు రవి దూబెతో జమాయి 2.0 అనే వెబ్ సిరీస్‌లో నియా శర్మ నటించిన సంగతి తెలిసిందే. వెండితెర మీద ముద్దులు, హగ్గులు ఇచ్చుకునే ఈ జంట వెబ్‌సిరీస్‌లోనూ రెచ్చిపోయారు. అండర్ వాటర్‌లో లిప్‌లాక్ సీన్లలోనూ నటించారు. చివరగా ఖత్రోన్ కే ఖిలాడి మేడ్ ఇన్ అనే సీరియల్లో నియా శర్మ కనిపించింది. చదవండి : (అతడు బెస్ట్ కిస్సర్, అంతా ఆమె వల్లే సాధ్యం!) (సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన నటి) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
కూతురి కోసం యాంకర్ రవి ఏం చేశాడో తెలుసా?
యాంకర్ రవి..బుల్లితెరపై టాప్ యాంకర్‌గా అలరిస్తున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తాడు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటూ రవి పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తన గారాల పట్టి వియా అంటూ చెప్పలేనంత ప్రేమ అని తనకోసం ఏదైనా చేస్తానంటున్నాడు రవి. తాజాగా కూతురు అడిగిందని వెంటనే తనకోసం స్పెషల్‌గా చికెన్ చేసి తినిపించాడు. అంతేకాకుండా తన చిట్టితల్లికి కారం తగలొద్దని జాగ్రత్తలు తీసుకొని మరీ వంట చేశాడట. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కూతురిపై రవి కురిపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు..మీరు చేసే వీడియోలు చూసి మా భార్యలు మమ్మల్ని కూడా వంట చేయమని డిమాండ్ చేస్తున్నారంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక రియాలిటీ షోలతో బిజీగా ఉంటున్న రవి...బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు మందు సీజన్లలోనూ బిగ్‌బాస్ టీం తనను సంప్రదించిందని, అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అప్పుడు వెళ్లలేదని గతంలో రవి పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్లో అయినా అడుగుపెడతాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. చదవండి : (చిరంజీవి చేతుల మీదుగా 'విరాటపర్వం') (లాస్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి) -
వైరల్ వీడియో: అమ్మో..పాము
-
జొమాటో డెలివరీ బాయ్ దౌర్జన్యం
-
మహేశ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాక చలనచిత్ర పరిశ్రమల్లో ఆయన గ్లామర్, ఫిట్‌నెస్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. నాలుగు పదుల వయసు వచ్చినప్పటికి కూడా మహేశ్ పాతికేళ్ల కూర్రాడిలాగే కనిపిస్తున్నాడు. అంటే అంతలా ఆయన ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహేశ్తా జాగా తన జిమ్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో మహేశ్ ‘బాక్స్ జంప్స్’ చేస్తూ కనిపించాడు. ఇక ఇది చూసి సూపర్ స్టార్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: మహేశ్ బాబు అందానికి సీక్రెట్ అదే : విష్ణు) కాగా మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేశ్ మీసాలు లేకుండా, కాస్త జులుపాల జుట్టుతో కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ మూవీలో మహేశ్ సరసన కీర్తి సురేష్ తొలిసారిగా జత కడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. (చదవండి: ఇక ఎక్కువ సమయం తనతోనే గడిపేస్తా : పూజా హెగ్డే) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్
-
చీరకట్టులో అదిరిపోయే డాన్స్..
-
దుమ్ములేపిన కొరియన్ బ్యాండ్
-
గేల్‌ను మరిపించే పవర్ఫుల్ హిట్టింగ్
-
కూతురి పాట: పై నుంచి ఊడిపడ్డ తల్లి!
-
‘మైండ్ బ్లాక్’ చేసిన సితార
-
నిహారిక ఇంట పసుపు ఫంక్షన్
-
మాస్క్ పెట్టుకోలేదని చితకబాదారు
-
అతనితో స్నేహం చేస్తా: నమ్రతా శిరోద్కర్
ముంబై: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మిస్ ఇండియా పోటీ చేసిన నాటి ఓ వీడియోను ఆమె సోదరి, నటి శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1993లో నమ్రతా మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీలో నమ్రత తన సమాధానంతో షో జడ్జీలను మెప్పించారని శిల్పా తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోను బుధవారం శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో మాజీ మిస్ ఇండియా సంగీత బిజ్లానీ కూడా కనిపించారు. ఈ రౌండ్లో ఏ ముగ్గురు తర్వాత రౌండ్‌కు వెళతారని సంగీతను అడగ్గా.. కచ్చితంగా నమ్రత విజయం సాధిస్తుందన్నారు. అంతేగాక తనకు ఇష్టమైన కంటెస్టెంట్ కూడా నమ్రత అని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అతడు నా అభిమాన హీరో) ఆ తర్వాత నమ్రతను.. ‘మీరు ఓ ఉదయం లేచేసరికి కౌంట్ డ్రాక్యులా(కల్పిత పాత్ర) మీ మంచంపై నిద్రిస్తున్నట్టు కనిపిస్తే ఏం చేస్తారు అని అడగ్గా’.. దానికి నమ్రత.. నేను నిజంగా భయపడాతాను కానీ అప్పుడు అతనితో స్నేహం చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారు. నమ్రతా హిందీలో ‘కచ్చే ధాగే’, ‘పుకార్’, ‘అస్తిత్వ’, ‘అల్బెలా’, ‘దిల్ విల్ ప్యార్ వయార్’ వంటి హిందీ చిత్రాలలో తన నటనకు నమ్రతా శిరోద్కర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో కూడా నటించారు. 2000 సంవత్సరంలో వచ్చిన ‘వంశీ’ సినిమా సమయంలో మహేష్ బాబుతో ప్రేమలో పడ్డారు. అనంతరం వీరిద్దరూ 2005లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. (చదవండి: ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత) View this post on Instagram @namratashirodkar I Love you😘😘😘 #feminamissindia #1993 A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73) on Jul 28, 2020 at 11:38pm PDT -
అనసూయను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..
‘క్లాసిక్‌ను ఎప్పటికి టచ్ చేయకూడదు.. మాస్టర్ పీస్‌ని చెడగొట్టకూడదు’ ఇది సిని ప్రపంచంలో మొదటి నియమం. ఫెయిల్యూర్ అవుతుందనే భయం కన్నా ఫీల్ చెడితే జనాల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొవడం అంత ఇజీ కాదు. ఇంతకు ముందంటే మన సినిమాల గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల తమకు నచ్చని వాటి గురించి మొహం మీదే చెప్పేస్తున్నారు అభిమానులు. నచ్చితే పొగడటం.. లేదంటే ట్రోల్ చేయడం వెంటవెంటనే జరిగిపోతుంది. ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికే కాక మహానటి సావిత్రి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ. ఓ పక్క టీవీ షోలు.. అడపదడపా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోన్న అనసూయ తాజగా ప్రకటనల రంగంలోకి కూడా ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ వస్త్రాల కంపెనీ యాడ్‌లో నటించిన అనసూయపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాడ్ కోసం సదరు కంపెనీ ఎవర్ గ్రీన్ హిట్ ‘మాయాబజార్’ సినిమాలోని ‘ఆహా నా పెళ్లంట’ పాటను ఎంచుకున్నారు. ఈ పాటలో అనసూయ ఏకంగా మహానటి సావిత్రిని ఇమిటేట్ చేస్తూ నటించారు. దాంతో నెటిజన్లు అనసూయనే కాక సదరు మాల్ యాజమాన్యాన్ని కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘మీరు సావిత్రి గారిని అవమానించారు’.. ‘అనసూయ.. సావిత్రి గారితో నీకు పోలికా’.. ‘దయ చేసి సావిత్రమ్మని ఇలాంటి పనులకు ఉపయోగించుకోకండి’.. అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ యాడ్‌లో ఘటోత్కచుడి పాత్రలో యస్వీఆర్‌ను ఇమిటేట్ చేస్తూ ప్రముఖ గాయకుడు మనో నటించారు. View this post on Instagram Something which I’ve been super anxious about but also feel super lucky to be the one to do.. #Savitramma #Mahanati 🙏🏻🙇🏻♀️!! The attempt itself is an acheivement for me!! Thank you @chandanabros @YamunaKishore garu for considering me🙏🏻🙏🏻 I will cherish this work forever🥰🙏🏻 A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on Dec 2, 2018 at 9:51pm PST -
నాకూ బతకాలని లేదు..!
-
శ్రీదేవి లేదు.. నాకు బతకాలని లేదు: నటి
శ్రీదేవి అకాల మరణాన్నిఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణం అందరిపైనా తీవ్ర ప్రభావం చూపింది. దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా శ్రీదేవికి అభిమాని. అతిలోక సుందరి అంత్యక్రియలకు హాజరై తుది వీడ్కోలు పలికింది. అనంతరం శ్రీదేవి మరణం తనును ఎంతో కలిచివేసిందని ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్టు పెట్టింది. 'శ్రీదేవి జీ! మీరు వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. ఐ లవ్ యూ సో మచ్. ఏమైంది మీకు? ఎందుకు వెళ్లిపోయారు? మీలా ఎవరూ నటించలేరు, డాన్స్ చేయలేరు. మీరు చాలా మంచి వారు. మీరు లేకపోవడంతో నాకూ బతకాలని లేదు.. లవ్ యూ ’ అంటూ బాధతో వీడియో పోస్టు పెట్టింది. అయితే రాఖీ సావంత్ పోస్టులకు నెటిజన్లు వినూత్నంగా స్పందించారు. 'ఇదంతా పబ్లిసిటీ స్టంట్, టీఆర్పీ కోసం చేస్తున్నావ్.., రాఖీ, కామెడీ చేయకు.., వీడియోలో నువ్వు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నావ్.., టూ ఫన్సీ.. అంటూ కామెంట్లు పెట్టారు. శ్రీదేవి మరణం తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌ను శ్రీదేవి ఫొటోలతో నింపిన రాఖీ.. తాజాగా శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి పాత వీడియోని పోస్ట్ చేసింది. శ్రీదేవి మళ్లీ పుట్టారని పేర్కొంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్పింది. -
నటిపై లైంగిక వేధింపులు..
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి జైరా వసీమ్ పై లైంగిక వేధింపుల కేసు వివాదం మరింత ముదురుతోంది. ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఆరోపించింది. విమానంలో తనకు ఎవరూ సాయం చేయలేదంటూ చేసిన వ్యాఖ్యలపై ఎయిర్ లైన్స్ అధికారులు స్పందించారు. ముంబైలో విమానం దిగే వరకూ తనపై జరిగిన లైంగిక వేధింపుల విషయాన్ని సిబ్బంది దృష్టికి జైరాగానీ, ఆమె తల్లి గానీ తీసుకురాలేదని స్పష్టం చేశారు. మాకు విషయం తెలిసిన వెంటనే వారిని సంప్రదించాం. ఫిర్యాదు చేయాలనుకుంటే సహకరిస్తామని ఎయిర్ లైన్స్ సిబ్బంది చెప్పగా అందుకు జైరా, ఆమె తల్లి నిరాకరించినట్లు ఆ అధికారి వెల్లడించారు. నటికి ఎదురైన వేధింపుల వివాదం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ముంబై పోలీసులు స్పందించారు. జైరా వసీమ్‌ను ప్రత్యేకంగా కలిసిన ముంబై పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబైకి వస్తున్న సమయంలో తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి సీటుపై కాలుపెట్టి, అసభ్యంగా తాకాడని ఆమె ఓ వీడియో ద్వారా ఆరోపించగా వేధింపుల ఘటన వెలుగుచూసింది. -
ఫ్లైట్‌లో అసభ్యప్రవర్తన.. దంగల్ నటి ఆవేదన
-
ఫ్లైట్‌లో అసభ్యప్రవర్తన.. దంగల్ నటి ఆవేదన
సాక్షి, ముంబై : దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న నటి జైరా వసీమ్(17) లైంగిక వేధింపులకు గురైంది. ఫ్లైట్‌లో ఆమెతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫ్లైట్ దిగాక తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. ఇలా జరగాల్సింది కాదు. నేను చాలా బాధతో ఉన్నా అని ఆమె ఆ పోస్టులో రోదిస్తూ తెలిపింది. శనివారం ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో ఆమెకు ఈ అనుభవం ఎదురైంది. నిద్రిస్తున్న సమయంలో సదరు వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడంట. తన వెనకాల కూర్చున్న ఆ మధ్యవయస్కు వ్యక్తి ఆమె సీటుపై కాలు పెట్టిన వీడియోను ఆమె చిత్రీకరించింది. తర్వాత ఫ్లైట్ ప్రయాణిస్తున్న క్రమంలో ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడంట. వెలుతురు సరిగ్గా లేకపోవటం ఆసరాగా చేసుకుని నిందితుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె అంటోంది. అమ్మాయిల భద్రత ఎలా ఉందో తెలిసిపోతోంది.. సాయం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని ఆమె వీడియోలో తెలిపింది. కాగా, ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. -
ఫీట్లు చెయ్యగలడు... ఈ గుంటడు గోడలెక్కగలడు!
నెట్ ఇంట్లో రెండేళ్ల అరట్ హుసైనీ గత జన్మలో గబ్బిలమై ఉంటాడు. అందుకే తలకిందులుగా వేళ్లాడగలుగుతాడు. కనీసం కోతి అయినా అయి ఉంటాడు. ఎందుకంటే ఆ బుడతడు కోతి కొమ్మచ్చి ఆడితే కోతులు సిగ్గుపడిపోతాయి. ఇవన్నీ కాకపోయినా ఖచ్చితంగా అమీబా అయి ఉంటాడు. ఎటు పడితే అటు శరీరాన్ని మెలిపెట్టేయగలడు. ఏ రూపమంటే ఆ రూపం దాల్చేయగలడు. హుసైనీ టీవీపై చేసే జిమ్నాస్టిక్లు చేయగలడు. గోడలపై ఎగబాకేయడాలు చేయగలడు. చిటారు కొమ్మల నుంచి వేలాడగలడు. చిన్న డబ్బాలో శీర్షాసనం వేయగలడు. చూస్తే ఔరా అనిపిస్తుంది. కాస్త ఖాళీగా ఉంటే చాలు పిల్లిమొగ్గలు వేస్తాడు. ఎత్తుల నుంచి దూకేస్తాడు. ఇరాన్‌కి చెందిన అరట్ హుసైనీ ఇన్స్టాగామ్ అకౌంట్‌కి గ్రాములు కాదు, కిలోలు కాదు, టన్నుల కొద్దీ అభిమానులున్నారు. ఏకంగా ఇరవై వేల మంది ఫాలోయర్ల్లు ఉన్నారు. ఈ గుంటడి ఘనకార్యాలను ఇన్స్టాగ్రామ్ విడియోల్లో చూడొచ్చు. http://www.buzzfeed.com/andreborges/pantles.va7x8pWn1 తప్పిపోయిన కొడుకు తల్లిని వెతుక్కుంటూ రావాలంటే ఇప్పుడు యాదోంకీ బారాత్ లాంటి పాటలు పాడాల్సిన అవసరం లేదు. అమర్, అక్బర్, ఆంథోనీలను కలిపే మన్మోహన్ దేశాయ్ లాంటి డెరైక్టర్ అంతకన్నా అవసరం లేదు. గూగుల్ ఎర్త్‌ను నమ్ముకుంటే చాలు, న్యూయార్క్ సబ్ వే మెట్లమీద ఎలుకైనా, ఇరాన్లో రెండేళ్ల హుసైనీ అయినా ఇన్స్టంట్ హీరోలు అయిపోవాలంటే నెట్ ఒక్కటి ఉంటే చాలు. నెట్ యుగంలో కొత్త దంపతులకు అరుంధతి, వశిష్టులను నక్షత్రాలుగా చూపించనక్కర్లేదు... పండుటాకులు లారా, హోవార్డ్ల యూట్యూబ్ విడియో చూపిస్తే చాలు. తినలేక వదిలేసిన ఆహారాన్ని ఆకలిగొన్నవారి నోళ్లలోకి పెట్టే ఆడమ్ స్మిత్ చేయూత... కర్తవ్యనిష్ఠకోసం జీవితంలోని అత్యంత ఆనందమయ క్షణాలను కూడా కాదనుకున్న గువో యువాన్ అనే నర్సు మంచి మనసు... ఎంచుకునే ఛాయిస్ మీది! కానీ వాళ్ల కథ చెప్పే వాయిస్ మాత్రం సోషల్ మీడియాదే! కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు! అన్నయ్య రైళ్లలో చెత్త ఊడుస్తున్నాడు. తమ్ముడికి ప్లాట్‌ఫారంపైనే నిద్ర పట్టేసింది. కళ్లు తెరిచి చూసేసరికి అన్నయ్య లేడు. ముందు ఒక రైలు ఆగి ఉంది. అన్నయ్య అందులో ఉన్నాడేమోనని అందులోకి మనవాడు ఎక్కేశాడు. అంతలో రైలు కదిలింది. ఆ రైలు కోల్‌కతాకి చేరింది. అక్కడి వేలాది వీధి బాలుళ్లలో మనవాడూ ఒకడయ్యాడు. కొన్నాళ్లకి అనాథాశ్రమం చేరుకున్నాడు. ఆ అనాథాశ్రమం అతడిని ఆస్ట్రేలియన్ దంపతులకు దత్తత ఇచ్చేసింది. కటికపేదరికం నుంచి కనక వర్షంలోకి వెళ్లాడు మనవాడు. కానీ మనను మ్యాప్ మీద ముద్రితమైన తన ఊరి రైల్వే ప్లాట్ ఫారం, పక్కనే జలపాతం, కొద్ది దూరంలో ఉన్న డ్యామ్ చిత్రాలు మాత్రం చెక్కు చెదరలేదు. సరూ అనే వీధిబాలుడి నుంచి సరూ బ్రెయర్లీగా మారిన మనవాడు గూగుల్ తల్లినే నమ్ముకుని కోల్‌కతా నుంచి 1200 కిమీ దూరంలో రైల్వే స్టేషన్, డ్యామ్, జలపాతం ఉన్న ఊరిని వెతికాడు. అలాంటి ఊరు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా అని తేలింది. అలా వెతుక్కుంటూ ఖాండ్వాకి వచ్చాడు. అక్కడకు చేరుకునేసరికి మనసు లోయల ముడుతల్లో దాగున్న జ్ఞాపకాలపై పొగమంచు పొరలు కరిగిపోయాయి. నేరుగా తన ఇంటికే వెళ్లి తలుపు తట్టాడు. తన వద్దనున్న చిన్నప్పటి ఫోటో చూపిస్తే తప్ప ఇంట్లో వాళ్లు 31 ఏళ్ల తర్వాత కాలం కలిసొచ్చిందని, తమ కొడుకే నడిచొచ్చాడని నమ్మలేకపోయారు. 1981 నుంచి 2012 దాకా ఖాండ్వా నుంచి కోల్‌కతా మీదుగా టాస్మేనియా వెళ్లి తిరిగొచ్చిన సరూ బ్రెర్లే నెట్ కనెక్టివిటీ ఉదంతం జస్ట్ కథకాదు, ఇది ఖరాఖండి నిజం. ఇప్పుడు సరూ కథ ’స్లమ్ డాగ్ మిలియనీర్’ దేవ్ పటేల్ హీరోగా ఒక సినిమాగా తయారవుతోంది. http://www.telegraph.co.uk/culture/film/11362518/Remarkable&story&of&lost&boy&who&found&mother&using&Google&Earth&after&25&years&to&become&film.html పిడికెడు బియ్యం - గుప్పెడు సాయం ఏడాదికి 1.3 బిలియన్ టన్నుల ఆహారం తినడానికి యోగ్యంగా ఉన్నా చెత్తకుప్పల్లోకి చేరుతోంది. ఇది మొత్తం ప్రపంచంలో తయారైన ఆహారంలో మూడో వంతు. తినడానికి యోగ్యంగా ఉన్నా చెత్తకుప్పల్లో పారేసే ఆహారాన్ని ఆకలిగొన్న వారికి అందిస్తే...? ఆడమ్ స్మిత్ అనే షెఫ్ గారికి ఇదే ఆలోచన వచ్చింది. 2013లో ఆయన ఇంగ్లండ్‌లో ఇలాంటి ఆహారాన్ని సేకరించి పేదలకు అతి తక్కువ ధరలకు ఇవ్వడం మొదపెట్టాడు. ఈ పనికి రియల్ జంక్ ఫుడ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టాడు. మీకు తోచినంత ఇవ్వండి అని హోటళ్లకు పే యాజ్ యూ ఫీల్ అని నామకరణం చేశాడు. వ్యంగ్యాలు, వెటకారాలు, ఎత్తిపొడుపులు, విపరీతార్థాల్లాంటి విఘ్నాలన్నిటినీ దాటి, మూడేళ్లలో ఇప్పుడు ఈ ఉద్యమం 120 దేశాలకు పాకింది. వందలాది కార్యకర్తలు ఆడమ్ స్మిత్ భుజం తట్టి, నడుం కట్టి ముందుకొచ్చారు. ఇప్పుడు ఏడాదికి దాదాపు 200 టన్నుల ఆహారాన్ని పేదలకు చేరుస్తున్నాడు స్మిత్. అన్నానికి, ఆకలి కడుపుకి మధ్య వారధిగా నిలవడం భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేసినంత పుణ్యకార్యం. అలాంటి ఆడమ్ స్మిత్‌ను అభినందిద్దామా మరి! అంతకు ముందు మీరు చేయాల్సింది ఫేస్బుక్లో ది రియల్ జంక్ ఫుడ్ ప్రాజెక్ట్ పేజీ (http://www.therealjunkfoodproject.org/)ని లైక్ చేయడం. మోస్ట్ బ్యూటిఫుల్ నర్స్ ఆమె చైనాలోని మోస్ట్ బ్యూటిఫుల్ నర్స్! కొద్దిరోజుల క్రితం ఆమె చైనాలోని ఒక బీచ్‌లో కాబోయే భర్తతో వెడ్డింగ్ ఫోటో దిగుతోంది. ఖరీదైన వెడ్డింగ్ గౌన్, కాస్ట్లీ మేకప్‌తో ఆమె పోజు ఇస్తోంది. అంతలో సముద్రంలో ఒక వ్యక్తి మునిగిపోతూ కేకలు వేస్తున్నాడు. అతనికి నీళ్లలోనే గుండె పోటు వచ్చింది. అంతే! ఆమె పరుగులు తీసింది. అతడిని కాపాడేందుకు శతథా ప్రయత్నించింది. ఆఖరికి అతనికి తన నోటి ద్వారా కృతిమ శ్వాస కల్పించేందుకు కూడా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో ఆమె ఖరీదైన గౌను పాడైపోయింది. విలువైన మేకప్ చెదిరిపోయింది. గోళ్లు విరిగిపోయాయి. అయినా ఆమె లెక్క చేయలేదు. తన జీవితంలోని అత్యంత ఆనందమయమైన క్షణాలను కూడా వదులుకుని కర్తవ్యనిష్ఠతో పనిచేసిన గువో యువాన్ యువాన్ అనే ఆ నర్సు మనసు ఎంతో అందమైనదని చైనా మీడియా ప్రశంసిస్తోంది. ఆమె సేవా తత్పరతే అసలైన అందమని ఆమె భర్త కూడా అంటున్నాడు. ప్రజలు ఆమెని చైనాలోని మోస్ట్ బ్యూటిఫుల్ నర్స్ అంటున్నారు. మన నర్సమ్మలు కూడా ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ నుంచి కాసింత నేర్చుకుంటే బాగుంటుందేమో కదూ! http://www.dailymail.co.uk/news/ peoplesdaily/article&3244492/ Nurse&hailed&prettiest&bride& China&trying&save&drowned& man&wearing&wedding&dress.html నీ నగుమోము నా కనులార కడదాకా..... ‘‘వయసున్న నాడే అనురాగము... వయసైన కొలదీ అనుబంధము’’ అని భానుమతి ఎప్పుడో చెప్పింది. ఆ మాట 93 ఏళ్ల లారా, 92 ఏళ్ల హోవార్డ్లను చూస్తే అక్షరాలా నిజం అనిపిస్తుంది. యౌవనంలో పెనవేసుకున్న అనురాగం, వార్థక్యంలో విడదీయరాని అనుబంధంగా మారింది. లారా మృత్యుశయ్య మీదుంది. తుది పిలుపుకోసం ఎదురుచూస్తోంది. హోవార్డ్ ఆమె భావోద్వేగంతో తడుముతూ, యౌవనంలో కలిసి పాడుకున్న పాటను ఆమె కోపం కన్నీళ్లు ఆపుకుంటూ పాడుతుంటే మరణశయ్య మీదున్న లారా పదే పదే ‘ఐ లవ్ యూ’ అంటుంది. రెండో ప్రపంచయుద్ధంలో పోరాడేందుకు హోవార్డ్ వెళ్లినప్పుడు లారా పదేపదే ఇదే పాట పాడుకునేది. ఆ తరువాత కూడా వారిద్దరూ ఈ పాట ఎన్నోసార్లు కలిసి పాడారు. ఆఖరి క్షణాల్లో అదే పాటను హోవార్డ్ ఆమె కోసం పాడుతుంటే ఎవరికైనా కంటి కొసల్లో కాసింతైనా తడి రాకుండా ఉండదు. ఒకటా రెండా ... 73 ఏళ్లుగా వారిద్దరిదీ సాహచర్యం, సహయాత్ర! చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్లే నేటి తరం ఈ పండుటాకుల భావోద్వేగం, సహజీవన మాధుర్యాన్ని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ‘‘మన జంట జంటలకే కన్నుకుట్టిపోవాలి. ఇంక ఒంటరిగా ఉన్నవాళ్లు జంటలైపోవాలి’’ అనిపించే ఈ జంట విడియో ఈ వారానికే కాదు, ఏ వారానికైనా బెస్ట్ విడియోనే! https://www.youtube.com/watch?v=wWPOGhxkTE కూర్పు: కె. రాకా సుధాకరరావు www.sakshipost.com