పిచ్చి పీక్స్‌ అంటే ఇదేనేమో భయ్యా.. మెట్రోలో టవల్‌తో ఫోజులు..  | Delhi Instagram Influencer Travels Metro Wearing Towel Video Viral | Sakshi
Sakshi News home page

పిచ్చి పీక్స్‌ అంటే ఇదేనేమో భయ్యా.. మెట్రోలో టవల్‌తో ఫోజులు.. 

Published Fri, Dec 9 2022 11:08 PM | Last Updated on Fri, Dec 9 2022 11:09 PM

Delhi Instagram Influencer Travels Metro Wearing Towel Video Viral - Sakshi

సోషల్ మీడియాలో హైలైట్‌ అయ్యేందుకు కొంతమంది ఏం​ చేస్తారో ఇప్పటికే చాలా వీడియోల్లో మనం చూసే ఉంటాం కాదా. ఈ క్రమంలో కొందరు రాత్రికి రాత్రే ఎంతో ఫేమస్‌ అయిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా, తాజాగా ఢిల్లీకి చెందిన ఓ ఇన్స్‌స్టాగ్రామ్‌ ఇన్స్‌ప్లూయాన్సర్‌ కూడా సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు వినూత్నంగా ఓ వీడియో తీశాడు. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన మోహిత్‌ గౌహర్‌కు సోషల్‌ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే, వినూత్నంగా ట్రయ్‌ చేస్తూ వీడియోలను తన అకౌంట్‌లో షేర్‌ చేస్తూ ఉంటాడు. అలాగే, తాజాగా ఓ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేశాడు. వీడియో సందర్బంగా మోహిత్‌.. ఢిల్లీ మెట్రో రైలులో హంగామా చేశాడు. కాగా, మోహిత్‌.. మెట్రో రైలు కోచ్‌లో బనియన్‌, టవల్‌తో దర్శనమిచ్చాడు. అంతటితో ఆగకుండా ఏదో ఫ్యాషన్‌ షోలో ఉన్నట్టుగా ఫీల్‌ అవుతూ క్యాట్‌ వాక్‌ చేశాడు. అంతటితో ఆగకుండా రైలు అద్దాల్లో తన అందం చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు. 

ఈ సందర్భంగా మెట్రో రైలు ప్రయణిస్తున్న కొందరు యువతులు మోహిత్‌ను చూసి ఫుల్‌గా నవ్వుకున్నారు. అతడి చేష్టలను ఎంజాయ్‌ చేశారు. కానీ, కొందరు మాత్రం మోహిత్‌ చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌లో ఇలాంటి పనులేంటని ప్రశ్నించారు. కాగా, వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు మాత్రం వీడియోపై మండిపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement