Delhi metro train
-
మెట్రోలో ‘పీత’లాటకం!
మహానగరాల్లో మెట్రో రైళ్లలో ప్రయాణికులు చాలావరకు మోత బరువులు లేకుండా, నీటుగా తయారై వెళ్తుంటారు. చెవుల్లో హెడ్ఫోన్లు, చేతుల్లో స్మార్ట్ఫోన్లతో ఎవరి లోకంలో వాళ్లు బిజీగా ఉంటారు. అలాంటి మెట్రోలో ఒక్కసారిగా డజను దాకా పీతలు ప్రత్యక్షమయ్యాయి. ఆకాశంలోంచి కాకపోయినా ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచి నుంచి కింద పడ్డాయి. స్వేచ్ఛ దొరికిందే తడవుగా తలోవైపు చకచకా పరుగులు తీశాయి. దాంతో సదరు మహిళకు గాభరాతో మెట్రో రైలు తలుపు వైపు పరుగెత్తింది. సాయం కోసం అటు ఇటూ చూసింది. చిరిగిన సంచినే వాటిపై గట్టిగా అదిమిపెడుతూ ఆపసోపాలు పడింది. ఇదంతా చూస్తున్న సూటు బూటు వేసుకున్న ఓ పెద్దాయన ఆమెకు సాయంగా రంగంలోకి దిగాడు. ఎడమ చేత్తో ఫోను చూస్తూనే కుడి చేత్తో పీతల వేట మొదలు పెట్టాడు. ఆయనకు మరో ‘హెడ్‌ఫోన్’ ప్రయాణికుడు, మరో వ్యక్తి తోడయ్యారు. ఇంకొకరు పెద్ద ఖాళీ సంచి అందించారు. అంతా కలిసి ఒక్కో పీతను ఒడుపుగా ఒడిసిపట్టి సంచిలో వేశారు. అయినా పీతలు పట్టుకున్న వాళ్లను కొండీలతో కరుస్తూ పారిపోయేందుకు ప్రయతి్నంచాయి. చివరికి అంతా కలిసి అన్ని పీతలనూ విజయవంతంగా సంచీలో వేశారు. మెట్రోలో ఈ పీతల హడావిడిని ఒక ప్రయాణికుడు వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే ఏకంగా కోటీ 15 లక్షల మందికి పైగా చూశారు. లెక్కలేనన్నిసార్లు షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుప్పలు తెప్పలుగా లైక్‌లు, కామెంట్లూ వస్తున్నాయి. ‘సూటూ బూటు నీటుగాళ్లు తిరిగే మెట్రోలో జనం సాయానికి ఇంతగా జనం ముందుకురావడం గ్రేట్’ అని ఒకరు, ‘పీతలు భలే తాజాగా ఉన్నాయి. వండుకు తింటే నా సామిరంగా..’ అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందన్నది మాత్రం తెలియదు! View this post on Instagram A post shared by SubwayCreatures (@subwaycreatures) -
మెట్రో రైలులో షికారుకెళ్లిన కోతి
-
పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో భయ్యా.. మెట్రోలో టవల్‌తో ఫోజులు..
సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు కొంతమంది ఏం చేస్తారో ఇప్పటికే చాలా వీడియోల్లో మనం చూసే ఉంటాం కాదా. ఈ క్రమంలో కొందరు రాత్రికి రాత్రే ఎంతో ఫేమస్ అయిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా, తాజాగా ఢిల్లీకి చెందిన ఓ ఇన్స్‌స్టాగ్రామ్ ఇన్స్‌ప్లూయాన్సర్ కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వినూత్నంగా ఓ వీడియో తీశాడు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన మోహిత్ గౌహర్‌కు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, వినూత్నంగా ట్రయ్ చేస్తూ వీడియోలను తన అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటాడు. అలాగే, తాజాగా ఓ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు. వీడియో సందర్బంగా మోహిత్.. ఢిల్లీ మెట్రో రైలులో హంగామా చేశాడు. కాగా, మోహిత్.. మెట్రో రైలు కోచ్‌లో బనియన్, టవల్‌తో దర్శనమిచ్చాడు. అంతటితో ఆగకుండా ఏదో ఫ్యాషన్ షోలో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ క్యాట్ వాక్ చేశాడు. అంతటితో ఆగకుండా రైలు అద్దాల్లో తన అందం చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు. ఈ సందర్భంగా మెట్రో రైలు ప్రయణిస్తున్న కొందరు యువతులు మోహిత్‌ను చూసి ఫుల్‌గా నవ్వుకున్నారు. అతడి చేష్టలను ఎంజాయ్ చేశారు. కానీ, కొందరు మాత్రం మోహిత్ చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌లో ఇలాంటి పనులేంటని ప్రశ్నించారు. కాగా, వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం వీడియోపై మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by 🇮🇳मोहित गौहर 🇮🇳 (@mohitgauhar) -
ఎంపీకే టోకరా.. రూ. 25 కోట్లకు కుచ్చుటోపి
న్యూఢిల్లీ: బ్యాంకులో తనఖా పెట్టి.. 20 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న ప్రాపర్టీని.. మాయమాటలు చెప్పి.. మరో వ్యక్తికి ఏకంగా 5 కోట్ల రూపాయలకు అంటగట్టారు నిందితులు. ఇక్కడ మోసపోయిన వ్యక్తి ఓ ఎంపీ కావడం విషేశం. నిందితులను అరెస్ట్ చేశారు ఆర్థిక నేరాల విభాగం అధికారులు. ఆ వివరాలు.. ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మకు నాలుగేళ్ల క్రితం నిందితుడు వినోద్ కుమార్ శర్మతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వినోద్ కుమార్ ఢిల్లీలో తనకు ఓ ప్రాపర్టీ ఉందని.. దాని విలువ సుమారు 5 కోట్ల రూపాయలుంటుందని తెలిపాడు. ఆ ప్రాపర్టీని ఢిల్లీ మెట్రో రైల్వై ప్రాజెక్ట్ లీజుకు తీసుకుందని.. నెలకు 8-9 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుందని నమ్మబలికాడు. (చదవండి: చందమామపై ఇల్లు 289 కోట్లే!) వినోద్ మాటలు నమ్మిన అనురాగ్.. అతడు చెప్పిన మేరకు 5.6 కోట్ల రూపాయలు చెల్లించి 2017, ఫిబ్రవరి 21న కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అసలు మోసం వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే అనురాగ్‌కు ప్రాపర్టీని అమ్మడానికి ముందే వినోద్ దాని మీద కెనరా బ్యాంక్‌లో 20.2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ ప్రాపర్టీ మీద కెనరా బ్యాంక్ అనేక చార్జీలు విధించినట్లు తెలుసుకున్నారు. (చదవండి: ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్!) అంతేకాక ప్రాపర్టీని అనురాగ్ శర్మకు అమ్మిన తర్వాత నిందితుడు.. ఆ విషయాన్ని దాచిపెట్టి డీఎంఆర్‌సీతో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్‌ను తన పేరు మీదనే పొడగించుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న అనురాగ్ శర్మ.. నిందితుల మీద ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వినోద్ శర్మ తనను తాను మాజీ న్యాయశాఖ అధికారిగా పరిచయం చేసుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’ -
వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది?
న్యూఢిల్లీ: కోతుల అల్లరి అంతా ఇంతా కాదు. ఇక అవి గుంపుగా ఉంటే ఆ దారి వెంట పోవాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అడవులు క్రమంగా తగ్గిపోతున్న వేళ గుంపులు గుంపులుగా కోతులు పల్లె సీమల్నే కాదు, పట్టణాలనూ ఆక్రమించుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ కోతి ఢిల్లీ మెట్రో రైలు ఎక్కింది. ఎక్కడికి వెళ్లాలి అనుకుందో గానీ.. మెట్రో రైలు కోచ్‌లో శనివారం కలియ తిరిగింది. అయితే అంత మంది ప్రయాణికులను చూసే సరికి భయం వేసిందో.. ఏమో గానీ.. బుద్ధిగా ఓ చోట సీటులో కూర్చుంది. అంతే కాదండోయ్ ఆ పక్కనే ఉన్న ప్రయాణికుడు తన నేస్తం అయినట్లు చేయి కూడా వేసింది. మెట్రో రైలు అద్దంలో నుంచి బయటి అందాలను చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వెంటనే ధృవీకరించక పోయినప్పటికీ, ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోకు ప్రతిస్పందనగా.. కోచ్ వివరాలను అందించాలని ఢిల్లీ మెట్రో అధికారులను కోరారు. కాగా దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. దయచేసి అతడిని స్టేషన్ బయట వదిలి పెట్టండి. వాళ్ల ఫ్యామిలీ తన కోసం ఎదురు చూస్తుంటుంది అని కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది? అంటూ చమత్కరించాడు. Video: One-way ticket! Monkey taking fun ride in Delhi Metro#delhimetro #MonkeyInMetro #Delhi #DMRC #ViralVideo #Viral pic.twitter.com/rpvfbbVz3H — Priya Jaiswal (@jaiswalpriyaa) June 20, 2021 చదవండి: 81 రోజుల తర్వాత.. 50 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు -
డ్రైవర్‌లెస్ ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోల తొలి డ్రైవర్ రహిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ‘దేశంలోని తొలి డ్రైవర్ రహిత, ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు సర్వీసు 37 కిమీలు మెజెంటా లైన్ మార్గంలో (జానక్‌పురి వెస్ట్ బొటానికల్ గార్డెన్ వరకు) డిసెంబర్ 28న ప్రారంభం కానుంది. ఈ సర్వీసును మోదీ ప్రారంభిస్తారు’ అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. -
‘మెట్రోలో రద్దీ తగ్గడానికి వేరే కారణాలు’
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైళ్లలో రద్దీ తగ్గడానికి కేవలం చార్జీల పెంపే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. అక్టోబరులో ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రయాణ చార్జీలను పెంచిన తర్వాత రోజుకు దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు తగ్గారు. చార్జీలు పెంచడం వల్లే ఇలా జరిగిందని పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పురీ మాట్లాడుతూ ‘చార్జీలకు, ప్రయాణికుల సంఖ్యకు ఏమైనా సంబంధం ఉందా? రద్దీ తగ్గడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. 2016 సెప్టెంబరు–అక్టోబరు మధ్య మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.3 లక్షలు తగ్గింది. అప్పుడు చార్జీలను పెంచలేదే. ప్రయాణికుల సంఖ్య సంవత్సరమంతా ఒకేలా ఉండదు. నెలను బట్టి మారుతుండొచ్చు. గత 8 ఏళ్లుగా ఢిల్లీ మెట్రో చార్జీలు పెంచలేదు. మెట్రో కోసం రూ.28,268 కోట్లు అప్పు తీసుకుంటే ఇప్పటికి రూ.1,507 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు. ఈ ఏడాది రూ.890 కోట్లు కట్టాల్సి ఉంది. మెట్రో మరింత మెరుగ్గా పనిచేయాలంటే ఆదాయం పెంచుకోవాల్సిందే’ అని వివరించారు. -
మెట్రో రేట్లు పెరిగాయి!
కాలుష్యం లేకుండా, తక్కువ సమయంలో ప్రయాణం చేసేందుకు అనువైన మార్గం అంటూ ఊదరగొట్టిన ఢిల్లీ మెట్రో.. ఇప్పుడు తన చార్జీలతో ప్రయాణికులను బెదరగొడుతోంది. తాజాగా మరోసారి మెట్రోరైలు టికెట్ల ధరలు పెరిగాయి. ఇప్పటివరకు కనీసచార్జీ రూ. 8గా ఉండగా.. ఇప్పుడది రూ. 10కి చేరుకుంది. గరిష్ట చార్జీ రూ. 50 వరకు వెళ్లబోతోంది. అంతేకాదు.. ఇప్పుడు పెట్టిన వాతకు తోడు అక్టోబర్‌లో మరోసారి రేట్లు పెరుగుతాయని కూడా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చెబుతోంది. అప్పుడు గరిష్ట చార్జీ రూ. 60 కానుంది. అక్టోబర్‌లో పెంచబోయే ధరలకు కూడా డీఎంఆర్సీ బోర్డు ఇప్పుడే ఆమోదం చెప్పేసింది. ఆఫ్ పీక్, సెలవుల్లో డిస్కౌంట్లు అయితే ఇప్పుడు ధరలు పెంచడమే కాక, ఆదివారాలతో పాటు రిపబ్లిక్ డే లాంటి పబ్లిక్ హాలిడేలలో మెట్రో రైళ్లలో ప్రయాణాలు చేసేవారికి డిస్కౌంట్లను కూడా ప్రకటించారు. స్మార్ట్ కార్డ్ యూజర్లకు ఇప్పటికే రిబేట్ వస్తుండగా, అదికాక ఇంకా 10 శాతం తగ్గిస్తారు. ఉదయం 8 గంటలలోపు, మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు, అలాగే రాత్రి 9 నుంచి మూసేసేవరకు ఉండే సమయాన్ని ఆఫ్-పీక్ అంటారు. పెరిగిన ధరలు ఇలా.. 2 కిలోమీటర్ల వరకు - రూ. 10 2-5 కిలోమీటర్ల వరకు - రూ. 15 5-12 కిలోమీటర్ల వరకు - రూ. 20 12-21 కిలోమీటర్ల వరకు - రూ. 30 21-32 కిలోమీటర్ల వరకు - రూ. 40 32 కి.మీ. కంటే ఎక్కువ దూరం - రూ. 50 -
షర్ట్ విప్పేసి మహిళ నిరసన.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారున గ్రేటర్ నోయిడా సహా పలు ప్రాంతాలలో ఆఫ్రికా వాసులపై జరిగిన జాతి వివక్ష దాడులు ఇటీవల వెలుగు చూశాయి. తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఓ ఆఫ్రికన్ మహిళ షర్ట్ విప్పేసి తనతో గొడవపడిన వారిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు ఆఫ్రికన్ మహిళలు మెట్రో రైలులో వెళ్తుండగా తోటి ప్రయాణికులు వారితో వాదనకు దిగారు. రైలులో మహిళల కంటే యువకులే ఎక్కువగా ఉన్నారు. మహిళలు ఇద్దరూ వారితో వాగ్వాదానికి దిగారు. కాసేపటి తర్వాత ఒకామె మరో మహిళను సీటులో కూర్చోబెట్టింది. తర్వాత కూడా మహిళలకు, యువకులకు మధ్య గొడవ జరుగుతూనే ఉంది. వీరిద్దరినీ బయటకు తోసేయండి అంటూ కొందరు అరిచారు. ఇంతలో ఓ మహిళ తన షర్ట్ విప్పేసి కొట్లాటకు రండి అంటూ యువకులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. కొందరు జోక్యం చేసుకుని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీట్ల విషయంపై మహిళలకు, యువకులకు మధ్య వాదులాట జరిగినట్టు సమాచారం. -
మెట్రో రైలా.. అబ్బే వద్దులే!
బాగా రద్దీగా ఉండటం, అనుకున్న చోటు వరకు కనెక్టివిటీ ఉండకపోవడం, సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండటం.. కూర్చోడానికి కూడా స్థలం లేకపోవడం.. ఇలాంటి కారణాలతో ఢిల్లీ మెట్రో రైలుకు చాలామంది దూరంగానే ఉంటున్నారట. కాస్త ఉన్నత ఆదాయ వర్గాలు అనుకున్నవాళ్లంతా తమ వ్యక్తిగత రవాణా సదుపాయాలనే ఉపయోగించుకుంటున్నారు తప్ప.. మెట్రో రైలు జోలికి వెళ్లట్లేదు. ఈ విషయం స్వయంగా ఢిల్లీ మెట్రోరైలు వర్గాలు నిర్వహించిన సర్వేలో తేలింది. దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణికులను ప్రశ్నించిన తర్వాత ఈ వివరాలు బయటపెట్టారు. మెట్రో ప్రయాణికుల్లో ఎక్కువ మంది నెలకు రూ. 20-50 వేల మధ్య జీతం వచ్చేవాళ్లే ఉంటున్నారు. ప్రయాణికులలో 50 వేల నుంచి లక్ష వరకు ఆదాయం ఉన్నవాళ్లు కేవలం 9.56 శాతం మంది మాత్రమే ఉండగా, లక్ష రూపాయలకు పైన జీతం వచ్చేవాళ్లు 1.67 శాతం మంది మాత్రమే ఉంటున్నారు. ఏసీ బోగీలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నా కూడా వీటి జోలికి పెద్దగా రావడం లేదు. వ్యక్తిగత వాహనాలనే వాడుతున్నారు. దాంతో ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య ఇప్పటికే కోటి దాటింది. మెట్రో రైలులో ప్రయాణించేవారిలో 18.4% మందికి సొంత వాహనాలున్నాయి. మెట్రో స్టేషన్ నుంచి మళ్లీ తమ ప్రాంతాలకు వెళ్లడానికి 20.23% మంది బస్సులు, 14.14% మంది ఈ-రిక్షాలు, 8.23% మంది ఆటోలు, 8.10% మంది రిక్షాలు, 3.45% మంది టాక్సీలు ఉపయోగించారు. 11.51% మంది నడవగా, కేవలం 14.31% మందే ఫీడర్ బస్సులను ఉపయోగించుకున్నారు. ప్రధానంగా మెట్రో రైళ్లలో పీక్ అవర్స్‌లో రద్దీ చాలా ఎక్కువగా ఉండటమే దీనివైపు మొగ్గు చూపించకపోవడానికి కారణం అవుతోంది. ఉదయం 8-11, సాయంత్రం 5-8 గంటల మధ్య పీక్ అవర్స్ ఉంటున్నాయి. ఈ సమయంలో ఢిల్లీ మెట్రో 188 రైళ్లు నడుపుతుండగా మిగిలిన సమయంలో 174 రైళ్లు నడుపుతోంది. తాను ప్రతిరోజూ నోయిడా నుంచి గుర్గావ్ వెళ్తుంటానని, మహిళల బోగీ కూడా ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుందని, అయినా అంత దూరం ప్రతిరోజూ కారులో వెళ్లడం కష్టం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే వెళ్తున్నానని మధు తివారీ అనే ప్రయాణికురాలు చెప్పారు. మెట్రో రైళ్లు ఎంత సౌకర్యవంతంగా ఉన్నా.. కారు వాడకాన్ని పూర్తిగా ఆపేసేంత పరిస్థితి మాత్రం లేదని అమిత్ భట్ అన్నారు. 2014లో 193 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీ మెట్రోరైలు నెట్వర్క్.. 2016 నాటికి 212.4 కిలోమీటర్లకు విస్తరించింది. అలాగే 2014లో రోజుకు 23.5 లక్షల మంది ప్రయాణించగా, ప్రస్తుతం 28.4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. -
గొడ్డలితో దాడిచేసిన వృద్ధురాలు!!
అవును.. మీరు సరిగ్గానే చదివారు. గొడ్డలితో వృద్ధురాలిపై దాడి జరగలేదు, ఆమే గొడ్డలి పట్టుకుని నానా హడావుడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని కుతుబ్‌మినార్ మెట్రోస్టేషన్లో జరిగింది. ఆమె వయసు సుమారు 65 సంవత్సరాలుంటుంది. ఆమె గొడ్డలి పట్టుకుని తోటి ప్రయాణికులపై దాడి చేసింది. మెట్రో రైల్లో కేవలం మహిళల కోసం ఒక బోగీ రిజర్వు అయి ఉంటుంది. ఆ బోగీలో సీటు కోసం జరిగిన గొడవలో.. ఆమె గొడ్డలితో హల్చల్ చేసింది. రైలు బోగీలోకి ఆమె ఎక్కేసరికి సీట్లన్నింటిలోనూ మహిళలు కూర్చుని ఉన్నారు. అంతలో సీనియర్ సిటిజన్ల కోసం రిజర్వు చేసిన సీట్లో ఒక 32 ఏళ్ల మహిళ కూర్చుని ఉండటాన్ని ఆమె చూసింది. ఆ సీటు ఖాళీ చేసి తనకు ఇవ్వాలని వృద్ధురాలు కోరగా.. ఆమె నిరాకరించింది. దాంతో ఆ వృద్ధురాలు ఆమెను చెంపమీద కొట్టింది. ఆ సమయంలో మిగిలిన ప్రయాణికులు కలగజేసుకుని.. రైల్లో గొడవలు వద్దని చెప్పారు. దాంతో ఆమెకు మరింత కోపం వచ్చి, బ్యాగులోంచి గొడ్డలి తీసి వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆమె చేతిలో ఆయుధం చూసిన మహిళలు ఒక్కసారిగా భయపడి.. సాయం కోసం గట్టిగా అరిచారు. కొంతమంది మాత్రం ఎలాగోలా ధైర్యం చేసి ఆమెను పట్టుకుని, ఆమె చేతుల్లోంచి గొడ్డలి లాగేసుకున్నారు. తర్వాతి స్టేషన్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సాయంతో ఆమెను దించేశారు. సాధారణంగా మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ చెకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, దాన్నంతటినీ దాటుకుని మరీ ఆమె తన బ్యాగులో ఈ గొడ్డలి పెట్టుకుని వచ్చింది. అయితే.. ఆమె దాడి చేయబోతుండగా తోటి మహిళలంతా కలిసి ఆమెను అడ్డుకుని, పట్టుకుని తదుపరి స్టేషన్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. అయితే.. వాళ్లు ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని అదుపులోకి తీసుకోకుండా, గొడ్డలి స్వాధీనం చేసుకుని, ఆమెను హెచ్చరించి పంపేశారు. -
మెట్రో ఉద్యోగిని పొడిచి.. రూ. 12 లక్షలతో పరారీ
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే మెట్రో రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి, ఓ ఉద్యోగిని స్టేషన్ ఆవరణలోనే పొడిచేసి.. రూ. 12 లక్షలతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగింది. నేరుగా స్టేషన్లోకి ప్రవేశించిన ఆగంతకులు నేరుగా కంట్రోల్ రూంలోకి వెళ్లారు. అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. పొద్దున్న మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కావడానికి ముందే వాళ్లు చాకుతో లోపలకు రావడంతో.. మెట్రో భద్రతా చర్యల్లో డొల్లతనం బయట పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దాడి వ్యవహారం సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయిందో లేదో మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. -
అన్ని సమస్యలకూ అభివృద్ధే సమాధానం
న్యూఢిల్లీ: అన్ని సమస్యలకు అభివృద్ధే సమాధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఢిల్లీ-ఫరీదాబాద్ రైలు మార్గాన్ని ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు. దేశాభివృద్దే తన లక్ష్యమని మోదీ అన్నారు. హర్యానా తనకు రెండో ఇల్లు వంటిదని చెప్పారు. రాజకీయాల కంటే విధానాలు తమకు ముఖ్యమని మోదీ అన్నారు. ప్రభుత్వ ఏకైక ఎజెండా అభివృద్ధి అని చెప్పారు. -
మెట్రో రైలెక్కిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించి ప్రయాణికులను, రైల్వే అధికారులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం ఉదయం మోదీ ఢిల్లీ-ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఉదయం జన్‌పథ్ స్టేషన్లో మెట్రో రైలు ఎక్కి ఫరీదాబాద్ బాటా చౌక్ స్టేషన్లో దిగారు. షెడ్యూల్ ప్రకారం మోదీ హెలీకాప్టర్‌లో ఫరీదాబాద్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉండగా, రైలులో ప్రయాణించారు. మోదీ వెంట కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, వీరేందర్ సింగ్, రావు ఇందర్జీత్ సింగ్ తదితరులున్నారు. -
ఢిల్లీ మెట్రోను పరిశీలించిన చంద్రబాబు
-
మెట్రో రైలు నుంచి దూకిన ప్రయాణికుడు
న్యూఢిల్లీ: బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్న మెట్రో రైలు నుంచి ఓ వ్యక్తి దూకాడు. ఆ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఆ సంఘటన గురువారం న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ద్వారకా నుంచి నోయిడా వైపు దూసుకుపోతున్న ట్రైన్ నుంచి వ్యక్తి దూకడంతో రైలులోని ప్రయాణికులు వెంటనే ట్రైన్ ఆపివేశారు. అనంతరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన దత్తాత్రేయ
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఢిల్లీ మెట్రోరైలులోప్రయాణించారు. విమానాశ్రయం నుంచి శివాజీ స్టేడియం వరకు మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మెట్రో రైలు లాంటి ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించడం ఆనందంగా ఉందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కాగా, కార్మిక చట్టాల్లో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనున్న దత్తాత్రేయ వెల్లడించారు. అన్నివర్గాల ప్రయోజనాలను కాపాడేలా సంస్కరణలు చేపట్టనున్నట్టు తెలిపారు. కార్మిక చట్టాల్లో సంస్కరణలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సంస్కరణలకు వ్యతిరేకంగా డిసెంబర్ 5న దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. -
రేపు రాత్రి 8 గంటలకు చివరి మెట్రో రైలు
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళిని పురస్కరించుకుని గురువారం ఆఖరి మెట్రో రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని ఢిల్లీ మెట్రో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ లైన్‌కు కూడా ఈ వేళలు వర్తిస్తాయి. దిల్షాద్ గార్డెన్, రిఠాలా, జహంగీర్‌పురి, హుడా సిటీ సెంటర్, నోయిడా సిటీ సెంటర్, ద్వారకా సెక్టర్ 21, వైశాలి, కీర్తినగర్, ఇందర్‌లోక్, ముండ్కా, సెంట్రల్ సెక్రటేరియట్, బదర్‌పుర్, న్యూఢిల్లీ నుంచి ఆఖరి మెట్రో రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. గురువారం ఉదయం మెట్రో సేవలు మామూలు సమయానికే ఉదయం 6 గంటలకు మొదలవుతాయి. ఎయిర్‌పోర్టు మెట్రో ఉదయం 4.45 గంటలకు బయలుదేరుతుంది. భాయ్ దూజ్ రోజున( అక్టోబర్ 25న) ప్రయాణికుల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు మెట్రో రైళ్లను స్టాండ్‌బైగా ఉంచాలని నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నట్లయితే స్టాండ్‌బైగా ఉంచిన రైళ్లను నడుపుతారు. మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, గైడ్లు అందుబాటులో ఉంటారు. మెట్రో సేవలు యథావిధిగా ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి.. ఎయిర్‌పోర్టు మెట్రో కూడా ఉదయం 4.45 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు నడుస్తుంది.