న్యూఢిల్లీ: బ్యాంకులో తనఖా పెట్టి.. 20 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న ప్రాపర్టీని.. మాయమాటలు చెప్పి.. మరో వ్యక్తికి ఏకంగా 5 కోట్ల రూపాయలకు అంటగట్టారు నిందితులు. ఇక్కడ మోసపోయిన వ్యక్తి ఓ ఎంపీ కావడం విషేశం. నిందితులను అరెస్ట్ చేశారు ఆర్థిక నేరాల విభాగం అధికారులు. ఆ వివరాలు..
ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మకు నాలుగేళ్ల క్రితం నిందితుడు వినోద్ కుమార్ శర్మతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వినోద్ కుమార్ ఢిల్లీలో తనకు ఓ ప్రాపర్టీ ఉందని.. దాని విలువ సుమారు 5 కోట్ల రూపాయలుంటుందని తెలిపాడు. ఆ ప్రాపర్టీని ఢిల్లీ మెట్రో రైల్వై ప్రాజెక్ట్ లీజుకు తీసుకుందని.. నెలకు 8-9 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుందని నమ్మబలికాడు.
(చదవండి: చందమామపై ఇల్లు 289 కోట్లే!)
వినోద్ మాటలు నమ్మిన అనురాగ్.. అతడు చెప్పిన మేరకు 5.6 కోట్ల రూపాయలు చెల్లించి 2017, ఫిబ్రవరి 21న కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అసలు మోసం వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే అనురాగ్‌కు ప్రాపర్టీని అమ్మడానికి ముందే వినోద్ దాని మీద కెనరా బ్యాంక్‌లో 20.2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ ప్రాపర్టీ మీద కెనరా బ్యాంక్ అనేక చార్జీలు విధించినట్లు తెలుసుకున్నారు.
(చదవండి: ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్!)
అంతేకాక ప్రాపర్టీని అనురాగ్ శర్మకు అమ్మిన తర్వాత నిందితుడు.. ఆ విషయాన్ని దాచిపెట్టి డీఎంఆర్‌సీతో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్‌ను తన పేరు మీదనే పొడగించుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న అనురాగ్ శర్మ.. నిందితుల మీద ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వినోద్ శర్మ తనను తాను మాజీ న్యాయశాఖ అధికారిగా పరిచయం చేసుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment