వైరల్‌ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్‌ ఏది? | Monkey Travel With Passenger In Delhi Metro | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్‌ ఏది?

Published Sun, Jun 20 2021 11:21 AM | Last Updated on Sun, Jun 20 2021 1:25 PM

Monkey Travel With Passenger In Delhi Metro - Sakshi

న్యూఢిల్లీ: కోతుల అల్లరి అంతా ఇంతా కాదు. ఇక అవి గుంపుగా ఉంటే ఆ దారి వెంట పోవాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అడవులు క్రమంగా తగ్గిపోతున్న వేళ గుంపులు గుంపులుగా కోతులు పల్లె సీమల్నే కాదు, పట్టణాలనూ ఆక్రమించుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ కోతి ఢిల్లీ మెట్రో రైలు ఎక్కింది. ఎక్కడికి వెళ్లాలి అనుకుందో గానీ.. మెట్రో రైలు కోచ్‌లో శనివారం కలియ తిరిగింది. అయితే అంత మంది ప్రయాణికులను చూసే సరికి భయం వేసిందో.. ఏమో గానీ.. బుద్ధిగా ఓ చోట సీటులో కూర్చుంది.

అంతే కాదండోయ్‌ ఆ పక్కనే ఉన్న ప్రయాణికుడు తన నేస్తం అయినట్లు చేయి కూడా వేసింది. మెట్రో రైలు అద్దంలో నుంచి బయటి అందాలను చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.  కాగా, ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) వెంటనే ధృవీకరించక పోయినప్పటికీ, ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోకు ప్రతిస్పందనగా.. కోచ్ వివరాలను అందించాలని ఢిల్లీ మెట్రో అధికారులను కోరారు. కాగా దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. దయచేసి అతడిని స్టేషన్‌ బయట వదిలి పెట్టండి. వాళ్ల ఫ్యామిలీ  తన కోసం ఎదురు చూస్తుంటుంది అని కామెంట్‌ చేశారు. ఇక మరో నెటిజన్‌ మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్‌ ఏది? అంటూ చమత్కరించాడు.


చదవండి: 81 రోజుల తర్వాత.. 50 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement